Nanny
-
పిల్లలపై వేధింపులు.. నిందితునికి 707 ఏళ్లు జైలు శిక్ష..!
కాలిఫోర్నియా: అమెరికాలో పిల్లలపై వేధింపులకు పాల్పడిన ఓ రాక్షసునికి న్యాయస్థానం 707 ఏళ్ల జైలు శిక్ష విధించింది! 16 మంది పిల్లలపై లైంగిక వేధింపులకు గురిచేయడంతోపాటు అశ్లీల చిత్రాలు చూపించిన కేసుల్లో ధర్మాసనం దోషిగా తేల్చింది. మొత్తం 34 కేసుల్లో నిందితునికి ధర్మాసనం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. మాథ్యూ జక్ర్జెవ్స్కీ(34) బేబీకేరింగ్ తరహా సేవలు అందించేవాడు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న 16 మంది మగ పిల్లలను లైంగికంగా వేధించాడు. చిన్నారులకు అశ్లీల చిత్రాలు కూడా చూపించేవాడని న్యాయస్థానం గుర్తించింది. ఈ నేరాల్ని నిందితుడు 2014 నుంచి 2019 మధ్య పాల్పడ్డాడు. 2 నుంచి 12 ఏళ్ల పిల్లలపై మాథ్యూ వేధింపులు జరిపాడు. ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న మ్యాథ్యూ విదేశాలకు వెళ్తుండగా.. 2019 మే 17న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల్లో తాజాగా తుది తీర్పును న్యాయస్థానం వెలువరించింది. దోషిపై ఎలాంటి దయ చూపించవద్దని, ఉరిశిక్ష విధించాలని ధర్మాసనాన్ని ఇద్దరు పిల్లలకు చెందిన బామ్మ కోరింది. తమ పిల్లలను చూసుకోవడానికి ఇలాంటి రాక్షసున్ని నియమించుకున్నందుకు బాధపడుతున్నామని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాథ్యూ తన రహస్యాలను బయటకు చెప్పకుండా పిల్లలను హెచ్చరించేవాడని ఓ బాలుడి తల్లి దుయ్యబట్టింది. న్యాయస్థానం తీర్పు వెలువరించిన తర్వాత మ్యాథ్యూ నేరాలకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. నవ్వుకుంటూ ముందుకు కదిలాడు. తాను పిల్లలకు ఆనందాన్నే పంచానని న్యాయమూర్తికి తెలిపాడు. పిల్లల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాడు. తాను ఎలాంటి అపరాధం చేయలేదని, తన చర్యలను సమర్థించుకున్నాడు. ఇదీ చదవండి: Sexiest Bald Man of 2023: ఈ యేడు బట్టతల అందగాడు ఇతడే.. -
బిలియనీర్ వివేక్ రామస్వామి ఇంట్లో ‘నానీ’ జాబ్: జీతం తెలిస్తే షాకవుతారు
Vivek Ramaswamy wants to hire nanny అమెరికా అధ్యక్ష పదవి రేసులో దూసుకుపోతున్న భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ వివేక్ రామస్వామి తన పిల్లలను చూసుకునేందుకు నానీ కోసం వెతుకు తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీగా జీతాన్ని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రిక్రూట్మెంట్ స్టాఫింగ్ వెబ్‌సైట్‌లోని జాబ్ లిస్టింగ్ ప్రకారం రామస్వామి తన పిల్లల్ని చూసుకునే నానీ (ఆయా)కోసం లక్ష డాలర్లు (రూ.80 లక్షల కంటే ఎక్కువ) లేదా అంతకంటే ఎక్కువ జీతాన్ని ఆందించనున్నారు. వివేక్ రామస్వామి అపూర్వ తివారీకి దంపతులకు కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు మగ పిల్లలున్నారు. వృత్తిరీత్యా అపూర్వ స్వరపేటిక నిపుణురాలు. (మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం) EstateJobs డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉద్యోగ ప్రకటన ప్రకారం ఇది ఒక హై ప్రొఫైల్ ఫ్యామిలీలో చేరడానికి ఒక అసాధారణమైన అవకాశం, ప్రత్యేకమైన కుటుంబ సాహసాలలో పాల్గొంటూ వారి పిల్లల పెరుగుదల, అభివృద్ధికి దోహదపడాలి అని ఎస్టేట్ జాబ్స్ ఉద్యోగ ప్రకటన పేర్కొంది. ఈ యాడ్‌లో క్లయింట్ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ, ఇది రామస్వామి కుటుంబానికి సంబంధించిందనే అంచనాలు భారీగా ఉన్నాయి. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?) ఈ ఉద్యోగానికి వారానికి 84 నుండి 96 గంటల పని అవసరం, ఆ తర్వాత వారం మొత్తం సెలవు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన నానీ ఇతర చెఫ్, నానీలు, హౌస్ కీపర్, ప్రైవేట్ సెక్యూరిటీతో సహా ఇతర కీలకమైన టీంతో కలిసి పనిచేయాలి. అలాగే అబ్బాయిల ఆటలు, బొమ్మలు, దుస్తులను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. (ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు) కాగా 2024 ఎన్నికల్లో జో బిడెన్‌తో తలపడేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ అభ్యర్థి రామస్వామి ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. (హ్యుందాయ్ కీలక నిర్ణయం: తొలి బ్రాండ్‌గా రికార్డ్) -
నెలకు 50 లక్షలు సంపాదిస్తున్న ఆయా..!
-
రోజుకి రూ. 1.6 లక్షల సంపాదిస్తున్న 34 ఏళ్ల యువతి.. ఈమె చేసే పనేంటో తెలుసా?
బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఓ రకమైన సంపాదన చేయవచ్చు. అయితే స్విట్జర్లాండ్‌కు చెందిన 'గ్లోరియా రిచర్డ్స్' (Gloria Richards) మాత్రం దీనికి భిన్నమైన ఉద్యోగం చేస్తోంది. కానీ సంపాదనలో మాత్రం ఎవరికీ తీసిపోదు. ఈమె చేసే పని ద్వారా రోజుకి ఏకంగా రూ. 1.6 లక్షలు సంపాదిస్తోంది. ఇంతకీ ఈమె చేసే ఉద్యోగం ఏమిటి? ఇంత డబ్బు ఎలా సంపాదిస్తోందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాకు చెందిన 'గ్లోరియా రిచర్డ్స్' మూడు పదుల వయసు దాటినా ఎంతో ఉత్సాహంగా పని చేస్తోంది. ఈమెకు ఇంత సంపాదన వస్తుంది, బిజినెస్ ఏమైనా చేస్తుందా అనుకుంటే పొరపాటే. గ్లోరియా ధనవంతుల పిల్లలకు ఆయాగా పనిచేస్తుంది. దీని ద్వారానే రోజుకి 2000 డాలర్లు సంపాదిస్తోంది. అంటే ఇది మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.6 లక్షలు. రోజుకి 12 నుంచి 15 గంటలు మాత్రమే పనిచేస్తుంది. (ఇదీ చదవండి: ఐఏఎస్ వదిలి ఇండియాలో అతిపెద్ద తయారీదారుగా.. ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!) గ్లోరియా రిచర్డ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉండే ధనవంతుల పిల్లలకు ఆయాగా పనిచేస్తుంది. అయితే ఈ పని సంవత్సరం మొత్తం చేయదని, పిల్లల చదువుల కోసం, సామజిక క్యాలెండర్ల సమన్వయంతోనే ఎక్కువ సమయం గడుపుతుంది వెల్లడించింది. అంతే కాకుండా మహిళలకు సహాయకురాలిగా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈమె ఎప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఆమె ప్రైవేట్ జెట్లలో కూడా తిరుగుతుంది. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - హైస్కూల్ డ్రాపౌట్ యువకుని సక్సెస్ స్టోరీ) నిజానికి గ్లోరియా రిచర్డ్స్ భారతీయ సంతతికి చెందిన మహిళ, కావున అక్కడి తెల్ల జాతీయుల పిల్లలకు ఆయాగా చేయడంలో కొంత సవాళ్లతో కూడుకున్న పని అని చెప్పుకొచ్చింది. కొంతమంది ధనవంతులు అప్పుడప్పుడు డబ్బు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారని, అలాంటి సమయంలో మాడిసన్ ఏజెన్సీ మద్దతు తీసుకుని బకాయిలను సకాలంలో పొందినట్లు తెలిపింది. మొత్తానికి తాను చేసే పనిలో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. -
Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే..
కేవలం 14 రోజులు వర్క్ చేస్తే 9 లక్షల రూపాయలా..! ఫేక్ నోటిఫికేషన్ అని కొట్టిపారేస్తారేమో.. నిజమండీ! ఈ విధమైన ఉద్యోగాలు కూడా ఉన్నాయీ జిందగీలో. ఉద్యోగవివరాలు ఇవే.. యూకే లోని ఎడిన్బర్గ్లో ఈ రకమైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి తాజాగా విడుదలైంది. డిసెంబర్ 22 నుంచి జనవరి 5 వరకు మొత్తం 14 రోజుల ఉద్యోగావకాశం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఏమిటంత ముఖ్యమైన జాబ్ అనే కదా అనుకుంటున్నారు..! చదవండి: ఈ రెండు చిత్రాల్లో మార్పులు కనిపెట్టారా? మళ్లీ ఓ పాలి.. లుక్కెయ్యండి.. సామీ.. ఓ సంపన్న కుటుంబం క్రిస్టమస్ సెలవుల్లో పిల్లల్ని చూసుకోవడానికిగాను ఈ ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతోంది. ఐదేళ్ల కవల పిల్లల సంరక్షణకుగాను రోజుకు అక్షరాల 59 వేల రూపాయల జీతం చొప్పున.. మొత్తం 14 రోజులకు 9 లక్షల రూపాయల జీతం ప్రకటించింది సదరు కుటుంబం. క్రిస్టమస్ టైంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఫుడ్, బెడ్ అన్నీ అక్కడే. ఈ ఉద్యోగాంలో చేరిన ఆయా.. పిల్లలకు స్నానం చేయించడం, ఆహారం పెట్టడం, వారితో ఆటలాడటం, నిద్ర పుచ్చడం.. వంటి పనులు చేయాలి. అంతేకాదు దరఖాస్తు దారులకు ఖచ్చితంగా పిల్లల సంరక్షణలో ఐదేళ్ల అనుభవం కూడా ఉండాలి. వింతగా అనిపించినా.. పిల్లల సంరక్షణకు ఆ తల్లీదండ్రులు ఎంత కేర్ తీసుకుంటున్నారో కదా! చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? -
ఆ హీరోకి అక్కగా..!
ఇండియన్ క్రికెటర్ ఎం.ఎస్. ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’ చిత్రంలో ధోని అక్క పాత్రలో నటించారు అందాల భామ భూమిక. తాజాగా మరోసారి సిస్టర్ రోల్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ఇంతకీ ఎవరికి అక్కగా నటించనున్నారంటే.. హీరో నానీకి. వెంట వెంటనే అక్క పాత్రలు అంటే ఎవరైనా ఒప్పుకోరేమో? కానీ, నాని చిత్రంలో అక్క పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో ఆమె ఒప్పుకున్నారని టాక్. వేణు శ్రీరాం దర్శకత్వంలో ‘దిల్’ రాజు సంస్థలో నాని ఓ సినిమా చేయనున్నారు. ఈ మూవీలోనే భూమిక అక్క పాత్రలో కనిపించనున్నారట. మంచి నిర్మాణ సంస్థ, పైగా దర్శకుడు కథ చెప్పిన విధానం భూమికకు నచ్చడంతోనే వెంటనే ఓకే చెప్పారని సమాచారం.