Earn Money
-
ఇస్రో వేల కోట్లు సంపాదన.. కేంద్ర మంత్రి ఏమన్నారో తెలుసా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. వివిధ రకాల వాహక నౌకలను రూపొందించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఉపగ్రహ సేవలు, వాణిజ్య పరంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో రికార్డులు నెలకొల్పుతోంది. అంతరిక్ష వాణిజ్యంలో ఇతర దేశాలు, ప్రైవేటు సంస్థలతో పోటీపడుతూ వరుస విజయాలను నమోదు చేస్తోంది. గడచిన 4-5 ఏళ్ల కాలంలో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో పెను మార్పులు జరిగాయి. అయితే తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఇస్రో ఎలా డబ్బు సంపాదిస్తుందో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత శాస్త్రవేత్తలు ప్రతిభ, సామర్ధ్యం, ప్యాషన్‌తో పనిచేస్తున్నారని జితేంద్ర సింగ్ అన్నారు. గతంలో వారికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల పురోగతి కుంటుపడిందన్నారు. మోదీ రాకతో ప్రైవేట్ మార్గాల నుంచి పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్, రష్యా వంటి ఇతర దేశాలకు ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా వచ్చే ఆదాయం గురించి మాట్లాడారు. నాసాకు సగం వనరులు ప్రైవేట్ పెట్టుబడుల నుంచి వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇస్రో సైతం దాదాపు రూ.1000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించినట్లు చెప్పారు. ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల్లో భారత పురోగతిని నొక్కిచెప్పారు. ఇండియా నుంచి ఇస్రో.. అమెరికా, రష్యాలకు చెందిన ఉపగ్రహాలను విజయవంతంగా తక్కువ ఖర్చుతో కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది. దాంతో డబ్బు సమకూరుతుందని తెలిపారు. వాణిజ్య ప్రయోగాల ద్వారా ఇతర దేశాల శాటిలైట్లను ప్రయోగించి ఇస్రో ఇప్పటి వరకు రూ.4,000 కోట్లకు పైగా సంపాదించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో అనేక దేశాలకు చెందిన దాదాపు 430 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు చెప్పారు. ఇస్రో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, మలేషియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, యూఎస్ఏ వంటి దేశాలకు సర్వీసులు అందించిందని వివరించారు. యూరోపియన్ దేశాల నుంచి రూ.2,635 కోట్లు, అమెరికా నుంచి రూ.1,417 కోట్లు సంపాదించినట్లు సింగ్ చెప్పారు. ఇదీ చదవండి: అంబానీ వాటిని పట్టించుకోరు: విజయ్ కేడియా గగన్‌యాన్ మిషన్ 2025 ప్రారంభంలో మానవరూప రోబోట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధంగా ఉందని సింగ్ వెల్లడించారు. 2047లో ప్రతిష్టాత్మకమైన 'డీప్ సీ మిషన్' గురించి సింగ్ మాట్లాడారు. హిమాలయ, సముద్రయాన్ వంటి మిషన్ల ద్వారా హిందూ మహాసముద్రం నుంచి ఖనిజాలను వెలికితీసే ప్రణాళికల గురించి వివరించారు. -
రోజుకి రూ. 1.6 లక్షల సంపాదిస్తున్న 34 ఏళ్ల యువతి.. ఈమె చేసే పనేంటో తెలుసా?
బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఓ రకమైన సంపాదన చేయవచ్చు. అయితే స్విట్జర్లాండ్‌కు చెందిన 'గ్లోరియా రిచర్డ్స్' (Gloria Richards) మాత్రం దీనికి భిన్నమైన ఉద్యోగం చేస్తోంది. కానీ సంపాదనలో మాత్రం ఎవరికీ తీసిపోదు. ఈమె చేసే పని ద్వారా రోజుకి ఏకంగా రూ. 1.6 లక్షలు సంపాదిస్తోంది. ఇంతకీ ఈమె చేసే ఉద్యోగం ఏమిటి? ఇంత డబ్బు ఎలా సంపాదిస్తోందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాకు చెందిన 'గ్లోరియా రిచర్డ్స్' మూడు పదుల వయసు దాటినా ఎంతో ఉత్సాహంగా పని చేస్తోంది. ఈమెకు ఇంత సంపాదన వస్తుంది, బిజినెస్ ఏమైనా చేస్తుందా అనుకుంటే పొరపాటే. గ్లోరియా ధనవంతుల పిల్లలకు ఆయాగా పనిచేస్తుంది. దీని ద్వారానే రోజుకి 2000 డాలర్లు సంపాదిస్తోంది. అంటే ఇది మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.6 లక్షలు. రోజుకి 12 నుంచి 15 గంటలు మాత్రమే పనిచేస్తుంది. (ఇదీ చదవండి: ఐఏఎస్ వదిలి ఇండియాలో అతిపెద్ద తయారీదారుగా.. ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!) గ్లోరియా రిచర్డ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉండే ధనవంతుల పిల్లలకు ఆయాగా పనిచేస్తుంది. అయితే ఈ పని సంవత్సరం మొత్తం చేయదని, పిల్లల చదువుల కోసం, సామజిక క్యాలెండర్ల సమన్వయంతోనే ఎక్కువ సమయం గడుపుతుంది వెల్లడించింది. అంతే కాకుండా మహిళలకు సహాయకురాలిగా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈమె ఎప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఆమె ప్రైవేట్ జెట్లలో కూడా తిరుగుతుంది. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - హైస్కూల్ డ్రాపౌట్ యువకుని సక్సెస్ స్టోరీ) నిజానికి గ్లోరియా రిచర్డ్స్ భారతీయ సంతతికి చెందిన మహిళ, కావున అక్కడి తెల్ల జాతీయుల పిల్లలకు ఆయాగా చేయడంలో కొంత సవాళ్లతో కూడుకున్న పని అని చెప్పుకొచ్చింది. కొంతమంది ధనవంతులు అప్పుడప్పుడు డబ్బు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారని, అలాంటి సమయంలో మాడిసన్ ఏజెన్సీ మద్దతు తీసుకుని బకాయిలను సకాలంలో పొందినట్లు తెలిపింది. మొత్తానికి తాను చేసే పనిలో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. -
ట్విట్టర్ కామెంట్ తో డబ్బు సంపాదించుకొనే అవకాశం
-
ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా?
ట్విటర్ సంస్థ ఎలాన్ మాస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత చాలా మార్పులు సంభవించాయి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, లోగోలో మార్పులు కూడా జరిగాయి. అయితే తాజాగా మస్క్ యూజర్లకు తమ కంటెంట్ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపాడు. ఏదైనా ఎక్కువ సమాచారం నుంచి ఎక్కువ నిడివి ఉన్న వీడియోల వరకు దేనికైనా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ తో డబ్బు సంపాదించవచ్చని తెలిపారు. దీని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి మానిటైజ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుందని కూడా వెల్లడించారు. ఈ ఆప్షన్ ఇండియాలో ప్రస్తుతానికి అందుబాటులో లేదు, అయితే అమెరికాలో అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ ఆప్షన్ మరిన్ని దేశాల్లో అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. Apply to offer your followers subscriptions of any material, from longform text to hours long video! Just tap on “Monetization” in settings. — Elon Musk (@elonmusk) April 13, 2023 తమ కంటెంట్ ద్వారా యూజర్లు సంపాదించిన డబ్బు నుంచి మొదటి సంవత్సరం ట్విటర్ ఏమీ తీసుకోదని మస్క్ తెలిపాడు. అంటే సబ్స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన డబ్బులో గరిష్ఠంగా 70 శాతం వరకు యూజర్లకే వస్తుంది. కానీ ట్విటర్ ద్వారా వచ్చిన డబ్బులో నుంచి ఐఓఎస్, ఆండ్రాయిడ్ 30 శాతం యాప్ స్టోర్ ఫీజు వసూలు చేస్తారు. అంతే కాకుండా తమ కంటెంట్ ప్రమోట్ చేసుకునే వెసులుబాటు కూడా సంస్థ కల్పిస్తుంది. నిజానికి ట్విటర్ ఎక్కువ మంది వినియోగించడానికి మస్క్ వేస్తున్న వ్యూహం అని తెలుస్తోంది. డబ్బు సంపాదించుకునే అవకాశం అని ప్రకటిస్తే తప్పకుండా ఎక్కువమంది దీనిని ఉపయోగించడం మొదలుపెడతారు. అయితే రానున్న రోజుల్లో దీనిపైన ఎలాంటి మార్పులు జరుగుతాయనేది తెలియాల్సి ఉంది. -
స్టాక్ మార్కెట్లో డబ్బులు బాగా సంపాదించాలంటే...ఈ టిప్స్ తెలిస్తే చాలు!
పెట్టుబడులకు కొన్ని విధానాలు అంటూ ఉంటాయి. ఆచరణీయ సూత్రాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో సంపదను సృష్టించుకున్న ప్రతీ ఇన్వెస్టర్ విజయం వెనుక కచ్చితంగా వీటి పాత్ర ఉంటుంది. అనుభవం మీద కానీ, వీటి గురించి ఇన్వెస్టర్లకు తెలియదు. ‘డబ్బులతో మార్కెట్లోకి అడుగుపెడితే అనుభవం మిగులుతుంది. అనుభవంతో మార్కెట్లోకి ప్రవేశిస్తే సంపద సృష్టి జరుగుతుంది’ అని చెబుతుంటారు. అందుకని మార్కెట్ పండితులు అనుసరించిన విధానాలను ముందే తెలుసుకుంటే, విలువైన సమయం ఆదా చేసుకోవడంతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్ని మూటగట్టుకోవచ్చు. అమెరికాకు చెందిన సర్ జాన్ టెంపుల్టన్ ప్రపంచంలోని దిగ్గజ ఇన్వెస్టర్లలో ఒకరు. 38 ఏళ్లపాటు ఏటా తన పెట్టుబడులపై 15 శాతం చొప్పున కాంపౌండింగ్ రాబడులను ఆయన సంపాదించగలిగారు. ఆయన అనుసరించిన సూత్రాలను, అనుభవ పాఠాలను ఈ ప్రాఫిట్ ప్లస్ కథనంలో తెలుసుకుందాం. తగినంత కసరత్తు పెట్టుబడులు పెట్టే ముందు తగినంత పరిశోధన అవసరం. విజయవంతమైన కంపెనీలకు సాయపడిన అంశాలు ఏంటన్నవి తెలుసుకోవాలి. కంపెనీల ఎర్నింగ్స్ (లాభాలు), ఆస్తులన్నవి స్టాక్ ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కంపెనీ ఎర్నింగ్స్ భవిష్యత్తులో మరింత పెరుగుతాయనే అంచనాలతో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్టాక్ ధరలు కూడా భవిష్యత్తు లాభాల అంచనాలకు తగ్గట్టే చలిస్తుంటాయి. కనుక, భవిష్యత్తులో ఇవి తారుమారు అయితే? స్టాక్స్ ధరలు కూడా పతనమవుతాయి. ఈ రిస్క్‌ను ముందే దృష్టిలో పెట్టుకుని అధ్యయనం తర్వాతే అడుగులు వేయాలి. కొని, మర్చిపోవద్దు.. బేర్ మార్కెట్ శాశ్వతం కాదు. అలా అని బుల్ మార్కెట్ శాశ్వతం కాదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో స్పందించాల్సి వస్తుంది. కొనుగోలు చేసి, మర్చిపోయే స్టాక్స్ అన్న వి చాలా అరుదు. ఏ కంపెనీ అయినా కానీ వెలుపలి పరిణామాలకు ప్రభావితం అవుతుంటుంది. అందుకుని పెట్టుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, అవసరమైతే మార్పులకు వెనుకాడొద్దు. భయపడిపోవద్దు.. అందరూ ఆశావాదంతో ఎగబడి కొంటున్న వేళ విక్రయించాలని చెప్పుకున్నాం. కానీ, ఆ సమయంలో అమ్ముకోకపోయి ఉండొచ్చు. ఆ తర్వాత మార్కెట్లు పడిపోవచ్చు. 2008, 2020లో మన స్టాక్ మార్కెట్ పతనాలు గుర్తున్నాయి కదా. ఒక్కో స్టాక్ ఒక రోజులో 20% వరకు నష్టపోయింది. ఆ సమయంలో భయపడిపోయి వచ్చినంత చాలనే ధోరణితో అమ్ముకో వడం సరికాదు. పతనానికి ముందే విక్రయించాలి. అది చేయలేకపోతే, ఒకసారి పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ను అధ్యయనం చేయాలి. ఏ అంశాల ఆధారంగా వాటిని కొనుగోలు చేశారో, వాటి ల్లో మార్పు రానంత వరకు మార్కెట్ పడిపోతుందని విక్రయించాల్సిన పనిలేదు. వేరే స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని, ఉన్నవి అమ్మేసుకుని వాటిని కొనుగోలు చేసుకోవడం కూడా సరికాదు. పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే ముందు ద్రవ్యోల్బణం, పన్నులను పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరికి వారు తమకు అనుకూలమైన పెట్టుబడుల విధానాన్ని అనుసరించాలి. పెట్టుబడుల తర్వాత ప్రశాంతత కోల్పోయేలా ఉండకూడదు. వాస్తవ రాబడులు అంటే ఇక్కడ.. వచ్చిన రాబడి నుంచి పన్నులు చెల్లించగా మిగిలే మొత్తం. అలాగే, ద్రవ్యోల్బణాన్ని సైతం రాబడి నుంచి మినహాయించి చూడాలి. పన్నులు, ద్రవ్యోల్బణం ప్రభావం పట్టించుకోని ఏ పెట్టుబడి అయినా వైకల్యంతో సమనమేనని టెంపుల్టన్ అంటారు. స్పెక్యులేషన్ వద్దు.. ఈక్విటీ మార్కెట్లో స్పెక్యులేషన్ (అంచనాల ఆధారంగా చేసే ట్రేడింగ్) అన్నది వేగంగా నష్టపోయే మార్గం. స్టాక్ మార్కెట్ క్యాసినో కాదు. తరచూ స్టాక్స్ కొని విక్రయిస్తుండడం, ఆప్షన్లను షార్ట్ సెల్ చేస్తుండడం, ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేయడం ఇదంతా క్యాసినోనే అని టెంపుల్టన్ అంటారు. ఇక్కడ అంతిమంగా ఇన్వెస్టర్ సంపాదించేదేమీ ఉండదన్నది ఆయన నమ్మే సిద్ధాంతం. మార్కెట్ పెరుగుతుందని, తగ్గుతుందని అంచనాల ఆధారంగా చేసే ట్రేడ్లు ఎప్పుడూ సక్సెస్ కావాలని లేదు. వీటిల్లో పెట్టుబడి నష్టానికి అదనంగా.. కమీషన్లు, చార్జీల రూపంలోనూ నష్టపోవాల్సి వస్తుంది. వాల్‌స్ట్రీట్ లెంజెడరీ ఇన్వెస్టర్ లూసీన్ హూపర్ నిర్వచనం ప్రకారం.. స్టాక్స్‌కు దీర్ఘకాల యజమానులుగా ఎంత ప్రశాతంగా ఉంటామన్నదే ముఖ్యం. ఇన్వెస్టర్ ఎంత ప్రశాంతంగా ఉంటే కనీస విలువల గురించి మరింతగా అర్థం చేసుకోగలడు. సహనంతో, భావోద్వేగాలకు లోను కాకుండా ఉండగలడు. తక్కువ మూలధన లాభాల పన్ను చెల్లిస్తాడు. అనవసర బ్రోకరేజీ కమీషన్లు చెల్లించే పని ఉండదు. జూదగాళ్ల మాదిరిగా ఆలోచించడు. మార్పునకు సిద్ధం.. ప్రతి పెట్టుబడుల విధానంలోనూ అనుకూల, ప్రతికూలతలు ఉంటాయి. తనకు అనుకూలమైన విధానాన్ని అనుసరిస్తూ, అవసరమైతే అందులో మార్పులు చేసుకునేందుకు సానుకూల దృక్పథంతో కొనసాగాలి. బ్లూచిప్ స్టాక్స్, సైక్లికల్ స్టాక్స్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్, కార్పొరేట్ బాండ్స్.. ఇలా ఒక్కో విభాగంలో పెట్టుబడులకు అనుకూల, ప్రతికూల సందర్భాలు ఉంటాయి. అంతేకాదు, అవసరమైతే నగదు రూపంలోనే కొనసాగాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఎందుకంటే నగదు ఉంచుకోవడం వల్ల మంచి అవకాశాలను సొంతం చేసుకోగలరు. అందుకే ఏదో ఒక్క పెట్టుబడి విధానం అన్నది అత్యుత్తమం అని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో కొన్ని విభాగాలకు ఎంతో ఆదరణ లభిస్తుంది. అది తాత్కాలికం కావచ్చు. అటువంటప్పుడు లాభాలు దీర్ఘకాలం పాటు కొనసాగలేవు. అందుకని మార్పునకు సదా సిద్ధంగా ఉండాలి. మార్కెట్ పెట్టుబడి సూత్రాలకూ ఇది వర్తిస్తుంది. కాలంతోపాటు ఈ విధానాల్లోనూ మార్పులు రావచ్చు. స్మార్ట్ ఇన్వెస్టర్ అయితే దీన్ని గుర్తిస్తాడు. కనిష్ట స్థాయి కనిష్ట స్థాయిల్లో కొనుగోలు చేసి, గరిష్ట స్థాయిల్లో విక్రయించడమన్నది వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ, ఆచరణ అంత ఈజీ కాదు. సాధారణంగా స్టాక్స్ ధరలు పెరుగుతున్నప్పుడే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆకర్షితులై, ఇంకా పెరుగుతుందన్న అంచనాతో కొనుగోలుకు ముందుకు వస్తుంటారు. షేరు ధర పడిపోతుంటే, ధైర్యం చేసి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు. ఎందుకంటే తాము ఇన్వెస్ట్ చేసిన తర్వాత, అది మరింత పడిపోతుందేమో, ఇక ఎప్పటికీ పెరగదేమో? అన్న భయం వారిని వెనక్కి లాగుతుంటుంది. నిజానికి అమ్మకాల ఒత్తిడి ఉందంటే నిరాశావాదం పెరిగినట్టు. కొనుగోళ్లకు అదే సరైన సమయం. అంతేకానీ, మార్కెట్లు ఇంకా పడిపోతాయని, ఆ తర్వాతే కొనుగోలు చేద్దామని అనుకోవద్దు. నిరాశావాదం ఎక్కువగా ఉన్నప్పుడే స్టాక్స్ ఎక్కవ నష్టాలు చూస్తాయి. దాన్నే తెలివైన ఇన్వెస్టర్ అనుకూలంగా మలుచుకోవాలి. కానీ, ఎక్కువ మంది దీనికి విరుద్ధంగా అధిక స్థాయిల్లో కొనుగోలు చేసి, తక్కువ ధరల వద్ద విక్రయిస్తుంటారు. మార్కెట్లలో ఆశావా దం పెరిగినప్పుడు విక్రయించి, నిరాశావాదం ఎక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేయాలని విఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సైతం చెబుతుంటారు. నాణ్యమైన స్టాక్స్ ఒక కంపెనీ వ్యాపారం ఎంత నాణ్యమైనది అనేది రాబడులకు కీలకం అవుతుంది. నాణ్యమైన వ్యాపారమే ఎక్కువ అమ్మకాలను నమోదు చేయగలదు. కస్టమర్ విశ్వాసాన్ని గెలుచుకుంటుంది. ఆయా రంగంలో టెక్నాలజీ పరంగా కంపెనీ బలమైన స్థానంలో ఉండాలి. బలమైన యాజమాన్యం, వ్యాపారాన్ని మెరుగ్గా నిర్వహించిన ట్రాక్ రికార్డ్ ఉండాలి. కంపెనీ వద్ద నిధుల సమస్య ఉండకూడదు. ఒక కంపెనీ తక్కవ ధరకే ఉత్పత్తి చేసినంత మాత్రాన నాణ్యమైనదిగా భావించడం సరికాదు. కానీ, టెక్నాలజీ పరంగా ఆధునికమైన, పటిష్టమైన కంపెనీ అయితే.. మరో కంపెనీ వచ్చి ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడం అంత తేలిక కాదు. మార్కెట్ కాదు.. కంపెనీ ముఖ్యం విడిగా కంపెనీలను, వాటి వ్యాపార బలాలను చూడాలే కానీ, మార్కెట్ గమనాన్ని కాదు. ఎలాంటి స్టాక్ అయినా బుల్ మార్కెట్లలో పరుగులు పెట్టగలదు. కానీ, బేర్ మార్కెట్లో పెరిగే స్టాక్స్ కూడా ఉంటాయి. బుల్ మార్కెట్లో పతనాన్ని చూసేవీ ఉంటాయి. మార్కెట్లు అనేవి ఎన్నో పరిణామాల ఆధారంగా చలిస్తుంటాయి. కానీ, ఇన్వెస్టర్ పెట్టుబడులకు నాణ్యమైన కంపెనీలు, బలమైన వ్యాపారా లు, పటష్టమైన యాజమాన్యాలనే సూత్రాలను అనుసరించాలి. మార్కెట్ గమనాన్ని కాదు. వైవిధ్యం.. పెట్టుబడులు అన్నింటిని తీసుకెళ్లి ఒకే చోట పెట్టేయరాదు. భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు. ఎవరూ నియంత్రించలేరు. అందుకని పెట్టుబడుల పరంగా వైవిధ్యం అవసరం. సరఫరా దారు వైపు సమ్మె ఏర్పడవచ్చు. తుఫాను లేదా భూకంపం.., పోటీ కంపెనీ అసాధారణ స్థాయిలో టెక్నాలజీ పరంగా పై చేయి సాధించొచ్చు. లేదంటే ఓ ఉత్పత్తిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ఆదేశించొచ్చు. ఇలాంటి పరిణామాలు కంపెనీలకు పెద్ద ఎత్తున నష్టాన్ని తీసుకొస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మెరుగ్గా నడుస్తున్న కంపెనీ సైతం సమస్యల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వివిధ రంగాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలి. ఆ తర్వాత అంతర్జాతీయం మార్కెట్లలోనూ గొప్ప పెట్టుబడుల అవకాశాలు కనిపిస్తాయి. వాటిని సైతం పరిశీలించొచ్చు. తప్పులే పాఠాలు పెట్టుబడుల పరంగా తప్పులు చేస్తున్నామని, అసలు ఇన్వెస్ట్ చేయకపోవడం అన్నది మరింత పెద్ద తప్పిదం అవుతుంది. తప్పులను చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేనే లేదు. నష్టపోయిన మొత్తాన్ని తిరిగి సంపాదించాలనే ధోరణితో మరింత రిస్క్ తీసుకోవద్దు. ప్రతి తప్పు నుంచి అనుభవాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ముందు చేసిన పెట్టుబడుల్లో నష్టాలకు దారితీసిన అంశాల గురించి తెలుసుకోవాలి. వాటిని తదుపరి పెట్టుబడుల్లో మళ్లీ చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు కారణాలకు బదులు, నష్టానికి వేరే వాటిని ఆపాదించుకుంటే, మళ్లీ అదే నష్టమే ఎదురవుతుంది. పెట్టుబడుల్లో విజేతలు, పరాజితుల మధ్య తేడా.. తప్పుల నుంచి పాఠాలను తెలుసుకోవడమే. మార్కెట్‌ను మించి రాబడులు.. మార్కెట్ కంటే మెరుగ్గా పెట్టుబడులపై