shame
-
మేయరా...అయితే మాకేంటి?
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలా ద్రిపై విజయవాడ నగ ర మేయర్‌కు సోమవా రం ఘోర అవమానం ఎదురైంది. కొండపై ఆమెను అడుగడుగునా అధికారులు అవమానించారు. ఆమె కారు ను పదేపదే నిలిపివేశారు. ఆమె కారులోంచి బయటకు వచ్చి తాను మేయర్‌ని అని, తనకు ప్రొటోకాల్ ఉంటుందని చెబుతున్నా ఎవరూ లెక్క చేయలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కష్టాలుపడి కొండపైకి చేరుకున్న ఆమెను ఆలయ చిన్న రాజగోపురం వద్ద పోలీసులు, దేవస్థానం సిబ్బంది నిలిపివేశారు.దీంతో ఆమె కొద్దిసేపు పక్కనే నిలబడి ఎదురు చూశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న మీడియా ఆమె వద్దకు వచ్చి వీడియో తీస్తుండగా అప్పటికప్పుడు సిబ్బంది స్పందించి గేట్ తీసి ఆమెను లోపలకు పంపించారు. రూ.300 క్యూ లైన్ నుంచి అమ్మవారికి నమస్కారం చేసుకొని మేయర్ బయటకు వచ్చేశారు. సాధారణంగా మేయర్ వచ్చినప్పుడు ఆమెకు ప్రొటోకాల్ అధి కారులు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించి, ఆశీర్వాదాలను, ప్రసాదాలను అందించి పంపాల్సి ఉంటుంది.బీసీ మహిళను అవమానించారు ‘అమ్మవారి దర్శనానికి వస్తే నన్ను అవమానించారు. దేవస్థానం చెప్పిన సమయంలోనే నేను కొండపైకి వచ్చాను.నాకు వెహికల్ పాస్ ఇవ్వమని కలెక్టర్, సీపీ, నగర కమిషనర్‌ను కోరాను. మీరు మేయర్.. మిమ్మల్ని ఎవరు ఆపుతారని అధికారులు అన్నారు. కానీ నాకు అడుగడుగునా అడ్డంకులే. నేను మేయర్‌ని అని అందరికీ చెప్పుకోవాలి్సన పరిస్థితి కల్పించారు. పోలీసులు, దేవస్థానం అధికారుల తీరు సరిగాలేదు. గతంలో ఏనాడైనా ఇలా జరిగిందా..? కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం. నగర పాలకసంస్థ సహకారం లేకుండా భవానీదీక్షలు, దసరా ఉత్సవాలను నిర్వహించగలరా? మేయర్‌ను అందులోనూ బీసీ వర్గానికి చెందిన మహిళను కావాలనే నన్ను అవమానించారు. –రాయన భాగ్యలక్ష్మి, మేయర్ విజయవాడ -
పవన్ ఇలా చేశావేంటి?.. పిఠాపురంలో జనసైనికులకు అవమానం
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు తీవ్ర అవమానం ఎదురైంది. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తీరుపై కార్యకర్తలు మండిపడ్డారు. జనసేన వార్డు కమిటీ సభ్యులతో సమావేశం రద్దు చేసుకుని హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్ ప్రయాణం అయ్యారు. పవన్ బస చేసిన హోటల్ వద్ద గేటు దగ్గర మండుటెండలో రెండు గంటల పాటు కార్యకర్తలు పడిగాపులు కాశారు. హోటల్ లోపలికి రానివ్వకుండా పవన్ బౌన్సర్లు గేటు మూసేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కూడా అడ్డుకోవడంతో గేట్లు నెట్టుకుని టీడీపీ నాయకులు లోపలికి వెళ్లారు. పార్టీ కోసం సేవ చేసిన తమను చులకనగా చూస్తున్నారని తమ ఆవేదనను వాట్సాప్ గ్రూపులో జనసేన కార్యకర్తలు షేర్ చేశారు. పిఠాపురానికి ఎవరెవరో వస్తున్నారు.. వారిని భుజంపై మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారాహి వాహనం అనుమతి తీసుకోలేక పోయారని ఉదయ్ శ్రీనివాస్‌ను జనసేన కార్యకర్తలు తిట్టుపోసుకుంటున్నారు. ఇదీ చదవండి: జనసేనను చిదిమేసిన చంద్రబాబు -
Karnataka assembly elections 2023: ‘జై బజరంగ బలీ’ అంటూ ఓటేయండి
శివాజీనగర/ముల్కీ: ‘కాంగ్రెస్ అవినీతి వ్యవస్థను కూల్చేశానని నాపై పీకలదాకా కోపం పెంచుకున్నారు. నన్ను నిరంతరం అవమానిస్తున్నారు. నన్ను దూషిస్తూ ఓట్లడుగు తున్నారు. ఇలాంటి అవమాన సంస్కృతిని మీరు అంగీకరిస్తారా? పోలింగ్ కేంద్రంలో మీట నొక్కేటపుడు జై బజరంగ బలీ అని నినదించండి. తద్వారా వారికి బుద్ధి చెప్పండి’ అని కర్ణాటక ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్రంలో మూడు బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించారు. ప్రతిచోటా మొదట్లో, చివర్లో జై బజరంగ బలీ అంటూ నినదించారు. బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీపై ప్రధాని మండిపడ్డారు. ‘విభజించు, పాలించు సిద్ధాంతమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ రాజకీయం నడుపుతుంది. ప్రపంచదేశాలు భారత్‌ను ఘనంగా కీర్తిస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం విదేశాల్లో పర్యటిస్తూ దేశ ప్రతిష్టను, సైన్యాన్ని అవమానించేలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశాభివృద్ధికి, శాంతియుత వాతావరణానికి ప్రబల శత్రువు కాంగ్రెస్. ఎన్నికల లబ్ధి కోసం దేశ వ్యతిరేకులతోనూ ఒప్పందం చేసుకుంటోంది’’ అంటూ దుయ్యబట్టారు. ప్రజలే నా రిమోట్‌కంట్రోల్ 140 కోట్ల మంది ప్రజలే తన రిమోట్ కంట్రోల్ అని మోదీ అన్నారు. ‘‘కర్ణాటకను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకోవాలని చూస్తోంది. అలాంటి పార్టీని రాష్ట్రం నుంచి తరిమేయండి’’ అని పిలుపునిచ్చారు. -
లావుగా ఉన్నానని ఎగతాళి చేశారు.. బుల్లితెర నటి
బాలీవుడ్ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టీవీ షో అనుపమతో ఫేమ్ తెచ్చుకుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె కెరీర్లో ఎదురైన సంఘటనలను వివరించింది. తాను బాడీ షేమింగ్‌కు గురైనట్లు నటి వెల్లడించింది. తనను చాలా లావుగా ఉన్నావంటూ ఎగతాళి చేసేవారని తెలిపింది. రూపాలీ గంగూలీ మాట్లాడూతూ.. 'అనుపమ షో తర్వాత కూడా నేను బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా. మీ శరీరంపై ముడతలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు లావుగా ఉన్నారు అని అన్నారు. అవును నా చర్మంపై ముడతలు ఉన్నాయి. అందుకు నేను గర్వపడుతున్నా. అనుపమ తన భర్త అనూజ్గా నటించిన సహనటుడు గౌరవ్ ఖన్నా కంటే నేనే పెద్దదాన్ని. దీనిపై సోషల్ మీడియాలో నన్ను ట్రోల్స్ చేశారు. అవును నేను అతనికి కంటే నాలుగేళ్లు వయసులో పెద్ద. అతనికి 41 ఏళ్లు, నాకు 45 ఏళ్లు. ఈ విషయంలో కూడా నేను గర్వంగా ఉన్నా. మేము షోలో భార్య, భర్తలుగా మా పాత్రలను మాత్రమే పోషించాం. నా పాత్రకు 100 శాతం న్యాయం చేశా.' అని అన్నారు. -
చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం
-
అమానుష చర్య.. చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం
సాక్షి, గుంటూరు: గుంటూరులో టీడీపీ నేతల అమానుష చర్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు సభలో గాయపడి కొన ఊపిరితో ఉన్న మహిళను కారు డిక్కీలో కుక్కి టీడీపీ నేతలు జీజీహెచ్‌కు తరలించారు. దీంతో తొక్కిసలాటలో గాయపడిన ఆమె.. ఊపిరి పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. టీడీపీ నేతల అమానుషంపై సభ్య సమాజం సిగ్గుపడుతోంది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతి చెందారు. కాగా, విజయవాడ ఏలూరు రోడ్లో ఉయ్యూరు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేశారు. ఏ-1గా ఉన్న శ్రీనివాస్‌పై నల్లపాడు పీఎస్‌లో సెక్షన్లు 304, 174 కింద కేసులు నమోదయ్యాయి. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేశారు. చదవండి: కాటేసిన కానుక! -
భారత్ కి జరిగిన అవమానం పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కామెంట్..
-
జాతీయ జెండాకు అవమానం
సాక్షి బెంగళూరు: ఇజ్రాయిల్‌లో భారత జాతీయ జెండాకు అవమానం జరిగిందని, ఆ సమయంలో అక్కడ ఉన్న కర్ణాటక మంత్రి పట్టించుకోకుండా ఉన్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఉద్యాన పంటలపై అధ్యయనం చేసేందుకు ఉద్యాన మంత్రి ఎంసీ మనగోళి ఇజ్రాయిల్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి పంటలపై విదేశీ అధికారులతో కలసి చర్చిస్తున్న సందర్భంలో ఎదురుగా ఉన్న టేబుల్‌పై జాతీయ జెండా తిరగేసి ఉండడాన్ని ఆయన గమనించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
కనికరించని ‘సఖి’
సాక్షి, హైదరాబాద్: పదిహేడేళ్ల బాలిక.. పైగా గర్భవతి. నా అనేవారు లేరు.. ఓ కామాంధుడి మాయమాటలు నమ్మి మోసపోయి గర్భం దాల్చింది. తలదాచుకునే చోటు లేదు. ఆశ్రయం కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సఖి కేంద్రానికి వెళ్లగా సిబ్బంది కనికరించలేదు. క్లిష్టపరిస్థితుల నుంచి వచ్చిన బాలికలు, మహిళలను ఎలాంటి సిఫారసు లేకుండా ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సఖి(ఒన్ స్టాప్ సెంటర్) కేంద్రం మానవత్వం మరిచింది. సిబ్బంది ఉదాసీన వైఖరితో ఏడు నెలల గర్భవతి అయిన బాలిక ఘోర అవమానం ఎదుర్కొంది. వివరాలు... మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏడు నెలల గర్భంతో ఉన్న పదిహేడేళ్ల అనాథ బాలిక ఆశ్రయం కోసం ఈ నెల 20న పోలీస్ స్టేషన్లో సంప్రదించింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించి ఆశ్రయం కల్పించి న్యాయం చేయాలని వేడుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆశ్రయం కోసం ఉమ్మడి జిల్లాలో ఉన్న సఖి కేంద్రం నిర్వాహకులను సంప్రదించారు. సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ఆమోదం ఉంటేనే ఆశ్రయం కల్పిస్తామని, వారిని సంప్రదించాలని నిర్వాహకులు సలహా ఇచ్చారు. దీంతో సదరు పోలీసు అధికారి సీడబ్ల్యూసీ చైర్మన్‌ను ఫోనులో సంప్రదించగా వెల్ఫేర్ కమిటీ ఆమోదంతో కూడిన లేఖను మరుసటి రోజు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. సీడబ్ల్యూసీ సిఫారసు లేఖ లేకపోవడంతో ఆ బాలికకు సఖి నిర్వాహకులు ఆశ్రయం ఇవ్వలేదు. దీంతో ఆ పోలీసు అధికారి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారులను సంప్రదించారు. చివరగా ఉప్పల్ సమీపంలోని ఓ చోట ఆశ్రయం కల్పించారు. ప్రమాదానికి గురైన బాధిత మహిళ/బాలిక సఖి కేంద్రానికి వస్తే తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స ఇవ్వాలి. ఇందుకు సఖి కేంద్రంలో ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఆ తర్వాత బాధితురాలికి ఆశ్రయం ఇవ్వడంతోపాటు కౌన్సెలింగ్ నిర్వహించాలి. తర్వాత వసతులు కల్పించి న్యాయసహకారం అందించాలి. -
నాకు సిగ్గు ఎక్కువే.. కానీ ఆ విషయాల్లో..
సాక్షి, సినిమా: పూజా హెగ్డే స్వతహాగా నాకు సిగ్గు ఎక్కువ అని చెబుతోంది. అయితే ఆ విషయానికి వస్తే సిగ్గు, బిడియాలను పూర్తిగా వదిలేస్తానంటోంది. దక్షిణాదికి ఎంట్రీ ఇచ్చి ఆరేళ్లు అయినా ఇప్పటికీ 10 చిత్రాలు మాత్రమే చేసింది పూజ. ఇందుకు పూజ ఇతరులతో మాట్లాడడానికి సిగ్గు పడే స్వభావం ఒక కారణం కావచ్చు అంటోంది. కానీ ఆమె వెండితెరపై అందాలను మాత్రం విచ్చలవిడిగా ఆరబోయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఈత దుస్తుల్లో కూడా ఇరగదీస్తోంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ అసలు ఏం చెప్పదలచుకుందో చూద్దాం.. ‘నాకు కాస్త సిగ్గు ఎక్కువ. అయితే ఫొటోలకు ఫోజులు ఇవ్వడంలోనూ, మరో విషయంలోనూ సిగ్గు, బిడియాలను పూర్తిగా వదిలేస్తాను. ఆ మరో విషయం ఏమిటంటే నటన అనేది ఓ కళ. అది మనలోని భావాలను వెల్లడించడానికి సహకరిస్తుంది. అందుకే నృత్యం చేయడానికి నా సిగ్గును వదిలేస్తాను. ఎంత కఠినమైన స్టెప్స్ అయినా ఆడేస్తాను. నిజం చెప్పాలంటే నాకు సిమాల్లో డాన్స్ చేసే అవకాశాలు ఇప్పుడే వస్తున్నాయి. ఇకపై నా చిత్రాల్లో డాన్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.’ అని చెప్పింది. పూజా హెగ్డే ముగముడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమై నటుడు జీవాతో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ చిత్రం తరువాత కోలీవుడ్‌లో కనిపించకపోయినా టాలీవుడ్లో బాగా పాపులర్ అయింది. అక్కడ స్టార్ హీరోలతో వరుసపెట్టి నటిస్తోంది. ఇటీవల రంగస్థలం సినిమాలో ఐటమ్ గర్ల్‌గా నటించి జిగేలు రాణిగా యువత గుండెల్ని కొల్లగొట్టేసింది. -
అవమానం భరించలేక ఆత్మహత్య
దహెగాం(సిర్పూర్): దొంగతనం చేసినట్లు నిందమోపడంతో అవమానం భరించలేక కుమురం భీం జిల్లా దహెగాం మండలం రాంపూర్‌కి చెందిన ఏగోలం గణపతిగౌడ్(55) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మానెపల్లి సత్తయ్య ఇంట్లో ఈ నెల 15న బంగారం చోరీ అయింది. గణపతిగౌడ్పై అనుమానముందని చెప్పడంతో పోలీసులు ఠాణాకు పిలిపించి విచారించారు. ఆ తర్వాత మానెపల్లి సత్తయ్య, మానెపల్లి రంగుబాయి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ధనూరి మల్లేశ్‌లు గణపతిగౌడ్ను బెదిరించి దుర్బాషలాడారు. చేయని నేరానికి నిందవేయడంతో మనస్తాపం చెందిన గణపతిగౌడ్ బుధవారంరాత్రి పురుగుల మందు తాగాడు. 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఆత్మహత్యకు మానెపల్లి సత్తయ్య, మానెపల్లి రంగక్క, మాజీ ఎంపీటీసీ ధనూరి మల్లేశ్ కారణమని గణపతి తల్లి ఏగోలం లచ్చమ్మగౌడ్ బుధవారంరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పై ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్ఐ అఫ్జల్ఖాన్ తెలిపారు. -
తుడా చైర్మన్‌కు అవమానం
►అతిథి గృహం వద్ద అడ్డుకున్న పోలీసులు ► సీఎంను కలవకుండానే తిరుగుముఖం సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) చైర్మన్ నర్సింహయాదవ్‌కు శనివారం ఉదయం ఘోర అవమానం జరిగింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఉన్న ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లగా మెయిన్ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. తాను తుడా చైర్మన్ అని, పార్టీలో సీనియర్ నాయకుడనని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. లోపలికి పంపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పలుమా ర్లు నచ్చజెప్పేందుకు నర్సింహయాదవ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చుట్టూ పార్టీ కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకులు, మీడియా వారు ఉన్నారని, తాను సీఎంను కలవాల్సిన అవసరం ఉందని బతిమాలినా పోలీసులు ససేమిరా అన్నారు. చిర్రెత్తుకొచ్చి పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మె మీద కూర్చుండిపోయారు. ‘సీఎం బయటకు వచ్చినపుడు మీ సంగతి తేలుస్తా’ అంటూ పోలీసులపై రుసరుసలాడారు. కొద్దిసేపటికి సమాచారం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని అక్కడికొచ్చి ఆయన్ను సముదాయించి లోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదట రానని మొండికేసిన నర్సింహయాదవ్ మీడియా చూస్తుండటంతో తప్పదన్నట్లు లోనికి వెళ్లారు. అయితే ఆయన సీఎంను కలిసే అవకాశం లేకుండా వెనుదిరిగినట్లు సమాచారం. చిన్నాచితకా వాళ్లను పంపరా.. పోలీసుల తీరుపై నర్సింహయాదవ్ ఒక దశలో మండిపడ్డారు. ఎవరెవర్ని లోనికి అనుమతించాలో, ఎవర్ని పంపకూడదో తెలియకుండానే ప్రొటోకాల్ ప్రాధాన్యత మరిచి పోలీసులు వ్యహరించడం దారుణమని తన సహచరుల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెల్సింది. -
అవమానం... అసమానం
ఆత్మీయం మనం ప్రతి వారిచేతా గౌరవింపబడాలి అని ప్రతి మనిషీ కోరుకుంటాడు తన గౌరవానికి. ఏ కాస్త భంగం వాటిల్లినా, తనకు అవమానం జరిగినట్లుగా భావిస్తాడు. వ్యక్తిలో ఉండే సంస్కారాలను బట్టి, అతని విద్యాగంధాన్ని బట్టి అవమానం స్థాయిలో హెచ్చుతగ్గులుంటాయి. అవమానం అనేది ఒక వ్యక్తి తనకు ఎదురైన వివిధ సంఘటనలపై స్పందించే తీరుపైన ఆధారపడి ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు అంతగా స్పందించని వ్యక్తి, ఇతరులతో కలిసి ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా వ్యక్తి ఎంత బలంగా ఉంటే అవమానం గురించి అంత తక్కువగా ఆలోచిస్తాడు. బలహీనంగా ఉంటే అవమానం ఎక్కువగా జరిగినట్లు భావిస్తాడు. అవమానం వల్ల మనిషి అభద్రతా భావానికి లోనవుతాడు. హింసాత్మకంగా మారతాడు. అవమానాన్ని తట్టుకోవాలంటే మానసికంగా బలంగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలగాలి. ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగి ఉండాలి. క్షమాగుణం కలిగి ఉండాలి. తనపై తనకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇతరులను అవమానం చేయాలన్న ఆలోచన ఉండకూడదు. సకల శాస్త్ర సారం ఏమి చెబుతోందంటే ఇతరులు తనకు ఏమి చేస్తే తనకు అవమాన మో, బాధాకరమో, అవి తాను ఇతరులకు చేయకూడదు. అదేవిధంగా ఇతరులు ఏమి చేస్తే తనకు ఆనందం కలుగుతుందో, సంతోషం చేకూరుతుందో అది తాను ఇతరుల పట్ల ఆచరించాలి. అలాంటివారికి మానావమానాల ప్రసక్తి ఉండదు. -
'అత్తార్'కు అడుగడుగునా అవమానాలు!
డబ్బుకు అమ్ముడు పోయిన మీరా మమ్మల్ని చైతన్య పరిచేది? మా గ్రామానికి మీరు రానవసరం లేదన్న గొడ్డువెలగల ప్రజలు ప్రొటోకాల్‌పై ఎమ్మెల్యేని నిలదీసిన టీడీపీ సర్పంచ్ కదిరి : పార్టీ ఫిరాయించిన కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు నియోజకవర్గంలో అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం కదిరి మండలం బూరుగు పల్లి గ్రామస్తులు ‘ఒక పార్టీ సింబల్‌తో గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన మీరా మమ్మల్ని చైతన్యం చేసేది? మీలాంటి వారికి మా గ్రామంలోకి అనుమతి లేదు’ అంటూ ఫ్లెక్సీ ద్వారా తమ నిరసనను తెలిపారు. తాజాగా సోమవారం గాండ్లపెంట మండలం గొడ్డువెలగల పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామం వద్ద ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘ఓట్లేసి గెలిపించిన ప్రజలను మీరు మోసగించారు. డబ్బుకు కక్కుర్తి పడి మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. జన చైతన్య యాత్రల పేరుతో మీరు జనాన్ని చైతన్యం చేయడమేంటి? ప్రజలను మోసగించిన మీ లాంటి వారిని మా గ్రామంలోకి అనుమతించం’ అంటూ గొడ్డువెలగల గ్రామ ప్రజల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేను నిలదీసిన టీడీపీ సర్పంచ్ ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాను టీడీపీకి చెందిన గొడ్డువెలగల సర్పంచ్ ప్రసాద్ నిలదీశారు. ’కదిరి వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వాన పత్రికలో మీ ఫొటో వేయలేదని నానా యాగీ చేసి ఆఖరుకు కార్యక్రమాన్నే రద్దు చేయించారు. మరి ఈరోజు మీరు జనచైతన్య యాత్రల పేరుతో మా గ్రామానికి వచ్చారు. సమావేశం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో గ్రామ సర్పంచ్ ఫొటో వేయాలని మీకు తెలీదా?’ అని ప్రశ్నించారు. అంతకు మునుపు ఆయన పోలీసులతో కూడా ఇదే విషయంపై మాట్లాడారు. పోలీసుల రక్షణతో గ్రామాల్లోకి .. పార్టీ మారిన తన పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ముందే ఊహించిన ఎమ్మెల్యే భారీ పోలీస్ బంద్బస్త్తో జనచైతన్య యాత్రల పేరుతో గ్రామాల్లోకి వెళ్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలను పోలీసులు ముందే వెళ్లి వాటిని తొలగించి, అక్కడ పరిస్థితిని చక్కబెట్టిన మీదటే ఎమ్మెల్యే గ్రామాల్లోకి అడుగుపెడుతున్నారు. ఎన్పీ కుంట మండలం గొల్లపల్లి మహిళలు తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేసిన విషయం విదితమే. -
జాతీయజెండాకు నిప్పు
బీర్కూర్: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మం డలం అంకోల్ పంచాయతీ పరిధిలోని బస్వాయిపల్లిలో జాతీయజెండాకు అవమానం జరిగింది. స్వాతం త్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం గ్రామాభివృద్ధి కమి టీ అధ్యక్షులు బండారి గంగారాం జాతీయ జెండాను ఎగురవేశారు. సాయంత్రం వెళ్లి చూడగా కర్ర కిందపడి, జాతీయజెండా సగం దగ్ధమై కనిపించింది. సర్పంచ్ దీపిక కిరణ్ గౌడ్ పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు జెండాను కిందపడేసి కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. -
జాతీయజెండాకు నిప్పు
బస్వాయిపల్లి(బీర్కూర్) : నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం అంకోల్ పంచాయతీ పరిధిలోని బస్వాయిపల్లి గ్రామంలో జాతీయజెండాకు అవమానం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేస్తారు. సోమవారం ఉదయం గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు బండారి గంగారాం జాతీయ జెండాను ఎగురవేశారు. సాయంత్రం జెండాను దించి అవతనం చేయడం కోసం వెళ్లగా కర్ర కిందపడి, జాతీయజెండా సగం దగ్ధమై కనిపించింది. దీంతో గ్రామ సర్పంచ్ దీపిక కిరణ్ గౌడ్‌కు సమాచారం అందించగా పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎవరో గుర్తుతెలియని దుండగులు దురుద్దేశంతోనే జెండాను కిందపడేసి కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. -
ఇళయరాజాకు అవమానం
చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకు బెంగళూర్ విమానాశ్రయంలో అవమానం జరిగింది. తనిఖీ పేరుతో అక్కడి సెక్యూరిటీ అధికారులు అత్యుత్సాహం చూపించి ఇళయరాజాను అవమాన పరిచారు.వివరాల్లోకెళ్లితే ఇళయరాజా కొన్ని రోజుల క్రితం తన కొడుకు కార్తీక్‌రాజా,కుటుంబసభ్యులతో కలిసి మంగుళూర్‌లో గల దేవాలయానికి దేవుని దర్శనార్థం వెళ్లారు. అనంతరం ఆదివారం రాత్రికి చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యారు. బెంగళూర్ వియానాశ్రయంలో ఆయన్ని అక్కడి సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేశారు. అప్పుడు ఇళయరాజా వద్ద దేవుని ప్రసాదం ఉండడంతో దాన్ని ఏదోగా భావించి ఆయన వస్తువులను పూర్తిగా శోధన చేయడం ప్రారంభించారు. ఇళయరాజా వివరణ ఇవ్వబోయినా వినిపించుకోకుండా వారి కుటుంబసభ్యులు సహ ఒక పక్కన నిలబెట్టారు. దీంతో ఆగ్రహం చెందిన ఇళయరాజా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక టీవీ చానల్ విలేకరి పరిస్థితిని గ్రహించి ఇళయరాజా గురించి అధికారులకు వివరించడంతో ఆయన్ని కుటుంబసభ్యులు సహా విమానాశ్రయంలోకి అనుమతించారు. ఈ తతంగం అంతా సీసీ కెమెరాల్లో చూసిన ఉన్నతాధికారి ఒకరు వెంటనే అక్కడికి వచ్చి ఇళయరాజాకు క్షమాపణ చెప్పి ఆయన్ని చెన్నై విమానం ఎక్కించారు. ఇళయరాజాకు వైగో మద్దతు ఇళయరాజాకు జరిగిన అవమానానికి ఎండీఎంకే నేత వైగో తీవ్రంగా ఖండించారు.ఈ సంఘటన గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఏ దేశ సంగీతదర్శకుడు చేయనటువంటి సింపోనిని చేసిన గొప్ప సంగీత దర్శకుడు ఆయన అని అన్నారు.ఆయనకు జరిగిన అవమానం గురించి ఉన్నత స్థాయిలో విచారణ జరిపి అందుకు బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
గర్ల్స్ షార్ట్స్ వేసుకోవడంపై ప్రొఫెసర్ వివాదం
బెంగళూరు: బెంగళూరు న్యాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఓ ప్రొఫెసర్‌కు మధ్య యుద్ధం జరుగుతోంది. తాము ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఒక ప్రొఫెసర్ నిర్ణయించడమేమిటని, అసభ్యకరంగా మాట్లాడటమేమిటని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. తాను అన్న మాటలకు ఎలాంటి విచారణ జరిపించుకున్న వారి ముందు సమాధానం చెప్పేందుకు సిద్ధమని ఆ ప్రొఫెసర్ అంటున్నారు. ఈ నెల 4న నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో షార్ట్ వేసుకొని క్లాస్‌కు వచ్చిన విద్యార్థినిని ప్రొఫెసర్ మందలించాడు. సరైన దుస్తులు వేసుకొని తరగతులకు రావాలని అందరి ముందు ఆ అమ్మాయిని నిలదీశాడు. దీనిని అవమానంగా భావించిన ఆ విద్యార్ధిని తోటి విద్యార్థులకు చెప్పడంతో ఆమెకు మద్దతుగా మరుసటి రోజు క్లాసుకు అంతా షార్ట్స్ వేసుకొని వచ్చారు. ఒక ప్రొఫెసర్ విద్యార్థిని విషయంలో అభ్యంతరకరమైన మాటలు ఎందుకంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దుస్తులు ధరించే విషయంలో ఈ వర్సిటీలో ముందునుంచే ఆ ప్రొఫెసర్ వేధింపులు ఎక్కువయ్యాయని, వీసీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, దర్యాప్తునకు తాను కూడా సిద్ధమని ఆ ప్రొఫెసర్ ప్రకటించారు. -
యువతి ఆత్మాహుతి
♦ అవమానించారని బలవన్మరణం ♦ బొర్రగూడెంలో విషాదం ♦ నిప్పంటించుకొని యువతి బలవన్మరణం ♦ వరుసకు అన్నను చిన్న మాట అడిగి ♦ ఆ తర్వాత అవమానపడ్డానని తనువు చాలించిన వైనం బొర్రగూడెం(వర్గల్): నలుగురిలో తనను నిల దీసి అవమానించారని క్షణికావేశంతో ఓ యు వతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని బ లవన్మరణం చెందింది. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని బొర్రగూడెంలో జరిగిం ది. బేగంపేట ఎస్సై అనీల్‌రెడ్డి కథనం ప్రకా రం ఈ విషాదకర ఘటన వివరాలిలా ఉ న్నాయి. బొర్రగూడెం గ్రామానికి చెందిన బొర్ర భీమయ్య, బాలమణి దంపతుల మూ డో కూతురు కవిత(18). ఆమె శుక్రవారం ఉదయం వరుసకు అన్న అయిన నవీన్‌ను కలిసి ‘వేరే ఎవరితోనో తిరుగుతున్నావట నిజమేనా( అని అడిగింది. తనపై చెల్లెలు నిందారోపణ చేసిన విషయం ఆ యువకుడు తన తల్లికి చెప్పాడు. దీంతో నవీన్ తండ్రి బొర్ర సత్తయ్య, మల్లయ్య, యాదయ్య, ఎల్లవ్వ, హంసవ్వ, మంజులలు ఓ బాలుడితో కవితను పిలిపించుకున్నారు. తమ కొడుకుపై అనవసరంగా ఎందుకు నిందలు మోపుతున్నావని నిలదీసి తిట్టారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కవిత పొలం వద్ద ఉన్న తండ్రి భీమయ్య వద్దకు వెళ్లింది. తాను ఆత్మహత్య చేసుకుంటానని తండ్రికి చెప్పింది. దీంతో తండ్రి ఆ బాలికకు నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చి వదిలివెళ్లాడు. ఆ తరువాత ఇంట్లో తల్లి బాలమణి దుస్తులు ఉతికే పనిలో నిమగ్నం కాగా, ఇంటి ముందర బాత్రూంకు చేరుకుని కిరోసిన్ పోసుకుని కవిత నిప్పంటించుకుంది. పొగలు వస్తున్నట్లు గమనించి అక్కడకు చేరుకోగా అప్పటికే కవిత మంటల్లో పూర్తిగా కాలిపోయి విగతజీవిగా మారింది. ‘అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన తమ కూతురు అ న్నంత పనిచేసి కానరాని తీరాలకు పోయిం ద’ని తల్లిదండ్రులు బోరుమన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకున్నది. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించా రు. మృతురాలి తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు బొర్ర మల్లయ్య, సత్తయ్య, యాద య్య, ఎల్లవ్వ, హంసవ్వ, మంజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఖేడ్ ను అవమానించొద్దు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రమంత్రిగా ఉంటూ రెండేళ్లుగా నారాయణఖేడ్‌ను పట్టించుకోని హరీశ్‌రావు ఇప్పుడు దత్తత తీసుకుంటామంటూ అవమానిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నారాయణఖేడ్ నీటి ఎద్దడికి మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిలే కారణమని ఆరోపించారు. సింగూరు జలాలను నిజాంసాగర్‌కు తరలించడం వల్ల నారాయణఖేడ్‌లో తాగునీటికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. నారాయణఖేడ్ ప్రజలకు తాగునీరు కూడా లేకుండా చేసిన హరీశ్‌రావు, ఇప్పుడు దత్తత తీసుకుంటానని అనడం మోసమని పొన్నం విమర్శించారు. నారాయణఖేడ్‌ను దత్తత తీసుకుంటానని చెప్పడం ద్వారా అక్కడ ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి అసమర్థుడని చెప్పడమే అవుతుందన్నారు. -
విన్‌సల్ట్
అవమానం... దారుణాతి దారుణ మానసిక గాయం. ఎంతటి అరివీర భయంకరులకైనా, ఘన విజ్ఞాన సుసంపన్నులకైనా కాలం కలసిరాని సందర్భాలలో అవమానాలు అనివార్యంగా ఎదురవుతుంటాయి. కించపడ్డ వాళ్లు కొంచెమైపోరు గానీ, అవమానం ఎదురైనప్పుడు ఆ భారాన్ని భరించడం సాంత్వన వచనాలు పలికినంత తేలికేమీ కాదు. మానావమానాలకు ఒకేరీతిలో స్పందించే లక్షణాన్ని స్థితప్రజ్ఞ అంటారు. ఇలాంటి స్థితప్రజ్ఞత యోగిపుంగవులు ఏ కొందరికో తప్ప సామాన్య మానవులకు సాధ్యం కాదు. సమ్మానాలకు పొంగిపోవడం, అవమానాలకు కుంగిపోవడం మానవ సహజ లక్షణం. ఎంతటి వారికైనా జీవితమంతా రాజపూజ్యంగానే గడిచిపోదు. అప్పుడప్పుడు అనుకోని అవమానాలూ ఎదురవుతుంటాయి. తమకు ఎదురైన అవమానాలకు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ప్రతిస్పందిస్తారు. కొందరు మౌనంగా తమలో తామే కుమిలిపోతూ, మానసికంగా కుంగిపోతారు. ఇంకొందరు తమను అవమానించిన వారిపై పగ పెంచుకుని, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతారు. చాలా కొద్దిమంది మాత్రమే అవమానాలను సవాలుగా స్వీకరించి, జీవితంలో తమను తాము నిరూపించుకుంటారు. చరిత్రలో ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. వాటిలో మచ్చుకు కొన్ని... 1893 మే... దక్షిణాఫ్రికా ట్రైన్‌లోని ఫస్ట్‌క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రిటోరియా వెళుతున్నారు గాంధీజీ. కాసేపటికి అదే బోగీలోకి ఎక్కిన ఒక తెల్లదొర గాంధీజీని చూసి అసహనంతో మొహం చిట్లించాడు. ‘ఛీ... నల్లవాడివి నువ్వు ఫస్ట్‌క్లాస్ బోగీలోకి ఎక్కడమేంటి? వెంటనే దిగేసి జనరల్ బోగీలోకి వెళ్లు’ అంటూ ఈసడించుకున్నాడు. ‘ఫస్ట్‌క్లాస్ టికెట్ కొన్నాకే ఈ బోగీలోకి ఎక్కాను. నేనెందుకు దిగాలి?’.. స్థిరంగా ప్రశ్నించారు గాంధీజీ. ‘మీలాంటి నల్లవాళ్లకు మా తెల్లదొరలతో కలసి ప్రయాణించే అర్హత లేదు... దిగు’ అంటూ గాంధీజీ లగేజీని విసిరేసి, ఆయననూ తోసేశాడు ఆ తెల్లదొర. ఒకవైపు అవమానభారం, మరోవైపు వణికించే చలి... రాత్రంతా అలానే గడిపారు గాంధీజీ. ఆ అవమానం ఆయనలో ఆలోచన రేపింది. దక్షిణాఫ్రికాలోని భారతీయుల హక్కుల కోసం పోరాడేందుకు ప్రేరణనిచ్చింది. అదే స్ఫూర్తితో భారతదేశానికి తిరిగి వచ్చాక, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర సమరశంఖాన్ని పూరించేలా చేసింది. జరిగిన అవమానానికి తనలో తానే కుమిలిపోయినా, లేకుంటే తనను ఫస్ట్‌క్లాస్ బోగీలోంచి తోసేసిన తెల్లదొరపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నా గాంధీజీ మహాత్ముడయ్యేవాడు కాదు. పీటర్మెరిట్స్బర్గ్ నడిబొడ్డున ఆయన కాంస్య విగ్రహమూ వెలిసేది కాదు. అవమానాన్ని సవాలుగా తీసుకుని, జాతి ఆత్మగౌరవం కోసం పోరాడటం వల్లనే ఆయనను ఇప్పటికీ గుర్తుంచుకున్నాం. గాంధీజీ స్ఫూర్తితోనే అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ నల్లవాళ్ల పట్ల జరుగుతున్న అవమానాలకు వ్యతిరేకంగా పోరాడాడు. చరిత్రలోని ఉదాహరణలు సరే, ఇటీవలి ఉదంతాలను పరిశీలిస్తే, శాంతా బయోటెక్ ఒక సజీవ ఉదాహరణగా కనిపిస్తుంది. 1990వ దశకం... జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ సదస్సుకు భారత ప్రతినిధిగా వరప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు. ఆ సదస్సులో వ్యాక్సిన్లకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. సదస్సుకు హాజరైన వారిలో ఒక జాత్యహంకారి ‘యూ ఇండియన్స్ ఆర్ ది బెగ్గర్స్... ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడి బతకడమే మీకు తెలుసు’ అంటూ అవమానించాడు. వరప్రసాద్‌రెడ్డి దీనిని వ్యక్తిగత అవమానంగా భావించలేదు. తన దేశానికి, తన జాతికి జరిగిన అవమానంగా భావించారు. నిమ్మళంగా ఆత్మావలోకనం చేసుకున్నారు. ఈ అవమానానికి మాటలతో కాదు, చేతలతో బదులివ్వాలని కృతనిశ్చయానికి వచ్చారు. డబ్ల్యూహెచ్‌వోలో జరిగిన అవమానానికి సమాధానంగా శాంతా బయోటెక్‌ను స్థాపించారు. వ్యాక్సిన్ల తయారీలో తమదే రాజ్యం అని విర్రవీగుతున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాల సరసన భారత్‌ను సగర్వంగా నిలబెట్టారు. అవమానం పొందిన చోటే అతి తక్కువ ధరలకు వ్యాక్సిన్లను ఇతర దేశాలకూ సరఫరా చేసి, ‘డోనర్’గా ఘనత సాధించారు. అందుకే.. ‘అవమానాన్ని ఆత్మపరిశీలనకు సాధనంగా ఉపయోగించుకుంటే విజయం సాధించగలం. అయితే, ఎంతో పరిణతి ఉంటే తప్ప అది సాధ్యం కాదు. విజయం నుంచి విజయానికి అవకాశాలు తక్కువ. అపజయం నుంచి విజయానికి ఉన్నవన్నీ అవకాశాలే. అందువల్ల అవమానం నుంచి గెలుపు సాధించాలంటే చాలా సంయమనం అవసరం’ అంటారాయన. పరాభవ పురాణం... పురాణాలలోనూ పరాభవాల ఉదంతాలు తక్కువేమీ కాదు. త్రేతాయుగంలో రావణుడు సీతాదేవిని అపహరించి అవమానించడం వల్లనే రామరావణ యుద్ధం జరిగింది. ద్వాపర యుగానికొస్తే... నిండుసభలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుడి దురహంకారం కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. సినిమాలకు ముడిసరుకు... చాలా మాస్ మసాలా సినిమాలకు అవమానమే ముడి సరుకు. నిరుపేద హీరోను డబ్బున్న విలన్ అవమానిస్తాడు. కసితో రగిలిపోయిన హీరో, క్లైమాక్స్‌లో ఆ విలన్ భరతం పడతాడు. ఆత్మగౌరవానికి మారుపేరులాంటి హీరోయిన్ని విలన్ పరాభవిస్తాడు... తోకతొక్కిన తాచులా పగబట్టిన ఆమె విలన్ అంతు చూస్తుంది... ఒక్కోసారి సింగిల్‌గానే... కొన్నిసార్లు హీరో సహకారంతో... ఉదాహరణకు ‘ప్రతిఘటన’ సినిమాలో హీరోయిన్ను నడిబజారులో వలువలూడదీసి అవమానిస్తాడు విలన్. ఆమె తనలో తానే కుమిలిపోకుండా, నిండుసభలోనే విలన్‌ను చంపి ప్రతీకారం తీర్చుకుంటుంది. విజయ సోపానాలు అవమానాలను సహించడం కష్టమే అయినా, స్థిమితం కోల్పోకుండా స్పందిస్తే అవి మన పురోగతికి పనికొస్తాయి. మనలోని శక్తియుక్తులను వెలికితీసేవి, మన కర్తవ్యాన్ని గుర్తుచేసేవి, మనల్ని కార్యోన్ముఖులను చేసేవి చాలా సందర్భాల్లో అవమానాలే. అవమానాలను ఓటమిగా భావించి, కుంగిపోకుండా, సవాలుగా స్వీకరించి అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధపడితే, అవే మన విజయ సోపానాలవుతాయి. - సరస్వతి రమ -
నిజాంను పొగడడం తెలంగాణను అవమానపర్చడమే
హుస్నాబాద్‌రూరల్ : సాయుధ పోరాటంలో దొడ్డి కొంరయ్యను కర్కషంగా చంపిన నిజాంను కేసీఆర్ పొగడడం తెలంగాణను అవ మానపర్చడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ సాయుధపోరాట యోధుడు అనభేరి 67వ వర్ధంతి సభను శుక్రవారం రాత్రి మహ్మదాపూర్ గుట్టల్లో ఘనంగా నిర్వహించారు. గుట్టల నుంచి కొవ్వత్తులతో ర్యాలీగా గ్రామంలోని స్తూపం వరకు పాదయాత్రగా వచ్చి నివాళులర్పించారు. హైదరాబాద్ కార్పొరేషన ఎన్నికల్లో గెలిచేందుకే ఎంఐఎంను పొగుడుతున్నారన్నారు. కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టులకు ప్రథమ శత్రువుగా మారుతారని హెచ్చరించారు. కమ్యూనిస్టులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కలిసి పనిచేస్తామన్నారు. భూర్జువా పార్టీలతో స్నేహం చేయడం శాపంగా మారిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సూర్య చంద్రులున్నంత వరకు అమరుల త్యాగాలు మరువబోమన్నారు. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తెలంగాణ సాంస్కృతిక శౌర్య రాష్ట్ర కన్వీనర్ పాశం యాదగిరి, సినీ హీరో మాదాల రవి, జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి, మాజీ కార్యదర్శి నారాయణ, నాయకులు సృజన్‌కుమార్ , అయిలయ్య, మల్లేశ్, శోభారాణి, సర్పంచ్ రమేశ్,తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన కులాంతర వివాహం
రాచగూడిపల్లె (ఒంటిమిట్ట): మండలంలోని రాచగూడిపల్లె బీసీ కాలనీలో కూతురు కులాంతర వివాహం చేసుకుందని అన్నదమ్ముళ్లు అవమానించడంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాచగూడిపల్లె గ్రామానికి చెందిన గిరిజ నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. సంక్రాంతి పండుగ రావడంతో ఇంటి వద్దకు వచ్చి తల్లిదండ్రులను తమను ఇంట్లోకి రానివ్వాల్సిందిగా బ్రతిమలాడింది. గిరిజ తండ్రి రవి కూతుర్ని క్షమించి ఇంట్లోకి ఆహ్వానించారు. అయితే రవి సోదరుడైన కృష్ణయ్య, అతని భార్య సుబ్బలక్షుమ్మలు కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావని అసభ్యకర పదజాలంతో దూషించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకానొక సందర్భంలో అతన్ని సోదరులు చితకబాదినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం నుంచి వీరి వేధింపులు ఎక్కువ కావడంతో అవమానం భరించలేక విషద్రావం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని 108లో రిమ్స్‌కు తరలించే క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి కుమార్తె గిరిజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పెద్దఓబన్న తెలిపారు. -
స్పీకర్ మీరా కుమార్ ఆవేదన