ఇరాన్‌లో వందలాదిమంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగింది. ఇప్పటికే ఆ దేశంలో మహిళలపై జరుగుతున్న హింసాకాండ మరువుక మునుపే మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. బాలికల విద్యను ఆపేయాలన్న ఉద్దేశ్యంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన టెహ్రాన్‌లో కోమ్‌లోని ఒక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ మేరకు డిప్యూటీ హెల్త్ మినిస్టర్ యూనెస్ పనాహి ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు వెల్లడించారు.
అంతేగాదు విద్యార్థినులపై విష ప్రయోగం జరిగిన వెంటనే కొంతమంది అన్ని పాఠశాలలను ముఖ్యంగా బాలికల పాఠశాలలను మూసివేయాలని కోరినట్లు ఇరాన్ స్థానికి మీడియాలు పేర్కొన్నాయి కూడా. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకుని అరెస్టులు చేయకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ విషయమై అధికారులను నిలదీసేందుకు నగర గవర్నరేట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి జహ్రోమి మాత్రం ఇంటెలిజెన్స్, విద్యా మంత్రిత్వ శాఖలు ఈ ఘటనకు గల కారణాలను కనుగొనడానికి యత్నిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ ఘటనకు కారణాలపై సత్వరమే దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులును అదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, గతేడాది వస్త్రధారణ నియమావళిని ఉల్లంఘించినందుకు అరెస్టు చేసిన 22 ఏళ్ల ఇరానియన్ కుర్ద్ మహ్సా అమిని డిసెబర్ 16న కస్టడీలో మరణించినప్పటి నుంచి ఇరాన్ నిరసనలతో అట్టుడుకుపోతోంది.
(చదవండి: పాక్, చైనాలకు సాయం కట్ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి)
Comments
Please login to add a commentAdd a comment