యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేసే యూజర్లకు వ్యూస్ ఆధారంగా యూట్యూబ్ డబ్బులను అందజేస్తుంది. తాజాగా కంటెంట్ క్రియేట్ చేసే యూజర్లకు మరో బంపర్ ఆఫర్‌ను యూట్యూబ్ ప్రకటించింది. టిక్‌టాక్ యాప్‌కు పోటీగా యూట్యూబ్ షార్ట్‌స్ వీడియోలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా షార్ట్ వీడియోలను తీసే వారికి కొత్తగా ప్రోత్సాహకాలను యూట్యూబ్ తన యూజర్లకు అందించనుంది. ప్రోత్సాహకాలను అందించడం కోసం యూట్యూబ్ సుమారు 100 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది.
2021 నుంచి 2022 మధ్య వైరలైన షార్ట్ వీడియోల కోసం యూజర్లకు రివార్డ్ అందించడంలో ఈ ఫండ్ ఉపయోగపడనుంది. యూట్యూబ్ సుమారు 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యూజర్లకు రివార్డ్ ఇవ్వనుంది. కాగా ఈ రివార్డులను సొంతం చేసుకోవాలంటే ఒక చిన్న మెలిక పెట్టింది. షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకొని రివార్డులను అందించనుంది.
షార్ట్ వీడియో క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని యూట్యూబ్ సపరేటుగా అడుగుతోంది. ప్రతి నెల షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ప్రకారం ఆయా కంటెంట్ క్రియేటర్లు చేసిన షార్ట్ వీడియోలు వ్యూస్ విషయంలో కచ్చితంగా క్వాలిఫై అవాల్సి ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్‌ను భారత్‌తోపాటుగా యుఎస్, యుకె, బ్రెజిల్, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, నైజీరియా, రష్యా , దక్షిణాఫ్రికా దేశాల్లోని కంటెంట్ క్రియేటర్లు ఈ ఫండ్ ద్వారా డబ్బు సంపాదించడానికి అర్హులు. త్వరలో ఈ పోటీని మరిన్ని దేశాలకు విస్తరించాలని యూట్యూబ్ యోచిస్తోంది.
యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ పొందాలంటే అర్హతలు..!
- యూజర్లు తమ యూట్యూబ్ ఛానెల్ నుంచి అర్హత సాధించిన షార్ట్ వీడియోను గత 180 రోజుల్లో అప్‌లోడ్ చేసి ఉండాలి.
- షార్ట్స్ వీడియో కచ్చితంగా ఒరిజినల్ కంటెంటై ఉండాలి. ఇతర వాటర్‌మార్క్‌లు లేదా లోగోలతో వీడియోలను అప్‌లోడ్ చేసేవారు అర్హులు కాదు.
- ఇతర యూట్యూబ్ ఛానళ్ల వీడియోలను అప్‌లోడ్ చేయకూడదు. ఈ వీడియోలు యూట్యూబ్ షార్ట్స్ ఫండ్‌కు అర్హత సాధించవు.
- యూజర్లు 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారై ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment