బుల్లితెర నటిపై తీవ్ర ఆరోపణలు.. దెబ్బకు వీడియో డిలీట్! | Rupali Ganguly's stepdaughter deletes video after defamation notice | Sakshi
Sakshi News home page

Rupali Ganguly : బుల్లితెర నటిపై సవతి కూతురు విమర్శలు.. ఆ ఒక్క పనితో డిలీట్!

Published Tue, Nov 12 2024 3:04 PM | Last Updated on Tue, Nov 12 2024 3:10 PM

Rupali Ganguly's stepdaughter deletes video after defamation notice

బాలీవుడ్‌లో బుల్లితెర స్టార్‌ రూపాలీ గంగూలీ అందరికీ సుపరిచితమే. బుల్లితెర నటుల్లో రిచెస్ట్‌ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఆమె సవతి కూతురు ఇషా నటిపై సంచలన కామెంట్స్ చేసింది.  తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్‌ను విడగొట్టిందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్‌ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది.

అయితే ఈషా కామెంట్స్‌పై నటి రూపాలీ గంగూలీ పరువునష్టం దావా వేసింది. తన పరువుకు భంగం కలిగించేలా ఇషా మాట్లాడిందంటూ రూ.50 కోట్లకు నోటీసులు పంపించింది. ఈ నోటీసులు అందుకున్న ఇషా వెంటనే అప్రమత్తమైంది. ఆ తర్వాత కొన్ని గంటలకే తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోను సైతం డిలీట్ చేసింది. అంతేకాకుండా తన ఇన్‌స్టా అకౌంట్‌ను ప్రైవేట్‌గా మార్చేసింది. పరువు నష్టం కేసు నోటీసులు రావడంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

(ఇది చదవండి: మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు)

డిలీట్ చేసిన వీడియో ఇషా మాట్లాడుతూ..'ఇప్పుడు నేను నా రౌడీలకు వ్యతిరేకంగా నిలబడ్డా. నా జీవితంలో వాళ్లిద్దరే రౌడీలు. వారు నేను  ప్రేమించే నా తల్లిని ఇబ్బంది పెట్టడమే కాదు.. నన్ను బాధపెట్టాలని చూశారు. వారు నన్ను  విమర్శించడానికి నా బలహీనతలను ఎంచుకున్నారు. వారు నాకు బహిరంగంగా, వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. నన్ను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని" మాట్లాడింది. పరువు నష్టం నోటీసులు రావడంతో వెంటనే ఆ వీడియోను తొలగించింది. 

isha

కాగా.. అశ్విక్‌ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్‌.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్‌ అనే కుమారుడు జన్మించాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement