
న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ చరిత్రాత్మక విజయం సాధిస్తారని ఆయన సర్వోన్నత పదవి గౌరవాన్ని కాపాడతారని, గొప్ప రాష్ట్రపతిగా సేవలు అందిస్తారని ఆశిస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.