రాబడులు రావాలంటే అందుకు మిగిలిన వారితో పోలిస్తే భిన్నంగా వ్యవహరించాల్సిందే. ఇందుకు మంచి మార్గదర్శకుడిని ఎంపిక చేసుకోవాలి. తగిన పెట్టుబడుల విధానాన్ని రూపొందించుకోవాలి. నిపుణులైన ఫండ్ మేనేజర్ల కంటే మెరుగైన పెట్టుబడుల నిర్ణయాలతోనే, గొప్ప ఫలితాలు సాధించడం సాధ్యపడుతుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అయినా మార్కెట్ కంటే అన్ని సమయాల్లోనూ మెరుగైన ఫలితాలను చూపిస్తుందంటే, అది ఇన్వెస్టర్ కంటే గొప్పగా పనిచేస్తున్నట్టే. కనుక అవసరమైతే అలాంటి సంస్థల సాయాన్ని తీసుకునేందుకు వెనుకాడొద్దు. గుడ్డి విధానం వద్దు మీకు మొదటిసారి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ షేరు, లేదంటే మీరు కొనుగోలు చేసిన మొదటి కారు కంపెనీపై అభిమానంతో షేరులో పెట్టుబడులు పెట్టడం సరైనది అనిపించుకోదు. మీరు ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసినంత మాత్రాన అది పెట్టుబడులకు మంచి కంపెనీ అవ్వాలని లేదు. ఆ షేరు అందుబాటు ధరలోనూ లేకపోవచ్చు. ఇక క్రేజీ ఉన్న ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయడం కూడా సరికాదు. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారని, లిస్టింగ్ రోజు లాభానికి విక్రయిద్దామని ఐపీవోలో దరఖాస్తు చేసుకోవడం అన్నది పెట్టుబడి కాదు, స్పెక్యులేషన్ అవుతుంది. కంపెనీకి మంచి భవిష్యత్తు ఉండి, దీర్ఘకాలం పాటు కంపెనీతో కొనసాగుతానని అనుకున్నప్పుడే ఐపీవోకు దరఖాస్తు చేసుకోవాలి. ఒకరి సలహాపై ఆధారపడి ఇన్వెస్ట్ చేయడం కూడా సరికాదు. ఎందుకంటే చెప్పిన వారి అనుభవం, పరిశీలన, అధ్యయనం మీకు సాయానికి రావు. సొంత అధ్యయనం తర్వాత, తమ పెట్టుబడుల సూత్రాలకు అనుకూలంగా ఉంటేనే ముందుకు వెళ్లాలి. ప్రతికూల ధోరణి విడిచి పెట్టాలి రిస్క్ భయంతో తరచూ ప్రతికూల ధోరణితో మార్కెట్‌ను చూడడం సరికాదు. పెట్టుబడికి ఎంపిక చేసుకునే ముందే ప్రతికూల కోణంలోనూ పరిశోధన చేయడం మంచి చర్య అవుతుంది. ఒక్కసారి అన్ని అంశాల్లో స్పష్టత వచ్చి, పెట్టుబడి పెట్టిన తర్వాత.. రంధ్రాన్వేషణ ఫలితమివ్వదు. అప్పుడు చిన్న అంశాలు సైతం పెద్దవిగా అనిపిస్తాయి. ప్రతీ పెట్టుబడి రాబడులనే ఇస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. వాస్తవికంగా, సానుకూల ధోరణితో వ్యవహరించడం ద్వారానే దీర్ఘకాలంలో ఈక్విటీల్లో సంపదను సృష్టించుకోగలరు. -
టీవీని అధిగమించనున్న డిజిటల్
ముంబై: టెలివిజన్‌ను అధిగమించి డిజిటల్ విభాగం 2022లో అతిపెద్ద మాధ్యమంగా అవతరించనుందని అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గ్రూప్ఎమ్ అంచనా వేసింది. 2022లో మొత్తం ప్రకటనల వ్యయం 22 శాతం వృద్ధితో రూ.1,07,987 కోట్లని లెక్కగట్టింది. ఈ మేరకు తన ‘ దిస్ ఇయర్, నెక్ట్స్ ఇయర్’ 2022 (టీవైఎన్‌వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్) అంచనాల నివేదికను ఆవిష్కరించింది. నివేదిక ప్రకారం యాడ్ వ్యయాల్లో వేగంగా పురోగమిస్తున్న 10 దేశాల్లో భారత్ ఒకటి. ఈ విషయంలో దేశం తొమ్మిదవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంటుంది. ప్రకటనల వ్యయ పరిమాణాల పెరుగుదలకు సంబంధించి ఐదవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మొత్తం మాధ్యమంలో డిజిటల్ షేర్ 2022లో 45 శాతానికి చేరుతుంది. ఈ విభాగంలో 33 శాతం పురోగతి ఉంటుంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే ప్రకటన ల వ్యయం 11% పెరిగి 850 బిలియన్ డాలర్లకు చేరుతుంది. డిజిటల్ వాటా ఇందులో 66%. భారత వినియోగదారు, పరిశ్రమ అభిరుచులను రూపుదిద్దే కొన్ని కీలక ధోరణులను కూడా గ్రూప్ఎమ్ తన నివేదికలో ప్రస్తావించింది. సంస్థాగత పరిస్థితులు, వినియోగదారు అభిరుచులు–స్థిరత్వం, డిజిటల్ అనుభవం, డేటా, వాణిజ్యం, పర్యావరణ వ్యవస్థ, క్రీడా వ్యాపార వృద్ధి, సాంకేతికత వినియోగం, మార్కెటింగ్ పనితీరు, టీవీ ప్రకటనల సాంకేతికత, ఆఫ్‌లైన్ మీడియా పరిణామం వంటి అంశాల్లో మార్పులు వినియోగదారు, పరిశ్రమలో కొత్త ట్రెండ్స్‌ను సెట్ చేస్తాయని నివేదిక విశ్లేషించింది. -
యూట్యూబ్ బంపర్ ఆఫర్..! వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు..!
యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేసే యూజర్లకు వ్యూస్ ఆధారంగా యూట్యూబ్ డబ్బులను అందజేస్తుంది. తాజాగా కంటెంట్ క్రియేట్ చేసే యూజర్లకు మరో బంపర్ ఆఫర్‌ను యూట్యూబ్ ప్రకటించింది. టిక్‌టాక్ యాప్‌కు పోటీగా యూట్యూబ్ షార్ట్స్ వీడియోలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా షార్ట్ వీడియోలను తీసే వారికి కొత్తగా ప్రోత్సాహకాలను యూట్యూబ్ తన యూజర్లకు అందించనుంది. ప్రోత్సాహకాలను అందించడం కోసం యూట్యూబ్ సుమారు 100 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 2021 నుంచి 2022 మధ్య వైరలైన షార్ట్ వీడియోల కోసం యూజర్లకు రివార్డ్ అందించడంలో ఈ ఫండ్ ఉపయోగపడనుంది. యూట్యూబ్ సుమారు 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యూజర్లకు రివార్డ్ ఇవ్వనుంది. కాగా ఈ రివార్డులను సొంతం చేసుకోవాలంటే ఒక చిన్న మెలిక పెట్టింది. షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకొని రివార్డులను అందించనుంది. షార్ట్ వీడియో క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని యూట్యూబ్ సపరేటుగా అడుగుతోంది. ప్రతి నెల షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ప్రకారం ఆయా కంటెంట్ క్రియేటర్లు చేసిన షార్ట్ వీడియోలు వ్యూస్ విషయంలో కచ్చితంగా క్వాలిఫై అవాల్సి ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్‌ను భారత్‌తోపాటుగా యుఎస్, యుకె, బ్రెజిల్, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, నైజీరియా, రష్యా , దక్షిణాఫ్రికా దేశాల్లోని కంటెంట్ క్రియేటర్లు ఈ ఫండ్ ద్వారా డబ్బు సంపాదించడానికి అర్హులు. త్వరలో ఈ పోటీని మరిన్ని దేశాలకు విస్తరించాలని యూట్యూబ్ యోచిస్తోంది. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ పొందాలంటే అర్హతలు..! యూజర్లు తమ యూట్యూబ్ ఛానెల్ నుంచి అర్హత సాధించిన షార్ట్ వీడియోను గత 180 రోజుల్లో అప్లోడ్ చేసి ఉండాలి. షార్ట్స్ వీడియో కచ్చితంగా ఒరిజినల్ కంటెంటై ఉండాలి. ఇతర వాటర్‌మార్క్‌లు లేదా లోగోలతో వీడియోలను అప్లోడ్ చేసేవారు అర్హులు కాదు. ఇతర యూట్యూబ్ ఛానళ్ల వీడియోలను అప్లోడ్ చేయకూడదు. ఈ వీడియోలు యూట్యూబ్ షార్ట్స్ ఫండ్‌కు అర్హత సాధించవు. యూజర్లు 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారై ఉండాలి. -
ఐఆర్సీటీసీలో నెలకు రూ.30 - 80 వేలు సంపాదించండిలా !
మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ఆన్లైన్ లో నెలకు రూ.80 వేలు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుంది ఇండియన్ రైల్వే. ఇండియన్ రైల్వేకి చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరోషన్ (irctc) లో ట్రైన్ టికెట్లు బుక్ చేసి మనీ ఎర్న్ చేయవచ్చు. ప్రతి టికెట్ బుకింగ్ పై కమిషన్ రూపంలో ఐఆర్సీటీసీ మనకు అందిస్తుంది. ఇండియన్ రైల్వే డేటా ప్రకారం 55శాతం రైల్వే ప్రయాణికులు టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నిరుద్యోగ యువత, అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ అవకాశం కల్పించింది. ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేస్తే వచ్చే ఆదాయం ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా నాన్ ఏసీ ట్రైన్ టికెట్ బుక్ చేసిన ప్రతి సారి రూ.20 కమిషన్ వస్తుంది ఏసీ టికెట్లు బుక్ చేస్తే టికెట్ పై రూ.40 కమిషన్ వస్తుంది అంతేకాదు మనీ రూ.2వేలు ట్రాన్స్‌శాక్షన్ పై 1శాతం కమీషన్ తో పాటు రూ.2వేలు ట్రాన్సాక్షన్ దాటితే గేట్‌వే ఛార్జీలను అదనంగా పొందవచ్చు. నెలలో అపరిమితంగా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒక్కో టికెట్ పై పక్కా కమిషన్‌ను పొందవచ్చు. దీన్ని బట్టి నెలకు రూ.80వేలు డబ్బులు సంపాదించుకోవచ్చు. అంతకాకపోయినా నెలకు రూ.40 నుంచి రూ.50వేల వరకు రాబడి ఉంటుంది. ఆర్థరైజ్ ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా పనిచేయాలంటే ఏంజెంట్‌గా పనిచేయాలనుకుంటే ఐఆర్సీటీసీకి ఏడాది రూ.3,999 అగ్రిమెంట్ చేయించుకోవాలి రెండు సంవత్సరాలకు రూ.6,999 చెల్లించాలి. 100 టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్‌పై రూ.10 చెల్లించాలి 101 నుంచి 300టికెట్లు బుక్ చేస్తే 8రూపాయిలు చెల్లించాలి 300 టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ పై రూ.5 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది ఆర్థరైజ్ ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా గుర్తింపు రావాలంటే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సంబంధిత శాఖ అధికారుల రిక్వైర్ మెంట్‌ను బట్టి అడ్రస్ ప్రూప్‌లను సబ్మిట్ చేయాల్సి ఉంది. సబ్మిట్ చేసిన వెంటనే మన ఐడీ వెరిఫికేషన్ జరిగి ఓటీపీ వస్తుంది. అనంతరం మీరు ఐఆర్సీటీసీ ఐడీతో ఎంటర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ కింద రూ1100 చెల్లించాలి చెల్లించిన తరువాత మీకు ఆర్ధరైజ్ ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా అనుమతి లభిస్తోంది. -
కొత్త అప్డేట్, ఇక యూట్యూబ్‌లో డబ్బులే డబ్బులు
క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆడియన్స్ నుంచి యూట్యూబ్ క్రియేటర్ల మనీ ఎర్నింగ్ చేసేందుకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ తో యూట్యూబ్ క్రియేటర్లు వ్యూవర్స్ నుంచి నాలుగు రకాలుగా డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించినట్లైంది. షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ సంస్థలు క్రియేటర్లు మంచి కంటెంట్‌ను అందించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే వాటికి పోటీగా యూట్యూబ్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. కాంపిటీటర్ల నుంచి పోటీని ఎదుర్కొనేలా యూట్యూబ్ క్రియేటర్లు డబ్బులు సంపాదించేందుకు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసింది. 'సూపర్ థ్యాంక్స్' అనే ఫీచర్ ద్వారా వ్యూవర్స్ క్రియేటర్లను సపోర్ట్ చేస్తూ సుమారు రూ.150 నుండి రూ.3,730 వరకు చెల్లించవచ్చు. తద్వారా తమ అభిమాన యూట్యూబ్ ఛానల్ లో మద్దతు ఇవ్వడానికి ఒక మార్గంగా ఉంటుందని యూట్యూబ్ ప్రకటించింది. సూపర్ థ్యాంక్స్ ఫీచర్ నుంచి మనీ డొనేట్ చేస్తే వారి పేర్లు కామెంట్ సెక్షన్లో హైలెట్‌గా నిలుస్తాయి. ఈ ఆప్షన్ ప్రపంచ వ్యాప్తంగా 68 దేశాలలో ఉన్న యూట్యూబ్ క్రియేటర్లకు అందుబాటులో ఉంటుందని యూట్యూబ్ ప్రతినిథులు అధికారికంగా వెల్లడించారు. కాగా,ఇప్పటికే యాడ్స్, ఛానల్ సబ్‌స్కిప్షన్,లైవ్ స్ట్రీమ్‌లో సూపర్ చాట్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండగా..మనీ ఎర్నింగ్ కోసం మరో ఫీచర్ అందుబాటులోకి తేవడంపై ఆన్ లైన్ లో మనీ ఎర్నింగ్ చేయాలనుకునే ఔత్సాహికులు, యూట్యూబ్ క్రియేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఆరేళ్ళలో అక్షయ్ సంపాదన ఎంతో తెలుసా?
ముంబై: సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్లు అంటూ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటారు. అందుకే అయన సంపాదన కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఒక్క ఏడాదిలో ఆరు సినిమాలు చేసినట్లు గతంలో పలు ఇంటర్వ్యూల్లో అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్‌లలో అక్షయ్ పేరు కూడా ఉంటుంది. ఇంత బిజీగా ఉండే అక్షయ్ కుమార్ గత ఆరు ఆరేళ్ళలో ఎన్నో కోట్లు సంపాదించారో మీకు తెలుసా?. ఫోర్బ్స్ యొక్క తాజా నివేదిక ప్రకారం.. గత 6 సంవత్సరాలలో అక్షయ్ సంపాదన దాదాపు 1,744 కోట్లు అని తేలింది. (చదవండి: ఒక్క సినిమాకు రూ.135 కోట్లు తీసుకోనున్న హీరో?!) 2020 సంవత్సరంలో కూడా అక్షయ్ కుమార్ 48.5 మిలియన్ డాలర్లు(రూ.356.57 కోట్లు) తెలుస్తుంది. 2019 అయితే అక్షయ్ కుమార్ కి ఒక స్వర్ణ సంవత్సరం అని చెప్పాలి. 2019లో కేసరి, బ్లాంక్, మిషన్ మంగల్, హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూజ్‌తో సహా అతను ఇతర బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా 65 మిలియన్ డాలర్లు(రూ.459.22 కోట్లు) సంపాదించాడు. అలాగే 2018లో రూ.277.06 కోట్లు, 2017లో రూ.231.06 కోట్లు, 2016లో రూ.211.58 కోట్లు, 2015లో రూ.208.42 కోట్లు సంపాదించినట్టు పోర్బ్స్ తన కథనంలో పేర్కొంది. గత ఏడాదిలో అక్షయ్ కుమార్ కేవలం ఒకే ఒక్క సినిమా 'లక్ష్మీ'తో అలరించాడు. ఈ ఏడాది 2021లో ఏకంగా మరో ఏడు సినిమాలతో బాలీవుడ్ పరిశ్రమలో మరోసారి తన సత్తా ఏంటో చూపించనున్నాడు. -
అక్షయ్ సంపాదన 356 కోట్లు
సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్లు అంటూ అక్షయ్ కుమార్ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటారు. ఆయన సంపాదన కూడా అదే రేంజ్లో ఉంటుంది. బాలీవుడ్ స్టార్స్‌లో ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్‌లో అక్షయ్ పేరు ఎప్పుడూ ఉంటుంది. ఏ స్టార్ సంపాదన ఎంత? టాప్ టెన్ ఎవరు? అంటూ ఫోర్బ్స్ మేగజీన్ ప్రతీ ఏడాది సర్వే నిర్వహిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆర్జిస్తున్న 100 సెలబ్రిటీలు అంటూ ఓ జాబితా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో అక్షయ్ కుమార్ ఉన్నారు. ఈ జాబితాలో ఆయనది 52వ స్థానం. 2020కిగాను అక్షయ్ సంపాదన సుమారు 48.5 మిలియన్ డాలర్లు. అంటే 356 కోట్లు. ఈ జాబితాలో అమెరికా మేకప్ దిగ్గజం, రియాలిటీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆమె సంపాదన 590 మిలియన్ డాలర్లు. -
ఐపీఎల్‌తో ఎంత ఆదాయమో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : పదేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇప్పుడు బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే కల్పవృక్షంగా మారింది. తాజా గణాంకాల ప్రకారం 2018-19 మధ్యకాలంలో సుమారు రూ. 2,017 కోట్ల మిగులు ఆదాయాన్ని బీసీసీఐ ఆర్జించనుంది. ఇక బోర్డుకు సంబంధించిన ఇతర కార్యకలాపాలు, అంతర్జాతీయ, దేశీయ మ్యాచుల ద్వారా కేవలం రూ.125 కోట్ల ఆదాయం సమకూరనుంది. మొత్తంగా వచ్చే ఆదాయం రూ.3,413 కోట్లు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ బోర్డు ఆదాయంలో ఐపీఎల్ వాటా సుమారు 95 శాతానికి పైమాటే. గతేడాది ఇది 60 శాతం మాత్రమే ఉంది. ఈ లెక్కన్న ఏడాదిలో బీసీసీఐకి వచ్చే ఆదాయం కన్నా.. 45 రోజుల పాటు కొనసాగే ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం 16 రెట్లు అధికంగా ఉందన్న మాట. ప్రసార హక్కుల కోసం స్టార్ ఇండియాతో సుమారు 16, 347 కోట్ల రూపాయలతో చేసుకున్న ఒప్పందం మూలంగానే ఇది అమాంతం పెరగటానికి కారణమని చెప్పుకొవచ్చు. ఇక మొత్తం ఆదాయంలో.. క్రీడా సదుపాయాలు, ఇతరత్రా వాటికి బీసీసీఐ రూ.1,272 కోట్లను ఖర్చు చేయనుంది. -
ఫేస్బుక్ పోస్టులతో డబ్బు సంపాదించండి!
వాషింగ్టన్: గ్రూప్ కాలింగ్ సర్వీస్ తో పాటుగా ఫేస్బుక్ సంస్థ మరిన్ని ఆఫర్లను యూజర్లకు అందించాలని భావిస్తుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇటీవలే గ్రూప్ కాలింగ్ సర్వీస్ ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. దీంతో ఒక్క యూజర్ ఒకేసారి ఇంటర్నెట్ ద్వారా 50 మందితో కనెక్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ గ్రూప్ కాలింగ్ సర్వీస్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండే మొబైల్స్ లో అందుబాటులోకి రానుంది. తాజాగా చేసిన ఓ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు యూజర్లు ఫేస్ బుక్ లో ఎన్నో ఫొటోలు, ఇతర డాటాను పోస్ట్ చేసుంటారు. అయితే భవిష్యత్తులో మాత్రం పోస్టింగ్స్ ద్వారా కొంత మొత్తం నగదును యూజర్స్ అందుకోనున్నారు. యూజర్స్ పోస్ట్ చేసే డాటాకు గాను వారికి మనీ ఇవ్వాలన్న యోచనలో సంస్థ ఉందని సర్వే ద్వారా తెలిసింది. కానీ కొన్ని రోజుల తర్వాత 'టిప్ జార్' అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని, దాంతో సంస్థకు వచ్చే రెవెన్యూలో కొంత మొత్తంలో నగదును ఈ డాటా పోస్టింగ్స్ చేసిన యూజర్లకు అందించనుంది. 2007లో యూట్యూబ్ వారు వీడియో షేరింగ్ లో ఈ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఓ కేటగిరీ యూజర్లకు మాత్రమే ఈ సర్వీస్ అందిస్తుంది. ప్రస్తుతం ఫేస్బుక్ కూడా కొన్ని కేటగిరీలకు చెందిన యూజర్లకు మాత్రమే మనీ ఎర్నింగ్ ఫెసిలిటీ కల్పిస్తుందా.. లేదా యూజర్స్ అందరికీ అందుబాటులోకి తెస్తుందా అనే విషయంపై ఇప్పటివరకైతే స్పష్టతరాలేదు.