న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో ప్రధాని మోదీ పాల్గొనడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
దేశంలో గణేష్ ఉత్సవాల సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణేజ్ పూజ జరిగింది. ఈ పూజలో మోదీ సంప్రదాయ మహరాష్ట్ర టోపీ ధరించి పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న ఫొటోల్ని ప్రధాని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే మోదీ పూజలో పాల్గొన్నడానికి ప్రతిపక్ష నేతలు తప్పుబడుతుంటే .. అధికార బీజేపీ నేతలు పూజలో రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు పాల్గొనడం నేరం కాదని మోదీకి మద్దతు పలుకుతున్నారు.
#WATCH | On PM Modi visiting CJI DY Chandrachud's residence for Ganpati Poojan, Shiv Sena (UBT) leader Sanjay Raut says, " Ganpathi festival is going on, people visit each other's houses. I don't have info regarding how many houses PM visited so far...but PM went to CJI's house… pic.twitter.com/AVp26wl7Yz
— ANI (@ANI) September 12, 2024
ప్రజల్లో సందేహాలు తలెత్తుతాయ్
రాజ్యసభ ఎంపీ, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇలాంటి (మోదీ పూజలో పాల్గొనడంపై) సమావేశాలు అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి. ఇది గణపతి పండుగ. ఢిల్లీలో చాలా చోట్ల గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రధాని ఇప్పటి వరకు ఎంత మంది ఇళ్లకు వెళ్లారో నాకు సమాచారం లేదు. కానీ ప్రధాని మాత్రం చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్లారు. అక్కడ గణపతి పూజలు చేశారు. హారతులిచ్చారు. రాజ్యాంగ పరిరక్షకులు.. రాజకీయ నాయకులను ఈ విధంగా కలుస్తుంటే ప్రజలకు సందేహాలు కలుగుతాయి’అని సంజయ్ రౌత్ అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీతో చంద్రచూడ్‌కు ఉన్న సంబంధాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. శివసేన (యూబీటీ) ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య జరిగిన గొడవకు సంబంధించిన కేసు విచారణ నుండి భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తప్పుకోవాలని కోరారు.
ఇదీ చదవండి : అన్నదమ్ముల్ని ప్రాణం తీసిన అప్పు
అది తప్పెలా అవుతుంది
ప్రధాని పర్యటనపై ప్రతిపక్ష నేతలు చేసిన విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. గణేష్ పూజకు హాజరు కావడం నేరం కాదు. అనేక సందర్భాల్లో న్యాయమూర్తలు, రాజకీయ నాయకులు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల్లో పాల్గొంటారు. అది తప్పు కాదు కదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 2009లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ హాజరయ్యారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment