బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఓ రకమైన సంపాదన చేయవచ్చు. అయితే స్విట్జర్లాండ్‌కు చెందిన 'గ్లోరియా రిచర్డ్స్' (Gloria Richards) మాత్రం దీనికి భిన్నమైన ఉద్యోగం చేస్తోంది. కానీ సంపాదనలో మాత్రం ఎవరికీ తీసిపోదు. ఈమె చేసే పని ద్వారా రోజుకి ఏకంగా రూ. 1.6 లక్షలు సంపాదిస్తోంది. ఇంతకీ ఈమె చేసే ఉద్యోగం ఏమిటి? ఇంత డబ్బు ఎలా సంపాదిస్తోందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన 'గ్లోరియా రిచర్డ్స్' మూడు పదుల వయసు దాటినా ఎంతో ఉత్సాహంగా పని చేస్తోంది. ఈమెకు ఇంత సంపాదన వస్తుంది, బిజినెస్ ఏమైనా చేస్తుందా అనుకుంటే పొరపాటే. గ్లోరియా ధనవంతుల పిల్లలకు ఆయాగా పనిచేస్తుంది. దీని ద్వారానే రోజుకి 2000 డాలర్లు సంపాదిస్తోంది. అంటే ఇది మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.6 లక్షలు. రోజుకి 12 నుంచి 15 గంటలు మాత్రమే పనిచేస్తుంది.
(ఇదీ చదవండి: ఐఏఎస్ వదిలి ఇండియాలో అతిపెద్ద తయారీదారుగా.. ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!)
గ్లోరియా రిచర్డ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉండే ధనవంతుల పిల్లలకు ఆయాగా పనిచేస్తుంది. అయితే ఈ పని సంవత్సరం మొత్తం చేయదని, పిల్లల చదువుల కోసం, సామజిక క్యాలెండర్ల సమన్వయంతోనే ఎక్కువ సమయం గడుపుతుంది వెల్లడించింది. అంతే కాకుండా మహిళలకు సహాయకురాలిగా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈమె ఎప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఆమె ప్రైవేట్ జెట్‌లలో కూడా తిరుగుతుంది.
(ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - హైస్కూల్ డ్రాపౌట్ యువకుని సక్సెస్ స్టోరీ)
నిజానికి గ్లోరియా రిచర్డ్స్ భారతీయ సంతతికి చెందిన మహిళ, కావున అక్కడి తెల్ల జాతీయుల పిల్లలకు ఆయాగా చేయడంలో కొంత సవాళ్లతో కూడుకున్న పని అని చెప్పుకొచ్చింది. కొంతమంది ధనవంతులు అప్పుడప్పుడు డబ్బు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారని, అలాంటి సమయంలో మాడిసన్ ఏజెన్సీ మద్దతు తీసుకుని బకాయిలను సకాలంలో పొందినట్లు తెలిపింది. మొత్తానికి తాను చేసే పనిలో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment