Anupamaa Star Rupali Ganguly Reveals She Has Been Age And Body Shamed, Deets Inside - Sakshi
Sakshi News home page

Rupali Ganguly: నా వయసుపై కూడా ట్రోల్స్ చేశారు: రూపాలీ

Apr 3 2023 8:12 PM | Updated on Apr 3 2023 8:24 PM

Anupamaa Star Rupali Ganguly Reveals She has Been body Shamed - Sakshi

బాలీవుడ్ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు.  ప్రముఖ టీవీ షో అనుపమతో ఫేమ్ తెచ్చుకుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె కెరీర్‌లో ఎదురైన సంఘటనలను వివరించింది. తాను బాడీ షేమింగ్‌కు గురైనట్లు నటి వెల్లడించింది. తనను చాలా లావుగా ఉన్నావంటూ ఎగతాళి చేసేవారని తెలిపింది. 

రూపాలీ గంగూలీ మాట్లాడూతూ.. 'అనుపమ షో తర్వాత కూడా నేను బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా.  మీ  శరీరంపై ముడతలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు లావుగా ఉన్నారు అని అన్నారు. అవును నా చర్మంపై ముడతలు ఉన్నాయి. అందుకు నేను గర్వపడుతున్నా. అనుపమ  తన భర్త అనూజ్‌గా నటించిన సహనటుడు గౌరవ్ ఖన్నా కంటే నేనే పెద్దదాన్ని. దీనిపై సోషల్ మీడియాలో నన్ను ట్రోల్స్ చేశారు. అవును నేను అతనికి కంటే నాలుగేళ్లు వయసులో పెద్ద.  అతనికి 41 ఏళ్లు, నాకు 45 ఏళ్లు. ఈ విషయంలో కూడా నేను గర్వంగా ఉన్నా. మేము షోలో భార్య, భర్తలుగా మా పాత్రలను మాత్రమే పోషించాం. నా పాత్రకు 100 శాతం న్యాయం చేశా.' అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement