
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌లో జన్మించిన ఒక వ్యక్తి యూకేలో కూర్చొని పక్షపాతంతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా టైమ్ మేగజీన్‌లో కథనం రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ నేషనల్ మేనిఫెస్టో సబ్ కమిటీ సభ్యురాలు కరుణ గోపాల్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మోదీ దేశాన్ని విభజిస్తున్నారని రాయడం దారుణమని, సుప్రీంకోర్టులో ఆ మేగజీన్‌పై పిటిషన్ వేస్తామన్నారు. మోదీ ప్రధాని కాకముందు ఈశాన్య రాష్ట్రాలు నిర్లక్ష్యం చేయబడ్డాయని, మోదీ వచ్చాకే ఆ రాష్ట్రాలను అభివృద్ధి చేశారని చెప్పారు. గతంలో ఆ రాష్ట్రాల వారు భారతదేశంలో ఉన్నామని ఎప్పుడూ భావించలేదని, మోదీ ప్రధాని అయిన తర్వాతే వారికి భారత్‌లో ఉన్నామనే భావన తీసుకొచ్చారని తెలిపారు.