Shorts
-
ఈ వయసులో షార్ట్స్ ఎందుకు?.. సీనియర్ నటి అదిరిపోయే సమాధానం!
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేరు అందరికీ పరిచయమే. గతేడాది లస్ట్ స్టోరీస్-2తో అలరించిన నీనా.. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో కనిపించింది. మలయాళంలో తెరకెక్కించిన 1000 బేబీస్ సిరిస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఇటీవల ఆమె టాక్ షోలో పాల్గొన్నారు. కరీనా కపూర్ ఖాన్ చాట్ షో రాబోయే ఎపిసోడ్లో కనిపించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఈ వయసులో మీరు ఎందుకు షార్ట్స్ వేసుకుంటారని చాలామంది అడుగుతున్నారని కరీనా ప్రశ్నించింది. దీనికి నీనా గుప్తా స్పందిస్తూ.. మీ నాన్న డబ్బులతో అయితే వేసుకోవడం లేదు కదా? అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. ఈ షోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. కాగా.. నీనా గుప్తా ఇటీవలే ఉంచాయి మూవీలో తన నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. -
ఇక యూట్యూబ్‌లో షాపింగ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ భారత్‌లో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అర్హత కలిగిన క్రియేటర్లు తమ వీడియోలకు ఉత్పత్తులను జోడించడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించేందుకు ఈ కార్యక్రమం వీలు కలి్పస్తుంది. వీడియోలు, షార్ట్స్, లైవ్స్ట్రీమ్స్కు కంటెంట్ క్రియేటర్లు ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేస్తే.. వీడియో డి్రస్కిప్షన్లో, అలాగే ప్రొడక్ట్ సెక్షన్లో అవి ప్రత్యక్షం అవుతాయి. వ్యూయర్స్ వాటిని క్లిక్ చేయడం ద్వారా రిటైలర్స్ సైట్‌కు చేరుకుని షాపింగ్ చేయవచ్చు. వీక్షకులు చేసే కొనుగోళ్ల ఆధారంగా కంటెంట్ క్రియేటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతానికి ఈ–కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, మింత్రా పోర్టల్‌లో లిస్ట్ అయిన ఉత్పత్తులను క్రియేటర్లు తమ వీడియోలకు ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా సక్సెస్..: యూట్యూబ్ షాపింగ్ అంతర్జాతీయంగా విజయవంతం అయిందని యూట్యూబ్ తెలిపింది. అంతర్జాతీయంగా 2023లో వ్యూయర్స్ ఏకంగా 3,000 కోట్లకుపైగా గంటల షాపింగ్ సంబంధ కంటెంట్‌ను యూట్యూబ్‌లో వీక్షించారు. ఈ నేపథ్యంలో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను భారత్‌లో పరిచయం చేసినట్టు యూట్యూబ్ షాపింగ్ జీఎం, వైస్ ప్రెసిడెంట్ ట్రావిస్ కజ్ తెలిపారు. -
యూట్యూబ్ షేక్.. 2023లో దుమ్ము రేపిన వీడియోలు, షార్ట్స్ ఇవే..
ఆధునిక కాలంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. దీంతో ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగిన నిమిషంలో తెలిసిపోతోంది. ఇందులో కూడా కొన్ని సంఘటనలు మాత్రమే పెద్దగా వైరల్ అవుతాయి. ఈ ఏడాది (2023) ఎక్కువ మంది చూసిన వీడియోలు ఏవి, టాప్ ట్రెండింగ్ కంటెంట్, దాని వెనుక ఉన్న క్రియేటర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023లో ఎక్కువ మంది వీక్షించిన వీడియాల్లో చెప్పుకోదగ్గది 'చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్-ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్'. దీనికి ప్రారంభంలో 8.5 మిలియన్స్.. ఇప్పటి వరకు 79 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ సంవత్సరంలో యూట్యూబ్‌లో అతిపెద్ద లైవ్ స్ట్రీమ్‌గా ఇది సంచలనం సృష్టించింది. ఆ తరువాత వరుసగా మ్యాన్ ఆన్ మిషన్, యూపీఎస్సీ స్టాండ్ అప్ కామెడీ, డైలీ వ్లాగర్ పేరడీ, శాస్తా బిగ్ బాస్ 2 వంటివి ఎక్కువ వ్యూవ్స్ పొందాయి. టాప్ 15 గేమింగ్ వీడియోలు 2023లో 'ఐ స్టోల్ సుప్రా ఫ్రమ్ మాఫియా హౌస్' ఎక్కువమంది హృదయాలను దోచింది. ఈ గేమింగ్ వీడియో ఇప్పటికి 30 మిలియన్ వీక్షణనలను పొందింది. ఆ తరువాత స్థానంలో జీటీఏ5 ఇన్ రియల్ లైఫ్, గ్రానీ చాఫ్టర్ 1, స్కిబిడి టాయిలెట్ 39 - 59, కునాలి కో దర్ నహీ లగ్తా వంటివి ఉన్నాయి. టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ ఈ ఏడాది యుట్యూబ్లో సంచలనం సృష్టించిన టాప్ 10 కంటెంట్ క్రియేటర్ల జాబితాలో ప్రధమ స్థానంలో పవన్ సాహు ఉండగా.. ఆ ఆ తరువాత స్థానాల్లో నీతూ బిష్ట్ (Neetu Bisht), క్యూట్ శివాని 05, ఫిల్మీ సూరజ్ యాక్టర్, అమన్ డ్యాన్సర్ రియల్, ఆర్టిస్ట్ సింతు మౌర్య మొదలైనవారు ఉన్నాయి. ఇందులోనే మహిళల విభాగంలో నీతూ బిష్ట్, షాలు కిరార్, జశ్వి విశ్వి, ది థాట్ఫుల్ గర్ల్, రాయల్ క్యూన్, సోనాల్ అగర్వాల్, మింకు టింకు, అంజు డ్రాయింగ్ షార్ట్స్, మహి లక్రా వ్లాగ్స్, మామ్ అండ్ రీదిష్ణ వంటి వారు ఉన్నారు. టాప్ 15 షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ విభాగంలో ఈ ఏడాది వరుసగా పతి కో బనాయా పాగల్, కదం కదం భజాంగే జా, 500 మీ ఐఫోన్, బ్లో ద రోలర్ అండ్ విన్ ఛాలెంజ్, చలాక్ బాయ్ ఫ్రెండ్, టామ్ అండ్ జెర్రీ (రిత్వి & కవి), పోర్ ఛాలెంజ్ విత్ సిరప్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా.. టాప్ 15 మ్యూజిక్ వీడియోలు 2023లో పాపులర్ అయిన వీడియోల విషయానికి వస్తే.. ఇందులో మొదటి స్థానంలో ఘనీ కో సబ్ ఘన్, జరా హక్తే జరా బచ్కే, జవేద్ మోహ్సిన్, క్యా లోగే తుమ్, హా నువ్ కావాలయ్యా (జైలర్), పల్సర్ బైక్ (ధమాకా), నా రెడీ (లియో) మొదలైనవి ఉన్నాయి. -
యూట్యూబ్‌ను ముంచేస్తున్న షార్ట్స్.. ఆందోళనలో ఉద్యోగులు
భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలు చైనా షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేశాయి. దీంతో యూట్యూబ్ ‘యూట్యూబ్ షార్ట్స్’ పేరుతో షార్ట్ వీడియో విభాగాన్ని ప్రారంభించింది. అయితే వ్యూస్, యూజర్ల విషయంలో షార్ట్స్‌కు ఊహించని స్పందన వచ్చింది. యూట్యూబ్ యాజమాన్యం సైతం సంతోషించింది. కానీ ఆ సంతోషం అంతలోనే అవిరైనట్లు తెలుస్తోంది. ఆందోళనలో యూట్యూబ్ సిబ్బంది షార్ట్స్‌ను ప్రారంభించడంలో యూట్యూబ్ లక్ష్యం.. వ్యాపారాన్ని పెంచడం, టిక్ టాక్, మెటా వంటి ప్రత్యర్థులతో నిలబడటం. అయితే, ఈ షార్ట్స్ ఫీచర్ లాంగ్ వీడియోలకు వచ్చే ఆదాయానికి గండిపెడుతుందని యూట్యూబ్ సిబ్బంది భావిస్తున్నారు. ఇటీవలి యూట్యూబ్ స్ట్రాటజీ మీటింగ్స్ లో కంపెనీకి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే లాంగ్ ఫామ్ వీడియోలు ఫార్మాట్ గా 'అంతరించిపోతున్నాయి' అనే ప్రమాదం గురించి చర్చించినట్లు నివేదిక తెలిపింది. సందిగ్ధంలో యూట్యూబ్ షార్ట్ ఫామ్ వీడియో కంటెంట్‌కు ఆదరణ పెరుగుతుండటంతో యూట్యూబ్ సందిగ్ధంలో పడింది. షార్ట్ ఫామ్ వీడియోలు ప్రేక్షకులలో మరింత ప్రాచుర్యం పొందాయి .త్వరగా క్రియేట్ చేయడం, వీక్షించడం సులభం. అందుకే టిక్ టాక్ , ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అంత సక్సెస్ కావడంతో పాటు యూట్యూబ్ కూడా షార్ట్స్‌ను పరిచయం చేసింది. ఏదేమైనా, యూట్యూబ్ ప్రకటనల నుండి ఆదాయాన్ని గడిస్తుంది. షార్ట్ ఫామ్ వీడియోలు ఎక్కువ ప్రకటనలను అనుమతించవు. అందువల్ల యూట్యూబ్ లాంగ్ ఫామ్ వీడియోల ద్వారా సంపాదించినంత లాభాన్ని షార్ట్స్ నుంచి పొందలేకపోతోంది. ఆదాయం కోసం ఇదిలా ఉంటే షార్ట్స్ నుంచి మరింత యాడ్ ఆదాయాన్ని ఎలా ఆర్జించాలనే దానిపై యూట్యూబ్ ఇంకా ప్రయత్నిస్తోంది. అయితే ఈలోగా కంటెంట్ క్రియేటర్లు తక్కువ నిడివి ఉన్న వీడియోలను అప్లోడ్ చేస్తుండటం యూట్యూబ్ సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. గూగుల్ తన యూట్యూబ్ ఆడియన్స్ యూజర్లను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఆదాయం గడించే మార్గాన్ని గుర్తించాలని యూట్యూబ్ సిబ్బంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
యూట్యూబ్ షార్ట్స్ కోసం కొత్త టూల్స్
‘షార్ట్స్’ కోసం యూట్యూబ్ కొత్త వీడియో ఎఫెక్ట్, ఎడిటింగ్ టూల్స్‌ను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల క్రియేటర్స్ మరింత మెరుగైన ‘షార్ట్స్’ను రూపొందించడానికి వీలవుతుంది. వ్యక్తిగత కామెంట్స్‌కు రిప్లే ఇచ్చే సదుపాయం కూడా రానుంది. ‘షార్ట్స్’ ద్వారా డబ్బు అర్జించడానికి ‘బ్రాండ్కనెక్ట్’ నుంచి ‘బ్రాండెడ్ కంటెంట్’ను బిల్డ్ చేయడం, షాపబుల్ వీడియోలు, లైవ్షాపింగ్... మొదలైన వాటికి ఐడియాలు, ఎలాంటి కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనేదానిపై సలహాలు పొందవచ్చు. మరో కొత్త ఫీచర్ స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కొత్త మొబైల్ యాప్(ఐఫోన్, ఆండ్రాయిడ్లలో)ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వీడియోలను లైక్, డిస్లైక్ చేయడం, షేర్ చేయడం సులభం అవుతుంది. ఫుల్ స్క్రీన్ మోడ్‌లో కూడా బాటమ్ కార్నర్లో బటన్ వరుస కనిపిస్తుంది. దీని వల్ల రకరకాల ఆప్షన్లతో యాక్సెస్ కావడానికి వీలవుతుంది. యూట్యూబ్ ‘లూపింగ్ ఫీచర్’ అనే కొత్త ఫీచర్‌ను పరిక్షిస్తోంది. (క్లిక్: ప్రాణం లేదు.. అయినా బుడ్డోడి హావభావాలు అదుర్స్) -
యూట్యూబ్ బంపర్ ఆఫర్..! వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు..!
యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేసే యూజర్లకు వ్యూస్ ఆధారంగా యూట్యూబ్ డబ్బులను అందజేస్తుంది. తాజాగా కంటెంట్ క్రియేట్ చేసే యూజర్లకు మరో బంపర్ ఆఫర్‌ను యూట్యూబ్ ప్రకటించింది. టిక్‌టాక్ యాప్‌కు పోటీగా యూట్యూబ్ షార్ట్స్ వీడియోలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా షార్ట్ వీడియోలను తీసే వారికి కొత్తగా ప్రోత్సాహకాలను యూట్యూబ్ తన యూజర్లకు అందించనుంది. ప్రోత్సాహకాలను అందించడం కోసం యూట్యూబ్ సుమారు 100 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 2021 నుంచి 2022 మధ్య వైరలైన షార్ట్ వీడియోల కోసం యూజర్లకు రివార్డ్ అందించడంలో ఈ ఫండ్ ఉపయోగపడనుంది. యూట్యూబ్ సుమారు 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యూజర్లకు రివార్డ్ ఇవ్వనుంది. కాగా ఈ రివార్డులను సొంతం చేసుకోవాలంటే ఒక చిన్న మెలిక పెట్టింది. షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకొని రివార్డులను అందించనుంది. షార్ట్ వీడియో క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని యూట్యూబ్ సపరేటుగా అడుగుతోంది. ప్రతి నెల షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ప్రకారం ఆయా కంటెంట్ క్రియేటర్లు చేసిన షార్ట్ వీడియోలు వ్యూస్ విషయంలో కచ్చితంగా క్వాలిఫై అవాల్సి ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్‌ను భారత్‌తోపాటుగా యుఎస్, యుకె, బ్రెజిల్, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, నైజీరియా, రష్యా , దక్షిణాఫ్రికా దేశాల్లోని కంటెంట్ క్రియేటర్లు ఈ ఫండ్ ద్వారా డబ్బు సంపాదించడానికి అర్హులు. త్వరలో ఈ పోటీని మరిన్ని దేశాలకు విస్తరించాలని యూట్యూబ్ యోచిస్తోంది. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ పొందాలంటే అర్హతలు..! యూజర్లు తమ యూట్యూబ్ ఛానెల్ నుంచి అర్హత సాధించిన షార్ట్ వీడియోను గత 180 రోజుల్లో అప్లోడ్ చేసి ఉండాలి. షార్ట్స్ వీడియో కచ్చితంగా ఒరిజినల్ కంటెంటై ఉండాలి. ఇతర వాటర్‌మార్క్‌లు లేదా లోగోలతో వీడియోలను అప్లోడ్ చేసేవారు అర్హులు కాదు. ఇతర యూట్యూబ్ ఛానళ్ల వీడియోలను అప్లోడ్ చేయకూడదు. ఈ వీడియోలు యూట్యూబ్ షార్ట్స్ ఫండ్‌కు అర్హత సాధించవు. యూజర్లు 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారై ఉండాలి. -
జీన్స్, షార్ట్స్ వేస్తే ఊరు దాటాల్సిందే..
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లొని ఖాప్ పంచాయతీ.. వస్త్రధారణపై కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు జీన్స్, పురుషులు షార్ట్స్ వేసుకోవడంపై నిషేధం విధించింది. ఇకపై గ్రామస్థులందరూ సంప్రదాయ దుస్తులనే ధరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే శిక్షతో పాటు, బహిష్కరణలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. చార్తవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపాల్సా గ్రామంలో మార్చి 2న జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు ర్ణయం తీసుకున్నట్టు పంచాయతీ నాయకుడు, కిసాన్ సంఘ్ చీఫ్ ఠాకూర్ పూరన్ సింగ్ ప్రకటించారు. మహిళలు సాంప్రదాయ భారతీయ దుస్తులైన చీరలు, ఘాగ్రాలు, సల్వార్-కమీజ్(పంజాబీ డ్రస్) ధరించాలని ఆయన సూచించారు. ప్రజల్లో భారతీయ వస్త్ర సంస్కృతి పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా గ్రామ ప్రజలు సైతం ఈ నిబంధనను అంగీకరించడం విశేషం. కాగా యూపీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంపై ఖాప్ పంచాయతీ మండిపడింది. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. చదవండి : (రెండో పెళ్లి చేస్తారా? చావాలా?: 60 ఏళ్ల వ్యక్తి బెదిరింపులు) (మమతకు ఛాతినొప్పి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు) -
టిక్‌టాక్ : యూట్యూబ్ "షార్ట్స్" వచ్చేసింది
సాక్షి,న్యూఢిల్లీ : భారతదేశంలో టిక్‌టాక్ నిషేధంతో అలాంటి ప్లాట్‌ఫాంతో గ్యాప్ పూరించడానికి పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో యూట్యూబ్ ఒక అడుగు ముందుంది. షార్ట్స్ పేరుతో టిక్‌టాక్ లాంటి షార్ట్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేసింది. యూట్యూబ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ జాఫ్ఫ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈవిషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతానికి "షార్ట్స్" మొబైల్ యాప్‌గా మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు.15సెకన్ల నిడివిలో లఘు చిత్రాలు, ఆకర్షణీయమైన వీడియోలను షూట్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు. అంతేకాదు త్వరలోనే మరిన్ని ఫీచర్లు జోడిస్తామని, ఇతర దేశాలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. (టిక్‌టాక్ రేసు నుంచి మైక్రోసాఫ్ట్ అవుట్) తమ కొత్త ప్లాట్ఫామ్లో బహుళ వీడియో క్లిప్‌లను స్ట్రింగ్ చేయడానికి బహుళ-సెగ్మెంట్ కెమెరా, స్పీడ్ కంట్రోల్స్ హ్యాండ్స్-ఫ్రీ రికార్డ్ చేయడానికి టైమర్, కౌంట్‌డౌన్ ఫీచర్లుకూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ద్వారా అందుబాటులోకి తీసుకురాగా, త్వరలోనే ఐఓఎస్ లో కూడా లాంచ్ చేయనుంది. కాగా భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడంతో జూన్‌లో టిక్‌టాక్ సహా 58 ఇతర చైనా యాప్‌లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్ కు 120 మిలియన్లకు పైగా వినియోగదారులతో అతిపెద్ద విదేశీ మార్కెట్ ఇండియానే. అటు అమెరికాలో టిక్‌టాక్ కొనుగోలు డీల్ ఇంకా ఖరారు కాని నేపథ్యంలో అమెరికాలో షార్ట్స్ ను త్వరలోనే లాంచ్ చేయనుందని సమాచారం. (టిక్‌టాక్‌కు ఫైనల్ వార్నింగ్) -
గర్ల్స్ షార్ట్స్ వేసుకోవడంపై ప్రొఫెసర్ వివాదం
బెంగళూరు: బెంగళూరు న్యాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఓ ప్రొఫెసర్‌కు మధ్య యుద్ధం జరుగుతోంది. తాము ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఒక ప్రొఫెసర్ నిర్ణయించడమేమిటని, అసభ్యకరంగా మాట్లాడటమేమిటని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. తాను అన్న మాటలకు ఎలాంటి విచారణ జరిపించుకున్న వారి ముందు సమాధానం చెప్పేందుకు సిద్ధమని ఆ ప్రొఫెసర్ అంటున్నారు. ఈ నెల 4న నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో షార్ట్ వేసుకొని క్లాస్‌కు వచ్చిన విద్యార్థినిని ప్రొఫెసర్ మందలించాడు. సరైన దుస్తులు వేసుకొని తరగతులకు రావాలని అందరి ముందు ఆ అమ్మాయిని నిలదీశాడు. దీనిని అవమానంగా భావించిన ఆ విద్యార్ధిని తోటి విద్యార్థులకు చెప్పడంతో ఆమెకు మద్దతుగా మరుసటి రోజు క్లాసుకు అంతా షార్ట్స్ వేసుకొని వచ్చారు. ఒక ప్రొఫెసర్ విద్యార్థిని విషయంలో అభ్యంతరకరమైన మాటలు ఎందుకంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దుస్తులు ధరించే విషయంలో ఈ వర్సిటీలో ముందునుంచే ఆ ప్రొఫెసర్ వేధింపులు ఎక్కువయ్యాయని, వీసీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, దర్యాప్తునకు తాను కూడా సిద్ధమని ఆ ప్రొఫెసర్ ప్రకటించారు.