లెజెండ్స్ లీగ్ బ్లూ ప్రింట్ సిద్ధం
దుబాయ్: క్రికెట్ దిగ్గజాలు సచిన్, షేన్‌వార్న్ కలిసి ఏర్పాటు చేయబోతున్న లెజెండ్స్ టి20కి సంబంధించిన బ్లూ ప్రింట్ సిద్ధమైంది. ఈ ఇద్దరూ కలిసి దీనిని ఐసీసీ ముందు ఉంచారు. ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్‌సన్‌ను కలిసిన సచిన్, వార్న్ లీగ్ విధివిధానాలను వివరించారు. అమెరికాలో ఆగస్టు, సెప్టెంబర్‌లలో తొలి సిరీస్ జరగనుంది. న్యూయార్క్, లాస్‌ఏంజెల్స్, చికాగో నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఫ్లింటాఫ్, బ్రెట్‌లీ, గంగూలీ, గిల్‌క్రిస్ట్, కలిస్, జయవర్ధనే, మెక్‌గ్రాత్ ఇప్పటికే ఈ లీగ్‌లో పాల్గొనేందుకు అంగీకరించారు.
మూడున్నరేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అయితే ఈ టోర్నీకి తమ అనుమతి అవసరం లేదని ఐసీసీ అధికార ప్రతినిధి తెలిపారు. మ్యాచ్‌లు ఏ దేశంలో నిర్వహిస్తే ఆ దేశ క్రికెట్ బోర్డు అనుమతి ఉంటే చాలని ప్రకటించారు. టోర్నీని ఐసీసీ దృష్టిలో ఉంచాలనే ఉద్దేశంతో సచిన్, వార్న్ తమ ప్రణాళికలను రిచర్డ్‌సన్‌కు వివరించినట్లు సమాచారం.