presidential candidate
-
ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్!
వాషింగ్టన్: చరిత్రాత్మక కవర్ పేజీలకు పెట్టింది పేరైన టైమ్ మేగజైన్ ‘ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్’ అంటూ తాజాగా వ్యంగాత్మక కవర్ పేజీ కథనం ప్రచురించింది. అందులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలోని ప్రెసిడెంట్ స్థానంలో కూర్చుని కని్పస్తున్నారు. ఎరుపు బ్యాక్‌గ్రౌండ్ ముఖచిత్రంలో చేతిలో కాఫీ కప్పు పట్టుకొని ఉన్నారు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఫెడరల్ ప్రభుత్వాన్ని సమూలంగా మార్చేందుకు మస్క్ ప్రయతి్నస్తుండటం తెలిసిందే. ఆ క్రమంలో ఆయనే అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నానే అర్థంలో టైమ్ ఇలా కవర్ పేజీని డిజైన్ చేసింది. అధ్యక్ష సింహాసనం వెనుక ఉన్న అసలైన శక్తి మస్కేనని పరోక్షంగా చెప్పుకొచ్చింది. కవర్ స్టోరీలోనూ ఈ అంశాన్ని గట్టిగానే ఎండగట్టింది. లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు మస్క్ దయపై ఆధారపడి బతకాల్సి వస్తోందని పేర్కొంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న స్పృహ ఆయనలో కన్పించడం లేదని ఆక్షేపించింది. ‘డోజ్ పనితీరుపై మా పత్రిక వైట్‌హౌస్‌కు కొన్ని ప్రశ్నలు పంపింది. కానీ వాటికి బదులివ్వడానికి వైట్‌హౌస్ నిరాకరిచింది’’ అని కథనంలోనే పేర్కొంది. మస్క్ టైమ్ మేగజైన్‌పై కనిపించడం ఇది రెండోసారి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను ‘కింగ్ మేకర్’గా అభిర్ణిణస్తూ ఇటీవలే మేగజైన్ ఓ ఫీచర్ రాసింది. టైమ్ తాజా కవర్ పేజీ ఉదంతంపై ట్రంప్‌ను ప్రశ్నించగా, ‘ఆ మేగజైన్ ఇంకా నడుస్తోందా? నాకు తెలియదు’ అంటూ అంతే వ్యంగ్యంగా స్పందించారు. -
మొదటి అధ్యక్షురాలి అవకాశం మీకే!
న్యూయార్క్: అమెరికా సెనేట్ మెజారిటీ నేత చుక్ షుమర్తోపాటు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జోకులు పేల్చారు. గురువారం న్యూయార్క్‌లో జరిగిన అల్ స్మిత్ మెమోరియల్ డిన్నర్‌కు హాజరైన ట్రంప్..కమలా హ్యారిస్ నెగ్గకుంటే మొదటి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అవకాశం మీకే వస్తుందంటూ షుమర్‌ను ఆటపట్టించారు. పలువురు ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు వచ్చి సరదాగా పట్టించుకుంటారు. ఇలా అందే విరాళాలు కేథలిక్ చారిటీలకు వెళ్తుంటాయి. అయితే, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమలా హారిస్ రాలేదు. బదులుగా చుక్ షుమర్ వచ్చారు. వేదికపై ట్రంప్‌కు సమీపంలోనే ఆయన కూడా ఉన్నారు. ‘షుమర్ చాలా డల్‌గా కనిపిస్తున్నారు. మరో కోణం కూడా చూడాలి. వాళ్ల పార్టీ చాలా చురుగ్గా తయారైంది. కమల అవకాశం కోల్పోతే, మొదటి అధ్యక్షురాలయ్యే అవకాశం మీకే వచ్చే అవకాశముంది’అని షుమర్నుద్దేశించి ట్రంప్ బిగ్గరగా అనడంతో హాలంతా నవ్వులతో నిండిపోయింది.ఈసారి కమలా హారిస్ లక్ష్యంగా ట్రంప్.. ‘నా ప్రత్యర్థి ఈ కార్యక్రమానికి రావల్సిన అవసరం లేదని భావించినట్లున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె తీవ్రంగా అవమానించారు. గతంలో 1984లో వాల్టర్ మొండెల్ మాత్రమే ఇలా చేశారు. అప్పట్లో ఆయన రొనాల్డ్ రీగన్ చేతిలో ఓడిపోయారు’అంటూ వ్యాఖ్యానించారు.దీనిపై అనంతరం కమల తనదైన శైలిలో స్పందించారు. ‘సహాయకుడు రాసిచ్చిన జోకుల్ని చదివేందుకే అవస్థలు పడ్డ ట్రంప్.. టెలీ ప్రాంప్టర్‌ను లోపలికి అనుమతించలేదంటూ ప్రశ్నించారు. తను అనుకుంటున్న జోకులకు ప్రేక్షకులు నవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ జోకులు ఎవరికైనా అర్థమవుతాయా? ట్రంప్ మాట్లాడింది ఒక్క ముక్క కూడా అర్థం కాదు’అంటూ చురకలు అంటించారు. అనంతరం సోషల్ మీడియాలో ట్రంప్ జోకులపై మిశ్రమ స్పందన వచ్చింది. -
స్పెయిన్‌కు పరారైన... వెనిజులా విపక్ష నేత
వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గొంజాలెజ్‌కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే. అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్‌ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్‌లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు. ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్‌కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్‌లో ఉంటున్నారు. – కారకాస్ -
Weekly roundup: కమలా హారీస్ సరికొత్త రికార్డు.. 36 ఏళ్ల తర్వాత..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూపు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. అనూహ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుంచి వైదొలగటంతో.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తెరమీదకు వచ్చారు. ఎట్టకేలకు ఆమె అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా ఖరారు అయ్యారు. వారం రోజుల నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నిక పోరులో చోటుచేసుకున్న కీలక పరిణామాలు ఇవే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష బరి నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గత ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ‘ఎక్స్’లో ఒక లేఖను పోస్ట్ చేశారు. దేశ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కోసమే ఈ తీసుకున్నట్లు తేల్చి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన బైడెన్ అనూహ్యంగా వైదొలగటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌తో గత నెలలో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా వయసు కారణంగా మతిమరుపు సమస్యను ఎదుర్కొన్నారు. దీంతో ఎన్నికల పోటీ నుంచి బైడెన్ తప్పుకోవాలని సొంత పార్టీ నేతలే ఒత్తిడి పెంచారు. అందుకే ఆయన ఎన్నికల పోటీ నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఇక.. ఆయన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె అసాధారణ భాగస్వామి అని ప్రశంసలు కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ మహిళ కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారాయన. అదేవిధంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంట్ను ఓడించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగడంతో నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరవుతారు అనే ఆసక్తి నెలకొంది. ఉపాధ్యక్షురాలు కమలా వైపు మొగ్గు కనపడుతున్నా.. పార్టీ నిబంధనావళి ప్రకారం ఓపెన్ కన్వెన్షన్ (ఎవరైనా పోటీ పడవచ్చు) జరుగుతుంది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవడానికి రాష్ట్రాల వారీగా నిర్వహించిన బైడెన్ తిరుగులేని మెజార్టీ కూడగట్టుకున్నారు. 4000పై చిలుకు డెలిగేట్లలో 3900 మంది డెలిగేట్లను బైడెన్ గెలుచుకున్నారు. నిబంధనల ప్రకారం ఆగస్టులో అధ్యక్ష అభ్యర్థిని ఖరారు చేయడానికి జరిగే జాతీయ కన్వెన్షన్ వీరందరూ బైడెన్‌కు అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం బైడెన్ స్వయంగా వైదొలిగారు కాబట్టి.. డెమోక్రాటిక్ టికెట్ కోసం పార్టీ సభ్యులెవరైనా పోటీపడవచ్చు. దీన్నే ఓపెన్ కన్వెన్షన్ అంటారు. కమలా హారిస్‌కు అవకాశాలు మెరుగ్గా ఉన్నా.. డెమోక్రాటిక్ పార్టీ ముఖ్యనేతలైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్, మిసిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌లు ఆమెకు ప్రధాన పోటీదారాలుగా ఉంటారని భావిస్తున్నారు. నామినేషన్ జాబితాలో పేరు లేనప్పటికీ డెలిగేట్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే వీలు కూడా ఉంది. నాలుగువేల పైచిలుకు డెలిడేట్లు ఆగస్టులో తమ తదుపరి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. తొలి రౌండ్ ఫలితాలు తేలకపోతే 700 మంది సూపర్ డెలిగేట్లను ఓటు వేయడానికి అనుమతిస్తారు. డెమోక్రాటిక్ నామినీ ఎన్నికయ్యే వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో ముమ్మర లాబీయింగ్, తెరవెనక మంత్రాంగాలు జరగటం ఖాయం.డెమోక్రాటిక్ పార్టీ టికెట్ కోసం కమలాకు గట్టి పోటీదారులుగా మారుతారని భావించిన పలు పలు రాష్ట్రాల గవర్నర్లు తమ మద్దతు ఉపాధ్యక్షురాలికేనని బాహాటంగా ప్రకటించారు. ఇక పార్టీలోని సహచరులకు కమలా ఆదివారమే 100 పైగా ఫోన్ కాల్స్ చేసి మద్దతు కూడా గట్టునే పనిలో నిమగ్నమయ్యారు. భారతీయ అమెరికన్, ఆఫ్రికా అమెరికన్ చట్ట సభ్యులు, బైడెన్ అనుచరులు కమలకు మద్దతుగా ముమ్మర లాబీయింగ్ మొదలుపెట్టారు. వివిధ రంగాలలోని మహిళలు కూడా ఆమెకు మద్దతు ప్రకటించారు. బైడెన్ ప్రచార బృందం కూడా సోషల్ మీడియాలో తమ అకౌంట్ల పేర్లను హారిస్ పేరు మీదకు మార్చేసింది. ప్రచార టీంలో 1000 మంది ఉద్యోగులు ఆమె కోసం పని చేయడానికి సిద్ధం అయ్యారు. గట్టి పోటీదారులు అయిన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్ ఆదివారమే ఆమెకు మద్దతు తెలిపారు.కీలక నేతల మద్దతు...ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమోక్రాటిక్ పార్టీలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం కమలకు మద్దతు ప్రకటించారు. శ్రామిక కుటుంబాల కోసం శ్రమించే సునిశిత మేథోశక్తి గల రాజకీయ నాయకురాలు అని కమలను అభివర్ణించారు. అమెరికాలో అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్ గ్రూప్ వారసుడు, ఇల్లినాయీ గవర్నర్ జేబి ఫ్రిట్జ్‌కర్, రెండు సార్లు కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ అభ్యర్థిత్వ రేసులో ఉంటారని భావించినా వారిద్దరూ కమలకే జై కొట్టారు. మిసిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌లు కూడా అదే బాటలో నడిచారు. మేరీ ల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ కూడా హారిస్‌కే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ మద్దతు కూడా కమలకు లభించింది. కమలకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలని సోమవారం హిల్లరీ పిలుపునిచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు లభిస్తే ఇక కమలకు తిరుగు ఉండదు. కమల్ ప్రత్యర్థులుగా ప్రస్తుతానికి రాయ్ కూపర్ (67) , అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ పేర్లు వినిపించాయి.అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు కమలా హారిస్‌కు మద్దతు తెలిపారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా పేరు అనధికారికంగా ఖరారు కావడంతో ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఆమె ఎవరిని ఎన్నుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం మొదటిసారి రోజంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బైడెన్ బృందంతో ఆమె సమావేశమయ్యారు. అదే బృందంతో కలిసి పని చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉండటంతో, గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.మరోవైపు.. కరోనా బారినపడి ఐసోలేషన్ లో ఉన్న జో బైడెన్ ఫోన్లో సమావేశంలో పాల్గొన్నారు. కమలా హారిస్‌ను గెలిపించడానికి కృషి చేయాలని డెమోక్రాట్లకు విజ్ఞప్తి చేశారు. తాను కోలుకోగానే ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.ప్రస్తుతానికి హారిస్ కు 40 మందికి పైగా డెమోక్రాటిక్ సెనేటర్లు, దాదాపు వంద మంది హౌస్ సభ్యుల మద్దతు ఉంది. అంతే కాదు కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్, కాంగ్రెషనల్ హిస్పానిక్ కాకస్, కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ తో పాటు సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ అనే రెండు కీలక సంఘాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ఇక ఉపాధ్యక్ష రేసులో కెంటకీ గవర్నర్ ఆండీ బేషీర్, యూఎస్ ట్రాన్స్ పోర్టేషన్ సెక్రటరీ పీట్ బుట్టిగీగ్, నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్, అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్ కర్, మిషిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఉండొచ్చని భావిస్తున్నారు.రికార్డ్ స్థాయిలో విరాళాలు...కమల హారిస్ ప్రచారం మొదలుపెట్టిన తొలి రోజే పార్టీని విరాళాలు వెల్లువెత్తాయి. 24 గంటల్లో 81 మిలియన్ డాలర్లు వచ్చాయి. అందులో 60 శాతం మొదటిసారి ఇచ్చారు. అధ్యక్ష అభ్యర్థిగా ఒక రోజులోనే ఇంత మొత్తం విరాళంగా రావడం డెమోక్రాట్ల చరిత్రలో తొలిసారి.ట్రంప్‌పై విమర్శలు.. ట్రంప్ లాంటి అవినీతిపరులను, ద్రోహులను ఎన్నికల్లో ఓడించడమే తన ధ్యేయం అని కమలా హారిస్ అన్నారు. ఆమె మంగళవారం విస్కాన్సిస్ రాష్ట్రంలో డెమోక్రాటిక్ పార్టీ సమావేశంలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అభ్యర్థిత్వానికి సరిపడ మద్దతు కూడగట్టుకున్న తర్వాత కమలా మాట్లాడినా మొదటి సమావేశం ఇది. గతంలో కాలిఫోర్నియా ప్రాసిక్యూటర్ గా పని చేశానని, తన రికార్డు ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. ట్రంప్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మహిళలను వేధించిన దుర్మార్గులను, అమాయకపు ప్రజలను దగా చేసిన మోసగాళ్లను, సొంత లాభం కోసం నిబంధనలను అతిక్రమించిన దుష్టులను ఎన్నికలలో ఓడించాలని పిలుపునిచ్చారు. కాగా తొలుత బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రజలను నుంచి వచ్చిన విరాళాలను కమల కు బదిలీ చేయడం ఆపాలని ట్రంప్ బృందం కోరింది. ఈ మేరకు ఫెడరల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.సర్వేల్లో కమలదే పైచేయి...అధ్యక్ష రేసులో జో బైడెన్ పై ఆధిపత్యం ప్రదర్శించిన ట్రంప్ కు కమలా వచ్చి రాగానే కళ్లెం వేశారు. మానసిక చురుకుదనం, సవాళ్లను ఎదుర్కొనే సత్తా విషయంలో ట్రంప్ కంటే హారిస్ కే అమెరికన్లు జై కొట్టడం విశేషం. ఈ విషయమై రాయిటర్స్/ ఇప్సోస్ చేసినా తాజా సర్వేలో 56 శాతం మంది హారిస్ ఓటు వేయగా, ట్రంప్ కు 49 శాతమే ఓట్లు దక్కాయి. పలు సర్వేలల్లో కూడా కమలా దూసుకుపోతున్నారు.కమలా హారిస్‌కు భారీ అడ్వాంటేజ్ఇటు తల్లి నుంచి ఆసియా, అటు తండ్రి నుంచి నల్లజాతి మూలాలుండటం హారిస్‌కు భారీ అడ్వాంటేజ్‌గా మారుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో ప్రబల శక్తులుగా ఉన్న ఈ రెండు వర్గాల ఓట్లూ ఆమెకే పడటం ఖాయమంటున్నారు. ఆగస్టు 19–21 తేదీల మధ్య జరిగే డెమొక్రాట్ల జాతీయ సదస్సులో హారిస్ అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర పడటం లాంఛనమే. అదే ఊపులో ట్రంప్‌ను ఓడిస్తే 248 ఏళ్ల అమెరికా చరిత్రలో తొలి అధ్యక్షురాలిగా, ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా మూలాలున్న నేతగా, నల్ల జాతి మహిళగా... ఇలా ఆ దేశ చరిత్రలోనే అరుదైన పలు రికార్డులను హారిస్ సొంతం చేసుకోనున్నారు. అంతేకాదు, ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ఐదో అమెరికన్‌గా కూడా నిలుస్తారు. 150 ఏళ్ల విరామం తర్వాత జార్జ్‌బుష్.. 1836లో ఉపాధ్యక్షుడు మార్టిన్ వాన్ బురెన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత మళ్లీ ఉపాధ్యక్షుడు నేరుగా అధ్యక్షుడు కావడానికి ఏకంగా 150 ఏళ్లు పట్టింది! 1988లో నాటి ఉపాధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ.బుష్ అధ్యక్షుడు అయ్యారు. చివరగా ఆ ఘనత సాధించిన నేత ఆయనే. 1988 తర్వాత తొలిసారిగా ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ నేరుగా ప్రెసిడెంట్ అయిన తొలి నేతగా రికార్డు సొంతం చేసుకునే దిశగా కమలా హారిస్ వడివడిగా దూసుకెళ్తున్నారు. అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షులుగా ఉంటూ నేరుగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలిచిన నేతలు నలుగురు. వారు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, మార్టిన్ వాన్ బురెన్, జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్. ఎనిమిది మంది ఉపాధ్యక్షులు అప్పటి అధ్యక్షుల మృతి కారణంగా ఆ పదవిని చేపట్టారు. వారు జాన్ టైలర్, మిలార్డ్ ఫిల్మోర్, ఆండ్రూ జాన్సన్, చెస్టర్ ఆర్థర్, థియోడర్ రూజ్ వెల్ట్, కాల్విన్ కూలిడ్జ్, హారీ ట్రూమాన్, లిండన్ జాన్సన్. గెరాల్డ్ ఫోర్డ్ మాత్రం ఉపాధ్యక్షునిగా ఉంటూ, నాటి అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఆ పదవి చేపట్టారు. ఇద్దరు ఉపాధ్యక్షులు మాజీలయ్యాక, అంటే పదవీకాలం ముగిసిన కొన్నాళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. వారిలో ఒకరు రిచర్డ్ నిక్సన్ కాగా రెండోవారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్. హారీ ట్రూమన్, చెస్టర్ ఆర్థర్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే అధ్యక్షులయ్యారు! థామస్ హెండ్రిక్స్, విలియం కింగ్ ఉపాధ్యక్షులు అయిన ఏడాదిలోపే మరణించారు. జార్జ్ క్లింటన్, జాన్ కాల్హన్ వరుసగా రెండుసార్లు ఉపాధ్యక్షులుగా వేర్వేరు అధ్యక్షుల హయాంలో పని చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒమాబా మద్దతు ప్రకటించారు. నా స్నేహితురాలు హారీస్ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నామని, ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నా స్నేహితురాలు యూనైటెడ్ స్టేట్స్కు అధ్బుతమైన అధ్యక్షురాలిగా అవుతుంది. రెండు రోజుల క్రితం కమలా హ్యారిస్‌కు మేము ఫోన్ చేశాం. మిచెల్, నేను ఆమెతో మాట్లాడాం. తనకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు చెప్పాము. ఈ క్లిష్టమైన సమయంలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలుపొందేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం. నీ పట్ల మాకు గర్వంగా ఉంది. నువ్వు చరిత్ర సృష్టిస్తామని తెలుసు’అని అని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు.అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(59) అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ఈ విషయాన్ని శనివారం ఆమె స్వయంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారామె. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ‘ఎక్స్’ ఖాతాలో ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె తమ అభ్యర్థి అని డెమోక్రటిక్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.కమలా హారిస్ నేపథ్యం.. కమలా హారిస్ పూర్తి పేరు.. కమలాదేవి హారిస్. ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి. తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైవాసి. పైచదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. కమల తండ్రి డొనాల్డ్ హ్యారిస్. జమైకాకు చెందిన ఆయన అర్థశాస్త్ర ప్రొఫెసర్. అమెరికాలో జన్మించిన కమల.. తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు కమల. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకొన్నారు.అటార్నీ జనరల్‌గా..హోవార్డ్‌లో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారామె. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్‌గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు.సెనేటర్ నుంచి తక్కువ టైంలో.. 2017లో క్యాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్ మోస్లే తర్వాత ‘అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లో అడుగుపెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2020లో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. కమలా హారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమే. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికే గురిపెట్టారు. డెమోక్రటిక్ పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తే.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78)తో ఆమె పోటీ పడనున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలిస్తే.. అగ్ర రాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. -
Kamala Harris: ‘మామ్’లా
‘లెట్స్ విన్ దిస్’ ఇది కమలా హ్యారిస్ నినాదం. గెలిచే శక్తి... గెలవగలిగే శక్తి తాను కాగలనని హ్యారిస్ ఆత్మవిశ్వాసం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి అభ్యర్థిగా జో బైడెన్ తప్పుకున్నాక ఇప్పుడు అమెరికాయే కాదు, ప్రపంచమంతా కమలా హ్యారిస్ వైపు చూస్తోంది. అధ్యక్ష పదవి అభ్యర్థిగా ఆమె ఎంపికైతే అది ఒక చరిత్రాత్మక సందర్భం... గెలిచి ప్రెసిడెంట్ అయితే చరిత్రే! భారతీయ మూలాల్లో తల్లి శక్తిస్వరూపిణి. స్త్రీ శక్తి స్వరూపిణి. స్త్రీగా... తల్లిగా... రాజకీయవేత్తగా కమలా హ్యారిస్ తన శక్తి ఏమిటో ఇప్పటికే నిరూపించారు. ఆమెలోని భారతీయత శక్తిని ఇస్తూనే ఉంటుంది.కమలా హ్యారిస్ జీవితంలో ఆగస్టు 22కు ఒక ప్రత్యేకత ఉంది. 2014లో డగ్లస్ ఎంహాఫ్‌తో ఆమె పెళ్లి జరిగిన రోజు అది. సరిగ్గా పదేళ్ల తర్వాత అదే ఆగస్టు 22 మళ్లీ ఇప్పుడు ఆమె కోసం మరొక చిరస్మరణీమైన సందర్భాన్ని సిద్ధం చేసి ఉంచినట్లే అనిపిస్తోంది! 2024 ఆగస్టు 19 నుంచి 22 వరకు షికాగోలో జరిగే పార్టీ సమావేశంలో చివరి రోజున డెమోక్రాట్లు తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఆ అభ్యర్థి కమలా హ్యారిస్ అయుండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరో మూడు నెలలో అధ్యక్ష ఎన్నికలు ఉండగా పోటీ నుంచి విరమించుకున్న జో బైడెన్.. వెళుతూ వెళుతూ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచి వెళ్లారు. ఆయన మాటపై కమలా హ్యారిస్‌కు మద్ధతుగా ఉన్న డెమోక్రాట్లతో పాటుగా, పార్టీలోని ఆమె వ్యతిరేకులు కూడా.. ఇప్పుడు ‘ట్రంప్‌ను ఓడించగల శక్తి’గా కమలా హ్యారిస్‌ను గుర్తించటం మొదలైంది.→ ఎంతటి శక్తిమంతురాలు?కమలా హ్యారిస్‌ను ఆమె పిల్లలు ‘మామ్లా’ (మామ్ + కమల) అని పిలుస్తారు. పిల్లలకు ఆమె సొంత తల్లి కాదు. విడిపోయిన డగ్లస్ ఎంహాఫ్ మొదటి భార్య పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కమలా డగ్లస్‌ల పెళ్లయ్యే నాటికి అబ్బాయికి 19 ఏళ్లు. అమ్మాయికి 15. ఆ వయసులోని పిల్లలు ఒక బయటి మనిషి తల్లిలా వచ్చి తమను చేరదీస్తానంటే వెళ్లి ఒడిలో వాలిపోతారా? కానీ అలాగే జరిగింది. వాళ్లను చక్కగా కలుపుకుపోయారు కమల. కొత్తమ్మ అమ్మ అయింది. ఫ్రెండ్ అయింది. అమ్మ, ఫ్రెండ్ కలిసి ‘మామ్లా’ అయింది. తల్లి స్థానంలో తల్లిగా వచ్చి, పిల్లల మనసు గెలుచుకోటానికి శక్తి కావాలి. అంతటి శక్తిమంతురాలు అయిన కమలకు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవటం, ఆపైన అధ్యక్షురాలిగా నెగ్గటం ఎంత పని?‘‘అమెరికాను సకల జాతులకు సహజీవన యోగ్యమైన దేశంగా మార్చటమే నా ధ్యేయం’’ అని కమల అనడం ట్రంప్ వంటి కరడు గట్టిన జాతీయవాదులకు నచ్చకపోవచ్చు. అయితే ఆ ఒక్క మాటతో ఆమె ఇప్పటికే అధికశాతం అమెరికన్లు, అమెరికాలోని ఇతర వలస దేశాల ప్రజల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించారు.→ వ్యక్తిగా ఎలాంటి మనిషి? నాలుగేళ్ల క్రితం బైడెన్ రన్నింగ్ మేట్‌గా (వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా) ఎంపికైనది మొదలు, అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యే వరకు కమలా హ్యారిస్‌ను గురించిన ఏ చిన్న విషయాన్నీ వదలకుండా ప్రపంచం ఆసక్తిగా తెలుసుకుంది. ‘‘నా బిడ్డ’’ అని భారతదేశం గర్వించింది. అంతేకాదు, తన ఉపాధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ఆమె భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తలపిస్తూ చీరకట్టులో వేదికపైకి రావాలని ఇండియా కోరుకుంది. అమెరికా ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పెద్ద పెద్ద డిబేట్లు జరిగిన విధంగానే.. ‘‘కమల చీర కట్టులో కనిపిస్తారా లేదా?’’ అని రెండు దేశాల్లోనూ డిబేట్లు జరిగాయి. చీర కట్టుకుంటే బావుంటుందన్న ఆకాంక్షలు వెల్లివిరిశాయి. ప్రమాణ స్వీకారానికి ఆమె చీర ధరిస్తే.. సంస్కృతుల సమైక్య భావనకు తనొక సంకేతం ఇచ్చినట్లు అవుతుంది’’ అని, ‘‘కమలా హ్యారిస్ చీర కట్టుకుని ప్రమాణం స్వీకారంలో కనిపిస్తే అమెరికాలోని దక్షిణాసియా సంతతి వారికి ఆమె తమ మనిషి అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది..’’ అని, ‘‘కమలా హ్యారిస్ కనుక చీరలో ప్రమాణ స్వీకారం చేస్తే అదొక దౌత్యపరమైన స్నేహానికి చిహ్నంగా నిలుస్తుంది’’ అని... ఇలా అనేక అభి్రపాయాలు వ్యక్తం అయ్యాయి.చివరికేం జరిగింది? అచ్చమైన అమెరికన్ ΄ûరురాలిగా ΄్యాంట్ సూట్, బౌ బ్లవుజ్లో వచ్చి ప్రమాణం స్వీకారం చేశారు కమలా హ్యారిస్. ఇది దేనికి సంకేతం? కొత్తగా తను సంస్కృతుల సమైక్య భావనను, దౌత్యపరమైన స్నేహభావనను ప్రదర్శించనవసరం లేదని ఆమె బలంగా నమ్మారని. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో వెల్లడించే ఒక చిన్న సందర్భం ఇది.→ ‘‘వాళ్లిద్దరు కూడా నాకు అమ్మలే’’తన తల్లి శ్యామలా గోపాలన్ కాకుండా, మరో ఇద్దరు మహిⶠలు కూడా తనకు తల్లి వంటి వారని.. ఆనాటి ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు కమల! ఆ ఇద్దరిలో ఒకరు: చిన్నప్పుడు తమ పక్కింట్లో ఉండే శ్రీమతి షెల్టన్. ఇంకొకరు : ఒకటో తరగతి టీచర్ శ్రీమతి విల్సన్. ‘‘సాయంత్రం అమ్మ డ్యూటీ నుండి రావటం లేటయితే నేను, చెల్లి మాయా నేరుగా షెల్టన్ వాళ్ల ఇంట్లోకి వెళ్లిపోయేవాళ్లం. అక్కడే తిని, అమ్మ వచ్చి మమ్మల్ని పిలుచుకెళ్లే వరకు అక్కడే పడుకునేవాళ్లం. షెల్టన్ మమ్మల్నెంతో ఆదరణగా చూశారు..’’ అని కమల గుర్తు చేసుకున్నారు. ఇక శ్రీమతి విల్సన్ బర్కిలీలోని థౌజండ్ ఓక్స్ ఎలిమెంటరీ స్కూల్లో ఒకటో తరగతి టీచర్. ‘‘బాల్యంలో నాలో ఆశల్ని, ధైర్యాన్ని నింపింది ఆవిడే. నేను పై చదువులకు వెళ్లి, ‘లా’ డి΄÷్లమా చేసి, ఆ సర్టిఫికెట్‌ను అందుకునేందుకు స్టేజ్ మీదకు వెళ్లినప్పుడు కూడా విల్సన్ నా కోసం వచ్చి ఆడియెన్స్‌లో కూర్చొని ఉండటం దూరాన్నుంచి కనిపించింది! నన్ను సంతోష పెట్టటం కోసం ఆమె అలా చేయటం నాకెంతో అనందాన్నిచ్చింది’’ అని విల్సన్ గురించి రాశారు కమల. అమెరికా తొలి ఉపాధ్యక్షురాలు అయ్యాక కూడా ఈ నాలుగేళ్లలో ఎక్కడా దర్పాన్ని ప్రదర్శించని కమల తన జీవితంలోని అమూల్యమైన వ్యక్తులను, ప్రదేశాలను, మరచిపోలేని సందర్భాలను తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. రేపు ఒకవేళ ఆమె అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైతే కనుక ఆమె షేర్ చేసే తొలి పోస్టు ఏదైనా గాని, తప్పకుండా ఆమె కన్నా కూడా అది అగ్రరాజ్యం అమెరికాకే చరిత్రాత్మక సందర్భం అవుతుంది. ‘‘అమెరికాను సకల జాతులకు సహజీవన యోగ్యమైన దేశంగా మార్చటమే నా ధ్యేయం’’ అని కమల అనడం ట్రంప్ వంటి కరడు గట్టిన జాతీయవాదులకు నచ్చకపోవచ్చు. అయితే ఆ ఒక్క మాటతో ఆమె ఇప్పటికే అధికశాతం అమెరికన్లు, అమెరికాలోని ఇతర వలస దేశాల ప్రజల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించారు. -
USA Presidential Elections 2024: అడ్వాంటేజ్ హారిస్
వాషింగ్టన్: జో బైడెన్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వైదొలగడంతో భారతీయ అమెరికన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అవకాశాలు మెరుగయ్యాయి. అధ్యక్ష అభ్యర్థిగా కమలకు బైడెన్ మద్దతు ప్రకటించారు. ఇది ఆమెను అధ్యక్ష టికెట్ రేసులో ముందు వరుసలో నిలుపుతుంది. అయితే బైడెన్ మద్దతిచి్చనంత మాత్రాన ఆటోమేటిగ్గా కమల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవ్వలేరు. డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో డెలిగేట్ల మద్దతును సంపాదించాల్సి ఉంటుంది. డేలిగేట్ల ఓటింగ్‌లో ఎవరైతే మెజారిటీ సాధిస్తారో వారే డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవుతారు. డెమొక్రాటిక్ పార్టీ టికెట్ కోసం కమలకు గట్టి పోటీదారులుగా మారతారని భావించిన పలు రాష్ట్రాల గవర్నర్లు తమ మద్దతు ఉపాధ్యక్షురాలికేనని బాహటంగా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతానికైతే అధికారికంగా కమల ఒక్కరే రేసులో ఉన్నారు. బైడెన్ విరమణ ప్రకటన అనంతరం కమల తక్షణం రంగంలోకి దిగారు. పారీ్టలోని సహచరులకు ఆదివారమే 100 పైగా ఫోన్‌కాల్స్ చేసి మద్దతు కూడ గట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు భారతీయ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్ చట్టసభ సభ్యులు, బైడెన్ అనుచరులు కమలకు మద్దతుగా ముమ్మర లాబీయింగ్ మొదలుపెట్టారు. వివిధ రంగాల్లోని మహిళలు కూడా ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. బైడెన్ ప్రచార బృందం కూడా సోషల్ మీడియాలో తమ అకౌంట్ల పేర్లను హారిస్ పేరు మీదకు మార్చేసింది. ప్రచార టీమ్‌లోని 1,000 మంది ఉద్యోగులు తక్షణం ఆమె తరఫున పనిచేయనున్నారు. పెలోసి, క్లింటన్ల మద్దతు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమొక్రాటిక్ పారీ్టలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం హారిస్‌కు మద్దతు ప్రకటించారు. శ్రామికవర్గ కుటుంబాల కోసం శ్రమించే, సునిశిత మేధోశక్తి గల రాజకీయ నాయకురాలిగా కమలను అభివరి్ణంచారు. బైడెన్‌ను వైదొలిగేలా ఒప్పించడంలో పెలోసిది కీలకపాత్ర. డజన్ల కొద్ది ప్రతినిధుల సభ సభ్యులు, సెనేటర్లు కూడా కమలకు మద్దతు తెలిపారు. గట్టి పోటీదారులైన పెన్సిల్వేనియా గవర్నర్ జోస్ షాపిరో, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదివారమే ఆమెకు మద్దతు ప్రకటించేశారు. అమెరికాలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్ హోటల్ గ్రూపు వారసుడు, ఇల్లినాయీ గవర్నర్ జె.బి.ఫ్రిట్జ్‌కర్, రెండుసార్లు కెంటకీ గవర్నర్ అండీ బెషియర్ అభ్యరి్థత్వ రేసులో ఉంటారని భావించినా సోమవారం వారిద్దరూ కమలకే జైకొట్టారు. మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ కూడా ఇదే బాటలో నడిచారు. మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ కూడా కమలకే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ల మద్దతు కూడా లభించింది. కమలకు ఉదారంగా విరాళాలివ్వాలని హిల్లరీ సోమవారం పిలుపిచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదముద్ర కూడి పడితే ఆమెకు తిరుగు ఉండదు. కమల ప్రత్యర్థులుగా ప్రస్తుతానికి రాయ్ కూపర్ (67), అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ పేర్లు వినిపిస్తున్నాయి. -
గ్రాడ్యుయేట్లకు అమెరికా గ్రీన్ కార్డు: ట్రంప్
వాషింగ్టన్: జాతీయవాదిగా, వలసలను వ్యతిరేకించే నాయకుడిగా పేరుగాంచిన అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ధోరణి మార్చుకున్నారు. అమెరికాలో చదువుకొనే విదేశీ విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. తాజాగా ఆల్–ఇన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్‌గా గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉండొచ్చని వెల్లడించారు. జూనియర్ కాలేజీల్లో చదువుకున్నవారికి సైతం గ్రీన్‌కార్డులు ఇస్తామన్నారు. ఇండియా, చైనా దేశాల విద్యార్థులు అమెరికా కాలేజీల్లో చదువుకొని, స్వదేశాలకు తిరిగివెళ్లి మల్టీ బిలియనీర్లుగా పైకి ఎదుగుతున్నారని, పరిశ్రమలు స్థాపించి, వేలాది మందికి ఉపాధి కలి్పస్తున్నారని చెప్పారు. వారు ఇక్కడే ఉండేలా చేస్తే అమెరికాకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా ట్రంప్ మరోసారి బరిలోకి దిగుతుండటం తెలిసిందే. -
అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
వాషింగ్టన్: భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయోవా రిపబ్లికన్ కాకస్ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా.. ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కారణంగా బరి నుంచి తప్పుకోవాలని రామస్వామి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్‌కు వివేక్ మద్దతు ఇవ్వనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో ఇది మొదటిది. ఇందులో ట్రంప్ అత్యధిక మెజార్టీ సాధించారు. రెండో స్థానంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మధ్య పోటీ నెలకొంది. ఇక, కేవలం 7.7 శాతం ఓటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచిన వివేక్ రామస్వామి ప్రైమరీ తొలి పోరులో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. వివేక్ రామస్వామి ఒహాయోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికా(America)కు వలస వచ్చారు. ఆయన సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్‌గా అభివర్ణించుకుంటారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. గత ఏడాది ఆయన స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ను స్థాపించారు. దీనికి ముందు ఆయనకు ఔషధరంగంలో గొప్ప పేరు ఉంది. రొవాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. 2016లో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆయన పోటీ ప్రకటన తర్వాత వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ సమయంలో ప్రకటించారాయన. ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదని.. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం అని చెప్పుకున్నారాయన. అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్ తరహాలో ప్రచారం చేస్తూ వచ్చారాయన. అలాగే.. చైనా నుంచి ఎదురవుతోన్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాను అంటూ ప్రకటన చేశారాయన. ఆ తర్వాత ప్రచారంలో వైవిధ్యతను కనబరుస్తూ వచ్చినప్పటికీ.. ప్రచార చివరిరోజుల్లో ట్రంప్, రామస్వామిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చివరకు..అయోవా కాకసస్ ఎన్నికల్లో చేదు ఫలితం అందుకుని అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నారు. ఇదీ చదవండి: అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్.. భారీ ఊరట -
లవ్ స్టోరీ చెప్పిన భార్య: తొలి బిడ్డను కోల్పోయాం.. వివేక్‌రామస్వామి భావోద్వేగం
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన, పారిశ్రామికవేత్త,భారతీయ సంతతికి చెందిన వివేక్ గణపతి రామస్వామి తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. ఈక్రమంలో అయోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో భార్య అపూర్వ, కుమారుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తి త జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను వివేక్‌ను ట్విటర్లో షేర్ చేశారు. తన భార్యకు గర్భం దాల్చి మూడున్నర నెలలకే గర్భస్రావం జరిగిందని ఇది తమకు చాలా బాధకరమైన క్షణమని పేర్కొన్నారు. ముఖ్యంగా తొలి బిడ్డను కోల్పోవడతో రెండోసారి కూడా ఆ భయం వెంటాడిందన్నారు. కానీ ఆ భగవంతుడిమీద విశ్వాసంతోనే ధైర్యాన్ని తెచ్చు కున్నామని, అలా కార్తీక్ , అర్జున్ వచ్చారని తమ జీవితాల్లోరావడంతో సంతోషం నిండిందంటూ అయోవాలోని ఫ్యామిలీ లీడర్ థాంక్స్ గివింగ్ ఫ్యామిలీ ఫోరమ్‌లో రామస్వామి తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. I haven’t spoken publicly about the loss of Apoorva and my first child—it’s difficult for us to talk about it. Apoorva and I draw strength from our faith in God and are so blessed to be the parents to our two sons Karthik and Arjun. pic.twitter.com/x2qzWqrxS5 — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 17, 2023 తన విశ్వాసమే తన స్వేచ్ఛ ను ఇచ్చిందనీ అదే ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నడిపించిందని చెప్పుకొచ్చాడు. దేవుడు ఒక్కడే అని తాను విశ్వసిస్తానన్నారు. అలాగే తల్లితండ్రుల పెంపకం, వారి పట్ల గౌరవం వివాహం, ఇతర సాంప్రదాయ విలువల్ని వారి నుంచి నేర్చుకున్నానన్నారు. హిందూ విశ్వాసం, సిద్ధాంతాలు, క్రైస్తవ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు నేర్చుకున్న క్రైస్తవ విలువల మధ్య సారూప్యాన్ని ప్రస్తావించారు. ఇవి మతపరమైన సరిహద్దులను అధిగమించి ఉన్నతమైన దైవిక శక్తికి చెందినవని పేర్కొన్నారు. అటు రామస్వామి భార్య అపూర్వ కూడా తమ ప్రేమ ఎలా మొదలైందీ పంచుకున్నారు. తొలుత ఒక కాలేజీ పార్టీలో కలుసుకున్నామని తెలిపారు. మెడ్ స్కూల్లో ఉండగా, వివేక్ అక్కడ న్యాయ విద్యార్థిగా ఉన్నారు. అక్కడ వివేక్‌ను చూశాను...చాలా ఆసక్తికరమైన వ్యక్తిగా అనిపించాడు. వెంటనే వెళ్లి వివేక్‌ను పరిచయం చేసుకున్నానని కానీ అపుడు వివేక్ పెద్ద ఆసక్తి చూపించలేదన్నారు. కానీ అప్పటినుంచి తరచు కలుసుకుంటూ, తాము పరస్పరం ఎంత దగ్గరి వారిమో గుర్తించాం. అప్పటినుంచీ కలిసే ఉన్నామని తెలిపారు. కాగా వివేక్ రామస్వామి తండ్రి వీజీ రామస్వామి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజినీర్‌గా పనిచేశారు. తల్లి గీతా రామస్వామి వృద్ధులకు సంబంధించిన జీరియాట్రిక్ సైకియాట్రిస్టు. భార్య అపూర్వ సర్జన్. యేల్ విశ్వవిద్యాలయంలో పరిచయం వీరి పెళ్లికి దారితీసింది. 2015లో అపూర్వ తివారీని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు. 2023 ఆగస్టు నాటి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం వివేక్ రామస్వామి సంపద విలువ 95 కోట్ల అమెరికన్ డాలర్లకు పైమాటే. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024 మంగళవారం జరగనున్నాయి. Voters in Iowa want to know the story how Apoorva and I met. Here’s how. 😉 📍 Osceola, IA pic.twitter.com/N7duPToNlO — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 19, 2023 -
యూఎస్ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన టిమ్ స్కాట్
కొలంబియా(యూఎస్ఏ): 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్ ప్రకటించారు. మరో రెండు నెలల్లో అయోవాలో ఓటింగ్ ప్రారంభం కానున్న వేళ ఆదివారం అర్ధరాత్రి టిమ్ స్కాట్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్య పరిచింది. ఉపాధ్యక్ష పదవికి సిద్ధమేనా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. రిపబ్లికన్ సెనేటర్లలో ఏకైక నల్లజాతీయుడైన స్కాట్ అందరి కంటే ముందుగా మేలోనే అధ్యక్ష పదవికి పోటీ పడనున్నట్లు తెలిపారు. -
బిలియనీర్ వివేక్ రామస్వామి ఇంట్లో ‘నానీ’ జాబ్: జీతం తెలిస్తే షాకవుతారు
Vivek Ramaswamy wants to hire nanny అమెరికా అధ్యక్ష పదవి రేసులో దూసుకుపోతున్న భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ వివేక్ రామస్వామి తన పిల్లలను చూసుకునేందుకు నానీ కోసం వెతుకు తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీగా జీతాన్ని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రిక్రూట్మెంట్ స్టాఫింగ్ వెబ్‌సైట్‌లోని జాబ్ లిస్టింగ్ ప్రకారం రామస్వామి తన పిల్లల్ని చూసుకునే నానీ (ఆయా)కోసం లక్ష డాలర్లు (రూ.80 లక్షల కంటే ఎక్కువ) లేదా అంతకంటే ఎక్కువ జీతాన్ని ఆందించనున్నారు. వివేక్ రామస్వామి అపూర్వ తివారీకి దంపతులకు కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు మగ పిల్లలున్నారు. వృత్తిరీత్యా అపూర్వ స్వరపేటిక నిపుణురాలు. (మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం) EstateJobs డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉద్యోగ ప్రకటన ప్రకారం ఇది ఒక హై ప్రొఫైల్ ఫ్యామిలీలో చేరడానికి ఒక అసాధారణమైన అవకాశం, ప్రత్యేకమైన కుటుంబ సాహసాలలో పాల్గొంటూ వారి పిల్లల పెరుగుదల, అభివృద్ధికి దోహదపడాలి అని ఎస్టేట్ జాబ్స్ ఉద్యోగ ప్రకటన పేర్కొంది. ఈ యాడ్‌లో క్లయింట్ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ, ఇది రామస్వామి కుటుంబానికి సంబంధించిందనే అంచనాలు భారీగా ఉన్నాయి. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?) ఈ ఉద్యోగానికి వారానికి 84 నుండి 96 గంటల పని అవసరం, ఆ తర్వాత వారం మొత్తం సెలవు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన నానీ ఇతర చెఫ్, నానీలు, హౌస్ కీపర్, ప్రైవేట్ సెక్యూరిటీతో సహా ఇతర కీలకమైన టీంతో కలిసి పనిచేయాలి. అలాగే అబ్బాయిల ఆటలు, బొమ్మలు, దుస్తులను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. (ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు) కాగా 2024 ఎన్నికల్లో జో బిడెన్‌తో తలపడేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ అభ్యర్థి రామస్వామి ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. (హ్యుందాయ్ కీలక నిర్ణయం: తొలి బ్రాండ్‌గా రికార్డ్) -
డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పూర్తి పదవీకాలం పనిచేసిన తన గురించి దేశ ప్రజలకు పూర్తిగా తెలుసని తాను మళ్ళీ అధ్యక్ష పదవి కోసం అభ్యర్థిత్వాన్ని బలపరచుకోవాల్సిన అవసరసం లేదని అన్నారు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రధాన అభ్యర్థిగా రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ తన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఈసారి జరగబోయే డిబేట్లలో తాను పాల్గొనడం లేదని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరపు అభ్యర్థులు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లుగా తమను తాము నిరూపించుకోవడానికి డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బుధవారం విస్కాన్సిన్లోని మిల్వాకీలో మొదట డిబేట్ జరగనుండగా ఈ డిబేట్ కార్యక్రమానికి ట్రంప్ రావడం లేదని 62 శాతం బలంతో తాను ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నానని అందుకే ఈ డిబేట్లో పాల్గొనడంలేదన్నారు డోనాల్డ్ ట్రాంప్. రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడి రేసులో ట్రంప్ తర్వాత 16 శాతం బలంతో ఫ్లోరిడా గవర్నర్ రోన్ డీసాంటిస్ ఉన్నారు. ఇక భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి సింగిల్ డిజిట్ బలంతో కొనసాగుతున్నారు. గత పర్యాయం ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు ట్రంప్ పై ఇప్పటికే నాలుగు అభియోగాలు నమోదు కాగా అవి ఇంకా విచారణ దశలో ఉన్నాయి. వాటిలో ఏమైనా నిరూపితమైతే ట్రంప్ అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమవుతుంది. అప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ఇది కూడా చదవండి: యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ మంత్రి ఫిదా..! -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి డోనాల్డ్ ట్రంప్ ను వెనక్కి నెట్టి రేసులో శరవేగంగా దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకునే క్రమంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. సీఎన్ఎన్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపగలను.. అందుకు రష్యా చైనాతో సైనిక సంబంధాలను నిలిపివేయాలని.. అలాగే క్యివ్, డాన్ బాస్ నాటోలో చేరకుండా ఉండాలన్నారు. రష్యాను ఓడించడం నా ఉదేశ్యం కాదు కానీ అమెరికాను గెలిపించడమే నా ఉద్దేశ్యమని అన్నారు.రష్యా-చైనా కలగలసిన సైన్యం ప్రపంచంలోనే పెద్దదని అది అమెరికాకు ఎప్పటికైనా ప్రమాదమేనని అన్నారు. ఇక్కడ విషయమేమిటంటే అమెరికా ప్రమేయం పెరిగే కొద్దీ రష్యా చైనాకు మరింత దగ్గరవుతూ ఉంటుందని.. ఏ రాజకీయ పార్టీ ఈ ప్రస్తావనే తీసుకురావడం లేదని.. ఈ సమస్యనుకి పరిష్కరించడానికి వీలయితే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాస్కో వెళతానని అన్నారు. ప్రస్తుతమున్న బైడెన్ ప్రభుత్వం రష్యా చైనా భాగస్వామ్యాన్ని వేరుచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కానీ అది సాధ్యపడాలంటే మనం మొదటిగా పుతిన్ - జిన్ పింగ్ మధ్య గీత గీయాల్సిన అవసరముంది. లేదంటే 1972లో నిక్సన్ చైనా వెళ్లిన నాటి పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. నా దృష్టికి పుతిన్ ఈ తరం మావోలా కనిపిస్తుంతయారు. నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాస్కో వెళ్లి రష్యాను చైనా బిగి కౌగిలి నుండి విడిపిస్తానని అన్నారు. నా విదేశీ విధానాల్లో ఇదే ప్రధానమైనదని వెల్లడించారు. I will end the Ukraine War on terms that require Putin to exit his military alliance with China. The goal shouldn’t be for Russia to “lose.” It should be for the U.S. to *win.* https://t.co/pmsxaiFR2I — Vivek Ramaswamy (@VivekGRamaswamy) August 18, 2023 ఇది కూడా చదవండి: 'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ -
75 ఏళ్లు దాటితే యోగ్యతా పరీక్షలు పెట్టాలి: నిక్కీ హేలీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న వారిలో 75 ఏళ్ల వయసుకు పైబడి ఉంటే వారికి ఎంతవరకు ఆ పదవికి యోగ్యత ఉందో అమెరికన్లు తప్పనిసరిగా చూడాలని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లోకి కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాషింగ్టన్లో ఎందరో రాజకీయ నాయకులకు వయసు మీదపడిందన్నారు. కాంగ్రెస్‌కి ఎన్నికవాలంటే వయసు పరిమితి విధించాల్సిన ఆవశ్యకత ఉందని హేలీ అన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన 75 ఏళ్లకు పైబడిన వారికి యోగ్యతా పరీక్షలు నిర్వహించాలని కొత్త ప్రతిపాదన చేశారు. మరోవైపు హేలీ అభిప్రాయాలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతూ ఉండడం, వారి వయసు 75 దాటిపోవడంతో హేలీ చేసిన ప్రతిపాదనపై విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలు, విమర్శలు, దాడులు గతంలో కూడా చూశామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీనా జీన్ పియరే అన్నారు. -
అమెరికా అధ్యక్ష రేసులో నిమ్రత నిక్కీ రాంధవా హేలీ
వాషింగ్టన్: అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన మహిళ నిలవబోతోంది. నిక్కీ హేలీ 2024లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిపబ్లికన్ తరపున నామినేషన్ కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వీళ్ల అధ్యక్ష అభ్యర్థిత్వంపై పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సౌత్ కరోలినా మాజీ గవర్నర్, ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి అయిన హేలీ, 2024 రిపబ్లికన్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడో విశేషం ఏంటంటే.. 2024 ఎన్నికల కోసం ట్రంప్‌కు తాను ఎట్టిపరిస్థితుల్లో పోటీదారురాలిని కాబోనని ఆమె రెండేళ్ల కిందట ప్రకటించారు. తాజాగా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని బరిలో దిగేందుకు సిద్ధం అవుతుండడం గమనార్హం. నిక్కీ హేలీ, నేనే నిక్కీ హేలీ, నేనే అధ్యక్ష రేసులో ఉన్నాను తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారామె. ఇదిలా ఉంటే జో బైడెన్‌పై ఆమె కొంతకాలంగా విమర్శలు చేస్తూనే.. అధ్యక్ష పదవి పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు నాయకత్వం ద్వారా రిపబ్లికన్ పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం తన అభిమతమని ప్రకటించారు. Get excited! Time for a new generation. Let’s do this! 👊 🇺🇸 pic.twitter.com/BD5k4WY1CP — Nikki Haley (@NikkiHaley) February 14, 2023 నిక్కీ హేలీ అలియాస్ నిమ్రత నిక్కీ రాంధవా హేలీ. ఆమె పూర్వీకులది పంజాబ్. పుట్టినప్పుడు ఆమె పేరు నిమ్రత నిక్కీ రాంధవా హేలీ. అమె దక్షిణ కరోలినాలో భారతీయ పంజాబీ సిక్కు తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె తండ్రి అజిత్ సింగ్ రాంధవా, తల్లి రాజ్ కౌర్ రాంధవా. వాళ్లు అమృత్సర్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అమె తండ్రి గతంలో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, తల్లి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందారు. 51 ఏండ్ల నిక్కీ హేలీ తొలి నుంచి రిపబ్లికన్ పార్టీలోనే ఉన్నారు. 2004లో తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించారు. 2008లో రెండోసారి గెలుపొందారు. 2010లో కాలిఫోర్నియా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో సౌత్ కాలిఫోర్నియా గవర్నర్‌గా పని చేసిన నిక్కీ హేలీ.. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా సేవలందించారు. సౌత్ కాలిఫోర్నియా గవర్నర్‌గా నియమితురాలైన తొలి మహిళగా ఆమె రికార్డు సాధించారు. ట్రంప్ తన అభ్యర్థిత్వాన్ని ముందుగానే ప్రకటించినా.. అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంలో నిక్కీ హేలీ ఓ అడుగు ముందుకేశారు. ట్రంప్, నిక్కీ హేలీతోపాటు అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ నుంచి ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెస్సెంటీస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తదితరులు పోటీ పడే అవకాశాలున్నాయి. నవంబర్ 5, 2024న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
ద్రౌపది ముర్ము అంటే గౌరవమే, కానీ..
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో.. మద్దతు విషయంలో పార్టీలన్నీ ఒక స్పష్టతకు వచ్చేస్తున్నాయి. దేశంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీగా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. రెండు రాష్ట్రాల్లో కలిపి పది రాజ్యసభ ఎంపీలను కలిగి ఉంది. ఈ తరుణంలో ఆప్ మద్దతు ఎవరికనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ తమ మద్దతు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే అని ప్రకటించింది. ఈ మేరకు ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము అంటే మా సభ్యులందరికీ ఒక గౌరవం ఉంది . కానీ, మా మద్దతు మాత్రం యశ్వంత్ సిన్హాగారికే అని.. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ తర్వాత సంజయ్ సింగ్ ప్రకటించారు. AAP के राष्ट्रीय संयोजक व दिल्ली के मा.मुख्यमंत्री @ArvindKejriwal जी की अध्यक्षता में पार्टी PAC की बैठक हुई। PAC ने राष्ट्रपति चुनाव में विपक्ष के उम्मीदवार श्री यशवंत सिन्हा जी का समर्थन करने का निर्णय लिया है। हम श्रीमती द्रोपदी मुर्मू का भी सम्मान करते हैं। pic.twitter.com/ViZAUw82QS — Sanjay Singh AAP (@SanjayAzadSln) July 16, 2022 రాష్ట్రపతి ఎన్నిక జులై 18న జరుగుతుండగా.. 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నామినేషన్ సమయానికే ద్రౌపది ముర్ముకు 50 శాతం ఓటింగ్ దక్కింది. ఆపై బీజేపీ, వైఎస్సార్సీపీ, బీజేడీ, బీఎస్పీ, శిరోమణి అకాలీ దల్, శివసేన లాంటి పార్టీల మద్దతు తర్వాత ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి 60 శాతం దాటింది. మరోవైపు కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, టీఆర్ఎస్ తదితర పార్టీల మద్దతుతో బరిలో దిగనున్నారు యశ్వంత్ సిన్హా. -
ఆంధ్రప్రదేశ్ కు ఘనమైన చరిత్ర ఉంది: ద్రౌపది ముర్ము
-
ద్రౌపది ముర్ముకు వైఎస్ఆర్ సీపీ పూర్తీ మద్దతు పలుకుతోంది: సీఎం వైఎస్ జగన్
-
సామాజిక న్యాయాన్ని గెలిపిద్దాం: సీఎం జగన్
సాక్షి, మంగళగిరి: సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులంతా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని, ఓటేయాలని సీఎం జగన్ కోరారు. ‘‘రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది. మొదటి నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తూ వస్తోంది. కాబట్టి, సహృదయంతో పార్టీ నిర్ణయాన్ని బలపర్చాల’ని పార్టీ ప్రతినిధులను సీఎం జగన్ కోరారు. అంతేకాదు ఒక్క ఓటు కూడా వృథా కాకూడదని, జులై 18న మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తామని, మాక్‌పోలింగ్‌లో పాల్గొన్న తర్వాతే ఓటింగ్‌కు వెళ్లాలని సభ్యులకు సూచించారు. ఎంపీల తరపున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు బాధ్యతలు తీసుకుంటారని, అలాగే విప్‌లు, మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను ముర్ముకు పరిచయం చేశారు సీఎం జగన్. -
వీడిన ఉత్కంఠ.. ద్రౌపది ముర్ముకే సపోర్ట్
ముంబై: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన మద్దతుపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. బీజేపీ-ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ప్రకటించేసింది. నిన్న(సోమవారం) ఎంపీలతో జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు మెజార్టీ సభ్యులు ముర్మువైపే మొగ్గుచూపినట్లు సమాచారం. దీంతో అధిష్టానం సైతం ఆ దిశగా సానుకూలత చూపిస్తోంది. మహారాష్ట్ర జనాభాలో పది శాతం ఎస్టీ జనాభా ఉంది. ఈ తరుణంలో.. గిరిజన కమ్యూనిటీకి చెందిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని సేన ఎంపీలు.. శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేపై ఒత్తిడి తెచ్చారు. మొత్తం 22 ఎంపీలకుగానూ 16 మంది(ఇద్దరు షిండే గూటిలో ఉన్నారు) ముర్ముకే మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. దీంతో శివసేన రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో దాదాపుగా ఒక స్పష్టత వచ్చినట్లయ్యింది. మరోవైపు ఈ మధ్యాహ్నాం సంజయ్ రౌత్.. రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలోనూ ఒక స్పష్టత ఇచ్చేశారు. సోమవారం ఎంపీల సమావేశంలో ద్రౌపది ముర్ము మద్దతు అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే.. ముర్ముకు మద్దతు ఇచ్చినంత మాత్రానా బీజేపీకి సపోర్ట్ చేసినట్లు కాదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం బలంగా ఉండాలన్నది మా ఉద్దేశం. యశ్వంత్ సిన్హా విషయంలోనూ శివ సేన సానుకూలంగానే ఉంది. గతంలో ఎన్డీయే అభ్యర్థికి కాకుండా.. ప్రతిభా పాటిల్‌కు మద్దతు ఇచ్చాం. ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతు ఇచ్చాం. ఒత్తిడిలో శివసేన ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. శివసేన ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటుంది. అంటూ సంజయ్ మాట్లాడారు. సంకుచిత స్వభావం కాదు.. ఉద్దవ్‌థాక్రే శివసేనది సంకుచిత స్వభావం కాదని, తనపై ఎవరి ఒత్తిడి ఉండదని.. ఉండబోదని శివసేన చీఫ్ ఉద్దవ్ ధాక్రే స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముకు తాము మద్దతు ప్రకటిస్తామని స్వయంగా వెల్లడించిన ఆయన.. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఆమెను బలపర్చకూడదు. కానీ, మేమంతా సంకుచిత స్వభావం ఉన్నవాళ్లం కాదు. అందుకే గిరిజన మహిళకు మద్దతు ప్రకటిస్తున్నాం అని ఉద్దవ్ థాక్రే తెలిపారు. ఇక రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన.. రాజకీయాలు పట్టించుకోదని, గతంలో మాదిరే ఇప్పుడు గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చి తీరుతుందని ఎంపీ గజానన్ కిరీట్కర్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమయంలో మల్లగుల్లాలు పడుతుంటే.. పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంది శివసేన. అందుకే కీలక సమావేశాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఎవరికి మద్దతు ఇస్తుందా? అనే ఆసక్తికర చర్చ నడుస్తూ వచ్చింది. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలు.. చంద్రబాబు ఎక్కడ?? -
ఉద్దవ్ థాక్రే నెత్తిన పిడుగు.. సేన ఎంపీల అల్టిమేటం!
ముంబై: శివ సేన ఎంపీలు తమ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రేకు అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. బీజేపీ-ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్ధతు ప్రకటించాలంటూ శివ సేన లోక్‌సభ ఎంపీలు ముక్తకంఠంతో పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ముంబైలో ఇవాళ(సోమవారం) జరిగిన కీలక సమావేశంలో వాళ్లు పార్టీ వ్యతిరేక గళం వినిపించినట్లు సమాచారం. భేటీ అనంతరం సేన ఎంపీ గజానన్ కిరీట్కర్ మాట్లాడుతూ.. ముర్ము గిరిజన మహిళ అయినందున ఆమెనే బలపర్చాలని, ఓటేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే వాళ్ల నిర్ణయానికి అధిష్టానం ఎలా స్పందించిందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. శివ సేనకు 18 మంది లోక్‌సభ ఎంపీలు ఉండగా.. మీటింగ్‌కు పదమూడు మంది హాజరైనట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు ఎంపీలు సంజయ్ జాదవ్, సంజయ్ మాండలిక్, హేమంత్ పాటిల్‌కు భేటీకి హాజరుకాకపోయినా.. ద్రౌపది ముర్ముకే మద్ధతు ప్రకటిస్తామని తెలిపినట్లు గజానన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. శివసేనకు మహారాష్ట్ర నుంచి 18 మంది లోక్‌సభ ఎంపీలు ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతాల తరపున ఎంపీ కాలాబెన్ డేల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీలలో ఇద్దరు రెబల్స్ ఉండగా.. భావనా గవాలి, శ్రీకాంత్ షిండే(సీఎం ఏక్నాథ్ షిండే తనయుడు) భేటీకి దూరంగా ఉన్నారు. భేటీ జరిగింది, కానీ.. అయితే శివ సేన ఎంపీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తున్న విషయంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మరోలా స్పందించారు. మాతోశ్రీలో లోక్‌సభ ఎంపీల భేటీ జరిగిందని, 15 మంది హాజరయ్యారని చెప్తున్నారు. అయితే భేటీలో ఏం చర్చించారనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో భేటీలు ఉద్దవ్ థాక్రేకు అల్టిమేటం జారీ చేశారని, కుదరకపోతే.. ఎంపీలు సైతం షిండే గూటికి తరలిపోయే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది. చదవండి: ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి.. ఎంపీల జంప్? -
‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్‌కి డబుల్ షాక్
లక్నో: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తర ప్రదేశ్ రాజకీయం మరింత మలుపులు తిరుగుతోంది. సీఎం యోగి రాయబారంతో ప్రతిపక్ష కూటమిలో మనస్పర్థలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, ఎస్సీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఝలక్ తగిలింది. ఇచ్చింది ఎవరో కాదు.. ఆయన సొంత బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని కాదని.. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు శివపాల్ యాదవ్. శివపాల్ యాదవ్‌తో పాటు ఎస్సీ కూటమి పార్టీ సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్.. శుక్రవారం రాత్రి సీఎం యోగి ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు ఇద్దరూ. ‘‘సమాజ్‌వాదీ పార్టీ నన్నేం పిలవలేదు. తాము మద్దతు ఇచ్చే అభ్యర్థికి ఓటేయమనీ అడగలేదు. సీఎం యోగి ఆదిత్యానాథ్ నన్ను ఆహ్వానించి.. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని అడిగారు. అందుకే అంగీకరించాం’’ అని బాబాయ్-అబ్బాయ్ మధ్య నెలకొన్న గ్యాప్‌ను మరోసారి బయటపెట్టారు శివపాల్ యాదవ్. అఖిలేష్‌కు సరైన రాజకీయ పరిణితి లేకపోవడం వల్లే.. తనను కీలక సమావేశాలకు ఆహ్వానించడం లేదని, అందుకే కూటమిలోని పార్టీలు తలోదారి చూసుకుంటున్నాయని శివపాల్ యాదవ్ మండిపడ్డారు. అఖిలేష్ గనుక నా సలహాలు గనుక పాటించి ఉంటే.. ఎస్పీ పరిస్థితి యూపీలో ఇవాళ మరోలా ఉండేదన్నారు ఆయన. ఇక ద్రౌపది ముర్ముకు మద్ధతు విషయంపై రాజ్‌భర్ కూడా స్పందించారు. ఎస్పీతో కూటమిలోనే తాము కొనసాగుతామని, ఒకవేళ అఖిలేష్ గనుక బలవంతంగా వెళ్లిపొమ్మంటే బయటకు వచ్చేస్తామని ప్రకటించారాయన. ముర్ముకు మద్దతు విషయం పూర్తిగా తన సొంత నిర్ణయమని పేర్కొన్నారాయన. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించే విషయమై.. గురువారం అఖిలేష్ నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ.. కూటమి పార్టీలతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ప్రగతీశీల్ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా అధ్యక్షుడు శివపాల్ యాదవ్‌తో పాటు ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కు సైతం ఆహ్వానం అందలేదు. ఈ క్రమంలోనే ఆగ్రహం, అసంతృప్తితో రగిలిపోతున్న ఈ ఇద్దరికీ ఆహ్వానం పంపి.. తమవైపు తిప్పుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. ఇదిలా ఉంటే.. అఖిలేష్ యాదవ్ సొంత బాబాయ్ అయిన శివపాల్ యాదవ్.. 2012-17 అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్న టైంలో ‘నెంబర్ టూ’గా కొనసాగారు. 2018లో అఖిలేష్‌తో పొసగక బయటకు వచ్చి ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా పేరిట కొత్త పార్టీ పెట్టారు. అయితే.. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి అబ్బాయితో కలిసి చేతులు కలిపారాయన. ఆ ఎన్నికల్లో.. జశ్వంత్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు శివపాల్ యాదవ్. అయితే ఆయన నెగ్గింది మాత్రం సమాజ్‌వాదీ పార్టీ గుర్తు మీదే కావడం గమనార్హం. మరోవైపు ఓంప్రకాశ్ రాజ్‌భర్ ఎస్బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లు నెగ్గింది. కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తి లేదంటూనే.. అఖిలేష్‌పై ఓంప్రకాశ్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో అఖిలేష్‌యాదవ్‌కు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు ఓంప్రకాశ్. 2012 సమయంలో అఖిలేష్ ముఖ్యమంత్రి అయ్యింది కూడా కేవలం తండ్రి ములాయం వల్లేనని, అఖిలేష్ నిజానికి అంత అర్హత ఉన్నోడు కాదంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు ఓంప్రకాశ్. -
ఇది రెండు భావజాలాల మధ్య పోరు
సాక్షి, హైదరాబాద్: ‘భారతదేశం పతనం బాటలో సాగుతోంది. ఈ పతనం మన కళ్లముందే జరుగుతోంది. ప్రస్తుతం జరిగే రాష్ట్రపతి ఎన్నిక రెండు భావజాలాల మధ్య జరిగే యుద్ధం. రాష్ట్రపతి ఎన్నికను పక్కన పెడితే దేశాన్ని నాశనం కానిద్దామా?’అని రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో శనివారం జరిగిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘర్షణ వాతావరణంపైనే ప్రధానికి విశ్వాసం ‘ప్రధానిపై వ్యక్తిగత ద్వేషం లేదు. నామినేషన్ తర్వాత ఫోన్ చేసి, మెసేజ్ పంపినా నేటికీ స్పందన లేదు. ఇది దేశ ప్రధానికి గౌరవాన్ని ఇచ్చే సంప్రదాయం ఎంత మాత్రమూ కాదు. ఈ ఎన్నిక చాలా అసాధారణ పరిస్థితుల్లో జరుగుతోంది. ఆదివాసీ మహిళ పోటీ చేస్తున్న సందర్భంలో ఏకాభిప్రాయ సాధన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రులు, విపక్ష నేతలతో మాట్లాడాల్సిన ప్రధాని అ దిశగా చొరవ తీసుకోవడం లేదు. ఎందుకంటే ప్రధానికి ఏకాభిప్రాయ సాధనకంటే ఘర్షణ వాతావరణంపైనే ఎక్కువ విశ్వాసం ఉంది. ఇతరులను అవమానించడం ఆయనకు అలవాటుగా మారింది. ఆయన డిక్షనరీలో ఏకాభిప్రాయమనే పదమే లేదు. దేశంలో రెండో పక్షంలో ఉన్నవారికి గౌరవం ఉండదా? అందుకే రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరి వ్యక్తుల నడుమ కొట్లాట కాదు.. రెండు భావజాలాల నడుమ జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధాన్ని మీ సహకారంతో చేస్తున్నా. యుద్ధానికి వెళ్లినపుడు ఎంత పెద్ద కత్తి ఉంది, ఎంత పెద్ద సైన్యం ఉందనేది చూడకుండా మన వద్ద ఉన్న ఆయుధంతో పోరాడుతాం. మన దేశంలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది..’అని సిన్హా చెప్పారు. పోరాటం కొనసాగుతుంది.. ‘ఆల్ట్ న్యూస్ జుబేర్‌ను వైషమ్యాలు పెంచుతున్నారని జైలులో పెట్టారు. కానీ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై చట్టబద్ధవిచారణేదీ మొదలవలేదు. దీనిపై ప్రధాని మౌనం పాటిస్తున్నారు. మన్ కీ బాత్ అంటూ ప్రసంగాలు చేసే ప్రధాని ఎనిమిదేళ్లలో ఒక్క మీడియా సమావేశంలోనూ మాట్లాడలేదు. అంటే ఒక్కడు మాట్లాడితే 140 కోట్ల భారతీయులు వినాలా? దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ప్రజా ఉద్యమంగా మారుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఫలితం ఏదైనా చింత లేదు. ఈ పోరాటం ఎన్నిక తర్వాత కూడా కొనసాగుతుంది..’అని తెలిపారు. తెలంగాణలో అద్భుతాలు ‘సీఎం కేసీఆర్‌తో కలిసి దేశవ్యాప్త పోరాటానికి సిద్ధం. ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్‌తో కలిసి మాట్లాడి పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో చర్చిస్తాం. 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణను సాధించి తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ తక్కువ సమయంలో అద్భుతాలు చేసి చూపించారు. కేవలం ఒక్కడిగానే పోరాడి కేసీఆర్ తెలంగాణ సాధించారు. దేశం నాశనం కాకుండా జరుగుతున్న పోరాటం హైదరాబాద్ నుంచే ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టాక రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తా. దేశంలో చర్చలు జరగకపోవడం దురదృష్టకరం. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినా ఎన్నడూ విపక్షాలు, రాజకీయ శత్రువుల అణచివేతకు ఈడీ వంటి సంస్థలను ఉపయోగించాలనే కనీస ఆలోచన కూడా రాలేదు. ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచేందుకు రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాడుతాం..’అని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. -
యశ్వంత్ గెలుస్తారనే ఆశాభావం ఉంది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతిగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హా గొప్ప వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. శనివారం జలవిహార్‌లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున హైదరాబాద్‌కు స్వాగతం. భారత రాజకీయాల్లో యశ్వంత్‌సిన్హా గొప్ప వ్యక్తి. న్యాయవాదిగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టి.. అధికారిగా ఆపై రాజకీయ వేత్తగా ఎదిగారు. అధికారిగా, రాజనీతిజ్ఞుడిగా తనను తాను నిరూపించుకున్నారు. తన పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే.. పార్లమెంటేరియన్లంతా ఆత్మ ప్రభోదానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ లాంటి మంచి నేతను ఎన్నుకోవడం అదృష్టం. సమున్నత వ్యక్తిత్వం ఉన్న యశ్వంత్ సిన్హా గెలుస్తారనే నమ్మకం ఉంది. ఆయన గెలవాలని మనసారా కోరుకుంటున్నట్లు.. తద్వారా దేశ గౌరవం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. మోదీపై విసుర్లు ప్రధాని మోదీ రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ఉండబోతున్నారు. రేపు ఆయన సభలో మా గురించి బాగా మాట్లాడబోతున్నారు. విపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలు చేయబోతున్నారు. మోదీ తనను తాను అత్యంత మేధావిగా భావిస్తారు. ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు మాట్లాడతారు. రేపు మోదీ తన ప్రసంగంతో నన్ను చీల్చి చెండాడబోతున్నారు. వ్యక్తిగతంగా ఆయనతో నాకు విబేధాలు లేవు. మీలో ప్రవహించే రక్తంలో కొంతైనా నిజాయితీ ఉంటే.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేరిందా? రైతులు, ఉగ్రవాదులు, వేర్పాటు వాదులుగా కనిపిస్తున్నారా?. రైతులను ఉగ్రవాదులు, ఖలీస్థానీలు అన్నారు. రైతు చట్టాలు సరైనవే అయినప్పుడు వెనక్కి ఎందుకు తీసుకున్నారు?. రైతుల ఆదాయం రెట్టింపు అన్నారు.. అది జరగలేదు. పెట్టుబడులు పెరిగిపోయాయి. దేశం ముందు మీరు(ప్రధాని మోదీని ఉద్దేశించి..) తలదించుకున్నారు. దేశ ప్రజలను తల దించుకునేలా చేశారు. మీ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు ఇలా.. ఏ వర్గం సంతోషంగా లేదు. ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. శ్రీలంకకు వెళ్లినప్పుడు.. ప్రధానిలా కాకుండా సేల్స్‌మ్యాన్‌లా వ్యవహరించారు. మీరు దోషి కాకుంటే రేపటి సభలో సమాధానం ఇవ్వండి. మీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. దేశం నుంచి పెద్ద కంపెనీలు వెళ్లిపోతున్నాయి. మేం మౌనంగా ఉండం.. పోరాటాలు చేస్తాం. ప్రసంగాలు కాదు.. మేం అడిగేవాటికి సమాధానం ఇవ్వాలని సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. -
హైదరాబాద్‌కు యశ్వంత్‌సిన్హా.. ర్యాలీలో సీఎం కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు ఇవాళ నగరం వేదిక అయ్యింది. ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ రాక నేపథ్యంలో.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సైతం నగరంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ సైతం ఈ ప్రచారంలో పాల్గొనడం విశేషం. శనివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్‌సిన్హాకు ఘన స్వాగతం లభించింది. సీఎం కేసీఆర్, మంత్రులు స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జలవిహార్ వరకు జరిగే ర్యాలీలో సిన్హాతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జలవిహార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు గత ఆరునెలలో మూడు సార్లు వచ్చారు. ఏ సందర్భంలోనూ ప్రొటోకాల్ ప్రకారం.. సీఎం కేసీఆర్ ప్రధానికి ఆహ్వానం పలకలేదు. ఈ తరుణంలో.. యశ్వంత్ సిన్హాకు మద్ధతు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆయన వెంట వందల మంది కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో పాల్గొంటుడడం, ప్రచారసభలో ప్రసంగిస్తుండడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లకు దీటుగా నగరం మొత్తం టీఆర్ఎస్ సైతం పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. దీనిపై రగడ నడుస్తోండగా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం టీఆర్ఎస్పై మండిపడ్డారు. Hyderabad | CM's son cannot become CM. BJP is getting stronger, they (TRS) are scared that their chair will go. They're misusing public money to advertise against us. KCR is indulging in digressed politics in Telangana: Union Minister, G Kishan Reddy pic.twitter.com/7zZjCDaNTl — ANI (@ANI) July 2, 2022 -
రాష్ట్రపతి ఎన్నికకు ద్రౌపది ముర్ము నామినేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేబినెట్ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ నామినేషన్ పత్రాలను అందజేశారామె. ద్రౌపది ముర్ము నామినేషన్‌ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీల నేతల సంతకాలతో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు ద్రౌపది ముర్ము దాఖలు చేశారు. అంతకుముందు ఆమె పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. ద్రౌపది వెంట.. బీజేపీతో పాటు మద్ధతు ప్రకటించిన పార్టీల ప్రతినిధులు సైతం ఉన్నారు. ఒడిషాకు చెందిన ముర్ముకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం.. రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. బీజేపీ-బీజేపీ కూటమి ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పని చేశారు. 2007లో బెస్ట్ ఎమ్మెల్యేగా ఒడిషా అసెంబ్లీ నుంచి నీలకంఠ్ అవార్డు అందుకున్నారామె. జార్ఖండ్‌కు తొలి గిరిజన మహిళా గవర్నర్‌గానూ పని చేశారు. #WATCH NDA's Presidential candidate Droupadi Murmu files her nomination today in the presence of PM Modi, Union cabinet ministers & CMs of BJP & NDA-ruled states pic.twitter.com/ennt3naoCB — ANI (@ANI) June 24, 2022 -
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
-
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు..??
-
రాష్ట్రపతి ఎన్నికలు: వెంకయ్యనాయుడితో నడ్డా, షా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: అధికార పక్షం తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారనే చర్చ జోరందుకుంది. ఈ తరుణంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో జేపీ నడ్డా, అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం వెంకయ్యనాయుడుని కలిసి.. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు. ఈ తరుణంలో.. రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడును నిలబెడతారా? అనే చర్చ మొదలైంది. గతంలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన వాళ్లు.. రాష్ట్రపతిగానూ పదోన్నతి పొందిన దాఖలాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతులుగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వి.వి. గిరి, ఆర్. వెంకట్రామన్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్ నారాయణన్‌లు రాష్ట్రపతులయ్యారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ల పర్వం మొదలై.. వారం గడుస్తున్నా ఇటు ఎన్డీయే, అటు విపక్షాల కూటమి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. విపక్షాలు మరోసారి భేటీ కానున్న తరుణంలో.. బీజేపీ కమిటీ మాత్రం అభ్యర్థి ఎవరనేది కనీసం హింట్ కూడా ఇవ్వలేదు. మంగళవారం రాత్రి 7 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో.. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయొచ్చని భావిస్తున్నారు. ఇక విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా పేరు తెర మీదకు వచ్చింది. అయితే అందరి ఆమోదయోగ్యమైన పేరును ప్రకటిస్తామని సీపీఐ నేత డి రాజా చెప్తున్నారు. జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. -
రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాల అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో విపక్షాలు తడబడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ముగ్గురుకి ముగ్గురు ప్రతిపాదిత అభ్యర్థులు.. రేసు నుంచి తప్పుకున్నారు. ఈ తరుణంలో అభ్యర్థి ఎవరన్నదానిపై ఇవాళ(మంగళవారం) సాయంత్రం లోగా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో అభ్యర్థి రేసులో మరొక పేరు తెరపైకి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ ప్రస్తుత నేత, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా.. పార్టీకి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ఉదయం ట్విటర్ వేదికగా ప్రకటించారు. టీఎంసీలో మమతాగారు(మమతా బెనర్జీని ఉద్దేశించి..) నాకు అందించిన గౌరవం, ప్రతిష్టకు నేను కృతజ్ఞుడిని. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం నేను విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుండి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. ఆమె నా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు ఆయన. ఇదిలా ఉండగా.. యశ్వంత్ సిన్హా ట్వీట్‌తో ఆయన రాష్ట్రపతి రేసులో నిలవడం దాదాపు ఖాయమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఎన్డీయే తరపు అభ్యర్థి విషయంలోనూ ఇవాళ ప్రధాని మోదీ భేటీ తర్వాత ఒక స్పష్టత రావొచ్చు. I am grateful to Mamataji for the honour and prestige she bestowed on me in the TMC. Now a time has come when for a larger national cause I must step aside from the party to work for greater opposition unity. I am sure she approves of the step. — Yashwant Sinha (@YashwantSinha) June 21, 2022 బీహార్, పాట్నాలో పుట్టిపెరిగిన యశ్వంత్ సిన్హా.. ఐఏఎస్ అధికారి. ఆపై దౌత్య వేత్తగానూ తరపున పని చేశారు. సర్వీస్సులో ఉండగానే రాజీనామా చేసిన ఆయన 1984లో జనతా పార్టీలో చేరారు. నాలుగేళ్లకు రాజ్యసభకు వెళ్లారు. జనతా దళ్ ప్రభుత్వంలో.. పార్టీ జనరల్ సెక్రటరీగా పని చేశారు. ఆపై చంద్రశేఖర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఏడాది పాటు పని చేశారు. 1996లో బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేసిన యశ్వంత్ సిన్హా.. 22 ఏళ్ల పాటు బీజేపీలోనే కొనసాగారు. లోక్‌సభ ఎంపీగా, పార్టీ కీలక ప్రతినిధిగా, ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో బీజేపీ పాలనను బహిరంగంగానే విమర్శిస్తూ పార్టీని వీడి.. కిందటి ఏడాది టీఎంసీలో చేరారు. -
ఆభ్యర్ధి కోసం అన్వేషణ
-
రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు భారీ ఝలక్!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కోసం అభ్యర్థి ఎంపిక కసరత్తులో ఉన్న విపక్షాలకు భారీ ఝలక్ తగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా(84) రేసు నుంచి తప్పుకున్నారు. తాను వైదొలుగుతుండడంపై శనివారం మధ్యాహ్నాం స్వయంగా ఆయన ప్రకటించడం విశేషం. ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనుకున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ప్రతిపక్షాలకు మరో షాక్ తగిలింది. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా సైతం రేసు నుంచి తప్పుకున్నారు. ‘‘జమ్ము కశ్మీర్ ఒక క్లిష్టమైన ఘట్టం గుండా వెళుతోంది. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. నా సేవలు స్వరాష్ట్రానికి అవసరం అని భావిస్తున్నా. అందుకే రాష్ట్రపతి రేసు నుంచి మర్యాదపూర్వకంగా వైదొలుగుతున్నా’’ అని తెలిపారాయన. జమ్ము రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే దేశ సేవలో సానుకూల సహకారం అందించడానికి సిద్ధంగానే ఉన్నా అంటూ ప్రకటించారు ఫరూఖ్ అబ్దుల్లా. I withdraw my name from consideration as a possible joint opposition candidate for the President of India. I believe that Jammu & Kashmir is passing through a critical juncture & my efforts are required to help navigate these uncertain times: NC chief Farooq Abdullah (File pic) pic.twitter.com/yPyJNqmi1P — ANI (@ANI) June 18, 2022 అంతేకాదు.. తన పేరును రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాల ఉమ్మడి ప్రతిపాదన చేసిన మమతా బెనర్జీకి, ఆ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చిన విపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారాయన. రేసు నుంచి వైదొలిగినా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారాయన. ఇదిలా ఉంటే.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం జూన్ 15వ తేదీన మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు సమావేశం అయ్యాయి. అయితే శరద్ పవార్ ఆసక్తి చూపించకపోవడంతో.. రేసులో ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను పరిశీలనలో ఉంచాయి. జూన్ 21న మరోసారి భేటీ అయ్యి.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఓ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. లిస్ట్‌లో ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా తప్పుకోవడం గమనార్హం. ఇక విపక్షాల జాబితాలో మిగిలింది గోపాలకృష్ణ గాంధీ పేరు మాత్రమే. చదవండి: మరీ ఇంత నిర్లక్ష్యమా? విపక్షాలపై సేన విసుర్లు -
ముగిసిన విపక్షాల భేటీ.. ఉమ్మడి అభ్యర్థిపై ఏకగ్రీవ తీర్మానం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో విపక్షాలు ఓ కీలక నిర్ణయానికి వచ్చాయి. పార్టీలకతీతంగా ఒక్కరిని మాత్రమే రాష్ట్రపతి రేసులో నిలబెట్టాలని విపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఈ మేరకు.. ఢిల్లీ కానిస్టిట్యూట్ క్లబ్లో భేటీ అనంతరం విపక్ష నేతలు ప్రకటించారు. అభ్యర్థి పేరు విషయంలో ఖరారు కోసం 21న మళ్లీ సమావేశం కానున్నాయి విపక్షాలు. ప్రజాస్వామ్యానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న నష్టం నుంచి గట్టెక్కించేందుకు ఓ అభ్యర్థి కావాలి అని సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. శరద్ పవార్ రేసులో ఆసక్తి చూపించకపోవడంతో.. ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు గోపాలకృష్ణ్ గాంధీ పేర్లను పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. ► విపక్షాల సమావేశం ముగిసింది. ఈ భేటీలో ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని తీర్మానించాము. కొన్ని పార్టీల నేతలు బిజీగా ఉండటం వల్ల భేటీలో పాల్గొనలేదు. శరద్ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా అంతా ప్రతిపాదించాం. కానీ, ఆయన దీన్ని తిరస్కరించారు. దేశంలో పేరుకుపోయిన బుల్డోజర్ రాజకీయాలను అడ్డుకునేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలి. రాష్ట్రపతి అభ్యర్థి కోసం సంప్రదింపులు కొనసాగిస్తాం- మమతా బెనర్జీ ► విపక్షాల భేటీలో.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎవరి పేరును ప్రతిపాదించలేదని సమాచారం. ► మహారాష్ట్ర నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని సున్నితంగా తిరస్కరించారు. విపక్షాల భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిగా మమతా బెనర్జీ, పవార్ పేరును ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. 81 ఏళ్ల వయసున్న శరద్‌పవార్.. తానింకా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నానని, ఆరోగ్య కారణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని విపక్ష భేటీలో చెప్పినట్లు తెలుస్తోంది. తొలుత.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి శరద్ పవార్ అంటూ కథనాలు వినిపించాయి. అయితే ఆయన ఆ ప్రచారాన్ని తిప్పికొట్టినట్లు ప్రతికథనాలు వచ్చినా.. ఇప్పుడు విపక్షాల భేటీలో అది అధికారికంగా స్పష్టం అయ్యింది. ► రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో.. విపక్ష నేతలతో దీదీ నిర్వహిస్తున్నారు భేటీకి ఎంఐఎంకు ఆహ్వానం అందలేదు. దీనిపై ఒవైసీ స్పందించారు. ఒకవేళ ఆహ్వానం ఇచ్చినా.. ఆ భేటీకి వెళ్లేవాడిని కాదని చెప్పారాయన. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కారణం. కాంగ్రెస్‌ను ఆహ్వానించారు కాబట్టే.. ఆ భేటీకి రామని చెప్పేవాళ్లం. మమతా పార్టీ టీఎంసీ ఇంతకు ముందు తమ పార్టీ(ఎంఐఎం) గురించి చాలా దారుణంగా మాట్లాడిందని... అలాంటప్పుడు ఆమె నిర్వహించే భేటీకి ఎలా హాజరవుతామని ఒవైసీ అన్నారు. ► రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. Delhi | Leaders of 17 parties- TMC, Congress, CPI, CPI(M), CPIML, RSP, Shiv Sena, NCP, RJD, SP, National Conference, PDP, JD(S), DMK, RLD, IUML and JMM - are participating in the Opposition leaders' meeting called by Mamata Banerjee ahead of Presidential election. pic.twitter.com/gSuvbE5ukz — ANI (@ANI) June 15, 2022 ► కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఎం-ఎల్, ఆర్ఎస్పీ, శివ సేన, ఎన్సీపీ, ఆర్జేడీ, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీ(ఎస్), డీఎంకే, ఆర్ఎల్డీ, ఐయూఎంఎల్, జేఎంఎం.. ప్రతినిధులు హాజరయ్యారు. #WATCH Opposition leaders' meeting called by TMC leader & West Bengal CM Mamata Banerjee ahead of Presidential poll, underway at Constitution Club of India in Delhi pic.twitter.com/BJjzUaIbig — ANI (@ANI) June 15, 2022 ► రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, దేశంలోని పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఐక్యంగా ఎదుర్కొనే అంశాలపై చర్చిస్తున్నాయి విపక్షాలు. ► రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున అభ్యర్థిని నిలబెట్టేందుకు టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాల సమావేశం జరుగుతోంది. ► ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో విపక్షాల భేటీ జరుగుతోంది. ► ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరుకాకపోవడం గమనార్హం. ► భేటీకి కాంగ్రెస్ తరుపున ఖర్గే, జైరాం రమేష్, అఖిలేష్ యాదవ్, సూర్జేవాలే, శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు. ► శివసేన నుంచి ఎంపీ ప్రియాంక చతుర్వేది, సీపీఐ నుంచి డి. రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, సీపీఎం నుంచి ఎలమరం కరీం హాజరయ్యారు. ► క్లబ్ బయటకు వచ్చి మరీ విపక్షాల నేతలను రిసీవ్ చేసుకున్నారు మమతా బెనర్జీ. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా మొత్తం 19 మందికి ఆహ్వానం పంపారు దీదీ. ► మమతా బెనర్జీ నేతృత్వంలో వివపక్షాల సమావేశానికి.. కాంగ్రెస్‌తో కలిసి కూర్చోలేమంటూ టీఆర్ఎస్ ఈ భేటీకి దూరం కాగా, ఆప్, అకాళీదళ్, బీజేడీ సైతం మమతా బెనర్జీ విపక్షాల భేటీకి గైర్హాజరు అయ్యాయి. Delhi | Opposition leaders' meeting called by TMC leader & West Bengal CM Mamata Banerjee ahead of Presidential poll, set to get underway at Constitution Club of India pic.twitter.com/WXQY3NbFWs — ANI (@ANI) June 15, 2022 -
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గాంధీ మనవడు!
-
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గాంధీ మనవడు!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెర మీదకు గోపాల్‌కృష్ణ గాంధీ పేరు వినిపిస్తోంది. మహాత్మా గాంధీ, సీ రాజగోపాలచారిల మనవడైన గోపాల్‌కృష్ణ గాంధీ.. పోటీలో నిలపాలనే ప్రతిపాదనను వామపక్ష పార్టీలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఆయన కొంత సమయం కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐఏఎస్, మాజీ దౌత్యవేత్త అయిన గోపాల్‌కృష్ణ గాంధీ.. గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పని చేశారు. 2017లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్ గాంధీ పోటీ చేశారు కూడా. అయితే ఆ సమయంలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు. ఇదిలా ఉంటే.. బుధవారం జరగబోయే విపక్షాల భేటీతో రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించబోయే ఈ భేటీకి దూరం జరిగాయి నాలుగు పార్టీలు. టీఆర్ఎస్, ఆప్, బీజేడీ, అకాలీదళ్ గైర్హాజరు కానున్నాయి. భేటీలో కాంగ్రెస్ ఉన్నందునా తాము భేటీకి దూరంగా ఉంటామని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలు.. విపక్షాలకు సీనియర్ నేత షాక్ -
పవార్‌ను కలిసిన దీదీ.. విపక్షాల భేటీపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. బుధవారం నిర్వహించబోయే వివక్షాల సమావేశం, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఆమె పవార్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల రేసులో విపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలిపే ప్రయత్నంలో భాగంగా ఆమె భేటీ నిర్వహించనున్నారు. బుధవారం నిర్వహించబోయే ఈ విపక్షాల సమావేశానికి 22 మంది నేతలను ఆహ్వానించారు సీఎం మమతా బెనర్జీ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌థాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌లకు ఆహ్వానం పంపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సైతం ఆహ్వానం పంపారు దీదీ. ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేష్, రణదీప్ సింగ్ సుర్జీవాలే భేటీకి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యమయ్యాయనే.. సంకేతాన్నిపార్టీలు చూపిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రేపటి భేటీకి ఎవరెవరు హాజరవుతారనే చర్చ జోరుగా నడుస్తోంది. చదవండి: విపక్షాలకు శరద్ పవార్ షాక్ -
ఏం చేద్దాం: పీకేతో సీఎం కేసీఆర్ చర్చలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాలు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏం చేయాలనే అంశాలపై ప్రధానంగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు అంశాలపై ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గత రెండు రోజలుగా ఎన్నికల వ్యూహకర్త పీకేతో వరుసగా చర్చిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికల ఎజెండాగా మమతా బెనర్జీ పిలుపు ఇచ్చిన భేటీకి వెళ్లే విషయంపైనా పీకే నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడమే టార్గెట్.. మమతా బెనర్జీ విపక్షాల తరపున అభ్యర్థి ఎంపికకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 22 విపక్షాలకు 15న ఢిల్లీలో మమత ఆహ్వానం పంపారు. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర కీలకం అని పీకే వెల్లడించారట. రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాల అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ పాత్ర పై చర్చ వీరిరువురి నడుమ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉన్న పీకే.. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో వరుస భేటీలు జరుపుతున్నారు. -
కేసీఆర్‌కు దమ్ముంటే రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో కొట్లాడుతు న్న ట్టు డ్రామా ఆడుతున్న సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. అప్పుడే మోదీ తో యుద్ధం చేస్తున్నట్టు ప్రజలు విశ్వసిస్తా రని అన్నారు. అలా కాకుండా ఎన్నికలు బహిష్కరించినా, ఓటింగ్‌కు దూరంగా ఉన్నా.. అది బీజేపీకి అనుకూలమే అని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ వ్యాఖ్యలపై ప్రెస్మీట్లు పెట్టి స్పం దించిన కేసీఆర్.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నగరానికి వచ్చి చేసిన కామెంట్లను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ స్థాయి సంజయ్ లెవ ల్లోనే ఉందని, మోదీ, అమిత్ షాకు కౌంటర్ ఇచ్చేంత సీన్ లేదని విమర్శించారు. రేవంత్ గురువారం గాంధీ భవన్లో మీడియా ప్రతిని«ధులతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది టీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉన్నాయని, వాళ్లది అత్తాకోడళ్ల పంచాయితీ లాంటిదని రేవంత్ పేర్కొన్నారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచుతున్నాడని కేసీఆర్‌ను విమర్శిస్తున్న బీజేపీ.. మళ్లీ మొన్న రూ.4 వేల కోట్ల మేర అప్పు ఎందుకు ఇప్పించిందో వెల్లడిం చా లని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహి స్తున్న ప్రజా దర్బార్ మంచిదేనని, అయితే గవర్నర్ రూల్ పెడితే ఇంకా మంచిదని వ్యాఖ్యానించారు. చురుకైన ప్రభుత్వం లేనప్పుడు ప్రజా సమస్యలను గవర్నర్ పరిష్కరించడంలో తప్పులేదన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను తొలగించాలి జూబ్లీహిల్స్ పబ్ కేసులో వక్ఫ్‌బోర్డు చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని రేవంత్ డిమాండ్ చేశారు. అధికారిక వాహనాల్లో రేప్‌లు జరుగుతుంటే సీఎం ఎక్కడ ఉన్నా రని ప్రశ్నించారు. కేసీఆర్, ఎంఐఎం ప్రభు త్వంలోనే కాకుండా అత్యాచారాలు, నేరా ల్లోనూ మిత్రపక్షాలే అని విమర్శించారు. శాంతిభద్రతలు దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పుడు విభజన చట్టంలోని సెక్షన్ 8ను ఉపయోగించుకునేందుకు గవర్నర్‌కు అధికారాలున్నాయని చెప్పారు. తాను లేకుండానే జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ చింతన్ శిబిర్‌పై మాట్లాడుతూ.. కాంగ్రెస్ వ్యవస్థా గతంగా నిర్వహించే కార్యక్రమాలు వ్యక్తులు న్నా, లేకున్నా ఆగవని, సమయం ప్రకారం జరుగుతుంటాయని స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌కు వస్తా రాష్ట్రంలో శాంతిభద్రతలపై చర్చించడానికి తాను ప్రగతిభవన్‌కు వస్తానని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో శాంతిభద్రతలు ఇంకా దిగజారకుండా, మరొకరు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని, దీనిపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. దుష్ట సంస్కృతితో భయాందోళనలు ‘హైదరాబాద్‌లో పబ్, క్లబ్, డ్రగ్స్ వాడ కం వంటి దుష్ట సంస్కృతి తీవ్ర భ యాందోళనలను కలిగిస్తోంది. ముఖ్యం గా ఆడపిల్లల తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ బతకడం మనం పోరాడి సాధించుకున్న తెలంగాణకు అవమానకరం కాదా..? డ్రగ్స్, పబ్స్, క్లబ్స్ మీద, వాటి నిర్వాహకులపై ఎందుకు కఠినంగా వ్యవహరిస్తలేరు? ఇప్పటివరకు ఒక సీఎంగా ఎందుకు సమీక్ష చేయలేదు..?’అని రేవంత్ నిలదీశారు. -
రాయని డైరీ: డొనాల్డ్ ట్రంప్ (అధ్యక్ష అభ్యర్థి)
‘‘అమెరికా అధ్యక్షుడా.. అమెరికా అధ్యక్షుడా..’’ అని జో బైడెన్‌ను డెమోక్రాట్లు కీర్తిస్తున్నారు. నృత్యాలు చేస్తున్నారు. అమెరికన్ల జాతీయవాద భావనను గౌరవించని ఉదారవాద సెక్యులర్ సన్నాసులతో కలసి మద్యం సేవిస్తున్నారు. ఓట్లు దొంగిలించి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అవగలడు. డొనాల్డ్ ట్రంప్‌లా నికార్సయిన ఒక మంచి అమెరికన్ కాగలడా! అమెరికా కర్మ ఫ్లోరిడా అడవుల్లా కాలబోతున్నట్లే ఉంది. వైట్ హౌస్‌లోని నా ఆఫీస్ గది కర్టెన్‌ని తొలగించి బయటికి చూస్తూ నిలుచున్నాను. పౌలా వైట్ పైకి వస్తూ కనిపించారు. ఆమె నా ఆధ్యాత్మిక గురువు. నా గెలుపు కోసం ప్రేయర్ చేశారు. ‘ఐ హియర్ విక్టరీ.. విక్టరీ.. విక్టరీ’ అని కనురెప్పలు మూసి, అలౌకికావస్థలో మూడుసార్లు ఆమె అన్నమాటలో అబద్ధం ఏమీ లేదు. నేను గెలవబోతున్న చప్పుడు ఆమె నుంచి నాకూ వినిపించింది. ‘‘ఓ మై గాడ్’’ అనుకుంటూ వచ్చారు పౌలా నా గదిలోకి. గాడ్ని ఆమె అవసరం అయినంత వరకు మాత్రమే తలుచుకుంటారు. తనను తలుచుకోడానికి గాడ్‌ను కూడా అవసరం అయినంత మేరకే అనుమతిస్తారు. ‘ఫర్ గాడ్స్ సేక్.. ట్రంప్ గెలిచి తీరాల్సిందే’ అని గాడ్‌తో అన్నారు పౌలా. అందుకు గాడ్ ఏమన్నాడో నాకు నేరుగా తెలిసే అవకాశం లేదు. పౌలానే చెప్పారు.. ‘ఫర్ ట్రంప్స్ సేక్.. నేనెందుకు ట్రంప్‌ను గెలిపించాలి?’ అని గాడ్ అన్నాడట. తర్వాత వాళ్లిద్దరూ నాకోసం చాలాసేపు వాదులాడుకున్నారు. నన్ను గెలిపించడం కోసం పౌలా, ‘అది కాదు పౌలా.. ఇప్పుడూ.. మరీ..’ అని నీళ్లు నములుతూ గాడ్. ‘‘మిస్టర్ ట్రంప్.. దేని గురించి మీరింకా ఆలోచిస్తూ ఉన్నారు’’ అన్నారు పౌలా అకస్మాత్తుగా నాకు దగ్గరగా వచ్చి. ‘‘ఓ మై ఏంజెల్ మిస్ పౌలా.. ఆలోచించడానికి ఇంకా ఏమి మిగిలి ఉందని గానీ మీరు నన్ను అడగడం లేదు కదా..’’ అన్నాను. ఆమె నవ్వారు. ‘‘మిమ్మల్ని బ్లెస్ చేశాను మిస్టర్ ట్రంప్. దేవుడి దీవెనలు మాత్రం డెమొక్రాట్లపై ఉన్నాయి. కానివ్వండి. మీపై నా బ్లెస్సింగ్స్ శక్తిమంతమైనవా, డెమొక్రాట్లపై దేవుడి దీవెనలు బలమైనవా అనేది త్వరలోనే తేలిపోతుంది. ‘మిస్టర్ ట్రంప్‌ని బ్లెస్ చేయడానికి మీకు అభ్యంతరం ఏమిటి?!’ అని గాడ్ని నేను కాస్త కటువుగానే ప్రశ్నించాను. ‘మిస్టర్ ట్రంప్ ఒక మంచి అమెరికన్ పౌరుడు కాగలడు గానీ, ఒక మంచి అమెరికా అధ్యక్షుడు కాలేడు’ అని గాడ్ అన్నారు..’’ అని చెప్పారు పౌలా. ‘‘గాడ్!!’’ అన్నాను. ‘‘ఏమిటి మిస్టర్ ట్రంప్’’ అన్నారు పౌలా. ‘‘మిస్ ఏంజెల్ పౌలా.. దేవుడూ నేనూ ఒకేలా ఆలోచిస్తున్నాం. మీరు కింది నుంచి పైకి వస్తూ ఉన్నప్పుడు కిటికీ తెర తొలగించి బయటికి చూస్తూ నేనూ ఇదే అనుకున్నాను.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అవగలడు కానీ, నాలా ఒక మంచి అమెరికన్ కాలేడు అని..’’ అన్నాను. ‘‘ఐ వజ్ ఆల్సో సర్ప్రైజ్డ్ మిస్టర్ ట్రంప్. అయితే నేను ఆశ్చర్యచకితురాలిని అయింది.. జో బైడెన్ మంచి ప్రెసిడెంట్ అయి, మీరు మంచి సిటిజెన్ అయి, ఇద్దరిలోనూ మంచి కామన్‌గా ఉన్నప్పుడు గాడ్ ఎందుకని బైడెన్ సైడ్ తీసుకున్నాడూ.. అని! రియల్లీ స్టన్నింగ్..’’ అన్నారు పౌలా. ఇద్దరం కొద్దిసేపు కిటికీలోంచి బయటికి చూస్తూ నిలుచున్నాం. ‘‘మిస్ ఏంజెల్ పౌలా.. ‘మీపై నా బ్లెస్సింగ్స్ శక్తిమంతమైనవా లేక డెమొక్రాట్లపై దేవుడి దీవెనలు బలమైనవా అనేది త్వరలోనే తేలిపోతుంది’ అని మీరు ఇంతకు క్రితం అన్నారు. ఎంత త్వరలో?!’’ అని అడిగాను. పౌలా కళ్లు తెరిచి లేవు! దేవుడితో మళ్లీ ఆమె వాదనకు దిగినట్లుగా ఉన్నారు.. నా కోసం!! - మాధవ్ శింగరాజు -
బైడెన్‌కు అధికారమిస్తే కలలన్నీ నాశనం: ట్రంప్
వాషింగ్టన్: డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తే అమెరికా కన్న కలలన్నీ సర్వనాశనం అవుతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా గొప్పతనాన్ని నాశనం చేయడంతో పాటుగా ప్రజలకెవరికీ ఉద్యోగాలు ఉండవన్నారు. కరోనా సంక్షోభం నుంచి బయట పడడానికి ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రెండోసారి నామినేషన్‌ను ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువా రం ట్రంప్ పార్టీ సదస్సులో మాట్లాడారు. అందరి చూపు మెలానియా,ఇవాంక పైనే సదస్సు వేదికపై మెలానియా ట్రంప్, ట్రంప్ మొదటి భార్య కుమార్తె ఇవాంకా ఒకరికొకరు ఎదురుపడిన వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. తన తండ్రిని అధ్యక్ష అభ్యర్థిగా పరిచయం చేసి వేదిక దిగి వస్తుండగా ఎదురపడిన మెలానియా ఇవాంకను చూసి చిరునవ్వుతో పలకరించారు. ఇవాంక కాస్త ముందుకు వెళ్లగానే మెలానియా ముఖంలో రంగులు మారాయి. -
యూఎస్ అధ్యక్ష అభ్యర్థిపై లైంగిక ఆరోపణలు
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ దేశంలో లైంగిక ఆరోపణలు అంశం కలకలం రేపుతోంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలోకి దిగేందుకు సిద్ధవుతున్న అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడిన్పై లైంగిక ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన సెనేట్ మాజీ సహాయకురాలు తారా రీడే ఈ ఆరోపణలు చేశారు. జో బైడిన్ తనను అనేక సార్లు లైంగికంగా వేధించారని ఆరోపించడం ఇప్పుడు అగ్రరాజ్యంలో సంచలనం సృష్టిస్తోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి ఆరోపణలు రావడం డెమోక్రటిక్ అభ్యర్థికి కొంతమేర ఇబ్బందికర విషయంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. (చైనాపై మళ్లీ కారాలు మిరియాలు) అయితే తారా చేసిన ఆరోపణలను జో బైడిన్ తీవ్రంగా ఖండించారు. తానెవ్వరనీ లైంగిక వైధింపులకు గురిచేయలేదని, ఇదంతా రాజకీయ కుట్రని అని కొట్టిపారేశారు. కాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఈసారి జో బైడిన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఆయన సమీప అభ్యర్థి బెర్నీ శాండర్స్ కూడా జో కు మద్దతు ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ బరిలో నిలువనున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1371282435.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అమెరికా ఎన్నికల ప్రచారంలో యోగా
వాషింగ్టన్: డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వం కోరుతున్న టిమ్ రియాన్ (46) తన ఎన్నికల నిధుల కోసం సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఎన్నికల నిధులను సమకూర్చుకునేందుకు, అమెరికాలోని ముందస్తు ఆరోగ్య పరిరక్షణ విధానానికి ప్రజల మద్దతును కూడగట్టేందుకు యోగాను ఉపయోగించుకోనున్నారు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారు సుమారు 24 మంది ఉన్నారు. యోగా శిక్షణ శిబిరంలో పాల్గొని తనతో యోగా చేసేందుకు ఒక్కొక్కరూ మూడు డాలర్లను విరాళంగా ఇవ్వాల్సిందిగా టిమ్ రియాన్ ప్రజల్ని కోరుతున్నారు. యోగా శిక్షణ శిబిరానికి విరాళాలు ఇచ్చిన వారిలో కొంతమందిని డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి న్యూయార్క్ ట్రిప్పును కల్పిస్తామని..టిమ్ రియాన్ ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. -
రాష్ట్రపతి పదవి అత్యంత పవిత్రమైంది: కోవింద్
హైదరాబాద్ : తనకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలకు, నేతలకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం జలవిహార్‌లో టీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ...‘గవర్నర్‌గా నేను పార్టీలతకు అతీతంగా పని చేశాను. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా దేశం అభివృద్ధి చెందాలి. అదే నా లక్ష్యం. యువత ఆకాంక్షను నెరవేర్చేందుకు, ఆధునిక విద్య అందించేందుకు కృషి చేస్తా. రాష్ట్రపతి పదవి అత్యంత పవిత్రమైంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. నేను ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీతో అనుబంధంగా లేను. నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి. ఇక నన్ను స్వాగతిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరమంతా కటౌట్లు పెట్టించారు. హిందీలో ప్రసంగించారు. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్రపతిగా పనిచేసిన జకీర్ హుస్సేన్ హైదరాబాదీ. నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.’ అని అన్నారు. -
హైదరాబాద్ చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్
హైదరాబాద్ : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రచారం నిమిత్తం నగరానికి చేరుకున్న ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ నేతలతో పాటు, ఉప ముఖ్య మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్ సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి తదితరులు కోవింద్‌కు ఘనస్వాగతం పలికారు. కోవింద్ నేరుగా విమానాశ్రయం నుంచి బేగంపేటలోని హరిత టూరిజం ప్లాజాకు చేరుకుని బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అనంతరం 10.45 వరకు టీడీపీ ఎమ్మెల్యేలతో కోవింద్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత పార్క్ హయత్ హోటల్‌కు చేరుకుని 11.15 గంటల నుంచి 12 గంటల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. -
నామినేషన్ దాఖలు చేసిన మీరా కుమార్
న్యూఢిల్లీ: విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యదర్శికి.. మీరా కుమార్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినాయకులతోపాటు విపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, సీతారాం ఏచూరి, కనిమొళి తదితరులతో పాటు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని 17 విపక్ష పార్టీలు మీరాకుమార్‌కు మద్దతు పలుకుతున్నాయి. కాగా నామినేషన్ వేసేందుకు ముందుగా మీరా కుమార్ ...ఈరోజు ఉదయం రాజ్‌ఘాట్ సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. -
మీరాకుమార్‌కు టీపీసీసీ నేతల శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: విప క్షాల తరఫున రాష్ట్ర పతి అభ్యర్థిగా ఎన్ని కల బరిలో నిలిచిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌కు టీపీసీసీ నేతలు శుభా కాంక్షలు తెలిపారు. మంగళవారమిక్కడ ఆమె నివాసంలో కలిసి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మీరాకుమార్ను కలిసిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
మీరాకుమార్‌పై సుష్మా వీడియో దాడి
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్‌పై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ విమర్శల దాడి చేశారు. 2013నాటి లోక్‌సభలో తాను మాట్లాడుతున్న సందర్భంలో తన పట్ల నాడు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్ ఎలా వ్యవహరించారో తెలియజేస్తూ ఓ వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక దేశ ప్రాధాన్యమున్న అంశంపై తాను మాట్లాడుతుంటే మీరాకుమార్ పదేపదే జోక్యం చేసుకొని తన ప్రసంగాన్ని ముగించాలని ఎలా ఒత్తిడి చేశారో ఆ వీడియో ద్వారా చూపించారు. యూపీఏ ప్రభుత్వం నాడు వివిధ అవినీతి కుంభకోణాలకు పాల్పడిందంటూ సుష్మా స్వరాజ్ 2013లో లోక్‌సభలో కొద్ది సేపు మాట్లాడారు. ఆ సమయంలో ఇక చాలంటూ మీరా కుమార్ ఆమెను నిలువరించే యత్నం చేశారు. 'ప్రతిపక్షనేత పట్ల నాడు స్పీకర్ మీరా కుమార్ వ్యవహరించిన తీరు ఎలా ఉందో చూపించేందుకు ఇది నిదర్శనం' అంటూ సుష్మా ఆదివారం తన ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో 2013 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంటు సమావేశాల నాటిది. -
కోవింద్ విజయం ఖాయం: వైఎస్ జగన్
న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ చరిత్రాత్మక విజయం సాధిస్తారని ఆయన సర్వోన్నత పదవి గౌరవాన్ని కాపాడతారని, గొప్ప రాష్ట్రపతిగా సేవలు అందిస్తారని ఆశిస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం రామ్‌నాథ్ కోవింద్‌ను న్యూఢిల్లీలో కలిశారు. కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మరోసారి తెలిపారు. అలాగే పార్టీ తరఫున రామ్‌నాథ్ కోవింద్ కు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. -
పోటీ నామమాత్రమే..!
యూపీఏ, ఇతర విపక్షపార్టీలు మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపాయి. వామపక్షాలు చెప్పినట్లు ఇది సైద్ధాంతిక పోటీయే తప్పితే ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని అంకెలు చెబుతున్నాయి. రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓట్ల విలువ 10,98,903. దీంట్లో సగంకన్నా ఒక ఓటు ఎక్కువ (5,49,452 ఓట్లు) వచ్చిన వారు గెలుస్తారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరాన్ని పాటించే తటస్థ పార్టీల్లో.. వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, బీజేడీ, జేడీయూ, అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఎన్డీయే అభ్యర్థికే తమ మద్దతును ప్రకటించాయి. తాజాగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ తమ పార్టీ జేడీయూ మద్దతు కోవింద్‌కు ఉంటుందని ప్రకటించారు. ఎన్డీయే బలానికి వీరి ఓట్లు కూడా తోడైతే కోవింద్‌కు ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న బలం 62.39 శాతం. విజయానికి 5,49,452 ఓట్లు వస్తే సరిపోనుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో కోవింద్‌కు అనుకూల ఓట్లు 6,89,630 కావడం గమనార్హం. దీనిని బట్టి విపక్షపార్టీలు మొక్కుబడిగా పోటీకి దిగుతున్నాయనేది సుస్పష్టం. యూపీఏ అభ్యర్థికి 3,70,804 అనుకూల ఓట్లున్నాయి. అంటే ఎలక్టోరల్ కాలేజీలో వీరికి 33.58 శాతం మద్దతుంది. ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న ఆప్ (0.82 శాతం), ఐఎన్ఎల్డీ (0.38 శాతం), స్వతంత్రులు, ఇతర చిన్నాచితక పార్టీలు ఏ వైఖరి తీసుకున్నా అంతిమఫలితంపై ప్రభావమేమీ ఉండదు. ఎన్డీఏకు మద్దతిస్తున్న ఇతర పార్టీలు పార్టీ ఓట్ల విలువ శాతం వైఎస్సార్సీపీ 16,848 1.53 టీఆర్ఎస్ 22,048 1.99 బీజేడీ 32,892 2.98 అన్నాడీఎంకే 59,224 5.36 (రెండు వర్గాలు) జేడీయూ 20,935 1.89 మొత్తం 1,51,947 13.75 – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘నామ్‌కే వాస్తే’గా రాష్ట్రపతి అభ్యర్థి
ప్రతిపక్షాలపై జితేందర్ రెడ్డి ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ ప్రతిపా దించిన అభ్యర్థి గెలవడా నికి పూర్తి మెజారిటీ ఉన్న దని తెలిసీ.. ప్రతిపక్షాలు ‘నామ్‌కే వాస్తే’గా తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని యోచిస్తున్నాయని టీఆర్ ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ నివాసానికి వెళ్లిన జితేందర్ రెడ్డి.. రాష్ట్రపతి పదవికి బీజేపీ ప్రతిపాదించిన రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్ తరఫున సంబంధిత పత్రాలపై సంతకం చేశారు. 23న జరగనున్న నామి నేషన్ ప్రక్రియలో సీఎం కేసీఆర్ పాల్గొం టారన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడైన విద్యావేత్తను ఎంపిక చేయడాన్ని తమ పార్టీ స్వాగతించిందన్నారు. 30న పార్ల మెంటులో జరగనున్న జీఎస్టీ ప్రారం భోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొం టారని తెలిపారు. -
‘మద్దతు ఇచ్చేది లేదు..’
హైదరాబాద్: రాష్ట్రపతి అభ్యర్ది ఎంపికలో బీజేపీ ప్రభుత్వానిది కుటిల రాజకీయ నీతి అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలతో చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఏక పక్షంగా అభ్యర్దిని ప్రకటించిందని అన్నారు. దేశ వ్యాప్తంగా దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. దళితున్ని రాష్ట్రపతి అభ్యర్దిగా ప్రకటించి, దళిత వర్గంలో తమ పార్టీపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవాలనే నీచమైన ఎత్తుగడ వేసిందని అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర పార్టీ కార్యాలయం మఖ్ధుం భవన్లో జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. గో సంరక్షణ పేరుతో సంఘ్ పరివార్ శక్తులు దళితులు, మైనార్టీలపై దాడులు చేస్తున్నాయని తెలపారు. అయినా ప్రభుత్వం తరుపున ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవటంపై బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత మోర్చా అధ్యక్షునిగా పని చేసి ప్రస్తుత బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ది రామ్‌నాథ్ కోవింద్ కూడా ఏనాడు సంఘ్ పరివార్ దాడులను ఖండించలేదని అన్నారు. అలాంటి వారికి వామపక్షాలుగా తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. -
రాష్ట్రపతి అభ్యర్థిపై విపక్షాల సందిగ్ధం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా ఓ దళితుడిని ఖరారు చేయడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్షాన్ని సందిగ్ధంలో పడేసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్)తో అనుబంధం ఉన్న కారణంగా తాము ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తామని సీపీఐ, సీపీఎం పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే యోగి ఆదిత్యనాథ్ , భాగవత్ లాగా కరడుగట్టిన హిందూత్వ వాది కాకపోవడం వల్ల రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని ఎలా వ్యతిరేకించాలో తెలియక కాంగ్రెస్ పార్టీ తలపట్టుకు కూర్చుంది. ఒక విధంగా ‘టుబీ నాట్ టుబీ’ పరిస్థితి ఏర్పడింది. ఇక దళితుడిని ఎలా వ్యతిరేకిస్తామని బహుజన సమాజ్ పార్టీకి చెందిన మాయావతి లాంటి నాయకులు వాపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ‘భీమ్ ఆర్మీ’ లాంటి మరో దళిత ఫోరమ్ ఏర్పాటు వల్ల ఇప్పటికే ఆందోళన పడుతున్న మాయావతి, రామ్‌నాథ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం ద్వారా దళితులను దూరం చేసుకోలేనని చెబుతున్నారు. బలమైన కారణం లేకుండా యూపీకి చెందిన రామ్‌నాథ్ ఎలా కాదనాలో తెలియక సమాజ్‌వాది పార్టీ నాయకులు అఖిలేష్ యాదవ్ ఆందోళన చెందుతున్నారు. దళిత వ్యతిరేకులమనే ముద్ర తమకెందుకని ఇతర ప్రతిపక్ష పార్టీలు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా దళిత అభ్యర్థినే ఖరారు చేయడం మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తం కావడంతో మీరా కుమార్ లాంటి పేర్లను పరిశీలిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఓ దళిత అభ్యర్థికి వ్యతిరేకంగా మరో దళిత అభ్యర్థిని నిలబెడితే ‘రాజకీయం’ చేస్తున్నారనే అపవాదు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన పడుతుంది. దళిత అభ్యర్థినే పార్టీ కోరుకున్నట్లయితే రామ్‌నాథ్ కోవింద్‌నే తాము సమర్థించవచ్చని పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. కోవింద్‌కు వ్యతిరేకించాలంటే ఆయనకు ధీటైన వ్యక్తిని నిలబెడితేనే తాము మద్దతు ఇవ్వగలమని ఇటు మాయావతి, అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లు అంటున్నారు. దళిత అభ్యర్థిపై దళిత అభ్యర్థిని నియమిస్తే తమదీ రాజకీయం అంటారన్న ఆందోళన కాంగ్రెస్‌కే కాకుండా దళిత పార్టీలకు కూడా ఉంది. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణ్‌ను కనుక ఈసారి దళిత మహిళకు ఆ అవకాశం ఇవ్వడం మంచిదనే వాదనను బలంగా వినిపిస్తూ మీరా కుమార్ లాంటి వారిని రంగంలోకి దించుతే సమంజసంగా ఉండవచ్చు. పోటీ నుంచి తప్పుకుంటే అన్ని విపక్షాలను కలుపుకొని 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా లౌకిక సంకీర్ణ కూటమి ఎదగాలన్న ఆశ, ఆశయం నీరుగారిపోతుంది. రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని తేల్చడానికి ఈ నెల కాంగ్రెస్ నాయకత్వాన విపక్షాలు సమావేశమవుతున్న విషయం తెల్సిందే. -
3రోజుల క్రితమే రాష్ట్రపతి పేరు చెప్పేశాడు!
వచ్చే నెల 24తో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతి ఎవరనే దానిపై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు సైతం వెలుగులోకి వచ్చాయి. అయితే, అందరినీ విస్మయపరుస్తూ ప్రధాని మోదీ తనదైన స్టైల్లో ఎవరూ ఊహించని వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. బిహార్ గవర్నర్, ప్రముఖ దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకు ఎవరీ రామ్‌నాథ్ కోవింద్, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటన్న దానిపై ఒకవైపు నెటిజన్లు సెర్చ్ చేస్తుండగా.. ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. లలిత్ మిశ్రా అనే ఓ ట్విట్టర్ యూజర్ సరిగ్గా మూడురోజుల కిందటే బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి రావొచ్చు అంటూ అంచనా వేశారు. ఆయన అంచనానే నిజమైంది. దీంతో సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి పేరును కరెక్టుగా అంచనా వేసిన ఆయనను ‘దేవుడి’గా అభివర్ణిస్తూ.. షేర్ మార్కెట్ ఫలితాలు ఎలా ఉంటాయి? మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి లలిత మిశ్రా ఇప్పుడు ట్విట్టర్లో పాపులర్ అయ్యాడు. I think Bihar governor Mr Ramnath Kovind is also a dark horse — Lalit Mishra (@lalit_kmishra) 16 June 2017 -
అమిత్ షాకు ఉద్ధవ్ ఠాక్రే ఝలక్!
అసమగ్రంగా ముగిసిన భేటీ ముందు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించండి ఆ తర్వాతే మద్దతు కోరండి.. బీజేపీకి తేల్చిచెప్పిన మిత్రపక్షం ముంబై: రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఎంతో ఆశతో తన గుమ్మాన్ని తొక్కిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు మిత్రపక్షం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చిన్నపాటి ఝలక్ ఇచ్చారు. ముందు రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయండి.. ఆ తర్వాతే మద్దతు కోరండని అమిత్ షాకు ఠాక్రే తేల్చిచెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఎన్నో అంచనాల మధ్య సాగిన అమిత్‌షా-ఉద్ధవ్ ఠాక్రే భేటీ అసంపూర్ణంగా ముగిసింది. రాష్ట్రపతి అభ్యర్థుల విషయమై శివసేన ఇప్పటికే ఇద్దరి పేర్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షా-ఠాక్రే మధ్య 75 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ఉద్ధవ్‌తోపాటు ఆయన కొడుకు ఆదిత్య, షాతోపాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడవ్నిస్ కూడా పాల్గొన్నారు. పేరుకు మిత్రపక్షాలైన ఉప్పు-నిప్పులా మహారాష్ట్రలో బీజేపీ-శివసేన బంధం కొనసాగుతోంది. ఇటీవల రుణమాఫీ విషయమై బాహాటంగానే బీజేపీ సర్కారుపై సేన నిప్పులు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన అమిత్ షా-ఉద్ధవ్ ఠాక్రే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
రాష్ట్రపతి అభ్యర్థిగా పరిశీలనలో సదాశివం
సాక్షి ప్రతినిధి, చెన్నై: త్వరలో జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీపై అనేక పేర్లు వినిపిస్తుండగా కేరళ గవర్నర్ సదాశివం పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన సదాశివం గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల అధినేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్న సదాశివంను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉందని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. -
హిల్లరీ నిర్ణయానికి 'అమ్మే' కారణమట!
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ బరిలోకి దిగడానికి కారణమేంటి? డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ పొందడానికి స్ఫూర్తినిచ్చింది ఎవరు? దీనికంతటికీ కారణం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత అని ఆ పార్టీ ఎమ్మెల్యే రాము చెబుతున్నారు. సాక్షాత్తూ తమిళనాడు అసెంబ్లీలో ఈ విషయం చెప్పి అమ్మభక్తి చాటుకున్నారు. రెండేళ్ల క్రితంలో అన్నాడీఎంకేలో చేరిన రాము తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 'అమెరికా చరిత్రలో ఓ మహిళ (హిల్లరీ) తొలిసారి ప్రధాన పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ ఘనతంతా అమ్మదే (జయలలిత). హిల్లరీ భారత్ పర్యటనకు వచ్చినపుడు అమ్మను కలిశారు. ఈ సమావేశానికి ఎంతో చరిత్రాత్మక ప్రాధాన్యం ఉంది. అమ్మతో మాట్లాడాక హిల్లరీ ఎంతో స్ఫూర్తిపొందారు. అమ్మ వ్యక్తిత్వం, ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం గురించి తెలుసుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీచేసేలా హిల్లరీ ప్రేరణ పొందారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా నామినేషన్ పొందారు. దీనికంతటికీ కారణం అమ్మే' అని అసెంబ్లీలో రాము చెప్పారు. -
డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధిగా భారత సంతతి యువతి
ఫిలడేల్ఫియా: భారత సంతతికి చెందిన స్మృతి పాలనియప్పన్ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధిగా నియమితులయ్యారు. అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. ఇఓవా ప్రతినిధిగా శృతి పాలనియప్పన్ను నియమించారు. దీంతో ఈ పదవికి ఎంపికైన అతి పిన్న వయస్కురాలిగా శృతి(18) చరిత్ర సృష్టించారు. అరిజోనా ప్రతినిధి ఇమ్మెట్(102) అతి పెద్ద వయస్కురాలు. తనను పార్టీ ప్రతినిధిగా నియమించిన సందర్భాన్ని పురస్కరించుకొని శృతి మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన హిల్లరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్ష అభ్యర్థిగా తొలిసారి ఓ మహిళ ఎన్నికై చరిత్ర సృష్టించారంటూ హిల్లరీపై ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగం నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని, అదే స్ఫూర్తితో హిల్లరీని గెలిపించేందుకు, పార్టీ విజయం కోసం కృషి చేస్తానన్నారు. -
ఫేస్బుక్లో జిందాల్ హవా
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బాబీ జిందాల్ ఇప్పుడు ఫేస్బుక్లో హవా సృష్టిస్తున్నారు. జిందాల్‌కు ఫేస్బుక్లో 21 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, 49 లక్షల మంది ఆయనతో సంభాషణలు జరుపుతున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులలో ఎక్కువగా చర్చలో ఉన్న వారిలో పదో వ్యక్తిగా బాబీ జిందాల్ నిలిచారు. ఆయనతో పాటు టెక్సాస్ మాజీ గవర్నర్ రికీ పెర్రీ కూడా ఈ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. అయితే వీళ్లిద్దరినీ ఫాక్స్ న్యూస్ తమ రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌కు పిలవలేదు. కానీ బాబీ జిందాల్, పెర్రీ ఇద్దరూ మాత్రం గురువారం రాత్రి జరిగిన హేపీ అవర్ డిబేట్లో పాల్గొన్నారు. పెర్రీకి 24 లక్షల మంది ఫాలోవర్లుండగా 73 లక్షల మంది ఆయనతో సంభాషణలు జరుపుతున్నారు. అందరికంటే అగ్రస్థానంలో బిజినెస్ టైకూన్ డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆయనకు 2.62 కోట్ల మంది ఫాలోవర్లుండగా 13.56 కోట్ల మంది సంభాషణలు జరుపుతున్నారు. ఆయన తర్వాతి స్థానంలో ఫ్లోరిడా మాజీ గవర్నర్ జెబ్ బుష్ ఉన్నారు.