'టైమ్స్' లిస్టులో సత్య నాదెళ్ల
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, మెక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అత్యంత ప్రభావశీరుల జాబితాలో ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీరుల పేర్లతో ప్రఖ్యాత 'టైమ్స్' మేగజీన్ రూపొందించిన ఈ జాబితాలో రూపొందించింది. ప్రపంచ నాయకులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర రంగాలకు చెందిన 127 మంది పేర్లను జాబితాలో చేర్చింది. వీరిలో 100 మంది పేర్లతో అత్యంత శక్తిమంతుల జాబితాను వచ్చే నెలలో విడుదల చేయనుంది. పాఠకుల ఓట్లు ఆధారంగా ఈ లిస్టు తయారుచేయనుంది.
ప్రధాని మోదీ గతేడాది కూడా ఈ జాబితాలో ఉన్నారు. మహిళల టెన్నిస్ లో డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకు సాధించిన సానియా స్వదేశంలో క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచారని 'టైమ్స్' కొనియాడింది. 'క్వాంటికో' నటించడం ద్వారా ప్రియాంకా చోప్రా హాలీవుడ్ దృష్టిని ఆకర్షించారని ప్రశంసించింది. సత్య నాదెళ్ల విండోస్ 10ను విజయవంతంగా ప్రవేశపెట్టారని, ఆయన సారథ్యంలో క్లౌడ్ టెక్నాలజీ బిజినెస్ ఊపంచుకుందని తెలిపింది. మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టనున్న హొలోలెన్స్ వంటి సరికొత్త టెక్నాలజీ కోసం ఐటీ ఇండస్ట్రీ ఎనలిస్టులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టైమ్స్ వెల్లడించింది. ఆండ్రాయిడ్, యూట్యూబ్ తో విదేశాల్లో కోర్ బిజినెస్ ను సుందర్ పిచాయ్ పెంచారని కితాబిచ్చింది.
గూగుల్ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్, సింగర్ రిహన్న, జమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్, హ్యారీ పోర్టర్ రచయిత్రి జేకే రౌలింగ్, అంగ్ సాన్ సూకీ, ఏంజెలా మోర్కల్, వ్లాదిమిర్ పుతిన్, పోప్ ఫ్రాన్సిస్, భారత సంతతి నటుడు అజీజ్ అన్సారీ తదితరులు 'టైమ్స్' లిస్టులో ఉన్నారు.