గర్ల్స్ షార్ట్స్ వేసుకోవడంపై ప్రొఫెసర్ వివాదం | NLSIU professor shames girl over shorts, students up in arms | Sakshi
Sakshi News home page

గర్ల్స్ షార్ట్స్ వేసుకోవడంపై ప్రొఫెసర్ వివాదం

Published Fri, Apr 8 2016 9:38 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

గర్ల్స్ షార్ట్స్ వేసుకోవడంపై ప్రొఫెసర్ వివాదం

గర్ల్స్ షార్ట్స్ వేసుకోవడంపై ప్రొఫెసర్ వివాదం

బెంగళూరు: బెంగళూరు న్యాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఓ ప్రొఫెసర్కు మధ్య యుద్ధం జరుగుతోంది. తాము ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఒక ప్రొఫెసర్ నిర్ణయించడమేమిటని, అసభ్యకరంగా మాట్లాడటమేమిటని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. తాను అన్న మాటలకు ఎలాంటి విచారణ జరిపించుకున్న వారి ముందు సమాధానం చెప్పేందుకు సిద్ధమని ఆ ప్రొఫెసర్ అంటున్నారు. ఈ నెల 4న నేషనల్ లా స్కూల్ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీలో షార్ట్ వేసుకొని క్లాస్కు వచ్చిన విద్యార్థినిని ప్రొఫెసర్ మందలించాడు.

సరైన దుస్తులు వేసుకొని తరగతులకు రావాలని అందరి ముందు ఆ అమ్మాయిని నిలదీశాడు. దీనిని అవమానంగా భావించిన ఆ విద్యార్ధిని తోటి విద్యార్థులకు చెప్పడంతో ఆమెకు మద్దతుగా మరుసటి రోజు క్లాసుకు అంతా షార్ట్స్ వేసుకొని వచ్చారు. ఒక ప్రొఫెసర్ విద్యార్థిని విషయంలో అభ్యంతరకరమైన మాటలు ఎందుకంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దుస్తులు ధరించే విషయంలో ఈ వర్సిటీలో ముందునుంచే ఆ ప్రొఫెసర్ వేధింపులు ఎక్కువయ్యాయని, వీసీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, దర్యాప్తునకు తాను కూడా సిద్ధమని ఆ ప్రొఫెసర్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement