Ganapati Puja
-
ప్రధాని మా ఇంటికి వస్తే తప్పేముంది: సీజేఐ చంద్రచూడ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణపతి పూజ కోసం తన నివాసానికి రావడంలో తప్పేముందని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ప్రశ్నించారు. ప్రధాని రాకలో తప్పేమీ లేదన్నారు. ఇలాంటి అంశాల్లో రాజకీయవర్గాలు పరిణితిని కనబర్చాలని పేర్కొన్నారు. సీజేఐ నివాసానికి ప్రధాని వెళ్లడం తప్పుడు సంకేతాలు వెళ్లడానికి ఆస్కారం కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించిన విషయం తెలిసిందే. ‘గణపతి పూజ నిమిత్తం ప్రధాని మోదీ నా నివాసానికి వచ్చారు. ఇందులో ఏమాత్రం తప్పు లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య జరిగే సమావేశాల్లో ఇదో భాగమే. రాష్ట్రపతి భవన్‌లోనూ, గణతంత్ర దినోత్సవం.. ఇలా పలు సందర్భాల్లో కలుస్తుంటాం. ప్రధాని, మంత్రులతో మాట్లాడతాం. మా మధ్య సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కేసుల ప్రస్తావన రాదు. సామాజిక స్థితిగతులు, ప్రజల జీవితాలపై చర్చ జరగుతుంది’అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు నిర్వహించిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. రెండు ప్రధాన వ్యవస్థల మధ్య సుహుృద్భావ చర్చలుగా తమ భేటీలను చూడాలని పేర్కొన్నారు. -
గణపతి పూజలో పాల్గొన్నా కాంగ్రెస్‌కు నచ్చట్లేదు
భువనేశ్వర్: సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజలో పాల్గొన్నందుకు తనపై విమర్శలు పెంచిన కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ మంగళవారం దీటుగా బదులిచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ గణేశ్ ఉత్సవం దేశంలో కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన వేడుక కాదు. దేశ స్వాతం్రత్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉత్సవం. ఆకాలంలో బ్రిటిష్ పాలకులు సైతం గణేశ్ ఉత్సవాలను ద్వేషించాలంటూ భారత్‌లో విభజించు, పాలించు కుట్రను అమలుచేశారు. ఇప్పుడు కూడా అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న కొందరు గణపతి పూజలో పాల్గొంటే సమస్యలొస్తాయంటూ సమాజాన్ని విభజించే పనిలో బిజీగా మారారు. గణపతి పూజలో పాల్గొన్న నాపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాల్లో పీకలదాకా కోపముంది. కాంగ్రెస్‌పాలిత కర్ణాటకలో గొడవలు జరుగుతాయంటూ ఏకంగా గణపతి విగ్రహాన్నే కటాకటాల వెనక్కి నెట్టారు. పోలీస్‌వ్యాన్‌లో గణపతి విగ్రహం ఫొటో చూసి యావత్భారతావని బాధపడింది. ఇక ఇలాంటి విద్వేష శక్తుల ఆట కట్టించాల్సిందే. దేశాన్ని కుల, మత ప్రాతిపదికన బ్రిటిషర్లు విభజించాలని చూస్తే లోకమాన్య తిలక్ గణేశ్ ఉత్సవాలతో దేశ సమైక్య స్ఫూర్తిని మరింతగా రగిల్చారు. కుల మతాలకతీతంగా ఐక్యంగా ఎలా ఉండాలో గణేష్ ఉత్సవాలు మనకు చాటిచెప్పాయి’’ అని మోదీ అన్నారు. రూ.2,871 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం తన నాయకత్వంలో మూడోదఫా పాలన మొదలై 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం మోదీ ఒడిశాలో రూ.2,871 కోట్ల విలువైన రైల్వే, జాతీయరహదారులకు సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపనలు చేసి కొన్నింటిని ప్రారంభించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వ కీలక పథకం ‘ సుభద్ర యోజన’ను ప్రారంభించారు. భువనేశ్వర్‌లోని సబర్ సాహీ మురికివాడలో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన(పట్టణ) 20 మంది లబి్ధదారుల ఇళ్లను మోదీ స్వయంగా ప్రారంభించి వారితో మోదీ ముచ్చటించారు. పుట్టినరోజున తమ ఇంటికొచి్చన మోదీకి ఆ గిరిజనులు అంగవస్త్రం ఇచ్చి ఆహా్వనించి నుదుటిన గంధం»ొట్టు పెట్టారు. ప్రేమతో తనకు వారు ఇచి్చన తీపి వంటకం ఖీర్‌ను మోదీ రుచిచూశారు. -
సీజేఐ ఇంట్లో ప్రధాని మోదీ గణపతి పూజపై రాజకీయ దుమారం
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో ప్రధాని మోదీ పాల్గొనడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.దేశంలో గణేష్ ఉత్సవాల సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణేజ్ పూజ జరిగింది. ఈ పూజలో మోదీ సంప్రదాయ మహరాష్ట్ర టోపీ ధరించి పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న ఫొటోల్ని ప్రధాని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే మోదీ పూజలో పాల్గొన్నడానికి ప్రతిపక్ష నేతలు తప్పుబడుతుంటే .. అధికార బీజేపీ నేతలు పూజలో రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు పాల్గొనడం నేరం కాదని మోదీకి మద్దతు పలుకుతున్నారు. #WATCH | On PM Modi visiting CJI DY Chandrachud's residence for Ganpati Poojan, Shiv Sena (UBT) leader Sanjay Raut says, " Ganpathi festival is going on, people visit each other's houses. I don't have info regarding how many houses PM visited so far...but PM went to CJI's house… pic.twitter.com/AVp26wl7Yz— ANI (@ANI) September 12, 2024 ప్రజల్లో సందేహాలు తలెత్తుతాయ్రాజ్యసభ ఎంపీ, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇలాంటి (మోదీ పూజలో పాల్గొనడంపై) సమావేశాలు అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి. ఇది గణపతి పండుగ. ఢిల్లీలో చాలా చోట్ల గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రధాని ఇప్పటి వరకు ఎంత మంది ఇళ్లకు వెళ్లారో నాకు సమాచారం లేదు. కానీ ప్రధాని మాత్రం చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్లారు. అక్కడ గణపతి పూజలు చేశారు. హారతులిచ్చారు. రాజ్యాంగ పరిరక్షకులు.. రాజకీయ నాయకులను ఈ విధంగా కలుస్తుంటే ప్రజలకు సందేహాలు కలుగుతాయి’అని సంజయ్ రౌత్ అన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీతో చంద్రచూడ్‌కు ఉన్న సంబంధాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. శివసేన (యూబీటీ) ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య జరిగిన గొడవకు సంబంధించిన కేసు విచారణ నుండి భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తప్పుకోవాలని కోరారు.ఇదీ చదవండి : అన్నదమ్ముల్ని ప్రాణం తీసిన అప్పుఅది తప్పెలా అవుతుందిప్రధాని పర్యటనపై ప్రతిపక్ష నేతలు చేసిన విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. గణేష్ పూజకు హాజరు కావడం నేరం కాదు. అనేక సందర్భాల్లో న్యాయమూర్తలు, రాజకీయ నాయకులు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల్లో పాల్గొంటారు. అది తప్పు కాదు కదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 2009లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ హాజరయ్యారని గుర్తు చేశారు. -
భూమి పూజకు శ్రీకారం
అయోధ్య: అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఈ బుధవారం జరగనున్న విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణం జరిగే రామ జన్మభూమి వద్ద సోమవారం 12 మంది పూజారులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గణపతి పూజ జరిపారు. అయోధ్యలోని హనుమాన్ గఢి ఆలయంలో మంగళవారం పూజాకార్యక్రమం నిర్వహిస్తారు. భూమి పూజ కార్యక్రమ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాలదాస్ మహారాజ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఉంటారు. కరోనా ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో ఆహ్వానితులు మాత్రమే భూమి పూజ కార్యక్రమానికి రావాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. ఆహ్వానాలు పంపిన 175 మందిలో 135 మంది పలు సంప్రదాయ మఠ, ఆధ్యాత్మిక గురువులేనని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెల్లడించింది. రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నాయకురాలు ఉమా భారతి.. భూమిపూజ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. ఉద్ధవ్ ఠాక్రే వెళ్లకపోవచ్చు అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరు కాకపోవచ్చని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ‘అయోధ్యలో కరోనా పరిస్థితి సీరియస్‌గా ఉంది. కోవిడ్–19తో ఒక యూపీ మంత్రి కూడా చనిపోయారు. మరో ముగ్గురు మంత్రులకు సోకింది. ఈ పరిస్థితుల్లో భూమి పూజ కార్యక్రమానికి ఎంత తక్కువ మంది వెళ్తే అంత మంచిది’ అన్నారు. రత్నాలు పొదిగిన దుస్తులు భూమి పూజ రోజు ‘రామ్‌లల్లా’కు అలంకరించే వస్త్రాలను శంకర్‌లాల్, భగవత్ లాల్ సోదరులు రూపొందిస్తున్నారు. మూడున్నర దశాబ్దాలుగా వారు బాల రాముడికి వ స్త్రాలను రూపొందిస్తున్నారు. ‘1985లో మా నాన్న బాబూలాల్ బాల రాముడికి వ స్త్రాలు రూపొందించడం ప్రారంభించారు. కుట్టుమిషన్‌తో పాటు రామజన్మభూమికి వెళ్లి, అక్కడే రామ్‌లల్లా విగ్రహం ముందే దుస్తులు కుట్టేవారు. మా ఇద్దరిని కూడా వెంట తీసుకువెళ్లేవారు’ అని శంకర్‌లాల్ తెలిపారు. ‘5న రామ్‌లల్లాకు అలంకరించడం కోసం రెండు జతల దుస్తులను రూపొందిస్తున్నాం. మఖ్మల్ వస్త్రంతో బంగారు దారంతో నవ రత్నాలు పొదిగి ఒకటి ఆకుపచ్చ వర్ణంలో, మరొకటి నారింజ రంగులో సిద్ధం చేస్తున్నాం’ అని తలిపారు. కాగా, భూమి పూజ పనులను యూపీ సీఎం ఆదిత్య నాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అది శ్రీరాముడి కోరిక భూమి పూజ కార్యక్రమానికి తాను హాజరుకావడం శ్రీరామ చంద్రుడి కోరిక కావచ్చని అయోధ్య భూ వివాదంలో కక్షిదారు అయిన ఇఖ్బాల్ అన్సారీ వ్యాఖ్యానించారు. ఆలయ ట్రస్ట్ నుంచి తనకు ఆహ్వానం అందిందన్నారు. భూమిపూజ రోజు ప్రధాని మోదీకి రాముడి పేరు ఉన్న శాలువాను, రామచరిత మానస్ పుస్తకాన్ని బహూకరించాలనుకుంటున్నా అని అన్నారు. రామ్ లల్లా ఫొటోతో ముద్రితమైన ఆహ్వాన ప్రతి -
శ్రీశైలంలో జపపారాయణలు ప్రారంభం
శ్రీశైలం (కర్నూలు): వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం వేద పండితులు, అర్చకులు జప పారాయణ పూజలను ప్రారంభించారు. ఇవి 12వ తేదీ వరకు కొనసాగుతాయి. సోమవారం ఉదయం స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ చేశారు. అనంతరం ఘటాభిషేక సంకల్పాన్ని పఠించారు. సకల జనులు ఆయురారోగ్యంతో ఉండాలని, వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, దేశం సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పం చెప్పారు. అనంతరం పుణ్యహవచానాన్ని చేసి స్థలశుద్ధి చేశారు. కాగా, బుధవారం ఉదయం 7.30 గంటలకు శ్రీమల్లికార్జునస్వామికి సహస్రఘటాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు, 11గంటలకు పూర్ణాహుతి, కలశోధ్వాసన, కలశ జలాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) సాగర్‌బాబు తెలిపారు. -
వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
పెనుగంచిప్రోలు, న్యూస్‌లైన్: గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో తొలి పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ఈవో ఎన్.విజయ్‌కుమార్, చైర్మన్ నెల్లూరి గోపాలరావు గణపతి పూజ అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. తొలిసారిగా పవిత్రోత్సవాలు నిర్వహించనుండడంతో ఏర్పాట్లు పటిష్టంగా చేశారు. ఉదయం మండపారాధన, సాయంత్రం అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రికి ఆలయం చుట్టూ అమ్మవారి ఊరేగింపు, పంచహారతుల అనంతరం దేవతామూర్తులకు పవిత్రములు ధరింపజేశారు. ఉత్సవాల ప్రారంభంతోపాటు శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని పాలు, పొంగళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ వైకుంఠరావు, ఏఈఓలు ప్రసాదరావు, గోపాలరావు, సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, పాల్గొన్నారు.