Time Magazine
-
గూడు కట్టుకున్న పక్షి ప్రేమ
‘హర్గిలా కొంగలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని మనమే రక్షించుకోవాలి’ అని ఊరూరు తిరుగుతూ ప్రచారం చేసేది పూర్ణిమాదేవి. ‘అలాగే’ అన్నవారి కంటే ‘మాకేమీ పనిలేదనుకుంటున్నావా’ అని ముఖం మీద చెప్పిన వాళ్లే ఎక్కువ. తాను భుజానికెత్తుకున్న పని ఎంత ముఖ్యమైనదో కాలక్రమంలో ప్రజలకు అవగాహన కలిగించడంలో పూర్ణిమాదేవి విజయవంతం అయింది. తాజా విషయానికి వస్తే,,, అస్సాంకు చెందిన జీవశాస్త్రవేత్త, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషనిస్ట్ పూర్ణిమాదేవి బర్మాన్ ‘టైమ్’ మ్యాగజైన్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’ జాబితాలో చోటు సాధించింది. ఈ జాబితా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 13 మంది మహిళలలో మన దేశం నుంచి ఎంపికైన ఏకైక మహిళ పూర్ణిమాదేవి బర్మాన్...బ్రహ్మపుత్ర నదికి దగ్గర్లోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో పెరిగింది పూర్ణిమ. ‘ఈరోజు నీ స్నేహితులను చూపిస్తాను వస్తావా?’ అని నవ్వుతూ అడిగింది అమ్మమ్మ.‘పద వెళదాం’ అంటూ రెడీ అయిపోయింది పూర్ణిమ. అది తన జీవితాన్ని మార్చిన రోజు. పక్షుల ప్రపంచాన్ని పరిచయం చేసిన రోజు. ఆరోజు మొదలు ప్రతిరోజూ అమ్మమ్మతోపాటు పంట పొలాల్లోకి వెళ్లి పక్షులతో మాట్లాడడం నుంచి వాటి మధుర గానాన్ని వినడం వరకు ఎన్నో చేసేది.జువాలజీలో మాస్టర్స్ చేసిన పూర్ణిమ గ్రేటర్ అడ్జటంట్ జాతికి చెందిన హర్గిలా కొంగలపై పీహెచ్డీ చేయాలనుకున్నప్పుడు అవి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయనే చేదునిజం తెలిసొచ్చింది. ఆ సమయంలో తనకు అకాడమిక్ ఆలోచనల కంటే ఉద్యమ స్థాయిలో ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది.‘పక్షులను రక్షించడం కోసం ఇప్పుడు ఒక సైన్యం కావాలి’ అనుకుంది. ఎవరి ప్రపంచం వారిది అయిపోయిన ఈ ప్రపంచంలో తన కలల సైన్యంలోకి ఎవరు మాత్రం వస్తారు? అయితే.. మనం ఒక మంచిపనికి నడుం బిగిస్తే అది విజయవంతం అయ్యేలా ప్రకృతి ఆశీర్వదిస్తుందట. అది నిజమేనేమో... ఒక్కరొక్కరుగా ఎంతోమంది మహిళలు ‘హర్గిలా’ సైన్యంలో చేరడం మొదలైంది. హర్గిలా ఆర్మీలో ఇప్పుడు ఇరవై వేల మంది మహిళా సైనికులు ఉన్నారు.హర్గిలా పక్షిని ‘స్కావెంజర్’ అని పిలుస్తారు. నీటికాలుష్యాన్ని నివారించడం నుంచి పరిసరాల శుభ్రత వరకు అవి ఎన్నో రకాలుగా మానవాళికి మేలు చేస్తాయి. ‘హర్గిలాను రక్షించుకోవడం అంటే ప్రకృతిని రక్షించుకోవడమే’ అనే నినాదంతో హర్గిలా ఆర్మీ ప్రజల్లోకి వెళ్లింది. గాయపడిన కొంగలకు చికిత్స చేయడం, గూడును ఏర్పాటు చేయడం, రకరకాల ఉత్సవాలు నిర్వహించడం... ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకువచ్చింది. మూడు పదులు దాటని కొంగల సంఖ్య ఇప్పుడు నాలుగు వందలు దాటేలా చేసింది.‘కొంగలకు సోదరి’ అంటూ పూర్ణిమాదేవిని ప్రజలు ప్రేమగా పిలుచుకుంటారు. అస్సాం సంప్రదాయ దుస్తులపై హర్గిలా బొమ్మలు వేస్తూ పర్యాటకులకు విక్రయించడం అనేది స్థానిక మహిళలకు జీవనోపాధిగా మారింది. ‘హర్గిలా’ ఆర్మీ అస్సాంకే పరిమితం కాలేదు. దేశంలోని ఎన్నోప్రాంతాలకు విస్తరించింది.కంబోడియా, ఫ్రాన్స్ పాఠశాలల్లో పూర్ణిమ చేసిన విశేష కృషి గురించి పాఠాలుగా చెబుతున్నారు. ‘సమాజంలో మార్పు తీసుకు వచ్చే శక్తి మహిళల్లో ఉంది’ అంటుంది పూర్ణిమాదేవి బర్మాన్. పురుషుల నుంచి అవమానాలు, తిట్లు, వెటకారాలు ఎదురైనప్పుడు ఆమెకు అండగా నిలబడింది మహిళలే. ‘హర్గిలా’ రూపంలో తన అసాధారణ కలను సాకారం చేసింది మహిళలే! ఆరోజు ఎంతగా అవమానించారో!ఆరోజు ఒక గ్రామానికి వెళ్లాను. ఒక వ్యక్తి తొమ్మిది గూళ్లు ఉన్న చెట్టును నరికివేయడం, పక్షి పిల్లలు చనిపోవడం చూశాను. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ గ్రామస్థుడితో మాట్లాడే సాహసం చేశాను. అప్పుడు చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. అంతమంది మగవాళ్ల మధ్య నేను ఒంటరి అయ్యాను. చెట్టు నరికిన వ్యక్తి తాను చేసింది తప్పు అనుకోలేదు. పైగా నాతో కోపంగా మాట్లాడాడు. నీకు పక్షులపై అంత ప్రేమ ఉంటే మా ఇంట్లో పనిమనిషిగా చేరు. పక్షుల మలమూత్రాలు శుభ్రం చేయడం లాంటి పనులు చెయ్యి అని అరిచాడు. అక్కడ ఉన్న వాళ్లు కూడా తిట్టడం మొదలుపెట్టారు. నువ్వు వచ్చింది హర్గిలాను రక్షించడానికి కాదు వాటి మాంసాన్ని తినడానికి అని ఒకరు తిట్టారు. హర్గిలాను రక్షించుకోవాలంటే ప్రయోగశాలలో శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే సరిపోవు అనే విషయం అప్పుడు నాకు అర్థమైంది. ముందు ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావాలి అనిపించింది. ఆ ఆలోచనే హర్గిలా ఆర్మీకి బీజం వేసింది.– పూర్ణిమాదేవి బర్మాన్ -
ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్!
వాషింగ్టన్: చరిత్రాత్మక కవర్ పేజీలకు పెట్టింది పేరైన టైమ్ మేగజైన్ ‘ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్’ అంటూ తాజాగా వ్యంగాత్మక కవర్ పేజీ కథనం ప్రచురించింది. అందులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలోని ప్రెసిడెంట్ స్థానంలో కూర్చుని కని్పస్తున్నారు. ఎరుపు బ్యాక్‌గ్రౌండ్ ముఖచిత్రంలో చేతిలో కాఫీ కప్పు పట్టుకొని ఉన్నారు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఫెడరల్ ప్రభుత్వాన్ని సమూలంగా మార్చేందుకు మస్క్ ప్రయతి్నస్తుండటం తెలిసిందే. ఆ క్రమంలో ఆయనే అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నానే అర్థంలో టైమ్ ఇలా కవర్ పేజీని డిజైన్ చేసింది. అధ్యక్ష సింహాసనం వెనుక ఉన్న అసలైన శక్తి మస్కేనని పరోక్షంగా చెప్పుకొచ్చింది. కవర్ స్టోరీలోనూ ఈ అంశాన్ని గట్టిగానే ఎండగట్టింది. లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు మస్క్ దయపై ఆధారపడి బతకాల్సి వస్తోందని పేర్కొంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న స్పృహ ఆయనలో కన్పించడం లేదని ఆక్షేపించింది. ‘డోజ్ పనితీరుపై మా పత్రిక వైట్‌హౌస్‌కు కొన్ని ప్రశ్నలు పంపింది. కానీ వాటికి బదులివ్వడానికి వైట్‌హౌస్ నిరాకరిచింది’’ అని కథనంలోనే పేర్కొంది. మస్క్ టైమ్ మేగజైన్‌పై కనిపించడం ఇది రెండోసారి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను ‘కింగ్ మేకర్’గా అభిర్ణిణస్తూ ఇటీవలే మేగజైన్ ఓ ఫీచర్ రాసింది. టైమ్ తాజా కవర్ పేజీ ఉదంతంపై ట్రంప్‌ను ప్రశ్నించగా, ‘ఆ మేగజైన్ ఇంకా నడుస్తోందా? నాకు తెలియదు’ అంటూ అంతే వ్యంగ్యంగా స్పందించారు. -
‘టైమ్స్’ ఈ ఏటి మేటి వ్యక్తి ట్రంప్
వాషింగ్టన్: కాబోయే అమెరికా అధ్యక్షుడు∙డొనాల్డ్ ట్రంప్‌ను ప్రఖ్యాత టైమ్ మేగజైన్ ఈ ఏటి మేటి వ్యక్తిగా గుర్తించింది. ఈ గౌరవం ఆయనకు దక్కడం ఇది రెండోసారి. 2016లోనూ ట్రంప్ ‘పర్సన్ ఆఫ్ ఇయర్’ అయ్యారు. ‘2024 పర్సన్ ఆఫ్ ఇయర్ ట్రంప్’ అని టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ శామ్ జాకోబ్ చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్ గురువారం ఉదయం న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఓపెనింగ్ బెల్ మోగించారు. -
టైమ్ జాబితాలో రిలయన్స్, టాటా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. 2024కి గాను ప్రపంచంలోనే 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీలతో టైమ్ దీన్ని రూపొందించింది. ఈ లిస్టులో రిలయన్స్ చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి. 2021లో కూడా ఈ జాబితాలో రిలయన్స్ ఉంది. కంపెనీలను అయిదు విభాగాలుగా వర్గీకరించగా టైటాన్స్ కేటగిరీలో రిలయన్స్, టాటాలను టైమ్ చేర్చింది. పయొనీర్స్ కేటగిరీలో సీరమ్ ఉంది. 58 ఏళ్ల క్రితం టెక్స్టైల్, పాలీయెస్టర్ కంపెనీగా ఏర్పాటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిందని టైమ్ పేర్కొంది. 1868లో ప్రారంభమైన టాటా గ్రూప్.. సాల్ట్ (ఉప్పు) నుంచి సాఫ్ట్వేర్ వరకు వివిధ రంగాల్లో విస్తరించిందని తెలిపింది. 2023లో ఐఫోన్లను అసెంబుల్ చేసే తొలి భారతీయ కంపెనీగా నిలి్చందని వివరించింది. అటు సీరమ్ ఏటా 3.5 బిలియన్ డోసుల టీకాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వేక్సిన్ల తయారీ సంస్థగా ఉందని టైమ్ పేర్కొంది. -
ఎవరీ ప్రియంవదా నటరాజన్? ఏకంగా టైమ్ మ్యాగజైన్లో..!
ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయ మహిళ ఖగోళ శాస్త్రవేత్త ప్రియంవదా నటరాజన్ కూడా ఉన్నారు. టైమ్ మ్యాగజైన్ ఈసారి, నాయకులు, స్పూర్తిదాయమైనవాళ్లు, ఆయా రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన వారుగా వర్గీకరించి మరీ వందమంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఈసారి ఆ జాబితాలో చాలామంది ప్రతిభావంతులైన భారతీయలకు స్థానం లభించడం విశేషం. ఈ జాబితాలో భారత సంతతి మహిళ శాస్త్రవేత్తకు ఎలా చోటు దక్కిందంటే.. ఆమెకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు.. భారత సంతతి అమెరికన్ అయిన ప్రియంవద నటరాజన్ యేల్ యూనివర్సిటీలో భారతీయ ప్రొఫెసర్. ఆమె అక్కడ ఖగోళ శాస్త్ర విభాగానికి అధ్యక్షురాలు, మహిళా ఫ్యాకల్టీ ఫోరమ్ చైర్పర్సన్ కూడా. ఆమె ప్రాథమిక విద్య ఢిల్లీ పబ్లిక స్కకూల్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది. తదనంతరం నటరాజన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీలో పీహెచ్డీ పూర్తి చేసింది. ఆ టైంలోనే ఆమె ప్రతిష్టాత్మకమైన ఐజాక్ న్యూటన్ విద్యార్థిని, ట్రినిటీ కళాశాలలో సహచరురాలు కూడా. ఆమె ఎక్కువగా మాసివ్ బ్లాక్‌హోల్స్‌పై విస్తృతంగా పరిశోధనలు చేసింది. 2022లో లిబర్టీ సైన్స్ సెంటర్ జీనియస్ అవార్డుని గెలుచుకుంది. అంతేగాదు మెరికన్ ఫిజికల్ సొసైటీ (ఏపీఎస్), అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ (ఏఏఏఎస్), గుగ్గెన్‌హీమ్ ఫౌండేషన్ మరియు రాడ్‌క్లిఫ్ ఇన్స్టిట్యూట్ వంటి అనేక సంస్థల నుంచి ఫెలోషిప్‌లు అందుకుంది. అలాగే 2016లో వచ్చిన 'మ్యాపింగ్ ది హెవెన్స్: ది రాడికల్ సైంటిఫిక్ ఐడియాస్ దట్ రివీల్ ది కాస్మోస్'రాసింది కూడా ప్రియంవదానే. (చదవండి: టైమ్ మ్యాగజైన్లో ఇద్దరు బారతీయ అమెరికన్లకు చోటు..!) -
టైమ్ మ్యాగజైన్లో ఇద్దరు బారతీయ అమెరికన్లకు చోటు..!
టైమ్ మ్యాగజైన్ 2024 ఏడాదికి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలోని రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ భార్య యులియా నవల్ని, ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో నాయకుల విభాగంలో భారత సంతతికి చెందిన యూఎస్ అధికారి జిగర్ షా, ఇటాలియాన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహ్మది వంటి వారు కూడా ఉన్నారు. ఈ జాబితాను టైమ్ మ్యాగజైన్ నాయకులు, ఆదర్శవంతమైన వ్యక్తులు, ఆయా రంగాల్లో ప్రావీణ్యం గల వారుగా వర్గీకరించి మరీ ఈ జాబితాను విడుదల చేసింది. ఇక రష్యా ప్రతిపక్ష నాయకుడు భార్య యులియా తన భర్త మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చారు. తన భర్త అలెక్సి ఉనికిని సజీవంగా ఉంచేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఇక భారతీయ అమెరికన్ అజయ్ బంగా గతేడాది ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడయ్యారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధికి నాయకత్వం వహించిన తొలి భారత సంతతి అమెరికన్‌గా చారిత్రతక ఘట్టాన్ని ఆవిష్కరించారు. బంగా ఐదేళ్ల కాలానికి 14వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ జాబితాలో మరో భారతీయ అమెరికన్ జిగర్ షా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రోగ్రామ్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్ స్వచ్ఛమైన మౌలిక సదుపాయాలు, ఇంధన కార్యక్రమాల కోసం పబ్లిక్ ఫండ్‌లో దాదాపు వంద బిలియన్ డాలర్లను పర్యవేక్షిస్తుంది. అలాగే నాయకుల జాబితాలో ఉన్న అగ్ర రాజకీయ నాయకులలో టాలియన్ ప్రధాని జార్జియా మెలోని ఒకరు. 47 ఏళ్ల మెలోని 2022లో అధికారంలోకి వచ్చి ఇటలీకి తొలి మహిళ నాయకురాలయ్యింది. ఆమెకు దేశంలో భారీగా మద్దతు ఉండటం విశేషం. ఇక 51 ఏళ్ల నర్గేస్ మొహమ్మది ఇరాన్ మానవహక్కుల కోసం ఆమె అలసిపోని న్యాయవాదానికి గుర్తుగా 2023 నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది. దీని గురించి ఆమె గత ఇరవై ఏళ్లులో ఎన్నో సార్లు జైలుల పాలయ్యింది. ఇప్పటికీ టెహ్రాన్‌లో ఎవిన్ జైలులో నిర్బంధింపబడి ఉంది. ఇక ఈ టైమ్స్ ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో ఈ జాబితాలో రెజ్లర్ సాక్షి మాలిక్ , సత్య నాదెళ్లకు కూడా చోటు దక్కించుకున్నారు. (చదవండి: సోషల్ మీడియా క్రేజ్ కోసం ఓ తండ్రి పసికందుపై పిచ్చి ప్రయోగం! చివరికి..) -
టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే..
Time’s CEO of the Year 2023: టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT)కంపెనీ ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘సీఈవో ఆఫ్ ది ఇయర్-2023’గా ఎంపికయ్యారు. ఆల్ట్మాన్ టెక్ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అవార్డు పొందారు. 5 రోజుల్లోనే మిలియన్ యూజర్లు 2022 నవంబర్ లో ప్రారంభమైన చాట్‌జీపీటీ 5 రోజుల్లోనే మిలియన్ మంది యూజర్లను సంపాదించకుందని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. చాట్‌జీపీటీకి ప్రస్తుతం 100 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ బెంచ్‌మార్క్‌ను చేరుకోవడానికి ఫేస్‌బుక్‌కు 4.5 సంవత్సరాలు పట్టింది. 2022లో 28 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నివేదించిన ఓపెన్ఏఐ 2023లో నెలకు 100 మిలియన్ డాలర్ల ఆదాయానికి చేరుకుంది. ఓ వైపు చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ పింక్ స్లిప్‌లు ఇస్తున్న సమయంలో ఓపెన్ఏఐ మాత్రం నియామకాలు చేపట్టడం విశేషం. చాట్‌జీపీటీ భారీ విజయం తర్వాత ఈ ఏడాది మార్చిలో జీపీటీ-4ను ఓపెన్ఏఐ తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఓ వైపు యూఎస్ సెనేట్‌లో చర్చలు జరుగుతున్న సమయంలో ఆల్ట్‌మన్ భారత్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు వెళ్లి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మళ్లీ సీఈవోగా.. బోర్డు సభ్యులతో విభేదాల కారణంగా ఆల్ట్‌మన్ ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి వైదొలిగారు. గత నవంబర్ 17న బోర్డు ఆల్ట్‌మాన్‌ను కంపెనీ నుంచి తొలగించింది. ఈ ఘటన జరిగిన వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆల్ట్‌మన్‌కు అండగా నిలిచారు. మైక్రోసాఫ్ట్‌లో అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే 5 రోజుల నాటకీయ పరిణామాల అనంతరం ఆయన మళ్లీ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. -
టైమ్ 100 నవ్య సారథుల జాబితాలో హర్మన్‌ప్రీత్
న్యూయార్క్: భిన్న రంగాల్లో విశేష కృషిచేస్తూ ప్రపంచ గతిని మార్చే కొత్త తరం సారథుల జాబితా అంటూ ప్రఖ్యాత మ్యాగజైన్ టైమ్ తీసుకొచ్చిన జాబితాలో భారతీయ మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ స్థానం దక్కించుకున్నారు. 2023 టైమ్ 100 నెక్స్ట్: ది ఎమర్జింగ్ లీడర్స్ షేపింగ్ ది వరల్డ్ పేరిట 100 పేర్లతో ఈ జాబితాను సిద్ధంచేశారు. ‘ఆటలో పోటీతత్వం, రగిలిపోయే క్రీడాసక్తితో హర్మన్‌ప్రీత్.. మహిళా క్రికెట్‌ను ప్రపంచంలో విలువైన క్రీడా ఆస్తిగా మలిచారు’ అని టైమ్ పొగిడింది. క్షయ వ్యాధి సోకడంతో అతిగా ఔషధాలు వాడి, వాటి దుష్ప్రభావంతో వినికిడి శక్తిని కోల్పోయినా మెరుగైన డ్రగ్ కోసం పోరాడి విజయం సాధించిన నందితా వెంకటేశన్ పేరూ ఈ జాబితాలో ఉంది. ఈమె కృషి ఫలితంగానే భారత్‌లో క్షయ చికిత్సకు మరింత మెరుగైన జనరిక్ మందులు అందుబాటులోకి వచ్చాయి. పర్యావరణహిత నిర్మాణాలతో మంచి పేరు తెచ్చుకున్న వినూ డేనియల్ పేరూ ఈ జాబితాలో ఉంది. -
టైమ్స్ మాగజైన్ 100: ఈ రంగం నుంచి వీరిద్దరే, ఆ సూపర్స్టార్లు ఎవరంటే?
సాక్షి ముంబై: టైమ్ మ్యాగజైన్ 2023లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్, టాలీవుడ్ దర్శక దిగ్గజం, ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చోటు సంపాదించారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, బిలియనీర్ ఎలాన్ మస్క్,హాలీవుడ్ దిగ్గజాలు ఏంజెలా బాసెట్, మైఖేల్ బి జోర్డాన్ , కోలిన్ ఫారెల్ లాంటి ప్రముఖుల ఎలైట్ వార్షిక జాబితాలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి వీరు మాత్రమే చోటు దక్కించుకోవడం విశేషం. (రిలయన్స్ ఫౌండర్ అంబానీ: తొలి జీతం రూ.300, ఆసక్తికర విషయాలు) గత వారం టైమ్ మ్యాగజైన్ ఆన్లైన్ పోల్‌లో షారూక్ టాప్‌లో నిలిచారు. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల స్థానానికి నిర్వహించిన ఈ పోల్‌లో లియోనెల్ మెస్సీ, ప్రిన్స్ విలియం, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ వంటి వారిని వెనక్కి నెట్టి మరీ షారూక్ టాప్‌లో నిలిచారు. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్) ఆర్ఆర్ఆర్ సంచలనం తరువాత ఎస్ఎస్ రాజమౌళి ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రముఖంగా నిలిచారు. డోజా క్యాట్, బెల్లా హడిద్, సామ్ ఆల్ట్మాన్ వంటి వారితో పాటు పయనీర్స్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) కాగా బాలీవుడ్ పఠాన్ మూవీ ఫారూక్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక సంచలనాలునమోదు చేసిన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ గత ఏడాది అత్యధిక వసూళ్లను సాధించడమేకాదు, ఆస్కార్‌తో సహా అనేక అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
టైమ్ 100 అగ్రస్థానంలో బాలీవుడ్ బాద్షా
న్యూఢిల్లీ: ‘పఠాన్’సినిమాతో మాంచి ఊపుమీదున్న బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(57)కు ఓ అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజీన్ 2023 సంవత్సరానికి నిర్వహించిన ప్రభావశీల వ్యక్తుల జాబితా 100లో అత్యధిక ఓట్లతో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ, ప్రిన్స్ హ్యారీ–మేఘన్ దంపతులు, ఆస్కార్ విజేత మిచెల్ యియోహ్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌లకు మించి ఆయనకు ఓట్లు పడ్డాయని టైమ్ మ్యాగజీన్ తెలిపింది. ఈ ఏడాది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో అర్హులుగా ఎవరుండాలని అను కుంటున్నారన్న ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది స్పందించారని పేర్కొంది. మొత్తం 12 లక్షల ఓట్లలో ‘పఠాన్’స్టార్‌కు 4%పైగా ఓట్లు పోలయ్యాయని వెల్లడించింది. ఈ నెల 13న తమ ఎడిటర్స్ టాప్100 జాబితాపై అభిప్రాయాలను వెల్లడించాక అంతిమ ఫలితాన్ని ప్రకటిస్తామని తెలిపింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత లీడ్ రోల్లో షారుఖ్ నటించిన పఠాన్ సినిమా జనవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్ద హిట్టయ్యింది. ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. టాప్ 100 రెండో స్థానంలో కఠిన ఇస్లామిక్ పాలన నుంచి స్వే చ్ఛ కావాలని ఉద్యమిస్తున్న ఇరాన్ మహిళలకు 3 శాతం ఓట్లు పోలయ్యాయి. టైమ్ 2022 జాబితాలోనూ హీరోస్ ఆఫ్ ది ఇయర్‌ను ఇరాన్ మహిళలే గెలుచుకోవడం గమనార్హం. ఆ తర్వాత బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు 1.9% ఓట్లతో వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. గత ఏడాది ఖతార్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనాకు చారిత్రక విజయం సాధించి పెట్టిన లియోనల్ మెస్సీ 1.8% ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ప్రముఖుల్లో ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ నటి విజేత యియోహ్, టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్, జుకర్‌బర్గ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా ఉన్నారని టైమ్ మేగజీన్ తెలిపింది. -
లగేజ్ సర్దేసుకుని లద్దాఖ్, మయూర్‌భంజ్‌కు ఛలో! ఆ రెండే ఎందుకంటారా?
న్యూఢిల్లీ: సమ్మర్ హాలీడేస్‌లో ఎక్కడికెవెళ్లాలి? పిల్లా పాపలతో కలిసి ఎక్కడికెళ్తే అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తాం? పెద్దగా ఆలోచించకుండా లగేజ్ సర్దేసుకొని కశ్మీర్‌లోని లద్దాఖ్‌కో, ఒడిశాలో మయూర్‌భంజ్‌కు ప్రయాణమైపోవడమే! ఆ రెండే ఎందుకంటారా? ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన ప్రాంతాల జాబితా–2023లో మన దేశం నుంచి చోటు దక్కించుకున్న ప్రాంతాలు అవే మరి! అరుదైన పులులు, పురాతన ఆలయాలు, సాహసంతో కూడిన ప్రయాణం, ఆహా అనిపించే ఆహారం. ఇవన్నీ లద్దాఖ్, మయూర్భంజ్లకు 50 పర్యాటక ప్రాంతాలతో టైమ్స్ రూపొందించిన ఈ జాబితాలో చోటు కల్పించాయి. లద్దాఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అడుగు పెడితే స్వర్గమే తలవంచి భూమికి చేరిందా అనిపించక మానదు. ‘‘మంచుకొండలు, టిబెటన్ బౌద్ధ సంస్కృతి కనువిందు చేస్తాయి. అక్కడి వాతావరణాన్ని ఫీల్ అవడానికి పదేపదే లద్దాఖ్ వెళ్లాలి’’ అని టైమ్స్ కీర్తించింది. ‘‘ఇక మయూర్భంజ్ అంటే పచ్చదనం. సాంస్కృతిక వైభవం, పురాతన ఆలయాలు, కళాకృతులకు ఆలవాలం. ప్రపంచంలో నల్ల పులి సంచరించే ఏకైక ప్రాంతం’’ అంటూ కొనియాడింది. ఏటా ఏప్రిల్‌లో మయూర్‌భంజ్‌లో జరిగే ‘చౌ’ డ్యాన్స్ ఫెస్టివల్ అదనపు ఆకర్షణ. ఒడిశా సాంస్కృతిక వారసత్వంతో పాటు ఏకశిలా శాసనాలు గొప్పగా ఉంటాయని టైమ్స్ పేర్కొంది. జాబితాలో అత్యధిక శాతం అమెరికా ప్రాంతాలకే చోటు దక్కింది. టాంపా (ఫ్లోరిడా), విల్లామెట్ (ఓరెగాన్), టక్సాన్ (అరిజోనా), యోసెమైట్ నేషనల్ పార్క్ (కాలిఫోర్నియా) వంటివి వాటిలో ఉన్నాయి. -
టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఉక్రెయిన్ అధ్యక్షుడు
న్యూయార్క్: ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్-2022’గా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీని ఎంపికచేస్తూ ఆయన ముఖచిత్రంతో టైమ్ మేగజీన్ తాజా సంచిక ప్రచురించింది. ఉక్రెయిన్‌లో, విదేశాల్లో చాలా మంది జెలెన్స్కీని హీరోగా అభివర్ణిస్తున్నారని పేర్కొంటూ ట్వీట్ చేసింది టైమ్ మేగజీన్. ‘ఉక్రెయిన్ సహా విదేశాల్లో చాలా మంది వొలొదిమిర్ జెలెన్స్కీని హీరోగా అభివర్ణిస్తున్నారు. 2022లో ఏడాదిగా ప్రజాస్వామ్యం, ధిక్కారానికి ఓ చిహ్నంగా నిరూపించుకున్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే రష్యా దాడులను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.’ అని పేర్కొంది. ఇదీ చదవండి: ఫోర్భ్స్ కుబేరుల జాబితా: పాపం ఎలన్ మస్క్ అలా దిగజారి.. ఆ వెంటనే.. -
నోబెల్ శాంతి బహుమతి రేసులో భారతీయులు!?
న్యూయార్క్: నోబెల్ బహుమతుల ప్రకటనల నడుమ.. ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో శాంతి బహుమతి ఎవరికి వెళ్లబోతోందా? అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు ప్రముఖ మ్యాగజైన్ టైమ్ ఒక కథనం ప్రచురించింది. భారత్‌కు చెందిన ఫ్యాక్ట్ చెకర్స్ మొహమ్మద్ జుబేర్, ప్రతీక్ సిన్హాలు నోబెల్ శాంతి బహుమతి కమిటీ పరిశీలనలో ఫేవరెట్‌గా ఉన్నట్లు టైమ్ మ్యాగజీన్ కథనం ప్రచురించడం గమనార్హం. ఆల్ట్ న్యూస్ సైట్ తరపున ఫ్యాక్ట్ చెకర్స్గా ఈ ఇద్దరూ పని చేస్తున్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం.. నార్వేజియన్ చట్టసభ సభ్యులు, బుక్మేకర్ల నుండి వచ్చిన అంచనాలు, పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో (PRIO) ద్వారా ఆధారంగా రేసులో సిన్హా, జుబేర్ ప్రముఖంగా నిలిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు శాంతి బహుమతి కమిటీ ఫేవరెట్‌గానూ ఈ ఇద్దరూ ఉన్నట్లు టైమ్ కథనంలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. జూన్ నెలలో 2018కి సంబంధించిన ట్వీట్ విషయంలో అరెస్టైన జుబేర్.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఉండడం గమనార్హం. నెల తర్వాత అతను జైలు నుంచి సుప్రీం కోర్టు బెయిల్ ద్వారా విడుదల అయ్యాడు. ఇక.. జుబేర్ అరెస్ట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. ‘‘భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అధ్వాన్నంగా ఉంది, జర్నలిస్ట్‌లకు ఇక్కడి ప్రభుత్వం ప్రతికూల, అసురక్షిత వాతావరణాన్ని సృష్టించింది’’ అంటూ అమెరికాలోని జర్నలిస్ట్ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం. నోబెల్ శాంతి బహుమతి 2022 కోసం.. 341 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 251 మంది, 92 సంస్థలు ఉన్నాయి. సాధారణంగా నోబెల్ కమిటీ నామినీల పేర్లను మీడియాకుగానీ, అభ్యర్థులకుగానీ అసలు తెలియజేయదు. అయితే.. కొన్ని మీడియా హౌజ్‌లు మాత్రం సర్వేల ద్వారా అభ్యర్థులను, అర్హత ఉన్నవాళ్లను పేర్లు.. వివరాలతో సహా అంచనా వేస్తుంటాయి. ఇక ఈ ఇద్దరు ఫ్యాక్ట్ చెకర్స్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఐరాస శరణార్థ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవెల్నీ, బెలారస్ ప్రతిపక్ష నేత స్వియాత్లానా, ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ డేవిడ్ అటన్‌బోరఫ్ తదితరులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 7వ తేదీన ప్రకటిస్తారు. ఇదీ చదవండి: ఈసారి టార్గెట్ జపాన్? -
‘టైమ్100’లో ఆకాశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన టైమ్100 నెక్ట్స్ జాబితాలో దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు, జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ (30) చోటు దక్కించుకున్నారు. బిజినెస్, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్ తదితర రంగాల రూపురేఖలను మార్చగలిగే సామర్థ్యాలున్న 100 మంది వర్ధమాన నాయకులతో టైమ్ మ్యాగజైన్ దీన్ని రూపొందించింది. ఇందులో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక వ్యక్తి ఆకాశ్ అంబానీయే. ఆయన కాకుండా భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త ఆమ్రపాలి గాన్ కూడా జాబితాలో ఉన్నారు. జూనియర్ అంబానీ 22 ఏళ్లకే కంపెనీ బోర్డు సభ్యుడిగా చేరారు. 42.6 కోట్ల మంది పైగా యూజర్లున్న జియోకి చైర్మన్‌గా ఇటీవల జూన్‌లోనే నియమితులయ్యారు. పారిశ్రామిక నేపథ్యం గల కుటుంబ వారసుడైన అంబానీ .. వ్యాపార పగ్గాలు చేపడతారన్న అంచనాలు సహజంగానే ఉన్నాయని, ఆయన కూడా కష్టించి పనిచేస్తున్నారని టైమ్ పేర్కొంది. ‘గూగుల్, ఫేస్బుక్ నుంచి భారీగా పెట్టుబడులు సమీకరించడంలో ఆకాశ్ కీలకపాత్ర పోషించారు‘ అని వివరించింది. మరోవైపు, అడల్ట్ కంటెంట్ క్రియేటర్ల సైట్ అయిన ’ఓన్లీఫ్యాన్స్’కి ఆమ్రపాలి గాన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2020 సెప్టెంబర్‌లో చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా చేరిన ఆమ్రపాలి ఆ తర్వాత పదోన్నతి పొందారు. అమెరికన్ సింగర్ ఎస్జెడ్ఏ, నటి సిడ్నీ స్వీనీ, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు యా మోరాంట్, టెన్నిస్ ప్లేయర్ కార్లోక్ అల్కెరాజ్ తదితరులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. -
ప్రపంచంలోనే గొప్ప ప్రాంతాల జాబితాలో కేరళ, అహ్మదాబాద్
న్యూయార్క్: భారత్‌లోని రెండు ప్రాంతాలకు అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాలు-2022 జాబితాలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం, కేరళ రాష్ట్రాలకు చోటు దక్కింది. 50 అత్యుత్తమ పర్యటక గమ్యస్థానాల్లో భారత్‌లోని ఈ రెండు ప్రాంతాలు స్థానం సంపాదించాయి. ‘ప్రయాణాల ద్వారా మానవ సంబంధాల విలువ తెలుసుకునేందుకు 2022లో ఎదురైన సవాళ్లు దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం రోడ్డు, ఆకాశ మార్గాల్లో ప్రయాణాలు పుంజుకున్నాయి. ఆతిథ్య పరిశ్రమ మళ్లీ ప్రారంభమైంది. యాత్రికులను ఆహ్వానించేందుకు సిద్ధమైంది.’ అని పేర్కొంది టైమ్ మ్యాగజైన్. భారత్‌లోని తొలి యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ నగరం అహ్మదాబాద్‌లో ఎన్నో కలగలిసి ఉన్నాయని పేర్కొంది. 'సంప్రదాయ పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ఇక్కడ పురాతన స్థలాలతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలు ఉన్నాయి. అందులో సబర్మతి నది సమీపంలో 36 ఎకరాలతో ఉన్న గాంధీ ఆశ్రమం నుంచి ప్రపంచంలోనే సుదీర్ఘ నృత్య పండుగ నవరాత్రి ఉత్సవాల వరకు చాలా ఉన్నాయి.' అని పేర్కొంది. అహ్మదాబాద్ అంటే ఒక సైన్స్ సిటీగా పేర్కొంది. మరోవైపు.. భారత్‌లోని ఆగ్నేయ తీర ప్రాంతంలో కేరళ ఒక అందమైన రాష్ట్రంగా అభివర్ణించింది టైమ్. అందమైన బీచ్‌లు, ఆలయాలు, ప్రాంతాలు ఉన్నాయని, దేవతలు నివసించే దేశంగా మారిందని పేర్కొంది. ఈ ఏడాది భారత్‌లో పర్యాటక రంగాన్ని కేరళ మరింత ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపింది. ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాను సిద్ధం చేయడానికి ఈ సంవత్సరం టైమ్ మ్యాగజైన్ దాని అంతర్జాతీయ నెట్వర్క్ కరస్పాండెంట్లు, కంట్రిబ్యూటర్ల ద్వారా తమ అనుభవాలను అందించే వారి వైపు దృష్టి సారించి స్థలాల నామినేషన్లను స్వీకరించినట్లు పేర్కొంది. జాబితాలోని మరికొన్ని ప్రాంతాలు.. వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్రాంతాల్లో యూఏఈలోని రాస్ అల్ ఖైమా, ఉతాహ్‌లోని పార్క్ సిటీ, సియోల్, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్, ద ఆర్కిటిక్, స్పెయిన్‌లోని వలెన్సియా, భూటాన్‌లోని ట్రాన్స్ భూటాన్ ట్రైల్, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్, బోగోటా, జాంబియాలోని లోవర్ జాంబేజి నేషనల్ పార్క్, ఇస్తాన్‌బుల్, కిగాలీ, ర్వాండాలు ఉన్నాయి. ఇదీ చూడండి: అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి! -
హోడ ఖామోష్..: అఫ్గాన్ అగ్నితేజం
టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితా (100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2022)లో చోటు సంపాదించిన వారిలో అఫ్గానిస్థాన్ అగ్నితేజం హోడ ఖామోష్ ఒకరు. ‘ఖామోష్’ అనేది పేరు కాదు. లక్షల గొంతుల రణనినాదం... ఇరాన్లో జన్మించింది హోడ ఖామోష్. తాను చిన్న వయసులో ఉన్నప్పుడే కుటుంబంతో పాటు అఫ్గానిస్థాన్‌కు వచ్చింది. ఆరోజుల్లో తనకు నిద్ర పట్టాలంటే అమ్మ తప్పనిసరిగా ఏదో ఒక కథ చెప్పాల్సిందే. అలా ఖామోష్ కాల్పనిక ప్రపంచంలోకి ప్రవేశించింది. ఆ ప్రపంచంలో ఎన్నో కథలు చదివింది. ఎన్నో కవిత్వాలు విన్నది. తొలిరోజుల్లో తన కాల్పనిక ప్రపంచంలో వాస్తవాలతో సంబంధం లేని ఊహాకల్పిత సాహిత్యం మాత్రమే ఉండేది. ఆ తరువాత కాలంలో మాత్రం...తన ప్రపంచంలోకి వాస్తవికత నడిచి వచ్చింది. రాజులు, రాణులు, అందమైన కోటలు, అద్భుత దీపాల స్థానంలో... నిజమైన సమాజం దర్శనమిచ్చింది. మనుషులు ఎదుర్కొనే రకరకాల సమస్యలను గురించి లోతుగా తెలుసుకోగలిగింది. తన మనసులోని వేడివేడి భావాలను కవిత్వంగా రాసేది. ‘సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజం తరఫున పనిచేయడానికి ఇది మాత్రమే చాలదు’ అనుకొని జర్నలిస్ట్ కావాలనుకుంది. ఖామోష్ ఆలోచనను హర్షించిన వారు తక్కువ. భయపెట్టిన వారు ఎక్కువ. అయితే అవేమీ తన కలను అడ్డుకోలేకపోయాయి. జర్నలిజంలో శిక్షణ పొందిన ఖామోష్ ఆ తరువాత స్థానిక పత్రికలలో పనిచేసింది. స్త్రీల హక్కులు, ఉద్యమాలపై ప్రత్యేకకథనాలు రాసింది. లోకల్ రేడియో ఛానల్స్ ప్రెజెంటర్‌గా తన గొంతు వినిపించింది. ఇదంతా ఒక ఎత్తయితే పౌరహక్కుల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం మరో ఎత్తు. ఉద్యమంలో భాగంగా ఎందరో మహిళలకు అండగా నిలిచింది. దాడులను ఎదుర్కొంది. బాధితులకు న్యాయం జరిగే వరకు మడమ తిప్పలేదు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలన మళ్లీ మొదలైన తరువాత చాలామంది కలాలు అటకెక్కాయి. గొంతులు మాట మార్చుకున్నాయి. కానీ ఖామోష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అవే అక్షరాలు...అదే గొంతు! తాలిబన్ల పాలన మొదలై అప్పటికే అయిదు నెలల దాటింది. ఆ సమయంలో ‘స్త్రీలపై జరుగుతున్న అణచివేత’ అనే అంశంపై నార్వేలో మాట్లాడే అవకాశం లభించింది. ‘ఈ సమయంలో మాట్లాడితే ప్రాణాలకే ముప్పు’ అని చాలామంది హెచ్చరించినా ఆమె భయపడలేదు. ‘నేను తప్పు చేయడం లేదు. తప్పుల గురించి మాట్లాడబోతున్నాను’ అంటూ నార్వేకి వెళ్లింది ఖామోష్. నీళ్లు నమలకుండా నిజాలు మాట్లాడింది. ఆనాటి ఆమె ప్రసంగంలో కొన్ని మాటలు... ‘నా పేరు హోడ ఖామోష్. అఫ్గానిస్థాన్‌లోని వేలాది మంది మహిళలలో నేను ఒకరిని. నేను ఏ రాజకీయపార్టీకి సానుభూతిపరురాలిని కాదు. సభ్యురాలిని కాదు. పౌరహక్కుల ఉద్యమంలో పనిచేస్తున్నాను. తాలిబన్ల పాలనలో ఉన్నాను. భయంతో గుండె వేగంగా కొట్టుకునే చోట, బుల్లెట్ల చప్పుడు నిరంతరాయంగా వినిపించే చోట ఉన్నాను’ ‘కాబుల్ తాలిబన్ల వశం అయిన తరువాత రాజ్యం పోలీసు రాజ్యం అయింది. స్త్రీలపై వివక్షత పెరిగింది. మీరు ఉండాల్సింది విద్యాలయాల్లో కాదు ఇంట్లో...అంటూ అణచివేత మొదలైంది. ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పాపానికి ముర్తాజ సమది అనే ఫొటోగ్రాఫర్‌ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. కాబుల్‌లో స్త్రీల నిరసన ప్రదర్శనకు సంబంధించిన వార్తలు రాసినందుకు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. తమ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న 70 మంది పౌరులను అరెస్ట్ చేశారు. వారిలో 40 మంది మహిళలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురిచేశారు’ నార్వే సదస్సులో అఫ్గాన్ కన్నీటి చిత్రాన్ని కళ్లకు కట్టిన ఖామోష్ ‘ఇక అంతా అయిపోయింది’ అని నిరాశ పడడం లేదు. ‘స్త్రీలను గౌరవించే రోజులు, స్త్రీల హక్కులు రక్షించబడే రోజులు తప్పకుండా వస్తాయి’ అంటున్న ఖామోష్లో ‘ఆశ’ అనే జ్వాల ఉజ్వలంగా వెలుగుతూనే ఉంది. -
అది కాళరాత్రి: జెలెన్స్కీ.. ఆయనపై ‘టైమ్’ కవర్ స్టోరీ
యుద్ధం మొదలైన రోజే కుటుంబంతో సహా తనను బంధించేందుకు, హతమార్చేందుకు రష్యా ప్రయత్నించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని రష్యా దళాలు కీవ్‌లో దిగాయి. మా ఆవిడ, నేను పిల్లలను లేపి విషయం చెప్పాం. అప్పటికే బాంబుల వర్షం మొదలైంది’’ అన్నారు. టైమ్ మేగజైన్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. టైమ్ తాజా సంచికలో ఆయనపై కవర్‌స్టోరీ కథనం ప్రచురించింది. -
రష్యా బలగాలు మా దాకా వచ్చాయి: జెలెన్స్కీ
ఉక్రెయిన్ యుద్ధంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీను పాశ్చాత్య దేశాలు హీరోగా అభివర్ణిస్తే.. కొన్ని దేశాల నుంచి మాత్రం విమర్శలతో ముంచెత్తాయి. అగ్రరాజ్యం అండ చూసుకుని.. అనవసరంగా ఉక్రెయిన్ను యుద్ధ ఊబిలోకి దించాడంటూ తిట్టిపోశారు కొందరు. అయినా జెలెన్స్కీ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోవడం లేదు. పోరాటం వెనుక ప్రమేయాలు లేవని, దేశం నుంచి ఇంచు భూమి కూడా వదులుకోబోమని, కడదాకా పోరాడతామని అంటున్నాడు. తాజాగా ఆయన ముఖచిత్రంతో టైమ్ మ్యాగజైన్ ‘హౌ జెలెన్స్కీ లీడ్స్’ పేరుతో ఓ కవర్‌స్టోరీ ప్రచురించింది. రిపోర్టర్ సైమన్ షూస్టర్, అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఆయన భార్య ఒలెనా జెలెన్స్కా, ఉక్రెయిన్ కీలక అధికారులను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా.. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎదుర్కొంటున్న అనుభవాల్ని, మానసిక సంఘర్షణలను వివరించాడాయన. ‘‘ఆ ఉదయం నాకు బాగా గుర్తుంది. రష్యా బలగాల దుశ్చర్యతో.. పొద్దుపొద్దునే బాంబుల మోత మోగింది. నేను, నా భార్య ఒలెనా, 17 ఏళ్ల కూతురు, తొమ్మిదేళ్ల కొడుకు నిద్ర లేచాం. మా ఇద్దరు పిల్లలకు బాంబుల దాడి మొదలైందని చెప్పాం. TIME's new cover: Over two weeks in April @shustry went inside Volodymyr Zelensky's compound for a look at how the Ukrainian President and his top advisers are experiencing the war https://t.co/9bmZXfvy8e pic.twitter.com/4PAxf97eNM — TIME (@TIME) April 28, 2022 వెంటనే కొంతమంది అధికారులు మా దగ్గరికి వచ్చారు. కుటుంబంతో సహా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. రష్యా బలగాలు ఏ క్షణమైనా కీవ్‌లో అడుగుపెట్టొచ్చని, కుటుంబంతో సహా తనను చంపే అవకాశాలు ఉన్నాయని వాళ్లు మమ్మల్ని హెచ్చరించారు. అధ్యక్ష భవనం నుంచి బయటకు చూస్తే.. విధ్వంసం, బాంబుల మోతే. సినిమాల్లో తప్ప అలాంటి దృశ్యాలేనాడూ చూడలేదు. అధ్యక్ష భవనం గేటు ముందు భారీగా సిబ్బంది మోహరించారు. ఆ రాత్రంతా ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ప్రాంగణంలో లైట్లు ఆర్పేశారు. నాకు, నా సిబ్బందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించమని ఇచ్చారు. ఏ క్షణం ఏ జరుగుతుందో అనే ఆందోళనతో అంతా ఉన్నారు. కానీ, ధైర్యం చెప్పా వాళ్లకు. రష్యా బలగాలు దాదాపుగా మా దగ్గరికి వచ్చేశాయి. కానీ, మా దళాలు గట్టిగానే ప్రతిఘటించాయి. అని జెలెన్స్కీ గుర్తు చేసుకున్నాడు. ఇక యుద్ధం తొలినాటి పరిస్థితులపై ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ అనుభవజ్ఞుడైన ఒలెక్సీ అరెస్టోవిచ్ స్పందించాడు. ఆరోజు దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. జెలెన్స్కీ, ఆయన భార్యాపిల్లలు లోపల ఉండగానే రష్యన్ దళాలు రెండుసార్లు అధ్యక్ష భవనం ప్రాంగణంపై దాడి చేయడానికి ప్రయత్నించాయని పేర్కొన్నాడు. చదవండి: తూర్పున దాడి ఉధృతం -
పుతిన్‌పై టైమ్ మ్యాగజైన్ సంచలనం! ఇదీ అసలు కథ
Fact Check On Putin Face With Hitler On Time Cover: ఉరుము ఉరిమి మంగలం (మట్టిపాత్ర) మీద పడ్డట్లు.. నాటో చేరిక అభ్యంతరాలను చూపుతూ ఉక్రెయిన్‌పై రష్యా తన ప్రతాపం చూపిస్తోంది. అందుకే ఉక్రెయిన్ దీనస్థితిని చూసి జనాలంతా జాలిపడుతున్నారు. శక్తివంతమైన తమ బలగాలను ఉక్రెయిన్ అడ్డుకుంటుండడంతో.. ఆ కోపం పౌరులపై చూపిస్తోంది రష్యా. ఇదిలా ఉంటే ఈ మారణహోమానికి కారకుడైన పుతిన్‌ను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో తిట్టిపోస్తోంది. టైమ్ మ్యాగజైన్ సైతం తన లేటెస్ట్ ఎడిషన్ ‘రి రిటర్న్ ఆఫ్ హిస్టరీ.. హౌ పుతిన్ షట్టర్డ్ యూరోప్స్ డ్రీమ్స్’ పేరిట కవర్ స్టోరీని పబ్లిష్ చేసింది. దానిపై పుతిన్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఫేస్‌తో కలగలిసిన కవర్ చిత్రం ఉండడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కళ్లతో పాటు, హిట్లర్ మీసాలు సైతం పుతిన్‌కు అన్వయింపజేసి ఆ కవర్ చిత్రాలను ప్రచురించినట్లు కనిపిస్తోంది. అయితే.. టైమ్ మ్యాగజైన్ ఇలా రెండు ఫొటోలతో కవర్ పేజీలను ప్రచురించిన దాఖలాలు లేవ్!. అందుకే క్రాస్ చెక్ కోసం ఫ్యాక్ట్ చెక్ ప్రయత్నించగా.. ఆ ఫొటోలు ఫేక్ అని తేలింది. ఒరిజినల్ టైం అదే టైటిల్‌తో కవర్ స్టోరీని మార్చి 14-21 ఎడిషన్ కోసం తీసుకొచ్చింది. దానిపై ఫొటో జర్మనీ యుద్ధ ట్యాంకర్ ఫొటోను పబ్లిష్ చేసింది. TIME’s new cover: How Putin shattered Europe’s dreams https://t.co/jXsRFKrW8B pic.twitter.com/hDJs0ptJs0 — TIME (@TIME) February 25, 2022 అయితే ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోలు మాత్రం ఫిబ్రవరి 28-మార్చి 7వ తేదీల పేరిట వైరల్ అవుతున్నాయి. My TIME artwork has gone viral - so I thought it would be appropriate for me to write a little about it. The image is one out of a sequence of three I created on the day Russia invaded Ukraine. I felt the official cover by TIME was uninspired and lacked conviction. pic.twitter.com/m5P5rorqgt — Patrick Mulder 🏴 (@MrPatrickMulder) February 28, 2022 గ్రాఫిక్ డిజైనర్ ప్యాట్రిక్ మల్డర్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి సందర్భంగా ఈ ఇమేజ్‌లను క్రియేట్ చేశాడట. తద్వారా జనాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అది ఇలా మరోలా జనాల్లోకి వెళ్లింది. How I made the cover. pic.twitter.com/LFZVOAhNMo — Patrick Mulder 🏴 (@MrPatrickMulder) February 26, 2022 -
రూ. 25 లక్షల కోట్ల సంపద.. రూ.83 వేల కోట్ల ఆదాయపు పన్ను.. ఇంకా మరెన్నో
Elon Musk Achievements In 2021: ఆకాశమే హద్దుగా కొంగొత్త ఆవిష్కరణలు చేస్తూ నిబంధనలకు కట్టబడని వ్యక్తిగా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు ఎలన్‌మస్క్. ఆయన జీవితంలో 2021 ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఎన్నో ప్రత్యేకమైన మైలురాళ్లు ఈ ఏడాదిలోనే ఆయన అధిగమించారు. దక్షిణాఫ్రికా మీదుగా దక్షిణాఫ్రికాలో 1971 జూన్ 28న జన్మించిన ఎలన్‌మస్క్ పెరుగుతున్న క్రమంలో కెనడా మీదుగా అమెరికా వచ్చి అక్కడ పౌరసత్వం పొందారు. అక్కడగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మారుతున్న కాలానికి తగ్గట్టు ముందుగానే ఇంటర్నెట్కి ఎడాప్ట్ అయ్యాడు. ఆ తర్వాత పేపాల్ ద్వారా మంచి ఎంట్రప్యూనర్‌గా గుర్తింపు పొందాడు. అటు నుంచి టెస్లా, స్పేస్‌ఎక్స్‌ల వరకు ఎలన్‌మస్క్ ప్రయాణం అప్రతిహాతంగా సాగుతోంది. ప్రస్తుతం 50వ పడిలో ఉన్న ఎలన్‌మస్క్ 2021లో అనేక మైలురాళ్లను చేరుకున్నాడు. - టెస్లా మార్కెట్ క్యాపిటల్ ఆకాశమే హద్దుగా పెరిగిపోవడంతో ఒక్కసారిగా ఎలన్మస్క సంపద కొండంతయి కూర్చుంది. అప్పటి వరకు ప్రపంచ కుబేరిగా నంబర్ వన్ స్థానంలో ఉన్న జెఫ్బేజోస్ని వెనక్కి నెట్టి 300 బిలియన్ డాలర్లతో అత్యంత ఐశ్వర్యవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం ఎలన్‌మస్క్ నెటవర్త్ 335 బిలియన్ డాలర్ల ( ఇండియన్ కరెన్సీలో 25 లక్షల కోట్లు)ని అంచనా. - సంపాదించడడమే కాదు ప్రపంచలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆదాయపు పన్ను చెల్లించిన ఘనత కూడా ఎలన్‌మస్క్‌కే దక్కింది. ఈ ఏడాది ఆయన ఏకంగా 11 బిలియన్ డాలర్లు (రూ. 83 వేలకు పైగా కోట్లు) ఇన్కంట్యాక్స్గా చెల్లించాడు. ఈ భూగోళంపై ఉన్న చాలా దేశాల జీడీపీల కంటే ఇది ఎక్కువ. - ఎలన్‌మస్క్ వరుసగా సాధిస్తున్న విజయాలను, భవిష్యత్తులో అతని ప్రణాళికలు చేరుకునే లక్ష్యాలను అంచనా వేసిన టైం మ్యాగజైన్ ఎలన్‌మస్క్‌ని పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించింది. కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది. - మెగా ఫ్యాక్టరీలకే తెలిసిన పారిశ్రామిక ప్రపంచానికి గిగాఫ్యాక్టరీలు అనే కొత్త కాన్సెప్టును పరిచయం చేసిన ఘనుడు ఎలన్‌మస్క్. భారీ ఎత్తున టెస్లా కార్లు తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎలన్‌మస్క్ నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మించాడు. వీటి ద్వారా ఈ ఏడాది టెస్లా కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక కార్ల (దాదాపు 5 లక్షలు)ను ఉత్పత్తి చేయగలిగింది. - ఎలన్‌మస్క్ వ్యవహార శైలిపై ఎన్ని వివాదాలు ఉన్నా అతని ప్రతిభ మీద ఎవ్వరికీ ఎటువంటి సందేహాలు లేవు. అందువల్లే నాసా సంస్థ తన అంతరిక్ష పరిశోధనల విషయంలో 3 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును ఎలన్‌మస్క్‌కి కట్టబెట్టింది. దీనిపై జెఫ్‌బేజోస్ బ్లూ ఆరిజిన్ కోర్టుకు వెళ్లినా.. చివరకు ఎలన్‌మస్క్ పై చేయి సాధించారు. - తన స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారా ఎనిమిది మంది వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కి తీసుకెళ్లి రికార్డు సృష్టించాడు. - భవిష్యత్తు టెక్నాలజీగా పేర్కొంటున్న లో ఎర్త్ ఆర్బిట్ (లియో) విభాగంలోనూ ఎలన్‌మస్క్ దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఎలన్‌మస్క్‌కి చెందిన స్టార్‌లింక్ సంస్థ 900లకు పైగా కొత్త శాటిలైట్లను ప్రయోగించింది. వీటి ద్వారా టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ విభాగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. చదవండి:పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు ఏం చేసేవాడో తెలుసా? -
‘అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ సిమోన్ బైల్స్
విఖ్యాత టైమ్ మేగజైన్ 2021కి గానూ ‘అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’గా అమెరికన్ స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌ను ఎంపిక చేసింది. నాలుగుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన బైల్స్ టోక్యో ఒలింపిక్స్ సమయంలో తాను ‘ద ట్విస్టీస్’తో బాధపడుతున్నట్లు చెప్పి నాలుగు బంగారు పతక ఈవెంట్ల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం అమెరికా జిమ్నాస్టిక్స్ టీమ్ మాజీ డాక్టర్ ల్యారీ నాసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సెనేట్ ముందు సాక్ష్యం చెప్పింది. -
టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎలన్ మస్క్
Time's person of the year 2021: టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్–2021’గా టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ను ఎంపిక చేసింది. అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షోమాన్‌గా ఆయనను అభివర్ణించింది. అంతరిక్షయాన సంస్థ స్సేస్ ఎక్స్‌కు కూడా మస్క్ సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ఎలన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. మధ్యలో ఇద్దరి మధ్య దోబుచులాట నడిచినప్పటికీ.. చివరికి తన సంపదను అమాంతం పెంచేసుకుని అపర కుబేరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు యాభై ఏళ్ల మస్క్. ప్రస్తుతం సంపద దాదాపు 253 బిలియన్ డాలర్లు ఉంది. ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా గుర్తింపు పొందిన టెస్లాలో మస్క్‌కు 17 శాతం షేర్లున్నాయి(చాలా వరకు అమ్మేసుకుంటూ పోతున్నాడు). 1927 నుంచి ప్రతి క్యాలెండర్ ఇయర్ ముగింపులో పర్సన్ ఆఫ్ ది ఇయర్ వార్తా కథనాన్ని టైమ్ మ్యాగజైన్ ప్రచురిస్తున్నది. ఆ వ్యక్తి ఫొటోను కవర్‌పేజీపై ముద్రిస్తుంది. ఏడాది కాలంలో వివిధ అంశాల్లో ఆయా వ్యక్తుల ఇన్ఫ్ల్యూయెన్స్ ఆధారంగా పర్సన్ ఆఫ్ ది ఇయర్`ను ఎంపిక చేస్తుంది. సోషల్ మీడియాలో మస్క్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, అలాగే ఇన్వెస్టర్లకూ ఆయనపై అంతే నమ్మకమని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ముఖ్యంగా క్రిప్టో మార్కెట్‌ను ఒకే ఒక్క ట్వీట్‌తో శాసిస్తూ వస్తున్నాడంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఇక ట్విట్టర్లో ఎలన్ మస్క్ 6.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టెస్లా సీఈవోగానే కాకుండా సొంత రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కూ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు యాభై ఏళ్ల ఎలన్ మస్క్. టెస్లా నుంచి పైసా కూడా జీతంగా తీసుకోకుండా.. తన వాటా ద్వారా లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇక స్పేస్ఎక్స్ ఒప్పందాలు-షేర్లతోనూ బిలియన్లు సంపాదిస్తున్నాడు. వీటితో పాటు ది బోరింగ్ కంపెనీ అనే మౌలిక వసతుల కంపెనీ, బ్రెయిన్ చిప్ స్టార్టప్ ‘న్యూరాలింక్’లకు వ్యవస్థాపకుడి హోదాలో పని చేస్తున్నాడు. చదవండి: ఎలన్ మస్క్ వెటకారం! ప్రధాని పైనా సెటైర్లు -
11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ
TIME Cover Ft. Zuckerberg: మార్క్ జుకమ్‌బర్గ్ ఈ పేరు అందరికీ సుపరిచతమైనదే. ఫేస్‌బుక్‌తో సోషల్‌మీడియా ప్రస్థానానికి నాంది పలికాడు మార్క్. ఫేస్‌బుక్‌ను స్థాపించడంలో జుకమ్బర్డ్ కీలకపాత్రను పోషించాడు. ఫేస్బుక్ స్థాపనతో అంచెలచెలుగా జుకమ్‌బర్గ్ ప్రపంచంలోనే సంపన్నుల జాబితాలో చేరాడు. ఫేస్బుక్ ఒక్కటే కాకుండా...వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వంటి సోషల్ మీడియా యాప్స్‌ను కూడా శాసించే రేంజ్‌కు జుకమ్‌బర్గ్ వెళ్లాడు. ఫేస్‌బుక్‌పై భారీ ఎత్తున ఆరోపణలు...! గత కొద్ది రోజుల నుంచి ఫేస్‌బుక్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫేస్బుక్ కొంతమంది వ్యక్తుల కోసమే పనిచేస్తుదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఫేస్‌బుక్‌పై దుమ్మెతి పోసింది. కొంత మంది వీఐపీల ప్రైవసీ విషయంలో ఫేస్బుక్ వారిని అందలాలను ఎక్కిస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేసింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక్కటే కాదు ఫ్రాన్సెస్ హాగెన్ అనే మాజీ ఉద్యోగిని కూడా ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలను చేసింది. ఫేస్బుక్ దృష్టిలో యూజర్ల‘భద్రత కంటే లాభాలే ముఖ్యం’ అంటూ యూఎస్ కాంగ్రెస్ వేదికగా పలు సంచలన రహస్య పత్రాలను బయటపెట్టింది. దీంతో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకమ్‌బర్గ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. మార్క్ జుకమ్బర్గ్పై ప్రపంచవ్యాప్తంగా అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. పర్సన్ ఆఫ్ ది ఇయర్ నుంచి...డిలీట్ వరకు...! తాజాగా ఫేస్బుక్ అధినేత మార్క్ జుకమ్ బర్గ్ ఫోటోను ప్రముఖ అమెరికన్ మ్యాగజీన్ టైమ్స్ మ్యాగజీన్ కవర్ మీద ప్రచురించింది. ఇప్పుడు ఈ ఫోటోపై సర్వత్రా చర్చ జరుగుతుంది. టైమ్స్ మ్యాగజీన్ జుకమ్‌బర్గ్ ఫోటోపై...‘డిలీట్ ఫేస్బుక్..క్యాన్సల్...డిలీట్... ’అంటూ మ్యాగజీన్ కవర్‌ను రూపోందించింది. ఫేస్బుక్ మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెస్ హాగెన్ ఫేస్‌బుక్‌పై బయటపెట్టిన రహస్య పత్రాలను ఉద్దేశించి టైమ్స్ మ్యాగజీన్ జుకమ్‌బర్గ్ కవర్ఫోటోను ప్రచురించింది. ఇక్కడ విషయమేమిటంటే ఇదే టైమ్స్ మ్యాగజీన్ 2010లో పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా మార్క్ జుకమ్‌బర్గ్ ఫోటోను కవర్‌పేజీపై ప్రచురించింది. ఆ సమయంలో మార్క్ ఏవిధంగా ఎదిగాడనే అంశాలను టైమ్స్ తన మ్యాగజీన్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మార్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారాడని సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు. చదవండి: Jeff Bezos and Elon Musk: వీళ్లిద్దరూ ఏక్ నెంబర్ 'పిసినారులు' -
Shilpa Yarlagadda: పింక్ రింగ్ శిల్ప!
తాజాగా టైమ్ మ్యాగజీన్ కవర్ ఫోటో మీద ప్రిన్స్ హారీ మేఘనా మెర్కెల్ జంట ఆకర్షణీయంగా కనిపించింది. అయితే వీరిద్దరూ ధరించిన డ్రెస్‌లు, ఆభరణాలలో ముఖ్యంగా మెర్కెల్ వేలికి తొడిగిన ‘డ్యూయెట్ పింక్ డైమండ్ రింగు’ ప్రత్యేకంగా ఉండడంతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక మహిళ మరొకరికి మద్దతు ఇస్తోంది అని చెప్పే ‘పింక్ వాగ్దానం’కు గుర్తుగా ఈ రింగును రూపొందించినట్లుగా ఆ ఉంగరాన్ని డిజైన్ చేసిన సంస్థ ‘శిఫాన్’ చెబుతోంది. రింగు బాగా పాపులర్ అవ్వడంతో రింగును రూపొందించిన డిజైనర్ శిల్పా యార్లగడ్డ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. శిల్ప పేరు తెరమీదకు రావడానికి ఒక పింక్ డైమండ్ రింగేగాక, చిన్న వయసులోనే డైమండ్ జ్యూవెలరీ స్టార్టప్‌ను ప్రారంభించి విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తూ, తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి వినియోగించడం మరో కారణం. ఒక పక్క తన చదువు ఇంకా పూర్తికాలేదు. కానీ తను ఒక సక్సెస్ ఫుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తూ.. తనలాంటి ఎంతోమందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా పనిచేస్తోంది శిల్పా యార్లగడ్డ. శిఫాన్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో పెరిగిన శిల్పా యార్లగడ్డ భారత సంతతికి చెందిన అమ్మాయి. శిల్ప హైస్కూల్లో ఉన్నప్పుడు నాసా, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లలో ఇంటర్న్‌షిప్ చేసింది. అప్పుడు కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంది. ఈ క్రమంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎమ్ఐటీ మొదటి ఏడాది చదివేటప్పుడు.. తన చుట్టుపక్కల ఉన్న జ్యువెలరీ సంస్థలన్నీ పురుషులే నిర్వహించడం చూసేది. ఈ రంగంలోకి మహిళలు కూడా అడుగుపెట్టాలి అని భావించి... వివిధ రకాల ఆభరణాలను ఎలా తయారు చేయాలి? తక్కువ ఖర్చులో మన్నిక కలిగిన ఆభరణాల తయారీ ఎలా... అనే అంశాలపై గూగుల్‌లో త్రీవంగా వెతికేది. త్రీడీ ప్రింటింగ్ ద్వారా తక్కువ ఖర్చులో అందమైన జ్యూవెలరీ తయారు చేయవచ్చని తెలుసుకుని స్నేహితులతో కలిసి 2017లో డైమండ్స్‌కు బాగా పేరున్న న్యూయార్క్‌లో ‘శిఫాన్’ పేరిట జ్యూవెలరీ స్టార్టప్‌ను ప్రారంభించింది. శిఫాన్ ప్రారంభానికి ‘అన్‌కట్ జెమ్స్’ సినిమా కూడా శిల్పకు ప్రేరణ కలిగించింది. వజ్రాలతో తయారు చేసిన సింగిల్ పీస్ జ్యూవెలరీని విక్రయించడం ప్రారంభించింది. 2 018లో ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో స్టైలిస్ట్ నికోల్ కిడ్మ్యాన్స్ క్లైంట్ శిఫాన్ సంస్థ రూపొందించిన రింగ్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడవడంతో అప్పుడు శిఫాన్కు మంచి గుర్తింపు వచి్చంది. అప్పటి నుంచి శిఫాన్ డైమండ్ జ్యూవెలరీ విక్రయాలు పెరిగాయి. డ్యూయెట్ హూప్స్.. గతేడాది నవంబర్‌లో ‘డ్యూయెట్ హూప్స్’ పేరుమీద రెండో జ్యూవెలరీని ప్రారంభించింది శిల్పా యార్లగడ్డ. ఆదర్శవంతమైన దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పింక్ డైమండ్ రింగును అందుబాటులోకి తీసుకొచ్చారు. పింక్ డైమండ్ రింగు స్పైరల్ ఆకారంలో అడ్జెస్టబుల్‌గా ఉంటుంది. మొదట ఒక పెద్ద సైజులో డైమండ్, దాని తరువాత చిన్న డైమండ్ ఉండడం ఈ రింగు ప్రత్యేకత. ఈ మోడల్ రింగును ఆమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ఒబామా, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ధరించడంతో ఆ మోడల్ బాగా పాపులర్ అయింది. అయితే ఈ పింక్ రింగును అమ్మగా వచ్చే ఆదాయంలో యాభై శాతం డబ్బును ‘స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్’కు శిల్ప అందిస్తోంది. ఇప్పటికే పెప్పర్, ఇటెర్నెవా, కిన్షిప్, సీ స్టార్ వంటి కంపెనీలకు నిధులు సమకూర్చింది. కాగా పింక్ రింగ్ ధర 155 డాలర్ల నుంచి 780 డాలర్లు ఉండడం విశేషం. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ ఫైనలియర్ చదువుతోన్న శిల్ప తన చదువు పూర్తయ్యాక పూర్తి సమయాన్ని శిఫాన్ కోసం కేటాయించనుంది. కాలం తిరిగి రాదు జ్యూవెలరీ తయారీ పరిశ్రమ మహిళలకు సంబంధించినది. కానీ ఈ పరిశ్రమలన్నీ పురుషులే నిర్వహిస్తున్నారు. అందుకే ఈ రంగంలో ఎక్కువమంది మహిళలు రావాలనుకున్నాను. ఈ క్రమంలోనే స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్లకు నిధులు సమకూర్చి ప్రోత్సహిస్తున్నాను. ఒక పక్క చదువుకూంటూ మరోపక్క ఒక కంపెనీ స్థాపించి దాని ఎదుగుదలకు కృషిచేయడం సవాలుతో కూడుకున్నది. కానీ ‘జీవితంలో ఏదైనా తిరిగి తెచ్చుకోవచ్చు గానీ కరిగిపోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోలేం’ అని ఒకరిచి్చన సలహా నా మనస్సుకు హత్తుకోవడంతో ఈ రెండూ చేయగలుగుతున్నాను. చదవండి: Mystery: న్యోస్ సరస్సు.. రాత్రి రాత్రే ఆ ఊళ్లన్నీ శ్మశానాలైపోయాయి! -
టైమ్ అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మోదీ, మమతా బెనర్జీ
న్యూయార్క్: ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ 2021వ సంవత్సరానికి గాను బుధవారం విడుదల చేసిన ‘ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల’ జాబితాలో భారత్ నుంచి ముగ్గురికి స్థానం లభించింది. ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రిన్స్ హ్యారీ–మెఘన్ మెర్కెల్ దంపతులు, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడు, అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ బరాదర్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత మూడవ కీలకమైన నాయకుడు నరేంద్ర మోదీ అని టైమ్ పత్రిక ప్రొఫైల్‌లో పేర్కొంది. ఈ ప్రొఫైల్‌ను సీఎన్ఎన్ జర్నలిస్టు ఫరీద్ జకారియా రాశారు. భారతదేశాన్ని నరేంద్ర మోదీ లౌకికవాదం నుంచి హిందూ జాతీయవాదం వైపు నెడుతున్నారని విమర్శలు గుప్పించారు. దేశంలోని ముస్లిం మైనార్టీల హక్కులను హరిస్తున్నారని, అమాయక జర్నలిస్టులను జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు. టైమ్ అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో టెన్నిస్ ప్లేయర్ నవోమీ ఒసాకా, రష్యా ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ, గాయకురాలు బ్రిట్నీ స్పియర్స్, ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్, హాలీవుడ్ నటీమణి కేట్ విన్స్లెట్, ఆసియన్ పసిఫిక్ పాలసీ అండ్ ప్లానింగ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంజూష పి.కులకర్ణి తదితరులు చోటు దక్కించుకున్నారు. -
టైమ్ మ్యాగజైన్లో జియో, బైజూస్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్, ఎడ్టెక్ స్టార్టప్ సంస్థ బైజూస్ చోటు దక్కించుకున్నాయి. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ దీన్ని తొలిసారిగా రూపొందించింది. భవిష్యత్‌కు రూపమిస్తున్న కంపెనీలకు ఈ లిస్టులో చోటు కల్పించినట్లు టైమ్ తమ వెబ్సైట్లో పేర్కొంది. హెల్త్‌కేర్, వినోదం, రవాణా, టెక్నాలజీ సహా పలు రంగాల కంపెనీలను టైమ్ ఇందుకోసం పరిశీలించింది. నవకల్పనలు, ప్రభావం చూపగలిగే సామర్థ్యం, లీడర్షిప్, ఆశయాలు, విజయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ‘స్మార్ట్‌గా రీసైక్లింగ్ చేసే విధానాలను ఆవిష్కరించిన టెక్ స్టార్టప్, భవిష్యత్తులో నగదు స్వరూపాన్ని మార్చబోతున్న క్రిప్టోకరెన్సీ సంస్థ మొదలుకుని ప్రస్తుత.. భవిష్యత్ అవసరాలకు కావాల్సిన టీకాలను రూపొందిస్తున్న ఫార్మా దిగ్గజాల దాకా 100 పైగా కంపెనీలను పరిశీలించాం. ఈ వ్యాపారాలు.. వాటికి సారథ్యం వహిస్తున్న నాయకులు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు‘ అని టైమ్ తెలిపింది. ఆవిష్కర్తల సరసన జియో..: నవకల్పనల ఆవిష్కర్తల కేటగిరీలో జియో ప్లాట్‌ఫామ్స్‌ను టైమ్ చేర్చింది. జూమ్, అడిడాస్, టిక్‌టాక్, ఐకియా, మోడెర్నా, నెట్‌ఫ్లిక్స్ తదితర సంస్థలు ఈ విభాగంలో ఉన్నాయి. ‘గత కొన్నేళ్లుగా దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ .. భారత్‌లో అతి పెద్ద 4జీ నెట్‌వర్క్‌ను నిర్మించింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ రేట్లకే డేటాను అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్ వ్యాపారాలకు హోల్డింగ్ కంపెనీ అయిన జియో ప్లాట్‌ఫామ్స్‌కి గల 41 కోట్ల మంది పైగా సబ్స్క్రయిబర్స్కు చేరువయ్యేందుకు పలు దిగ్గజ ఇన్వెస్టర్లు పోటీపడుతున్నారు‘ అని టైమ్ మ్యాగజైన్ తెలిపింది. జియో గతేడాది 20 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు సమీకరించడం తెలిసిందే. డిస్రప్టర్స్ కేటగిరీలో బైజూస్ వినూత్న ఆవిష్కరణలతో మార్కెట్‌ను కుదిపేసిన కంపెనీల కేటగిరీలో బైజూస్ చోటు దక్కించుకుంది. టెస్లా, హువావే, షాపిఫై, ఎయిర్‌బీఎన్‌బీ, డీడీ చషింగ్ తదితర సంస్థలు ఈ లిస్టులో ఉన్నాయి. ‘అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చన్నది భారతీయ ఈ–లెర్నింగ్ స్టార్టప్ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కి బాగా తెలుసు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో యూజర్ల సంఖ్య రెట్టింపై 8 కోట్లకు చేరే క్రమంలో టెన్సెంట్, బ్లాక్‌రాక్ లాంటి దిగ్గజ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకున్న నిధులతో ఆయన పలు సంస్థలు కొనుగోలు చేశారు‘ అని టైమ్ పేర్కొంది. బైజూస్ ఇటీవలే వైట్‌హ్యాట్ జూనియర్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తయారీ సంస్థ ఓస్మో మొదలైన సంస్థలను కొనుగోలు చేసింది. అలాగే, అమెరికా, బ్రిటన్, ఇండోనేసియా, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలకు కూడా కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. -
నన్ను బెదిరించలేరు, కొనలేరు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ భారతీయ మహిళా రైతులకు అంకితం ఇచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులపై ప్రత్యేక కథనాన్ని రాసింది. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రి వద్ద జరుగుతున్న రైతు నిరసనల్లో కీలక పాత్ర పోషిస్తున్న 20 మంది మహిళా రైతులు చంకలో బిడ్డల్ని ఎత్తుకొని నినాదాలు చేస్తున్న ఫొటోని మార్చి సంచికలో కవర్ పేజీగా ప్రచురించింది. ‘‘నన్ను బెదిరించలేరు, నన్ను కొనలేరు’’ శీర్షికతో ఉన్న ఆ కథనంలో ఎన్ని బాధలు ఎదురైనా వెన్ను చూపకుండా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా రైతులు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారని కీర్తించింది. నిరసనలు కట్టిపెట్టి మహిళల్ని, వృద్ధుల్ని వెనక్కి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం చెప్పడం, సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి కూడా మహిళలు వెనక్కి వెళ్లేలా బుజ్జగించండి అంటూ చెప్పినప్పటికీ తమ గళం వినిపిస్తూనే ఉన్నారని నీలాంజన భౌమిక్ రాసిన ఆ కథనం పేర్కొంది. -
టైమ్ 100లో భీంఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్
న్యూయార్క్: ట్విట్టర్ ఉన్నతస్థాయి న్యాయవాది విజయ గద్దెతో యూకె ఆర్థిక మంత్రి రిషి సునక్ సహా, భారతీయ సంతతికి చెందిన సామాజిక కార్యకర్తకు టైమ్ మ్యాగజైన్ వార్షిక ‘’ఎమర్జింగ్ లీడర్స్హూ ఆర్ షేపింగ్ ద ఫ్యూచర్’’జాబితాలో చోటు సంపాదించుకున్నారు. భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ ఎదుగుతోన్న 100 మంది ప్రపంచ స్థాయి అత్యంత ప్రతిభావంతమైన నేతల పేర్లను 2021 టైమ్ 100 జాబితా ప్రకటిస్తుంది. ‘‘ఈ జాబితాలో చేరిన వ్యక్తులంతా చరిత్రసృష్టిస్తారు. నిజానికి చాలా మంది ఆ పనిచేసే ఉంటారు’’. టైమ్ 100 ఎడిటోరియల్ డైరెక్టర్ డాన్మాక్సై చెప్పారు. ♦ టైమ్ 100 జాబితాలో పేరు దక్కించుకున్న మిగిలిన భారతీయ సంతతికి చెందిన నేతలు ఇన్‌స్టాకార్ట్ వ్యవస్థాపకులు, సీఈఓ అపూర్వ మెహతా, డాక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ‘గెట్ ఆన్ పీపీ ఈ’శిఖా గుప్తా, మరో స్వచ్ఛంద సంస్థకు చెందిన రోహన్ పావులూరి ఉన్నారు. ♦ భీంఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ కూడా ప్రపంచస్థాయి ప్రముఖ నేతల సరసన చేరారు’’ఇక టైమ్ మ్యాగజైన్. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ప్రొఫైల్‌లో ‘‘కొద్దికాలం క్రితం ఈ 40 ఏళ్ల బ్రిటన్‌లోని చాలా తక్కువ మందికి తెలిసిన జూనియర్ మినిస్టర్ అతి స్వల్పకాలంలోనే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు’అని రాశారు. సునాక్ దేశంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన రాజకీయ వేత్త ’’అని పేర్కొనడం గమనార్హం. ♦ జనవరి 6న క్యాపిటల్ ఎటాక్ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎకౌంట్‌ని రద్దు చేస్తున్నట్టు ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సేకి చెప్పింది విజయ గద్దె అన్న విషయాన్ని ప్రస్తావించిన టైమ్ ప్రొఫైల్, అత్యంత శక్తివంతమైన ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దెని ప్రశంసించింది. ♦ భీం ఆర్మీ నాయకుడు 34 ఏళ్ల చంద్రశేఖర్ ఆజాద్ నడుపుతోన్న పాఠశాలలు విద్య ద్వారా దళితుల్లో పేదరికాన్ని పారదోలేందుకు కృషి చేస్తున్నాయి. కులపరమైన అణచివేత, హింసపై గళం విప్పుతూ, వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది’అంటూ భీం ఆర్మీ నాయకుడిని గురించి టైం ప్రస్తావించింది. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై భీంఆర్మీ ఉద్యమాన్ని టైమ్ గుర్తించింది. ♦ వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్‌లో గుప్తా లేకపోయినప్పటికీ, ఆయన అత్యంత కీలక కోవిడ్ సంక్షోభకాలంలో వైట్‌హౌస్ లో నాయకత్వ లేమిని పూరిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులకు అవసరమైన ఆరోగ్య పరికరాలను సమకూర్చారు. గుప్తా సారథ్యంలో 6.5 మిలియన్ల పీపీఈ కిట్లను ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి అందించగలిగారు. ♦ 25 ఏళ్ల పావులూరి ఫ్రీ ఆన్లైన్ టూల్‌కి ఆద్యుడు. కోవిడ్–19 సంక్షోభంలో అగ్రరాజ్యం అమెరికా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. వీటి నుంచి బయటపడేందుకు పావులూరి తయారుచేసిన యాప్ సమర్థంగా పనిచేసింది. -
టైమ్ 100 జాబితాలో భారతీయులు
న్యూయార్క్: ట్విట్టర్ ఉన్నతస్థాయి న్యాయవాది విజయ గద్దెతో యూకె ఆర్థిక మంత్రి రిషి సునక్ సహా, భారతీయ సంతతికి చెందిన సామాజిక కార్యకర్తకు టైమ్ మ్యాగజైన్ వార్షిక ‘’ఎమర్జింగ్ లీడర్స్ çహూ ఆర్ షేపింగ్ ద ఫ్యూచర్’’జాబితాలో చోటు సంపాదించుకున్నారు. భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ ఎదుగుతోన్న 100 మంది ప్రపంచ స్థాయి అత్యంత ప్రతిభావంతమైన నేతల పేర్లను 2021 టైమ్ 100 జాబితా ప్రకటిస్తుంది. ‘‘ఈ జాబితాలో చేరిన వ్యక్తులంతా చరిత్రసృష్టిస్తారు. నిజానికి చాలా మంది ఆ పనిచేసే ఉంటారు’’. టైమ్ 100 ఎడిటోరియల్ డైరెక్టర్ డాన్మాక్సై చెప్పారు. ► టైమ్ 100 జాబితాలో పేరు దక్కించుకున్న మిగిలిన భారతీయ సంతతికి చెందిన నేతలు ఇన్‌స్టాకార్ట్ వ్యవస్థాపకులు, సీఈఓ అపూర్వ మెహతా, డాక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ‘గెట్ ఆన్ పీపీ ఈ’శిఖా గుప్తా, మరో స్వచ్ఛంద సంస్థకు చెందిన రోహన్ పావులూరి ఉన్నారు. ► భీంఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ కూడా ప్రపంచస్థాయి ప్రముఖ నేతల సరసన చేరారు’’ఇక టైమ్ మ్యాగజైన్. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ప్రొఫైల్‌లో ‘‘కొద్దికాలం క్రితం ఈ 40 ఏళ్ల బ్రిటన్‌లోని చాలా తక్కువ మందికి తెలిసిన జూనియర్ మినిస్టర్ అతి స్వల్పకాలంలోనే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు’అని రాశారు. సునాక్ దేశంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన రాజకీయ వేత్త ’’అని పేర్కొనడం గమనార్హం. ► జనవరి 6న క్యాపిటల్ ఎటాక్ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎకౌంట్‌ని రద్దు చేస్తున్నట్టు ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సేకి చెప్పింది విజయ గద్దె అన్న విషయాన్ని ప్రస్తావించిన టైమ్ ప్రొఫైల్, అత్యంత శక్తివంతమైన ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దెని ప్రశంసించింది. ► భీం ఆర్మీ నాయకుడు 34 ఏళ్ల చంద్రశేఖర్ ఆజాద్ నడుపుతోన్న పాఠశాలలు విద్య ద్వారా దళితుల్లో పేదరికాన్ని పారదోలేందుకు కృషి చేస్తున్నాయి. కులపరమైన అణచివేత, హింసపై గళం విప్పుతూ, వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది’అంటూ భీం ఆర్మీ నాయకుడిని గురించి టైం ప్రస్తావించింది. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై భీంఆర్మీ ఉద్యమాన్ని టైమ్ గుర్తించింది. ► వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్‌లో గుప్తా లేకపోయినప్పటికీ, ఆయన అత్యంత కీలక కోవిడ్ సంక్షోభకాలంలో వైట్‌హౌస్ లో నాయకత్వ లేమిని పూరిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులకు అవసరమైన ఆరోగ్య పరికరాలను సమకూర్చారు. గుప్తా సారథ్యంలో 6.5 మిలియన్ల పీపీఈ కిట్లను ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి అందించగలిగారు. ► 25 ఏళ్ల పావులూరి ఫ్రీ ఆన్లైన్ టూల్‌కి ఆద్యుడు. కోవిడ్–19 సంక్షోభంలో అగ్రరాజ్యం అమెరికా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. వీటి నుంచి బయటపడేందుకు పావులూరి తయారుచేసిన యాప్ సమర్థంగా పనిచేసింది. -
పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా బైడెన్, కమల
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హ్యారిస్‌లు టైమ్ మ్యాగజైన్ ఈ ఏటి మేటి వ్యక్తులుగా నిలిచారు. ప్రతీ ఏడాది టైమ్ మ్యాగజైన్ ప్రతిష్టాత్మకంగా ఎంపిక చేసే ‘‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’’లో 2020లో బైడెన్, హ్యారిస్ నిలిచారు. వారిద్దరూ విభజన శక్తుల కంటే సానుభూతి గొప్పదని నిరూపించారని, అమెరికా కథనే మార్చారని టైమ్ మ్యాగజైన్ తన తాజా సంచికలో వారిని కొనియాడింది. ప్రపంచం యావత్తూ ఒక మహమ్మారి చేతిలో చిక్కుకొని విలవిలలాడుతూ ఉంటే దానికి మందు ఎలా వెయ్యాలో దృష్టి పెట్టారని పేర్కొంది. ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా తుది జాబితాలో ఫ్రంట్ లైన్ వర్కర్లు, అమెరికా జాతీయ అంటువ్యాధుల సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచి, జాతి వివక్ష పోరాట సంస్థలు, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. వీరందరూ ఇచ్చిన పోటీని తట్టుకొని జో బైడెన్, కమలా హ్యారిస్‌లు ముందుకు దూసుకెళ్లి టైమ్ ముఖచిత్రానికెక్కారు. గత ఏడాది టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ 16 ఏళ్లకే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టిస్తే, ఈ ఏడాది జో బైడెన్ 78 ఏళ్ల వయసులో అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచారు. టైమ్ మ్యాగజైన్ హీరోస్ ఆఫ్ 2020 జాబితాలో ఇండియన్ అమెరికన్ రాహుల్ దుబేకి చోటు లభించింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా ప్రదర్శనల్లో పాల్గొన్న 70 మందికి పైగా నిరసనకారులకి రాహుల్ తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. -
బైడెన్, కమలా హారిస్‌లకు అరుదైన గౌరవం
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌లు.. ఈ యేటి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆ పత్రిక ప్రకటించింది. హెల్త్ కేర్ వర్కర్లు, అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, డోనాల్డ్ ట్రంప్ పోటీ పడ్డా.. డెమొక్రటిక్ జంటకే టైమ్ గౌరవం దక్కడం విశేషం. టైమ్ మ్యాగజైన్ కవర్‌పేజీపై బైడెన్, హారిస్ ఫోటోలను ప్రచురించారు. చేంజింగ్ అమెరికాస్ స్టోరీ అన్న సబ్‌టైటిల్ ఆ ఫోటోకు ఇచ్చారు. తాజాగా ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ 306 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించారు. ట్రంప్‌కు కేవలం 232 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. రిపబ్లికన్ నేత ట్రంప్ కన్నా.. బైడెన్‌కు సుమారు 70 లక్షల ఓట్లు అధికంగా పోలయ్యాయి. కాగా వచ్చే ఏడాది జనవరి 20న జో బైడెన్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక క్యాలండర్ ఇయర్ల అధిక ప్రభావం చూపిన వ్యక్తులను టైమ్ మ్యాగజైన్ తన కవర్‌పేజీలో ప్రచురిస్తుంది. వారినే 'పర్సన్ ఆఫ్ ఇయర్' అవార్డుతో సత్కరిస్తున్నది. -
ముఖచిత్ర మకుటం
మూడేళ్ల వయసులో తల్లి అడిగింది. ‘బేబీ.. సిక్ అయిన వాళ్లకు నువ్వెలా నయం చేస్తావ్?’ అని. ‘మ్యూజిక్ వినిపిస్తాను’ అంది గీతాంజలి! పియానో చక్కగా ప్లే చేస్తుంది ఇప్పటికీ తను. గీతాంజలికి ఇప్పుడు పదిహేనేళ్లు. మ్యూజిక్లోంచి సైన్స్ చేసే మ్యాజిక్‌లోకి వచ్చేసింది. సైంటిస్ట్, ఇన్వెంటర్ తనిప్పుడు! స్కూల్‌కి వెళ్లొస్తూనే ప్రపంచాన్ని మలుస్తోంది. భూగోళంపై ఎన్నో సమస్యలు. వాటి పరిష్కారానికి ఒక టీమ్‌ని నిర్మిస్తానంటోంది.. ఈ ‘టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్’. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘టైమ్’ పత్రిక తరచు కొన్ని ప్రత్యేకమైన ముఖచిత్రాలతో వెలువడుతుంటుంది. ఈ సోమవారం మరింత ప్రత్యేకమైన ముఖచిత్రంతో కొత్త సంచిక మార్కెట్లోకి రాబోతోంది. అయితే ఆ ప్రత్యేకత ‘టైమ్’ పత్రిక వల్ల ఆ ముఖచిత్రానికి వచ్చింది కాక, ముఖచిత్రం వల్ల టైమ్ పత్రికకు వచ్చినది! ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’గా పదిహేనేళ్ల భారతీయ బాలిక గీతాంజలీరావును ‘టైమ్’పత్రిక ఎంపిక చేయడమే అందుకు కారణం. ‘టైమ్’ కే ఒక కిరీటం అయినట్లుగా ముఖచిత్రంపై ఆత్మవిశ్వాసపు దృక్కులతో మందస్మిత గంభీరంగా కూర్చొని ఉంది చిన్నారి గీతాంజలి. ఆన్లైన్లో గీతాంజలితో ఏంజెలీనా. ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్‌తో ‘టైమ్’ ఇలా ఒక ముఖచిత్రాన్ని వెయ్యడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల మంది చిన్నారుల ప్రతిభా సామర్థ్యాలను పరిశీలించి, విశ్లేషించి, వడపోసి గీతాంజలిని ఎంపిక చేసింది టైమ్. గీతాంజలి కొన్ని సామాజిక, నిత్యజీవితావసరాల్లో మిళితమై ఉన్న సమస్యలకు పరిష్కారం కనిపెట్టింది. అవే ఆమెను తక్కిన చిన్నారుల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ‘‘ప్రపంచాన్ని ఎవరైతే మలుచుతారో వారిదే ఈ ప్రపంచం. ప్రపంచం ఏ విధమైన అస్థిరతలో ఉన్నా, అందుకొక పరిష్కారాన్ని చూపే చిన్నారులు ప్రతి తరంలోనైనా ఉంటారు’’ అని టైమ్ వ్యాఖ్యానించింది. ∙∙ గీతాంజలిని ‘టైమ్’ పత్రిక.. సైంటిస్ట్, ఇన్వెంటర్ అని పేర్కొంది. అయితే సైంటిస్టుగా, ఇన్వెంటర్‌గా నేరుగా ల్యాబ్‌లోకి వెళ్లి కూర్చోలేదు గీతాంజలి. మొదట ఆమెక్కొన్ని ఆలోచనలు వచ్చాయి. మంచినీటి కాలుష్యాన్ని తగ్గించడం, కలుషిత కారకాలు అసలే లేకుండా చేయడం మొదటి ఆలోచన. ఆమెకు తొమ్మిదేళ్ల వయసులో వచ్చిన ఆలోచన అది. స్కూలు పిల్లల్లో ‘సైబర్ బుల్లీయింగ్’ను కనిపెట్టి ‘ఎడిట్’ చెయ్యడం పన్నెండేళ్ల వయసు లో ఆమెకు వచ్చిన రెండో ఆలోచన. ఈ రెండు ఆలోచనల మధ్యలో అనేక ఆలోచనలు చేసింది గీతాంజలి. ‘టెడ్ఎక్స్ టాక్’ షో లో గీతాంజలితో బాలీవుడ్ షారుక్‌ఖాన్ (గత ఏడాది) వీటన్నిటినీ టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నియంత్రించే పద్ధతుల్ని కనిపెట్టింది! తాగు నీటిలో ఉండే సీసం ఆరోగ్యానికి హాని చేసే రసాయన మూలకం. సీసం ప్రకృతి సిద్ధంగానే నీటిలో కలిసి ఉంటుంది. అయితే మోతాదుకు మించి ఉంటే ప్రమాదం. ఎలా తెలుస్తుంది మనకు, మన తాగే నీటిలో సీసం ఎంత ఉందన్నది?! దాన్ని తెలుసుకునేందుకు గీతాంజలి ‘టెథిస్’ అనే పరికరాన్ని కనిపెట్టింది! అసలైతే తాగునీటిలో సీసం సున్నా శాతం ఉండాలి కానీ, అది సాధ్యం కాదు కనుక పాయింట్ 24 మైక్రో మోలార్స్ కంటే మించకుండానైతే చూసుకోవాలి. టెథిస్‌తో అలా చూసుకోవడం, జాగ్రత్త పడటం సాధ్యమౌతుంది. బావికో, చెరువుకో వెళ్లి మంచినీళ్లను తోడుకునో, నింపుకునో తెచ్చుకునే కాలం నుంచి, ప్లాంట్ల నుంచి కొనుక్కునే కాలం లోకి ఏనాడో వచ్చిపడ్డాం. నీటిని అమ్మే పెద్ద పెద్ద ప్లాంట్ల వాళ్లు నీటి నుంచి సీసాన్ని తొలగించామనే చెబుతారు. అయితే నిజంగానే తొలగించారా, ఏ మేరకు తొలగించారు అని గీతాంజలి కనిపెట్టిన టెథిస్‌తో తెలుసుకోవచ్చు. టెథిస్ను క్యాన్లలోని నీటికి తాకిస్తే చాలు. మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్న సెన్సర్ ద్వారా ఆ నీటిలో సీసం ఎంత మోతాదులో ఉన్నదీ డిస్ప్లే అవుతుంది. యు.ఎస్.లోని కొలరడోలో ఉంటున్న గీతాంజలికి ఈ ‘టెథిస్’ థాట్ 2014లో వచ్చింది. ఆ యేడాది మిషిగాన్‌లోని ఫ్లింట్ సిటీలో పురాతన కాలం నాటి పైపుల నుంచి సీసం నిల్వలు వచ్చి తాగునీటిలో కలవడంతో అనేకమంది జబ్బునపడటం ఆ చిన్నారిలో ఆలోచనలు రేపింది. అలాగే ‘సైబర్ బుల్లీయింగ్’పై నిఘాకు గీతాంజలి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థను కనిపెట్టడానికి కూడా స్కూల్లో తను చూసిన సంఘటనలే ప్రేరణ. లావుగా ఉన్నారని, పీలగా ఉన్నారని, బ్లాక్ పీపుల్ అని ఇలా సాటి విద్యార్థులను ఏడిపించేవారి నుంచి మనసు గాయపడకుండా తప్పించుకోవడం కోసం ‘కైండ్లీ’ అనే ఒక యాప్‌ను, క్రోమ్ ఎక్స్టెన్షన్ అనుసంధానం చేస్తూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని వృద్ధి చేసింది! ప్రధానంగా ఈ రెండు ఆవిష్కరణలు గీతాంజలిని ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’గా నిలిపాయి. ∙∙ గీతాంజలి తల్లిదండ్రులు ఉండేది కొలరడోలోని ‘లోన్ ట్రీ’ ప్రాంతంలో. గీతాంజలి అక్కడే పుట్టింది. ప్రస్తుతం అక్కడి ‘స్టెమ్ స్కూల్ హైలాండ్ రాంచ్’లో చదువుతోంది. బాల్యం నుంచే తనకు కొత్తకొత్త విషయాలను కనుక్కోవడం పై ఆసక్తి. కనుక్కునే అవసరాన్ని మాత్రం ఆమె చూసిన నిజ జీవిత ఘటనలు కలిగించాయి. జెనిటిక్స్ ఇంజినీరింగ్ చదువుతానని అంటోంది. వ్యసనాల మీద, ఉద్యోగాలలో స్త్రీ, పురుష వేతనాల్లోని వ్యత్యాసాల మీద ఈ వయసుకే ప్రసంగాలు కూడా ఇచ్చింది! ‘‘సమాజాన్ని అన్ని విధాలా ఆరోగ్యవంతంగా పునర్నిర్మించగల జ్ఞానం, వివేకం ఉన్న చిన్నారులే ఈ భూగోళం భవిష్యత్తు’’ అని టైమ్ ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ గా నిలిచిన సందర్భంగా గీతాంజలిని ఇంటర్వ్యూ చేసిన నటి ఏంజెలీనా జోలీ ఆమెను ప్రశంసిస్తూ అన్నారు. మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది గత ఏడాది కూడా ఇదే సమయానికి గీతాంజలి వార్తల్లో ఉంది. నవంబర్ 2 న షారుక్ ఖాన్ బర్త్‌డే. అదే రోజు స్టార్ ప్లస్‌లో ‘టెడ్ టాక్స్ ఇండియా సీజన్ 2 – నయీ బాత్ ప్రీమియర్ మొదలైంది. ‘డోంట్ కిల్ ఐడియాస్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ టెక్నాలజీ–ఎంటర్టైన్మెంట్–డిజైన్ (టి.ఇ.డి) టాక్ షో ప్రసారం అవుతుంటుంది. ఆ షోకి వ్యాఖ్యాత షారుక్‌ఖాన్. ఆ రోజు గెస్ట్ స్పీకర్ గీతాంజలీరావు. అవును స్పీకర్! అలా అమెరికాలో ఉన్న గీతాంజలికి ముంబైలో ఉన్న షారుక్ ఖాన్‌ను కలిసే అవకాశం వస్తే, ముంబైలో ఉన్న షారుక్‌కు అమెరికాలో ఉండే గీతాంజలిని కలిసే అవకాశం వచ్చింది. నిజంగా అవకాశంలానే ఫీల్ అయ్యారు షారుక్. ఆమె కనిపెట్టిన టెథిస్ పరికరం గురించి విని చాలా సంతోషపడిపోయారు. ‘మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది’ అని ప్రశంసించారు. టెథిస్ అంటే స్వచ్ఛమైన జలం అని అర్థం. గ్రీకుపురాణాల్లోని ఒక సముద్రం పేరు కూడా. ‘నా పిల్లలకీ చెబుతాను’ గీతాంజలి టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక అవగానే హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ టైమ్ తరఫున గీతాంజలిని ఇంటర్వ్యూ చేశారు. ప్రధానంగా ఆమె ‘సైబర్ బుల్లీయింగ్’ని అడ్డుకునేందుకు గీతాంజలి కనిపెట్టిన ‘కైండ్లీ’ యాప్ టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ ఫోన్ టెక్స్టింగ్లో బుల్లీయింగ్ని సూచించే పదాలను గీతాంజలి రూపొందించిన యాప్ డిలీట్ చేసి, ఆ తర్వాతే సెండ్ చేస్తుంది. అలా అప్షన్స్ని సెట్ చేసుకోవచ్చు. ఈ వయసు పిల్ల అంత టెక్నాలజీని కనిపెట్టడం ఏజెలీనాకు మురిపెంగా అనిపించింది. ‘అయితే ఈ యాప్ గురించి నా పిల్లలకీ చెబుతాను’ అని ఆమె అన్నారు. ‘నీ లక్ష్యం ఏమిటì గీతాంజలీ అని అడిగిన ప్రశ్నకు.. ‘‘భూగోళంపై సమస్యలన్నిటికీ పరిష్కారం కనిపెట్టే ఒక యంగ్ టీమ్‌ని నిర్మించడం’’ అని చెప్పింది గీతాంజలి. -
టైమ్ ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా ఇండో అమెరికన్ బాలిక
న్యూయార్క్: 15 ఏళ్ల ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రఖ్యాత టైమ్ మేగజీన్ ఆ బాల శాస్త్రవేత్తను ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా గుర్తించింది. తాగునీటి కాలుష్యం, డ్రగ్స్ వాడకం, సైబర్ వేధింపులు.. తదితర సమస్యలకు గీతాంజలి రావు టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారని ‘టైమ్’ ప్రశంసించింది. 5 వేల మందితో పోటీ పడి ప్రతిష్టాత్మక టైమ్ మేగజీన్ తొలి ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ గుర్తింపును ఆమె సాధించింది. టైమ్ మేగజీన్ కోసం ఆమెను ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఆంజెలినా జోలి వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ చేశారు. ‘గమనించడం, ఆలోచించడం, పరిశోధించడం, ఫలితం సాధించడం, సమాచారం ఇవ్వడం’ ఇదే తన ప్రయోగ విధానమని జోలీకి ఆమె వివరించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సృజనాత్మక, శాస్త్రీయ దృక్పథం గల యువతతో ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేయాలన్న తన ఆశయాన్ని వెల్లడించారు. ‘కనిపించిన ప్రతీ సమస్యను పరిష్కరించాలనుకోవద్దు. మిమ్మల్ని బాగా కదిలించిన సమస్యపై దృష్టిపెట్టండి’ అని ఆమె సహచర యువతకు పిలుపునిచ్చారు. ‘నేను చేయగలిగానంటే.. ఎవరైనా చేయగలరు’ అని స్ఫూర్తినిచ్చారు. పాత తరం ఎదుర్కొన్న సమస్యలతో పాటు కొత్త సమస్యలను తన తరం ఎదుర్కొంటోందని ఆమె వివరించారు. అందరినీ సంతోషంగా చూడాలనుకోవడం తన ఆశయమన్నారు. మార్పు కోసం సైన్స్‌ను ఎలా వాడాలన్న ఆలోచన తనకు రెండో, లేదా మూడో తరగతిలో ఉండగానే వచ్చిందని తెలిపారు. -
97 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా..
మీరు కనుక అపూర్వమైన వాటిని సేకరించి దాచుకునే ఒక చక్కటి అభిరుచిని కలిగి ఉన్నవారైతే, ఇప్పటికే మార్కెట్లో ఉన్న నవంబర్ రెండు TIME వార పత్రికను 250 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయవచ్చు. టైమ్ 97 ఏళ్ల చరిత్రలోనే తొలిసారి TIME అనే పేరుతో రాని టైమ్ సంచిక అది! బహుశా ఇలాంటిది ప్రపంచ పత్రికా చరిత్రలోనే ఒక విశేషం. TIMEలోని IM అనే మధ్య లెటర్స్ ని తొలగించి, ఈ చివర్న ఉన్న Tని ఆ చివర్న ఉన్న E పక్కకు జరిపి, ఎడమవైపున ఖాళీ అయిన రెండు స్థానాలలో VO అనే లెటర్స్ పెట్టి VOTE అనే పేరుతో తాజా సంచికను మార్కెట్ లోకి విడుదల చేశారు! టైమ్ తన ఐడెంటిటీని కోల్పోవడమే ఇది. తను కోల్పోవడం ద్వారా యూఎస్‌కి ఈ అధ్యక్ష ఎన్నికలు ఎంత కీలకమైనవో చెప్పాలని టైమ్ భావించినట్లుంది. ముఖచిత్రంపై ఒక మహిళ.. కర్చీఫ్‌ను మాస్కులా ధరించి ఉంటుంది. కర్చీఫ్ మీది డిజైన్లుగా బ్యాలెట్ బాక్సు, బాక్సును కాపాడుతున్నట్లుగా రెండు అరిచేతులు, విడిగా ఇనుప సంకెళ్లు, ఇంకా ఏవో అంతరార్థ చిత్రాలు ఉంటాయి. ప్రముఖ వీధి చిత్రకారుడు ఫ్రాంక్ షెఫర్డ్ ‘టైమ్’ పూర్వపు సంచికల ముఖచిత్రాలు రెండింటిని మిక్స్ చేసి ఈ కవర్ పేజ్ని డిజైన్ చేశాడని టైమ్ ఎడిటర్–ఇన్–చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెంతాల్ (54) లోపల రాసిన ముందుమాటను బట్టి తెలుస్తోంది. ఆయన ఇంకొక మాట కూడా రాశారు. ‘రానున్న రోజుల్లో కొన్ని ఘటనలు ప్రపంచాన్ని మలచబోతున్నాయి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కంటే కూడా..’ అని వ్యాఖ్యానించారు! ఓటు వేసి ఆ కొన్ని ఘటనల ప్రభావాన్ని అమెరికాలోని సకల పౌరుల సార్వభౌమాధికారతకు అనుకూలంగా మార్చుకోవాలని ఓటర్లకు చెప్పడం ఆయన ఉద్దేశంలా కనిపిస్తోంది. అర్థం కాలేదా? ట్రంప్ ఓడిపోతే ‘య్యస్’ అనే పెద్ద అరుపుతో బల్లను గుద్దిన చప్పుడు మొదట వినిపించేది న్యూయార్క్ లోని ‘టైమ్’ కార్యాలయ భవనం నుంచే! ఎడిటర్లు ప్రభుత్వాన్ని పడగొట్టగలరు. నిర్మించగలరు. ట్రంప్ ఓడినా, గెలిచినా టైమ్ పత్రిక తాజా సంచిక VOTE మాత్రం ఎప్పటికీ అపూర్వంగానే నిలిచిపోతుంది. -
మోదీ, షాహిన్‌బాగ్ దాదీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావితం చూపించిన వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీసహా ఐదుగురు భారతీయులు స్థానం సంపాదించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ఆందోళనలను ముందుండి నడిపించిన 82 ఏళ్ల వయసున్న బామ్మ బిల్కిస్ టైమ్ జాబితాలో స్థానం పొందారు. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా అత్యంత ప్రభావితం చూపించిన 100 మందిలో చోటు దక్కించుకున్నారు. ఇక ఇండియన్ అమెరికన్, డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ టైమ్స్ జాబితాకెక్కారు. రాజకీయ నాయకుల కేటగిరీలో మోదీతో పాటుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉన్నారు. భారత్‌ని ముందుకు నడిపించే నాయకుడు మోదీని మించి మరొకరు లేరని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధిని జయించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో క్లినికల్ మైక్రోబయాలజీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. అణగారిన వర్గాల గొంతుక షాహిన్‌బాగ్ దాదీగా పేరు సంపాదించిన బిల్కిస్ గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా 100 రోజుల పాటు రేయింబవళ్లు పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. ‘ఒక చేత్తో జపమాల, మరో చేత్తో జాతీయ జెండా పట్టుకొని అణగారిన వర్గాల గళంగా బిల్కిస్ నిలిచారు. మహిళలు, మైనార్టీల అణచివేతకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని రగిలించారు. పొద్దున్నే 8కల్లా ఠంచనుగా నిరసనకు కూర్చొనే ఆమె అర్ధరాత్రయినా కదిలేవారు కాదు’అని టైమ్ మ్యాగజైన్ ప్రొఫైల్‌లో షాహిన్‌బాగ్ దాదీ గురించి జర్నలిస్టు రాణా అయూబ్ రాసుకొచ్చారు. ఆయుష్మాన్ భవ ఆర్టిస్టుల కేటగిరిలో స్థానం దక్కించుకున్న బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గురించి టైమ్ ప్రొఫైల్‌లో నటి దీపికా పదుకొనె రాశారు. కన్న కలలు నిజం కావడం చాలా కొద్ది మంది చూస్తారని, అందులో ఆయుష్మాన్ ఒకరని అన్నారు. ఆయనలో ప్రతిభ, కష్టపడే తత్వంతో పాటుగా సహనం, పట్టుదల, నిర్బయంగా ముందుకు దూసుకుపోయేతత్వాన్ని దీపిక ప్రశంసించారు. -
ప్రధాని మోదీతో పాటు ఈ ‘దాదీ’ కూడా..
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ 2020 ఏడాదిగానూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసిన ‘‘అత్యంత ప్రభావశీల వ్యక్తుల’’ జాబితాను విడుదల చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు షాహిన్‌బాగ్ దాదీగా ప్రాచుర్యం పొందిన బిల్కిస్, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. లీడర్స్ కేటగిరీలో ప్రధాని మోదీ, ఐకాన్స్ కేటగిరిలో బిల్కిస్ స్థానం సంపాదించుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు, రచయిత రాణా ఆయుబ్.. ‘‘ఓ చేతిలో జపమాల, మరో చేతిలో జాతీయ జెండాతో బిల్కిస్ భారత్‌లోని అణచివేయబడిన వర్గాల తరఫున గళమెత్తింది. 82 ఏళ్ల వయస్సులో పొద్దున 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిరసనల్లో పాల్గొంది’’అంటూ ఈ బామ్మ గురించి టైమ్ మ్యాగజీన్లో పేర్కొన్నారు. (చదవండి: రైతుల ఆర్థిక స్థితి మారుతుంది: మోదీ ) కాగా ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో చిన్నాపెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరు నిరసనలు తెలియజేస్తూ దీక్ష చేపట్టారు. ఈ ఆందోళనల్లో భాగమైన 82 ఏళ్ల బిల్కిస్ దాదీ మీడియా దృష్టిని ఆకర్షించారు. ‘‘ఇక్కడ చూడండి. కేవలం ముస్లింలు మాత్రమే నిరసన చేపట్టలేదు. అన్ని మతాల వారు వచ్చి ఇందులో పాలుపంచుకుంటున్నారు. భోజనం పంచుతున్నారు. మాకోసం కొందరు అరటిపళ్లు తీసుకువచ్చారు. మరికొందరు జ్యూస్, బిస్కట్లు తెస్తున్నారు. చూడండి ఇక్కడ అంతా కలిసే ఉన్నారు’’ అంటూ మతసామరస్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వ భావన గురించి అమూల్యమైన మాటలు చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్లో చోటు సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ట్రంప్, కమలా హారిస్ కూడా ఇక పలు సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో నటించిన ఆయుష్మాన్ ఖురానా ఆర్టిస్టుల కేటగిరీలో స్థానం సంపాదించుకున్నారు. కాగా టైమ్ మ్యాగజీన్ విడుదల చేసిన 100 మంది ప్రభావశీలుర జాబితాలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఉపాధ్య పదవికి పోటీపడుతున్న కమలా హారిస్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్- వెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన జో బైడెన్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా తదితరులు ఈ లిస్టులో ఉన్నారు.(చదవండి: 244 ఏళ్ల స్వాత్రంత్ర్య చరిత్ర: మహిళకు దక్కని అవకాశం!) -
ట్రంప్– గ్రెటా ట్వీట్ వార్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుజేసుకున్నారు. పర్యావరణ యువ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను ప్రఖ్యాత పత్రిక ‘టైమ్’ పర్సన్ ఆఫ్ ది ఈయర్‌గా ప్రకటించడంపై మండిపడ్డారు. అది తెలివితక్కువ నిర్ణయమని టైమ్ పత్రికను విమర్శించారు. ‘గ్రెటా ముందు తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడంపై దృష్టిపెట్టాలి. ఆ తరువాత ఓ ఫ్రెండ్‌తో కలిసి మంచి సినిమాకు వెళ్లాలి. చిల్.. గ్రెటా చిల్!’ అని గురువారం ట్రంప్ ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా గ్రెటా థన్‌బర్గ్ తన ట్విట్టర్ బయోడేటాను మార్చారు. ‘నేను కోపాన్ని అదుపులో పెట్టుకోవడంపై దృష్టి పెట్టిన ఒక టీనేజర్‌ను. ప్రస్తుతం ఒక ఫ్రెండ్ తో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను’ అని ట్రంప్‌నకు రిటార్ట్ ఇచ్చారు. -
టైమ్స్ టాప్ 100లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’
సాక్షి : ప్రతిష్టాత్మక టైమ్ మేగజీన్ ఏటా రూపొందించే ‘వరల్డ్ టాప్ 100 జాబితా 2019’లో మనదేశం నుంచి రెండింటికి చోటు దక్కింది. అందులో ఒకటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ కాగా మరొకటి ముంబైలోని ‘సోహో హౌస్’. 182 మీటర్లతో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించిన ఉక్కుమనిషి విగ్రహం గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా బాగా వృద్ధి చెందింది. కొన్ని రోజుల క్రితం ఒకే రోజు 34000 మంది టూరిస్టులు ఈ విగ్రహాన్ని సందర్శించడం విశేషం. ఈ రెండు అంశాలను పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న సోహో హౌస్ ఐరోపా, అమెరికా ఖండాల బయట, ఆసియాలోనే మొదటిది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అరేబియా సముద్ర తీరంలో పదకొండు అంతస్థులతో నిర్మితమైంది. ఇందులో లైబ్రరీ, ఓపెన్ రూఫ్ టాప్ బార్‌తో పాటు 34 మందికి సరిపోయే సినిమా థియేటర్ కూడా ఉంది. దీని నిర్మాణంలో వాడిన ఫర్నిచర్, నిర్మాణ శైలి, భవనంలోని కళాకృతులతో ఈ భవనం ప్రత్యేకత కలిగి ఉంది. వాస్తవికత, ఆవిష్కరణ, కొత్తదనం, ప్రభావం వంటి అంశాల ఆధారంగా టైమ్ మేగజీన్ ఏటా ప్రపంచవ్యాప్తంగా తగిన ప్రదేశాలను ఎంపిక చేస్తుంది. -
స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ‘టైమ్’ గుర్తింపు
న్యూయార్క్: గుజరాత్ తీరంలో ఏర్పాటైన 597 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ముంబైలోని సోహో హౌస్‌లకు ప్రఖ్యాత టైమ్ మేగజీన్ రూపొందించిన టాప్–100 ప్రపంచంలోనే గొప్పవైన, తక్షణమే వెళ్లి ఆస్వాదించదగిన ప్రాంతాల రెండో జాబితాలో చోటు లభించింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 597 అడుగుల ఎత్తైన విగ్రహం గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో ఏర్పాటుచేయడం తెల్సిందే. అలాగే, అమెరికా, యూరప్‌లలో కాకుండా ఆసియాలోనే మొట్టమొదటి సారిగా ముంబైలో ఏర్పాటైన ఘనత సోహో హౌస్ సొంతం. సముద్ర తీరంలో 11 అంతస్తుల భవనంలో ఏర్పాటైన ఈ క్లబ్లో ఒక లైబ్రరీ, చిన్న సైజు సినిమా హాలు, రూఫ్‌టాప్ బార్, స్విమ్మింగ్‌పూల్ ఉన్నాయి. 200 కళాత్మక వస్తువులు ఈ ప్రైవేట్ క్లబ్ ప్రత్యేకతలు. -
మోదీ ‘టైమ్’ మారింది
న్యూయార్క్: ప్రధాని మోదీ భారత విభజన సారథి (ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్) అంటూ ఆయనను విమర్శిస్తూ రెండు వారాల క్రితం (సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు) కథనం ప్రచురించిన ప్రముఖ టైమ్ మేగజీన్.. ఎన్నికల ఫలితాలు రాగానే మాట మార్చింది. గత 5 దశాబ్దాల్లో మోదీలా దేశాన్ని ఎవ్వరూ ఏకం చేయలేకపోయారంటూ మోదీని ప్రశంసిస్తూ తాజాగా మరో కథనాన్ని ప్రచురించింది. పాత కథనాన్ని పాకిస్తాన్ మూలాలున్న ఆతీష్ తసీర్ అనే జర్నలిస్టు రాయగా, తాజా కథనాన్ని భారత్‌కు చెందిన మనోజ్ లాద్వా రాశారు. లండన్ కేంద్రంగా పనిచేసే ఇండియా ఇన్కార్పొరేషన్ గ్రూప్ అనే మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవోనే ఈ మనోజ్. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘ప్రధానిగా మోదీ’ అనే ప్రచార కార్యక్రమంలో పరిశోధన, విశ్లేషణ విభాగానికి మనోజ్ నేతృత్వం వహించారు. మోదీ సమాజంలో మతపరమైన విభజన తీసుకువచ్చారని ఆతీష్ తసీర్ వ్యాసం ద్వారా ఆరోపించిన టైమ్ మేగజీన్.. ఎన్నికల్లో మోదీ భారీ విజయం సాధించడంతో ఆ పత్రిక తన రూటు మార్చుకోవాల్సి వచ్చింది. మోదీ విభజన వాది కాదు, దేశాన్ని ఏకతాటిపైన నడిపించిన నాయకుడు అంటూ మనోజ్ రాసిన సంపాదకీయంలో టైమ్ ప్రశంసించింది. కుల, మత, వర్గ సమీకరణల్ని అధిగమించి మరీ మోదీ అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాదు, సీట్లు, ఓట్లు పెంచుకున్నారని విశ్లేషించింది. క్షేత్రస్థాయి అధ్యయనంలో విదేశీ మీడియా విఫలం భారత్‌లో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేయడంలో పశ్చిమ దేశాల మీడియా విఫలమైందని మనోజ్ అభిప్రాయపడ్డారు. ‘మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రకులాల ఆధిపత్యం పెరిగిందని అందరూ భావించారు. వెనుకబాటు కులాలే ఒక్కటై మోదీకి జేజేలు పలికాయి. ఒక వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం, ఉద్యోగ వర్గాలకు ప్రతి«నిధిగా ఆయన కనిపించడం, నిరుపేదలు అత్యధికంగా ఉన్న భారత్‌లో మోదీపై ఉన్న వ్యక్తిగత కరీష్మాయే ఆయనను రెండోసారి అధికార అందలాన్ని ఎక్కించింది. పాలనలో మోదీ విధానాలపై ఎన్నో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్నికల ప్రచారం సమయంలోనూ ఆయనను విపక్ష పార్టీలు విమర్శించాయి. అయినా భారత ఓటర్లు ఏకమై ఆయనకే పట్టంగట్టారు. ఈ స్థాయిలో ఓటర్లు ఒక్కటై ఒక వ్యక్తిని చూసి ఓటు వేయడం 50 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి’ అని మేగజీన్ వ్యాసంలో పేర్కొంది. -
‘అతను పాకిస్తానీ.. నమ్మాల్సిన పని లేదు’
న్యూఢిల్లీ : ‘భారత విభజన సారథి’ అనే శీర్షికన కొద్ది రోజుల క్రితం టైమ్ మ్యాగజైన్ ప్రధాని నరేంద్ర మోదీపై ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం మోదీ స్పందించారు. ‘టైమ్ మ్యాగజైన్ విదేశీ పత్రిక. దానిలో నా గురించి కథనం రాసిన వ్యక్తి పాకిస్థానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. ఇది చాలు ఆయన విశ్వసనీయత ఏంటో చెప్పడానికి’ అని మోదీ వ్యాఖ్యానించారు. టైమ్ మ్యాగజైన్లో ఈ కవర్ స్టోరీని అతీశ్ తసీర్ రాశారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గతంలో కంటే ఎక్కువ విభజనకు గురవుతోంది’ అని పేర్కొన్నారు. దానిలో మూక దాడులు, యోగి ఆదిత్యనాథ్‌ను యూపీ ముఖ్యమంత్రిగా నియమించడం, మాలేగావ్ పేలుడు నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు లోక్‌సభ టికెట్ ఇవ్వడం వంటి పలు అంశాలను వివరించారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ మీద కూడా విమర్శలు చేశారు. ‘134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రచారం కోసం సోదరి ప్రియాంకను రంగంలోకి దించింది. ఇది అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్, ఉపాధ్యక్ష పదవికి ఆమె కుమార్తె చెల్సియా పోటీపడటం లాంటిదే. బలహీన ప్రతిపక్షం ఉండటం మోదీ అదృష్టమే. మోదీని ఓడించడం తప్ప వీరికి మరో అజెండా లేదు’ అని విమర్శించారు. విభజనాధికారి అంటూ టైమ్ మ్యాగ్జైన్ మోదీపై చేసిన విమర్శల మీద బీజేపీ తీవ్రంగా మండిపడింది. -
‘టైమ్ మేగజీన్‌పై సుప్రీంలో కేసు వేస్తాం’
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్లో జన్మించిన ఒక వ్యక్తి యూకేలో కూర్చొని పక్షపాతంతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా టైమ్ మేగజీన్‌లో కథనం రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ నేషనల్ మేనిఫెస్టో సబ్ కమిటీ సభ్యురాలు కరుణ గోపాల్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మోదీ దేశాన్ని విభజిస్తున్నారని రాయడం దారుణమని, సుప్రీంకోర్టులో ఆ మేగజీన్‌పై పిటిషన్ వేస్తామన్నారు. మోదీ ప్రధాని కాకముందు ఈశాన్య రాష్ట్రాలు నిర్లక్ష్యం చేయబడ్డాయని, మోదీ వచ్చాకే ఆ రాష్ట్రాలను అభివృద్ధి చేశారని చెప్పారు. గతంలో ఆ రాష్ట్రాల వారు భారతదేశంలో ఉన్నామని ఎప్పుడూ భావించలేదని, మోదీ ప్రధాని అయిన తర్వాతే వారికి భారత్‌లో ఉన్నామనే భావన తీసుకొచ్చారని తెలిపారు. -
మోదీపై ‘టైమ్’లో వ్యాసం రాసినందుకు...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘టైమ్’ మేగజీన్‌లో కవర్ పేజీ వ్యాసం రాసిన ప్రముఖ జర్నలిస్ట్ ఆతిష్ తసీర్ గురించి వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని పూర్తిగా మార్చి వేశారు. టైమ్ మేగజీన్‌తోపాటు పలు ఆంగ్ల పత్రికలకు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేసిన తసీర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పీఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారంటూ యాడ్ చేశారు. నరేంద్ర మోదీ గురించి ‘టైమ్’లో వ్యాసం రాగా, ఆ మరుసటి రోజే, అంటే మే 10వ తేదీనాడు వికీపీడియా పేజీని మార్చివేశారు. వాస్తవానికి ఇది మే 20వ తేదీ సంచిక. ముందే మార్కెట్లోకి వచ్చింది. తర్వాత దాన్ని భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా యూజర్ చౌకీదార్ శశాంక్ సింగ్ ట్వీట్ చేయగా, అది ఇప్పుడు వేలసార్లు రిట్వీట్ అవుతోంది. ‘ఆతిష్ తసీర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు పీఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. నిష్పక్షపాతంగా ఉంటుందన్న గుర్తింపును అది ఎప్పుడో కోల్పోయింది. కమ్యూనిస్టుల బాకాగా మారింది’ అని శశాంక్ సింగ్ ట్వీట్ చేశారు. ఇదే టైమ్ మేగజీన్ 2015, మే సంచికలో ‘వై మోదీ మ్యాటర్స్’ అంటూ మోదీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇదే బీజేపీ సోషల్ మీడియా ‘టైమ్’ అంత గొప్ప మేగజీన్ ప్రపంచంలోనే లేదంటూ ఆకాశానికి ఎత్తుకుంది. నాడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ ప్రపంచ దిగ్గజంగా ఎదగాలంటే నరేంద్ర మోదీ లాంటి నాయకుడు అవసరమంటూ నాడు టైమ్ మేగజీన్ కవర్ పేజీతో మోదీ ఇంటర్వ్యూను ప్రచురించింది. ఇప్పుడు ఆ ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయని, భారత ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తానంటూ అధికారంలోకి వచ్చిన మోదీ అన్నింటా విఫలమయ్యారని, ఆయన చర్యలు విద్వేషపూరిత జాతీయ వాదానికి బీజం వేశాయంటూ విమర్శించింది. దీంతో కోపం వచ్చిన బీజేపీ సోషల్ మీడియా జర్నలిస్ట్, రచయిత అయిన ఆతిష్ తసీర్‌ను కాంగ్రెస్ పీఆర్ మేనేజర్‌ను చేసింది. 2003లో ఇండియా టుడే పత్రిక కూడా ‘మాస్టర్ డివైడర్’ అంటూ కవర్ పేజీ వ్యాసం రాసింది. ఆతిష్ భారతీయ జర్నలిస్ట్ తవ్లీన్ సింగ్ కుమారుడు. ఆయన టైమ్ మేగజీన్‌తోపాటు ప్రాస్పెక్ట్ మేగజీన్, ది సండే టైమ్స్, ది సండే టెలిగ్రాఫ్, ఫైనాన్సియల్ టైమ్స్ పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. దేశ విభజన సందర్భంగా అద్బుతమైన కథలు రాసిన ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో కథనాలను ‘మంటో: సెలెక్టెడ్ స్టోరీస్’ పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. (చదవండి: ‘టైమ్’లో ఆతిష్ తసీర్ రాసిన కథనం ఇదే) -
భారత విభజన సారథి.. మోదీ
న్యూయార్క్ / న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగింపుదశకు చేరుకున్న వేళ ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ ప్రధాని మోదీపై సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత విభజన సారథి(ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్) అనే వివాదాస్పద శీర్షికతో మోదీ చిత్రాన్ని కవర్‌పేజీపై ముద్రించింది. 2014లో ఉజ్వలమైన భవిష్యత్‌పై ఆశలు కల్పిస్తూ అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు ఓ సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారంది. ఈ కథనాన్ని ప్రముఖ భారత జర్నలిస్ట్ తవ్లీన్ సింగ్ కొడుకు అతీశ్ తసీర్ రాశారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్ అంతర్జాతీయ ఎడిషన్లలో మోదీ ముఖచిత్రంతో టైమ్ మ్యాగజీన్ ప్రధాన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనమున్న ప్రతి 2019, మే 20న ప్రజలకు అందుబాటులోకి రానుంది. హామీల అమలులో విఫలం.. భారత్ మరో ఐదేళ్ల పాటు మోదీ ప్రభుత్వాన్ని భరించగలదా? అని తసీర్ తన కథనంలో ప్రశ్నించారు. ‘2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీ సమాజంలోని విభేదాలను సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వచ్చారు. తాజాగా 2019 ఎన్నికల్లో అవే పరిస్థితులను భరిస్తూ తనకు ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. ఓవైపు హిందువులకు పూర్వవైభవం, మరోవైపు దక్షిణకొరియా అభివృద్ధి మోడల్‌తో భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్న హామీతో మోదీ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని ఓ సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారు. 2014లో ప్రజల సాంస్కృతిక ఆగ్రహాన్ని ఆర్థికరంగంవైపు మళ్లించగలగడంలో మోదీ విజయవంతం అయ్యారు. అప్పుడు ఉద్యోగాలు, అభివృద్ధి గురించే ఆయన మాట్లాడేవారు. వ్యాపారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని చెప్పేవారు. కానీ మోదీ ఆర్థిక ప్రణాళికలు కార్యరూపం దాల్చడంలో విఫలమయ్యాయి. ఆయన చర్యలు దేశంలో విద్వేషపూరిత మత జాతీయవాదానికి బీజం వేశాయి’ అని మండిపడ్డారు. ‘134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రచారం కోసం సోదరి ప్రియాంకను రంగంలోకి దించింది. ఇది అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్, ఉపాధ్యక్ష పదవికి ఆమె కుమార్తె చెల్సియా పోటీపడటం లాంటిదే. బలహీన ప్రతిపక్షం ఉండటం మోదీ అదృష్టమే. మోదీని ఓడించడం తప్ప వీరికి మరో అజెండా లేదు’ అని విమర్శించారు. మోదీకి ప్రత్యామ్నాయం లేదు.. భారత్‌లో ఆర్థిక సంస్కరణలు కొనసాగాలంటే మోదీనే సరైన వ్యక్తి అని యూరేసియా గ్రూప్ అధ్యక్షుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ‘ఇండియాలో ఇంకా సంస్కరణలు కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇతర నేతలతో పోలిస్తే మోదీనే ఈ సంస్కరణలను సమర్థవంతంగా చేపట్టగలరు. ఆయన హయాంలోనే చైనా, అమెరికా, జపాన్‌తో భారత ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయి. మోదీ విధానాల కారణంగా భారత్‌లో కోట్లాది మంది ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి. ఆధార్ బయోమెట్రిక్ విధానాన్ని విస్తరించడం వల్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం తగ్గింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించే తత్వం మోదీది. అదే సమయంలో భారత్ లో అవసరమైన సంస్కరణలు చేపడ్డటంలో మోదీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీటైన ప్రత్యామ్నాయం లేకపోవడం మోదీ పాలిట వరంగా మారింది’ అని బ్రెమ్మర్ విశ్లేషించారు. -
టైమ్ మ్యాగ్జైన్ కవర్‌పై మోదీ చిత్రం
న్యూఢిల్లీ : దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ వీక్లీ.. ‘టైమ్’ మ్యాగజైన్ భారత ఎన్నికలపై ప్రత్యేకంగా అంతర్జాతీయ ఎడిషన్ ప్రచురించింది. దాంతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను కవర్ పేజీపై ముద్రించింది. అయితే కవర్ పేజీపై మోదీ ఫొటో పక్కనే ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ అని రాసిన హెడ్లైన్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ హెడ్‌లైన్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఇక మీ నిజస్వరూపాన్ని అందరూ చూస్తారు’ అని కాంగ్రెస్ మహిళా వింగ్ ట్వీట్ చేసింది. ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ కథనాన్ని ఆతిష్ తసీర్ రచించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరో ఐదేళ్లు మోదీ ప్రభుత్వం వస్తుందా?’ అనే పేరుతో తసీర్ కథనం ప్రచురితం కానుంది. దీనిలో ఈ ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనల గురించి ప్రస్తావించారు తసీర్. మూక దాడులు, యోగి ఆదిత్యనాథ్‌ను యూపీ సీఎంగా నియమించడం, సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ను భోపాల్ నుంచి బరిలో దించడం వంటి అంశాలను ఈ కథనంలో చర్చించారు. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా చర్చించారు తసీర్. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు మినహా ఇంకేమీ చేయట్లేదని ఆయన దుయ్యబట్టారు. తాజాగా రాహుల్‌గాంధీకి తోడుగా ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కానీ పెద్దగా మార్పేం కనబడటంలేదని పేర్కొన్నారు. ఇంతటి బలహీన ప్రతిపక్షం ఉండటం కూడా మోదీ ప్రభుత్వానికి బాగా కలిసి వస్తుందని తసీర్ పేర్కొన్నారు. మోదీ చిత్రం టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటోగా రావడం ఇదే ప్రథమం కాదు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తైన సందర్భంగా టైమ్ మ్యాగజైన్ మోదీ కవర్ ఫోటోతో ప్రత్యేక ఎడిషన్‌ని ప్రచురించిన సంగతి తెలిసిందే. -
ముకేశ్, అరుంధతిలకు ‘టైమ్’
న్యూయార్క్: రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ప్రజా ప్రయో జన వ్యాజ్యాలతో మానవ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామిలకు అరుదైన గుర్తింపు లభించింది. టైమ్స్ మ్యాగజైన్ ప్రతీ ఏడాది రూపొందించే ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపించిన 100 మంది జాబితాలో భారత్ నుంచి వారికి చోటు లభించింది. మార్గదర్శకులు, నాయకులు, కళాకారులు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలతో 2019 సంవత్సరానికి టైమ్స్ మ్యాగజైన్ బుధవారం ఈ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండో అమెరికన్ కమేడియన్, టీవీ హోస్ట్ హసన్ మిన్హాజ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని ఇమ్రాన్, గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్‌వుడ్స్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ఉన్నారు. వీరంతా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ముద్ర వేశారో టైమ్స్ వారి ప్రొఫైల్స్‌లో వివరించింది. అరచేతిలో ప్రపంచం ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ భారత వాణిజ్య రంగంలో అద్భుతమైన దార్శనికుడని, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేయడంలో ఆయన పాత్రను మరువలేమని ముకేశ్ ప్రొఫైల్‌ని రాసిన మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహేంద్ర అన్నారు. అరచేతిలో∙ప్రపంచమంటూ ముఖేశ్ చేసిన రిలయన్స్ జియో ఆవిష్కరణతో ఆయన ప్రతిష్ట పెరిగిందన్నారు. స్వలింగ సంపర్కులు హక్కుల కోసం, సెక్షన్ 377ను (దీని ప్రకారం స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరం. ఈ సెక్షన్‌ను 2018 సెప్టెంబర్‌లో సుప్రీం రద్దు చేసింది) రద్దు కోసం పోరాడి సుప్రీంకోర్టులో విజయం సాధించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న పిటిషన్‌దారులు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామి. ‘ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం అరుంధతి, మేనక చిత్తశుద్ధితో చేసిన న్యాయపోరాటం మరువలేనిది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఎలుగెత్తి చాటి భారత్ సామాజిక పురోగతికి ముందడుగు వేశారు’ అని నటి ప్రియాంక అన్నారు. -
స్త్రీలోక సంచారం
చదువులోను, పరిశుభ్రతను పాటించడంలోనూ ముస్లిం బాలికలు ముందుంటున్నారని ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ అన్నారు. అభివృద్ధి ఆర్థికవేత్త, ‘సుధీర్ కమిషన్’ సభ్యుడు అయిన ఖాన్ హైదరాబాద్‌లో జరిగిన ‘అనాథలకు ఆర్థిక సహాయం’ అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. ‘హైదరాబాద్ జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘ఇండియాలో ముస్లిం బాలికలు చదువులో వెనుకబడి ఉంటారన్న ఒక అపోహ ఉంది. అది నిజం కాదు. దేశంలో చదువు అందుబాటులో ఉన్న 80 శాతం మంది బాలికల్లో 90 శాతం మంది ముస్లిం బాలికలే. ఈ తొంభై శాతం అంతా కూడా జీవించడానికి అత్యవసరమైన ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్నవారే. ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత విషయంలోనూ వీళ్లు ముందున్నారు. ‘శుద్ధీకరణ’ (అబ్లూషన్) ఆచారంలో భాగంగా ముస్లిం బాలికలు రోజుకు ఐదుసార్లు చేతులు శుభ్రపరచుకుంటారు’’ అని అమీరుల్లా ఖాన్ వివరించారు. ‘‘చదువుకున్న అమ్మాయిల్ని ముస్లిం సమాజం గౌరవిస్తుంది. అయితే ఆర్థిక కారణాల వల్ల ఎక్కువమంది బాలికలు ఉన్నతస్థాయి విద్యకు నోచుకోలేకపోతున్నారు’’ అని ఖాన్ అన్నారు. ‘సుధీర్ కమిషన్’ రాష్ట్రంలోని ముస్లింల విద్య, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేస్తుంటుంది. ఈ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మెక్సికో నుంచి యు.ఎస్.కి శరణార్థులుగా వచ్చే వారిని నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘వలస శరణార్థుల నియంత్రణ’ బిల్లుకు వ్యతిరేకంగా మహిళా న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్బర్గ్.. ఆసుపత్రి పడక మీద నుంచే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైద్యులు ఆమె ఎడమ ఊపిరితిత్తిలోని రెండు క్యాన్సర్ కణుతులను తొలగించిన అనంతరం, వైద్య సేవల కోసం ఆమె ఆసుపత్రిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలో వచ్చిన బిల్లు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఐదుగురిలో నలుగురు జడ్జీలు ఓటు వేయగా, మిగిలిన ఒక ఓటు కూడా వ్యతిరేకంగా పడితే ప్రతిపాదన వీగిపోయే కీలకమైన స్థితిలో గిన్స్బర్గ్ తన ఓటును నిరర్థకం చేసుకోదలచుకోలేదు. సన్నిహితులు చుట్టూ ఉండగా, ఆసుపత్రి కుర్చీలో కూర్చుని 85 ఏళ్ల వయసులోఎంతో ఉత్సాహంగా ట్రంప్ కోరుకుంటున్న బిల్లుకు వ్యతిరేకంగా ఆమె ఓటు వేశారు. ప్రస్తుతం గిన్స్బర్గ్ ఆరోగ్యంగా ఉన్నారు. తిరిగి జనవరి ఆరంభంలో మొదలయ్యే కోర్టు వాదోపవాదాలకు హాజరవుతారు. ‘టైమ్’ మ్యాగజీన్ 2013లో ఎంపిక చేసిన ‘అత్యంత ప్రభావశీలురైన 100 మంది’ జాబితాలో మలాలా యూసఫ్‌జాయ్ కూడా ఒకరు. ‘కూడా ఒకరు’ కాదు. ఆ జాబితాలో ఒబామాకు 51వ స్థానం వస్తే, మలాలా 15వ స్థానంలో ఉన్నారు! ఆ సంచిక విడుదల అయినప్పుడు మలాలా ఆసుపత్రిలో ఉన్నారు. తాలిబన్ల హెచ్చరికలను ఖాతరు చేయకుండా తను బడికి వెళ్లడమే కాకుండా, బాలికలకు చదువు ఎంత అవసరమో ఆమె చెప్పడం తప్పయింది. తాలిబన్లు ఆమెపై కాల్పులు జరిపారు. తల వెనుక భాగంలో బులెట్ గాయంతో ప్రాణాపాయ స్థితిలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకుంటుండగానే టైమ్ జాబితాలో మలాలా పేరు వచ్చింది. ఆ సంగతిని మలాలా తండ్రి జియావుద్దీన్‌కి ఆయన డ్రైవర్ ద్వారా తెలిసింది. వెంటనే తన ఫోన్లోకి ఫార్వర్డ్ చేయించుకుని టైమ్ కవర్ పేజీపై ఉన్న మలాలా ముఖచిత్రాన్ని కూతురుకి చూపించాడు. అప్పుడు మలాలా స్పందన ఆయన్ని ఆశ్చర్యపరిచింది. ‘మనుషుల్ని ప్రత్యేకంగా చూపించే ఇలాంటి విభజనలపై నాకు నమ్మకం లేదు నాన్నా’ అని ఆ వయసులోనే మలాలా అన్నారట. ఈ విషయాన్ని తన తాజా పుస్తకం ‘లెట్ హర్ ఫ్లయ్ : ఎ ఫాదర్స్ జర్నీ అండ్ ది ఫైట్ ఫర్ ఈక్వాలిటీ’ అనే పుస్తకంలో రాసుకున్నారు జియావుద్దీన్. లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘డబ్లు్య.హెచ్. అలెన్ అండ్ కంపెనీ’ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. -
‘టైమ్’లో ఇండియన్ టీన్స్
హూస్టన్: టైమ్ మ్యాగజైన్ 2018 ఏడాదికి సంబంధించి ప్రకటించిన అత్యంత ప్రభావశీల టీనేజర్ల కేటగిరీలో ముగ్గురు భారత సంత తి విద్యార్థులు చోటు సంపాదించారు. వారి వారి విభాగాల్లో విశేష ప్రతిభ చూపించిన ఇండో–అమెరికన్ కావ్య కొప్పరపు, రిషబ్ జైన్, బ్రిటిష్–ఇండియన్ అమికా జార్జ్‌లు మొదటి 25 స్థానాల్లో నిలిచారు. ప్యాంక్రియాటిక్ కేన్సర్‌ను నయం చేయగలిగే సామర్థ్యం ఉన్న అల్గారిథమ్‌ను ఎనిమిదో తరగతి చదువుతున్న రిషబ్ జైన్ అభివృద్ధి చేశాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న కావ్య కొప్పరపు అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ మెదడు కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారి మెదడు కణజాలాన్ని క్షుణ్నంగా స్కాన్ చేయగలదు. ఈ సాఫ్ట్వేర్ సహాయంతో మెదడుకు సంబంధించిన కణజాల అమరిక, రంగు, సాంద్రత, ఆకృతి వంటి వాటిని పరిశీలించవచ్చు. ఈ వ్యాధికి సంబంధించి ప్రతి రోగికి విడివిడిగా చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తేవాలన్నదే కావ్య లక్ష్యం అని, ప్రస్తుతం ఆ దిశగా ఆమె పనిచేస్తోందని టైమ్ చెప్పింది. ఇక అమికా జార్జ్ మహిళల కోసం ఫ్రీ పీరియడ్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. రుతుక్రమ సమయంలో మహిళలకు అవసరమయ్యే సామగ్రిని ప్రభుత్వాలే వారికి అందజేసేలా అమికా కృషి చేస్తోంది. బ్రిటన్‌లో అనేకమంది బాలికలు పీరియడ్స్ సమయంలో స్కూళ్లకు రావడం లేదని, ఆ సమయంలో వారికి అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడమేనని కారణమని అమికా తెలిపింది. -
ఈసారి నలుగురు ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘టైమ్’ మాగజైన్ 2018 సంవత్సరానికి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ హోదాను ప్రకటించింది. అయితే ఈసారి ఒక్కరికి కాదు, నలుగురు వ్యక్తులకు ఓ వార్తా పత్రికకు కలిపి ప్రకటించింది. వీరందరిని కలిపి ‘ది గార్డియన్స్’గా వ్యవహరించింది. టైమ్ పత్రిక ప్రతి ఏడాది వార్తాలను అత్యధిక ప్రభావితం చేసిన వ్యక్తులకు సాధారణంగా ఈ హోదాను కల్పిస్తోంది. వార్తలను అత్యధికంగా ప్రభావితం చేసిన వారిలో మంచివారే ఉండాల్సిన అవసరం లేదు. విలన్లుగా పరిగణించే వారు కూడా ఉంటారు. అందుకనే 1938లో ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను పేర్కొంది. ఈసారి గత అక్టోబర్ 2వ తేదీన సౌదీ యువరాజు కుట్రకు బలైన సౌదీ సీనియర్ జర్నలిస్ట్, రచయిత, కాలమిస్ట్ జమాల్ అహ్మద్ ఖషోగ్గి, ఫిలిప్పినో జర్నలిస్ట్ మారియా రెస్సా, ఇద్దరు రాయిటర్స్ యువ జర్నలిస్టులు వా లోన్, క్యా సో ఊలతోపాటు అమెరికా నుంచి వెలువడుతున్న ‘ది క్యాపిటల్ గెజిట్’ను కలిపి ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ను ప్రకటించింది. ఈ ఏడాది వార్తాలపై వారు చూపించిన ప్రభావాన్నే కాకుండా జర్నలిజం వత్తిపట్ల వారు ప్రదర్శించిన నిబద్ధతతోపాటు వాస్తవాలను వెల్లడించాలనే వారి సంకల్పాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈసారి ఈ హోదాను ప్రకటించినట్లు టైమ్ సంపాదకవర్గం ప్రకటించింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, ఆయన తండ్రి వ్యవహారాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు వారి పాలనాతీరును విమర్శించినందుకు యువరాజు కాన్సులేట్‌లోనే జమాల్ అహ్మద్ ఖషోగ్గిని దారుణంగా హత్య చేశారు. అనవాళ్లు దొరక్కుండా ఆసిడ్‌తో మృతదేహాన్ని కరిగించారు. మాజీ సీఎన్ఎన్ కరస్పాండెంట్ మెరియా రెస్సా ఏడేళ్ల క్రితం రాప్లర్ న్యూస్ వెబ్‌సైట్‌ను స్థాపించి నిక్ష్పక్షపాతంగానే కాకుండా ధైర్యంగా నిజాలను రాశారు. ఫిలిప్పినో అధ్యక్షుడు డ్యూడర్టే నియంత్రత్వ విధానాలను ఎప్పటికప్పుడు విమర్శించారు. డ్రగ్ మాఫియా కనిపిస్తే కాల్చివేయడంటూ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా ఆయన 12 వేల మందిని చంపించారు. వాటిని ఎప్పటికప్పుడు వెల్లడించడంతో ఆన్లైన్లో ఆమెను డ్యూడర్ట్తోపాటు ఆయన సైన్యం కూడా ఎన్నో వేధింపులకు గురిచేసింది. అమెను పన్నులు ఎగ్గొట్టారన్న సాకుతో ఆమెకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు అధికార రహస్యాల చట్టం కింద వా లోన్, క్యా సో ఊన్లకు వారి ప్రభుత్వం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక ‘ది క్యాపిటల్ గెజట్’ కార్యాలయంలోని గత జూన్ నెలలో ఓ ఉన్మాది జొరబడి ఐదుగురు జర్నలిస్టులను కాల్చి చంపారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల స్ఫూర్తికి గుర్తింపుగా ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ టైమ్ సంపాదకవర్గం ప్రకటించింది. -
1,377 కోట్లకు టైమ్ మేగజీన్ అమ్మకం
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రఖ్యాత టైమ్ మేగజీన్ యాజమాన్యం మరోసారి మారింది. క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ మార్క్ బెనియాఫ్కు టైమ్ మేగజీన్‌ను రూ.1,377 కోట్లకు (190 మిలియన్ డాలర్లు) అమ్ముతున్నట్లు మెరిడిత్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా పూర్తి నగదును చెల్లించనున్నట్లు వెల్లడించింది. టైమ్ మేగజీన్ రోజువారీ వార్తలకు సేకరణ, ప్రచురణలకు సంబంధించి నూతన యాజమాన్యం జోక్యం చేసుకోబోదని పేర్కొంది. ఈ కొనుగోలు పూర్తిగా బెనియాఫ్ వ్యక్తిగతమనీ, దీనికి సేల్స్‌ఫోర్స్ కంపెనీతో సంబంధం లేదంది. గతేడాది టైమ్ మేగజీన్ సహా పలు ప్రచురణలను టైమ్ కంపెనీ నుంచి మెరిడిత్ కొనుగోలు చేసింది. ఈ విషయమై బెనియాఫ్ దంపతులు స్పందిస్తూ.. ప్రపంచంపై గణనీయమైన ప్రభావం చూపగల కంపెనీలో తాము పెట్టుబడి పెడుతున్నామని వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 1923, మార్చిలో యేల్ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ విద్యార్థులు హెన్రీ లూస్, బ్రిటాన్ హడెన్‌లు కలసి టైమ్ మేగజీన్‌ను ప్రారంభించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఇదే తరహాలో 2013లో వాషింగ్టన్ పోస్ట్ పత్రికను రూ.1,811 కోట్లకు కొన్నారు. -
‘టైమ్’ జాబితాలో దీపిక, కోహ్లి, నాదెళ్ల
న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 2018 సంవత్సరానికి 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలోని 45 మంది వయసు 40 సంవత్సరాల లోపేనని టైమ్ మ్యాగజైన్ తెలిపింది. వీరిలో 14 ఏళ్ల నటుడు మిల్లీ బాబీ బ్రౌన్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. లింగ సమానత్వం విషయంలో చాలా వెనుకపడి ఉన్నప్పటికీ.. 2018 టైమ్ జాబితాలో ఎన్నడూ లేనంతగా మహిళలకు చోటు దక్కిందని పేర్కొంది. ఈ సందర్భంగా టైమ్ జాబితాలో చోటుదక్కించుకున్నవారి ప్రొఫైల్స్‌ను ఆయా రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులు రాశారు. కాగా, టైమ్ ప్రాబబుల్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పరిశీలనకు వచ్చినప్పటికీ.. ఆయనకు తుది జాబితాలో మాత్రం చోటు దక్కలేదు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రొఫైల్‌ను మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాస్తూ.. ‘2008లో అండర్–19 ప్రపంచకప్‌కు నేతృత్వం వహిస్తున్న కోహ్లిని తొలిసారి చూశాను. ఈరోజు విరాట్ కోహ్లి అనే పేరు ప్రతి ఇంట్లో సుపరిచితమైపోయింది. కోహ్లిలో పరుగులు సాధించాలన్న కసి, ఆటలో స్థిరత్వం అసాధారణం’ అని చెప్పారు. వెస్టిండిస్ పర్యటనలో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న కోహ్లి.. ఆ తర్వాత ఆట, ఫిట్‌నెస్‌లో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్నాడని సచిన్ ప్రశంసించారు. ట్రిపుల్ ఎక్స్ జాండర్‌కేజ్ చిత్రంలో తనతో కలసి నటించిన బాలీవుడ్ నటి దీపిక పదుకోన్‌పై ప్రముఖ హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘పదుకోన్ ఇక్కడ కేవలం ఇండియాకు మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదు. ఆమె ప్రపంచం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచం ఇప్పటివరకూ అందించిన వాటిలో దీపికే అత్యుత్తమం’ అని ఆమె ప్రొఫైల్ రాశారు. ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సచిన్ బన్సల్ భవీశ్ ప్రొఫైల్ రాస్తూ.. ‘దూరదృష్టి, పనిపట్ల మక్కువ, బలమైన సంకల్పంతో భవీస్ అడ్డంకులన్నింటినీ అధిగమించారు. కేవలం 32 ఏళ్ల వయసులోనే ఓలాను స్థాపించి 100కు పైగా భారతీయ నగరాల్లో లక్షలాది మంది డ్రైవర్లకు సాధికారత కల్పించారు’ అని చెప్పారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్లలో కంపెనీ మార్కెట్ విలువ 130% పెరిగిందని ఐజాక్సన్ పేర్కొన్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, హాలీవుడ్ నటీమణులు నికోల్ కిడ్మన్, వండర్ ఉమెన్ ఫేమ్ గాల్ గడోట్, మేఘన్ మెర్కెల్లతో పాటు బ్రిటన్ యువరాజు హ్యారీ, సౌదీ యువరాజు బిన్ సల్మాన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా అధినేత కిమ్, కెనడా ప్రధాని ట్రూడో, ఐర్లాండ్‌కు తొలి గే ప్రధాని వరద్కర్, లండన్ మేయర్ సాదిక్, ‘మీ టూ’ ఉద్యమకారిణి తరానా బర్క్, బంగ్లాదేశ్ ప్రధాని హసీనా, పాప్ గాయని జెన్నిఫర్ లోపేజ్ స్థానం సంపాదించారు. -
తూటాలకు ఎదురెళ్లి.. నేడు ఘన సత్కారాలు
-
తూటాలకు ఎదురెళ్లి.. నేడు ఘన సత్కారాలు
హ్యూస్టన్ : నాడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో తుటాలకు ఎదురెళ్లి భారతీయుడిని కాపాడిన కాన్సాస్కు చెందిన అమెరికన్ పౌరుడు ఇయాన్ గ్రిల్లాట్‌కు ఘన సన్మానం జరిగింది. 5 హీరోస్ హు గేవ్ అస్ హోప్ ఇన్ 2017' అనే పేరిట టైమ్ మేగజీన్ సత్కారం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కాన్సాస్‌లోని ఓ బార్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. నేవీలో పనిచేసిన ఓ మాజీ అధికారి భారతీయులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో గ్రిల్లాట్(24) ఆ కాల్పులు జరుపుతున్న వ్యక్తికి అడ్డుపడ్డాడు. అప్పటికీ తెలుగువాడైన శ్రీనివాస్ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోగా అలోక్ మాదసాని తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా గ్రిల్లాట్ అడ్డుకోగలిగాడు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా గ్రిల్లాట్‌ను ఇండియన్ అమెరికన్ల కమ్యూనిటి హ్యూస్టన్‌లో ఏ ట్రూ అమెరికన్ హీరో అంటే పెద్ద సత్కారం చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కాన్సాస్‌లో అతడు ఓ ఇళ్లు కొనుగులో చేసుకునేందుకు లక్ష డాలర్లు బహుమతిగా కూడా ఇచ్చారు. -
టైమ్ జాబితాలో మోదీ, పేటీఎం విజయ్ శర్మ
-
‘టైమ్’ జాబితాలో మోదీ
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకూ స్థానం అత్యంత ప్రభావశీలుర జాబితాలో భారత్ నుంచి వీరిద్దరికే చోటు న్యూయార్క్: టైమ్ మేగజీన్ ఏటా ప్రచురించే ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన వందమంది వ్యక్తుల జాబితాలో భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మాత్రమే చోటు సంపాదించారు. ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను టైమ్ మేగజీన్ గురువారం విడుదల చేసింది. ఆయా రంగాల్లో మార్గదర్శకులుగా నిలిచినవారు, కళాకారులు, నేతలు, ప్రముఖులకు ఈ జాబితాలో చోటు లభించింది. జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే పేర్లు కూడా ఉన్నాయి. ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త కుష్నెర్‌లకు ఇందులో చోటు లభించడం విశేషం. జాబితాలో ఇంకా పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజెస్, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే, వివాదాస్పద ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగొ డ్యుటెర్టె పేర్లు కూడా ఉన్నాయి. కాగా, టైమ్ మేగజీన్ నిర్వహించిన ఆన్లైన్ రీడర్స్ పోల్‌లో మోదీకి ఓట్లేవీ పడకపోయినా.. ‘టైమ్’ ఎడిటర్లు ఎంపిక చేసిన వందమంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆయన చోటు పొందడం విశేషం. మోదీ ప్రభ మసకబారలేదు ఈ ‘టైమ్’ సంచికలో మోదీ ప్రొఫైల్‌ను రచయిత పంకజ్ మిశ్రా రాశారు. అందులో ‘గుజరాత్లో గోధ్రా అనంతరం చెలరేగిన ముస్లిం వ్యతిరేక హింసాకాండ నేపథ్యంలో ఆయనకు అమెరికా వీసా నిరాకరించింది. స్వదేశంలో ఆయన రాజకీయ అస్పృశ్యతను ఎదుర్కొన్నారు. సంప్రదాయ మీడియాను తోసిరాజని.. ప్రపంచీకరణ కారణంగా దెబ్బతిన్నామని భావిస్తున్న అణగారిన వర్గాల ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరుచుకున్నారు. అవినీతిపరులు, స్వార్థపరుల్ని ఏరివేసి భారత్‌ను మరోసారి సమున్నత స్థానంలో నిలుపుతానని వాగ్దానం చేయడం ద్వారా సామాన్య ప్రజలకు చేరువయ్యారు’ అని వివరించారు. మోదీ ప్రభ మసకబారలేదని, అస్తిత్వ భయాలు, సాంస్కృతిక అభద్రతలతో కొట్టుమిట్టాడే ప్రజలను రాజకీయంగా చేరదీసే కళలో ఆయన ఆరితేరిపోయారని మిశ్రా అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దుతో..: పేటీఎం వ్యవస్థాపకుడు శేఖర్ శర్మ(43) గురించి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని వివరిస్తూ.. నోట్లరద్దుతో నెలకొన్న పరిస్థితులను శర్మ తనకు అనుకూలంగా మలుచుకోగలిగారన్నారు. నోట్ల రద్దు అనంతర పరిస్థితుల్లో శర్మకు చెందిన డిజిటల్ చెల్లింపుల స్టార్టప్.. ‘పేటీఎం’ ఊపందుకుందని తెలిపారు. -
టైమ్ జాబితాలో మోదీ, పేటీఎం విజయ్ శర్మ
టైమ్ పత్రిక ప్రతియేటా ప్రకటించే అత్యంత ప్రభావశీలురైన వంద మంది వ్యక్తులలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మలకు స్థానం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరెసా మే కూడా ఈ జాబితాలో ఉన్నారు. డోనాల్డ్ ట్రంప్ ఇంకా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం పొందుతారా లేదా అన్నది కూడా ఇంకా నిర్ధారణ కాకముందే 2014 మే నెలలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మోదీ ప్రధానమంత్రి అయ్యారని ఆ ప్రకటనలో చెప్పారు. దాదాపు మూడేళ్ల తర్వాత కూడా మోదీ ప్రభ ఏమాత్రం తగ్గలేదని, ప్రజలను సమ్మోహితులను చేయడంలో ఆయన అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయాన్ని కూడా అందులో ప్రస్తావించారు. ఇక పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అయితే భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు. నవంబర్ నెలలో భారత ప్రభుత్వం ఉన్నట్టుండి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు పేటీఎం విజయ్ ఆ అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకున్నారని తెలిపారు. 2016 ప్రారంభం నాటికి పేటీఎంకు 12.2 కోట్ల మంది యూజర్లుంటే, సంవత్సరాంతం నాటికి వారి సంఖ్య 17.7 కోట్లకు చేరుకుందని వివరించారు. చిన్న పల్లెటూరి నుంచి వచ్చి హిందీ మీడియంలో చదువుకుని దేశంలో డిజిటల్ ఎకానమీతో సంచలనం సృష్టించారన్నారు. టైమ్స్ పత్రిక ప్రతియేటా విడుదల చేసే 100 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో కళాకారులు, వ్యాపారవేత్తలు, నాయకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉంటారు. -
నేను అధ్యక్షుడిని.. నువ్వు కాదు: ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై ఆగ్రహాన్ని ఎంతమాత్రమూ దాచుకోవడం లేదు. టైమ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్.. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను సమర్థించుకున్నారు. ‘నేను విభిన్న ఆలోచనలు కలిగిన వ్యక్తిని.. నా స్వభావం, ఆలోచనలు సరైనవి. అవే నిజమవుతాయి. నేను అంత చెడుగా ఏమీ చేయట్లేదని అనుకుంటున్నాను.. ఎందుకంటే నేను ఈ దేశానికి అధ్యక్షుడిని.నువ్వు కాదు’ అని టైమ్స్ వాషింగ్టన్ బ్యూరో చీఫ్ మైకేల్ షారెర్తో ట్రంప్ అన్నారు. ఇంటర్వ్యూలో తన విధానాలను సమర్థించుకుంటూ మాట్లాడారు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ చేసిన ‘వైర్ ట్యాపింగ్’ ఆరోపణలకు సంబంధించిన అంశంపైనా టైమ్స్ ప్రశ్నలు అడిగింది. మాజీ అధ్యక్షుడు ఒబామా తన ఫోన్‌ను వైర్‌ట్యాప్ చేశారని ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే ఒబామా అభ్యర్థన మేరకు బ్రిటిష్ గూఢచర్య సంస్థ జీసీహెచ్‌క్యూ తన ప్రచారంపై నిఘా పెట్టిందని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కూడా ట్రంప్ సమర్థించారు. బ్రెగ్జిట్ సమయంలోనే తాను అది జరుగుతుందని చెప్పానని, అప్పుడు అందరూ నవ్వారని, అయితే అప్పుడు తాను చెప్పిందే జరిగిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. -
టైమ్‘ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: ఆన్లైన్ రీడర్స్ సర్వేలో అగ్రస్థానంలో నిలిచిన భారత ప్రధాని మోదీని తోసిరాజని అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్‌ను టైమ్ మేగజీన్ 2016 ఏడాదికి‘ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. తొలి రన్నపరప్గా ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్, రెండో రన్నరప్‌గా ఆన్లైన్ హ్యాకర్లు నిలిచారు. ఈ గౌరవానికి బరిలో నిలిచిన తుది 11 మందిలో భారత ప్రధాని మోదీ కూడా ఉన్నారు. ఈ నిర్ణయం వెలువడిన తరువాత ట్రంప్ స్పందిస్తూ ‘ ఇది గొప్ప గౌరవం. టైమ్ మేగజీన్ చదువుతూ పెరిగాను. గతంలో ఈ మేగజీన్ కవర్ పేజీపై చోటు సంపాదించడం నా అదృష్టం ’అని ఎన్బీసీ న్యూస్‌తో సంతోషం పంచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక, ప్రజాకర్షక అభ్యర్థిగా ప్రచారం చేసి అమెరికా ఎన్నికల్లో కనీవిని ఎరుగని విధంగా ట్రంప్ విజయం సాధించారని ‘టైమ్’ కొనియాడింది. ప్రపంచ వ్యాప్తంగా మంచికి లేదా చెడుకి వార్తల్లో ఎక్కువగా నిలిచిన నాయకులు, కళాకారులు, వ్యాపారవేత్తలు, సంస్థల నుంచి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ను టైమ్ ఎడిటర్లు ఎంపిక చేస్తారు. ఇతర పోటీదారుల్లో...యూఎస్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, టర్కీ అధ్యక్షుడు రీసెప్ తాయిప్ ఎర్డోగాన్, యూకే ఇండిపెండెన్స పార్టీ నాయకుడు నైగల్ ఫరేజ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్బర్గ్ తదితరులున్నారు. తదుపరి రక్షణ మంత్రిగా మ్యాటిస్ 4 స్టార్ మెరైన్ కోర్ రిటైర్డ్ జనరల్ జేమ్స్ మ్యాటిస్‌ను ట్రంప్ అమెరికా తదుపరి రక్షణ శాఖ మంత్రిగా నియమించారు. 66 ఏళ్ల మ్యాటిస్కు ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. అమెరికా రక్షణ విధానంలో విజయం సాధించాలంటే రక్షణ విభాగాన్ని నడిపించేందుకు సరైన వ్యక్తి కావాలని మ్యాటిస్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. -
'టైమ్స్' లిస్టులో సత్య నాదెళ్ల
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, మెక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అత్యంత ప్రభావశీరుల జాబితాలో ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీరుల పేర్లతో ప్రఖ్యాత 'టైమ్స్' మేగజీన్ రూపొందించిన ఈ జాబితాలో రూపొందించింది. ప్రపంచ నాయకులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర రంగాలకు చెందిన 127 మంది పేర్లను జాబితాలో చేర్చింది. వీరిలో 100 మంది పేర్లతో అత్యంత శక్తిమంతుల జాబితాను వచ్చే నెలలో విడుదల చేయనుంది. పాఠకుల ఓట్లు ఆధారంగా ఈ లిస్టు తయారుచేయనుంది. ప్రధాని మోదీ గతేడాది కూడా ఈ జాబితాలో ఉన్నారు. మహిళల టెన్నిస్ లో డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకు సాధించిన సానియా స్వదేశంలో క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచారని 'టైమ్స్' కొనియాడింది. 'క్వాంటికో' నటించడం ద్వారా ప్రియాంకా చోప్రా హాలీవుడ్ దృష్టిని ఆకర్షించారని ప్రశంసించింది. సత్య నాదెళ్ల విండోస్ 10ను విజయవంతంగా ప్రవేశపెట్టారని, ఆయన సారథ్యంలో క్లౌడ్ టెక్నాలజీ బిజినెస్ ఊపంచుకుందని తెలిపింది. మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టనున్న హొలోలెన్స్ వంటి సరికొత్త టెక్నాలజీ కోసం ఐటీ ఇండస్ట్రీ ఎనలిస్టులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టైమ్స్ వెల్లడించింది. ఆండ్రాయిడ్, యూట్యూబ్ తో విదేశాల్లో కోర్ బిజినెస్ ను సుందర్ పిచాయ్ పెంచారని కితాబిచ్చింది. గూగుల్ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్, సింగర్ రిహన్న, జమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్, హ్యారీ పోర్టర్ రచయిత్రి జేకే రౌలింగ్, అంగ్ సాన్ సూకీ, ఏంజెలా మోర్కల్, వ్లాదిమిర్ పుతిన్, పోప్ ఫ్రాన్సిస్, భారత సంతతి నటుడు అజీజ్ అన్సారీ తదితరులు 'టైమ్స్' లిస్టులో ఉన్నారు. -
ఆయన ఆస్తి.. దేశ బడ్జెట్ కంటే రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: ఆయన ఆస్తి భారతదేశ బడ్జెట్‌కు రెండింతలు.. సొంత విమానాశ్రయం, సొంత రైల్వే, సొంత బ్యాంకు.. అప్పట్లో ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు..మిలమిలా మెరిసే 185 కేరెట్ల జాకబ్ వజ్రం ఆయన బల్లపై పేపర్ వెయిట్..1937లో ఫిబ్రవరి 22న టైం మేగజైన్ కవర్‌పేజీపై ‘రిచెస్ట్ మెన్ ఇన్ ది వరల్డ్’ పేరుతో ప్రచురితమైన కథనం ఆయనదే... ఆయనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. అసఫ్‌జాహీ వంశంలో చివరి రాజు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో హైదరాబాద్ స్టేట్‌ను పాలిస్తున్న రాజు. 1940వ దశకంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డుపుటల్లోకి ఎక్కిన ఏడో నిజాం.. ప్రపంచ నలుమూలలకూ మేలిమి వజ్రాలను సరఫరా చేసినవాడిగా కూడా రికార్డు సాధించారు. అదే ఆయనను ప్రపంచ ధనికుడిని చేసింది. అమెరికా మొత్తం సంపదలో రెండు శాతంతో సమంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంపద ఉండేది. అప్పట్లోనే ఆయన సంపద విలువ రెండు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అప్పుడు భారతదేశ వార్షికాదాయం ఒక బిలియన్ డాలర్లు మాత్రమే. అంతేకాదు హైదరాబాద్ సంస్థానం బడ్జెట్ అప్పట్లోనే రూ.కోట్లలో ఉండేది. మొత్తం బడ్జెట్లో 11 నుంచి 15 శాతం దాకా విద్యా రంగానికే కేటాయించే వారు. ఇళ్లకు విద్యుత్ వెలుగులు, నిజాం విశ్వవిద్యాలయం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి భవనం, నిజాం చక్కెర కర్మాగారం.. ఇవన్నీ ఆయన బడ్జెట్ కానుకలే. ప్రస్తుతం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’గా కొనసాగుతున్న బ్యాంకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సొంతంగా స్థాపించిన బ్యాంకే. -
'పేదరికమే నా ఫస్ట్ ఇన్ స్పిరేషన్'
న్యూఢిల్లీ: తన జీవితంలో పేదరికమే మొదట స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదల కోసం పనిచేయాలన్న తపన రగిలించిందని 'టైమ్స్' మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.... ' నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. రైలు బోగీల్లో ఛాయ్ అమ్మేవాణ్ని. మమల్ని పోషించడం కోసం మా అమ్మ పాచిపని చేసేది. పేదరికాన్ని చాలా దగ్గరగా చూశా. నా బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. అలా చూసుకుంటే పేదరికమే నా ఫస్ట్ ఇన్ స్పిరేషన్'. ఈ స్ఫూర్తితోనే పేదలకు ఏదైనా చేయాలన్న సంకల్పం చెప్పుకున్నా. నాకోసం బతకకూడదని.. ఇతరుల కోసం బతకాలని.. వారి కోసం పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. 12 లేదా13 ఏళ్ల వయసులో స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం మొదలు పెట్టా. ఈ పుస్తక పఠనంతో నా ఆలోచనా దృక్ఫథం మారింది. ఇతరుల కోసం జీవితాన్ని అంకితం చేయాలని15 లేదా 16 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నా. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నా' అని మోదీ వెల్లడించారు. -
ఓహో.. మోదీ!
సంస్కరణల సారథిగా అభివర్ణించిన ఒబామా టైమ్ మేగజైన్లో మోదీ ప్రొఫైల్ రాసిన అమెరికా అధ్యక్షుడు ‘ఇండియాస్ రిఫార్మర్ ఇన్ చీఫ్’గా కితాబు ‘పేదరికం నుంచి ప్రధానమంత్రి వరకు’ అంటూ మోదీ జీవన ప్రస్థానంపై కథనం కృతజ్ఞతలతో స్పందించిన భారత ప్రధానమంత్రి {పధాని నరేంద్రమోదీకి అరుదైన, అద్భుతమైన, అనూహ్య గౌరవం లభించింది. ప్రఖ్యాత ‘టైమ్’ పత్రికలో మోదీ ప్రొఫైల్(వ్యక్తిత్వ వర్ణన)ను అగ్రదేశం అమెరికా అధినేత బరాక్ ఒబామా స్వయంగా రాసి.. భారత ప్రధానితో తనకున్న ఆత్మీయ స్నేహానుబంధాన్ని చాటారు. టైమ్ మేగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో చోటు సాధించిన మోదీని.. ‘భారత్‌లో సంస్కరణల సారథి (రిఫార్మర్ ఇన్ చీఫ్)’గా ఒబామా అభివర్ణించారు. మోదీ గురించి ‘టైమ్’లో తాను రాసిన వ్యాసానికీ ఒబామా అదే శీర్షిక పెట్టారు. ‘పేదరికం నుంచి ప్రధానమంత్రి వరకు’ అంటూ మోదీ జీవన ప్రస్థానాన్ని అందులో స్ఫూర్తివంతంగా వివరించారు. టైమ్ మేగజైన్లో తన ప్రొఫైల్ రాసిన బరాక్ ఒబామాకు నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఒబామా వ్యాఖ్యలు హృదయానికి హత్తుకునేలా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. టైమ్ మేగజైన్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. న్యూయార్క్: భారత ప్రధాని మోదీ నాయకత్వ సామర్థ్యాన్ని, సానుకూల వ్యక్తిత్వాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అక్షరబద్ధం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది జాబితాను ప్రచురించిన టైమ్ మేగజైన్లో.. ఆ జాబితాలో చోటు సంపాదించిన మోదీ ప్రొఫైల్‌ను స్వయంగా ఒబామానే రాసి.. భారతదేశ ప్రధానికి తానిచ్చే ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు. మోదీ జీవితం భారతదేశ ప్రగతిశీల సామర్థ్యాన్ని, చలనశీలతను ప్రతిబింబిస్తుందని తన వ్యాసంలో ఒబామా వర్ణించారు. ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆయన అధినేత. పేదరికం నుంచి ప్రధానమంత్రి పదవి వరకు సాగిన ఆయన జీవన పయనం.. భారతదేశ ప్రగతిశీల సామర్థ్యాన్ని, ఆ దేశ చలనశీలతను ప్రతిబింబిస్తుంది, తన మార్గంలో మరింతమంది భారతీయులు పయనించేలా స్ఫూర్తినిస్తుంది. దేశంలో దారుణంగా నెలకొని ఉన్న పేదరికాన్ని తగ్గించడం, విద్యారంగంలో ప్రమాణాలు పెంచడం, మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం, వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొంటూనే భారతదేశ ఆర్థిక ప్రగతి వాస్తవ సామర్థ్యాన్ని వెలికితీయడం.. లక్ష్యాలుగా ఆయన ఒక ప్రతిష్టాత్మక, దార్శనిక కార్యక్రమాన్ని చేపట్టారు. భారతదేశం లాగానే ఆయన ప్రాచీన, ఆధునిక భావనల వారధి. సంప్రదాయ యోగాకు ప్రాచుర్యం కల్పిస్తూనే.. ట్వీటర్లో ప్రజలతో అనుసంధానమవుతూ డిజిటల్ ఇండియాను స్వప్నిస్తుంటారు’ అంటూ మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. ‘వందకోట్లకు పైగా భారతీయులు ప్రగతిపథంలో ఐక్యంగా ముందుకుసాగితే ప్రపంచానికే స్పూర్తినివ్వగలరని ప్రధానమంత్రి మోదీ గుర్తించారు’ అని పేర్కొన్నారు. గత సంవత్సరం మోదీ అమెరికా వచ్చిన సందర్భంగా తామిరువురు పౌర హక్కుల పోరాట యోధుడు డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్మారక కేంద్రం వద్దకు నివాళులర్పించడానికి వెళ్లిన విషయాన్ని ఒబామా గుర్తు చేసుకున్నారు. ‘అప్పుడు లూథర్ కింగ్, మహాత్మాగాంధీల బోధనలను గుర్తు చేసుకున్నాం. భారత్, అమెరికాల్లోని భిన్నమైన నేపథ్యాలు, విశ్వాసాలు మనకు అందించిన శక్తిసామర్థ్యాలను ఎలా కాపాడుకోవాలనే విషయంపై మాట్లాడుకున్నాం’ అని ఒబామా రాశారు. టైమ్ పత్రిక ప్రకటించిన 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో.. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్జాయి, ఐసీఐసీఐ చీఫ్ చందా కొచ్చర్, ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్, రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియన్, నటుడు బ్రాడ్లీ కూపర్, నటి, మహిళాహక్కుల కార్యకర్త ఎమ్మా వాట్సన్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. తదితరులున్నారు. ఒబామా ప్రొఫైల్‌ను టైమ్ మేగజైన్లో రాజకీయ వ్యవహారాల వ్యాసకర్త జో క్లీన్ రాశారు. -
నిరుపేదగా మొదలై ప్రధానిగా..
వాషింగ్టన్: ప్రధాని నరేంద్రమోదీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రముఖ మేగజిన్ టైమ్ మ్యాగజైన్లో మోదీ గొప్పతనాన్ని, సామర్థ్యాన్ని, జీవితాన్ని స్పృష్టిస్తూ 'ఇండియాస్ రిఫార్మర్ ఇన్ చీఫ్' అనే పేరిట ఓ వ్యాసం రాశారు. భారత దేశంలో సంస్కరణలు ప్రవేశ పెట్టినవారిల్లోనే మోదీ అగ్రగణ్యుడు అని కొనియాడారు. మోదీ జీవితం డైనమిజంతో నిండుకొని ఉన్నదని చెప్పారు. భారత్‌ను ఆర్థికశక్తిగల దేశంగా నిర్మిస్తుండటంలో ఆయన పాత్ర గొప్పదని చెప్పారు. చిన్నవయసులో ఉన్నప్పుడు మోదీ తన తండ్రికి చాయ్ అమ్మడంలో సాయం చేశాడని.. ఇప్పుడు మాత్రం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడయ్యాడని చెప్పారు. ఆయన జీవితం పేదరికం నుంచి ప్రధాని వైపుగా సాగిందని తెలిపారు. ఇదంతా భారత డైనమిజాన్ని, శక్తిసామర్ధ్యాలను చూపిస్తోందని ఒబామా చెప్పారు. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా వంటి మోదీ తెచ్చిన పలు సంస్కరణలు ఆయన ఆర్టికల్‌లో ఒబామా ప్రస్తావించారు. కాగా, ఒబామాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
అత్యంత ప్రభావశీలురు మోదీ, కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చోటు లభించింది. రాజకీయం, వినోదం, తదితర రంగాల్లో ఉత్తమ వ్యక్తులపై టైమ్ మేగజైన్ ‘టైమ్ 100 రీడర్స్ పోల్’ పేరుతో ఆన్లైన్ పోలింగ్ నిర్వహించింది. ఇందులో రష్యా అధ్యక్షుడు పుతిన్ 6.9 శాతం ఓట్లతో ఈ ఏడాది జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పాప్ సింగర్స్ లేడీ గాగా, రిహానా, టేలర్ స్విఫ్ట్‌లు టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాను యాజమాన్యం అధికారికంగా ఈ వారాంతంలో ప్రకటించనుంది. ఈ జాబితాలో చోటు కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేరు కూడా పోటీ పడినా టాప్ 100లో నిలవలేదు. -
అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో మోదీ
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్లో అత్యంత ప్రభావశీలురైన 30 మంది వ్యక్తుల్లో మోదీ ఒకరిగా నిలిచారు. టైమ్ మేగజైన్ తాజాగా వెల్లడించిన జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో పాటు హ్యారీపోటర్ సృష్టికర్త జేకే రౌలింగ్, సింగర్స్ టేలర్ స్విఫ్ట్, బియాన్స్‌లు ఉన్నారు. ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో 3.8 కోట్లమంది ఫాలోవర్లున్న మోదీ నాయకుల్లో ఒబామా తరువాత రెండో స్థానంలో నిలిచారు. భారత్‌లోని దాదాపు 20 కోట్లమంది నెటిజన్లను చేరుకోవడానికి సోషల్ మీడియాను మంచి సాధనంగా మోదీ గుర్తించారని పత్రిక తెలిపింది. -
ఇంటర్నెట్లో మోదీకి అదిరే ఫాలోయింగ్
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చేరారు. ప్రపంచంలో గుర్తించిన టాప్ 30 మంది ప్రభావవంతమైన జాబితాలో చోటుదక్కించుకున్నారు. ప్రపంచంలో ఇంటర్నెట్ ద్వారా ప్రజలను ప్రభావితం చేయగల వ్యక్తులపై టైం మేగజిన్ నిర్వహించిన సర్వేలో టాప్-30 మందిలో నరేంద్రమోదీకి స్థానం దక్కింది. మోదీతోపాటు చోటుదక్కించుకున్నవారిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, హ్యారీ పోటర్స్ సిరీస్ బ్రిటన్ రచయిత జేకే రోలింగ్, గాయకులు టేలర్, స్విప్ట్, బేయాన్స్ కూడా ఉన్నారు. నరేంద్రమోదీకి ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా 38 మిలియన్ల మంది ఉన్నారని మేగజిన్ పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామాజిక అనుసంధాన వెబ్సైట్లను ఉపయోగించుకోవడంలో ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ ముందుంటారనే విషయం మనకు తెలిసిందే. -
టైమ్ ఉత్తమ ఆవిష్కరణల్లో ‘మామ్’
న్యూయార్క్: భారత్‌కు అంతర్జాతీయ కీర్తిని సంపాదించి పెట్టిన ‘మంగళ్యాన్ (మార్స్ ఆర్బిటార్ మిషన్-మామ్) మరో గౌరవాన్ని దక్కించుకుంది. 2014కుగాను టైమ్ మేగజైన్ ప్రకటించిన 25 అత్యుత్తమ ఆవిష్కరణల్లో మంగళ్యాన్ స్థానం సంపాదించింది. చరిత్రలోనే మొదటిసారిగా భారత్ తమ తొలి ప్రయత్నంలోనే అంగారకుడి వద్దకు విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపగలిగిందని టైమ్ ఈ సందర్భంగా ప్రశంసించింది. ‘తమ మొదటి ప్రయత్నంలోనే ఎవరూ అంగారకుడిని చేరుకోలేకపోయారు. అమెరికా, రష్యాతో పాటు యురోపియన్లు కూడా ఆ పని చేయలేకపోయారు. సెప్టెంబర్ 24న భారత్ ఆ ఘనతను సాధించింది. అద్భుతమైన మంగళ్యాన్ ఉపగ్రహం ఆ రోజున అరుణగ్రహం చుట్టూ కక్ష్యలో ప్రవేశించింది. అంగారకుడి వద్దకు విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.’ అని పేర్కొంది. కేవలం 450 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని సాధించడం అద్భుతమని టైమ్ వ్యాఖ్యానించింది. -
భావి నేతల్ల్లో భారత యువకుడు!
న్యూయార్క్: ప్రతిష్టాత్మక టైమ్ పత్రిక రూపొందించిన ‘రేపటి నాయకుల’ జాబితాలో భారత యువ వాస్తుశిల్పి(ఆర్కిటెక్ట్) అలోక్ శెట్టికి కూడా చోటు దక్కింది. మురికివాడల్లో నివసించే ప్రజల కోసం వరదను తట్టుకునే ఇళ్లను డిజైన్ చేసినందుకుగాను 28 ఏళ్ల అలోక్‌కు ఈ గౌరవం లభించింది. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చేందుకు కృషిచేస్తున్న ఆరుగురు రేపటి తరం నాయకుల్లో అలోక్ కూడా ఒకరని టైమ్ పత్రిక కితాబునిచ్చింది. భారత్‌లో క్లిష్టమైన సమస్యలకు అలోక్ సులభమైన, చౌకైన పరిష్కారాలు కనుగొంటున్నారని ప్రశంసించింది. బెంగళూరుకు చెందిన పరిణామ్ ఫౌండేషన్‌తో కలసి పనిచేస్తున్న అలోక్ ‘ఎల్ఆర్డీఈ’ స్లమ్ ఏరియా పేదల కోసం వరదలను తట్టుకునే ఇళ్లను డిజైన్ చేస్తున్నారు. వెదురు, చెక్కలతో రూ.18 వేలకే ఈ ఇళ్లను నాలుగు గంటల్లోనే నిర్మించొచ్చు లేదా అవసరమైనప్పుడు విప్పేసుకోవచ్చు. అలాగే మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యం, విద్యను అందించేందుకు ఉపయోగపడే భవనాలను సులభంగా, చౌకగా నిర్మించేందుకు కూడా అలోక్ కృషి చేస్తున్నారు. కాగా, టైమ్ రేపటి నాయకుల జాబితాలో ఇజ్రాయెలీ సామాజిక, వ్యాపారవేత్త ఆది అల్‌షులర్(27), చైనాలో వైద్యపరీక్షల రంగంలో కృషిచేస్తున్న ఝావో బోవెన్(22), టునీషియా మహిళా హక్కుల కార్యకర్త ఇక్రమ్ బెన్ సెయిద్(34), ఆన్లైన్ మ్యూజిక్ వీడియో మొఘల్ జమాల్ ఎడ్వర్డ్స్(24), నైజీరియాలో తొలి ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించిన ఫ్లయింగ్ డాక్టర్స్ నైజీరియా సంస్థ ఎండీ ఓలా ఒరెకున్రిన్(28) ఉన్నారు. -
రేపటి నాయకుల జాబితాలో భారత వాస్తుశిల్పి
న్యూయార్క్: ప్రతిష్టాత్మక టైమ్ పత్రిక రూపొందించిన ‘రేపటి నాయకుల’ జాబితాలో భారత యువ వాస్తుశిల్పి(ఆర్కిటెక్ట్) అలోక్ శెట్టికి కూడా చోటు దక్కింది. మురికివాడల్లో నివసించే ప్రజల కోసం వరదను తట్టుకునే ఇళ్లను డిజైన్ చేసినందుకు అలోక్‌కు ఈ గౌరవం లభించింది. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చేందుకు కృషిచేస్తున్న ఆరుగురు రేపటి తరం నాయకుల్లో అలోక్ కూడా ఒకరని టైమ్ పత్రిక కితాబునిచ్చింది. అలోక్ 20 సంవత్సరాల వయసులోనే బెంగళూరులోని ఆర్వి కాలేజీలో ఆర్కిటెక్చర్ చదువుతూ 20 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ప్లాన్ రూపొందించారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి యువ ఆర్కిటెక్ట్ అవార్డు కూడా అందుకున్నాడు. భారత్‌లో క్లిష్టమైన సమస్యలకు అలోక్ సులభమైన, చౌకైన పరిష్కారాలు కనుగొంటున్నారని టైమ్ పత్రిక ప్రశంసించింది. బెంగళూరుకు చెందిన పరిణామ్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్న 28 ఏళ్ల అలోక్ ‘ఎల్ఆర్డీఈ’ స్లమ్ ఏరియా పేదల కోసం వరదలను తట్టుకునే ఇళ్లను డిజైన్ చేస్తున్నారు. వెదురు, చెక్కలతో 18 వేల రూపాయలకే ఈ ఇళ్లను నాలుగు గంటల్లోనే నిర్మించొచ్చు లేదా అవసరమైనప్పుడు విప్పేసుకోవచ్చు. అలాగే మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యం, విద్యను అందించేందుకు ఉపయోగపడే భవనాలను సులభంగా, చౌకగా నిర్మించేందుకు కూడా అలోక్ కృషి చేస్తున్నారు. కాగా, టైమ్ రేపటి నాయకుల జాబితాలో ఇజ్రాయెలీ సామాజిక, వ్యాపారవేత్త ఆది అల్‌షులర్(27), చైనాలో వైద్యపరీక్షల రంగంలో కృషిచేస్తున్న ఝావో బోవెన్(22), టునీషియా మహిళా హక్కుల కార్యకర్త ఇక్రమ్ బెన్ సెయిద్(34), ఆన్లైన్ మ్యూజిక్ వీడియో మొఘల్ జమాల్ ఎడ్వర్డ్స్(24), నైజీరియాలో తొలి ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించిన ఫ్లైయింగ్ డాక్టర్స్ నైజీరియా సంస్థ ఎండీ ఓలా ఒరెకున్రిన్(28) ఉన్నారు. ** -
'ఈ'మ్యూజియానికి 'ఆ' గుర్తింపు
తాజాగా... ఢిల్లీ సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్స్‌లోకి ఒకసారి అడుగు పెడితే చాలు...టాయిలెట్లకు సంబంధించి 4,500ల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కళ్లకు కడుతుంది. ఈరకమైన మ్యూజియం ప్రపంచంలో ఎక్కడా లేదు. తాజాగా టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలో పది భిన్నమైన మ్యూజియం’ జాబితాలో సులభ్ మ్యూజియం చోటు చేసుకుంది. 1992లో నిర్మించిన ఈ మ్యూజియానికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది.విదేశీ పర్యాటకులు, విద్యార్థులకు ఇదొక ప్రధాన ఆకర్షణగా మారింది. రకరకాల వింత ఆకారాలలో ఉన్న టాయిలెట్లతో పాటు ఎలక్ట్రికల్, సోలార్ మోడల్ టాయిలెట్లు కూడా మ్యూజియంలో ఉన్నాయి. ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డ్ డావిన్సి గీసిన ఫ్లష్ టాయ్‌లెట్ స్కెచ్‌లు మరో ఆకర్షణ. ‘టాయ్‌లెట్స్ మ్యానర్స్’ అంటే ఏమిటో కూడా ఈ మ్యూజియాన్ని దర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులు చేర్చడం ఈ మ్యూజియం ప్రత్యేకత. ఫతేపూర్ సిక్రి, అంబర్ ఫోర్ట్, గోల్కోండ ఫోర్ట్‌లలో తొలిరోజులలో, హరప్పా నాగరికత కాలంలో మరుగుదొడ్లు ఎలా ఉండేవో కూడా ఈ మ్యూజియంలో కొలువు తీరిన ఛాయాచిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు. ‘‘నాగరిక సమాజాలలో మరుగుదొడ్లు అనేవి శుభ్రతకు సంబంధించిన ముఖ్య సాధనాలుగా ఉండేవి. మరుగుదొడ్ల గురించి మాట్లాడుకోవడం ఏమిటి? అనే స్థాయి నుంచి వాటి గురించి పూర్తి స్థాయిలో మాట్లాడుకునే పరిస్థితి కలిపించడానికే ఈ ప్రయత్నం చేశాను. మరుగుదొడ్ల మీద మరింత అవగాహన పెంచడానికి, రకరకాల ప్రశ్నలు మదిలో మొలకెత్తడానికి ఈ మ్యూజియం ఉపయోగపడుతుంది’’ అంటున్నాడు ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దిన బిందేశ్వర్ పాఠక్. -
టైమ్ జాబితాలో సచిన్, షారుక్ లకు చోటు!
న్యూయార్క్: విశ్వవ్యాప్తంగా ఇంటర్నెట్ లో అమితంగా అభిమానించే 100 మందిలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు చోటు లభించింది. టైమ్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కు ప్రథమ స్థానం లభించగా, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రెండవస్థానం, పాప్ సింగర్ మడోన్నాకు మూడవస్థానం దక్కింది. భారత దేశానికి చెందిన సచిన్ టెండూల్కర్ కు 68 స్థానంలో, షారుక్ ఖాన్ 99 స్థానంలో నిలిచారు. హిల్లరీ క్లింటన్ 11వ, వ్లాదిమిర్ పుతిన్ 27 స్థానంలో నిలిచారు. ఆన్ లైన్ లో సెలబ్రీటిలు, గ్లోబల్ లీడర్ల వెబ్ సైట్లు, వికీ పేజిల ఆధారంగా టెమ్ 100 మంది జాబితాను రూపొందించారు. -
మోడీకి మెక్ కెయిన్, టైమ్ అభినందనలు
లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారంటూ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని అమెరికా సెనేటర్ జాన్ మెక్కెయిన్ అభినందించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోడానికి ఆయన తమ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో చాలా శక్తిమంతంగా, స్ఫూర్తినిచ్చేలా జరిగిన ఎన్నికల్లో ఇంత భారీ విజయం సాధించినందుకు నరేంద్ర మోడీకి, బీజేపీకి అభినందనలు అంటూ సందేశం పంపారు. మోడీతో కలిసి పనిచేసేందుకు తనకు ఎంతో ఆసక్తిగా ఉందని 2004 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడిన మెక్ కెయిన్ అన్నారు. భారత్- అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికాలో ప్రసిద్ధి చెందిన టైమ్ పత్రిక కూడా మోడీ విజయాన్ని ప్రశంసించింది. అధికార కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో సహా పెకలించి, పార్లమెంటులో ఇంతకుముందెన్నడూ లేనంత అత్యధిక మెజారిటీ సాధించారంటూ మోడీని అభినందించింది. -
అంతర్జాతీయం
హతాఫ్ -3 క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్ అణుసామర్థ్యం ఉన్న క్షిపణి హతాఫ్-3ని పాకిస్థాన్ ఏప్రిల్ 22న విజయవంతంగా ప్రయోగించింది. 200 కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. సైన్యంలోని వ్యూహాత్మక దళాల కమాండ్ శిక్షణలో భాగంగా ఈ పరీక్ష నిర్వహించింది. భారత్‌లోని పలు ప్రాంతాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. కొత్త ఖనిజాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పశ్చిమ ఆస్ట్రేలియాలో కొత్త ఖనిజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు అడిలైడ్‌కు చెందిన మినరలాజికల్ మ్యాగజీన్ ఏప్రిల్ 21న తెలిపింది. నిర్మాణం, కూర్పులో ప్రత్యేకత కలిగిన ఆ ఖనిజానికి పుట్నిసైట్ అని పేరుపెట్టారు. ఈ పుట్నిసైట్లో స్టోంటియం, కాల్షియం, క్రోమియం, సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ మూలకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు 400 ఖనిజ రకాలను గుర్తించారు. బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా సిద్దార్థ్ హిందీ చిత్రం సిద్దార్థ్ బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి ఇండియన్ కెనడియన్ రిచీ మెహతా దర్శకత్వం వహించారు. తప్పిపోయిన కొడుకు కోసం తండ్రి వెతకడం అనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 88 దేశాల నుంచి వచ్చిన 837 చిత్రాలతో పోటీ పడిన సిద్దార్థ్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. దక్షిణ కొరియా ప్రధాని చుంగ్ హాంగ్ వాన్ రాజీనామా ప్రయాణికుల నౌక మునిగిపోయిన దుర్ఘటనతో కలత చెందిన దక్షిణ కొరియా ప్రధానమంత్రి చుంగ్ హాంగ్ వాన్ ఏప్రిల్ 27న పదవికి రాజీనామా చేశారు. ప్రయాణికులను రక్షించడంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదని ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. సహాయ చర్యలు సమర్థంగా నిర్వహించలేకపోయామని ప్రధాని అంగీకరించారు. దక్షిణకొరియా దక్షిణ తీరంలో ఏప్రిల్ 16న నౌక మునిగిపోయి 300 మంది గల్లంతయ్యారు. మొత్తం 459 మంది నౌకలో ప్రయాణిస్తున్నారు. అందులోని వారంతా విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు. ప్రభావితం చేయగల వ్యక్తుల్లో మోడీ, కేజ్రీవాల్, అరుంధతి రాయ్‌కి స్థానం 2014 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ప్రభావితం చేయగల 100 మంది జాబితాను టైమ్ మ్యాగజీన్ ఏప్రిల్ 25వ సంచికలో ప్రచురించింది. ఈ 100 మందిలో భారత్ నుంచి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, నవలాకారిణి అరుంధతీ రాయ్‌లకు చోటు దక్కింది. వీరితో పాటు కొయంబత్తూర్‌కు చెందిన ఆరోగ్య ప్రచారకర్త అరుణాచలమ్ మురుగనాథమ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. టైమ్ మ్యాగజీన్ జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ముఖచిత్రంగా ప్రచురితమైన గాయకురాలు బియోన్స, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, పాకిస్తాన్ బాలికల విద్య ప్రచార కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్, విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ స్నోడన్, జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఉన్నారు. దక్షిణ ఆఫ్రికాలో బహుళ జాతి ప్రజాస్వామ్యానికి 20 ఏళ్లు దక్షిణ ఆఫ్రికాలో బహుళ జాతి ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 27 నాటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. 27న ఫ్రీడమ్ డే ని జరుపుకున్నారు. మండేలా లేకుండా తొలిసారి ఫ్రీడమ్ డే జరిగింది. జాత్యహంకార వ్యతిరేక పోరాట యోధుడు మండేలా 95 ఏళ్ల వయసులో 2013 డిసెంబర్లో మరణించారు. 20 ఏళ్ల క్రితం దేశంలో అన్ని జాతులు తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నాయి. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) అధికారంలోకి వచ్చింది. నెల్సన్ దేశ తొలి నల్లజాతి అధ్యక్షుడిగా అధికారం చేపట్టారు. -
‘టైమ్ జాబితా’లో మోడీ, కేజ్రీవాల్
జాబితాలో వీరు సహా నలుగురు భారతీయులు న్యూయార్క్: ప్రతిష్టాత్మక టైమ్ పత్రిక రూపొందించిన ‘ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2014’లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌లకు చోటు దక్కింది. ర్యాంకులు కేటాయించకుండా గురువారం ప్రచురించిన ఈ జాబితాలో నలుగురు భారతీయులు ఉన్నారు. మోడీ, కేజ్రీవాల్‌లతోపాటు రచయిత్రి అరుంధతీ రాయ్, కోయంబత్తూరుకు చెందిన ఆరోగ్య కార్యకర్త అరుణాచలం మురుగనందమ్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. మోడీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఏలనున్న విభజనవాద రాజకీయ నేత అని టైమ్ పేర్కొంది. కేజ్రీవాల్ ఆధునిక భారత రాజకీయాల్లో భిన్నమైన వ్యక్తి అని పేర్కొంది. -
‘టైమ్ 100’జాబితాలో నలుగురు భారతీయులు
న్యూయార్క్: ప్రతిష్టాత్మక టైమ్ పత్రిక రూపొందించిన ‘ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2014’లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌లకు చోటు దక్కింది. ర్యాంకులు కేటాయించకుండా గురువారం ప్రచురించిన ఈ జాబితాలో నలుగురు భారతీయులు ఉన్నారు. మోడీ, కేజ్రీవాల్‌లతోపాటు రచయిత్రి అరుంధతీ రాయ్, కోయంబత్తూరుకు చెందిన ఆరోగ్య కార్యకర్త అరుణాచలం మురుగనందమ్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. మోడీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఏలనున్న విభజనవాద రాజకీయ నేత అని టైమ్ పేర్కొంది. ‘మోడీ వేగంగా చర్యలు తీసుకుంటారని, ప్రై వేట్ రంగాన్ని ప్రోత్సహిస్తారని, బాగా పరిపాలిస్తారనే ఖ్యాతి ఉంది. అయితే నిరంకుశంగా పాలిస్తారని, అతివాద హిందూ జాతీయవాది అనే మచ్చ కూడా ఉంది. అయితే మార్పు ఆశిస్తున్న దేశంలో ఇలాంటి ఆందోళనలు తగ్గుతున్నాయి’ అని వ్యాఖ్యానించింది. అరవింద్ కేజ్రీవాల్ ఆధునిక భారత రాజకీయాల్లో భిన్నమైన వ్యక్తి అని పేర్కొంది. శక్తిమంతులను ఢీకొంటున్న ఆయనది భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానమంది. అరుంధతీరాయ్ భారతదేశ చైతన్యమని అభివర్ణించింది. -
‘టైమ్’ ప్రభావశీలుర పోల్‌లో మోడీని అధిగమించిన కేజ్రీ
న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్... ప్రపంచంలోని వందమంది ప్రభావశీలుర జాబితా రూపకల్పనకు నిర్వహిస్తున్న ఆన్లైన్ పోల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. మంగళవారం ఉదయం వరకూ నమోదైన గణాంకాల ప్రకారం కేజ్రీవాల్ అత్యధిక ‘ఎస్’ ఓట్లతో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతోపాటు అమెరికా పాప్ గాయని కేటీ పెర్రీని అధిగమించారు. ఈ పోల్‌లో కేజ్రీవాల్‌కు 71.5 శాతం ‘ఎస్’ ఓట్లు లభించగా వ్యతిరేకంగా 28.5 శాతం ‘నో’ ఓట్లు పడ్డాయి. కేజ్రీవాల్‌కు ఇప్పటివరకూ 3,168,308 ఓట్లు లభించాయి. మరోవైపు ఈ జాబితాలో పోటీపడుతున్న ప్రముఖుల్లో అందరికంటే ఎక్కువ శాతం ‘నో’ ఓట్లతో మోడీ వెనకంజలో ఉన్నారు. మోడీకి 49.7 శాతం ‘ఎస్’ ఓట్లు లభించగా 50.3 శాతం ‘నో’ ఓట్లు వచ్చాయి. మోడీకి ఇప్పటివరకూ 5,075,588 ఓట్లు వచ్చాయి. కేజ్రీవాల్, మోడీ తర్వాతి స్థానంలో ఈజిప్టు సైనిక కమాండర్ అబ్దుల్ ఫత్తా అల్-సిసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొత్తం 96,070 ఓట్లతో 40వ ర్యాంకులో కొనసాగుతున్నారు. -
మోడీ ప్రధాని అయితే అమెరికా ఆపగలదా?
దేవయానీ ఖోబ్రగడే విషయంలో తల బొప్పి కట్టించుకున్న అగ్రరాజ్యం అమెరికా ముందు ఇప్పుడు మరో పెద్ద బండ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న నరేంద్రమోడీ నిజంగానే రేపు ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి అయితే.. ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని టైమ్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. పనిమనిషి వీసా కేసులో అమెరికాలో తీవ్ర అవమానానికి గురైన తర్వాత భారతీయ దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగడే భారతదేశానికి తిరిగి వెళ్లారని ఆ పత్రిక తన తాజా సంచికలో రాసింది. అయితే, రెండు దేశాల మధ్య సంబంధాలు అంత త్వరగా మెరుగుపడతాయని తాము అనుకోవట్లేదని, నరేంద్ర మోడీకి అమెరికా వీసా నిరాకరించడంతో, రేపు ఆయన ప్రధానమంత్రి అయితే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని తెలిపింది. ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా రాసింది. నరేంద్ర మోడీ 'అమెరికాకు ఏమాత్రం ఇష్టంలేని వ్యక్తి' అని, ఆయనపై హింసాత్మక సంఘటనలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినా, భారతీయ కోర్టులేవీ ఆయనను బాధ్యుడిగా పేర్కొనలేదని 'టైమ్' పత్రిక తెలిపింది. మతస్వేచ్ఛకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ భంగం కలిగించేలా ప్రవర్తించిన నాయకులకు అమెరికన్ చట్టాల ప్రకారం వీసా ఇవ్వబోమంటూ అమెరికా విదేశాంగ శాఖ 2005లోనే నరేంద్ర మోడీకి తమదేశంలో ప్రవేశించడానికి వీల్లేకుండా వీసా నిరాకరించింది. అప్పటికి మోడీ జాతీయస్థాయి నాయకుడు కారని, కానీ ఇప్పుడు మాత్రం ఆయన ప్రధాని అయితే.. అంతటి నాయకుడిని అమెరికా నిరాకరించగలదా అని ఆ పత్రిక సూటిగా ప్రశ్నించింది. మోడీ విషయంలో అమెరికా విధాన నిర్ణేతలు కూడా చీలిపోయారని, కొంతమంది మోడీ రాకను వ్యతిరేకిస్తున్నా.. రియలిస్టులు, అమెరికా వ్యాపారవేత్తలు మాత్రం ఆయన రావాలనే కోరుకుంటున్నారని, విదేశీ పెట్టుబడులకు ఆయన అనుకూలంగా ఉంటారన్న విషయాన్ని వారు గ్రహించారని టైమ్ పేర్కొంది. -
‘టైమ్’ ఈ ఏటి మేటి వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్
పోప్ ఫ్రాన్సిస్‌ను ఈ ఏటి మేటి వ్యక్తిగా ‘టైమ్’ మ్యాగజైన్ ప్రకటించింది. పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన 9నెలల కాలంలోనే కేథలిక్ చర్చి దృక్పథాన్ని అసాధారణమైన రీతిలో మార్చారంటూ ఆయనను శ్లాఘించింది. గడచిన పన్నెండు వందల సంవత్సరాల్లో తొలి యూరోపియనేతర పోప్‌గా చరిత్ర సృష్టించిన పోప్ ఫ్రాన్సిస్ అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొన్నారని పేర్కొంది. ‘టైమ్’ మ్యాగజైన్ 2013 సంవత్సరానికి చేపట్టిన ఈ ఏటి మేటి వ్యక్తి ఎంపికలో అమెరికా రహస్యాలను బట్టబయలు చేసిన సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ రెండోస్థానంలో నిలిచారు. టాప్-10 జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త ఎడిత్ విండ్సర్ తదితరులు ఉన్నారు. ఈ జాబితాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ 42వ స్థానంలో నిలిచారు. -
టైమ్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’ తుది రేసులో మోడీ
-
టైమ్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’ తుది రేసులో మోడీ
న్యూయార్క్: ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ టైమ్... ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్-2013’ అవార్డుకు కుదించిన తుది జాబితాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి చోటు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో మొత్తం 42 మందికి చోటు దక్కగా భారత్ నుంచి ఇందులో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయుడు మోడీనే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వాన్ని పడగొట్టగల అవకాశం ఉన్న వ్యక్తి ఆయనేనని ‘టైమ్’ పేర్కొంది. జాబితాలోని ఇతర ప్రముఖుల్లో జపాన్ ప్రధాని షింజో అబె, అమెరికా అధ్యక్షుడు ఒబామా, పాక్ సాహస బాలిక మలాలా, అమెరికా నిఘా రహస్యాలను బయటపెట్టిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఉన్నారు. విజేతను ‘టైమ్’ ఎడిటర్లు వచ్చే నెల ఎంపిక చేస్తారు. అయితే ఈ ఏడాది వార్తల్లో (మంచి అయినా/చెడు అయినా) ఎక్కువగా నిలిచిన వ్యక్తికి ఓటు వేయాల్సిందిగా ఆన్లైన్ పాఠకులను ‘టైమ్’ కోరగా 2,650కిపైగా ఓట్లు/25 శాతంతో మోడీ తొలి స్థానంలో ఉన్నారు.