అధికార దాహంతో విభజన రాజకీయాలు చేసే వాళ్లకు నేనంటే కోపం
సీజేఐ ఇంట్లో పూజకు హాజరవడంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
భువనేశ్వర్: సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజలో పాల్గొన్నందుకు తనపై విమర్శలు పెంచిన కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ మంగళవారం దీటుగా బదులిచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ గణేశ్ ఉత్సవం దేశంలో కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన వేడుక కాదు. దేశ స్వాతం్రత్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉత్సవం.
ఆకాలంలో బ్రిటిష్ పాలకులు సైతం గణేశ్ ఉత్సవాలను ద్వేషించాలంటూ భారత్‌లో విభజించు, పాలించు కుట్రను అమలుచేశారు. ఇప్పుడు కూడా అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న కొందరు గణపతి పూజలో పాల్గొంటే సమస్యలొస్తాయంటూ సమాజాన్ని విభజించే పనిలో బిజీగా మారారు. గణపతి పూజలో పాల్గొన్న నాపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాల్లో పీకలదాకా కోపముంది.
కాంగ్రెస్‌పాలిత కర్ణాటకలో గొడవలు జరుగుతాయంటూ ఏకంగా గణపతి విగ్రహాన్నే కటాకటాల వెనక్కి నెట్టారు. పోలీస్‌వ్యాన్‌లో గణపతి విగ్రహం ఫొటో చూసి యావత్‌భారతావని బాధపడింది. ఇక ఇలాంటి విద్వేష శక్తుల ఆట కట్టించాల్సిందే. దేశాన్ని కుల, మత ప్రాతిపదికన బ్రిటిషర్లు విభజించాలని చూస్తే లోకమాన్య తిలక్ గణేశ్ ఉత్సవాలతో దేశ సమైక్య స్ఫూర్తిని మరింతగా రగిల్చారు. కుల మతాలకతీతంగా ఐక్యంగా ఎలా ఉండాలో గణేష్ ఉత్సవాలు మనకు చాటిచెప్పాయి’’ అని మోదీ అన్నారు.
రూ.2,871 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం
తన నాయకత్వంలో మూడోదఫా పాలన మొదలై 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం మోదీ ఒడిశాలో రూ.2,871 కోట్ల విలువైన రైల్వే, జాతీయరహదారులకు సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపనలు చేసి కొన్నింటిని ప్రారంభించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వ కీలక పథకం ‘ సుభద్ర యోజన’ను ప్రారంభించారు. భువనేశ్వర్‌లోని సబర్ సాహీ మురికివాడలో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన(పట్టణ) 20 మంది లబి్ధదారుల ఇళ్లను మోదీ స్వయంగా ప్రారంభించి వారితో మోదీ ముచ్చటించారు. పుట్టినరోజున తమ ఇంటికొచి్చన మోదీకి ఆ గిరిజనులు అంగవస్త్రం ఇచ్చి ఆహా్వనించి నుదుటిన గంధం»ొట్టు పెట్టారు. ప్రేమతో తనకు వారు ఇచి్చన తీపి వంటకం ఖీర్‌ను మోదీ రుచిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment