2023 ప్రారంభం నుంచి ఐటీ సంస్థల ఆదాయం తగ్గడంతో.. ఖర్చులను తగ్గించుకోవడానికి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి, ఇప్పటికీ తొలగిస్తూనే ఉన్నాయి. ఒక వైపు ఆర్ధిక మందగమనం.. మరోవైపు ఊడిపోతున్న ఉద్యోగాల మధ్య టెక్ ఉద్యోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు .
ఐటీ కంపెనీలు ఇప్పటికి లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో కేవలం ఫ్రెషర్స్ మాత్రమే కాకుండా కొన్ని ఏళ్లుగా సంస్థలకు సేవలందిస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. సెప్టెంబర్‌లో గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్ నుంచి వందలాది మంది ఉద్యోగుల్ని గూగుల్ తొలగించింది. ఇందులో ఏకంగా 18 సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన 'రీటా' కూడా ఉండటం గమనార్హం.
గూగుల్‌లో మేనేజర్‌గా పనిచేసిన రీటా 18 ఏళ్లుగా గూగుల్ సంస్థకు సేవలందించినట్లు, ఇటీవలే ఉద్యోగం పోయినట్లు లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసింది. అంతే కాకుండా హెచ్ఆర్, టాలెంట్ అక్విజిషన్, కెరీర్ డెవలప్మెంట్ రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్..
ప్రముఖ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించడం, వారు సోషల్ మీడియాలో భావోద్వేగాలను పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో గూగుల్ మాత్రమే కాకుండా అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ ఐటీ దిగ్గజాలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment