
టైమ్ మేగజైన్ వ్యంగ్యాత్మక కవర్ పేజీ
ఆ మేగజైన్ ఇంకా నడుస్తోందా?
అంతే వ్యంగ్యంగా ట్రంప్ స్పందన
వాషింగ్టన్: చరిత్రాత్మక కవర్ పేజీలకు పెట్టింది పేరైన టైమ్ మేగజైన్ ‘ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్’ అంటూ తాజాగా వ్యంగాత్మక కవర్ పేజీ కథనం ప్రచురించింది. అందులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలోని ప్రెసిడెంట్ స్థానంలో కూర్చుని కని్పస్తున్నారు. ఎరుపు బ్యాక్‌గ్రౌండ్ ముఖచిత్రంలో చేతిలో కాఫీ కప్పు పట్టుకొని ఉన్నారు.
జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఫెడరల్ ప్రభుత్వాన్ని సమూలంగా మార్చేందుకు మస్క్ ప్రయతి్నస్తుండటం తెలిసిందే. ఆ క్రమంలో ఆయనే అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నానే అర్థంలో టైమ్ ఇలా కవర్ పేజీని డిజైన్ చేసింది. అధ్యక్ష సింహాసనం వెనుక ఉన్న అసలైన శక్తి మస్కేనని పరోక్షంగా చెప్పుకొచ్చింది. కవర్ స్టోరీలోనూ ఈ అంశాన్ని గట్టిగానే ఎండగట్టింది. లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు మస్క్ దయపై ఆధారపడి బతకాల్సి వస్తోందని పేర్కొంది.
ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న స్పృహ ఆయనలో కన్పించడం లేదని ఆక్షేపించింది. ‘డోజ్ పనితీరుపై మా పత్రిక వైట్‌హౌస్‌కు కొన్ని ప్రశ్నలు పంపింది. కానీ వాటికి బదులివ్వడానికి వైట్‌హౌస్ నిరాకరిచింది’’ అని కథనంలోనే పేర్కొంది. మస్క్ టైమ్ మేగజైన్‌పై కనిపించడం ఇది రెండోసారి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను ‘కింగ్ మేకర్’గా అభిర్ణిణస్తూ ఇటీవలే మేగజైన్ ఓ ఫీచర్ రాసింది. టైమ్ తాజా కవర్ పేజీ ఉదంతంపై ట్రంప్‌ను ప్రశ్నించగా, ‘ఆ మేగజైన్ ఇంకా నడుస్తోందా? నాకు తెలియదు’ అంటూ అంతే వ్యంగ్యంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment