బిలియనీర్ వివేక్‌ రామస్వామి ఇంట్లో ‘నానీ’ జాబ్‌: జీతం తెలిస్తే షాకవుతారు  | US presidential candidate Vivek Ramaswamy wants nanny for his sons offers 80 lakh Report | Sakshi
Sakshi News home page

బిలియనీర్ వివేక్‌ రామస్వామి ఇంట్లో ‘నానీ’ జాబ్‌: జీతం తెలిస్తే షాకవుతారు 

Published Tue, Oct 3 2023 8:14 PM | Last Updated on Tue, Oct 3 2023 9:24 PM

US presidential candidate Vivek Ramaswamy wants nanny for his sons offers 80 lakh Report - Sakshi

Vivek Ramaswamy wants to hire nanny అమెరికా అధ్యక్ష పదవి రేసులో దూసుకుపోతున్న భారతీయ సంతతికి చెందిన  వ్యాపారవేత్త, బిలియనీర్ వివేక్ రామస్వామి తన పిల్లలను చూసుకునేందుకు నానీ కోసం వెతుకు తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీగా   జీతాన్ని ఆఫర్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. రిక్రూట్‌మెంట్ స్టాఫింగ్ వెబ్‌సైట్‌లోని జాబ్ లిస్టింగ్ ప్రకారం రామస్వామి తన పిల్లల్ని చూసుకునే నానీ (ఆయా)కోసం లక్ష డాలర్లు (రూ.80 లక్షల కంటే ఎక్కువ)  లేదా అంతకంటే ఎక్కువ జీతాన్ని ఆందించనున్నారు. వివేక్‌ రామస్వామి అపూర్వ తివారీకి దంపతులకు కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు మగ పిల్లలున్నారు. వృత్తిరీత్యా అపూర్వ స్వరపేటిక నిపుణురాలు.   (మరో వివాదంలో బిగ్‌ బీ అమితాబ్‌: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం)

EstateJobs డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ ఉద్యోగ ప్రకటన ప్రకారం  ఇది ఒక హై ప్రొఫైల్‌ ఫ్యామిలీలో చేరడానికి ఒక అసాధారణమైన అవకాశం, ప్రత్యేకమైన కుటుంబ సాహసాలలో పాల్గొంటూ వారి పిల్లల పెరుగుదల, అభివృద్ధికి దోహదపడాలి అని ఎస్టేట్ జాబ్స్‌ ఉద్యోగ ప్రకటన పేర్కొంది. ఈ యాడ్‌లో క్లయింట్ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ, ఇది రామస్వామి కుటుంబానికి సంబంధించిందనే అంచనాలు భారీగా ఉన్నాయి. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?)

ఈ ఉద్యోగానికి వారానికి 84 నుండి 96 గంటల పని అవసరం, ఆ తర్వాత వారం మొత్తం సెలవు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన నానీ ఇతర చెఫ్, నానీలు, హౌస్ కీపర్, ప్రైవేట్ సెక్యూరిటీతో సహా ఇతర కీలకమైన టీంతో కలిసి పనిచేయాలి. అలాగే అబ్బాయిల  ఆటలు,  బొమ్మలు, దుస్తులను  ఒక  క్రమ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది.   (ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు)

కాగా 2024 ఎన్నికల్లో జో బిడెన్‌తో తలపడేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు  భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ అభ్యర్థి రామస్వామి  ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే.  (హ్యుందాయ్ కీలక నిర్ణయం: తొలి బ్రాండ్‌గా రికార్డ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement