criticisms
-
బుల్లి కారులో వచ్చి శీష్‌మహల్ స్థాయికి ఎదిగారు
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ అబద్ధాలు మాట్లాడుతూ, తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారన్నారు. రాజకీయాలను మారుస్తానంటూ చిన్న కారులో వచ్చిన ఈ వ్యక్తి నేడు వాగన్ ఆర్ కారులో శీష్ మహల్‌కు వెళ్లే స్థాయికి ఎదిగారంటూ మండిపడ్డారు. ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో అధికార నివాసం శీష్ మహల్లో విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసిన ఈయన ఇప్పుడు ఇతర పార్టీలు అవినీతికి పాల్పడ్డాయంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. గత పదేళ్లలో అవినీతిలో మునిగి తేలడం, కాలుష్యాన్ని పెంచడం మినహా ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ చేసిందేమీ లేదన్నారు. సమాజంలో హింసను, విద్వేషాలను బీజేపీ వ్యాపింపజేస్తోందని, తమ కాంగ్రెస్‌పార్టీ మాత్రమే ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. తన మంత్రివర్గాన్ని నవ రత్నాలంటూ కేజ్రీవాల్ చెప్పుకుంటున్న వారిలో ఒక్కరూ ఓబీసీ, మైనారిటీ, దళిత, గిరిజన వర్గాలకు చెందిన వారు లేరన్నారు. అందరూ అగ్ర కులాలకు చెందిన వారేనని రాహుల్ చెప్పారు. ‘ఢిల్లీ రాజకీయాల్లో మార్పు తెస్తానమంటూ ప్రకటించుకున్న కేజ్రీవాల్.. అతిపెద్ద మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. యమునా నదిలో మునిగి, యమునా జలాలను తాగుతానని ఐదేళ్ల క్రితం చెప్పిన కేజ్రీవాల్ ఆ విషయం మర్చేపోయారు’అని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి ఢిల్లీ ఎన్నికలు అవకాశవాద పోటీ కాదని చెప్పారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను పరిరక్షించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. మదీపూర్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ బీజేపీపైనా విమర్శలు సంధించారు. సమాజంలో కులాలు, భాషల ప్రాతిపదికన విభేదాలు పెంచి, హింసను బీజేపీ ఎగదోస్తోందన్నారు. ప్రజలను సమస్యల నుంచి మళ్లించేందుకు, సంపదను బడా పారిశ్రామిక వేత్తల ధారాదత్తం చేసేందుకు కుట్రలు పన్నుతోందని చెప్పారు. టాప్ 25 పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన మోదీజీ..ఢిల్లీలోని విద్యార్థులు, చిరు వ్యాపారులు, గృహిణుల రుణాలెన్నిటిని రద్దు చేశారు? అంటూ ప్రశ్నించారు. మోదీ, కేజ్రీవాల్ ఒక్కటే అవినీతి విషయంలో ప్రధాని మోదీ, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇద్దరూ ఒక్కటేనని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ముస్తాఫాబాద్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆమె.. విభేదాలు సృష్టించడమే బీజేపీ నైజమని చెప్పారు. మోదీ రాజ్‌మహల్ గురించి ఆప్ నేతలు మాట్లాడుతుంటే, కేజ్రీవాల్ శీష్ మహల్ గురించి బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, ఈ రెండు పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు తెచ్చేందుకే తప్ప ప్రజలకు రహదారులు, మంచి నీరు, విద్య వంటి వాటి గురించి బీజేపీ మాట్లాడటం లేదని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌కు మోదీకి మధ్య తేడాయేలేదన్నారు. -
జస్టిస్ చంద్రచూడ్‌పై మొయిత్రా విమర్శలు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం లోక్‌సభలో చేసిన విమర్శలు తీవ్ర కలకలం రేపాయి. అంతేగాక విమర్శించే గొంతుకలన్నింటినీ నొక్కేయడమే లక్ష్యంగా దేశంలో సర్వ వ్యవస్థలనూ మోదీ సర్కారు చెరబడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసే క్రమంలో ప్రత్యేక కోర్టు జడ్జి బి.హెచ్.లోయా మృతి అంశాన్ని ఆమె ప్రస్తావించడంతో సభలో దుమారం రేగింది. లోయాది అత్యంత అకాల మరణమన్న మొయిత్రా వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘అత్యంత తీవ్ర ఆరోపణలివి. దీనిపై కచ్చితంగా తగిన రీతిలో పార్లమెంటరీ చర్యలుంటాయి. మొయిత్రా తప్పించుకోలేరు’’ అన్నారు. మొయిత్రా ప్రసంగ రికార్డులను స్పీకర్ ఓం బిర్లా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఆమెపై మరోసారి అనర్హత వేటు తప్పదంటున్నారు. నోటుకు ప్రశ్నల ఆరోపణలపై గత లోక్‌సభలో మొయిత్రా సభ్యత్వం రద్దవడం తెలిసిందే. లోయా 2014లో రాజకీయంగా సొహ్రాబుద్దీన్ షేక్ హత్య కేసును విచారిస్తుండగా వివాదాస్పద రీతిలో మృతి చెందారు. దాని వెనక బీజేపీ హస్తముందనేలా విపక్షాలు ఆరోపించాయి. ఆయనది సహజ మరణమేనని సుప్రీంకోర్టు నిర్ధారించింది.సీజేఐలపై తీవ్ర వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని హత్య చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయతి్నస్తోందంటూ మొయిత్రా తన ప్రసంగంలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు చేతిలో వెయ్యి కత్తి పోట్లతో రాజ్యాంగం నిలువెల్లా రక్తమోడుతోందన్నారు. ఈడీ, సీబీఐ వంటివాటిని చివరికి వసూళ్ల సంస్థలుగా, ఈసీ వంటివాటిని జేబు సంస్థలుగా మార్చుకుందని ఆక్షేపించారు. ఆ క్రమంలో జస్టిస్ చంద్రచూడ్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాల సమగ్రతను, స్వతంత్ర ప్రతిపత్తిని పణంగా పెట్టేందుకు ప్రయతి్నంచారు! తాజా మాజీ సీజేఐ హయాంలో కొందరికే బెయిళ్లు మంజూరయ్యాయి. ఒక వర్గం వారికి మొండిచెయ్యి చూపారు. వారికి ఆయన అక్షరమాలలో స్థానమే లేకుండా పోయింది. ఆ మాజీ సీజేఐ ప్రవర్తన చివరికి సుప్రీంకోర్టు రాజకీయ ప్రతిపక్షంలా వ్యవహరించరాదనే వ్యాఖ్యలకూ కారణమైంది. విపక్ష పాత్ర పోషించేందుకు మేమున్నాం. అందుకు సుప్రీంకోర్టు అవసరమేమీ లేదు’’ అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ తన నివాసంలో గణేశ్ చతుర్థి వేడుకలకు ప్రధాని మోదీని ఆహా్వనించడాన్ని మొయిత్రా తీవ్రంగా తప్పుబట్టారు. మోదీని దేవునితో పోలుస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమూర్తులు తీర్పులు రాసేందుకు తర్కం, చట్టం, రాజ్యాంగానికి బదులు ఇలా దేవునితో ప్రైవేట్ సంభాషణలపై ఆధారపడే పరిస్థితిని బహుశా మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ ఊహించి కూడా ఉండరు. మాజీ, ప్రస్తుత సీజేఐలందరికీ నాదో సలహా. ఇలా దేవుడి నుంచి సూచనలు అందుకోవడం మానేయండి. వ్యక్తిగత వేడుకలకు రాజకీయ పెద్దలను అతిథులుగా పిలిచి వాటిని టీవీ సర్కస్లుగా మార్చకండి. మీ ఏకైక అతిథి రాజ్యాంగమే. అది మాత్రమే మీ ఇంట్లో కొలువుదీరే దేవుడు కావాలి. మీరు మిగల్చబోయే వ్యక్తిగత వారసత్వం గురించి ఆందోళన పడటం ఆపేయండి. ఎందుకంటే అలా వ్యక్తిగత గుర్తింపు కోరుకునే వాళ్లు ఎలాంటి వారసత్వమూ మిగల్చలేరు. మౌలిక హక్కులను పరిరక్షించేవారు మాత్రమే గుర్తుండిపోతారు’’ అన్నారు. -
ఒత్తిడిలో ఉన్నారా...? ఉద్యోగం ఉఫ్
సంస్థలో సరదాగా అంతర్గత సర్వే అంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా స్పందిస్తారు. సర్వేలో అడిగే ప్రశ్నలు వివాదాస్పదమైనవి కాకుండా సాధారణంగా ఉంటే ఏ ఉద్యోగి అయినా స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా సమాధానమిస్తారు. తమ అభిప్రాయాలను సంస్థ యాజమాన్యంతో పంచుకుంటారు. అలా ఉద్యోగులు చెప్పిన విషయాలే తమ ఉద్యోగం ఊడటానికి కారణమని సదలు ఉద్యోగులు తెల్సుకుని షాక్‌కు గురయ్యారు. ఉద్యోగుల్ని తొలగించే ఉద్దేశ్యం ఉంటే నేరుగా ఆ ఉద్యోగులకు చెప్పాలిగానీ ఇలా సర్వే వంకతో ఉద్యోగం నుంచి తొలగించడమేంటని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నోయిడా కేంద్రంగా పనిచేసే ఒక అంకుర సంస్థ చేసిన నిర్వాకం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. యస్ అని చెబుతున్నారా? పనివేళల్లో పని కారణంగా మీరు ఒత్తిడికి గురి అవుతున్నారా? అంటూ ‘యస్మేడమ్’అనే అంకురసంస్థ తన ఉద్యోగులతో అంతర్గత ఈమెయిల్ సర్వే చేపట్టింది. ఈ సంస్థ ఇంటి వద్ద హెయిర్ కటింగ్, మసాజ్, ఇతరత్రా బ్యూటీ, వెల్నెస్ సేవలను అందిస్తోంది. ఈ సర్వేలో భాగంగా చాలా మంది ఉద్యోగులు తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేశారు. వీటిని సేకరించిన సంస్థ.. ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాం అని సమాధానం చెప్పిన వారందరినీ తొలగిస్తున్నట్లు వాళ్లకు విడిగా ఈమెయిల్ సందేశాలు పంపింది. ఇతర ఉద్యోగులకు వివరణ సందేశాలు పంపింది. ‘‘ఒత్తిడి ఉందా అని మేం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి సర్వేలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ స్పందనకు మేం చాలా విలువ ఇస్తున్నాం. పనిచేసేటప్పుడు ఒక్కరు కూడా ఒత్తిడిగా ఫీల్ అవ్వకూడదు అనేది సంస్థ సిద్ధాంతం. ఈ మేరకు ఉద్యోగుల విషయంలో సంస్థ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తదుపరి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’అని కంపెనీ పేర్కొంది. కంపెనీ మానవవనరుల విభాగ సారథి అషు అరోరా ఝా పేరిట వచ్చిన ఈమెయిల్ సందేశాలను చూసి సదరు ఉద్యోగులు అవాక్కయ్యారు. ‘‘ఒత్తిడిగా ఉందని చెబితే పిలిచి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలిగానీ ఇలా ఏకంగా ఉద్యోగం ఊడపీకేస్తారా? అంటూ జాబ్ కోల్పోయిన ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. సర్వేలో ‘యస్’అని చెప్పిన దాదాపు 100 మందిని సంస్థ తొలగించిందని తెలుస్తోంది. ఇండిగో డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ డైరెక్టర్ శితిజ్ డోగ్రా చేసిన ఒక పోస్ట్‌తో ఈ ‘ఉద్యోగుల ఉద్వాసన పర్వం’వెలుగులోకి వచ్చింది. ‘‘నిజాయతీగా సమాధానం చెబితే సంస్థ ఇలాంటి మతిలేని నిర్ణయం తీసుకుంటుందా?’’అని చాలా మంది నెటిజన్లు సంస్థ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ఆలిండియా ఎంప్లాయీ అసోసియేషన్ స్పందించింది. ‘‘కార్మిక వ్యవస్థలోని లోపాలను కొన్ని సంస్థలు పూర్తిగా దురి్వనియోగం చేస్తున్నాయి. ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే స్తోమత లేకపోతే ముందుగా అసలు ఉద్యోగాల్లోకి తీసుకోకండి. ఆరోగ్యకరమైన ఉద్యోగ వాతావరణాన్ని కల్పించలేకపోతే ఎవరికీ ఉద్యోగం ఇవ్వకండి. పిచ్చిపిచ్చి కారణాలు చెప్పి ఉద్యోగులను మానసికంగా వేధించకండి’’అని వ్యాఖ్యానించింది. ‘‘హేతుబద్దత లోపించిన అనైతిక నిర్ణయం ఇది. ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు సంస్థలు ఇలాంటి చవకబారు నిర్ణయాలు తీసుకుంటారని ఇప్పుడే చూస్తున్నాం. ఉద్యోగలు పనిసమయాల్లో ఒత్తిడిగా ఫీల్ అయ్యారోలేదో తెలీదుగానీ ఈ వార్త తెల్సి నిజంగా చాలా ఒత్తిడికి గురై ఉంటారు. ఇది అందరూ ఒత్తిడిగా ఫీల్ అయ్యే ఘటన’’అని పలువురు పెదవి విరిచారు. -
అటార్నీ జనరల్‌గా ప్రమాణం చేయబోను
వాషింగ్టన్: అమెరికా తదుపరి అటార్నీ జనరల్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎంపికచేసిన రిపబ్లికన్ నేత మ్యాట్ గెయిట్జ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. 2017–2020కాలంలో పలు డ్రగ్స్–సెక్స్ పార్టీలు నిర్వహించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 42 ఏళ్ల మ్యాట్ అత్యంత కీలకమైన పదవికి అనర్హుడంటూ ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనే స్వయంగా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. అటార్నీ జనరల్‌గా ట్రంప్ ఎంపికచేయగా పదవి చేపట్టకముందే గెయిట్జ్ యూటర్న్ తీసుకోవడం గమనార్హం.‘‘ట్రంప్ రెండోదఫా సుపరిపాలనకు నా నియామకం పెద్ద అవరోధంగా మారకూడదు. ట్రంప్ ప్రభుత్వం కొలువుతీరిన మొదటి రోజు నుంచే అద్భుతంగా పాలించాలి. అందుకే నేను ఉపసంహరణకే మొగ్గుచూపా’అని గెయిట్జ్ గురువారం ప్రకటించారు. సెనేట్‌లోని సొంత రిపబ్లికన్ పార్టీ సభ్యులే గెయిట్జ్కు మద్దతు పలకలేదని తెలుస్తోంది. తీరా సెనేట్‌లో ఓటింగ్వేళ మెజారిటీ ఓట్లు పడకపోతే అవమానభారంతో వెనుతిరిగేబదులు ముందే తప్పుకుంటే మంచిదని గెయిట్జ్ భావించారని అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. అమెరికా పార్లమెంట్ దిగువసభలో సభ్యుడైన గెయిట్జ్ ఇటీవల అటార్నీ జనరల్‌గా నామినేషనల్ సాధించడంతో గత వారమే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. గెయిట్జ్పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారించి నివేదిక సిద్ధంచేసింది. గతంలో డ్రగ్స్–సెక్స్ పారీ్టలో 17 ఏళ్ల టీనేజీ బాలికతో శృంగారం జరిపాడని గెయిట్జ్పై ఆరోపణలున్నాయి. వీటిని ఆయన కొట్టిపారేశారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో నూతన అటార్నీ జనరల్‌గా ట్రంప్ ఎవరిని ఎంపికచేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మెరుపువేగంతో నూతన నియామకాలు చేపట్టేబదులు ట్రంప్ సంయమనంతో స్రత్పవర్తన గల నేతలనే కీలక పదవులకు ఎంపిక చేస్తే మంచిదని సెనేట్‌లో రిపబ్లికన్ సభ్యుడు సింథియా లూమిస్ అన్నారు. -
బీజేపీ నేతలు ప్రజానుబంధం ఏనాడో తెంచుకున్నారు
వయనాడ్: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ వాద్రా విమర్శలను పెంచారు. ఆదివారం నైకెట్టి, సుల్తాన్ బతేరీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారర్యాలీల్లో గిరిజనులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ ఇక్కడున్న పెద్దవాళ్లలో చాలా మందికి మా నాన్నమ్మ ఇందిరాగాంధీ బాగా తెలిసే ఉంటుంది. గిరిజనులతో ఆమెకు ఎంతో అనుబంధం ఉండేది. ఇక్కడి భూమి, అడవులు, నేల, నీరుతో గిరిజనులు అవినాభావ సంబంధం ఉంది. పేదల అభ్యున్నతి కోసమే అటవీ చట్టం, గ్రామీణ ఉపాధ హామీ పథకం, విద్యాహక్కుచట్టం తెచ్చాం. అదే బీజేపీ నేతలు సొంతవాళ్లనే పట్టించుకుంటూ గిరిజనులను, జనాలను గాలికొదిలేసింది. అసలు బీజేపీ నేతలు ప్రజలతో బంధాన్ని ఏనాడో తెంచుకున్నారు’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. -
మణిపూర్‌ను మంటల్లోకి నెట్టేసింది
లోహార్‌దాగా/సిండెగా(జార్ఖండ్): కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలను తీవ్రతరం చేశారు. కాషాయ పార్టీ మణిపూర్‌కు మంటపెట్టిందని, దేశ ప్రజలను మతం ప్రాతిపదికగా విభజించేందుకు ప్ర యత్నిస్తోందని మండిపడ్డారు. దేశంలోని 90 శాతం మంది ప్రజల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. రాహు ల్ శుక్రవారం జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొని, ప్రసంగించారు. ‘బీజేపీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులను ఒకరిపై మరొకరిని ఉసిగొల్పుతోంది. ఇటీవల హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జాట్లు, జాట్‌యేతరుల మధ్య చిచ్చుపెట్టింది. ఇదే బీజేపీ నైజం’అని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలకు బదులు ప్రేమను పెంచేందుకే కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ‘దళితులు, గిరిజనుల కోసం గళం వినిపించినప్పుడల్లా దేశాన్ని విభజిస్తున్నానంటూ నాపై బీజేపీ విమర్శలు చేస్తోంది. కానీ, నేను దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు, బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా. దేశం జనాభాలో 90 శాతం ఉన్న గిరిజనులు, దళితులు, ఓబీసీలకు పాలనలో భాగస్వామ్యం కోసం మాట్లాడటమే తప్పయినట్లయితే, ఇకపైనా ఇదే పనిని కొనసాగిస్తా’అని రాహల్ అన్నారు. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తాం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇచ్చా రు. జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే ఎస్టీల రిజర్వేషన్లను 26 శాతం నుంచి 28 శాతానికి, ఎస్సీల కోటాను 10 నుంచి 12 శాతానికి, ఓబీసీలకు 14 నుంచి 27 శాతానికి రిజర్వేషన్లను పెంచుతామన్నారు. కులగణనతో గిరిజనులు, దళితులు, ఓబీసీల ప్రాతినిధ్యం తగు రీతిలో పెరుగుతుందని చెప్పారు. బీజేపీ రైతు రుణాలు మాఫీ చేసిందా? యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు తీసుకున్న రూ.72 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందంటూ విమర్శలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం..దేశంలోని 25 మంది పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిందని రాహుల్ చెప్పారు. ‘జార్ఖండ్‌లోని రైతుల రుణాలను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందా? లేదు..ఎందుకంటే మీరంతా గిరిజనులు, దళితులు, ఓబీసీలు కాబట్టి. పెట్టుబడిదారుల రుణాలను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం మీరు తీసుకున్న అప్పులను మాత్రం మాఫీ చేయదు’అని ఎద్దేవా చేశారు. గిరిజన ప్రజల నుంచి నీరు, భూమి, అడవి(జల్, జంగల్, జమీన్)ని లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’అని ఆయన ఆరోపించారు. ఇది సైద్ధాంతిక పోరాటం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ఇండియా కూటమి, బీజేపీ–ఆర్ఎస్ఎస్ల మధ్య జరుగుతున్న సైద్థాంతిక పోరుగా రాహుల్ అభివరి్ణంచారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ల లక్ష్యం దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే, ఇండియా కూటమి లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణే అన్నారు. జలం, అడవి, భూమి తమవేనని కాషాయ పార్టీ, ఆర్ఎస్ఎస్, పెట్టుబడిదారులు భావిస్తున్నారు..అందుకే, ప్రధాని మోదీ గిరిజనులను వనవాసీలంటూ సంబోధిస్తున్నారని ఆరోపించారు. -
USA Presidential Elections 2024: చపలచిత్తుడు
ఫిలడెల్ఫియా: రిపబ్లికన్ల అధ్య ర్థి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన డెమొక్రాటిక్ పార్టీ ప్రత్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఘాటైన విమ ర్శలు చేశారు. ‘‘ట్రంప్ అ త్యంత చపలచిత్తుడు. ఆపాద మస్తకమూ ప్రతీకారేచ్ఛతో నిండిపోయిన బాపతు. దానికోసమే అపరిమితమైన అధికారానికై అర్రులు చాస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అతి సమీపంలోకి నేపథ్యంలో ఆమె శుక్రవారం లాస్‌వెగాస్‌లో ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంటేనే విద్వేషానికి ప్రతినిధి అంటూ తూర్పారబట్టారు. ‘‘పొరపాటున ట్రంప్‌ను గెలిపిస్తే ‘శత్రువుల జాబితా’ను జేబులో పెట్టుకుని మరీ శ్వేతసౌధంలోకి అడుగు పెడతారు. నేనైతే అమెరికన్ల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు ఏమేం చేయాలన్న జాబితాతో కాలు పెడతా. అందులో మొదటిది మీ జీవనవ్యయాన్ని తగ్గించడమే’’ అని ప్రకటించారు. హారిస్‌కు మద్దతుగా ప్రఖ్యాత గాయని జెన్నిఫర్ లోపెజ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. అమెరికన్లంతా, ప్రత్యేకించి లాటినో అమెరికన్లు హారిస్‌కు మద్దతివ్వాలని పిలుపు నిచ్చారు. ట్రంప్ మాదిరిగా కొందరినే కాకుండా అమెరికన్లందరి సంక్షేమాన్నీ హారిస్ పట్టించుకుంటారని లోపెజ్ అభిప్రా యపడ్డారు. అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ కూడా గురువారం హారిస్‌కు తన మద్దతు ప్రక టించారు. ఆమెకు ఓటేస్తేనే తన పిల్లల భవిష్యత్తు క్షే మంగా ఉంటుందన్నారు. ‘కమలా హారి స్కే ఓటే యండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. -
‘ముంబై’ దాడులపై నాడు స్పందనే లేదు!
ముంబై: 2008లో ముంబైలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై విదేశాంగ మంత్రి జై శంకర్ పరోక్ష విమర్శలు చేశారు. ఆ దాడికి భారత్ వైపు నుంచి స్పందనే లేకపోయిందంటూ ఆక్షేపించారు. ముంబైలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ముంబై దాడి జరిగినప్పుడు భారత్ నుంచి దానిపై స్పందనే లేదు. ఆ సమయంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ సభ్య దేశం. ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అధ్యక్ష స్థానంలో ఉంది. ఆ కమిటీ బేటీ కూడా ఉగ్ర దాడికి లక్ష్యంగా మారిన ముంబై తాజ్ హోటల్లోనే జరిగింది’’ అని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు పరిస్థితి మారింది. నేడున్నది నాటి భారత్ కాదు. ఉగ్ర ఘటనలపై గట్టిగా స్పందిస్తున్నాం. దుస్సాహసం చేస్తే మన సమాధానమే వేరుగా ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. మనతో పగలు వ్యాపారం చేస్తాం, రాత్రిళ్లు మనపైనే ఉగ్ర దాడులు చేస్తామంటే కుదరదన్నారు. తూర్పు లద్దాఖ్‌లో 2020 నాటి పరిస్థితి నెలకొనాలంటే చైనా సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని జైశంకర్ అన్నారు. -
‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది!
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో సీనియర్ రెజ్లర్లు పోరాడారు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వీరంతా సమష్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, సాక్షి మలిక్ నిరాటంకంగా పాల్గొని పోరాటాన్ని ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు సాక్షి మలిక్ నాటి ఘటనపై పలు భిన్నమైన విషయాలు చెప్పింది. తన పుస్తకం ‘విట్నెస్’లో సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్‌లపై ఆమె విమర్శలు కూడా చేసింది. ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సడలింపు వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని ఆమె అభిప్రాయ పడింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం తర్వాత బాధ్యతలు తీసుకున్న తాత్కాలిక కమిటీ హాంగ్జౌ ఆసియా క్రీడల సెలక్షన్స్‌లో పాల్గొనకుండా నేరుగా పాల్గొనే అవకాశం వినేశ్, బజరంగ్‌లకు కల్పించింది. సాక్షి మాత్రం దీనికి అంగీకరించలేదు. ‘వినేశ్, బజరంగ్ సన్నిహితులు కొందరు వారిలో స్వార్థం నింపారు. వారిద్దరు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించేలా చేయగలిగారు. వినేశ్, బజరంగ్‌లకు సడలింపు ఇవ్వడం మేలు చేయలేదు. మా నిరసనకు అప్పటి వరకు వచి్చన మంచి పేరును ఇది దెబ్బ తీసింది. ఒకదశలో సెలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అంతా అనుకునే పరిస్థితి వచి్చంది’ అని సాక్షి వెల్లడించింది. మరోవైపు బబిత ఫొగాట్ తమ నిరసనకు మద్దతు పలకడంలో కూడా స్వార్థమే ఉందని ఆమె పేర్కొంది. ‘మేమందరం బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడుతూ వచ్చాం. బబిత ఫొగాట్ మరోలా ఆలోచించింది. బ్రిజ్‌భూషణ్‌ను తొలగించడమే కాదు. అతని స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుంది. అందుకే మా శ్రేయోభిలాషి తరహాలో ఆమె ప్రవర్తించింది’ అని సాక్షి వ్యాఖ్యానించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి కాంస్య పతకం గెలుచుకుంది. . -
గణపతి పూజలో పాల్గొన్నా కాంగ్రెస్‌కు నచ్చట్లేదు
భువనేశ్వర్: సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజలో పాల్గొన్నందుకు తనపై విమర్శలు పెంచిన కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ మంగళవారం దీటుగా బదులిచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ గణేశ్ ఉత్సవం దేశంలో కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన వేడుక కాదు. దేశ స్వాతం్రత్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉత్సవం. ఆకాలంలో బ్రిటిష్ పాలకులు సైతం గణేశ్ ఉత్సవాలను ద్వేషించాలంటూ భారత్‌లో విభజించు, పాలించు కుట్రను అమలుచేశారు. ఇప్పుడు కూడా అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న కొందరు గణపతి పూజలో పాల్గొంటే సమస్యలొస్తాయంటూ సమాజాన్ని విభజించే పనిలో బిజీగా మారారు. గణపతి పూజలో పాల్గొన్న నాపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాల్లో పీకలదాకా కోపముంది. కాంగ్రెస్‌పాలిత కర్ణాటకలో గొడవలు జరుగుతాయంటూ ఏకంగా గణపతి విగ్రహాన్నే కటాకటాల వెనక్కి నెట్టారు. పోలీస్‌వ్యాన్‌లో గణపతి విగ్రహం ఫొటో చూసి యావత్భారతావని బాధపడింది. ఇక ఇలాంటి విద్వేష శక్తుల ఆట కట్టించాల్సిందే. దేశాన్ని కుల, మత ప్రాతిపదికన బ్రిటిషర్లు విభజించాలని చూస్తే లోకమాన్య తిలక్ గణేశ్ ఉత్సవాలతో దేశ సమైక్య స్ఫూర్తిని మరింతగా రగిల్చారు. కుల మతాలకతీతంగా ఐక్యంగా ఎలా ఉండాలో గణేష్ ఉత్సవాలు మనకు చాటిచెప్పాయి’’ అని మోదీ అన్నారు. రూ.2,871 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం తన నాయకత్వంలో మూడోదఫా పాలన మొదలై 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం మోదీ ఒడిశాలో రూ.2,871 కోట్ల విలువైన రైల్వే, జాతీయరహదారులకు సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపనలు చేసి కొన్నింటిని ప్రారంభించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వ కీలక పథకం ‘ సుభద్ర యోజన’ను ప్రారంభించారు. భువనేశ్వర్‌లోని సబర్ సాహీ మురికివాడలో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన(పట్టణ) 20 మంది లబి్ధదారుల ఇళ్లను మోదీ స్వయంగా ప్రారంభించి వారితో మోదీ ముచ్చటించారు. పుట్టినరోజున తమ ఇంటికొచి్చన మోదీకి ఆ గిరిజనులు అంగవస్త్రం ఇచ్చి ఆహా్వనించి నుదుటిన గంధం»ొట్టు పెట్టారు. ప్రేమతో తనకు వారు ఇచి్చన తీపి వంటకం ఖీర్‌ను మోదీ రుచిచూశారు. -
ఢిల్లీ నేతలకు నేనంటే ద్వేషం : ఒమర్
శ్రీనగర్: జమ్మూకశీ్మర్‌లో ఎన్నికల వేళ బీజేపీ అగ్రనాయకత్వంపై నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పరోక్ష విమర్శలు చేశారు. శుక్రవారం గాందర్బల్ అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారంలో ఒమర్ మాట్లాడారు. ‘‘ ఢిల్లీలో ఉన్న నేతలకు నేనంటే ద్వేషం. ఎన్నికల్లో ఓడించి నా నోరు మూయించాలని చూస్తున్నారు. పని గట్టుకుని స్వతంత్య అభ్యర్థులను నాపై పోటీకి నిలుపుతున్నారు. నన్ను ఓడించి చట్టసభల్లో నా గొంతు వినపడకుండా చేయాలని కుట్ర పన్నారు. ఢిల్లీ నేతలపై నేను పోరాడుతున్నది నా కోసమో, నా కుటుంబం కోసమో కాదు. జమ్మూకశ్మీర్ పౌరుల కోసం. నేనేం మాట్లాడిన ప్రజల గొంతుక వినిపిస్తా’’ అని ఒమర్ అన్నారు. -
దేవుడు, విశ్వరూపి... ఆ తర్వాతేమిటి?
గుమ్లా (జార్ఖండ్): లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీపై తరచూ సునిశిత విమర్శలు గుప్పిస్తున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జీవుడు వికాస క్రమంలో మనిషి లక్షణాలు సంతరించుకుంటాడు. ఆనక అతీత శక్తులున్న సూపర్‌మ్యాన్ కావాలని ఆశపడతాడు. తర్వాత దేవుడు, భగవంతుడు కావాలనుకుంటాడు. ఆ తర్వాత విశ్వరూపి కావాలని ఆశిస్తాడు. దాన్నీ దాటితే? ఆపైన ఏముందో ఎవరికీ తెలియదు. అంతర్గత, బహిర్గత వికాసానికి అంతన్నదే ఉండదు’’ అన్నారు. మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచాన్ని అందమైన నివాసయోగ్య ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు పాటుపడటమే మన బాధ్యతన్నారు.మోదీపై ఆరెస్సెస్ అగ్ని క్షిపణి: కాంగ్రెస్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించినవేనని కాంగ్రెస్ పేర్కొంది. ‘‘అవి లోక్ కల్యాణ్ మార్గ్ (ఢిల్లీలోని మోదీ అధికారిక నివాసం)పైకి నాగ్‌పూర్ (ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం) ప్రయోగించిన అగ్ని క్షిపణి’ అంఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందరిలా తాను తల్లి కడుపు నుంచి పుట్టలేదని చెప్పుకున్న ప్రధానికి ఆరెస్సెస్ తాజా సందేశం విన్పించే ఉంటుందంటూ వాగ్బాణాలు విసిరారు. -
కోడ్ ఉల్లంఘనే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన 48 గంటల ధ్యానంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఏడో విడత పోలింగ్ ముందు ప్రధానమంత్రి ధ్యానం చేయడం ముమ్మాటికీ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో గురువారం నుంచి రెండు రోజులపాటు మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని టీవీ మీడియాలో ప్రసారం చేయకుండా, ప్రింట్ మీడియాలో ప్రచురించకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, అభిõÙక్ సింఘ్వీ, సయీద్ నజీర్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. -
PM Narendra Modi: కాంగ్రెస్ వస్తే దేశమంతటా కర్ణాటక మోడల్
ఆగ్రా/మొరేనా: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడిని రోజురోజుకూ ఉధృతం చేస్తున్నారు. సంపద పునఃపంపిణీ, ఓబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతున్నారు. ప్రజలు కష్టపడి సంపాదించి, దాచుకున్న సొమ్మును దోచేయడానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను దొడ్డిదారిన కాజేసి, ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టడానికి కాంగ్రెస్ పెద్ద కుట్ర పన్నిందని మరోసారి నిప్పులు చెరిగారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో, బరేలీ, షాజహాన్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని మొరేనా నగరంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని మండిపడ్డారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... అడ్డుగోడను నేను.. ‘‘మన తల్లులు, అక్కచెల్లెమ్మల సొత్తుపై కాంగ్రెస్ నాయకులు గురిపెట్టారు. అధికారంలోకి రాగానే తస్కరించాలని కుట్ర పన్నారు. మన ఆడపడుచుల సొమ్మును ఎవరూ దోచుకెళ్లకుండా నేను కాపలాదారుడిగా పనిచేస్తున్నా. మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా. ప్రజలకు, కాంగ్రెస్‌కు మధ్య ఒక అడ్డుగోడగా నేను నిల్చున్నా. ప్రజల ఆస్తులను కాంగ్రెస్ దోచుకోకుండా కాపాడుతున్నా. జనం ఆస్తులను, సంపదను ఎక్స్–రే తీస్తామని కాంగ్రెస్ రాజకుమారుడు అంటున్నారు. ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని మరో కాంగ్రెస్ నాయకుడు చెబుతున్నారు. ఎవరైనా ఆస్తి సంపాదించి మరణిస్తే అందులో 55 శాతం ఆస్తిని స్వా«దీనం చేసుకొని, మిగతా 45 శాతం ఆస్తిని వారసులకు ఇస్తారట! ఇదెక్కడి న్యాయమో అర్థం కావడం లేదు. మతపరమైన రిజర్వేషన్లను మన రాజ్యాంగం అనుమతించదు. అయినా కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. తద్వారా రాజ్యాంగాన్ని కించపరుస్తోంది. మతం ఆధారంగా రిజర్వేషన్ల వ్యవస్థ తీసుకొచ్చేందుకు ఇప్పటిదాకా కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను కోర్టులు తిరస్కరించాయి. అందుకే ఆ పార్టీ దొడ్డిదారిని ఎంచుకుంది. మైనార్టీలను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చేస్తోంది. కర్ణాటకలో ముస్లింలను ఇప్పటికే చట్టవిరుద్ధంగా ఓబీసీ కేటగిరీలో చేర్చి, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పదేపదే ఈ విషయం చెబుతోంది. మేనిఫెస్టోలో కూడా చేర్చింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలుత ఆంధ్రప్రదేశ్‌లోనే ముస్లిం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. కేంద్రంలో అధికారంలోకి రాగానే కర్ణాటక మోడల్‌ను దేశమంతటా అమలు చేయాల న్నదే కాంగ్రెస్ కుయుక్తి. నేను కూడా ఒక ఓబీసీనే. కర్ణాటక మోడల్ నాకు ఆందోళన కలిగిస్తోంది. ఇక సామాన్య ప్రజల సంగతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను ఎవరూ తస్కరించకుండా రక్షణ కల్పించడానికి ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కుటుంబాల్లో రెండు ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి బలవంతంగా లాగేసుకుంటారు. ముస్లింలకు కట్టబెడతారు. ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలు మన దేశాన్ని ముక్కలు చేస్తాయని అందరూ తెలుసుకోవాలి. సంతుïÙ్టకరణ(ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తిపర్చడం) ద్వారా తుషీ్టకరణ(బుజ్జగింపు)ను అంతం చేయాలన్నదే మా ప్రయత్నం. అసలు లోగుట్టు ఇదే..ఎస్టేట్ డ్యూటీ(పన్ను)ని అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ రద్దు చేశారని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెబుతున్నారు. నిజానికి ఇందిరా గాంధీ మరణం తర్వాత ఆమె ఆస్తులను ప్రభుత్వం స్వా«దీనం చేసుకోకుండా కాపాడుకోవడానికి ఎస్టేట్ డ్యూటీని కుమారుడు రాజీవ్ గాంధీ రద్దు చేశారు. అసలు లోగుట్టు ఇదే. ఇందిరా గాంధీ నుంచి బదిలీ అయిన ఆస్తులను ఆమె కుటుంబంలో నాలుగు తరాలు చక్కగా అనుభవించాయి. ఇందిరా గాంధీ మరణం కంటే ముందు ఎస్టేట్ డ్యూటీతో భారీగా లాభపడిన కాంగ్రెస్ ఇప్పుడు అదే విధానం తీసుకురావాలని భావిస్తోంది. బీజేపీ ఉన్నంతకాలం కాంగ్రెస్ ఆటలు సాగవు. జనం ఆస్తులను కాజేసే ప్రయత్నాలను కచి్చతంగా తిప్పికొడతాం. -
Rahul Gandhi: కులగణనను ఏ శక్తీ ఆపలేదు
సాక్షి, న్యూఢిల్లీ: కులగణనను ఏ శక్తీ ఆపలేదని ప్రకటిస్తూ ప్రధాని మోదీ, బీజేపీపై రాహుల్ గాంధీ మరోమారు విమర్శల వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. బుధవారం ఢిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ‘‘ నాకు కులం పట్టింపు లేదు. కానీ న్యాయం విషయానికొచ్చేసరికి దేశంలో అన్యాయమైపోయిన 90 శాతం జనాభాకు న్యాయం దక్కేలా చూడటమే నా జీవిత లక్ష్యం. మా ప్రభుత్వం ఏర్పడగానే మేం చేసే మొట్టమొదటి పని కులగణన జరిపించడమే.మోదీ అస్తవ్యస్తపాలనలో దాపురించిన ఆదాయ అసమానతల గురించే కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోంది. మోదీ అత్యంత మిత్రులైన బడా పారిశ్రామికవేత్తలకు బదిలీచేసిన రూ.16 లక్షల కోట్ల మొత్తంలో కాంగ్రెస్ కొంతైనా ఈ 90 శాతం పేదలకు అందేలా చేస్తుంది. లెక్కలు కట్టాం. ఇదే న్యాయం అని భావించాం. అందుకే ఈ అంశాలను మేనిఫెస్టోలో చేర్చాం’’ అని రాహుల్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..నాన్‌సీరియస్ నేతనా?‘‘పూర్తిగా రాజకీయాలకు అంకితంకాని నేత అని రాహుల్‌పై బీజేపీ చేసిన విమర్శలకు రాహుల్ ధీటుగా బదులిచ్చారు. ‘‘ గ్రామీణఉపాధి హామీ పథకం, భూసేకరణ బిల్లు, ఉత్తరప్రదేశ్‌లో భట్టా, పార్సౌల్ గ్రామాల వద్ద భూసేకరణ ఉద్యమం, నియాంగిరీ హిల్స్ వివాదం ఇలా ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషిచేశా. ఉద్యమాలను ముందుండి నడిపించా. ఇవన్నీ మీడియాకు నాన్‌సీరియస్ అంశాలేకదా. సీరియస్ అంశాలుగా అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విరాట్ కోహ్లీల గురించి మీడియా చూపిస్తుంది. 90 శాతం జనాభా గురించి పట్టించుకునే వ్యక్తిని నాన్‌సీరియస్ నేత అని అంటారా?’’ఓబీసీ, దళితులు, గిరిజనుల ప్రాతినిధ్యమెక్కడ?‘‘ మీడియారంగంలో ఓబీసీ, దళితులు, గిరిజనుల చేతుల్లో ఉన్న ఒక్క మీడియా సంస్థనైనా చూపించండి. ఒక్కరు కూడా లేరు. మీ ప్రాతినిధ్యం మీడియాలో లేదు. న్యాయవ్యవస్థలోనూ దాదాపు అంతే. 650 మంది హైకోర్టు జడ్జీల్లో 90 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించేది కేవలం 100 మందే. దేశంలోని 200 అగ్రశ్రేణి సంస్థల్లోనూ దళితులు, గిరిజనులు, ఓబీసీలు లేరు’’ దేశాన్ని విడగొడుతున్నానట!‘‘అన్యాయం జరిగితే ఏ మేరకు అన్యాయం జరిగిందో తెల్సుకుంటాం. ఒక వ్యక్తికి అంతర్గత గాయమైతే ఎక్స్–రే తీయడంలో తప్పులేదుగా. అలాగే కులగణన ఎక్స్–రే అవసరమని నేను అనగానే జాతీయ మీడియా, నరేంద్ర మోదీ ఏకమైపోయి నేనేదో దేశప్రజలను విభజిస్తున్నట్లు విష ప్రచారం మొదలెట్టారు. అన్ని కులాల ప్రాతినిధ్యం ఎలా ఉందో తెలియాలంటే ఎక్స్–రే అవసరమని దేశభక్తులంతా భావిస్తారు. దేశాన్ని సూపర్‌పవర్‌గా మార్చాలనే ఈ దేశభక్తుడు(మోదీ) మాత్రం ఈ ఎక్స్–రే పేరు వింటేనే భయపడుతున్నారు’’ కులాలే లేనప్పుడే మీరెలా ఓబీసీ అయ్యారు?‘‘ గత పదేళ్లు తాను ఓబీసీ వ్యక్తినని మోదీ ఘంటాపథంగా చెప్పారు. తీరా నేను కులగణన ప్రస్తావన తీసుకురాగానే దేశంలో కులాలే లేవని మాట మార్చారు. మరి అలాంటపుడు మీరు ఓబీసీ ఎలా అయ్యారు? మళ్లీ ఆయనే దేశంలో రెండే కులాలున్నాయని సెలవిచ్చారు. పేద, ధనిక కులాలు అని. పేదల జాబితాను పరికిస్తే దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలే కనిపిస్తాయి. ఈ 90 శాతం జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం’’రామమందిరం, పార్లమెంట్లో మా వ్యక్తులెక్కడ? ‘‘ సమస్య నుంచి కొంతకాలమే దృష్టి మరల్చగలరు. ఓబీసీలు మిమ్మల్ని నిలదీసే సమయం వచి్చంది. రామమందిరం పూర్తయింది అక్కడ మా(దళితులు, గిరిజనులు) వాళ్లు ఒక్కరైనా ఉన్నారా? పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించారు. మా వాళ్లు ఒక్కరైనా ఉన్నారా?. ఒక్కరినైనా ఆహా్వనించారా? గిరిజన మహిళా రాష్ట్రపతి ముర్ము, మాజీ రాష్ట్రపతి కోవింద్‌లను ఎందుకు రానివ్వలేదు?’’ఆర్థిక, వ్యవస్థాగత సర్వేలూ కలిపే..‘‘ మేం అధికారంలోకి వస్తే కులగణనతోపాటే ఆర్థిక సర్వే చేస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్రంగాలుసహా అన్ని రంగాల్లో అణగారిన వర్గాల ప్రాతినిధ్యం ఎంత ఉందనేది తెలిపే ఇన్స్టిట్యూషనల్ సర్వేనూ చేస్తాం. కులగణనను ఏ శక్తీ ఆపలేదు. ఎంత గట్టిగా నిలువరిస్తే అంతే బలంగా ప్రతిఘటిస్తాం’’ -
పరివార్.. ప్రధానిపై లాలూ విమర్శలతో రాజకీయ రగడ
న్యూఢిల్లీ/ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ నేత లాలూప్రసాద్ విమర్శలు పెను రాజకీయ వివాదానికి దారి తీశాయి. దేశవ్యాప్తంగా మంటలు రాజేశా యి. మోదీకి కుటుంబమూ లేదు, సంతానమూ లేరంటూ ఆదివారం పట్నా జన్సందేశ్ ర్యాలీలో లాలూ ఎద్దేవా చేశారు. ఆయనసలు హిందువే కాదంటూ ఆక్షేపించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్‌తో పాటు ఇండియా కూటమికి చెందిన విపక్ష నేతల సమక్షంలో లాలూ చేసిన ఈ వ్యాఖ్యలకు మోదీ సోమవారం గట్టిగా కౌంటరిచ్చారు. దేశం కోసమే జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు. భారతదేశం, 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని పునరుద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలంతా వెంటనే అందిపుచ్చుకున్నారు. తామంతా మోదీ కుటుంబమేనంటూ ఆయనకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మొదలుకుని రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జి.కిషన్‌రెడ్డి, అర్జున్‌రామ్ మేఘ్వాల్ తదితర కేంద్ర మంత్రులు, నేతలంతా ఈ మేరకు ప్రకటనలు చేశారు. మోదీపై లాలు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. విపక్షాలపై పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. తామంతా మోదీ కుటుంబమేనంటూ ప్రధానికి బాసటగా నిలిచారు. అంతేగాక సోషల్ మీడియా అకౌంట్లలో తమ పేరు పక్కన ‘మోదీ కా పరివార్’ అంటూ జోడించుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు కూడా ఇదే బాటపట్టి ‘మోదీ కా పరివార్’ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. చివరికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా తన ఎక్స్ ప్రొఫైల్‌కు ‘మోదీ కా పరివార్’ అని చేర్చుకున్నట్టు ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి! విపక్షాలు మరోసారి లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి చేజేతులా పదునైన నినాదమే అందించాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిల్లర వ్యాఖ్యలు: బీజేపీ మోదీపై వ్యక్తిగత విమర్శలు విపక్షాలకు కొత్తేమీ కాదంటూ బీజేపీ ఆగ్రహం వెలిబుచి్చంది. ‘‘17 ఏళ్లుగా ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాయి. ఇది నిజంగా బాధాకరం’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. విపక్షాల రాజకీయ దురహంకారానికి దేశ ప్రజలు తగిన విధంగా బదులు చెబుతారన్నారు. ‘‘మొత్తం దేశాన్నే తన కుటుంబంగా మార్చుకున్నారు మోదీ. అందుకే ఎంత పని చేసినా ఆయనకు అలుపే రాదు. గత పదేళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు’’ అని చెప్పారు. మోదీకి సంతానం లేదన్న లాలు వ్యాఖ్యలను కూడా సుధాన్షు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘హిందూ మతం గురించి లాలుకేం తెలుసు? అసలు విపక్ష ఇండియా కూటమిలో ఒక్కరు కూడా హిందువు లేదు! సనాతన ధర్మంలో భక్తికే పెద్దపీట తప్ప కుమారునికి కాదు. భారత్‌లో గురుశిష్య సంప్రదాయముంది తప్ప తండ్రీ కొడుకుల సంప్రదాయం లేదు. రామ భక్తుడైన హనుమంతునికే ఊరూరా గుళ్లున్నాయి. రాముని కుమారులు లవకుశులకు ఎక్కడైనా ఆలయముందా?’’ అని ప్రశ్నించారు. ‘‘మోదీ నాయకత్వంలో 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం మోదీ లక్ష్యమైతే ఎలాగైనా అధికారం సాధించి 2047 దాకా కూడా దాన్ని తమ కుటుంబాల గుప్పెట్లోనే ఉంచుకోవడం విపక్షాల లక్ష్యం’’ అంటూ దుయ్యబట్టారు. వీలైనంత భారీగా అవినీతికి పాల్పడి, తద్వారా తాము, తమ కుటుంబాలు మాత్రమే తరతరాలకు సరిపడా సంపద పోగేసుకోవాలన్నది విపక్షాల ఉద్దేశమని ఆరోపించారు. నేరగాళ్లే మోదీ పరివారం: కాంగ్రెస్ ఇండియా కూటమి నానాటికీ బలోపేతమవుతుండటం చూసి అధికార బీజేపీలో అక్కసు పెరిగిపోతోందని కాంగ్రెస్ ఆరోపించింది. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘మోదీ కా పరివార్’ పేరిట కొత్త డ్రామాకు తెర తీసిందని మండిపడింది. ‘‘రైతులను కార్లతో తొక్కించి చంపిన నేరగాడి తండ్రయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన ఎంపీ బ్రిజ్‌భూషణ్‌సింగ్ వంటి బీజేపీ నేతలే నిజమైన మోదీ కుటుంబం. అదే ‘మోదీ కా అస్లీ పరివార్’’ అంటూ ఎద్దేవా చేసింది. ‘‘మణిపూర్ హింసాకాండకు బలైన మహిళలకు మోదీ కుటుంబంలో చోటేది? ఢిల్లీ శివార్లలో నిరసన గళమెత్తుతున్న రైతులను తన కుటుంబంగా చెప్పుకోగలరా? ఉపాధి లేక నిత్యం ఆత్మహత్యల బాట పడుతున్న నిరుద్యోగ యువతను తన కుటుంబమని చెప్పుకోరేం? బీజేపీ సర్కారు కేవలం క్రూరమైన నేరగాళ్లు, మోదీ సన్నిహిత పెట్టుబడిదారుల కోసం మాత్రమే పని చేస్తోంది’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ దుయ్యబట్టారు. ‘‘రైతుల హత్య, మహిళలపై అత్యాచారాలు... ఇదే నిజమైన మోదీ కుటుంబం’’ అంటూ కాంగ్రెస్ నేతలంతా విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్, అజయ్ మిశ్రా తదితరులు తమ సోషల్ హ్యాండిల్స్‌కు ‘మోదీ కా పరివార్’ అని జోడించుకోవడాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. సంఘ్ పరివార్ కాస్తా చివరికి మోదీ పరివార్‌గా మారిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. 2019లో ‘మై భీ చౌకీదార్’ సాక్షి, న్యూఢిల్లీ: మోదీపై విపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఇది తొలిసారి కాదు. 2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీపై ‘మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి)’ అంటూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో మత అల్లర్లకు కారకుడనే అర్థంలో ఆమె చేసిన విమర్శలు వివాదానికి దారి తీశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బాగా నష్టం చేశాయి. అనంతరం 2018లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలాదారే దొంగ) అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. తాను దేశానికి చౌకీదార్‌లా ఉంటానన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ ఎక్కుపెట్టిన ఆ విమర్శలూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నింటికీ తీవ్రంగా చేటు చేశాయి. ఆ వ్యాఖ్యలను బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకుని ఘనవిజయం సాధించింది. మోదీ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో ‘నరేంద్ర మోదీ చౌకీదార్’ అని చేర్చుకున్నారు. బీజేపీ నేతలు కూడా ‘మై భీ చౌకీదార్’ అని ప్రొఫైల్స్‌లో చేర్చుకున్నారు. ‘‘నువ్వేమీ మరీ అంత పెద్దవాడివి కాదు. మాట్లాడితే కుటుంబ రాజకీయాలంటూ మాపై పదేపదే దాడికి దిగుతున్నావ్! కుటుంబాల గురించి నీకెందుకు? నీకు సంతానం ఎందుకు లేదో చెప్పు. కుటుంబమే లేదు నీకు. అయోధ్యలో రామాలయం కట్టామంటూ గొప్పలు చెప్పుకుంటావు. కానీ నువ్వసలు హిందువువే కాదు. అమ్మ మరణిస్తే ప్రతి హిందువూ శిరోముండనం చేయించుకుంటాడు. నువ్వు మాత్రం చేయించుకోలేదు. కారణమేంటో చెప్పు! దేశమంతటా విద్వేష వ్యాప్తి చేస్తున్నావ్!’’ – పట్నా ర్యాలీలో మోదీపై లాలూ విమర్శలు ‘‘ఇండియా కూటమిలోని విపక్ష నేతలంతా అవినీతి, వారసత్వ, సంతుస్టీకరణ రాజకీయాల్లో పీకల్లోతున కూరుకుపోయారు. పార్టీ ఏదైనా ఝూట్–లూట్ (అబద్ధాలు, దోపిడీ) అన్నదే వాళ్లందరి నైజం. దీనిపై ప్రశి్నస్తే నాకు కుటుంబమే లేదంటూ ఆక్షేపిస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం. నా భారతదేశమే నా కుటుంబం. ఒక సేవకునిలా ప్రజా క్షేమానికే నా జీవితాన్ని అంకితం చేశా. దేశసేవ చేయాలనే కలను నిజం చేసుకోవడానికి చిన్న వయసులోనే ఇల్లు వీడా. నా జీవితమంతా తెరిచిన పుస్తకం. ప్రతి భారతీయునికీ ఆ విషయం తెలుసు’’ – ఆదిలాబాద్ సభలో మోదీ -
మోదీ కలలు కంటున్నారు: విపక్షాలు
న్యూఢిల్లీ: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కుపైగా స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేయడంపై విపక్ష పార్టీలు విమర్శలు పెంచాయి. ‘‘ మోదీ కలలు కంటున్నారు. ఏకంగా 400కుపైగా సీట్లు గెల్చుకుంటామని మోదీ చెప్పడం చూస్తుంటే మళ్లీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఆయనకు లేదని అర్థమవుతోంది. బీజేపీ ప్రభుత్వం దేశ లౌకిక భావనను గాయపరిచింది. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి ద్రోహం చేసింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీల కోసం ఏం చేసింది? రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఎందుకు ఇంతవరకు నెరవేర్చలేదు?. గత మే నుంచి రావణకాష్టంగా రగిలిపోతున్న మణిపూర్‌లో మోదీ ఎందుకు ఇంతవరకు ఒక్కసారైనా పర్యటించలేదు?’’ అని సీపీఐ నేత బినోయ్ విశ్వం నిలదీశారు. ‘‘ 400 లేదా 500 సీట్లు గెలుస్తామని కల కనే హక్కు మోదీకి ఉంది. కానీ వాస్తవం వేరు. వేరే వాళ్ల కలలకు తగ్గట్లు నడుచుకోవాలో, సొంత నిర్ణయాలు తీసుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు’ అని సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిటస్ చెప్పారు. ‘ ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు ప్రస్తావించకుండా ప్రధాని ప్రసంగం అస్సలు ముగియదు. ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు స్మరించుకుంటేగానీ మోదీకి ఎన్నికల్లో గిట్టుబాటు అవుతుంది’’ అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ‘‘ బాధ్యతాయుతమైన ప్రధాని పదవిలో కూర్చున్నందుకైనా కాస్తంత గౌరవప్రదంగా మాట్లాడాలి. 400కుపైగా గెలుస్తామనడం చూస్తుంటే ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలొస్తున్నాయి’’ అని మరో కాంగ్రెస్ ఎంపీ డ్యానిష్ అలీ అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ నెహ్రూ గతించి దాదాపు 60 ఏళ్లు గడుస్తున్నా మోదీ ఇంకా ఆయననే లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మోదీ ఇంతగా పట్టించుకుంటుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మోదీ ఆయన ప్రసంగమంతా కాంగ్రెస్‌కే అంకితమిచ్చారు. ఇప్పుడు పెరిగిన ధరల గురించి మోదీ ఇంకా నెహ్రూ, ఇందిర గాంధీలనే తిడుతున్నారు. ధరలు పెరిగిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రతిసారీ కాంగ్రెస్ గెలిచినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు కూడా ధరలు పెరిగాయి!’’ అని కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. -
పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్
బార్పేట(అస్సాం): అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. నాగాలాండ్ నుంచి అస్సాంలోని గువాహటిలోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నపుడు జరిగిన ఘర్షణలకు రాహుల్ కారకుడంటూ హిమంత సర్కార్ కేసులు పెట్టడం తెల్సిందే. అస్సాంలో ఏడురోజుల యాత్ర బర్పెటా జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన తొలి బహిరంగ సభలో సీఎంపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ కేసులు పెట్టి నన్ను బయపెట్టొచ్చన్న ఐడియా హిమంతకు ఎందుకు వచి్చందో నాకైతే తెలీదు. మీరు(హిమంత, పోలీసులు) ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మరో పాతిక తప్పుడు కేసులు బనాయించండి. నేను అస్సలు భయపడను. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నన్ను భయపెట్టలేవు’’ అని అన్నారు. హిమంతను అతిపెద్ద అవినీతి సీఎంగా అభివరి్ణంచారు. ‘‘ మీరు ఆయనతో మాట్లాడుతుంటే ఆలోపు మీ భూమి కొట్టేస్తారు. మీరు వక్కపలుకులు నమిలినంత తేలిగ్గా ఆయన సుపారీ బిజినెస్ కానచ్చేస్తారు. మీ జేబులో డబ్బు నొక్కేస్తారు. ఏకంగా కజిరంగా నేషనల్ పార్క్ స్థలాలనే సీఎం ఆక్రమించారు. సీఎంతో జాగ్రత్త’ అని జనాన్ని అప్రమత్తం చేశారు. ఎన్నికలయ్యాక లోపలేస్తాం: సీఎం మంగళవారం నాటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత చెప్పారు. -
కులమతాల చిచ్చు పెడుతున్నారు
ఇటానగర్: కులం, మతం ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ విడగొడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో అడుగుపెట్టిన సందర్భంగా దోయ్‌ముఖ్‌లో రాహుల్ స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ దేశంలో విద్వేషం చిమ్మడమే బీజేపీ పని. తమ కులం, మతం గొప్పదంటూ దేశ ప్రజలు తమలో తాము ఘర్షణలుపడేలా బీజేపీ కుట్రలు చేస్తోంది. కొద్ది మంది పారిశ్రామికవేత్తల కోసమే బీజేపీ పనిచేస్తోంది. జనం కష్టాలు ఆ పారీ్టకి పట్టవు. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే వారి ఐక్యత కోసం కాంగ్రెస్ కృషిచేస్తోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర మార్గమధ్యంలో శనివారం పాపుం పరే జిల్లా గుండా అరుణాచల్ ప్రదేశ్‌లో అడుగుపెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ నబాం టుకీ రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. శనివారం ఒక్కరోజు మాత్రమే అరుణాచల్‌లో యాత్ర కొనసాగి ఆదివారం మళ్లీ అస్సాంలోకి అడుగుపెట్టనుంది -
అస్సాం ప్రభుత్వం, సీఎం..
శివసాగర్/జోర్హాట్(అస్సాం): భారత్ జోడో న్యాయ్ యాత్రను అస్సాంలో మొదలుపెడుతూనే ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. నాగాలాండ్ బుధవారం ముగిసిన యాత్ర అస్సాంలో గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శివసాగర్ జిల్లాలోని హాలోటింగ్ పట్టణంలో వందలాది మంది పార్టీ కార్యకర్తల సమక్షంలో రాహుల్ మాట్లాడారు. ‘‘ దేశంలో అత్యంత అవినీతిమయ ప్రభుత్వం ఉందంటే అది ఈ రాష్ట్ర సర్కారే. అతిపెద్ద అవినీతి సీఎం కూడా ఇక్కడే ఉన్నారు’’ అని ఆరోపించారు. జొర్హాట్ జిల్లాలోని దేబెరాపూర్‌లోని వీధి సమావేశంలోనూ రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ అస్సాంలోని బీజేపీ రాష్ట్ర సర్కార్ ఇక్కడి గిరిజనులు, తేయాకు కారి్మకులు, స్థానిక తెగలకు అన్యాయం చేస్తోంది. సంపదను కొల్లగొడుతూ విద్వేషాన్ని చిమ్ముతోంది. యాత్ర మొదలైన మణిపూర్‌లో జాతుల మధ్య వైరం కార్చిచ్చులా విస్తరించి నివురుగప్పిన నిప్పులా ఉంది. దానిని చల్లార్చేందుకు కనీసం ఒక్కసారైనా మోదీ మణిపూర్‌కు రాలేదు. ఇక నాగాలాండ్‌లో నాగాల సమస్యను పరిష్కరిస్తామని మోదీ సర్కార్ తొమ్మిదేళ్ల క్రితం ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ అది ఎంత వరకు సఫలమైందనేది మోదీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు’’ అని రాహుల్ ఆరోపించారు. -
USA presidential election 2024: రామస్వామిపై డొనాల్డ్ ట్రంప్ విసుర్లు
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకు పడ్డారు. ఆయన మోసపూరిత ప్రచార జిమ్మికులకు పాల్పడుతున్నారన్నారు. వివేక్ అనుచరులు ‘సేవ్ ట్రంప్, ఓట్ వివేక్’ అన్న షర్టులు ధరించడం, అవి వైరలవడం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. తనకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తూనే మోసపూరిత ప్రచార ట్రిక్కులు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వివేక్ మాయలో పడకుండా తనకే ఓటేయాలన్నారు. వివేక్‌పై ట్రంప్ నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి. -
Mayawati: మీ సంగతి చూసుకోండి
లక్నో: బీఎస్పీపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసే ముందుకు ఆత్మపరిశీలన చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు మాయావతి సూచించారు. బీఎస్పీని ఇండియా కూటమిలో చేర్చుకుంటారా అని మీడియా ప్రశ్నించగా ఎన్నికల తర్వాత పొత్తులు మార్చే అలవాటున్న మాయావతి పార్టీని ఎవరు నమ్ముతారని అఖిలేశ్ ప్రశ్నించారు. వీటిపై మాయా మండిపడ్డారు. బీజేపీని బలోపేతం చేస్తూ, వారితో అంటకాగుతున్న అఖిలేశ్ ప్రతిష్ట మంటగలిసిందని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు, తర్వాత ప్రధాని మోదీని నాటి ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆశీర్వదించారని గుర్తు చేశారు. -
ప్రధానిలో నిర్దయ చూస్తే బాధేస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఉదంతంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో కేంద్రం తీరుకు నిరసనగా నిరసనగా ఖేల్ రత్న, అర్జున అవార్డులను రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఢిల్లీలో రోడ్డుపై వదిలేయడం తెలిసిందే. ఆ వీడియోను రాహుల్ ఆదివాంర ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ప్రధానిని వైఖరిని ఎండగట్టారు. ‘‘భారతదేశంలోని ప్రతి అమ్మాయి ఆత్మాభిమానానికి అత్యంత విలువ ఇస్తుంది. అవార్డులు, పురస్కారాలన్నీ ఆ తర్వాతే. ఇలాంటి ధైర్యశాలుల కంటే ‘బాహుబలి’ వంటి పరపతి గల వ్యక్తుల నుంచి పొందే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయా?’’ అని మోదీని ప్రశ్నించారు. ‘‘ప్రధాని అంటే దేశ రక్షకుడు. ఇంతటి తీవ్రమైన అంశంలో ఇంత నిర్దయగా వ్యవహరించడం చాలా బాధేస్తోంది’’ అన్నారు. -
Canada–India relations: నిజ్జర్ హత్యపై ఆధారాలిచ్చాం
టొరంటో/న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌పై విమర్శలు చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయంపై తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలను భారత ప్రభుత్వానికి చాలా వారాల క్రితమే అందజేసినట్లు ట్రూడో తెలిపారు. తీవ్రమైన ఈ అంశంలో వాస్తవాలను ధ్రువీకరించే విషయంలో నిర్మాణాత్మకంగా భారత్ వ్యవహరించాలని తాము కోరుకుంటున్నామన్నారు. భారత్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కెనడాతో భారత్ సహకిస్తుందని ఆశిస్తున్నామన్నారు. దీనివల్ల సమస్య మూలాల్ని తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. అయితే, అది ఎలాంటి సమాచారమో ఆయన వెల్లడించలేదు. కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. ‘కెనడా ప్రధాని చెబుతున్నట్లుగా గతంలో గానీ, ఇప్పుడు గానీ అటువంటి సమాచారం భారత ప్రభుత్వానికి అందనేలేదు. అటువంటిదేమైనా ఉంటే భారత ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుంది. ఇదే విషయాన్ని కెనడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం’అని స్పష్టం చేశారు. గతంలో కెనడా గడ్డపై భారత వ్యతిరేక హింసాత్మక చర్యలకు సంబంధించిన సమాచారం అందజేసినప్పుడు అటువైపు నుంచి స్పందన రాలేదని గుర్తు చేశారు. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు దగ్గరి సంబంధం ఉందనే విషయంలో కెనడా నిఘా సంస్థలు చురుగ్గా దర్యాప్తు చేపట్టాయంటూ గత వారం ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆ ఆరోపణలు ఆందోళనకరం: అమెరికా ఖలిస్తానీ వేర్పాటువాది హత్యకు సంబంధించి భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. బ్లింకెన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌నుద్దేశించి ప్రధానమంత్రి ట్రూడో చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దీనిపై కెనడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లా డుతున్నాం. భారత ప్రభుత్వంతో కూడా ప్రస్తావించాం. దర్యాప్తులో భారత్ సహకరించడం ఎంతో కీలకం. నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి బాధ్యులను తేల్సాల్సిన అవసరం ఉంది’అని ఆయన అన్నారు. భారత్‌పై ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణల వెనుక ఫైవ్ ఐస్ నుంచి అందిన నిఘా సమాచారమే ఆధారమని కెనడాలో అమెరికా రాయబారి డేవిడ్ కోహెన్ చెప్పారు. మత పెద్ద కాదు.. ఉగ్రవాదే: భారత్ నిజ్జర్ ఉగ్రవాదేనని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర శిక్షణ శిబిరాల నిర్వహణ, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సేకరించడం వంటి వాటితో అతడికి సంబంధాలున్నాయంది. అతడు ప్రముఖుడు కాదని పేర్కొంది. నిషేధిత ఖలిస్తాన్ కమాండో ఫోర్స్(కేసీఎఫ్)కు చెందిన గుర్దీప్ సింగ్ అలియాస్ హెరాన్వాలాకు అతడు సన్నిహితుడని తెలిపింది. 1980–90 మధ్య కాలంలో పంజాబ్‌లో గుర్దీప్ సింగ్200 వరకు హత్యలకు పాల్పడినట్లు గుర్తు చేసింది. బలవంతంపు వసూళ్లు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో ఉన్న నిజ్జర్ పోలీసుల అరెస్టు భయంతో 1996లో నకిలీ ధ్రువపత్రాలతో భారత్ నుంచి కెనడాకు పరారయ్యాడని అధికార వర్గాలు తెలిపాయి. ఇంటర్నెట్లో చూసే తెలుసుకున్నా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయం తాను ఇంటర్నెట్లోనే చూశానని బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఈబీ చెప్పారు. తనకీ విషయాలను దర్యాప్తు అధికారులెవరూ తెలపకపోవడం నిరుత్సాహం కలిగించిందన్నారు. ఫెడరల్ ప్రభుత్వం కీలకమైన సమాచారాన్ని అందించకపోవడంతో స్థానికంగా పౌరులకు భద్రత కల్పించే చర్యలపై తమ వంతుగా స్పందించలేకపోయామన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను ఆస్తులు జప్తు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఆస్తుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. 2020లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ)కింద నమోదైన కేసుకు సంబంధించి మొహాలిలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) జనరల్ కౌన్సిల్‌గా చెప్పుకునే పన్నుకు చెందిన అమృత్‌సర్‌లోని ఖాన్కోట్ గ్రామంలో ఉన్న 5.7 ఎకరాల వ్యవసాయ భూమి, చండీగఢ్‌లోని సెక్టార్ 15/సి ప్రాంతంలోని ఇంటిలో కొంతభాగం ఉన్నాయన్నారు. -
G20 Summit: నేతలకు పేదరికం కనిపించకుండా దాస్తోంది
న్యూఢిల్లీ: జీ20 భేటీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టిన చర్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మురికి వాడలను కనిపించకుండా చేయడం, ధ్వంసం చేయడం వంటి వాటితోపాటు వీధుల్లో తిరిగే కుక్కలు తదితర జంతువులను క్రూరంగా బంధించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. అతిథుల ఎదుట మన దేశ వాస్తవాలను దాచాల్సిన అవసరం లేదన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ శనివారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న మురికివాడల చుట్టూ పచ్చని పాలిథిన్ షీట్లను కప్పి ఉంచినట్లుగా ఉన్న వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘ప్రభుత్వం మమ్మల్ని పురుగులుగా భావిస్తోంది. మేం మనుషులం కామా?’ అని స్లమ్ నివాసి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. మోదీ చర్యలను విమర్శించారు. ‘మోదీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జీ20 శిఖరాగ్రం వేళ మురికివాడలను కనిపించనీయడం లేదు. ఎందుకంటే రాజు పేదలను ద్వేషిస్తాడు’అని కాంగ్రెస్ ప్రధాని మోదీనుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించింది. -
‘రెడ్ డైరీ’ కాంగ్రెస్‌ను ముంచేస్తుంది
సికార్(రాజస్తాన్): రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అక్రమ, ఆర్థిక లావాదేవీల చిట్టా ఈ ‘రెడ్ డైరీ’లో ఉందంటూ బహిష్కృత మంత్రి రాజేంద్ర గుఢా చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ వంతపాడారు. ఈ ఆరోపణలకు దేశవ్యాప్తంగా 1.25 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితంచేసే కార్యక్రమం వేదికగా నిలిచింది. సికార్‌లో జరిగిన ఈ వేడుకలో ఇంకొన్ని అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ‘ బ్రిటిష్ వారు దేశాన్ని వదిలివెళ్లిపోవాలని గాం«దీజీ ‘క్విట్ ఇండియా’ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇవ్వాల్సిన నినాదం ‘అవినీతి క్విట్ ఇండియా, వారసత్వం క్విట్ ఇండియా, బుజ్జగింపు క్విట్ ఇండియా’. కాంగ్రెస్ వారి కొల్లగొట్టే దుకాణంలో కొత్త సరుకే ఈ ‘రెడ్ డైరీ’. గెహ్లాట్ సర్కార్ పేపర్ లీక్ పరిశ్రమను నడుపుతోంది. కాంగ్రెస్ వారి అవినీతి రహస్యాలు అందులో దాగిఉన్నాయి. ఆ అవినీతి ఈసారి ఎన్నికల్లో వారిని ఓటమిపాలుచేయనుంది’ అని మోదీ అన్నారు. ‘ రెడ్‌డైరీ పేజీలు తెరిస్తే చాలా మంది పెద్ద తలకాయల బండారాలు బయటపడతాయని ప్రజలే చెబుతున్నారు’ అని ఆరోపించారు. పేరు మార్చి ఏమార్చి.. ‘ఇందిరాగాంధీ హయాంలో ఇందిరనే ఇండియా, ఇండియానే ఇందిర’ అని ప్రజల్ని ఏమార్చారు. తర్వాత యూపీయేనే ఇండియా, ఇండియానే యూపీయే’ అని మభ్యపెట్టారు. బ్రిటిష్ సంస్థకు ఇండియా పదాన్ని జోడించి దేశంలో అడుగుపెట్టి దోచుకున్న ఈస్టిండియా కంపెనీ సంగతి తెల్సిందే. ఇండియా పేరున్న సిమీపై నిషేధం విధించాక ఎఫ్‌పీఐ పేరిట మళ్లీ ఉగ్రవాదులు దాడులకు దిగారు. ఇప్పుడు కాంగ్రెస్, దాని జట్టు పారీ్టలు ఇదే ఎత్తుగడతో తమ కూటమికి ఇండియా అని పేరుపెట్టుకున్నాయి’ అని మోదీ ఆరోపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో మోదీ పర్యటించడం గత ఆరునెలల్లో ఇది ఏడోసారి కావడం గమనార్హం. ‘ప్రజల ఆకాంక్షలు నెరవేరడంతో విపక్షాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి’ అని గుజరాత్‌లోని తొలి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయిన రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారం¿ోత్సవంలో మోదీ విమర్శించారు. గెహ్లాట్ ‘ఎరుపు’ దాడి మోదీ విమర్శలపై సీఎం గెహ్లాట్ ఘాటుగా స్పందించారు. ‘ఎరుపు(రెడ్) డైరీ ఊహాత్మకం. వాస్తవానికి అలాంటిది లేదు. మాజీ మంత్రిని పావుగా వాడి రాజకీయం చేస్తున్నారు. నిజానికి అదొకటి ఉంటే మీ చేతిలో కీలుబొమ్మలైన ఈడీ, ఐటీ, సీబీఐలు ఎందుకు ఇంతవరకు దాని వివరాలు తెల్సుకోలేకపోయారు? ఎర్ర సిలిండర్(ఎలీ్పజీ సిలిండర్) ఏకంగా రూ.1,150కి విక్రయిస్తూ అసలైన దోపిడీకి పాల్పడింది మోదీనే. ఎర్ర టమాటాలు రూ.150 పైగా ఎగబాకడానికి మీరే కారణం. ఇంత ధరకు సిలిండర్, టమాటాలు కొనాల్సిరావడంతో ఆగ్రహంతో ప్రజల ముఖాలు ఎర్రబడిపోయాయి. రాజస్తాన్ ప్రజలు ఈసారీ బీజేపీకి ఎర్రజెండానే చూపిస్తారు’ అని అన్నారు.‘ రాష్ట్రానికి విచ్చేసిన మీకు మూడునిమిషాల ప్రసంగం ద్వారా ఆహా్వనం పలికే అవకాశాన్ని పీఎంఓ కార్యాలయం తొలగించింది. అందుకే ఇలా ట్వీట్ ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నా’ అని గెహ్లాట్ ట్వీట్‌చేశారు. దీనిపై ప్రధాని కార్యాలయం స్పందించింది. ‘కాళ్లకు గాయాల కారణంగా మీరు హాజరుకావట్లేరని మీ కార్యాలయం నుంచి సమాచారం వచి్చనందుకే షెడ్యూల్ మార్చాం. అయినా రావాలనుకుంటే ఇదే మా ఆహా్వనం. వచ్చేయండి’ అని పీఎంఓ తేలి్చచెప్పింది. -
అలవాటు మార్చుకుని.. ఇక నుంచి ఇక్కడే విమర్శిస్తారట!
అలవాటు మార్చుకుని.. ఇక నుంచి ఇక్కడే విమర్శిస్తారట! -
ఓర్వలేకే దేశంపై నిందలు
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బ్రిటన్‌లో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తూర్పారబట్టారు. ఇండియాటుడే సదస్సులో మాట్లాడిన ఆయన రాహుల్ పేరు ప్రస్తావించకుండా దుయ్యబట్టారు. ‘‘భారత ప్రజాస్వామ్యం సాధిస్తునప్రగతిని, ఘన విజయాలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే దేశంపై నిందలేస్తున్నారు. మాటల దాడులు చేస్తున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో ఆత్మవిశ్వాసం నిండుగా తొణికిసలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నాయకులు, మేధావులు, ఆర్థికవేత్తలు అందరూ భారత్‌పై ఎంతో విశ్వాసం కనబరుస్తున్నారు. ఇలాంటి వేళ ప్రతికూల వ్యాఖ్యలతో దేశాన్ని తక్కువ చేసే, ప్రజల స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శుభ సందర్భాల్లో దిష్టిచుక్క పెట్టడం మన సంప్రదాయం. ఇలాంటి వ్యక్తులు తమ చేష్టల ద్వారా బహుశా అలా దిష్టిచుక్క పెట్టే బాధ్యత తీసుకున్నట్టున్నారు’’ అంటూ చురకలంటించారు. ఇలాంటి కురచ ప్రయత్నాలను పట్టించుకోకుండా దేశం ప్రగతి పథంలో దూసుకుపోతూనే ఉంటుందన్నారు. ‘‘గత పాలకుల హయాంలో అవినీతి, కుంభకోణాలే నిత్యం పతాక శీర్షికల్లో ఉండేవి. ఇప్పుడేమో అలాంటి అవినీతిపరులంతా వారిపై ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న వార్తలు హెడ్‌లైన్స్‌గా మారుతున్న విచిత్ర పరిస్థితిని మనమంతా చూస్తున్నాం’’ అంటూ ఎద్దేవా చేశారు. -
Bharat Jodo Yatra: 21వ శతాబ్దపు కౌరవులు!
అంబాలా/చండీగఢ్: ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సంఘ్ సభ్యులు 21వ శతాబ్దపు కౌరవులని మండిపడ్డారు. భారతీయ విలువలకు సంఘ్ వ్యతిరేకమని ఆరోపించారు. సంఘ్ కార్యకర్తలు హర హర మహాదేవ్, జైశ్రీరామ్ అంటూ ఏనాడూ నినదించలేదని ఆక్షేపించారు. భారత్ జోడో యాత్రలో సోమవారం హరియాణాలోని అంబాలాలో ఆయన మాట్లాడారు. ‘‘మహాభారతం హరియాణాతో ముడిపడి ఉంది. కౌరవులెవరు? మొదట 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెప్పబోతున్నా. వారు చేతిలో లాఠీలు పట్టుకుంటారు. శాఖలు నిర్వహిస్తుంటారు. మన దేశంలోని బిలియనీర్లు ఆ కౌరవుల ఎదుట సాగిలపడుతున్నారు. పాండవులెప్పుడైనా పెద్ద నోట్లను రద్దు చేశారా? తప్పుడు జీఎస్టీ అమలు చేశారా?’’ అని ప్రశ్నించారు. పాండవులు తపస్వులు గనుక ఎన్నడూ అలా చేయలేదన్నారు. పరస్పరం జైశ్రీరామ్ అంటూ పలుకరించుకోవాలని ప్రజలకు సూచించారు. రాహుల్ ‘పూజారి’ వ్యాఖ్యలపై విమర్శలు న్యూఢిల్లీ:తపస్వులకే తప్ప పూజారులకు భారత్‌లో స్థానం లేదన్న వ్యాఖ్యలతో రాహుల్ తమను చులకన చేశారంటూ ఆలయ పూజారులు మండిపడ్డారు. ప్రయాగ్‌రాజ్ సహా పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. -
మా అమ్మ పార్థివ దేహం వద్ద... కరువుదీరా ఏడ్వలేకపోయా
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై ప్రిన్స్ హ్యారీ (38) విమర్శలు, ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రేమకు ప్రతిరూపమైన తన తల్లి డయానా చనిపోతే కనీసం కరువుదీరా ఏడవలేకపోయానని మంగళవారం విడుదల కానున్న తన స్వీయచరిత్ర ‘స్పేర్’లో ఆయన వాపోయారు. రాచ కుటుంబపు కఠినమైన నైతిక కట్టుబాట్లే అందుకు కారణమని ఆరోపించారు. ‘‘ఏం జరిగినా ఏడవకూడదన్నది రాజకుటుంబంలో అలిఖిత నియమం. ఇలాంటి వాటిని చిన్నతనం నుంచే రుద్దీ రుద్దీ నా హృదయాన్ని బండబార్చారు. దాంతో మా అమ్మ చనిపోయి అంతులేని శూన్యాన్ని మిగిల్చినా ఆ దుర్భర ఆవేదనను బయట పెట్టే స్వేచ్ఛ కూడా లేకపోయింది. దాన్నంతటినీ గుండెల్లోనే అదిమి పెట్టి మా అమ్మ కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను నవ్వుతూ పలకరించాల్సి వచ్చింది. కానీ వారిలో ఎవరితో కరచాలనం చేసినా అరచేతులన్నీ తడితడిగా తగిలాయి. అవన్నీ వారి కన్నీళ్లతో తడిశాయని అర్థమై చాలా సిగ్గుపడ్డా. ఆ వీడియోలను ఇప్పుడు చూసినా సిగ్గేస్తుంటుంది’’ అన్నారు. -
బిహార్ కులకలం
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ ఇతర పార్టీ చేయని సాహసానికి పూనుకున్నారు. రాష్ట్రంలో కులగణనకి శ్రీకారం చుట్టారు. బడుగు, బలహీన వర్గాలకు శాస్త్రీయ విధానంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే కులాలు లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు. రెండు దశలుగా సాగే ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించారు. దేశ ప్రయోజనాల కోసమే కులగణనను చేపడుతున్నామని, ఓబీసీల అసలు లెక్కలు ఎంతో తేల్చాలన్నదే తమ ఉద్దేశమని నితీశ్ కుమార్ బయటకి చెబుతున్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఈ సంక్లిష్ట ప్రక్రియను మొదలు పెట్టారన్న విమర్శలు మొదలయ్యాయి. కులగణనపై వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాల్సిందేనని ఒక వర్గం గట్టిగా పట్టుబడుతోంది. ఓబీసీలకు కేటాయించిన కోటా వారికి సమానంగా పంపిణీ చేయడం కోసం నియమించిన రోహిణి కమిషన్ ఓబీసీల్లో 2,633 కులాలు ఉన్నాయని తేల్చింది. అయితే ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న ఓబీసీల రిజర్వేషన్లలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వార్డ్ కేస్ట్స్ (ఈబీసీ)లకే అమలవుతున్నాయి. మరోవైపు 21 శతాబ్దంలో కూడా కులాల వారీగా జనాభా లెక్కిస్తే సమాజంలో మరిన్ని చీలికలు వస్తాయని మరో వర్గం వాదనగా ఉంది. ఇంకా కులాల కుంపట్లలోనే మగ్గిపోతూ ఉంటే గ్లోబల్ సూపర్ పవర్‌గా భారత్ ఎదిగే అవకాశాలకు గండిపడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఎందుకీ కులగణన? స్వాతంత్య్రానంతరం ఇప్పటివరకు కులాలవారీగా జనాభా లెక్కింపు చేపట్టలేదు. 1990లో కేంద్రంలో జనతాదళ్ ఆధ్వర్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. జనాభా ప్రాతిపదిక అంటూ ఏమీ లేకుండా 27% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం 1992 నుంచి అమలవుతోంది. ఇప్పటివరకు మన దగ్గరున్న కులాల లెక్కలకు 1931 నాటి గణాంకాలే ఆధారం. వాటి ప్రకారం జనాభాలో ఓబీసీలు 52 శాతం! పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లున్నాయి. అందుకే తమకూ అలాగే రిజర్వేషన్లను పెంచాలని ఓబీసీలు డిమాండ్ చేస్తున్నారు. కుల సమీకరణలు అధికంగా ఉన్న బిహార్‌లో ఓబీసీలే కీలకం. ఓబీసీ నాయకుడైన నితీశ్ మొదట్నుంచి కులగణనకు మద్దతుగా ఉన్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక దాన్ని ఆచరణలో పెట్టి రాజకీయ వేడిని పెంచారు. ఒక్కసారి చరిత్రలోకి చూస్తే.. భారత దేశంలో మొట్టమొదటి సారిగా బ్రిటిష్ ప్రభుత్వం 1871లో కులగణన చేపట్టింది. మన దేశంలో ఉన్న విభిన్న వర్గాల ప్రజల్ని అర్థం చేసుకోవడానికే ఈ ప్రక్రియ మొదలు పెట్టింది. అప్పట్లో సేకరించిన సమాచారం ఆధారంగా కులాలకు ప్రాధాన్యతా క్రమాలను నిర్దేశించింది. అలా మొదలు పెట్టిన కులగణన 1931లో చివరిసారిగా చేశారు. ఆ నాటి జనాభా గణాంకాల ప్రాతిపదికగానే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. స్వాంతంత్య్రానంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ కులగణనకు దూరంగా ఉన్నాయి. పదేళ్లకి ఒకసారి చేసే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల డేటా సేకరణకు మాత్రమే పరిమితమయ్యారు. 2011లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన కులాల వివరాలను కూడా సేకరించింది. కానీ వాటిని విడుదల చేయలేదు. ప్రస్తుతం కేంద్రంలో సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భూమిక యూపీఏ హయాంలో జరిగిన కులగణన సరిగా జరగలేదని, అదంతా తప్పులతడకగా సాగిందని చెబుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులకు ఆ డేటా పాతబడిపోయిందని వివరించారు. లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం ఎంత ? బిహార్‌లో కులగణన పూర్తయి లోక్‌సభ ఎన్నికల కంటే ముందే నివేదిక వస్తే నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్లకే అత్యధికంగా లాభం చేకూరే అవకాశాలే కనిపిస్తున్నాయి. బిహార్‌లో ఓబీసీల్లో మరింతగా వెనుకబడిన వారైన అత్యంత వెనకబడిన తరగతులు(ఈబీసీ), దళితుల్లో మరింత అణగారిన మహాదళితుల కార్డుతో కొత్త సామాజిక సమీకరణలకి తెరతీసిన నితీశ్ రాజకీయంగా లబ్ధి పొందుతూ వస్తున్నారు. వీరి వాస్తవ సంఖ్య వెల్లడైతే ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆయన పై చేయి సాధించవచ్చు. మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలు, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే వంటి పార్టీలు కులగణనకు మద్దతుగా ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలన్న స్వరం పెరుగుతుంది. ఇప్పుడు బిహార్‌లో ఓబీసీ జనాభా ఎంత ఉందో వాస్తవాలు వెల్లడైతే వారి ఓటు బ్యాంకే ప్రధానంగా కలిగిన ప్రాంతీయ పార్టీలు బలపడతాయి. ఇది జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలైన బీజేపీకి, కాంగ్రెస్‌కు కూడా ఎదురు దెబ్బగా పరిణమిస్తుంది. అంతే కాకుండా దేశంలో మరోసారి మండల్ వర్సెస్ కమండల్ రాజకీయాలకు తెరలేవచ్చు. 1990 దశకంలో బీజేపీ నేత అద్వానీ రథయాత్రకు కౌంటర్‌గా మండల్ కమిషన్ నివేదికతో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం దేశవ్యాప్తంగా హింసకు దారి తీసింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను మినహాయించి మిగిలిన కులాల జనగణన సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు నితీశ్ కుమార్ చేపట్టిన ప్రక్రియ జాతీయ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్‌డెస్క్ -
Bharat Jodo Yatra: వారివి రాముని ఆదర్శాలు కావు: రాహుల్
అగర్ మాల్వా(మధ్యప్రదేశ్): ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు శ్రీరాముడి నైతిక జీవనాన్ని అనుకరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన అగర్‌మాల్వాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘మహాత్మాగాంధీ తరచూ ఉచ్ఛరించే ‘హే రామ్’అంటే ఒక జీవన విధానమని అర్థం. ప్రేమ, సోదరభావం, గౌరవం, తపస్సు అర్థాన్ని ప్రపంచానికి నేర్పింది’ అని ఒక సాధువు తనకు చెప్పారని రాహుల్ చెప్పారు. అదేవిధంగా, జై సియా రామ్ అర్థం సీత, రాముడు ఒక్కరేనని, శ్రీరాముడు సీత గౌరవం కోసం పోరాడారని ఆ సాధువు చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు మాత్రం శ్రీరాముని అడుగుజాడల్లో నడవడం లేదని, ఆయన ఆదర్శాలను పాటించడం లేదని విమర్శించారు. మహిళలకు గౌరవం కల్పించేందుకు బీజేపీ నేతలు పాటుపడటం లేదని అన్నారు. -
కశ్మీర్ ఫైల్స్‌పై... మాటలు.. మంటలు
ముంబై: విడుదలైనప్పుడే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇఫీ ఉదంతం పుణ్యమా అని మరోసారి దేశవ్యాప్తంగా మంటలు రేపుతోంది. అదో చెత్త సినిమా అంటూ సోమవారం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ముగింపు వేడుకల్లో ఇజ్రాయెల్‌కు చెందిన జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంటా బయటా విమర్శలు రేగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇది పెద్ద చర్చకు తెర తీసింది. నదవ్ వ్యాఖ్యలను భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ తీవ్రంగా ఖండించారు. ‘‘అతిథిని దైవంగా భావించే దేశానికి వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి. ఇఫీ జడ్జీల ప్యానల్‌కు సారథ్య స్థానంలో కూచోబెట్టిన ఆతిథ్య దేశాన్ని నదవ్ తన వ్యాఖ్యలతో దారుణంగా అవమానించారు’’ అంటూ మంగళవారం బహిరంగ లేఖలో దుయ్యబట్టారు. ‘‘హిట్లర్ సారథ్యంలోని నాజీల చేతుల్లో లక్షలాది మంది యూదులు హోలోకాస్ట్ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో నిస్సహాయంగా ఊచకోతకు గురయ్యారు. అదృష్టం కొద్దీ ఆ మారణహోమం నుంచి తప్పించుకున్న వారి వారసున్ని నేను. నీ వ్యాఖ్యలనే గీటురాయిగా తీసుకునే పక్షంలో హోలోకాస్ట్ దారుణాలపై హాలీవుడ్ దర్శక దిగ్గజం స్పీల్బర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్ కూడా చెత్త సినిమాయేనా అని భారతీయులు ప్రశ్నిస్తుంటే నా మనసెంతో గాయపడుతోంది. కశ్మీర్ ఫైల్స్‌పై నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వాటిని నువ్వు ఏ విధంగానూ సమర్థించుకోలేవు’’ అంటూ తూర్పారబట్టారు. నదవ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీరీ పండిట్ల మండిపాటు బీజేపీతో పాటు కశ్మీర్ ఫైల్స్ సినిమా రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అందులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా నదవ్ విమర్శలను తీవ్రంగా ఖండించారు. ‘‘భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ఉగ్రవాదుల వాదనకు మద్దతిచ్చేందుకు వాడుకున్న తీరు ఆశ్చర్యకరం. కశ్మీర్ ఫైల్స్ ప్రచారం కోసం తీసిందని, అందులో ఒక్క సీన్ గానీ, డైలాగ్ గానీ అవాస్తవమని నిరూపించినా ఇకపై సినిమాలే తీయను. నదవ్తో పాటు ప్రపంచ మేధావులకు, అర్బన్ నక్సల్స్‌కు ఇది నా సవాలు’’ అని అగ్నిహోత్రి అన్నారు. నవద్ను తక్షణం భారత్ నుంచి పంపించేయాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ కాన్సులర్ జనరల్ కొబ్బీ షొషానీ కూడా నదవ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. -
కొలీజియం పరాయి వ్యవస్థ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి విమర్శలు గుప్పించారు. అది మన రాజ్యాంగానికి పరాయి వ్యవస్థ అన్నారు. 1991 కంటే ముందు న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమించేదని గుర్తుచేశారు. కొలీజియం వ్యవస్థను తీర్పు ద్వారా సుప్రీంకోర్టే సృష్టించుకుందని శుక్రవారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ఆయనన్నారు. రాజ్యాంగం దేశంలో అందరికీ, ముఖ్యంగా ప్రభుత్వానికి మత గ్రంథం వంటిదే. కోర్టులు, కొందరు న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయానికి మొత్తం దేశం మద్దతున్నట్టు ఎలా భావిస్తాం? కొలీజియం వ్యవస్థను ఏ నియమం కింద నిర్వచిస్తారో చెప్పాలి. అయితే జడ్జీల నియామకానికి మరో ఉత్తమ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేదాకా కొలీజియంను ప్రభుత్వం గౌరవిస్తూనే ఉంటుంది’’ అన్నారు. ఆ ఉత్తమమైన వ్యవస్థ ఏమిటన్న దానిపై తాను చర్చించలేనన్నారు. -
Gujarat Assembly Election 2022: తల్లీబిడ్డలను వేరుచేస్తున్నారు
మహువా: కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో అడుగుపెట్టారు. రాష్ట్ర అధికార బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. సోమవారం ఆయన సూరత్ జిల్లాలోని మహువాలో జరిగిన భారీ బహిరంగ సభలో గిరిజనులద్దేశిస్తూ ప్రసంగించారు. ‘బీజేపీ మిమ్మల్ని తాత్కాలిక వనవాసులు అంటోంది. కానీ, గిరిపుత్రులే అడవికి అసలైన యజమానులు. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు అటవీభూములను ధారాదత్తంచేస్తూ గిరిజనులను తమ అడవి తల్లికి దూరంచేస్తోంది. ఇక్కడ మీ బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీంతో ఆధునిక విద్య, వైద్యానికి మీ పిల్లలు దూరమవుతున్నారు. మీ పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడుతూ వైద్యులు, ఇంజనీర్లు, పైలట్లు కావడం బీజేపీ సర్కార్‌కు ఇష్టంలేదు’ అని రాహుల్ దుయ్యబట్టారు. రాజ్‌కోట్‌లో జరిగిన మరో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బీజేపీతోనే రైతులకు కష్టాలు మహారాష్ట్రలో కర్షకులు, యువత, గిరిజనులను పట్టిపీడిస్తున్న కష్టాలకు అసలు కారణం బీజేపీయేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో 380 కిలోమీటర్ల పొడవునా కొనసాగిన భారత్ జోడో యాత్రనుద్దేశిస్తూ రాహుల్ సోమవారం ఒక ప్రకటన విడుదలచేశారు. పంటల బీమా పథకాల వైఫల్యం కారణంగా రైతులు కష్టాలు పడుతున్నారని వాపోయారు. -
రాహుల్ వ్యాఖ్యలపై రగడ.. మహా వికాస్ అగాడీకి బీటలు?
ముంబై: వీర సావర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శలు మహారాష్ట్రలో రాజకీయ కాక రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గురువారం సావర్కర్‌పై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. ఆయన బ్రిటిష్ వారికి భయపడి క్షమాభిక్ష కోరారని, గాంధీ, పటేల్, నెహ్రూ వంటి స్వాతంత్య్ర సమర యోధులకు ద్రోహం చేశారని ఆరోపణలు గుప్పించారు. వీటిపై కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడుతోంది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ అగాడీ నుంచి బయటికి వచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. రాహుల్ వ్యాఖ్యలను ఉద్ధవ్ ఠాక్రే వెంటనే ఖండించడం తెలిసిందే. మహారాష్ట్రులకు ఆరాధ్యుడైన సావర్కర్ వ్యతిరేక వ్యాఖ్యలను తాము సహించే ప్రసక్తే లేదని ఉద్ధవ్ వర్గానికి చెందిన నేత అరవింద్ సావంత్ కుండబద్దలు కొట్టారు. ఇటీవలే రాహుల్‌తో కలిసి జోడో యాత్రలో నడిచిన ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా తాజాగా అదే మాట చెప్పారు. రాహుల్ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఉద్ధవ్ వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా శనివారం అభిప్రాయపడ్డారు. అవి అగాడీ కూటమి మనుగడపై ప్రభావం చూపుతాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ కాకను మరింత పెంచేలా సావర్కర్‌పై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే శనివారం మరిన్ని విమర్శలు గుప్పించారు! బ్రిటిష్ వారి నుంచి సావర్కర్ రూ.60 పెన్షన్ తీసుకున్నారంటూ మరోసారి వివాదాల తేనెతుట్టెను కదిపారు. రాహుల్ వ్యాఖ్యలను విమర్శిస్తున్న వారు ముందుగా దీనికి బదులివ్వాలన్నారు. మరోవైపు ఉద్ధవ్‌కు సావర్కర్‌పై ఏ మాత్రం గౌరవమున్నా కాంగ్రెస్‌కు తక్షణం గుడ్‌బై చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్‌సాహెబ్ దన్వే శనివారం డిమాండ్ చేశారు. ఆ ఉద్దేశముందో లేదో చెప్పాలని సవాలు చేశారు. -
నచ్చనంత మాత్రాన విమర్శిస్తారా?
‘‘నటిగా నేను ఎంచు కున్న జీవితం ప్రత్యేకమైనది. ఇక్కడ (ఇండస్ట్రీ) ఉన్న ప్రతి ఒక్కర్నీ అందరూ ఇష్టపడతారని కచ్చితంగా అనుకోను. నేను మీకు (విమర్శిస్తున్నవారిని ఉద్దేశించి) నచ్చనంత మాత్రాన మీరు నాపై విమర్శలు చేయొచ్చని కాదు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రతిరోజూ కష్టపడి పని (సినిమాలు) చేయడం మాత్రమే నాకు తెలుసు. నా పని వల్ల మీరు ఆనందపడితే నాకు అదే చాలు’’ అని రష్మికా మందన్నా అన్నారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక ఈ విధంగా షేర్ చేశారు. ‘‘కొన్నేళ్లుగా రెండు విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నాను. నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నిజానికి ఇది కొన్ని సంవత్సరాల క్రితమే చేయాల్సింది. నటిగా నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి చాలామంది నన్ను ద్వేషిస్తున్నారు. విమర్శలు, నెగటివిటీ ఈ రెండు విషయాలతో ఇబ్బందిపెడుతున్నారు. ప్రతికూలత, ద్వేషం వల్ల ఉపయోగం ఏంటి? నేను మాట్లాడని విషయాల గురించి నాపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం నన్ను చాలా నిరుత్సాహపరుస్తోంది. అవి చదివినప్పుడు నా హృదయం పగిలిపోతోంది. కొన్ని ఇంటర్వ్యూల్లో నేను మాట్లాడిన కొన్ని విషయాలు తప్పుగా రీచ్ అయ్యి.. నాకు వ్యతిరేకంగా మారడాన్ని గుర్తించాను. ఇంటర్నెట్లో వస్తోన్న తప్పుడు కథనాలు ఇటు పరిశ్రమలో అటు బయట నాకున్న మంచి రిలేషన్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. నాతో పాటు నా సహచరులు కూడా ఇబ్బందిపడుతున్నారు. నన్ను నేను మెరుగుపరచుకోడానికి ఉపయోగపడే సద్విమర్శలను స్వాగతిస్తాను. నాపై వస్తున్న విమర్శలను ఎత్తి చూపడం ద్వారా నేను ఎవరిపైనో గెలవడానికి ప్రయత్నించడం లేదు. అలాగే నాపై వస్తున్న విమర్శల కారణంగా మనిషిగా నేను మారాలనుకోవడం లేదు. నా చుట్టూ ఉన్నవారిపై నాకు అభిమానం, ప్రేమ ఉన్నాయి. మీరందరూ నాపై చూపిస్తున్న ప్రేమ, సపోర్ట్ నన్ను ముందుకు నడుపుతున్నాయి. ఇదిగో ఇలా అందరికీ నా మనసులోని మాటలను చెప్పే ధైర్యాన్ని నాకు ఇచ్చింది అవే. అందరం అందరికీ మంచి చేసేలా కృషి చేద్దాం’’ అని పోస్ట్ చేశారు రష్మిక. -
అవినీతిమయ పార్టీలు: ఆప్, కాంగ్రెస్‌లపై మోదీ విసుర్లు
సోలన్ (హిమాచల్‌ప్రదేశ్): ‘‘కరడుగట్టిన నిజాయతీపరుమని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ నిజానికి అత్యంత అవినీతిమయం. ఇకకాంగ్రెసైతే అవినీతికి, స్వార్థ రాజకీయాలకు, ఆశ్రిత పక్షపాతానికి తిరుగులేని గ్యారెంటీ’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రెండు పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కపెట్టారు. శనివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని సుందర్ నగర్లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. స్థిరత్వానికి, అభివృద్ధికే ఓటేయాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ హిమాలయ రాష్ట్రంతో తనకు సుదీర్ఘ అనుబంధముందని చెప్పారు. అధికార బీజేపీకి వేసే ప్రతి ఓటూ తనకు ఆశీర్వాదమని భావిస్తానన్నారు. ‘‘మీరు వేసే ప్రతి ఓటూ వచ్చే పాతికేళ్ల కాలానికి రాష్ట్ర భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. నేను కమలం పువ్వు గుర్తు చేపట్టి మీ ముందుకొచ్చాను. మా అభ్యర్థులను చూడకండి. కమలం గుర్తును చూసి ఓటేయండి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘కాంగ్రెస్ హయాంలో స్థిరత్వం లేని పాలన వల్ల చిన్న రాష్ట్రాలు ఎంతగానో నష్టపోయాయి. చిన్న రాష్ట్రమని హిమాచల్‌ను కాంగ్రెస్ ఏళ్ల తరబడి చిన్నచూపు చూసింది. అందుకే 21వ శతాబ్దంలో మనకు కావాల్సింది స్థిరమైన, బలమైన ప్రభుత్వాలు. అది బీజేపీకి మాత్రమే సాధ్యం’’ అన్నారు. ‘‘మందులను మాటిమాటికీ మారిస్తే రోగం తగ్గదు. ఎవరికీ మేలు జరగదు. అందుకే అధికార బీజేపీని మళ్లీ గెలిపించండి’’ అని కోరారు. హిమాచల్‌లో ప్రతిసారీ అధికార పార్టీ ఓడటం ఆనవాయితీగా వస్తోంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు గుజరాత్‌తో పాటుగా డిసెంబర్ 8న జరుగుతుంది. -
కొలీజియంలో పారదర్శకత లేదు.. న్యాయవ్యవస్థలో రాజకీయాలు
ముంబై: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలే తప్ప కొలీజియంకు తెలిసిన వారినెవరినో కాదంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పైగా ఈ పద్ధతి న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలకు తావిస్తోంది. న్యాయమూర్తులు బయటికి చెప్పకపోవచ్చు. కానీ అక్కడ లోతైన రాజకీయాలే ఉన్నాయి’’ అంటూ సునిశిత విమర్శలు కూడా చేశారు. బుధవారం ఇండియాటుడే కాంక్లేవ్‌లో న్యాయవ్యవస్థను సంస్కరించే అంశంపై మంత్రి మాట్లాడారు. ‘‘నేను న్యాయవ్యవస్థను గానీ, న్యాయమూర్తులను గానీ విమర్శించడం లేదు. కానీ ప్రస్తుత కొలీజియం వ్యవస్థ పట్ల మాత్రం నాకు చాలా అసంతృప్తి ఉంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమకు తెలిసిన సహచరుల పేర్లనే సిఫార్సు చేస్తున్నారు. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే కాదు. లాయర్లతో పాటు కొందరు న్యాయమూర్తుల్లో కూడా ఉన్న అభిప్రాయాలనే చెబుతున్నాను. ఏ వ్యవస్థా పరిపూర్ణం కాదు. నిత్యం మెరుగు పరుచుకుంటూ పోవాలి. ప్రతి వ్యవస్థలోనూ జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి. అలా లేనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత మంత్రి కాక ఇంకెవరు మాట్లాడతారు?’’ అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక పాత్ర పోషించరాదని కుండబద్దలు కొట్టారు. ‘‘నియామక ప్రక్రియలో కేంద్రం కూడా పాలుపంచుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే న్యాయమూర్తుల కొలీజియం సిఫార్సు చేసే పేర్లను ఆమోదించేముందు వాళ్లను గురించి అన్నిరకాల సమాచారం సేకరించే స్వతంత్ర యంత్రాంగం ప్రభుత్వం సొంతం. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఈ వెసులుబాటు లేదు. పైగా, వాళ్లు దృష్టి పెట్టాల్సింది న్యాయమూర్తుల నియామకాల వంటి పాలనపరమైన పనుల పైనా, లేక ప్రజలకు న్యాయం అందించడం మీదా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. జడ్జిలూ... వ్యాఖ్యలెందుకు? నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటును సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని రిజిజు ప్రస్తావించారు. ఈ చర్యపై కేంద్రం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదని గుర్తు చేశారు. ‘‘నిజానికి వాళ్లలా కొట్టేసినప్పుడు కేంద్రం కావాలనుకుంటే ఏదో ఒకటి చేసేది. కానీ న్యాయవ్యవస్థ పట్ల గౌరవమున్న కారణంగా ఆ పని చేయలేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలన్నది మోదీ సర్కారు అభిప్రాయం’’ అన్నారు. అంతమాత్రాన తామెప్పుడూ మౌనంగానే ఉంటామని అనుకోవద్దంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా రిజిజు తప్పుబట్టారు. ‘‘ఏం చెప్పినా తీర్పుల ద్వారానే చెప్పాలి తప్ప అనవసర వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకోవద్దు’’ అని సూచించారు. -
UK PM: తొలిరోజే విమర్శల జడివాన.. బ్రేవర్మన్ నియామకంపై వ్యతిరేకత
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ బాధ్యతలు తీసుకున్న వెంటనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. డేటా ఉల్లంఘన తప్పిదాలపై లిజ్ ట్రస్ హయాంలో హోంమంత్రిగా రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ని తిరిగి నియమించడాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ఆమెను అదే పదవిలో నియమించడాన్ని తప్పు పట్టింది. బ్రేవర్మన్ నియామకాన్ని రిషి సమర్థించారు. ఆమె తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్, విదేశాంగ మంత్రిగా జేమ్స్ క్లెవెర్లీలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్త మంత్రులతో ఆయన బుధవారం మొట్టమొదటి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. తొలిసారి ప్రధాని హోదాలో ప్రైమ్ మినిస్టర్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్) ఎదుర్కోవడానికి ముందు కేబినెట్ కొత్త మంత్రులతో కలిసి చర్చించారు. యూకే రాజకీయాల్లో పీఎంక్యూస్ కార్యక్రమం అత్యంత కీలకమైనది. ప్రతీ బుధవారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో విపక్ష పార్టీలు, ఎంపీలు ఏ అంశం మీద అడిగిన ప్రశ్నలకైనా ప్రధాని బదులివ్వాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలను రిషి నవంబర్ 17 దాకా వాయిదా వేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సన్నాహాలే ఇందుకు కారణమని హంట్ చెప్పారు. కేబినెట్ సమావేశంలోనూ ప్రధానిగా పార్లమెంటు తొలి భేటీలోనూ రిషి చేతికి హిందువులకు పవిత్రమైన దీక్షా కంకణం (మంత్రించిన ఎర్ర తాడు) ధరించి పాల్గొన్నారు. దీనిపై చర్చ జరుగుతోంది. దుష్ప్రభావాలు పోయి మంచి జరగడానికి దీనిని ధరిస్తే దేవుడు రక్షగా ఉంటాడని హిందువులు నమ్ముతారు. హిందూ మత విశ్వాసాలకు చెందిన దీనిని ధరించడంతో రిషి తాను నమ్ముకున్న సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
మునుగోడులో తిట్ల దండకం!.. ‘అయ్య ఫాంహౌజ్ స్టార్.. కొడుకు డ్రగ్ స్టార్'
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ పార్టీల స్టార్ ప్రచారకర్తలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలతో దుమారం రేపుతున్నారు. అధికార టీఆర్ఎస్తోపాటు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ప్రచార పర్వంలో పైచేయి సాధించేందుకు చేస్తున్న విమర్శలు వివాదాలు రేపుతున్నాయి. కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఓటర్లు, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రచార విన్యాసాలు కొన్ని సందర్భాల్లో వికటిస్తున్నాయి. గురువారం చౌటుప్పల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఏకంగా సమాధి కట్టిన ఘటన ప్రచారంలో కొత్తపోకడకు దారితీసింది. హడావుడిగా నేతలు అన్ని పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో క్రియాశీల కార్యకర్తలను మోహరించి ప్రతీ ఓటరును చేరుకునేందుకు శ్రమిస్తున్నారు. దీంతో ఊరూరా విందులు జోరుగా సాగుతున్నాయి. మద్యం, శీతల పానీయాలు, చికెన్ విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సామాజిక సమీకరణాలపై అన్ని పార్టీలు దృష్టి సారించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఓటర్లను కలుసుకునే బాధ్యతను అప్పగించారు. టీఆర్ఎస్, బీజేపీలు ఇతర పార్టీల నుంచి చేరికల పేరిట హడావుడి చేస్తూ నేతలు కండువాలు కప్పే పనిలో తీరికలేకుండా ఉన్నారు. చేరికలు నిరంతరంగా సాగుతుండటంతో ఎవరు పార్టీలో కొనసాగుతున్నారో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని అధికార పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో భాగంగా గ్రామాలను చుట్టబెడుతున్నారు. మండలాలు, గ్రామాలు, సామాజికవర్గాల వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఓటరు జాబితాను అన్ని పార్టీలు వడపోసి, వివరాలను క్షేత్రస్థాయిలో అందజేశాయి. నాయకుల మాటల తూటాలు... టీఆర్ఎస్ ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అయన అసలు ప్రజాప్రతినిధిగానే పనికిరారని, కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చారని, అదీగాక గెలిచిన పార్టీలో కోవర్టుగా పనిచేశారని తీవ్రంగా విమర్శిస్తోంది. అదే సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపై విమర్శలు గుప్పిస్తోంది. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు బఫూన్లని, వారు కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని మంత్రి కేటీఆర్ విమర్శిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధానంగా సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. మంత్రులు/ ఎమ్మెల్యేలను దండుపాళ్యం బ్యాచ్‌గా, నీతి, జాతిలేని రాక్షసులుగా దుమ్మెత్తిపోస్తున్నారు. ‘అయ్య ఫాంహౌజ్ స్టార్.. కొడుకు డ్రగ్ స్టార్, అల్లుడు వెన్నుపోటు స్టార్.. సడ్డకుడి కొడుకు టానిక్ స్టార్, మిగిలింది లిటిల్ స్టార్. వీళ్లంతా బందిపోటు స్టార్స్’ అంటూ ఆరోపణలు చేయడం గమనార్హం. టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం టీఆర్ఎస్, బీజేపీలను ఏకిపారేస్తున్నారు. ‘ఒకరు దొంగ అయితే ఇంకొకరు గజదొంగ.. తాగడానికి గంజి లేని టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బెంజి కార్లలో తిరుగుతున్నారు. మంత్రులు మందు పోసే దివాలాకోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అడ్డమైన గాడిదలు టీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాయి’ అంటూ తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. -
కాంగ్రెస్‌కు ఆజాద్ గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ: వరుస పరాజయాలు, నేతల నిష్క్రమణతో నీరసించిన కాంగ్రెస్‌కు మరో భారీ షాక్. గాంధీల కుటుంబానికి విధేయుడైన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ (73) కాంగ్రెస్‌ను వీడారు. పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాహుల్‌గాంధీపై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. ఇప్పటిదాకా పార్టీ వీడిన ఏ నాయకుడూ చేయని రీతిలో తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్‌వి పిల్ల చేష్టలు. సీనియర్లను గౌరవించని తత్వం’’ అంటూ దుయ్యబట్టారు. అలాంటి అపరిపక్వ వ్యక్తి నాయకత్వంలో పనిచేయలేనంటూ అధినేత్రి సోనియాగాంధీకి ఐదు పేజీల లేఖ రాశారు. ‘‘పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని రాహుల్ పూర్తిగా కుప్పకూల్చారు. ప్రశ్నించిన సీనియర్లపై కోటరీతో వ్యక్తిగత దాడి చేయించారు. శవయాత్రలు చేయించారు. పార్టీని అన్నివిధాలుగా పతనావస్థకు చేర్చారు. ఏమాత్రం సీరియస్‌నెస్ లేని అలాంటి వ్యక్తికే పగ్గాలిచ్చేందుకు నాయకత్వం ఎనిమిదేళ్లుగా విఫలయత్నం చేస్తూ వచ్చింది. తద్వారా జాతీయ స్థాయిలో బీజేపీని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చేజేతులారా అందలమెక్కించింది’’ అని ఆరోపించారు. అందుకే బరువెక్కిన హృదయంతో పార్టీతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభించడానికి ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జోడో అంటూ కార్యాచరణ చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలతో కూడిన జీ23 గ్రూప్‌లో ఆజాద్ కీలక నేతగా వ్యవహరించడం, పార్టీ తీరును కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉండటం తెలిసిందే. ఆయన రాజీనామాను దురదృష్టకరంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. బీజేపీతో పోరు కీలక దశకు చేరిన సమయంలో ఇలా చేయడం దారుణమంటూ వాపోయింది. ఆజాద్ డీఎన్ఏ ‘మోడీ’ఫై అయిందంటూ దుయ్యబట్టింది. ఏడాది కాలంలో దాదాపు15 మంది దాకా నేతలు కాంగ్రెస్‌ను వీడారు! రాహుల్ రాకతో సర్వం నాశనం సోనియాకు రాసిన లేఖలో రాహుల్ తీరును ఆజాద్ తూర్పారబట్టారు. ‘‘పార్టీ అధినేత్రిగా కేంద్రంలో యూపీఏ1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. సీనియర్ల సలహాలను పాటించడం, వారి తీర్పును విశ్వసించడం, వారికి అధికారాలప్పగించడం అందుకు ప్రధాన కారణాలు. దురదృష్టవశాత్తు 2013లో రాహుల్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్నే కుప్పకూల్చారు. సీనియర్లు, అనుభవజ్ఞులైన నాయకులందరినీ పక్కన పెట్టారు. ఏ అనుభవమూ లేని కొత్త కోటరీయే పార్టీ వ్యవహారాలను నడుపుతోంది. కాంగ్రెస్ కోర్ గ్రూప్‌లో పొందుపరిచి, కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించి, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ మీడియా ముందు చించిపారేశారు. ఇలాంటి చిన్నపిల్లల ప్రవర్తన వల్లే 2014లో అధికారానికి దూరమయ్యాం. ముందు సోనియా, తర్వాత రాహుల్ నాయకత్వంలో 2014–22 మధ్య 49 అసెంబ్లీ ఎన్నికలకు గాను ఏకంగా 39సార్లు ఘోరంగా ఓడిపోయాం. వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలయ్యాం. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యవర్గ సభ్యునిగా నేనిచ్చిన ప్రతిపాదనలన్నీ స్టోర్ రూమ్‌కే పరిమితమయ్యాయి. 2013 జైపూర్ చింతన్‌శిబిర్‌లో పార్టీ పునరుజ్జీవం కోసం చేసిన సిఫార్సులదీ తొమ్మిదేళ్లుగా అదే గతి! రాహుల్‌కు వ్యక్తిగతంగా పదేపదే గుర్తు చేసినా వాటిని పట్టించుకోలేదు. పార్టీని గాడిలో పెట్టేందుకు 23మంది సీనియర్లం లేఖలు రాస్తే రాహుల్ కోటరీ నేతలు మాపై వ్యక్తిగత దాడి చేసి అవమానించారు. కోటరీ ఆదేశాల మేరకు జమ్మూలో నా శవయాత్ర చేశారు. ఇంకో సీనియర్ ఇంటిపైకి గూండాలను పంపారు. వారిని రాహుల్ వ్యక్తిగతంగా సన్మానించారు’’ అని ఆరోపించారు. రిమోట్ కంట్రోల్ మోడల్ ద్వారా యూపీఏ ప్రభుత్వ సమగ్రతను కుప్పకూల్చారంటూ సోనియాపైనా ఆజాద్ విమర్శలు గుప్పించారు. ‘‘మన ఓటమికి కారణమైన అదే మోడల్‌ను పార్టీకీ వర్తింపజేసి రాహుల్ సర్వనాశనం చేశారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రహసనం, బూటకం. దేశవ్యాప్తంగా ఎక్కడా ఏ స్ధాయిలోనూ ఎన్నికలు జరగలేదు. ఏఐసీసీ కార్యాలయంలో కూర్చున్న కోటరీ తయారు చేసిన కమిటీ జాబితాలపై సంతకం చేయాల్సిందిగా బలవంతపెట్టారు’’ అంటూ దుయ్యబట్టారు. కోటరీ గుప్పెట్లో బందీ కోటరీ గుప్పెట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బందీ అయిందని ఆజాద్ ఆరోపించారు. ‘‘తద్వారా పోరాట పటిమను, కాంక్షను పూర్తిగా కోల్పోయింది. పుంజుకునే అవకాశమే లేనంతగా పతనావస్థకు చేరింది. ఇప్పుడు కూడా అసమర్థులకు పగ్గాలు అప్పగించే ఫార్సు మొదలవబోతోంది’’ అని కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఉద్దేశించి ఆరోపించారు. ‘‘ఇదీ విఫల ప్రయోగంగా మిగిలిపోతుంది. ఎందుకంటే మళ్లీ ఓ కీలుబొమ్మనే గద్దెనెక్కిస్తారు’’ అన్నారు. స్వాతంత్య్రం అమృతోత్సవాల వేళ పార్టీకి ఇంతటి దురవస్థ ఎందుకు ప్రాప్తించిందో ఏఐసీసీ నాయకత్వం తనను తాను ప్రశ్నించుకోవాలని సూచించారు. తను, తన సహచరులం జీవితాంతం నమ్మిన విలువల కోసం కృషి చేస్తామని చెప్పారు. కపిల్ సిబల్, అశ్వనీకుమార్ తదితర నేతలు కాంగ్రెస్‌ను వీడటం తెలిసిందే. రాహుల్‌పై ఆజాద్ ఆరోపణలు... ► రాహుల్ ఏ మాత్రం పరిపక్వత లేని వ్యక్తి. అన్నీ పిల్లచేష్టలే. ఆయన రంగప్రవేశంతో, ముఖ్యంగా 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీ సర్వనాశనమైంది. ► అనుభవజ్ఞులైన సీనియర్లందరినీ రాహుల్ పక్కన పెట్టారు. తొత్తులతో కూడిన కోటరీ ద్వారా పార్టీని నడుపుతూ భ్రష్టు పట్టించారు. ► సోనియా పేరుకే పార్టీ చీఫ్. ముఖ్య నిర్ణయాలన్నీ రాహుల్‌వే. కొన్నిసార్లు ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలూ నిర్ణయాలు తీసేసుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది! ► ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను మీడియా సాక్షిగా చించేయడం రాహుల్ అపరిపకత్వకు పరాకాష్ట. ప్రధాని అధికారాన్ని పూర్తిగా పార్టీ ముందు మోకరిల్లేలా చేసిన ఈ పిల్లచేష్టే 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ఘోర ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ► కాంగ్రెస్‌ను పూర్తిగా చెప్పుచేతల్లో పెట్టుకునే క్రమంలో రాహుల్ నేతృత్వంలోని చెంచాల బృందం పార్టీకి చెప్పలేనంత ద్రోహం తలపెట్టింది. జాతీయోద్యమానికి నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన పార్టీ వారివల్లే ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ► 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునే ముందు పార్టీ కోసం జీవితాలను ధారపోసిన సీనియర్ నాయకులందరినీ వర్కింగ్ కమిటీ భేటీలోనే రాహుల్ తీవ్రంగా అవమానించారు. ఆజాద్ నైజం బయటపడింది: కాంగ్రెస్ దశాబ్దాల పాటు అన్ని పదవులూ అనుభవించి కీలక సమయంలో పార్టీని వీడటం ద్వారా ఆజాద్ తన అసలు నైజం బయట పెట్టుకున్నారంటూ కాంగ్రెస్ మండిపడింది. పదవి లేకుండా ఆజాద్ క్షణం కూడా ఉండలేరంటూ ఏఐసీసీ మీడియా హెడ్ పవన్ ఖేరా చురకలు వేశారు. ‘‘అందుకే రాజ్యసభ సభ్యునిగా పదవీకాలం ముగియగానే పార్టీ వీడారు. పార్టీని బలహీనపరిచేందుకు నిత్యం ప్రయత్నించారు. ఇప్పుడేమో పార్టీ బలహీనపడిందని విమర్శలు చేస్తున్నారు’’ అంటూ ఆక్షేపించారు. రాహుల్‌పై ఆజాద్ విమర్శలను కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కొట్టిపారేశారు. ‘‘మోదీని పార్లమెంటులోనే ఆజాద్ ఆకాశానికెత్తారు. పద్మభూషణ్ స్వీకరించారు. ఆయన రిమోట్ మోదీ చేతిలో ఉందనేందుకు ఇవన్నీ నిదర్శనాలు’’ అంటూ ట్వీట్ చేశారు. ఆజాద్‌కు కాంగ్రెస్ అన్నీ ఇచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. రాహుల్‌పై ఆయనా చేసిన విమర్శలు దారుణమన్నారు. పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడిలాంటి విమర్శలు చేయడం ఆజాద్ దిగజారుడుతనానికి నిదర్శనమని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. -
‘కాళీ’ పోస్టర్‌పై తీవ్ర వివాదం.. అమ్మవారి పాత్రధారి సిగరెట్ తాగుతూ...
న్యూఢిల్లీ: ‘కాళీ’ అనే డాక్యుమెంటరీ పోస్టర్ తీవ్ర వివాదానికి దారితీసింది. కెనడాలోని ఆగాఖాన్ మ్యూజియంలో ఈ పోస్టర్‌ను ప్రదర్శించారు. కాళీ మాత పాత్రధారి సిగరెట్ తాగుతూ, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్(ఎల్జీబీటీ)ని సూచించే ఏడు రంగుల జెండాను ప్రదర్శిస్తూ పోస్టర్లో కనిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంటరీ దర్శకురాలు లీనా మణిమేఖలై దీనిపై సోమవారం స్పందించారు. ‘‘నేను బతికున్నంతకాలం నిర్భయంగా గొంతు వినిపిస్తూనే ఉంటా. అందుకు నా జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా సిద్ధమే. డాక్యుమెంటరీ చూస్తే పోస్టర్ వెనుక ఉద్దేశం అర్థమవుతుంది’’ అన్నారు. తమిళనాడుకు చెందిన ఆమె టొరంటోలో ఉంటున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన మణిమేఖలైపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశామని ‘గో మహాసభ’ వెల్లడించింది. పోస్టర్‌పై కెనడాలోని హిందూ సమాజం నుంచి ఫిర్యాదులందాయని ఒట్టావాలోని ఇండియన్ హైకమిషన్ తెలియజేసింది. డాక్యుమెంటరీలో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే అంశాలుంటే తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. -
పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ఆరోపణలు
లాహోర్: పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరోక్ష విమర్శలు చేశారు. తన పదవి పోయేందుకు కీలక స్థానాల్లో ఉన్న కొందరు కారణమని దుయ్యబట్టారు. తన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ‘ప్రతి సంస్థలో మనుషులుంటారు. అందులో ఒకరిద్దరు తప్పుడువారైనంత మాత్రాన మొత్తం సంస్థను బాధ్యురాలిగా చేయలేము. ఒకవేళ ఒకరు (జనరల్ బజ్వా) తప్పు చేస్తే అది మొత్తం సంస్థ తప్పు చేసినట్లు కాదు.’’ అని ఆయన ట్వీట్ చేశారు. సైన్యానికి తమ పార్టీకి మధ్య సంబంధాలు గత కొద్ది నెలలుగా క్షీణించాయని పాక్ మాజీ మంత్రి ఫవాద్ చెప్పారు. ఐఎస్ఐ చీఫ్‌గా నదీమ్ అంజుమ్ నియామకాన్ని ఇమ్రాన్ గతేడాది తొలుత తిరస్కరించి తర్వాత ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయనకు సైన్యంతో చెడింది. దేశ చరిత్రలో గుర్తుండే ర్యాలీ నిర్వహణకు తన మద్దతుదారులంతా గురువారం మినార్ ఐ పాకిస్తాన్‌కు చేరాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఒకపక్క ఆర్మీ చీఫ్‌ను విమర్శిస్తూ మరోపక్క సైన్యాన్ని ఆయన ప్రశంసించారు. -
Russia-Ukraine War: పుతిన్‌ను బోనెక్కించగలరా?
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర విచక్షణారహితంగా సాగుతోంది. బుచా పట్టణంలో సాధారణ పౌరుల్ని వెంటాడి వేటాడిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా మిలటరీపైనా , అధ్యక్షుడు పుతిన్‌పైనా యుద్ధ నేరాల కింద విచారణ జరిపించాలని ప్రపంచ దేశాలు గర్జిస్తున్నాయి. యుద్ధం అంటేనే ఒక ఉన్మాద చర్య. అలాంటప్పు డు అందులో నేరాలుగా వేటిని పరిగణిస్తారు ? రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై యుద్ధ నేరాల విచారణ సాధ్యపడుతుందా ? ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్‌లో రష్యా మిలటరీ సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. బుచా పట్టణం శవాల దిబ్బగా మారింది. రక్తమోడుతూ, మసిబొగ్గుల్లా మారిన 300 మంది అన్నెం పున్నెం ఎరుగని పౌరుల మారణహోమం వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఏ క్షణంలో ఏమవుతుందోనన్న భయంతో చిన్నారుల శరీరాలపై తల్లిదండ్రులు వారి వివరాలు రాయడం మనసుని పిండేస్తోంది. గత నెలలోనే మారియూపోల్‌లోని ప్రసూతి ఆస్పత్రి, థియేటర్లపై బాంబు దాడులతో రష్యా యుద్ధ నేరాలకు దిగింది. తాజాగా బుచా పట్టణంలో రష్యా మిలటరీ చేసిన మారణకాండతో ఆ దేశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం బోనులోకి ఎక్కించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అయితే రష్యా మాత్రం బుచాలో తాము జరిపింది మిలటరీ ఆపరేషనేనని ఉక్రెయిన్ చూపిస్తున్న ఫొటోలు, వీడియోలు అన్నీ ఉక్రెయిన్ కవ్వింపు చర్యల్లో భాగమేనని ఎదురుదాడి చేస్తోంది. యుద్ధ నేరాలు అంటే ..? ఆయుధ బలం ఉంది కదాని ఒక దేశం ఇష్టారాజ్యంగా మరో దేశాన్ని నాశనం చేస్తామంటే కుదరదు. బలవంతుడి చేతిలో బలహీనులు బలికాకుండా ఉండడం కోసం 19వ శతాబ్ది ప్రారంభంలోనే అంతర్జాతీయ మానవతా చట్టం ద్వారా కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధ నేరాలపై ప్రపంచ దేశాలు విస్తృతంగా చర్చించి ఒక అవగాహనకి వచ్చాయి. 1949 ఆగస్టు 12న జరిగిన జెనీవా ఒప్పందం యుద్ధ నేరాల గురించి స్పష్టతనిచ్చింది. వివిధ ఒడంబడికల ఆధారంగా యుద్ధ నేరాలుగా వేటిని పరిగణించాలో యూఎన్ సభ్యదేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం యుద్ధ నేరాలంటే.. ► యుద్ధంలో పాల్గొనని పౌరుల్ని ఉద్దేశపూర్వకంగా చంపడం ► సాధారణ పౌరుల్ని హింసించడం, గాయపరచడం, వారిపట్ల అమానవీయంగా ప్రవర్తించడం ► ఆసుపత్రులు, స్కూళ్లు, ప్రార్థనాలయాలపై దాడులు జరపడం ► పౌరుల్ని బందీలుగా పట్టుకోవడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం. యుద్ధప్రభావం పౌరులపై పడేలా ధ్వంసం సృష్టించడం ► కొన్ని రకాల మారణాయుధాలు, రసాయన బాంబుల్ని వాడడం ఇవన్నీ యుద్ధ నేరాలుగానే పరిగణిస్తారు. యుద్ధ నేరాలకు సంబంధించి జెనీవా ఒప్పందంలో ఉన్నవన్నీ తమకు సమ్మతమేనని 1954లోనే నాటి సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్) అంగీకరించింది. 2019లో కూడా రష్యా ఈ ఒప్పందాలకు కట్టుబడి ఉంటామనే స్పష్టతనిచ్చింది. యుద్ధనేరాల కేసు ముందుకెళుతుందా ? రష్యా మిలటరీ లేదంటే ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై యుద్ధ నేరాల కేసుని ముందుకు తీసుకువెళ్లడం అంత సులభం కాదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో నేరారోపణల్ని నమోదు చేయడానికే కనీసం మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది. ఉక్రెయిన్ నుంచి యుద్ధ నేరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించడం అంత సులభంగా జరిగే అవకాశం లేదని హార్వార్డ్ లా స్కూల్ ప్రొఫెసర్ అలెక్స్ వైటింగ్ అభిప్రాయపడ్డారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటోలు, వీడియోలు వంటి ఆధారాలు సేకరించినప్పటికీ ఆ మారణకాండకి ఆదేశాలు ఇచ్చిన నాయకులెవరని రుజువు చేయడం సులభం కాదన్నారు. అందుకే నేరారోపణలు నమోదైన తర్వాత కూడా విచారణకు ఏళ్లకి ఏళ్లు పట్టే అవకాశం ఉంది. నెదర్లాండ్స్‌లోని ద హేగ్ కేంద్రంగా పనిచేసే స్వతంత్ర సంస్థ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) యుద్ధనేరాలు, మారణకాండలు, ఊచకోతలపై విచారణ జరుపుతూ ఉంటుంది. ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ గత నెలలోనే రష్యా యుద్ధనేరాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఐసీసీలో 123 దేశాలకు సభ్యత్వం ఉన్నప్పటికీ రష్యా, ఉక్రెయిన్ సభ్య దేశాలు కాదు. రష్యా ఐసీసీని కనీసం గుర్తించలేదు సరికదా ఆ కోర్టు విచారణకు సహకరించకూడదని నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఏర్పాటైన దగ్గర్నుంచి యుద్ధ నేరాలకు సంబంధించి 30 కేసుల్ని విచారించింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
అంతర్జాతీయ నిబంధనలను కొన్ని దేశాలే నిర్దేశించలేవు
బీజింగ్: డ్రాగన్ దేశం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అగ్రరాజ్యం అమెరికాపై మరోసారి పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన అంతర్జాతీయ చట్టానికి ప్రపంచ దేశాలన్నీ ఎలాంటి మినహాయింపులు లేకుండా కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ నిబంధనలను ఏవో కొన్ని దేశాలు నిర్దేశించలేవని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి అధికారాన్ని అందరూ ఆమోదించాలని, సమితి పట్ల నిబద్ధులై ఉండాలని హితవు పలికారు. చైనాను ఒక దేశంగా ఐక్యరాజ్యసమితి గుర్తించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రత్యేక సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడారు. అంతర్జాతీయ నిబంధనలను ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలు మాత్రమే కలిసికట్టుగా రూపొందిస్తాయని అన్నారు. ఇందులో మరో మాటకు తావు లేదని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు లేదా కొన్ని దేశాల కూటములు ఈ పని చేయలేవని పరోక్షంగా అమెరికాకు చురక అంటించారు. సమితిని గౌరవించాలని ప్రపంచ దేశాలకు జిన్‌పింగ్ సూచించారు. సమితిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకు దూరంగా ఉండాలని అన్నారు. -
తొడలు కొడుతూ, భుజాలు చరుస్తూ..
‘వాడు స్టేజీ ఎక్కితే జోకర్.. స్టేజీ దిగిన తర్వాత బ్రోకర్’.. మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు. ‘అరే సాలే.. గూట్లే.. లఫంగ.. ఇద్దరమూ పదవులకు రాజీనామా చేద్దాం’ అంటూ రేవంత్‌కు మంత్రి మల్లారెడ్డి తొడలు కొట్టి సవాల్, దూషణలు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార, విపక్ష నేతల నడుమ దూషణల పర్వం పరాకాష్టకు చేరుకుంది. ప్రభుత్వం, పార్టీల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు స్వయంగా తిట్ల దండ కం అందుకుంటుండటంతో.. వారి అనుచరులు మీడియా సమావేశాలు, సోషల్ మీడియా వేదికగా ఏకంగా బూతు పురాణం అందుకుంటున్నారు. ఓ వైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక వాతావరణం, మరోవైపు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ క్షేత్రస్థాయిలో చేపడుతున్న సభలు, సమావేశాలు, యాత్రలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్త రాజకీయ శక్తులు వైఎస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, తీన్మార్ మల్లన్న వంటి వారు కూడా ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. పార్టీతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ఖండించేందుకు టీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా మీడియా ముం దుకు రావడంలో పోటీపడుతున్నారు. అయితే వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ఉపయోగిస్తున్న భాష హద్దులు దాటి బూతులు మాట్లాడే దశకు చేరుకుంటోంది. టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల ఏర్పాటు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’తో రాబోయే రోజుల్లో పరస్పర విమర్శలు, ఆరోపణలు తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వింగ్‌లతో పరాకాష్టకు... అన్ని రాజకీయ పక్షాలు తమ కార్యకలాపాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు వాట్సాప్ గ్రూప్ లు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల మీద ప్రత్యేక ఖాతాలు తెరుస్తు న్నాయి. గ్రామస్థాయి నుంచే సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వార్తా పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చే వార్తలు, చర్చలు, ప్రసంగాల్లో తమకు అనువైనవి, ఎదుటి వారిపై చేసే విమర్శల్లో కొన్నింటిని ఎంపిక చేసుకుని నేతల అనుచరులు, కార్యకర్తలు పోస్ట్ చేస్తున్నారు. వీటిపై వచ్చే కామెంట్లు కూడా చెప్పలేని రీతిలో ఉంటున్నాయి. అదే రీతిలో సమాధానం ఇవ్వకపోతే వెనకబడి పోతామనే ఉద్దేశంతో అలా స్పందించాల్సి వస్తోందని అధికార పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. ‘న్యూటన్ సూత్రం ప్రకారం.. చర్యకు ప్రతిచర్య తప్పదు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తోంది. విమర్శలు సంస్కారవంతంగా ఉండాలి. ఏడేండ్లుగా ఓపిక పట్టిన మా కార్యకర్తలకూ సహనం నశించింది’ అని శుక్రవారం ప్రెస్మీట్లో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు పా ర్టీలు, నేతలతో సంబంధం లేకుండా ‘అరేయ్.. ఒరేయ్’అంటూ ఏకవచనంతో వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేసే వ్యాఖ్యలు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి ఉదంతంతో పరాకాష్టకు చేరాయి. ఇక తొడలు కొడుతూ, భుజాలు చరుస్తూ మంత్రి మల్లారెడ్డి ప్రదర్శించిన హావభావాలు, దూషణల పర్వాన్ని తర్వాతి దశకు తీసుకెళ్లాయి. ఈ ఉదంతంపై సామా జిక మాధ్యమాలు, ఇతర వేదికల మీద జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయా పార్టీల కార్యకర్తలు, నేతల అనుచరులు, అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న పోస్టులు మరీ దారుణంగా ఉంటున్నాయి. రాయ లేని, చెప్పలేని భాషలో ఆడ, మగ తేడా లేకుండా తిట్ల దండకం అందుకుంటున్నారు. ఇటీవలి కాలంలో రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి మల్లారెడ్డి, పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గ్యాదరి కిషోర్, మైనంపల్లి హన్మంతరావు, కాంగ్రెస్ నేతలు అద్దంకి దయా కర్, దాసోజు శ్రావణ్, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నాయకుడు రాకేశ్‌రెడ్డి తదితరులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట పడకపోతే రాబోయే రోజుల్లో విమర్శల పర్వం దాడుల పర్వానికి దారి తీసే అవకాశముందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ‘గతంలో సున్నిత అంశాల మీద సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు తీవ్ర విధ్వంసానికి దారితీసిన ఘటనలున్నాయి. రాజకీయ నాయకులు కూడా ఆరోపణలు, విమర్శల విషయంలో సంయమనం పాటించకపోతే భౌతిక దాడులు, ఘర్షణలకు దారి తీసే ప్రమాదం పొంచి ఉందని’ఓ సీనియర్ పోలీసు అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. -
బీజేపీ, ఆరెస్సెస్‌లతో భారత్‌కు ప్రమాదం
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే) శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్‌లపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆరెస్సెస్‌ల విధానం మొత్తం భారత్‌కే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ, ఆరెస్సెస్‌ల సైద్ధాంతిక విధానంతో మొత్తం భారత్‌కే ముప్పు కలుగుతుంది. వారు ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చేసుకోరు. వారు క్రిస్టియన్లను, సిఖ్‌లను, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను కూడా తమ వేధింపులకు లక్ష్యంగా చేసుకుంటారు. ఎందుకంటే ఈ వర్గాలను వారు తమతో సమానులుగా భావించరు’ అని ఇమ్రాన్ విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్‌లో కశ్మీరీలపై వేధింపులు మరింత పెరిగాయన్నారు. అన్ని అంతర్జాతీయ వేదికలపై తాను కశ్మీరీల తరఫున బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్నానన్నారు. కశ్మీరీల న్యాయమైన పోరాటంలో పాకిస్తాన్ వారికి తోడుగా ఉంటుందన్నారు. జులై 25న పీఓకేలో ఎన్నికలు జరగనున్నాయి. -
సోషల్ మీడియాలో డిలీట్ చేశాం అనుకోకండి, స్క్రీన్ షాట్స్ కూడా సాక్ష్యమే
‘సరేలే బోండాం’ ‘నువ్వూ నీ తారుడబ్బా ముఖమూ’ ‘ఉఫ్పున ఊదితే ఎగిరిపోతావ్’ ఎవరినైనా ఉద్దేశించి ఇలా బాడీ షేమింగ్ చేయడం నేరం. సోషల్ మీడియాలో చేస్తే ఎవరు పట్టించుకుంటారు అనుకోవచ్చు. కాని కోలకతా నటి శ్రుతి దాస్ పోలీస్ కంప్లయింట్ పెట్టింది. రంగు నలుపు అంటూ ఆమె పై చేసే వ్యంగ్య వ్యాఖ్యల స్క్రీన్ షాట్స్ ఇప్పుడు పోలీసుల దగ్గరకు చేరాయి. మీ మిత్రులు ఇలాంటి కూతలు కూస్తుంటే మీరు హెచ్చరించాల్సిన సమయం వచ్చేసింది. హేళన చేయడం ద్వారా మనిషి కొంత ఆనందం పొందుతాడు. అయితే ఆ ఆనందం వికృత స్థాయికి చేరుకుంటే ఏం చేయాలి? హేళన ద్వారా మనిషిని బాధించడం, హాస్యం పుట్టించడం ఇవాళ చాలా వ్యాపారం అయిపోయింది. టీవీలలో వస్తున్న చాలామటుకు కామెడీ షోలు స్త్రీలను, వారి రూపాలను, వారి నడవడికను, లైంగిక ప్రవర్తనలను హేళన చేసేవే. బాడీ షేమింగ్ (శరీర అవయవాలను అవమానించడం), కలరిజం (శరీర వర్ణాన్ని బట్టి కామెంట్ చేయడం) నిజానికి ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఆ సంగతి తెలియక చాలామంది సోషల్ మీడియాలో విమర్శ పేరుతో హేళన చేస్తున్నారు. అలాంటి వారు ఇబ్బందుల్లో పడక తప్పదని కోలకటాలో తాజా ఘటన నిరూపించింది. అక్కడి టీవీ నటి శ్రుతి దాస్ తన రంగు తక్కువ అంటూ హేళన చేస్తున్న వారిపై కేసు పెట్టింది. ఏం జరిగింది? కోల్కటాలో టీవీ నటిగా ఉన్న శ్రుతి దాస్ గత రెండు సంవత్సరాలుగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన ‘త్రినయని’ అనే టీవీ సీరియల్ హిట్ అయ్యింది. ‘నేను ఆ సీరియల్ దర్శకుడితో అనుబంధంలో ఉన్నాను. కాని సోషల్ మీడియాలో ఆ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నా రంగు గురించి ప్రస్తావన చేస్తూ నన్ను హేళన చేస్తున్నారు’ అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగాల్లో నల్లగా ఉన్నవారిని ‘కాలో’(నల్లది), ‘మోయిలా’ (మాసినది) అని హేళన చేసేవాళ్లుంటారు. విమర్శ చేయాలంటే ఏ పాయింట్ లేనప్పుడు ఇలా రంగునో రూపాన్నో ప్రవర్తననో ముందుకు తెచ్చి కామెంట్ చేసి బాగా అన్నాం అని చంకలు గుద్దుకుంటారు కొందరు. కాని అలాంటివారిని వదిలేది లేదని ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. స్క్రీన్ షాట్స్ కూడా సాక్ష్యమే సోషల్ మీడియాలో మనం ఏదైనా కామెంట్ చేస్తే దానికి శిక్షలు పడవనుకుంటే పొరపాటు. బాధింపబడినవారు పోలీస్ కంప్లయింట్ చేస్తే అలాంటి వారిని వెంటనే చట్టపరంగా శిక్షించడానికి కేసు నమోదు అవుతుంది. కొందరు కామెంట్ చేసి ఆ తర్వాత దానిని డిలీట్ చేయవచ్చు. కాని ఈలోపు ఆ బాధితులు ఆ కామెంట్‌ను స్క్రీన్ షాట్స్ తీసుకుంటే అవి కూడా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. హేళన కూడా ఒక అణచివేత సాధనమే. ఎదుటివారిని అణచివేయడానికి హేళనను ఆయుధంగా వాడుతారు. కాని అలాంటి రోజులు పోయాయి. స్త్రీలను, వృద్ధులు, వికలాంగులను, ఇంకా ఎవరినైనా గాని రూపాన్ని బట్టి, భాషను బట్టి, రంగును బట్టి, నేపథ్యాన్ని బట్టి హేళన చేస్తే, మనసు గాయపరిస్తే, అగౌరవపరిస్తే వారంతా చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ‘కాళీ మాత కూడా నల్లగానే ఉంటుంది. ఆమెను కొలుస్తాం మనం. కాని హేళన సమయంలో మాత్రం ఎదుటివారిని నల్లగా ఉన్నారని అంటాం. ఇది ఎంత తప్పో అందరూ ఆలోచించాలి’ అని శ్రుతి దాస్ అంది. ‘నలుపు నారాయణమూర్తే గాదా’ అని ఒక దేశీయగీతం ఉంది. ఏ రంగైనా ప్రకృతి దృష్టిలో ఒకటే. సంస్కారలోపం ఉన్నవారే వర్ణఅంతరాన్ని చూస్తారు. -
ఎంత ఏడ్వాలో మనకు ఇంకా ఎంతకాలం చెబుతారు
ఎంత ఏడ్చినా ఇంటి దగ్గరే ఏడ్వాలి. ఎంత మొత్తుకున్నా హాస్పిటల్ దగ్గరే మొత్తుకోవాలి. చివరి యాత్ర మొదలుకాక ముందే స్త్రీల అనుబంధం ముగుస్తుంది మన సమాజంలో. అంతిమ సంస్కారాలలో పాల్గొనే హక్కు ఆమెకు లేదా? నటి మందిరా బేడీ తన భర్త అంతిమ సంస్కారాల్లో పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి. దానికి జవాబూ చెబుతున్నారు. అంతిమ వీడ్కోలు చెప్పే హక్కు స్త్రీలకు ఎందుకు లేదు అనేది ఇప్పుడు ప్రశ్న. 2018లో వారణాసిలో ఒక ఘటన జరిగింది. ఆ ఊళ్లో నివాసం ఉండే 95 ఏళ్ల సంతోరి దేవి కొన ఊపిరితో ఉండగా తాను మరణించాక అంతిమ సంస్కారాలు కుమార్తె పుష్పవతి పాటిల్ చేయాలని కోరింది. అంతే కాదు తన బంధువుల్లోని స్త్రీలే అంతిమ సంస్కారాల్లో పాల్గొనాలని చెప్పింది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక్క కూతురు పుష్పవతి పాటిల్. ఇద్దరు కొడుకులు ఉన్నా కూతురే ఎందుకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలి అనంటే ‘మగవాళ్లకే ఆ హక్కు ఉండటం నాకు ఇష్టం లేదు’ అని ఆ పెద్దావిడ చెప్పింది. ఆమె పిల్లలను అబ్బాయి అమ్మాయి అనే తేడా లేకుండా పెంచింది. అందుకే మరణించాక కూతురే దహన కర్మలు నిర్వహించింది. సోదరులు అందుకు మద్దతుగా నిలిచారు. ఈ వార్త గొప్ప ప్రచారం పొందింది. దక్షణాదిలో కూడా రెండు మూడు సందర్భాలలో కూతుళ్లే చితి మంట పెట్టడం వంటి వార్తలు వచ్చాయి. ఇటీవల కరోనా సమయంలో తండ్రి పాడెను మోసిన కుమార్తెల చిత్రాలు వచ్చాయి. దుఃఖ సమయంలో ఎవరి దుఃఖ ప్రకటన వారిదిగా ఉంటుంది. కొందరు తమ వారిని చిట్టచివరి క్షణం వరకూ చూసుకోవాలని అనుకోవచ్చు. దగ్గరగా ఉండి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే వారి ఆత్మలు సంతృప్తి పడతాయి అనుకోవచ్చు. లేదా తమకు శాంతి అనుకోవచ్చు. అది వ్యక్తిగతం. కాని అది సామాజికం అని ఇతరుల స్పందన వల్ల తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మందిరా బేడి విషయంలో అదే అయ్యింది. భర్త అంతిమ సంస్కారాల సమయంలో .. నువ్వు వెళ్లకుండా ఉండాల్సింది... నటి మందిరా బేడీ భర్త, దర్శకుడు అయిన రాజ్ కౌశల్ జూన్ 30న 49 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించాడు. ఇలాంటి సంఘటన ఎవరికైనా చాలా పెద్ద విషాదమే. మందిరా బేడికి ఇద్దరు సంతానం. ఆ దంపతులు ఆ సంతానంతో దిగే ఫొటోలు, పిల్లల గురించి మందిరా చెప్పే విశేషాలు సోషల్ మీడియా ద్వారా అభిమానులు చూస్తూనే వచ్చారు. అలాంటిది సడన్‌గా భర్త చనిపోవడం చాలా పెద్ద షాక్‌కు గురి చేసి ఉంటుంది మందిరాకు. ఆమె భర్త అంతిమ సంస్కారాల్లో పాల్గొంది. పాడె ముందు నిప్పుకుండ పట్టుకుని నడిచింది. చితి మండే వరకూ దహనవాటికలోనే ఉంది. అయితే ఈ ఫొటోలు ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చాయో విమర్శలు మొదలయ్యాయి నువ్వు వెళ్లకుండా ఉండాల్సింది అని. ఆ బట్టలు ఏమిటి? ‘స్త్రీలు దుఃఖాన్ని నిభాయించుకోలేరు... అంతిమ సంస్కారాలు చూడలేరు... ఆ సమయంలో వారు పాల్గొంటే చనిపోయిన వారి ఆత్మకు సద్గతి లభించదు’... అని కామెంట్లు వచ్చాయి. సరే.. అవి సంప్రదాయవాదుల కామెంట్లు అనుకున్నా కొందరు ఇంకాస్త ముందుకెళ్లి ఆ బట్టలేమిటి అని కూడా అన్నారు. ఆ సమయంలో మందిర జీన్స్ ప్యాంట్, వైట్ టాప్ వేసుకుని ఉండటమే ఇందుకు కారణం అట. స్త్రీలు వెళ్లడానికి అనుమతి లేని చోట వెళ్లకపోవడమే కరెక్ట్ అని విమర్శలు వచ్చాయి. ఆ మాట చెప్పడానికి మీరెవరు? అయితే మందిరా మీద ఇలాంటి అటాక్ మొదలైన వెంటనే మహిళా వాదులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. స్త్రీలు ఎలా దుఃఖపడాలో, ఏ మేరకు దుఃఖ పడాలో, ఆప్తుల మరణంలో ఏ చర్యలు చేయాలో చేయకూడదో మగవాళ్లు ఎంత కాలం డిసైడ్ చేస్తారు అని వారు ప్రశ్నిస్తున్నారు. గాయని సోనా మహాపాత్ర, టీవీ యాంకర్ మిని మాథుర్ వీరిలో ఉన్నారు. ‘దుఃఖంలో ఉన్న స్త్రీని అనడానికి వీరెంత బుద్ధిలేనివారో అనిపిస్తోంది’ అని వారు అన్నారు. టెలివిజన్ నటి శ్వేతా తివారి అయితే ‘మందిరా... మేము నిన్ను చూసి గర్విస్తున్నాం’ అని వ్యాఖ్యానించింది. డాన్సర్ ముక్తి మోహన్ ‘మానవాళిలో సగం మనం. కాని ఇప్పటి వరకూ ఈ సగానికి సరైన మర్యాద, గౌరవం దక్కలేదు. మనల్ని మనమే దెబ్బ తీసుకున్నాం. అందరూ ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకోవాలి. మనం ఎంత ఏడ్వాలో మనకు ఇంకా ఎంతకాలం చెబుతారు’ అని వ్యాఖ్యానించింది. కొరివి పెట్టే కొడుకు పుట్టాలనుకునే రోజులు పోయి ఒక్క అమ్మాయి పుడితే సంతోషపడి బాగా పెంచుకుందాం అనుకుని ఆపరేషన్ చేయించుకున్నవారు పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక్క అమ్మాయి ఉన్న ఇంటికి ఉన్న అంగీకారం ఆ ఒక్క అమ్మాయో లేదా భార్యో ఇటువంటి సందర్భాల్లో ఇది తన కర్తవ్యం అనుకుంటే అంగీకరించాల్సిన వాతావరణం ఏర్పడాల్సి ఉంది. స్త్రీలు ఏర్పరిచేలానే ఉన్నారు. -
బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి... తీవ్ర ఆందోళనకరం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి మరింతగా రాజుకుంది. గవర్నర్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని, పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిపోయిందని గవర్నర్ జగదీప్ ధన్కర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఎన్నో హత్యలు, అత్యాచారాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఎన్నికల తర్వాత ప్రతీకారంలో భాగంగా కొనసాగుతున్న హింసను అరికట్టేందుకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని, ఈ నెల 7న (సోమవారం) తన ఎదుట స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని బెంగాల్ చీఫ్ సెక్రటరీ హెచ్‌కే ద్వివేదీని గవర్నర్ ఆదేశించారు. బెంగాల్లో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు పోలీసు యంత్రాంగాన్ని సైతం వాడుకుంటున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో హింసాకాండ వల్ల లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినవారు బాధితులుగా మారుతున్నారని అన్నారు. అరాచక శక్తులు అమాయక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తృ బెంగాల్లో ప్రజాస్వామ్య విలువలను పట్టపగలే కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. -
నారీ నారీ నడుము లొల్లి
‘దక్షిణాదివాళ్లకు నడుము భాగం అంటే పిచ్చి’ అనే అర్థం వచ్చేట్లు ఓ ఇంటర్వ్యూలో అన్నారు పూజా హెగ్డే. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో హీరో తన కాళ్లను చూడటం గురించిన చర్చలో భాగంగా వచ్చిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ‘నాకైతే ఎవరైనా నా కాళ్లు చూస్తే బావుణ్ణు అనుకుంటాను కానీ నడుము కాదు’ అనే ఉద్దేశంలో పూజ మాట్లాడారు. అయితే ఈ మాటలకు సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారామె. ‘సౌత్‌లో పాపులారిటీ పొంది, ఈ ఇండస్ట్రీ గురించే ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు. చాలామంది హీరోయిన్లు ఈ విధంగానే చేస్తున్నారు’ అని నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే, దానికి అంతగా విమర్శించాల్సిన పని లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీలు మాట్లాడే మాటలు, వాళ్ల అభిప్రాయాలు వెంటనే విమర్శలకు గురవుతున్న కాలం ఇది. ఏ మాట ఎటు దారి తీస్తుందో ఊహించలేం. అందుకే సెలబ్రిటీలు మాట్లాడే ముందు కాస్త జాగ్రత్తపడలేమో. -
ట్రంప్ క్యాంపులో చీలికలు?
వాషింగ్టన్: అధికారం చేపట్టినప్పటి నుంచి తరచూ వివాదాల్లో చిక్కుకుపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియపై విచ్చలవిడి విమర్శలకు దిగడం, కౌంటింగ్ ప్రక్రియ నిలిపివేతకు న్యాయస్థానాల్లో కేసులు, కౌంటింగ్ సాగుతూండగానే తాను గెలిచినట్లుగా ప్రకటించుకోవడం వంటి వాటిపై రిపబ్లికన్ పార్టీ నేతలు పలువురు గుర్రుగా ఉన్నారు. దీంతో ట్రంప్ చర్యలకు పార్టీ తరఫు నుంచి తగిన మద్దతు లేదు సరికదా.. రిపబ్లికన్ల నేతగా మరోసారి ఎన్నుకునే అవకాశాలూ మృగ్యమవుతున్నాయి. సెనేట్‌లో ట్రంప్ మద్దతుదారుగా ఇప్పటివరకూ వ్యవహరించిన మిచ్ మెక్కానెల్ ఇప్పటికే ఓట్ల లెక్కింపు జరుగుతూండగానే గెలిచినట్లు ట్రంప్ ప్రకటించడాన్ని పరోక్షంగా ఆక్షేపించారు. ‘‘గెలిచానని చెప్పుకోవడం వేరు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడం వేరు’’అని కెంటకీ నుంచి గెలుపొందిన మిచ్ స్పష్టం చేశారు. ట్రంప్‌పై తమ వ్యతిరేకతను స్పష్టం చేసిన వారిలో మిచ్ ఒక్కరే లేరు. ఫ్లారిడా సెనేటర్, ఇటీవలే ట్రంప్ ర్యాలీలో ప్రసంగాలు చేసిన మార్కో రూబియో ట్విట్టర్ వేదికగా ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం చెప్పుకోవాల్సిన అంశం. ‘‘చట్టబద్ధంగా పోలైన ఓట్ల లెక్కింపులో జాప్యం జరగడం మోసం కాదు’’అని ట్వీట్ చేశారు. చట్టబద్ధ ఓట్లు లెక్కిస్తే నాదే గెలుపు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. చట్టబద్ధమైన ఓట్లనే లెక్కిస్తే తనదే గెలుపన్నారు. వైట్‌హౌస్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో నిజాయతీగా గెలవలేరని డెమొక్రాట్లకు తెలుసు. అందుకే భారీగా అవకతవకలకు, అక్రమాలకు పాల్పడ్డారు. లక్షలాదిగా గుర్తు తెలియని మెయిల్ ఇన్ ఓట్లు వేయించారు. దీనికి సంబంధించి నా దగ్గర చాలా ఆధారాలున్నాయి’ అని తెలిపారు. నిజాయతీతో కూడిన ఎన్నికలు, నిజాయతీతో కూడిన లెక్కింపు కోరుకుంటున్నామన్నారు. ‘చట్టబద్ధ ఓట్లు లెక్కిస్తే తేలిగ్గా గెలుపు సాధిస్తా. అక్రమ ఓట్లను లెక్కిస్తే ఫలితాలను తారుమారు చేస్తున్నట్లే. ఆలస్యంగా వచ్చిన ఓట్లను లెక్కించాలనుకుంటే మేం ప్రతిఘటిస్తాం. కానీ, చాలా ఓట్లు ఆలస్యంగా వచ్చాయి’ అని ట్రంప్ అన్నారు. ఎన్నికల ఫలితాల విశ్లేషకులు, ప్రముఖ టెక్ సంస్థలు, మీడియా.. డెమొక్రాట్ల పక్షాన నిలబడి ఓటర్లను మభ్యపెట్టాయని ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ప్రసారం చేయని ఏబీసీ, సీబీఎస్, ఎన్బీసీ శ్వేతసౌధంలో ట్రంప్ మీడియా సమావేశాన్ని ఏబీసీ, సీబీఎస్, ఎన్బీసీ వంటి వార్తా చానళ్లు పట్టించుకోలేదు. ట్రంప్వ్యాఖ్యలపై సీఎన్ఎన్కు చెందిన ఆండర్సన్ కూపర్.. తన సమయం ముగిసిందని తెలిసి వెనక్కి తిరిగి వెళ్తున్న ఊబకాయం తాబేలు వంటి వాడంటూ ట్రంప్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అక్రమాలు జరగలేదని అందరూ భావిస్తుండగా ట్రంప్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తుండటం వల్లే ఆ సమావేశాన్ని తాము ఆపేశామని ఎన్బీసీకి చెందిన లెస్టర్ హోల్ట్ చెప్పారు. భారీగా దొంగ ఓట్లు పడ్డాయనేందుకు ఎలాంటి సూచనలు కనిపించడం లేదని, ఇది ట్రంప్ చేస్తున్న ఆరోపణ అని సీబీఎస్ కరస్పాండెంట్ నాన్సీ కోర్డెస్ చెప్పారు. అధ్యక్షుడు చేస్తున్న తప్పును సరి చేసేందుకే తాము ట్రంప్ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదని ఎంఎస్ఎన్బీసీ వ్యాఖ్యాత బ్రియాన్ విలియమ్స్ అన్నారు. ‘మాకు తెలిసినంత వరకు చట్ట విరుద్ధమైన ఓట్లు ఏమీ లేవు. మాకు తెలిసిన ప్రకారం ట్రంప్‌కు గెలుపు కూడా లేదు అని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జాప్యం అవుతుండటంతో ట్రంప్ అసహనంతో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. -
యూపీ నిర్భయ పట్ల అమానవీయం
హథ్రాస్/లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ‘నిర్భయ’ ఘటన బాధితురాలి పట్ల అధికార యంత్రాంగం మరోసారి అమానవీయంగా వ్యవహరించింది. ఢిల్లీ ఆస్పత్రిలో మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచిన ఆ దళిత యువతి(19)కి అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు జరిపించింది. అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ పోలీసులు తమను బలవంతపెట్టారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. తాజా పరిణామంపై రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితురాలు అయినందున బాధితురాలి పట్ల మరణంలోనూ క్రూరంగా వ్యవహరించిందని మండిపడ్డాయి. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా హడావుడిగా అంత్యక్రియలు ముగించడంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. కుటుంబసభ్యుల కోరిక మేరకే అంత్యక్రియలు జరిపించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ బృందం(సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వారంలోగా దర్యాప్తు పూర్తి చేయించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ యూపీ సీఎంకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సీఎం యోగి బుధవారం ఉదయం బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. అర్థరాత్రి జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రాస్ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన దళిత యువతిపై 15 రోజుల క్రితం అగ్ర వర్ణానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, పాశవికంగా వ్యవహరించారు. ఆ యువతి చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చనిపోయింది. రాత్రి సమయంలో ఆస్పత్రి నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు వెంటరాగా బాధితురాలి మృతదేహాన్ని తీసుకుని కుటుంబసభ్యులు అక్కడికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న హథ్రాస్ జిల్లాలోని సొంతూరుకు చేరుకున్నారు. అప్పటికి అర్ధరాత్రి 2.30 గంటలైంది. అధికారులు, పోలీసుల సమక్షంలో అప్పటికప్పుడే దహన సంస్కారాలు జరిపించారు. ఆ సమయంలో మృతురాలి తండ్రితోపాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిపి సుమారు 40 మంది శ్మశానవాటికలో ఉన్నారని ఆమె కుటుంబసభ్యుడొకరు చెప్పారు. మీడియా సభ్యులు దరిదాపుల్లోకి రాకుండా ప్రత్యేక పోలీసు దళాన్ని కూడా రంగంలోకి దించారు. ‘నా కూతురికి అర్థరాత్రి దాటిన తర్వాత 2.30–3 గంటల సమయంలో అంత్యక్రియలు జరిగాయి’ అని ఆమె తండ్రి తెలిపారు. ‘మా నాన్న ఢిల్లీ ఆస్పత్రి నుంచి హథ్రాస్‌కు చేరుకున్న వెంటనే పోలీసులు మా ఇంటికి వచ్చారు. మా నాన్నను బలవంతంగా తమతోపాటు శ్మశానవాటికకు తీసుకెళ్లారు’ అని బాధితురాలి సోదరుడు తెలిపారు. తాము గ్రామానికి చేరుకోకమునుపే పోలీసులు మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారని ఓ కుటుంబసభ్యుడు ఆరోపించారు. తీవ్ర విమర్శలు హత్యాచారానికి దారి తీసిన పరిస్థితులు, అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు జరిపించడంపై వివిధ ప్రతిపక్షపార్టీలు, వామపక్షాలు, కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఖరిపై ఢిల్లీలోని యూపీ భవన్ ఎదుట ఆందోళనకు దిగాయి. దీంతో వారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా తెలిపారు. తన కూతురికి న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. ‘బాధితురాలికి, ఆమె కుటుంబానికి మీ ప్రభుత్వం భద్రత కల్పించలేక పోయింది. మరణంతో సహా ఆమెకున్న అన్ని హక్కులను హరించింది. ముఖ్యమంత్రిగా కొనసాగడానికి మీకు ఎలాంటి నైతిక హక్కు లేదు. రాజీనామా చేయండి’ అంటూ ప్రియాంక ట్విట్టర్లో సీఎం యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. సాక్ష్యాలను చెరిపేసేందుకు పోలీసులు అర్థరాత్రి అంత్యక్రియలు జరిపారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ ఆరోపించారు. కోల్‌కతాలో యూపీ సీఎం కటౌట్ దహనం -
మొదలైన మాటల యుద్ధం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందస్తుగా సాగే ప్రెసిడెన్షియల్ డిబేట్లలో తొలి డిబేట్ బుధవారం హోరాహోరీగా జరిగింది. రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల తరఫు అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ఒకే వేదికపై చేరి పలు అంశాలపై వైఖరిని వెల్లడించారు. డిబేట్లో ఒక దశలో పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఈ డిబేట్లను ఉపయోగించుకుంటారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకం, పెరుగుతున్న జాత్యహంకార ధోరణులు, వాతావరణ ఒప్పందాలు, పన్నులు, కరోనా అంశాలపై వీరు తమ వైఖరులను తెలియజేస్తూ ప్రత్యర్థిపై విమర్శలు గుప్పించారు. ఒకరు మాట్లాడుతుండగా మరొకరు అడ్డు రావడం వంటివి జరిగాయి. వారిని సముదాయించి చర్చను సజావుగా సాగించేందుకు వ్యాఖ్యాత క్రిస్ వాలెస్ చెమటోడాల్సివచ్చింది. కరోనా కారణంగా వారు షేక్‌హ్యాండ్ చేసుకోలేదు. కానీ, మాస్కు కూడా ధరించలేదు. ఎన్నికలకు 35 రోజులుండగా, ఒపీనియన్ పోల్స్‌లో ట్రంప్ కాస్త వెనుకంజలో ఉన్నారు. బైడెన్‌కు సైతం పెద్దగా మద్దతేమీ కనిపించడం లేదు. దీంతో డిబేట్ల ద్వారా జనాన్ని ఆకట్టుకోవాలని వారు భావిస్తున్నారు. చర్చలో రెండు మార్లు భారత్ ప్రస్తావన తెచ్చారు. కరోనా మరణాల సంఖ్య చెప్పని దేశాల్లో భారత్ ఒకటన్నారు. కర్బన ఉద్గారాల విషయంలో చైనా, భారత్‌పై కట్టడి లేదన్నారు. ఇండో అమెరికన్ల మిశ్రమ అభిప్రాయం తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌పై ఇండో అమెరికన్ల అభిప్రాయం మిశ్రమంగా ఉంది. ట్రంప్‌నకు ఎదురులేదని రిపబ్లిక్ పార్టీ సమర్థక ఇండో అమెరికన్లు అభిప్రాయపడగా, బైడెన్ విజయవంతంగా డిబేట్‌ను గెలిచారని డెమొక్రాటిక్ పార్టీ సమర్థ కులు భావిస్తున్నారు. ట్రంప్ డిబేట్లో బైడెన్‌ను చితక్కొట్టాడని ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ ప్రతినిధి ఆల్మాసన్ అభిప్రాయపడ్డారు. డిబేట్ వ్యాఖ్యాత డెమొక్రాట్లకు మద్దతుగా ఉన్నారని కాలిఫోర్నియా అటార్నీ, రిపబ్లికన్ నేత హర్మీత్ థిల్లాన్ విమర్శించారు. రాబోయే రోజుల్లో ఇలాంటివారు డిబేట్లో పాల్గొనకుండా చూడాలని సొంత పార్టీ నేతలను కోరారు. ట్రంప్ మరోమారు అధ్యక్ష పదవికి అనర్హుడని బైడెన్ నిరూపించారని సౌత్ఏసియన్స్ ఫర్ బైడెన్ ప్రతినిధి నేహా దివాన్ చెప్పారు. ట్రంప్ తప్పిదాలను బైడెన్ సరిదిద్దగలనని నిరూపించారని అజయ్ జైన్ చెప్పారు. -
‘క్వీన్’కు కేంద్రం రక్షణ!
న్యూఢిల్లీ: సినీనటి కంగనా రనౌత్‌కు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీలో ఉన్నవాళ్లకు దాదాపు పదిమంది కమాండోలు రక్షణగా ఉంటారు. తనకు రక్షణ కల్పించడంపై కంగన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. దేశభక్తులను ఎవరూ తొక్కేయలేరని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయంపై శివసేన, కాంగ్రెస్‌లు విమర్శలు గుప్పించాయి. రెండ్రోజుల క్రితం ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోలుస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలపై శివసేన సహా పలువురు భగ్గుమన్నారు. దీంతో తాను ఈ నెల 9న ముంబై వస్తున్నానని, ఎవరైనా ధైర్యముంటే అడ్డుకోవచ్చని ఆమె సమాధానమిచ్చారు. ఈ సవాళ్ల నేపథ్యంలోనే కేంద్రం ఆమెకు 24గంటల సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వై ప్లస్ కేటగిరీలో ఆమెకు 10– 11 మంది కమాండోలు షిఫ్టుల వారీగా రక్షణ ఇస్తారు. ఆమె నివాసానికి వచ్చిపోయేవాళ్లందరినీ వీళ్లు పర్యవేక్షిస్తారు. ఒక ఎస్కార్ట్ వాహనం కూడా కేటాయిస్తారు. సుశాంత్ మరణం తర్వాత ముంబై సురక్షితంగా లేదని, బాలీవుడ్లో కొందరికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని కంగనా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంగనాకు కేంద్రం సెక్యూరిటీ కల్పించడంపై హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ హర్షం ప్రకటించారు. కంగనాను హిమాచల్ కన్నబిడ్డగా అభివర్ణించారు. ఆమెకు రక్షణ ఇచ్చేందుకు కేంద్రం, తమ రాష్ట్రం సిద్దమన్నారు. మనాలీలో ఆమె నివాసానికి స్థానిక పోలీసులు రక్షణ ఇస్తారన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఇటీవలే కంగనాకు రక్షణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. ‘‘కావాలంటే నన్ను ఈ పరిస్థితుల్లో ముంబై వెళ్లవ ద్దని సూచించవచ్చు. కానీ కేంద్ర హోం మంత్రి నా ఆత్మాభిమానాన్ని గుర్తించారు. అందుకే రక్షణ కల్పించారు. ఇది భరతమాత ఆడబిడ్డకు ఇచ్చిన గౌరవం. వారికి నా కృతజ్ఞతలు’’ అని కంగనా వ్యాఖ్యానించారు. అసలు గొడవేంటి? బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియాను బయటపెడుతున్న కంగనాకు శివసేన ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని ఇటీవల బీజేపీ నేత రామ్ కదమ్ కోరారు. దీనిపై కంగనా స్పందిస్తూ మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులంటే తనకు భయమని ట్వీట్ చేశారు. వారికి బదులు హిమాచల్ ప్రభుత్వం లేదా కేంద్రం తనకు రక్షణ కల్పించాలన్నారు. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందిస్తూ ఆమెను ముంబైకి రావద్దని, ముంబై పోలీసులను ఆమె అవమానించారని మండిపడ్డారు. దీనికి బదులుగా ముంబై ఏమైనా పీఓకేనా? అని కంగన ప్రశ్నించారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని రౌత్ ముంబై ప్రభుత్వాన్ని కోరారు. నా ఆఫీస్ కూలుస్తారేమో! మున్సిపల్ అధికారులు ముంబైలోని తన ఆఫీసును కూల్చేస్తారేమోనని కంగనా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు తన ఆఫీసు వద్ద ఉన్న వీడియోను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సోమవారం మున్సిపల్ అధికారులు తన ఆఫీసుకు వచ్చారని, మంగళవారం ఆఫీసును కూల్చవచ్చని ఆమె ట్విట్టర్లో కామెంట్ చేశారు. కార్యాలయ ఆస్తి విషయంలో అవకతవకలకు పాల్పడలేదని వివరించారు. ఒకవేళ అక్రమ నిర్మాణం ఉంటే నోటీసు ఇవ్వవచ్చన్నారు. అధికారులు బలవంతంగా ఆఫీసులోకి వచ్చి కొలతలు తీసుకున్నారని, ఇరుగుపొరుగును కూడా ఇబ్బంది పెట్టారని చెప్పారు. -
‘ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర’
జైపూర్: రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ శాసనసభ్యులకు 15 కోట్లరూపాయలు ఆశచూపి, వారిని డబ్బుతో కొనేయాలని చూస్తోందని ప్రతిపక్ష బీజేపీపై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. అయితే తమ ప్రభుత్వం స్థిరంగా ఉండడం మాత్రమే కాదనీ, తమ ప్రభుత్వం ఐదేళ్ళ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా తన ప్రభుత్వాన్ని సహించలేకపోతున్నారనీ, అందుకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నుతున్నారని గహ్లోత్ ఆరోపించారు. కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకే బీజేపీ నాయకులు గేమ్ ఆడుతున్నారన్నారు. అడ్వాన్స్‌గా రూ.10 కోట్లను, ప్రభుత్వాన్ని కూల్చాక మరో రూ.15 కోట్లు ఇస్తామని చెప్పి తమ శాసనసభ్యులను కొనేయత్నం చేశారని గహ్లోత్ అన్నారు. బీజేపీ నాయకులు రాజకీయాలను ‘మేకల మండీ’లా భావిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా, రాజేంద్ర రాథోడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియాలు కేంద్ర నాయకత్వ ఎజెండాను అమలు చేస్తున్నారంటూ గహ్లోత్ ఆరోపించారు. -
కెప్టెన్‌గా కోహ్లి సాధించిందేం లేదు
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరో సారి విమర్శకు దిగాడు. ఇప్పటి వరకు సారథిగా విరాట్ కోహ్లి గొప్పగా చెప్పుకోవడానికేమీ లేదని గంభీర్ వ్యాఖ్యానించాడు. బ్యాట్స్‌మన్‌గా అన్ని ఫార్మాట్లలో ఆటగాడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన విరాట్... కెప్టెన్‌గా సాధించాల్సింది చాలా ఉందని అభిప్రాయ పడ్డాడు. ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటితేనే గొప్ప సారథుల జాబితాలో కోహ్లికి చోటు దక్కుతుందని అతను అన్నాడు. జట్టులోని ఆటగాళ్ల బలాలు, బలహీనతలను సరిగా గుర్తించి వారిని ప్రోత్సహించినప్పుడు మాత్రమే మెగా ఈవెంట్లలో భారత్ టైటిల్ గెలిచే అవకాశముంటుందని పేర్కొన్నాడు. ‘నిజం చెప్పాలంటే భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లి గొప్ప విజయాలేమీ సాధించలేదు. బ్యాట్స్‌మన్‌గా విరాట్ భారీగా పరుగులు చేస్తున్నాడు. మిగతా వారిలో అతను ప్రత్యేకం. కోహ్లిలా ఇతరులు పరుగులు సాధించలేకపోవచ్చు కానీ కెప్టెన్‌గా జట్టులోని ఆటగాళ్ల ప్రతిభను అతను బయటకి తీయాలి. తన సామర్థ్యంతో వారిని పోల్చకూడదు. ఎవరికి వారే ప్రత్యేకం కాబట్టి వారిలో అత్యుత్తమ ఆట బయటకు వచ్చేలా కోహ్లి ప్రోత్సహించాలి. వరల్డ్‌కప్ లాంటి మెగా టైటిళ్లు గెలిస్తేనే గొప్ప. లేకుంటే కెరీర్లో అదో లోటుగా మిగిలిపోతుంది. ఆస్ట్రేలియాలో తొలిసారి సిరీస్ గెలవడంతో పాటు జట్టును నంబర్‌వన్‌గా నిలిపి టెస్టుల్లో కోహ్లి కెప్టెన్‌గా మంచి ఘనతలు సాధించాడు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ద్వైపాక్షిక సిరీస్ విజయాలతోనే సరిపెట్టుకుంటున్నాడు. 2018 ఆసియా కప్ కూడా రోహిత్ కెప్టెన్సీలో భారత్ గెలుపొందింది’ అని గంభీర్ గుర్తు చేశాడు. -
‘నా శైలి అందరికీ తెలుసు’
రాజ్‌కోట్: భారత టెస్టు జట్టులో కీలక సభ్యుడైన చతేశ్వర్ పుజారా పలు సందర్భాల్లో బాగా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు. గతంలో ఒక సారి జట్టు కోచ్, కెప్టెన్ కూడా అతని స్ట్రయిక్‌రేట్‌ను ప్రశ్నించారు. దూకుడుకు చిరునామాగా మారిన ఈతరం క్రికెట్లో పుజారా బ్యాటింగ్ శైలి చాలా మందిని ఆకట్టుకోదు. ఇటీవల బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా అతను ఇదే తరహాలో ఆడాడు. జ్వరంనుంచి కోలుకొని ఇన్నింగ్స్ కొనసాగించిన అతను 237 బంతుల్లో 66 పరుగులు చేశాడు. దీంతో సగటు క్రికెట్ అభిమానులు మళ్లీ పుజారా ఆటతీరును విమర్శించారు. దీనిపై ఇప్పుడు స్వయంగా పుజారానే స్పందించాడు. ‘నా ఆటతీరు గురించి మీడియాలోనే అనేక రకమైన వార్తలు కనిపిస్తాయి. అయితే జట్టు అంతర్గత చర్చల్లో మాత్రం దీని గురించి అసలు ప్రస్తావనే ఉండదు. ఈ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ నాకు పూర్తిగా మద్దతిస్తోంది. వేగంగా ఆడాలంటూ కెప్టెన్‌నుంచి గానీ కోచ్‌నుంచి గానీ నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు’ అని పుజారా వివరణ ఇచ్చాడు. కరోనా కారణంగా ప్రస్తుతం ఎక్కడికీ వెళ్లకుండా పుజారా కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. ‘మీ అందరికీ ఒక విషయం చెప్పదల్చుకున్నా. నా స్ట్రయిక్‌రేట్ గురించి చర్చ రాగానే అంతా టీమ్ మేనేజ్మెంట్ నాతో ఎలా వ్యవహరిస్తోందో అని ఆలోచిస్తారు. అయితే వారందరికీ నా శైలి బాగా తెలుసు. నా ఆట ప్రాధాన్యత కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడూ నాపై ఒత్తిడి పెంచలేదు’ అని పుజారా అన్నాడు. సోషల్ మీడియాలో చాలా మంది తనను పరుగులు చేసేందుకు అన్నేసి బంతులు ఎందుకు తీసుకుంటావని అడుగుతుంటావని, అయితే తాను వాటిని పట్టించుకోనని చింటూ చెప్పాడు. ‘అసలు అలాంటి వాటిపై నేను దృష్టి పెట్టను. జట్టు మ్యాచ్‌లు గెలిచేలా నా వంతు పాత్ర పోషించడమే నా పని. చాలా మందికి ఒక వ్యక్తిలో తప్పును గురించి మాట్లాడే అలవాటు ఉంటుంది. ఇది నా ఒక్కడికే పరిమితం కాదు. నేను ఆడిన టెస్టులు, వాటిలో చేసిన పరుగులు, క్రీజ్‌లో గడిపిన సమయం చూస్తే ప్రత్యర్థి జట్టులో కూడా ఎక్కువ మంది ఇదే తరహాలో ఆడారని అర్థమవుతుంది’ అని ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ వ్యాఖ్యానించాడు. అయితే తన గురించి తాను వాస్తవంగా ఆలోచిస్తానని, మరీ దూకుడుతనంతో ఆడలేనని ప్రత్యేకంగా విషయం తనకు తెలుసని కూడా పుజారా వివరించాడు. ‘నేను డేవిడ్ వార్నర్‌లా, వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆడలేనని నాకు తెలుసు. కానీ ఒక సాధారణ బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో ఎక్కువ సమయం తీసుకుంటే తప్పేమీ లేదు’ అని అతను చెప్పాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన సిరీస్‌లో ఒకే ఒక అర్ధ సెంచరీ చేసిన పుజారా ఈ ఏడాదిలో ఒక్క శతకం కూడా కొట్టలేకపోయాడు. ఇది తనను కొంత నిరాశకు గురి చేసిందని భారత టెస్టు స్పెషలిస్ట్ చెప్పాడు. ‘అభిమానులు నేను భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటారు. నేనూ సెంచరీ చేయాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాను. అయితే ఓవరాల్‌గా టెస్టుల్లో దాదాపు 50 సగటు ఉందంటే ప్రతీ రెండో ఇన్నింగ్స్‌లో నేను అర్ధ సెంచరీ చేసినట్లే. సీజన్ గొప్పగా సాగలేదనేది వాస్తవం. అయితే మరీ ఘోరంగా ఏమీ ఆడలేదు. నా ఫామ్ దిగజారిందని అంగీకరించను. ప్రతీ ఇన్నింగ్స్‌కు తనదైన విలువ ఉంది’ అని పుజారా వెల్లడించాడు. ఈతరం క్రికెటర్లు టెస్టులపై ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. డబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి కుర్రాళ్లు టెస్టులకు దూరంగా ఉంటున్నారనేది వాస్తవం. ఇందులో తప్పేమీ లేదు కానీ టెస్టులకు కూడా ప్రత్యేకత ఉంది. ఒక ఆటగాడి అసలు సత్తాను ఐదు రోజుల మ్యాచ్‌లే బయటపెడతాయి’ అని పుజారా అన్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ తమకు అత్యంత కీలకమన్న భారత టెస్టు మూడో నంబర్ ఆటగాడు... మన పేసర్లు పూర్తి ఫిట్నెస్, తగినంత విరామంతో సిద్ధంగా ఉంటే మళ్లీ సిరీస్ గెలవవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 సిరీస్‌ను భారత్ 2–1తో సొంతం చేసుకుంది. -
ప్రధాని భద్రత బడ్జెట్‌పై విమర్శలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)’కి ఈ సంవత్సరం బడ్జెట్లో రూ. 600 కోట్లను కేటాయించడంపై ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్లకు కల్పించిన ఎస్పీజీ భద్రతను గత సంవత్సరం కేంద్రం ఉపసంహరించింది. ప్రధాని, ఆయన అధికార నివాసంలో ఆయనతో ఉండే కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రత కల్పించేలా ఇటీవల ఎస్పీజీ చట్టంలో సవరణ చేశారు. రూ.600కోట్ల కెటాయింపుపై సోషల్ మీడియాలో విమర్శలు పెరిగాయి. ‘ప్రధాని మోదీ ‘ఫకీరీ’ దేశ ఖజానాపై రోజుకు రూ. 1.62 కోట్ల భారం మోపుతోంది’ అని అఖిల భారత మహిళాకాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘జేఎన్‌యూలో 8 వేల మంది విద్యార్థులు న్నారు. వారిపై ప్రభుత్వం గ్రాంట్లు, సబ్సీడీల పేరుతో ఏటా రూ. 400 కోట్లను ఖర్చు చేస్తోంది. ఒక స్వయం ప్రకటిత ఫకీరు భద్రత ఖర్చు ఏటా రూ. 563 కోట్లా?’ అని ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. ‘మోదీజీ.. మీ భద్రతకు అయ్యే ఖర్చు తగ్గించండి. మీ దుబారాతో ఖజానా ఖాళీ అవుతోంది. మీరొక ఫకీరు. సింపుల్ మ్యాన్. భద్రతను పక్కనబెట్టి స్వేచ్ఛగా తిరగండి’ అని మరో ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. ‘ప్రధాని భద్రత ఖర్చు ఏడాదికి రూ. 592 కోట్లు అంటే.. రోజుకు రూ. 1.62 కోట్లు. గంటకు రూ. 6.75 లక్షలు. నిమిషానికి రూ. 11,263’ అని మరో యూజర్ ట్విట్టర్లో లెక్కలు గట్టాడు. -
రివైండ్ 2019: తలనొప్పిగా మారిన సిన్మాలు.. వివాదాలు
సినిమా మొదలైనప్పటి నుంచి.. పూర్తయ్యే దాకా దర్శకులు నిర్మాతలు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టైటిల్, స్టోరీ, లేదా నటీనటుల ఏదో ఒక సందర్భాల్లో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి.. ఇక ఈ మధ్యకాలంలో ఇలాంటి వివాదాలు ఎక్కువయ్యాయి. సినిమా ప్రారంభం నుంచి థియేటర్లోకి వచ్చే వరకు అడుగడుగునా ఆటంకాలతో చిత్ర నిర్మాతలు తలబాదుకుంటున్నారు. ఏదైనా చిత్రం విడుదలకు ముందు ఈ వివాదం బాగా నడుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ కాంట్రవర్సరీలు కొనసాగుతున్నాయి. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. కథను కాపీ కొట్టడం, సినిమా పేర్లను కాపీ కొట్టడం.. వివాదాస్పదమైన పేర్లు పెట్టడం.. సినిమా అంతా పూర్తి అయ్యాక సెన్సార్షిప్ సర్టిఫికెట్ వివాదం. ఇలాంటి కారణాలు తెలుగు చిత్ర సీమను ఈ ఏడాది విమర్శల్లో నెట్టాయి.. మరీ వాటి విశేషాలెంటో ఓసారి చుద్దాం రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది ఓ సంచలనం అవుతుంది. వర్మ సినిమా చేస్తున్నాడు అంటే అప్పటి నుంచే ఏం చేయబోతున్నాడు. ఎలాంటి సినిమా చేయబోతున్నాడు. సినిమా టైటిల్ ఏం పెట్టబోతున్నాడు అనే దాని చుట్టూనే మొదటగా అందరూ ఆలోచిస్తారు. అలా ఈ సంవత్సరం విమర్శల్లో కేంద్ర బిందువులా మారాడు వర్మ. ఆయన చేసిన రెండు సినిమాలు వివాదాల్లో నిలిచాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆది నుంచి వివాదాలను మూటగట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను తీసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించాక జరిగిన సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది. బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్కు కౌంటర్‌గా వర్మ ఈ మూవీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైనపుడు కూడా ఇంతగా చర్చ జరగలేదు కానీ వర్మ మాత్రం సంచలనాలకు తెరతీసాడు. ఈ సినిమా విడుదలను ఆపాలని కొందరు ఈసీకి ఫిర్యాదు చేయగా విడుదలను అడ్డుకోలేమని తొలుత ప్రకటించింది. అయితే, ఏపీ హైకోర్టు మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై స్టే విధించింది. దీంతో నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా వారికి చుక్కెదరయ్యింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశించడంతో ఏపీలో విడుదల కాలేదు. తెలంగాణలో మాత్రం ఈ చిత్రాన్ని మార్చి 29 న విడుదల చేశారు. కానీ, ఏపీలో మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా రిలీజ్ కాలేదు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అలియాస్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రాంగోపాల్‌వర్మ తీసే ప్రతీ సినిమాతో ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టిస్తాడు. కొన్నాళ్ళ క్రితం లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్‌తో ఇంకొక వివాదాన్ని రాజేసాడు. ఈ సినిమా రాజకీయంగాను, కొన్ని వర్గాల పార్టీ నేతలలో ఆందోళన కలిగేలా చేసింది. ఏపీలో ప్రముఖ రాజకీయ నాయకులను కించపరిచేలా, వారి హోదాను దిగజార్చేలా సినిమా ఉందన్నకారణంతో పెద్ద ఎత్తు విమర్శలు వెల్లువెత్తాయి. 2019 ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిన విషయం విదితమే. ఈ చిత్రం పట్ల ఏపీలో చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాలో తన పాత్రను అవమానపరిచే విధంగా చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు పేరు మార్చాలని సూచంచడంతో కమ్మరాజ్యంలో కడప బిడ్డలు కాస్తా అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని పేరు మార్చారు. సినిమా టైటిల్ మార్చినప్పటికీ సెన్సార్ బోర్డు అనుమతి లభించలేదు. దీంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన కోర్టు వారం రోజుల్లో సినిమా చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది. చివరికి డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వర్మ తన సెటైరికల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇంకొక కాంట్రవర్సీకి తెరలేపాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఒక ప్రముక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తదుపరి సినిమా మెగా ఫ్యామిలీతోఅంటూ వివాదాల్లో నిలిచాడు. అది కాస్త 24 గంటలు కాకుండానే ఈ సినిమాను నేను తీయడం లేదని తేల్చి చెప్పాడు. తాను విన్న కధ 39 మంది పిల్లలున్న మెగా ఫామిలీ పై సినిమా తీయడం నావల్ల కాదని, తనకు చిన్నపిల్లలంటే ఇష్టముండదని అందుకే ఆ సినిమా చేయట్లదన్నాడు వర్మ. దీనిపై చిరంజీవి వర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని అందువల్ల వర్మ వెనక్కి తగ్గాడని టాలివుడ్ లో చర్చ నడుస్తుంది. గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకీ వివాదంగా మారిన మరో తెలుగు చిత్రం వాల్మీకీ. తమిళంలో విజయవంతమైన జిగార్తండను దర్శకుడు హరీష్ శంకర్ వరుణ్ తేజ్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా టైటిల్ సమస్యనే ఎదుర్కొంది. వాల్మీకి అనే టైటిల్ ని పెట్టడమే కాకుండా టైటిల్ లోగో లో రివాల్వర్ ని యాడ్ చేయడంతో వాల్మికి కులస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. రివాల్వర్ పెట్టి వాల్మీకిల మనోభావాలను కించపరిచేలా చేశారని చిత్ర యూనిట్ పై మండిపడ్డారు. సినిమా పేరును మార్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చివరి క్షణంలో గద్దలకొండ గణేష్‌గా పేరు మార్చి సెప్టెంబర్ 13న విడుదల చేశారు. వరుణ్ తేజ్ తన సింగిల్ క్యారెక్టర్‌తోనే సినిమాను పండించాడు. ఈ సినిమా యాక్షన్, కామెడీ పరంగా మంచి హిట్‌ను సాధించింది. జార్జి రెడ్డి తెలుగులో వివాదస్పదమైన మరో చిత్రం జార్జి రెడ్డి. 1970లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదువుకుంటూ..రాజకీయ పంథాలో విద్యార్థి ఉద్యమాన్నినడిపిన నాయకుడు జార్జిరెడ్డి. ఆయన కథ ఆధారంగానే ఈ మూవీ తెరకెక్కించారు. జార్జిరెడ్డి 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీలో హత్యకు గురయ్యాడు. ఆయన సిద్దాంతాలను వ్యతిరేకించే రైట్ వింగ్ విద్యార్థి సంఘం ఆయన్ను హత్య చేసి ఉంటారని ఆరోపనలు ఉన్నాయి. అయితే సినిమాలో కేవలం జార్జిరెడ్డి నడిపి ఉద్యయాన్ని, ఆయన హీరోయిజాన్ని చూపించడంతో రైట్ వింగ్ రాజకీయాలు నడిపేవారు అభ్యంతరం వ్యక్తం చేశారు. జార్జిరెడ్డి సిద్దాంతాలను తెరకెక్కించే సందర్భంలో తమను తప్పుగా చూపే ఎలిమెంట్స్ ఉంటాయని ఏబీవీపీ కార్యకర్తలు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. జార్జిరెడ్డిపై దాదాపు 15 క్రిమినల్ కేసులున్నాయని, ఆయన రౌడీయిజాన్ని కూడా చూపించాలంటూ వారు డిమాండ్ చేశారు. సినిమాలో ఏక పక్షంగా ఏబీవీపీ విద్యార్థులనే టార్గెట్ చేసి లేనివి ఉన్నట్లు చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే ఎట్టకేలకు నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మా(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) అలాగే సినిమా వివాదాలతో ఈ ఏడాది మరో వివాదం తెరమీదకు వచ్చింది. అదే మా అసోసియేషన్. ఇది రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో మా ఒక్కసారిగా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. మా లో ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నరేష్ ప్యానల్, శివాజీ రాజా ప్యానల్ ఎన్నికల్లో పోటీ చేయగా అనూహ్యంగా నరేష్ ప్యానల్ విజయం సాధించడంతో కమిటీపై ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఒకే ప్యానల్ నుంచి పోటీ చేసిన నరేష్, జీవితా రాజశేఖర్ మధ్య వివాదం రాజుకుంది. అధ్యక్షుడు నరేష్ లేకుండానే ఎక్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, సెక్రటరీ జీవితలు జనరల్ బాడీ మీటింగ్‌ను నిర్వహించారు. అత్యవసర సమావేశం జరుగుతుంది అంటూ సభ్యులకు మెసేజ్ చేయటంలో అంతా హజరయ్యారు. అయితే ఈ మీటింగ్‌పై మా అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకపోవటంతో అధ్యక్షుడికి తెలియకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ జీవిత రాజశేఖర్‌లను ప్రశ్నించాడు. ఇక అయితే ఈ విషయంపై స్పదించిన రాజశేఖర్, జీవితలు ఇది ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమే.. కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్ కాదన్నారు. ఈ మీటింగ్‌లో గత తొమ్మిది నెలలో అధ్యక్షుడిగా నరేష్ తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా నరేష్, జీవిత రాజశేఖర్ల మధ్య వివాదాలు జరగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నరేష్‌కు రాజశేఖర్ తన వర్గంతో కలిసి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పంచాయితీ కాస్తా మెగాస్టార్ చిరంజీవి దాకా చేరడంతో ఆయన నరేష్వైపే ఉన్నట్లు సమాచారం ఇక ఇవేనండి ఈ ఏడాది కాంట్రవర్సీలాగా మారిన టాలీవుడ్ సినిమాలు. పలు సినిమాలపై వివాదాలు అయితే వచ్చాయి గానీ.. ఇలాంటి వివాదాలను లెక్క చేయకుండా ప్రేక్షకులు ఈ సినిమాలను ఆదరించారు. సినిమాలో కంటెంట్ ఉంటేనే ఏ మూవీ అయినా హిట్ కొడుతుందని ప్రేక్షకులు వాదిస్తున్నారు. -
అహంకారం.. అనిశ్చితి.. డోలాయమానం!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న ఎన్డీయే ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అహంకారం, రాజకీయ ప్రచారం, అనిశ్చితి, ఆందోళన, డోలాయమానంగా బీజేపీ పాలన సాగిందంటూ ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ గత బడ్జెట్ సమావేశాల్లో 39 బిల్లులను ప్రవేశపెట్టి 28 బిల్లులను ఆమోదించుకున్న ఎన్డీయే ప్రభుత్వం.. ఏ ఒక్క బిల్లును కూడా పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి గానీ, స్టాండింగ్ కమిటీకిగానీ పంపలేదన్నారు. గత వంద రోజుల్లో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పిందని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలు తప్పించుకొనేలా మార్గ్గం సుగమం చేస్తున్నాయని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, అస్సాంలో ఎన్ఆర్సీతో దేశంలో అనిశ్చితి సృష్టించిందన్నారు. ఆటోమొబైల్ రంగం తిరోగమనంలో ఉందని, 3.50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తయారీ, నిర్మాణ రంగాల్లో వృద్ధి తగ్గి, చేనేత, బంగారం ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. -
మిత్రుడికి కాంట్రాక్టు ఎలా దక్కింది?
సాగర్ (మధ్యప్రదేశ్) / భదోహి (యూపీ): ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్, యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన యూకే సంస్థ బ్యాకాప్స్తో రాహుల్ సంబంధాలను ప్రస్తావించారు. మీ మిత్రుడికి జలాంతర్గాముల కాంట్రాక్టు ఎలా దక్కిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడి కుంభకోణాలన్నీ భూమి, గాలి, నీటిలోంచి వెలుగులోకి వస్తున్నాయని మోదీ చెప్పారు. ఆయన మాజీ వ్యాపార భాగస్వామి యూపీఏ హయాంలో జలాంతర్గాముల కాంట్రాక్టు పొందినట్లుగా బయటపడిందన్నారు. ఆ సంస్థ పేరు ‘బ్యాకాప్స్’ కూడా.. ముందు నుంచి కాకుండా తెరవెనుక (బ్యాక్ ఆఫీస్) జరిగే కార్యకలాపాల్లో పాల్గొనడం లాంటి కాంగ్రెస్ నేత (రాహుల్) చర్యలకు తగ్గట్టుగానే ఉందని అన్నారు. రాహుల్ బహిరంగంగా ఎప్పుడూ ఆ కంపెనీలో పనిచేయలేదని, అంతా తెరవెనుకే ఉండి నడిపించారని మోదీ ఆరోపించారు. ఈ తెరవెనుక సంస్థ 2009లో మూతపడినా.. కంపెనీలో ఆయన భాగస్వామి 2011లో జలాంతర్గాముల కాంట్రాక్టు పొందినట్లు వెలుగుచూసిందన్నారు. ఆ కంపెనీ యజమాని రాహుల్ స్నేహితుడే అన్నారు. కేవలంలో లైజనింగ్‌లో (రెండు కంపెనీల మధ్య సంధానకర్తగా వ్యవహరించడంలో) అనుభవం కలిగిన మీ భాగస్వామికి జలాంతర్గాముల రంగంలోకి వచ్చే అవకాశం ఎలా దక్కిందంటూ ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారని మోదీ అన్నారు. బోఫోర్స్ తుపాకులు, హెలికాప్టర్లు (అగస్టా వెస్ట్‌ల్యాండ్).. తాజాగా జలాంతర్గాములు.. ఎంత లోతుగా తవ్వితే అంతగా.. అది గాలైనా (నభ్), నీరైనా (జల్), భూమైనా (తల్) కానివ్వండి.. వారి కుంభకోణాలు వెలుగుచూస్తున్నాయని ప్రధాని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటేనే అసత్యం, దుష్ప్రచారం, మోసం అని అన్నారు. రాహుల్ తనపై చేసిన అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ‘నేను ఒంటరిని కాదు..దేవుడు నాతో ఉన్నాడు. నాపై మీరెంత బురద వేస్తే అంతగా మరిన్ని కమలాలు వికసిస్తాయి..’ అని చెప్పారు. దేశం ఓ దశాబ్దం కోల్పోయింది ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలో పదేళ్ల పాటు సాగిన యూపీఏ పాలనపై మోదీ ధ్వజమెత్తారు. 2004లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ భావించలేదు. ఊహించని విధంగా అవకాశం వచ్చింది. అయితే అప్పటికి ‘యువరాజు’ రెడీ కాకపోవడం, ఆయనకు ‘శిక్షణ’ ఇచ్చేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో కాంగ్రెస్ ఒక ‘కుటుంబ విశ్వాసపాత్రుడు’, ఒక కాపలాదారుని ప్రధానిని చేసిందన్నారు. దీంతో 21వ శతాబ్దిలో మొత్తం ఒక దశాబ్దాన్ని దేశం కోల్పోయిందని విమర్శించారు. అమరుల ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకునేందుకు తాను ప్రతిన బూనానన్నారు. సంక్షేమమే వికాస్పంతి లక్ష్యం ఉత్తరప్రదేశ్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలపై ఆయన ధ్వజమెత్తారు. కులం పేరిట ప్రజలు ఎప్పుడూ కొట్లాడుకునేలా ఈ పార్టీలు చేశాయన్నారు. స్వాతంత్య్రానంతరం నాలుగు రకాలైన పరిపాలన, పార్టీలు, రాజకీయ సంస్కృతి (నామ్పంతి, వామ్పంతి, దామ్ అవుర్ దామన్పతి, వికాస్పంతి) ఉండేవని చెప్పారు. ఓ కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లు జపించడంలో నామ్పంతి నిమగ్నమై ఉండేదని, వామ్పంతి విదేశీ విధానాలు దేశంపై రుద్దే ప్రయత్నం చేసేదని, దామ్, దామన్పంతి డబ్బు, కండబలం ఉపయోగించి పరిపాలన సాగించేందని ప్రధాని వివరించారు. ఇక నాలుగోదైన వికాస్పంతిని తాము తెచ్చామంటూ.. దీనికి దేశంలోని 130 కోట్ల మంది ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రధానమని చెప్పారు. తమ సంపద రెట్టింపు చేసుకోవడానికే అధికారం అన్నట్టుగా మహాకల్తీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
పేదల్ని ‘చౌకీదార్’లు పట్టించుకోట్లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. కాపలాదారులు(బీజేపీ నేతలు) ప్రస్తుతం ధనికుల కోసమే పనిచేస్తున్నారనీ, పేదలగోడు వారికి పట్టడం లేదని దుయ్యబట్టారు. యూపీలో చక్కెర రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10,000 కోట్లు దాటడంపై ప్రియాంక ఆదివారం స్పందిస్తూ..‘యూపీలో చెరకు రైతులు పగలు,రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో బాధ్యత తీసుకోవడం లేదు. ప్రస్తుతం ఈ బకాయిలు రూ.10,000 కోట్లు దాటాయి. అంటే చెరకు రైతుల పిల్లల చదువులు, ఆహారం, ఆరోగ్యంతో పాటు మరో పంటసాగుకు అవసరమైన నగదు ఆగిపోయినట్లే’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలంతా తమ ట్విట్టర్ ఖాతాల్లో పేరుకు ముందు చౌకీదార్(కాపలాదారు) అనే పదాన్ని చేర్చిన నేపథ్యంలో ప్రియాంక ఈ మేరకు స్పందించారు. ప్రియాంకా గాంధీ ఇటీవల యూపీ తూర్పువిభాగం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. -
6 వేల విలువేంటో వారికేం తెలుసు?
లేహ్/జమ్మూ/శ్రీనగర్: రైతులకు ఆరు వేల రూపాయలు ఎంత ముఖ్యమనే విషయం ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చునే వారికి తెలియదంటూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ్టపై ఆదివారం విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులను ఆకట్టుకునే ఉద్దేశంతో ఐదెకరాల్లోపు సాగు భూమి ఉన్న వ్యవసాయదారులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం చేయనున్నట్లు కేంద్రం తాత్కాలిక బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ రైతులకు ఇచ్చేది రోజుకు 17 రూపాయలేనా, ఇది వారిని అవమానించడమేనంటూ ధ్వజమెత్తింది. ఈ వ్యాఖ్యలకు స్పందనగా జమ్మూ కశ్మీర్లో మాట్లాడుతూ ‘పీఎం–కిసాన్ ఒక గొప్ప పథకం. పేద రైతుకు ఈ రూ.6 వేలు ఎంత ముఖ్యమో ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చునే వారికి అర్థం కాదు. ఈ రాష్ట్రంలో కూడా చాలా మందికి ఈ పథకం వల్ల లబ్ధి జరుగుతుంది. ఆదివారమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను మార్గదర్శకాలు పంపిస్తా’ అని అన్నారు. అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని విజయపూర్‌లో మోదీ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీని కాంగ్రెస్ ఎన్నికల గిమ్మిక్కుగా వాడుతోందని మోదీ ఆరోపించారు. ‘2008–09లో రూ. 6 లక్షల కోట్ల విలువైన రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించి, అధికారంలోకి వచ్చాక, రూ. 52 వేల కోట్ల విలువైన రుణాలనే మాఫీ చేసింది. మాఫీ పొందిన వారిలో 30 లక్షల మంది అనర్హులే ఉన్నట్లు కాగ్ తేల్చింది’ అని మోదీ అన్నారు. భరతమాత బిడ్డలకు సాయం చేస్తాం.. 1947లో దేశ విభజన కారణంగా ఈ దేశ పౌరులు కాకుండా పోయిన భారతి బిడ్డలను కాపాడతామని చెప్పారు. కశ్మీరీ పండితుల మహా నిష్క్రమణం తననెప్పుడూ గుండెల్లో బాధకు గురిచేస్తుంటుందని మోదీ వెల్లడించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ .. శ్రీనగర్, లడఖ్, లేహ్, విజయ్‌పూర్, కఠువా తదితర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. లేహ్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ప్రజలు -
బాడీ షేమింగ్
‘బోండాం’ అనడం బాడీ షేమింగ్. ‘బక్క పీనుగ’ అనడమూ బాడీ షేమింగే. స్త్రీని పురుషుడు చేసే బాడీ షేమింగ్ అయితే ఇంకా రకరకాలుగా ఉంటుంది. బాడీ షేమింగ్ అని అతడికి తెలియకపోవచ్చు. ఆమెకు తెలుస్తుంది. హర్ట్ అవుతుంది. ఏ విధంగానైనా స్త్రీని బాడీ షేమింగ్ చెయ్యడం అంటే ప్రకృతి ధర్మాన్నే అవమానించడమే. స్త్రీ దేహధర్మాలు, స్త్రీ దేహ స్వభావాలు విలక్షణమైనవి. ఆ విలక్షణతల కారణంగా కొన్ని విభిన్నతలకూ ఆమె దేహం లోనవుతూ ఉండొచ్చు. ఆ విభిన్నతలను ఎత్తిచూపుతూ ఒక మాట అనడం అంటే.. జన్మనిచ్చే జెండర్‌ను కించపరచడమే. వసుంధరారాజే (65) సీనియర్ లీడర్. రాజస్తాన్ తొలి మహిళా ముఖ్యమంత్రి. మళ్లీ కనుక ఆమె ముఖ్యమంత్రి అయితే హ్యాట్రిక్ అవుతుంది. మూడోసారి ముఖ్యమంత్రి కాకుండా ఆమెను అడ్డుకోవాలంటే ఆమె ప్రభుత్వంలోని బలహీనతలేవో ఎత్తి చూపాలి. చేస్తానని చెయ్యని పనులేవైనా ఉంటే వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అయితే శరద్ యాదవ్, వసుంధరా రాజే ‘ఒంటిని’ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు! ఆయన కూడా సీనియర్ లీడరే. 73 ఏళ్లు. ‘ఏళ్లొచ్చాయ్ ఎందుకు?’ అనిపిస్తుంది రాజేను ఆయన చేసిన కామెంట్‌ని వింటే! వినే ఉంటారు. ‘‘వసుంధర కో ఆరామ్ దో. బహుత్ థక్ గయీ హై. మోటీ హో గయీ హై’’ అన్నారు. పోలింగ్‌కి ముందురోజు ప్రత్యర్థిపై ఆయన సంధించిన చివరి అస్త్రం అది! ‘‘వసుంధరకు విశ్రాంతి ఇవ్వండి. మనిషి బాగా లాౖÐð పోయి ఆయాస పడుతోంది’’ అని. స్త్రీని సవ్యంగా ఎదుర్కోలేకపోయినప్పుడే పురుషుడు ఇలా ఉక్రోషంతో ఆమె ఒంటి పైకి నోటిని ప్రయోగిస్తాడు. వాస్తవానికి శరద్, రాజే సమీప ప్రత్యర్థి ఏమీ కాదు. అయన్ది రాజస్తాన్ కూడా కాదు. ఎన్నికల ప్రచారం కోసం బిహార్ నుంచి వచ్చారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తో పడక, గతేడాది జేడీయూ నుంచి బయటికి వచ్చి, ఈ ఏడాది మే నెలలో సొంతంగా ‘లోక్తాంత్రిక్ జనతాదళ్’ పార్టీ పెట్టుకుని రాజస్తాన్ ఎన్నికల్లో రాజేకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వచ్చారు. ఆ సందర్భంగానే శరద్, రాజే ఒంటిపై కామెంట్ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన వివరణ కూడా ఆయన స్థాయికి తగినట్లుగా లేదు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు క్యాబినెట్ మినిస్టర్‌గా చేసిన శరద్ యాదవ్.. ‘ఊరికే జోక్ చేశాను’ అన్నారు! ‘‘ఆమెను హర్ట్ చెయ్యాలని నా ఉద్దేశం కాదు. తనతో నాకు పాత పరిచయం ఉంది. ఆమెను కలిసినప్పుడు కూడా నేనిదే చెప్పాను.. మీరు లావౌతున్నారని’’ అన్నారు. శుక్రవారం జలావర్‌లోని ‘మహిళా పోలింగ్ బూత్’ నుంచి ఓటేసి వస్తూ.. ‘‘అతడి కామెంట్‌పై నేను ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయబోతున్నాను’’ అని రాజే మీడియా ప్రతినిధులతో అనగానే.. శనివారం ఆమెకు క్షమాపణలు చెబుతూ శరద్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్మృతి ఇరానీ (శరద్ యాదవ్) శరద్ యాదవ్ ఇలా మహిళల్ని కించపరుస్తూ, ‘బాడీ షేమింగ్’ (ఒంటి సైజు, ఒంటి షేప్, ఒంటి రంగును అవమానించడం) చెయ్యడం ఇదే మొదటి సారి కాదు. మూడేళ్ల క్రితం స్మృతి ఇరానీని ఇలాగే పార్లమెంటులో.. ‘నువ్వేంటో నాకు తెలుసు’ అన్నారు. గత ఏడాది విచిత్రంగా ఓటుకు, ఆడపిల్లలకు ముడిపెట్టి మాట్లాడారు. ఆడపిల్ల పరువు కన్నా ఓటు పరువు ముఖ్యమట. ‘‘ఆడపిల్ల అమ్ముడుపోతే ఇంటి పరువు, ఊరి పరువు మాత్రమే పోతాయి. ఓటు అమ్ముడు పోతే దేశం పరువే పోతుంది’’ అన్నారు. ఏంటో దానర్థం! ‘నువ్వేంటో నాకు తెలుసు’ అని స్మృతి ఇరానీని అన్న మాటల్లోని పరమార్థం ఏమిటో కూడా ఆయనకే తెలియాలి. రాజ్యసభలో ఇన్సూరెన్స్ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు డిబేట్ ఎటు నుంచి ఎటో వెళ్లిపోయి, ‘‘ఇండియాలో అందరికీ తెల్లగా ఉండే అమ్మాయిలే కావాలి. నల్ల అమ్మాయిలను ఎవరూ వధువుగా కోరుకోరు. దక్షిణాది మహిళలంతా నల్లగా ఉంటారు. అయినప్పటికీ వారిలో మెరుపు కనిపిస్తుంది..’’ అని యాదవ్ అన్నారు. అక్కడితో ఊరుకోకుండా ఇంకా వివరణ ఇవ్వబోతుంటే.. మంత్రి స్మృతి ఇరానీ డిప్యూటీ చైర్మన్ వైపు చూస్తూ ‘ఇక ఆపమనండీ’ అని అభ్యర్థించారు. దానికి యాదవ్ అసహనంతో.. ‘ఐ నో వాట్ యు ఆర్’ అని స్మృతిపై మండిపడ్డారు. రేణుకా చౌదరి (వెంకయ్య నాయుడు) ఈ ఏడాది మార్చిలో రాజ్యసభ సభ్యత్వపు పదవీకాలం పూర్తి చేసుకున్నవారిలో రేణుకా చౌదరి ఒకరు. ఆ వీడ్కోలు సభలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు, రేణుకా చౌదరికి మధ్య జరిగిన సంభాషణలోనూ రేణుక బాడీషేమింగ్‌కి గురయ్యారు. అయితే వారిద్దరి మధ్య ఉన్న చిరకాల పరిచయం కారణంగా అది కేవలం ఉల్లాసభరితమైన వాగ్వాదంగా మాత్రమే మిగిలిపోయింది. బరువు టాపిక్ తెచ్చింది మొదట రేణుకే. తన వీడ్కోలు ప్రసంగంలో ఆమె వెంకయ్యనాయుడును ఉద్దేశించి.. ‘సర్.. నా వెయిట్ గురించి అంతా వర్రీ అవుతున్నారు. కానీ ఇది మన వెయిట్ ఏంటో చూపించాల్సిన జాబ్ కదా’’ అన్నారు. అందుకు వెంకయ్యనాయుడు.. ‘‘మీరు వెయిట్ తగ్గండి. మీ పార్టీ వెయిట్ పెంచండి’’ అని సలహా ఇచ్చా రు. ఆ మాటకు రేణుక హాయిగా నవ్వేస్తూ.. ‘మా పార్టీ వెయిట్‌కి వచ్చిన నష్టం ఏమీ లేదు సర్. ఇటీస్ ఫైన్’ అన్నారు. అప్పటికే నాయుడు ఉపరాష్ట్రపతి. రేణుక గానీ, ఇతర మహిళలు కానీ పాయింట్ అవుట్ చెయ్యకపోవడంతో అది పెద్ద ఇష్యూ కాలేదు. షేక్ హసీనా (నరేంద్ర మోదీ) గత ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘ఆడమనిషై ఉండీ టెర్రరిజాన్ని జీరో టాలరెన్స్ (ఏమాత్రం సహించకపోవడం)తో నియంత్రిస్తోంది’ అని ఆయన అన్నారు. ‘ఆడ మనిషై ఉండీ’ అనడంలో మెచ్చుకోలు ఉన్నప్పటికీ.. ‘కంపారిటివ్లీ బలహీనమైన’ అనే అర్థం ధ్వనిస్తుండడంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇందులో బాడీ షేమింగ్ ఎక్కడున్నట్లు? ఉంది. ‘ఆడపిల్ల నయం కదా, ధైర్యంగా పోరాడింది’ అంటే.. అంతర్లీనంగా ఆమె బలహీనత స్ఫురిస్తుంది కదా. బలహీనమైన బాడీ అనడం షేమింగ్ కాక మరేమిటి?! మహిళల మీద (అబూ అజ్మీ) ఐదేళ్ల క్రితం సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ అజ్మీ ఒక కామెంట్ చేశాడు. ఆడవాళ్లను స్వేచ్ఛగా వదిలిపెడితే దోపిడికీ గురవుతారట. ఎందుకనంటే.. ‘‘వాళ్లు బంగారంలా విలువైనవారు. బాహాటంగా పెడితే ఆ బంగారాన్ని దోచుకునిపోతారు’’ అని ఆయన ఆందోళన. అందుకే ఆడవాళ్లు.. తోడు లేకుండా బయట తిరగకూడదు. చీకటైతే అసలు బయటికి రాకూడదు అని కూడా అన్నారు అజ్మీ. ఇదొక రకం బాడీ షేమింగ్. తమని తాము కాపాడుకోలేని దేహాలు అని చెప్పడమేగా! చివరికి ఆయన మాటలకు ఆయన కోడలు (కొడుకు ఫర్హాన్ భార్య) అయేషా టాకియా సోషల్ మీడియాలోకి వచ్చి క్షమాపణ చెప్పారు. ‘‘మా మామగారు అలా అని ఉండాల్సింది కాదు’’ అని. భార్యల మీద (శ్రీ ప్రకాశ్ జైస్వాల్) శ్రీ ప్రకాశ్ జైస్వాల్ అయితే ఏకంగా యావత్ద్దేశంలోని భార్యలనే బాడీ షేమింగ్ చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ, మంత్రి ఆయన. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకు రెండేళ్ల క్రితం కాన్పూర్‌లోని ఒక మహిళా కాలేజ్‌లో ప్రసంగిస్తూ... ‘‘ఈ భార్యలున్నారే.. ముసలివాళ్లయిపోతారు. అప్పుడు వాళ్ల మీద ఏ ఆకర్షణా కలగదు’’ అన్నారు. ఎంత ఘోరమైన బాడీ షేమింగ్! పెద్ద చదువులుండి, పెద్ద హోదాలుండీ.. ఎందుకీ పెద్దవాళ్లు ఇలా చిన్న మాటలు మాట్లాడతారు? ఒక్క రాజకీయ నాయకులనే కాదు, ఏ రంగంలోని పురుషులైనా.. స్త్రీలను అవమానించడానికి, వ్యంగ్యంగా మాట్లాడటానికి వారి దేహాలను టార్గెట్ చెయ్యడం సంస్కారమేనా? బలవంతుణ్ని అనుకుంటాడు కదా మగవాడు! స్త్రీని బాడీ షేమింగ్ చెయ్యడమేనా అతడి బలం?! ప్రియాంకా చోప్రా (రాజ్‌నాథ్ సింగ్) కొన్ని కామెంట్లు పైకి బాడీ షేమింగ్‌గా అనిపించవు కానీ, లోతుగా చూస్తే వాటిల్లోనూ బాడీ షేమింగ్ కనిపిస్తుంది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్‌గా ఎన్నికైనప్పుడు రాజ్‌నాథ్‌సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా ప్రియాంక లక్నోలో ఉంటోంది. సీఎం స్థాయిలో ఉండి ఆయన ప్రియాంకను ప్రశంసించాల్సింది పోయి, ‘ఈ అందాలపోటీలను బ్యాన్ చెయ్యాలి. మన సంస్కృతిని ఇవి దిగజారుస్తున్నాయి’ అన్నారు. ఆయన ఉద్దేశం.. ఆడపిల్లలు వేదికలెక్కి ఒళ్లు చూపిస్తున్నారని! బ్యూటీ షేమింగ్‌లా కనిపించే బాడీ షేమింగ్ ఇది. -
ఆ ఒక్క కుటుంబం కోసం..
న్యూఢిల్లీ: నెహ్రూ–గాంధీ కుటుంబం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ కుటుంబాన్ని కీర్తించడం కోసం స్వాతంత్య్ర పోరాటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్, సుభాష్‌చంద్ర బోస్ లాంటి మహానుభావుల త్యాగాల్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆరోపించారు. ఈ దిగ్గజాలు పోషించిన చారిత్రక పాత్రను భారతీయులంతా తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఎర్రకోటలో మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుభాష్‌చంద్ర బోస్ అనుచరుల్లో ఒకరైన లాల్టిరామ్ బహూకరించిన టోపీ ధరించి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు బ్రిటిష్ పాలకుల చేతిలో విచారణ ఎదుర్కొన్న ఎర్రకోటలోని జైలుగది సంఖ్య 3లో ఆ శిలాఫలకాన్ని ఏర్పాటుచేయనున్నారు. అదే జైలులో ఒక మ్యూజియాన్ని కూడా నిర్మించనున్నారు. వాళ్ల మార్గదర్శనం ఉండి ఉంటే... స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా బ్రిటిష్ వ్యవస్థ ఆధారంగానే మన విధానాల్ని రూపొందించారని, బ్రిటిషర్ల దృక్కోణంలోనే ఆలోచించారని మోదీ పేర్కొన్నారు. అందుకే విద్య, ఇతర రంగాలకు సంబంధించిన విధానాలు విఫలమయ్యాయని అన్నారు. ‘భారతదేశ చరిత్ర, విలువల పట్ల నేతాజీ ఎంతో గర్వించేవారు. ఇతర దేశాల కోణంలో అన్నింటిని చూడొద్దని ఆయన బోధించారు. 16 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలనలో భారత దేశ దుస్థితి పట్ల కలతచెందారు. జాతీయవాదమే ఆయన సిద్ధాంతం. అదే శ్వాసగా బతికారు. వలస పాలన, అసమానత్వంపై పోరాటంలో భాగం గా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో బోస్ స్ఫూర్తిగా నిలిచారు. సుభాష్‌చంద్ర బోస్, సర్దార్ పటేల్ లాంటి మహానుభావులు మార్గదర్శనం లభించినట్లయితే పరిస్థితులు ఇప్పుడు మరోలా ఉండేవి. ఒక కుటుంబాన్ని కీర్తించేందుకు, ఎందరో గొప్ప నాయకుల సేవల్ని విస్మరించడం విచారకరం’ అని మోదీ అన్నారు. విపత్తు సమయంలో సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించే సిబ్బందికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట ఇకపై ఏటా అవార్డు ఇస్తామని మోదీ ప్రకటించారు. పోలీసు స్మారకానికి ఇన్నేళ్లా?.. విధుల నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం స్మారకం ఏర్పాటుచేయడంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని మోదీ ఆరోపించారు. జాతీయ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మోదీ పోలీసు స్మారకాన్ని ఆవిష్కరించారు. ‘దేశానికి అంకితం చేస్తున్న ఈ స్మారకం పట్ల గర్విస్తున్నా. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఇన్నాళ్లూ ఇలాంటి స్మారకాన్ని ఎందుకు ఏర్పాటుచేయలేదని ప్రశ్నిస్తున్నా. 2002లో శంకుస్థాపన జరిగిన ఈ స్మారక నిర్మాణ పనులకు కొన్ని న్యాయపర అడ్డంకులు తలెత్తిన సంగతిని అంగీకరిస్తున్నా. కానీ అంతకుముందున్న ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్మారకం ఎప్పుడో పూర్తయ్యేది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఖమ్మం గ్రానైట్‌తో స్మారకం సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆవిష్కరించి న జాతీయ పోలీసు స్మారక చిహ్నాన్ని ఖమ్మం గ్రానైట్‌తో తయారుచేయడం విశేషం. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో 31 అడుగుల పొడ వు, 9 అడుగుల వెడల్పుతో 270 టన్నుల బరువున్న అతి భారీ గ్రానైట్ రాయి తో ఈ స్మారక చిహ్నన్ని రూపొందించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెర్వు మాధారంలోని గాయత్రి గ్రానైట్స్ క్వారీ నుం చి ఈ రాయిని వెలికితీసి ఢిల్లీకి తరలించారు. ఆర్కిటెక్చర్ నిపుణులు ఈ గ్రానైట్‌పై ముం దువైపు స్మారక చిçహ్నాన్ని చెక్కారు. ఈ కార్యక్రమానికి గాయత్రి గ్రానైట్స్ యాజమాన్య ప్రతినిధులు వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్వర్లు, నిఖిల్‌లను హోం శాఖ అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. -
ఆత్మవిశ్వాసం పెరిగింది!
నటీనటులకు ఎప్పుడూ పొగడ్తలే కాదు. అప్పుడప్పుడూ విమర్శలు కూడా ఎదరవుతాయి. విమర్శలను ఎదుర్కొన్నప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నను కన్నడ నటి మంజిమా మోహన్...‘‘నా యాక్టింగ్‌పై విమర్శలు వచ్చినప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. కానీ, అలానే కూర్చిండిపోను. విమర్శలను విశ్లేషించుకుంటాను. నా తప్పులు ఏవైనా ఉంటే సరిచేసుకుంటాను. ‘ఓరు వడక్కన్ సెల్ఫీ’ టైమ్‌లో బాగా విమర్శలు రావడంతో బాగా ఫీలయ్యాను. ఆ టైమ్‌లో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు అండగా నిలవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’’ అని చెప్పుకొచ్చారు మంజిమా మోహన్. -
వాళ్లవి విభజన రాజకీయాలు
అజ్మీర్: అధికారం కోసం ప్రజలను విడదీస్తూ కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని పతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు చెబుతూ, అనుమానాలు పెంచుతూ ప్రజలను భయ పెడుతోందన్నారు. ఆ పార్టీకి అధికారం దక్కనివ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే చేపట్టిన ‘రాజస్తాన్ గౌరవ యాత్ర’ ముగింపు సందర్భంగా శనివారం అజ్మీర్‌లో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కాలేదు. అధికారంలో ఉండగా ప్రభుత్వ యంత్రాంగంలోనూ చిచ్చుపెట్టింది. పర్యవసానంగా పరిపాలన దెబ్బతింది. ఓటు బ్యాంకు దృష్టితోనే నిధులు కేటాయించడంతో సమగ్ర అభివృద్ధి జరగలేదు. 60 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ ఈ దుస్సంప్రదాయాన్ని కొనసాగించింది. అతికష్టంమీద, 60 ఏళ్ల తర్వాత ప్రస్తుతం వ్యవస్థ గాడినపడింది. వారికి మళ్లీ అవకాశం ఇవ్వకండి. కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ ఒక కుటుంబం. ఆ కుటుంబానికి భజన చేయడం ద్వారానే వారు రాజకీయాలు సాగిస్తున్నారు’ అని పేర్కొన్నా రు. ‘రెండేళ్ల క్రితం సైన్యం చేపట్టిన అత్యంత సాహసోపేతమైన ‘సర్జికల్ స్ట్రైక్’ను సైతం కాంగ్రెస్ ప్రశ్నించింది. సైనికులను అగౌరవపరిచింది అని అన్నారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్ అంశాల వారీగా ఎందుకు పోరాడటం లేదు? అబద్ధాలు చెప్తూ ప్రజల్లో అనుమానాలను పెంచడమే వారికి ఇష్టం’ అని అన్నారు. రైతులకు ఉచిత కరెంటు రైతులందరికీ ఉచిత విద్యుత్ అందజేస్తామని రాజస్తాన్ సీఎం వసుంధర ప్రకటించారు. ఎన్నికల కమిషన్ రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించటానికి కొద్దిసేపటికి ముందు జరిగిన ‘రాజస్తాన్ గౌరవ యాత్ర’ ర్యాలీలో ఆమె ఈ ప్రకటన చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సత్వరమే నియమావళి అమల్లోకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని జనరల్ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులందరికీ పరిమితికి లోబడి ఉచిత కరెంటు అందజేసే పథకాన్ని 5న ప్రారంభించామన్నారు. ఈ పథకం అన్నదాతల ఆదాయం పెరిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గృహానికి విద్యుత్ సౌకర్యం కల్పించిందని తెలిపారు. రూ.40 వేల కోట్లతో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచామన్నారు. విద్యుత్ సౌకర్యమే లేని గ్రామాల్లో సైతం ప్రస్తుతం 20 నుంచి 22 గంటలపాటు నిరాటంకంగా కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. -
అంబానీ జేబులోకి పేదల సొమ్ము
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పేదల డబ్బు దోచుకుని పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి ధారపోస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ‘దేశానికి కాపలా దారుగా (చౌకీదార్) ఉన్న వ్యక్తి పేద ప్రజలు, అమరవీరులు, జవాన్ల జేబుల్లో నుంచి రూ. 20 వేల కోట్లు తీసుకుని.. వాటిని అంబానీ జేబులో పెట్టారు. ప్రధాని అవ్వగానే ‘చౌకీదార్‌జీ’ నేరుగా ఫ్రాన్స్ వెళ్లి ఆ దేశాధ్య క్షుడితో ఒప్పందం చేసుకున్నారు. హెచ్ఏఎల్ను కాదని అనిల్ అంబానీకి కాంట్రాక్టు ఇవ్వమని కోరారు’ అని ఆరోపించారు. అమేథీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన సోమవారం మాట్లాడుతూ.. రాఫెల్ ఒప్పందం విలువను ఎందుకు బయటపెట్టడం లేదని, అంబానీకి కాంట్రాక్టు ఎలా దక్కిందో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కుట్రలో పాకిస్తాన్ పాత్ర: బీజేపీ రాఫెల్ ఒప్పందం రద్దుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో రాహుల్ గాంధీ పాత్ర ఉందని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హోలండ్ అందులో భాగమని బీజేపీ ఆరోపించింది. బావ రాబర్ట్ వాద్రాకు సంబంధమున్న కంపెనీకి సాయం చేసేందుకు ఒప్పందం రద్దును రాహుల్ కోరుకుంటున్నారని బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అన్నారు. వాద్రాకు సంబంధమున్న కంపెనీని రాఫెల్ ఒప్పందంలో మధ్యవర్తిగా తీసుకోకపోవడంతో అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసుకుందన్నారు. ఈ కుట్రలో పాకిస్తాన్ పాత్ర ఉందని కూడా షెకావత్ చెప్పారు. తదుపరి భారత ప్రధాని రాహుల్ అంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి రెహమాన్ మాలిక్ ట్వీట్ చేయడమే అందుకు నిదర్శనమన్నారు. తనపై ఆరోపణల్ని వాద్రా తోసిపుచ్చారు. నిజాలు నిగ్గుతేల్చండి: రాఫెల్ ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలని కేంద్ర విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సీవీసీ కేవీ చౌదరీకి పూర్తి వివరాలతో మెమొరాండం సమర్పించింది. ఖజానాకు ప్రభుత్వం నష్టం చేకూర్చిందని, కొందరు వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను పక్కనపెట్టి దేశ భద్రతను కేంద్రం ప్రమాదంలో పడేసిందని కాంగ్రెస్ బృందం అందులో ఆరోపించింది. ‘రాఫెల్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రక్షణ రంగ కుంభకోణం. రోజుకొక అంశం వెలుగులోకి వస్తూ అవినీతి జాడలు బయటపడుతున్నా.. రక్షణ శాఖ నుంచి ఎలాంటి సమాధానం లేదు. రాఫెల్ ఒప్పందంలోని అవినీతి, ఆశ్రిత పక్షపాత దుర్గంధం రోత పుట్టిస్తోంది. ఇందులో మీరు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలి’ అని కాంగ్రెస్ కోరింది. -
హారరిన్దీమిడ్నైట్
ఎడిటర్ భార్గవ పెద్దగా నవ్వాడు. ఎంత పెద్దగా అంటే.. ఆ పత్రికా కార్యాలయమే కనుక ఒక పెద్ద ఊడల మర్రి అయి ఉంటే.. ఆ ఊడలన్నీ కదిలిపోయేంత పెద్దగా!గాయత్రి అనే చిన్న పాప రాసిన ఉత్తరం ఆయన చేతిలో ఉంది. ఆ ఉత్తరం చదివాడు. అందుకే అంత పెద్దగా నవ్వాడు. ‘ప్రళయ’ పత్రికా కార్యాలయం అది. ఆ పత్రిక ఎడిటరే భార్గవ. ప్రళయ.. న్యూస్ పేపర్ కాదు. ‘వ్యూస్’ పేపర్. దినపత్రికే కానీ, ఘటనలను ఇవ్వదు. ఘటనల వెనుక ఉన్నదేమిటో ఊహించి ఇస్తుంది. అది కూడా మామూలు ఘటనలు కావు. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, విలయాలు, విపత్తులు, విధ్వంసాలు.. ఇలాంటి వాటిపై వ్యూస్ ఉంటాయి. కేరళలో మొన్న వరదలు వచ్చినప్పుడు ‘అయ్యప్పస్వామికి కోపం వచ్చిందా?’ అని ఈ పత్రిక విరామం లేకుండా స్టోరీల మీద స్టోరీలు కొట్టింది! అయ్యప్పస్వామికి కోపం వచ్చిందో లేదో తేల్లేదు కాదు, ప్రళయపై విమర్శలు మాత్రం వచ్చాయి. కానీ, సర్క్యులేషన్ పెరిగింది! ఏదైనా పత్రికలో ఒకటీ రెండూ కాలమ్స్ బాగా పాపులర్ అయి ఉంటాయి. ‘ప్రళయ’లో అలాక్కాదు. ప్రతి కాలమ్, ప్రతి పేజీ పాపులరే! రోజూ మూడో పేజీలో వచ్చే దెయ్యం కథైతే.. హారరిన్దీమిడ్నైటే! ప్రళయ.. వాకిట్లో పడగానే, దాన్ని చేతుల్లోకి తీసుకున్నవాళ్లు.. వెంటనే పేజీ తిప్పి రైట్ సైడ్ మూడో పేజీలో ఉండే దెయ్యం కథ కోసం వెతుక్కుంటారు. దానికో పెద్ద దెయ్యం బొమ్మ ఉంటుంది. కథ చదవగానే ఎంతటి ధైర్యస్థులకైనా దెయ్యం పట్టినట్లు అవుతుంది. అంత ఘోస్టీ›్లగా ఉంటుంది. పేజ్ త్రీలో వచ్చే కథ.. ‘పేజ్ త్రీ గర్ల్’లా ఉండాలని అంటాడు భార్గవ. అంటే.. వ్యామోహం కలిగించేలా! దెయ్యాల బొమ్మల్ని కూడా అతడు అందమైన అమ్మాయిల్లా వేయిస్తాడు. అసలా పైశాచిక అందానికే సగం ఛస్తారు పాఠకులు. విరబోసుకున్న జుట్టు, ఎరుపెక్కిన కళ్లు, ‘వాడాయ్..’ అని పాట పాడుతున్నట్లు ఉంటుంది ఆ దెయ్యం ఇలస్ట్రేషన్. నవ్వు ఆపుకోలేక పోతున్నాడు భార్గవ. అతడి చేతిలో గాయత్రి అనే ఆ పాప రాసిన ఉత్తరమింకా అలానే ఉంది. మళ్లీ ఒకసారి చదివాడు. ‘‘డియర్ అంకుల్.. మీరు వేసే కథల్లో, బొమ్మల్లో ఎప్పుడూ ఆడ దెయ్యాలే ఉంటాయెందుకు? దెయ్యాల్లో మగ దెయ్యాలు ఉండవా? దయచేసి నా సందేహానికి సమాధానం చెప్పగలరు’’– ఇట్లు మీ పత్రిక రీడర్, గాయత్రి, టెన్త్ క్లాస్, హైదరాబాద్.భార్గవకు సంతోషం వేసింది. ‘ప్రళయ’కు టీనేజ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న సంతోషం అది. కాలింగ్ బెల్ నొక్కాడు.ధడేల్మని తలుపు తోసుకుని వచ్చాడు ప్రళయ కిశోర్. ఆఫీస్ బాయ్ అతడు. అతడి పేరు కిశోర్ మాత్రమే. ప్రళయలో పని చేస్తున్నాడు కాబట్టి ప్రళయ కిశోర్. ఆ ఆఫీస్‌లో ప్రతి ఒక్కరి పేరుకు ‘ప్రళయ’ అన్న మాట ప్రీఫిక్స్గా ఉంటుంది. ఆ నియమం పెట్టింది కూడా భార్గవే. చేస్తున్న పని మీద, చేస్తున్న వృత్తి మీద గౌరవం ఉన్నా లేకున్నా, ఆఫీస్‌లో ఉన్నంత వరకు గౌరవం పాటించడానికి పెట్టిన నిబంధన అది. తనని కూడా ప్రళయ భార్గవ అనే అనమంటాడు భార్గవ.‘‘ప్రళయ మనోహర్ని రమ్మను’’.. బాయ్‌తో చెప్పాడు భార్గవ. మనోహర్ వచ్చాడు. కూర్చోమనలేదు భార్గవ. అతడికి తెలుసు.. తన స్టాఫ్ ఎవరికీ ఎడిటర్ ఎదురుగా కూర్చునేంత తీరిక ఉండదని. ‘‘ఇవాళ్టి పేజ్ త్రీ దెయ్యం కథ వచ్చిందా?’’ అడిగాడు. ‘‘రాలేదు సార్’’ అన్నాడు ప్రళయ మనోహర్. ‘‘ఎందుకు రాలేదు?’’ పెద్దగా అరిచేశాడు భార్గవ. ఉలిక్కిపడ్డాడు ప్రళయ మనోహర్. మూడో పేజి ఇన్‌ఛార్జి అతడు. పేజ్ త్రీ దెయ్యం కథ బయటి నుంచి వస్తుంది. దాన్ని రాస్తున్నది ప్రళయ భయంకర్. భయంకర్ అసలు పేరు దీనదయాళ్. భార్గవే అతడికి భయంకర్ అనే పేరు పెట్టాడు.‘‘ఇంకా పది కథలు రెడీగా ఉన్నాయి సార్’’ అన్నాడు ప్రళయ మనోహర్.. ‘ఇంకో పది రోజుల దాకా ప్రళయ భయంకర్ కథ ఇవ్వకున్నా పర్లేదు’ అన్న టోన్‌లో. ‘‘సో.. మిస్టర్ ప్రళయ మనోహర్.. ఇంకో పది రోజులు మిమ్మల్ని నా క్యాబిన్లోకి పిలవక్కర్లేదనేనా మీరు అంటున్నారు!’’ అన్నాడు భార్గవ. ప్రళయ మనోహర్ భయంతో బిగదీసుకుపోయాడు. అతడి భయం చూసి భార్గవ కాస్త తగ్గుముఖం పట్టాడు. ‘‘ఎన్ని కథలు రెడీగా ఉన్నా, ఇవాళ్టి కథను మనం రెడీ చేసుకోవాల్సిందే మనోహర్. లేకుంటే పత్రికను నడపలేం’’ అన్నాడు. ‘‘సర్.. ఫోన్ చేశాను. వాళ్ల మిసెస్‌కి బాగోలేదట. అయినప్పటికీ, లెవన్త్ అవర్లోనైనా ఇచ్చేస్తానన్నారు’’.. చెప్పాడు మనోహర్.‘‘ఏం బాగోలేదట?’’.. క్యాజువల్‌గా అడిగాడు భార్గవ. చాలా క్యాజువల్‌గా. జనరల్‌గా అతడు అలా అడగడు. ఆఫీస్ స్టాఫ్‌లో కూడా లేడీస్‌కి ఎవరికైనా బాగోలేదని తెలిస్తే, ‘ఏమైంది?’ అని అడగడు. జస్ట్ బాగోలేదు అన్నంతవరకే ఆ టాపిక్‌కి ఆపేస్తాడు. ‘‘ఏం బాగోలేదట?’’ మళ్లీ అడిగాడు.. ఆ అడగడంలో, తనకు కథ రాలేదన్న అసహనం కన్నా, భయంకర్పై కన్సర్నే ఎక్కువగా ఉంది. ‘‘దెయ్యం పట్టిందట సర్.. వాళ్లావిడకు’’ చెప్పాడు మనోహర్. ‘‘వ్హాట్..!’’ అన్నాడు భార్గవ. భార్గవ క్యాబిన్లో అతడి ఎదురుగా కూర్చొని ఉన్నాడు భయంకర్. అతడి చేతిలో ఆవేళ్టి కథ ఉంది. ఇస్తానన్నట్లుగానే క్రితం రోజు కథను క్రితం రోజు రాత్రే చివరి నిముషంలో పంపించాడు కూడా. ‘‘మిసెస్ భయంకర్ ఇప్పుడెలా ఉన్నారు’’ అడిగాడు భార్గవ. ‘‘తను ఓకే.. నేనే బాగోలేనట..’’ ‘‘డాక్టర్ చూసింది తననా, మిమ్మల్నా?’’ నవ్వాడు భార్గవ.‘‘తనని చూసి, నాకు చెప్పాడు. దెయ్యం పట్టినట్లు బిహేవ్ చేస్తోంది డాక్టర్ అని చెప్పాను. ‘అయితే అది ఆమె ప్రాబ్లమ్ కాదు, మీ ప్రాబ్లమ్’ అన్నాడు. ‘అదేంటి డాక్టర్?’ అన్నాను. మీరు ఆమెను పట్టించుకోకపోవడం వల్లనే, ఆ స్పేస్‌లో ఆమెకు దెయ్యం పట్టింది’ అన్నాడు!’’.. చెప్పాడు భయంకర్. భయంకర్ వెళ్లిపోయాక, శ్రీకంఠను పిలిపించాడు భార్గవ. దెయ్యం కథకు రెగ్యులర్‌గా బొమ్మలు వేస్తుండే ఆర్టిస్ట్ అతడు.‘‘ఇవాళ్టి నుంచి, దెయ్యం కథకు మగ దెయ్యం బొమ్మ వెయ్యండి’’ చెప్పాడు భార్గవ. సంశయంగా అక్కడే ఆగిపోయాడు శ్రీకంఠ. ‘‘సర్క్యులేషన్ పడిపోయినా పర్లేదు.. మగదెయ్యం బొమ్మ వెయ్యండి’’ చెప్పాడు భార్గవ. - మాధవ్ శింగరాజు -
అతిపెద్ద కుంభకోణం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక విడుదల చేసిన వేళ ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు దేశచరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. గురువారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలైన స్నేహితులకు డబ్బులు సమకూర్చేందుకే సామాన్యులపై మోదీ నోట్ల రద్దు అస్త్రాన్ని ప్రయోగించారని విమర్శించారు. ‘పెద్ద నోట్ల రద్దు కారణంగా చెల్లకుండాపోయిన నగదంతా బ్యాంకులకు తిరిగివచ్చేసింది. ఇది భారీ కుంభకోణానికి ఏమాత్రం తక్కువకాదు’ అని వ్యాఖ్యానించారు. ‘దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలైన ఆయన మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని ఉద్దేశపూర్వకంగా నోట్ల రద్దుతో సామాన్యులపై దాడికి పాల్పడ్డారు.గత ఎన్నికల్లో ప్రచారానికి భారీగా డబ్బులు ఖర్చుపెట్టిన పారిశ్రామికవేత్తలకు సాయం చేయడమే ఆయన లక్ష్యం’ అని రాహుల్ మండిపడ్డారు. బీజేపీ చీఫ్ అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్న గుజరాత్‌లోని ఓ సహకార బ్యాంకులో ఏకంగా రూ.700 కోట్ల విలువైన రద్దయిన నోట్లను కొందరు మార్చుకోవడంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకులో ఎవరి నగదు మార్పిడి జరిగిందో విచారణ జరిపారా? అని ప్రశ్నించారు. రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని ఆర్థికమంత్రి జైట్లీకి తాము పెట్టిన డెడ్‌లైన్ గడువు ముగుస్తోందన్నారు. రాహుల్‌తో కుమారస్వామి భేటీ కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాహుల్‌గాంధీని కర్ణాటక సీఎం కుమారస్వామి ఢిల్లీలో కలిశారు. కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై ఇద్దరు నేతలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై త్వరలో∙నిర్ణయం తీసుకుంటామని అనంతరం కుమారస్వామి మీడియాతో అన్నారు. -
మానవ తప్పిదం వల్లే కేరళ విపత్తు!
తిరువనంతపురం: జలవిలయంలో తీవ్రంగా నష్టపోయిన కేరళలో సహాయక చర్యలు దాదాపు పూర్తి కావస్తుంటే మరోవైపు వరద రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. కేరళ వరదలు మానవ తప్పిదం వల్ల చోటుచేసుకున్న విపత్తేనని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఒకేసారి 40 ఆనకట్టల గేట్లు ఎత్తడమే ఈ కల్లోలానికి కారణమని రాష్ట్రంలోని లెఫ్ట్ సర్కారుపై రాష్ట్ర ప్రతిపక్షంతో పాటు బీజేపీ ఆరోపించాయి. విపత్తుపై న్యాయ విచారణకు డిమాండ్ ఈ మహాప్రళయానికి దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణకు ఆదేశించాలని మంగళవారం కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల డిమాండ్ చేశారు. ‘పంబ నదీ పరీవాహకంలోని 9 డ్యాంలు, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో పెరియార్‌పై 11, త్రిస్సూర్‌లోని చాలకుడి నదీ పరీవాహకంలో ఆరు డ్యాంల నుంచి నీటిని ఒక్కసారి విడుదల చేస్తే ఏ ప్రాంతాలు ముంపునకు గురవుతాయో అనేదానిపై ప్రభుత్వానికి అవగాహన శూన్యం. సరైన హెచ్చరికలు చేయకుండా ఒకేసారి 44 డ్యాంల ఆనకట్టల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు.’ అని ఆయన అన్నారు. ఈ విపత్తుకు విజయన్ ప్రభుత్వానిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై తప్పుపట్టారు. ముందస్తు హెచ్చరికలు చేశాకే నీటి విడుదల ‘మా నియంత్రణలో ఉన్న డ్యాంల విషయంలో తప్పిదం జరగలేదు. హెచ్చరికలు జారీచేశాకే నీటిని విడుదల చేశాం. నదులు భారీ వర్షాల కారణంగా ఉప్పొంగాయి. డ్యాంల గేట్లు ఎత్తివేయడం వల్లే వరదలు సంభవించాయి అనడంలో అర్థంలేదు’ అని కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు(కేఎస్ఈబీ) చైర్మన్ కేపీ శ్రీధరన్ వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలు అర్థరహితమని డ్యాంల భద్రతా విభాగం చైర్మన్ రామచంద్రన్ చెప్పారు. ఈ వరద కేవలం అధిక వర్షపాతం వల్లే చోటుచేసుకోలేదని, నిర్లక్ష్యం తోడైందని విపత్తు పరిశోధన ప్రత్యేక విభాగం చైర్పర్సన్, ఢిల్లీ జేఎన్‌యూ వర్సిటీ ప్రొఫెసర్ అమృతా సింగ్ అన్నారు. శరవేగంగా పునర్నిర్మాణ పనులు: కేరళలో పునర్నిర్మాణం, పారిశుధ్య పనులు ఊపందు కున్నాయి. బురద, చెత్తతో నిండిన ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్ని శుభ్రం చేయడంతో ప్రజలు నిమగ్నమయ్యారు. శిబిరాల నుంచి ఇళ్లకు చేరుతున్న బాధితులు ఇంట్లో నిండిన బురద, భారీ చెత్తను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడైపోయాయి. పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి. ‘మేం మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సిందే. ఏమీ మిగల్లేదు’ అని ఓ మహిళ చెప్పింది. బావులన్నీ మురికినీటితో కలుషితం కావడం వల్ల ప్రజలు తీవ్ర తాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు. సులువుగా బీమా పరిహారం కేరళ వరద బాధితుల బీమా క్లెయిమ్‌లు త్వరగా పరిష్కరించేందుకు ఎల్ఐసీ నిబంధనలను సరళీకరించింది. పాలసీదారుడి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని అతడి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేయబోమని బుధవారం ప్రకటించింది. అధీకృత ప్రభుత్వ అధికారి ఇచ్చే ఏదైనా పత్రం లేదా ప్రభుత్వం నుంచి పరిహారం పొందినట్లు ఆధారాలు ఇస్తే చాలు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా(పీఎంజేజేబీవై) పథకంలో చేరిన పాలసీదారుల క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు భాగస్వామ్య బ్యాంకులతో కలసిపనిచేస్తున్నామని తెలిపింది. కేరళకు సిద్ది వినాయక్ రూ.కోటి సాయం సాక్షి, ముంబై: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రూ. కోటి సాయం ఇవ్వనున్నట్లు ప్రభాదేవిలోని సిద్ది వినాయక్ ఆలయ ధర్మకర్తల మండలి ప్రకటించింది. ఈ మొత్తాన్ని చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నారు. పతంజలి నుంచి రూ.2 కోట్ల సాయం: బాబా రాందేవ్ వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న కేరళ, కర్ణాటకలను ఆదుకునేందుకు పతంజలి సంస్థ తమ వంతు కృషిచేస్తోంది. ‘టూత్‌పేస్టులు మొదలుకొని మంచి నీటి బాటిళ్ల వరకు ఇలా దాదాపు రూ.50 లక్షల విలువైన సరకులను ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు పంపించాం. మరో వారంలో అదనంగా దాదాపు రూ.1.5కోట్ల విలువైన సహాయక సామగ్రిని వరద బాధిత రాష్ట్రాలకు తరలిస్తాం’ అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు. ఇంకా వరద ముంపులోనే పలు ప్రాంతాలు ఆగస్టు 8 నుంచి వరదల్లో 231 మంది మరణించగా.. ఇంకా 32 మంది ఆచూకీ తెలియడం లేదు. సహాయక శిబిరాల్లో 14.5 లక్షల మంది తలదాచుకున్నారు. కుట్టనంద్, అలపుజా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. కేరళకు కేంద్రం రూ. 600 కోట్ల సాయాన్ని విడుదల చేయగా.. మరోవైపు ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి ఇంతవరకూ రూ. 309 కోట్ల విరాళాలు అందాయి. -
అమిత్ షా జెండా వందనంలో అపశృతి
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తడబడ్డారు. దేశరాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో షా జెండా ఆవిష్కరిస్తుండగా.. జాతీయ పతాకం ఒక్కసారిగా నేలపై పడిపోయింది. దీంతో వెంటనే తేరుకున్న షా.. జెండా తాడును వేగంగా లాగి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. జెండా ఆవిష్కరణ అనంతరం షా జాతీయ జెండాకు కాకుండా మరోవైపు తిరిగి సెల్యూట్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. జాతీయ పతాకం కిందకు పడిపోవడంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ‘జాతీయ జెండాను సరిగ్గా ఆవిష్కరించలేని వాళ్లు దేశాన్ని ఏం పాలిస్తారు? గత 50 ఏళ్లుగా జాతీయ జెండాను గుర్తించడానికి వారు తిరస్కరించి ఉండకపోతే.. ఇవాళ జాతీయ పతాకం ఇలా నేలపై పడిపోయేదే కాదు’ అని ట్వీట్ చేసింది. భారత మాత తన విచారాన్ని జెండా ద్వారా ప్రకటించిందని ఆప్ ట్వీట్ చేసింది. -
‘కార్పొరేటు’ సేవలో ఇంటర్ బోర్డు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల సేవలో ఇంటర్మీడియెట్ బోర్డు తరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది బోర్డు అధికారులు కార్పొరేట్ కాలేజీలకు తొత్తులుగా మారారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే అనేక మినహాయింపులను బోర్డు ఇస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా సంతృప్తి చెందని సదరు యాజమాన్యాలు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు బోర్డు అధికారులపై ఇంకా ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. కాలేజీల అనుబంధ గుర్తింపు వ్యవహారంలో బోర్డు తీరుపై అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తినా పట్టించుకోని అధికారులు.. హాస్టళ్ల గుర్తింపు విషయంలోనూ అదే ధోరణి తో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 50 కాలేజీలే దరఖాస్తు: రాష్ట్రంలో 600 వరకు కాలేజీల్లో విద్యార్థులకు హాస్టళ్లు ఉండగా, అందులో రెండుసార్లు అవకాశం ఇచ్చినా 50 లోపు కాలేజీలే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా హాస్టళ్ల ఇన్స్పెక్షన్ ఫీజు, అనుమతి ఫీజు, ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఓ విధానం అంటూ లేకుండా, శాస్త్రీయ అంచనాలు లేకుండా, యాజమాన్యాల ఒత్తిడికి ఇంటర్ బోర్డు తలొగ్గుతూనే ఉంది. ఆ ఫీజుల విషయంలో యాజమాన్యాల డిమాండ్లకు ఇప్పటికే ఓసారి తలొగ్గిన బోర్డు మరోసారి తలొగ్గి ఫీజులను భారీగా తగ్గించింది. అయినా ఫీజులను ఇంకా తగ్గిస్తేనే తాము కోర్టులో ఉన్న కేసును విత్‌డ్రా చేసుకుంటామంటూ ఒత్తిడి చేస్తుండటంతో ఏం చేయా లో తెలియని గందరగోళంలో బోర్డు పడింది. నెలాఖరుకు ముగియనున్న గడువు రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల హాస్టళ్లలో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. వాటిలో సరైన సదుపాయాలు ఉండేలా చేసేందుకు, వాటిని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హాస్టళ్లను బోర్డు పరిధిలోకి తెచ్చి నియంత్రించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా బోర్డు అధికారులు ఇన్స్పెక్షన్, అనుమతి, ఫిక్స్డ్ డిపాజిట్ ఫీజులను నిర్ణయించారు. అంత మొత్తం తాము చెల్లించబోమంటూ యాజమాన్యాలు మొండికేయడం, పైగా బోర్డుకు ఆ అధికారం లేదంటూ కోర్టును ఆశ్రయించడంతో ఫీజులను తగ్గించాల్సి వచ్చి ంది. ఆ తగ్గింపు కూడా సరిపోదని, మరింత గా తగ్గించాలని డిమాండ్ చేశాయి. ఆ మేరకు తాజాగా కూడా ఫీజులను తగ్గించినా.. హాస్టళ్ల గుర్తింపు కోసం కాలేజీలు దరఖాస్తు చేసుకోవడం లేదు. మరింతగా తగ్గించాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది. కాలేజీల హాస్టళ్లకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేందుకు బోర్డు ఈనెల 6 నుంచి అవకాశం కల్పించింది. కానీ ఇప్పటివరకు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 20తోనే దరఖాస్తు గడువు ముగియగా, రూ.5 వేల ఆలస్య రుసుముతో బుధవారంతో గడువు ముగిసింది. రూ.10 వేల ఆలస్య రుసుముతో ఈనెల 31తో గడువు ముగియనుంది. ఇంకా తగ్గించాల్సిందే.. ♦ ఫిక్స్డ్ డిపాజిట్లను భారీగా తగ్గించినా ఇంకా తగ్గించాలంటూ యాజమాన్యాలు పట్టుపడుతున్నాయి. 200 మంది వరకు ఉంటే రూ.లక్ష, 201 నుంచి 500 లోపు ఉంటే రూ.2 లక్షలు, 501 కంటే ఎక్కువ మంది ఉంటే రూ.3 లక్షలు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్‌గా చెల్లిస్తామని పట్టుపడుతున్నాయి. ♦ కార్పొరేషన్ పరిధిలో ఇన్స్పెక్షన్ ఫీజు ఏటా రూ.80 వేలుగా, అనుమతి ఫీజు రూ.లక్షగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. యాజమాన్యాల డిమాండ్ మేరకు తర్వాత వరుసగా రూ.55 వేలు, రూ.65 వేలకు తగ్గించింది. అయినా యాజమాన్యాలు ఒప్పుకోకపోవడంతో తాజాగా ఇన్స్పెక్షన్కు రూ.30 వేలుగా, అను మతికి రూ.40 వేలు ఫీజుగా నిర్ణయించింది. అయినా తగ్గించాలని, ఇన్స్పెక్షన్కు రూ.25 వేలు, అనుమతి ఫీజు రూ.30 వేలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ♦ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొదట ఇన్స్పెక్షన్కు రూ.60 వేలు, అనుమతి ఫీజు రూ.80 వేలు ఉండగా తర్వాత దాన్ని రూ.40 వేలు, రూ.50 వేలకు బోర్డు తగ్గించింది. తాజాగా ఇన్స్పెక్షన్కు రూ.25 వేలు, అనుమతికి రూ.30 వేలుగా నిర్ణయించింది. వాటిని వరుసగా రూ.20 వేలు, రూ.25 వేలుగా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ♦ గ్రామ పంచాయతీల్లో ఇన్స్పెక్షన్కు రూ.50 వేలు, అనుమతికి రూ.60 వేలుగా నిర్ణయించగా తర్వాత ఇన్స్పెక్షన్కు రూ.30 వేలు, అనుమతికి రూ.40 వేలకు తగ్గించింది. తాజా గా ఇన్స్పెక్షన్కు రూ.20 వేలుగా, అనుమతి ఫీ జు రూ.25 వేలుగా నిర్ణయించింది. వాటిని రూ.10 వేలు, రూ.15 వేలకు తగ్గించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. -
మా ఉద్దేశం అది కాదు
సిగరెట్ తాగుతూ ఉన్న విజయ్ లేటెస్ట్ సినిమా ‘సర్కార్’ ఫస్ట్ లుక్ తమిళనాడులో తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈ పోస్టర్ తప్పుదోవ పట్టించేలా ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ – ‘‘సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. సినిమాలో పాత్రల కోసం యాక్టర్స్ ధూమపానం చేస్తారు తప్పితే కావాలని కాదు. యువతను తప్పు దోవ పట్టించాలని ఉద్దేశం కూడా కాదు. మా నాన్నకి సిగరెట్ అలవాటు ఉండేది. ఆయన్ను చూసి నేను అలవాటు చేసుకోలేదే? చెడుని తీసుకోవాలా? వద్దా? అనే విషయం మన మీద ఆధారపడి ఉంటుంది. కేవలం పబ్లిసిటీ కోసం సినిమాల్లో పోస్టర్స్ గురించి మాట్లాడటం తప్పు. ఈ ప్రాబ్లమ్‌ని నిజంగా సాల్వ్ చేయాలనుకునేవాళ్లు సిగరెట్ తయారు చేసేవాళ్లను తప్పుపట్టండి’’ అన్నారు. -
‘కార్పొరేట్లకు తలవంచుతా.. నేనెవర్ని?’
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్(79)పై అల్లరిమూక దాడిచేసిన ఘటనపై ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శలు గుప్పించారు. మోదీ తీరును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘నేను దేశంలో శక్తిమంతమైన కార్పొరేట్లకు తలవంచుతాను. బలం, అధికారమే నాకు ముఖ్యం. నేను ప్రజల్లో భయం, విద్వేషం వ్యాప్తిచేసి అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తా. బలహీనుల్ని తొక్కిపడేస్తా. నాకు ఎంతమేరకు ఉపయోగపడతారన్న దాన్ని బట్టే చుట్టూ ఉన్నవారిని గౌరవిస్తా. నేనెవర్ని?’ అని రాహుల్ ట్వీట్ చేశారు. స్వామి అగ్నివేశ్‌పై అల్లరిమూక దాడి వీడియో క్లిప్‌ను ఈ ట్వీట్‌కు జతచేశారు. జార్ఖండ్‌లోని పకుర్‌లో హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఓ అల్లరిమూక అగ్నివేశ్‌పై మంగళవారం దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. బీజేపీ అనుబంధ బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలే తనపై దాడిచేశారని అగ్నివేశ్ ఆరోపించారు. -
విపక్షాలది మొసలికన్నీరు
మిర్జాపూర్: రైతులు, వారి సమస్యల విషయంలో కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ మొసలికన్నీరు కారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వీరు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని, నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించి అన్నదాతకు దుర్భరమైన పరిస్థితులను సృష్టించారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ సమీపంలో బాణ్‌సాగర్ కెనాల్ ప్రాజెక్టును ప్రారంభించడంతోపాటు, మిర్జాపూర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన (మొత్తంగా రూ.4వేల కోట్ల అభివృద్ధి పనులకు) చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు రైతుల సమస్యలపై మొసలికన్నీరు కారుస్తూ.. రాజకీయాలు చేస్తున్న వారంతా అధికారంలో ఉన్నప్పుడు సరైన కనీస మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. కపటప్రేమను నటిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల రైతుల ఆదాయం రెట్టింపయ్యే రోజులు మరెంతో దూరంలో లేవన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయిన విషయాన్ని మోదీ గుర్తు చేస్తూ.. ‘ఈ బాణ్‌సాగర్ ప్రాజెక్టు ఒకటే కాదు.. రైతు సంక్షేమానికి సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులను ఆపడం, పెండింగ్‌లో పెట్టడం, పక్కదారి పట్టించడం వంటి ఎన్నో పనులు చేశారు. ఎప్పుడూ రైతుల సమస్యలపై దృష్టిపెట్టలేదు. వారు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే.. ఇంత కీలకమైన ప్రాజెక్టు ఎందుకు అటకెక్కింది?’ అని విమర్శించారు. 40 ఏళ్ల క్రితమే చేసుంటే..! ‘వ్యవసాయం, రైతుల పేరుతో గత ప్రభుత్వాలు ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేయడమో, కావాలని ఆలస్యం చేయడమో చేశారు. అసలు వీరు రైతుల గురించి కనీసం కూడా ఆలోచించలేదు. అందుకే ఇన్ని దశాబ్దాలుగా రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రూ.3,500 కోట్ల బాణ్‌సాగర్ ప్రాజెక్టు వల్ల మిర్జాపూర్, అలహాబాద్ ప్రాంతాలతో సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షన్నర హెక్టార్లలో పంటసాగవుతుంది. 40 ఏళ్ల క్రితమే ఫ్రేమ్‌వర్క్ సిద్ధమైన ఈ ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తయి ఉంటే.. దశాబ్దాల క్రితం నుంచే ఎన్నో రైతు కుటుంబాలు ఆనందంగా ఉండేవి’ అని ప్రధాని పేర్కొన్నారు. యోగి నేతృత్వంలో యూపీ ప్రభుత్వం పూర్వాంచల్‌లో అభివృద్ధిని వేగవంతం చేస్తోందని ప్రశంసించారు. రైతులకు మేలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కనీస మద్దతు ధరను పెంచిందన్నారు. ‘గతంలో కూడా ఎమ్మెస్పీలను ప్రకటించారు. పత్రికలు, చానెళ్లలో ఫొటోలు వేసుకుని భారీగా ప్రచారం చేసుకున్నారు. పని చేశామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ రైతుల వద్దనుంచి కొనుగోళ్లు చేయలేదు. దీంతో రైతుల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు’ అని మోదీ విమర్శించారు. మేక్రాన్‌కూ నచ్చింది! వింధ్యా, భగీరథి పర్వతాల మధ్య ఉన్న ఈ ప్రాంతం చాలా పవిత్రమైనదని.. మొన్నటి మార్చి నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ వచ్చినపుడు ఈ ప్రాంత విశిష్టత, వింధ్యావాసినీ మాత ప్రాశస్త్యం తెలుసుకుని ఆశ్చర్యపోయారని కూడా మోదీ పేర్కొన్నారు. నేడు పశ్చిమబెంగాల్‌కు ప్రధాని పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో సోమవారం జరగనున్న రైతు సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. -
ముస్లిం పురుషుల పార్టీ కాంగ్రెస్!
ఆజంగఢ్: కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం పురుషుల పక్షానే నిలుస్తుందని ప్రధాని మోదీ∙విమర్శలు చేశారు. ట్రిపుల్ తలాక్‌పై వీరు అనుసరిస్తున్న ధోరణే ఇందుకు నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో–ఘాజీపూర్‌లను అనుసంధానించే 340 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకు (రూ.23వేల కోట్లు విలువైన) ఆజంగఢ్‌లో మోదీ శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటుచేసిన సభలో కాంగ్రెస్ సహా విపక్షాలపై నిప్పులు చెరిగారు. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మోదీ విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ముస్లిం మహిళల కష్టాలపై విపక్ష పార్టీల అసలు రంగు బయటపడింది. మహిళల జీవితాల్లో వెలుగు తేవాలని మేం చూస్తుంటే విపక్ష పార్టీలు ముస్లిం మహిళల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లిం మహిళలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటానని భరోసా ఇస్తున్నా’ అని అన్నారు. ట్రిపుల్ తలాక్‌ను అడ్డుకుంటూ.. ‘కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పినట్లు వార్తాపత్రికల్లో చదివాను. దీనిపై చర్చ జరుగుతోంది. సహజవనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉంటుందని ప్రధానిగా మన్మోహన్ ఆనాడు అన్నారు. కాంగ్రెస్ ముస్లిం పురుషుల కోసమేనా? ముస్లిం మహిళల హక్కులను గౌరవించే అవకాశం మీ పార్టీలో ఉందా? ట్రిపుల్ తలాక్‌ను అడ్డుకునేందుకు రాజ్యసభ జరగకుండా చేస్తున్నారు’ అని మండిపడ్డారు. లోక్‌సభలో ఆమోదం పొందిన తలాక్ బిల్లును రాజ్యసభలో విపక్షాలు అడ్డుకోవడం తెల్సిందే. కాంగ్రెస్, విపక్షాలు బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. బీజేపీ మాత్రం ఆ పార్టీలు బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నాయంది. ‘ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా బాధితులను కలవండి. వారి బాధలేంటో అర్థం చేసుకోండి’ అని విపక్షాలను ప్రధాని కోరారు. నాలుగేళ్ల కృషికి ఫలితమిది వారణాసి దుస్థితికి గత ప్రభుత్వాల విధానాలే కారణమని మోదీ విమర్శించారు. వారణాసిలో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘వారణాసిలో మార్పు ఇప్పుడిప్పుడే కనబడుతోంది. మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతోనే ఈ మార్పు సాధ్యమైంది. గత ప్రభుత్వాలు వారణాసిని పూర్తిగా విస్మరించాయి’ అని అన్నారు. ‘గతంలో బద్ధశత్రువులైన పార్టీలు (పరోక్షంగా బీఎస్పీ, ఎస్పీలను పేర్కొంటూ) ఇప్పుడు ఒక్కటయ్యాయి. దళితులు, వెనుకబడిన వర్గాలకు మాయమాటలు చెప్పి ఓట్లు అడిగిన వీరు గెలిచాక తమ జేబులు నింపుకుంటున్నారు’ అని విమర్శించారు. వారణాసితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు లబ్ధి చేకూర్చే దాదాపు రూ.వెయ్యికోట్ల పనులను మోదీ ప్రారంభించారు. అది మా ఆలోచనే: అఖిలేశ్ తమ ప్రభుత్వం చేసిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే అని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ అన్నారు. తమ ప్రాజెక్టులనే బీజేపీ అమల్లోకి తెస్తోందన్నారు. ‘ఈ ప్రాజెక్టుకు మేం సమాజ్‌వాదీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ అని పేరుపెట్టాం. కానీ సమాజ్‌వాదీని పక్కనపెట్టిన బీజేపీ ఇది తన ఘనతగా చెప్పుకుంటోంది’ అని లక్నోలో విమర్శించారు. ఈ విమర్శలను సీఎం యోగి తిప్పికొట్టారు. ఎస్పీ ప్రభుత్వం భూసేకరణ, పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే టెండర్లకు పిలిచి చేతులు దులుపుకుందని ఆయన వెల్లడించారు. -
కమల్‌కు ట్విట్టర్లో చురకలు
చెన్నై: కులానికి వ్యతిరేకంగా ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్లో దుమారం రేగుతోంది. కులంపై తన కూతురు శ్రుతి హాసన్ చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. సంస్కరణలను ముందుగా కమల్ ఆయన ఇంటి నుంచి ప్రారంభించాలని సూచించారు. తన ఇద్దరు కూతుళ్ల స్కూల్ అడ్మిషన్ దరఖాస్తులో కులం, మతానికి సంబంధించిన కాలమ్‌ను ఖాళీగా వదిలేశానని కమల్ ఇటీవల ట్వీట్‌చేశారు. వచ్చే తరానికి కులం, మతం గురించి తెలియకుండా చేయాలంటే ఇదే సరైన మార్గమన్నారు. అయితే, కమల్ ట్వీట్‌పై ట్విట్టర్లో విమర్శల దాడి మొదలైంది. కొన్నేళ్లక్రితం శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. తాను ‘అయ్యంగర్’ (బ్రాహ్మణ) అని పేర్కొన్న వీడియోను ఓ ట్విటర్ ఖాతాదారుడు పోస్ట్ చేశాడు. ‘పిల్లలకు వారి కులం తెలియకుండా పెంచాలి’ అని వ్యాఖ్యానించాడు. ‘జంధ్యం తీసి, కుల ధ్రువీకరణ పత్రాన్ని చించినంత మాత్రాన కులం పోదు’ అని ట్వీట్‌చేశారు. -
అనిశ్చితి సృష్టించడమే వారి పని
మఘర్ (యూపీ): స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలన్నీ చేతులు కలిపి సమాజంలో అనిశ్చితి సృష్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 1975లో ఎమర్జెన్సీ విధించిన వారు, అప్పుడు దాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు కలిసి ఒకే కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మఘర్‌లో 15వ శతాబ్దం నాటి కవి, తత్వవేత్త కబీర్ దాస్ 500వ వర్ధంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ.. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో విపక్షాలపై నిప్పులుగక్కారు. ‘అధికారం కోసం ఎంతకైనా దిగజారేందుకు సిద్ధమయ్యారు. ఎమర్జెన్సీని విధించిన వారు, దీన్ని అప్పుడు వ్యతిరేకించినవారు.. నేడు కలసి నడుస్తున్నారు. ఇది కేవలం అధికారాన్ని దక్కించుకోవడానికే. వారికి దేశం, సమాజ సంక్షేమం గురించి పట్టింపు లేదు. కేవలం తమ కుటుంబ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని పనిచేశారు. తమ జేబులు నింపుకునేందుకు పేదలు, అణగారిన, బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేశారు. కోట్ల విలువైన భవంతులు కట్టుకుంటున్నారు’ అని మోదీ విమర్శించారు. కుల, మతాలకు అతీతంగా సమాజంలో అందరూ ఉండాలంటూ తన కవితలతో ప్రచారం చేసిన కబీర్ దాస్ మఘర్లోనే తుదిశ్వాస విడిచారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయే. ఎస్పీ, బీఎస్పీలపై విమర్శలు ‘ఒకవేళ సమాజంలో అనిశ్చితి ఏర్పడితే.. అది తమకు రాజకీయంగా లాభిస్తుందనేది వారి ఆలోచన. కానీ వారు వాస్తవం నుంచి చాలా దూరంలో ఉన్నారు. సంత్ కబీర్, అంబేడ్కర్, మహాత్మాగాంధీ వంటి మహామహులు పుట్టిన ఈ దేశంలోని ప్రజల మనసుల్లో ఏముందో అర్థం చేసుకోలేకపోతున్నారు. సమాజ్‌వాద్, బహుజన్ అని చెప్పుకుంటున్న వారంతా పూర్తి స్వార్థపరులు’ అని పరోక్షంగా ఎస్పీ, బీఎస్పీలపై ప్రధాని విమర్శలు చేశారు. ‘కబీర్ దాస్తోపాటు, రాయ్దాస్, మహాత్మా పూలే, గాంధీ, అంబేడ్కర్ తదితరులు సమాజంలోని అసమానతలు తొలగిపోవాలని చాలా కృషిచేశారు. దురదృష్టవశాత్తూ.. సమాజంలో విభజన తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందేందుకే.. కొందరు ఈ మహామహుల పేర్లను వాడుకుంటున్నారు’ అని ప్రధాని ఆరోపించారు. మఘర్‌ను ప్రపంచ సామాజిక సామరస్య కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కబీర్ సమాధి వద్ద మోదీ చాదర్ సమర్శించారు. సంత్ కబీర్ అకాడెమీకి శంకుస్థాపన చేశారు. విలువైన నేత పీవీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 97వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశచరిత్రలో అత్యంత సంకట పరిస్థితుల్లో పీవీ చూపిన విలువైన నాయకత్వ పటిమ మరువలేమని ప్రశంసించారు. ‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విలువైన నాయకుడు. అద్భుతమైన రాజనీతిజ్ఞతతో దేశ చరిత్రలో క్లిష్టమైన సమయాల్లో తన గొప్ప నాయకత్వ లక్షణాలతో దేశాన్ని ముందుకు నడిపారు. అద్భుతమైన మేధస్సు ఆయన సొంతం’ అని ట్వీట్ చేశారు. -
నీతి ఆయోగ్‌తో లాభం లేదు
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు (విపక్ష పార్టీలు) తమ ఐక్యతను ప్రదర్శించారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై అంశాల వారీగా విమర్శలు చేశారు. 15వ ఆర్థిక సంఘం నివేదిక, కేంద్ర నిధుల పంపిణీ తదతర అంశాలపై ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నీతి ఆయోగ్‌తో రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదని. ఏదో జరుగుతుందని కూడా తాము భావించడం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘రాష్ట్రాల సమస్యలను తెలుసుకునేందుకు కేంద్రం ప్రయత్నించిందా? ప్రతి రాష్ట్రానికి వేర్వేరు సమస్యలున్నాయి. కేంద్రం విధివిధానాలను నిర్ణయిస్తుంది. కానీ అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే కదా. కేంద్రం సహకార సమాఖ్య విధానాన్ని అవలంబించాలి. రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు’ అని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతు రుణమాఫీని సమావేశంలో లేవనెత్తారు. రైతు రుణమాఫీలో 50 శాతం సాయాన్ని కేంద్రమే భరించాలని కర్ణాటక సీఎం కుమారస్వామి కోరారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను పునర్నిర్వచించాలని కేరళ సీఎం పినరయి విజయన్ కోరారు. ‘కేంద్రం విడుదల చేసే నిధులు రాష్ట్రాలకు సమానంగా చేరేందుకు.. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను పునర్నిర్వచించాలి’ అని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
సోనియా నిజమైన ఇండియన్
సాక్షి, బెంగళూరు: తన తల్లి సోనియాగాంధీ విదేశీయతను ప్రధాని మోదీ ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తప్పుపట్టారు. దేశంలో తాను చూసిన చాలామంది భారతీయుల కంటే సోనియా నిజమైన భారతీయురాలన్నారు. మోదీ తనలో ముప్పును చూస్తున్నారని, ప్రధాని కావాలన్న తన ఆకాంక్షపై ఆయన చేస్తున్న విమర్శలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకేనని తప్పుపట్టారు. ‘నా తల్లి ఇటలీలో జన్మించినా భారత్‌లోనే ఎక్కువ కాలం జీవించింది. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసింది. తనను, తన తల్లిని ఇటలీ వాళ్లు అని సంభోధించడం ప్రధాని స్థాయి వ్యక్తికి సరికాదు. మోదీ చేసే అలాంటి వ్యాఖ్యలు ఆయన స్వభావాన్ని తెలియచేస్తాయి’ అని అన్నారు. గురువారం బెంగళూరులోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా తమ సంకల్పాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. ఎవరు కావాలి? ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించిన సిద్దరామయ్య కావాలో.. లేక జైలుకెళ్లి వచ్చిన యడ్యూరప్ప కావాలో ప్రజలకు బాగా తెలుసునని రాహుల్ అన్నారు. అవినీతి గురించి తరచూ మాట్లాడే ప్రధాని మోదీ అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లిన యడ్యూరప్పను పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నారని∙ప్రశ్నించారు. దళితుల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని, దళితుడైన రోహిత్ వేముల మృతిపై దేశమంతా ఏకరువు పెడుతుంటే ప్రధాని మోదీ ఒక్క మాట అయినా మాట్లాడారా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా దేశంలో చేసిన అభివృద్ధి గురించి 15 నిమిషాలు తన మాతృభాషలో మోదీ చెప్పగలరా? అని నిలదీశారు. దేశం మొత్తం మీద దళితులకు కేటాయించిన నిధుల్లో సగం ఒక్క కర్ణాటక ప్రభుత్వమే కేటాయించిందన్నారు. అన్ని మతాలను గౌరవిస్తా ఎంతో చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తాను అన్ని మతాలను, విశ్వాసాలను గౌరవిస్తానని చెప్పారు. కొన్ని పార్టీల తరహాలో మత ఘర్షణలు, విద్వేషాల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం పాకులాడబోనని రాహుల్ స్పష్టం చేశారు. మోదీ అవలంబిస్తున్న విదేశాంగ విధానాలు దేశాన్ని ఆత్మ రక్షణలో పడేయడం ఖాయమని ఆయన విమర్శించారు. యూపీఏ కంటే ఎన్డీయే హయాంలోనే పెట్రోల్ ధరలు భారీ పెరిగాయన్నారు. కన్నడ ప్రజల భాష, ఆహారం, అలవాట్లపై ఆర్ఎస్ఎస్ దాడులు చేస్తోందని ఆరోపించారు. కన్నడిగుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుందన్నారు. బెంగళూరును సిలికాన్ వ్యాలీగా మార్చడంలో కాంగ్రెస్ పార్టీ కృషి ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. కర్ణాటకలో నిరుద్యోగం అనే మాట వినపడకుండా చేస్తామని రాహుల్‌గాంధీ హామీనిచ్చారు. మోదీ వైఫల్యాలనుప్రజలు గమనించారు: సిద్దరామయ్య సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నామని.. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో ప్రధాని మోదీ వైఫల్యాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, బీజేపీని ఓటమి భయం వెంటాడుతోందని చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి సరైన ఆధారాలతో ఆరోపణలు చేస్తే బాగుంటుందని అన్నారు. అమిత్ షావి వట్టి మాటలేనని.. చేతల్లో ఏమీ ఉండదని విమర్శించారు. నాలుగేళ్లలో దేశానికి ఏమీ చేశారో చెప్పకుండా కేవలం రాహుల్ గాంధీని విమర్శించడమే మోదీ పనిగా పెట్టుకున్నారని ఆయన తప్పుపట్టారు. -
బెంగళూరును అవమానించారు
సాక్షి, బెంగళూరు: ప్రధాని మోదీ బెంగళూరును చెత్త నగరంగా సంబోధించి అవమానించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. ‘ప్రియమైన మోదీజీ.. మీరు బెంగళూరును నేరాల నగరి అని, చెత్త నగరం అని సంబోధించి అవమానించారు. అబద్ధాలు చెప్పడం మీకు సహజంగానే అబ్బింది. మీకంటే యూపీఏ ప్రభుత్వం 1,100% ఎక్కువ నిధులు కర్ణాటక నగరాల అభివృద్ధికి కేటాయించింది. కర్ణాటకకు కాంగ్రెస్ రూ.6,570 కోట్లు కేటాయిస్తే.. బీజేపీ ప్రభుత్వం కేవలం రూ.598 కోట్లు మాత్రమే ఇచ్చింది’ అని అన్నారు. రాహుల్ గజేంద్రగఢ్, కల్గి, హావేరీల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడారు. దళితులపై అత్యాచార ఘటనలు కొనసాగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మోదీని ప్రశ్నించారు. కొందరు పారిశ్రామికవేత్తలకు మాత్రం మోదీ కొమ్ముకాస్తూ బలహీనవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ గురించి తరచూ మాట్లాడే మోదీ ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో దళిత నేత ఖర్గే పలు కీలక అంశాలను ప్రస్తావించబోగా అడ్డుకున్నారని ఆరోపించారు. బీజేపీ అనుబంధ సంస్థల కార్యకర్తలు దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నా మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడిన రెడ్డి సోదరులను తమ ప్రభుత్వం జైలుకు పంపిస్తే..బీజేపీ ప్రభుత్వం వారిని విడుదల చేయించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలనే బీజేపీ తన మేనిఫెస్టోలో నింపేసిందన్నారు. అంతకుముందు రాహుల్ బీదర్ జిల్లాలోని గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేశారు. మహిళా సాధికారితపై ప్రధాని మోదీ మాటలు మాని.. చేతల్లో చూపాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ఆయన ట్వీటర్లో ఉదహరించారు. బీజేపీ అభ్యర్ధి ఆకస్మిక మృతి, ఎన్నిక వాయిదా సిట్టింగ్ ఎమ్మెల్యే, జయనగర్ బీజేపీ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్‌ఆకస్మికంగా మృతి చెందారు. శుక్రవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో ఉండగానే గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి చనిపోయారని పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. దీంతో అక్కడ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. -
ప్రకృతి ప్రకోపానికి 116 మంది బలి
న్యూఢిల్లీ: రెండు రోజుల వ్యవధిలో ప్రకృతి ప్రకోపానికి యూపీ, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో 116 మంది మృతిచెందగా, 300 మందికి పైగా గాయపడినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, యూపీలకు రాష్ట్రాలకు వర్షం, పెనుగాలుల ముప్పు ఉందని శుక్రవారం తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఇసుక తుపాన్, గాలి వాన, పిడుగుపాటులకు గురువారం ఉత్తరప్రదేశ్‌లో 73 మంది మరణించగా, 91 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ప్రభావిత రాష్ట్రాల్లో సుమారు 12 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, 2,500 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మరోవైపు, యూపీలో ప్రకృతి బీభత్సం ఎక్కువగా ఉండడంతో.. కర్ణాటక ఎన్నికల ప్రచారం వాయిదావేసుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హుటాహుటిన లక్నో చేరుకున్నారు. యోగి వేరే రాష్ట్రంలో ప్రచారం చేయడంపై విమర్శలు పెరిగాయి. ‘యూపీ ప్రజలు యోగిని ఎన్నుకున్నది తమ రాష్ట్రంలో పనిచేయమనే.. కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం కాదు’ అని మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా యోగిపై విమర్శలు చేశారు. -
రామ్‌గోపాల్ వర్మ ఫొటోలు దహనం
అనంతపురం కల్చరల్ : మహిళలను కించపరుస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు బలిజ సంఘం నాయకులు మునిరత్నం శ్రీనివాసులు హితవు పలికారు. పవన్‌కల్యాణ్ తల్లిని నిందిస్తూ చేసిన వ్యాఖ్యాలు, అందుకు వివిధ రకాలుగా ప్రేరేపించిన రామ్‌గోపాల్ వర్మ చేసిన చర్యలను ఖండిస్తూ శనివారం బలిజ సంఘం నాయకులు స్థానిక శ్రీనివాసనగర్‌లోని బాలాజీ కల్యాణ మంటపం ఎదుట రామ్‌గోపాల్ వర్మ ఫొటోలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మునిరత్నం శ్రీనివాసులతో పాటు పగడాల మల్లికార్జున, మాసూలు శ్రీనివాసులు, భవానీ రవికుమార్, గల్లా హర్ష, పత్తి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. సిద్ధాంతాల ప్రకారం విమర్శలుండాలే కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మోహన్, లక్ష్మీప్రసాద్, గొంది శ్రీనివాస్ పాల్గొన్నారు. -
1.4 కోట్ల మందిపై నిఘా!
వాషింగ్టన్: నాన్ ఇమిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లాలనుకునేవారు దరఖాస్తు సమయంలో గత ఐదేళ్ల సోషల్ మీడియా, ఫోన్, ఈ మెయిల్ వివరాలు వెల్లడించాలన్న ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం ఏడాదికి దాదాపు 1.47 కోట్ల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. టూరిజం, వైద్య చికిత్స, వ్యాపారం కోసం జారీచేసే వీసాలు, హెచ్–1బీ, స్టూడెంట్ వీసాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. అమెరికా విదేశాంగ శాఖ రూపొందిస్తున్న కొత్త నియమావళి ప్రకారం వీరంతా తమ వ్యక్తిగత వివరాల్ని అమెరికాకు బహిర్గతం చేయడం తప్పనిసరి. సోషల్ మీడియా వివరాలు, పాస్‌పోర్ట్ నంబర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, విదేశీ ప్రయాణాల వివరాలూ చెప్పాలి.ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసేవారిని సోషల్ మీడియా వివరాల్ని అడుగుతామని, ఈ నిర్ణయం ఏడాదికి 7 లక్షలపై ప్రభావం చూపనుందని గత సెప్టెంబర్‌లో అమెరికా వెల్లడించింది. అయితే ఆ ప్రతిపాదనను మరింత విస్తరించి 1.4 కోట్ల నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు వర్తింపచేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం దరఖాస్తుదారుడు మొత్తం 20 సోషల్ మీడియా ఫ్లాట్‌పాంల ఖాతాల వివరాలు తెలపాలి. వాటిలో అమెరికా నుంచి నడుస్తున్న ఫేస్బుక్, ఫ్లికర్, గూగుల్ ప్లస్, ఇన్‌స్ట్రాగాం, లింక్డిన్, మై స్పేస్, పింట్రెస్ట్, రెడిట్, టంబ్లర్, ట్విటర్, వైన్, యూట్యూబ్‌లు ఉండగా.. చైనా సైట్లు డౌబన్, క్యూక్యూ, సైనా వైబో, టెన్సెంట్ వైబో, యుకు, రష్యా సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వీకే, ట్వూలు ఉన్నాయి. క్షుణ్నంగా తనిఖీలు.. క్షుణ్నంగా తనిఖీ చేశాకే అమెరికాలోకి అనుమతిస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ పగ్గాలు చేపట్టాక.. గతేడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా అన్ని కాన్సులేట్ కార్యాలయాల్లో దరఖాస్తుల తనిఖీని మరింత కట్టుదిట్టం చేయాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. ఇప్పుడు వ్యాపార అవసరాలతో పాటు టూరిస్ట్ పర్యటనకు అమెరికా వెళ్లాలనుకునే వారికి కూడా ఈ తనిఖీల్ని కట్టుదిట్టం చేయనున్నారు. ఈ నిర్ణయం భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికోలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వీసా లేకుండా అమెరికాలోకి ప్రయాణించే అవకాశం కల్పిస్తున్న 40 దేశాలపై ఈ నిబంధనలు ఎలాంటి ప్రభావం చూపబోవు. వీటిలో ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలున్నాయి. నిష్ఫల ప్రయత్నం.. తాజా నిబంధనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది మంది వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా వివరాలు సేకరించాలనుకోవడం నిష్ఫల, సమస్యలు సృష్టించే ప్రయత్నమని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ డైరెక్టర్ హినా షంషీ అన్నారు. ఇది వ్యక్తిగత అంశాల్లోకి చొరబడడమే కాకుండా అర్థరహిత నిర్ణయమని డ్రెక్సెల్ యూనివర్సిటీలో అసోసియేట్ లా ప్రొఫెసర్ అనిల్ ఖాల్హన్ చెప్పారు. ప్రైవేటు ఖాతాల సమాచారం ఇవ్వాలని బలవంతం చేయడానికి తాము వ్యతిరేకమని ఇంతకు ముందే చెప్పామని అందులో ఎలాంటి మార్పులేదని ఫేస్బుక్ పేర్కొంది. -
నా దుస్తులు చింపాలని ఆదేశించారు
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థులు మార్చి 23న చేపట్టిన ర్యాలీలో ఢిల్లీ పోలీసులు విద్యార్థినులతో వ్యవహరించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. 8 మంది విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడిన జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రికి బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పార్లమెంటు వరకూ భారీ ర్యాలీ చేపట్టిన సంగతి తెల్సిందే. ర్యాలీలో పోలీసులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని జేఎన్‌యూ సోషియాలజీ విభాగానికి చెందిన షీనా ఠాకూర్(24) అనే విద్యార్థిని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ర్యాలీని అడ్డుకున్న ఓ మహిళా పోలీస్ అధికారిణి ఆందోళన చేస్తున్న తన దుస్తుల్ని చించేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించిందన్నారు. దీంతో వెంటనే కొందరు తనపై పిడిగుద్దులు కురిపించారని, లోదుస్తుల్ని లాగేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు తమపై వాటర్ కేనన్లను ప్రయోగించారన్నారు. -
హస్తం హవానా? కమల వికాసమా?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వేసవి ఎండలతో సమాంతరంగా కర్ణాటకలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. యూపీ, బిహార్ ఉప ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీకి కర్ణాటక ఎన్నికల్లో పాగా వేయడం తక్షణ అవసరం. అలాగే, మోదీకి వ్యతిరేకంగా భావసారూప్యత ఉన్నా లేకున్నా శత్రువు శత్రువులను కూడగట్టుకుని బీజేపీని దెబ్బ కొట్టి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవటం రాహుల్‌కు కీలకం. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవటానికి రెండు పార్టీలూ సిద్ధంగా లేవు. రాహుల్ గాంధీ, అమిత్‌షా సర్వశక్తులూ ధారపోసి సత్తా చాటాలని యత్నిస్తున్నారు. పంజాబ్ తర్వాత హస్తం చేతుల్లో ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక మాత్రమే. బీజేపీకి కర్ణాటకలో షాక్ ఇచ్చి 2019 ఎన్నికలకు సిద్ధం కావాలనేది కాంగ్రెస్ వ్యూహం. కర్ణాటకలో కాంగ్రెస్‌ను చావుదెబ్బకొట్టాలనేది బీజేపీ ప్రతివ్యూహం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ ఖాతాలోకి వెళ్తుంది. తద్వారా జాతీయ రాజకీయ శక్తుల పునరేకీకరణలో కాంగ్రెస్ తన మాటను చెల్లించుకునే అవకాశం దక్కుతుంది. ఓడిపోతే.. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’.. షా, మోదీల నినాదానికి ప్రజల మద్దతు దొరికినట్లవుతుంది. 1985 తర్వాత ఏ పార్టీ కూడా కర్ణాటకలో వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. దళితులు, వెనుకబడిన తరగతులు, కురబలు, ముస్లింల ఓట్లపై కాంగ్రెస్ ఆధారపడుతూ వస్తోంది. లింగాయత్‌లు, బ్రాహ్మణులు బీజేపీకి అండగా ఉండగా మరో బలమైన పార్టీ జేడీఎస్ వక్కళిగర్ ఓటు బ్యాంకును నమ్ముకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే బీజేపీ 132 అసెంబ్లీ సీట్లలో, కాంగ్రెస్ 77, జేడీఎస్ 15 స్థానాల్లో మెజారిటీ సాధించాయి. ఆకర్షణ పనిచేసేనా? బీజేపీ సీఎం అభ్యర్థిగా యడ్యూరప్ప ఇప్పటికే 75 రోజులపాటు రాష్ట్రమంతటా పర్యటించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విమర్శల దాడి ప్రారంభించారు. ఫిబ్రవరి 4వ తేదీన బెంగళూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ సిద్దరామయ్య ప్రభుత్వ అవినీతిని ఉద్దేశించి ‘పది శాతం కమిషన్ ప్రభుత్వం’గా అభివర్ణించారు. అదే సమయంలో గౌరీ లంకేశ్ హత్యపై ఆయన మౌనంగా ఉండటం ఇబ్బంది కలిగించే అంశమే. మరోవైపు, ఉత్తరప్రదేశ్, బిహార్ ఎన్నికల్లో చావుదెబ్బతినటంతో బీజేపీ వ్యూహాలను మార్చుకోవాల్సి వచ్చింది. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను ప్రచారాస్త్రంగా వాడుకోవాలన్న ఎత్తుగడ విషయంలో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. బీజేపీ హయాం (2008–13)లో ముగ్గురు సీఎంలు మారారు. అవినీతి ఆరోపణలు, కుమ్ములాటలు, మత ఉద్రిక్తతలు ఆ పార్టీని దెబ్బతీశాయి. 2013 ఎన్నికల్లో అధికారం కోల్పోయి 40 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం, బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించి, పార్టీ చీఫ్ అమిత్ షా చాణక్యం, ప్రధాని మోదీ ఆకర్షణతో గట్టెక్కాలని ఆరాటపడుతోంది. ‘లింగాయత్’ కలిసొచ్చేనా? ఈ ఐదేళ్లలో సీఎం సిద్దరామయ్య బలమైన నేతగా ఎదిగారు. సిద్దరామయ్య చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, కన్నడిగుల ఆత్మగౌరవ నినాదంతో తలపెట్టిన ‘ప్రత్యేక జెండా’ ఉద్యమం, వెనుకబడిన కులాలు, దళితులు, ముస్లింల మద్దతు కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశాలు. అయితే, శాంతి భద్రతలు, అవినీతి ఆరోపణలు, రైతు ఆత్మహత్యలు సిద్దరామయ్యకు ఇబ్బంది కలిగించే అంశాలు. బీజేపీ ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది. కర్ణాటకలో లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూల ఫలితాలు తీసుకొస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 17శాతం లింగాయత్‌లు ఇప్పటివరకు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. తండ్రీకొడుకుల పార్టీ మూడో ప్రధాన పార్టీ జేడీఎస్ తండ్రీకొడుకుల పార్టీ ముద్ర నుంచి బయటపడలేకపోయింది. అసంఘటిత రంగ కార్మికుల్లో కుమారస్వామికి మంచిపేరే ఉంది. బీఎస్పీ, వామపక్ష పార్టీలతో పొత్తు కొంతవరకు కలిసి వచ్చే అంశం. -
సీఎం వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఏ మైకంలో ప్రధానిని అవమానించారో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు కేటాయించినా అవి పూర్తిస్థాయిలో ప్రజలకు ఉపయోగపడకుండా చేసి ఇప్పుడు కేంద్రాన్ని విమర్శించడం దారుణమన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఏ శాఖ విషయంలో ఎంత ఉంటుందో కూడా తెలియని దుస్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. వ్యవసాయశాఖ విషయంలో రాష్ట్రానిదే ప్రధాన బాధ్యత అనే విషయం కూడా ఆయనకు తెలియకపోవటం దారుణమన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోవటంతో రావాల్సిన నిధులు ఆగిపోయాయన్నారు. అలాగే ఫసల్ బీమా యోజన పథకం ప్రీమియం వాటా చెల్లించకపోవటంతో రైతులకు బీమా అందకుండా పోయిందని విమర్శించారు. -
సీఎం కేసీఆర్ ఓ అలీ బాబా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఓ అలీ బాబా అని, ఆయన కుటుంబసభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్ చార్ చోర్ (నలుగురు దొంగలు) అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేకుండా పోయా యన్నారు. తెలంగాణలో ఇలాంటి నిరం కుశ, అరాచక పోకడలు ఉంటాయని ఊహించలేదన్నారు. రాజ్యసభ సీటు కూడా సంతోష్కిస్తారా, అమరవీరుల కుటుంబాలకు ఎందుకివ్వరని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ బస్సు యాత్రతో మంత్రి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీపై కేసీఆర్ వ్యాఖ్య లు బాధించాయంటున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా సీఎంతోనే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్ తిడితే కేటీఆర్‌తో ఆమె వివరణ తీసుకోవడం హాస్యాస్పదమన్నారు. -
కాంగ్రెస్, బీజేపీల అంతం ఖాయం
సాక్షి,హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం లో కాంగ్రెస్, బీజేపీల అంతం ఖాయమని ఆల్ ఇండియా మజ్లిస్–ఏ–ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత, హైద రాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ దారుస్సలాంలో ఏఐఎంఐఎం 60వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ పతాకాన్ని ఒవైసీ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ బస్సు యాత్రలు, పాదయాత్రలతో కాంగ్రెస్, బీజేపీల పప్పులు ఉడకవని, ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్–బీజేపీ దొందూ దొందేనని, షరియత్ సమస్య వస్తే కాంగ్రెస్‌లో గల ఒక్క ముస్లిం ఎంపీకి పార్లమెంట్లో నోరు విప్పేందుకు పార్టీపరంగా అనుమతి లేకుండా పోయిందన్నారు. మోదీ హయాం.. కుంభకోణాల మయం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుంభకోణాల మయమైందని, వేల కోట్లు దిగమింగి, విదేశాలకు పారిపోతున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందని, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా పోరుకు సిద్ధమేనని ప్రకటించారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల బరిలో దిగామని, త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో రెండు లక్షల ఓట్ల మెజార్టీ సాధిస్తామని, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీని పరాజయం పాలు చేయడం ఖాయమని అన్నారు. హైదరాబాద్ పాతబస్తీకి మెట్రో రైలు రావడం ఖాయమన్నారు. ఫలక్‌నుమా నుంచి ఎయిర్ పోర్టు వరకు ఒక లైన్, నాగోల్, మలక్‌పేట, పురానాపూల్ వరకు మరో లైన్‌ను సాధించి తీరుతామన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది శూన్యం కాంగ్రెస్ 70 ఏళ్లలో మతకలహాలు తప్ప ముస్లిం వర్గాలకు చేసింది శూన్యమని మజ్లిస్ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మజ్లిస్ పార్టీ 60 ఏళ్లలో యావత్ ముస్లింల గళంగా, బలంగా మారిందని గుర్తుచేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ మజ్లిస్ చలవేన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే మిగతా రాష్ట్రాల్లో అమలుచేసి ఉండేదన్నారు. ఈ సభలో మజ్లిస్ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
అది ప్రజల మాటే
సాక్షి, హైదరాబాద్: ‘జానాబాబా 40 దొంగలు’అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన కుసంస్కారానికి నిదర్శనమంటూ సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించడాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తప్పుబట్టారు. రాష్ట్రాన్ని 60 ఏళ్లు పాలించి దోచుకున్న కాంగ్రెస్ నేతల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మంత్రి కేటీఆర్ కూడా అదే మాట అన్నారని, ఇందులో అనుచితమేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను నిత్యం బండ బూతులు తిట్టే కాంగ్రెస్ నేతలు నీతులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, పూల రవీందర్‌తో కలసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గుడ్డలు ఊడదీసి కొడతాం, దవడలు పగులగొడతామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే ఆ పార్టీ పెద్దలకు సంస్కా రం గుర్తురాలేదా అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. జానారెడ్డికి కాంగ్రెస్‌లో గౌరవం లేకు న్నా, సీఎం కేసీఆర్ గౌరవం ఇస్తున్నారని చెప్పారు. నల్లగొండ సభలో జాతీయ నాయకుల ముందే కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన నాయకులు అసభ్యంగా మాట్లాడితే జానారెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపై ప్రజలు సంతో షంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలను ఇంటికి పంపించడానికే ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రజల మెప్పు పొంది నాయకుడయ్యారని జగదీశ్‌రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని, కాంగ్రెస్ నేతలకు చేతనైతే అసెంబ్లీలో మాట్లాడాలని సవాల్ చేశారు. కాంగ్రెస్‌పైనే ప్రజాగ్రహం తెలంగాణ వస్తే చీకటి రోజులు వస్తాయంటూ నాటి కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బెదిరించారని...కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రజలు, రైతులకు 24 గంటల నిరంతర కరెంటును ఇస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. విత్తనాల కోసం రోజుల తర బడి క్యూలలో నిలబెట్టిన పాలన కాం గ్రెస్ పార్టీదని... ఇంటికే విత్తనాలను పంపిస్తున్న పార్టీ తమదన్నారు. మోస కారి కాంగ్రెస్ నేతలపై ప్రజలకు కోపం ఉంటుందా లేక అన్ని హామీలనూ నెరవేరుస్తున్న టీఆర్ఎస్ మీద ప్రజలకు కోపం ఉంటుందా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి వల్ల తెలంగాణ పేరు మూడేళ్లలోనే ప్రపంచంలో మారుమోగిపోతోందన్నారు. గ్రామస్థాయి నుంచి కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. -
అధికార గర్వం.. కుసంస్కారం
సాక్షి, హైదరాబాద్: ‘జానాబాబా 40 దొంగలు’ అంటూ మంత్రి కె. తారక రామారావు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సభలో చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌కు కౌంటర్ ఇవ్వడం తన స్థాయికి తక్కువే అయినా మాట్లాడుతున్నానంటూ చురకలంటించారు. ‘అధికారగర్వంతో హేళన, కుసంస్కారంతో అర్థంపర్థంలేని సందర్భాల్లో మాట్లాడటం సరైంది కాదు’అని మంత్రికి హితవు పలికారు. తనకన్నా ఎక్కువ స్థాయి వాళ్ల గురించి మాట్లాడితే పెద్దవాడినయిపోతాననే భ్రమలో కేటీఆర్ ఉన్నారని జానారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ చేసిందేమీ లేకపోగా ఒక ముఠాను తయారు చేసుకొని ఊత పదాలతో ప్రజలను భ్రమింపజేస్తున్నారని విమర్శించారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో జానా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలకు తానే ఆద్యం పోశానన్నారు. లక్షా 70 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా చేశానని, ఇప్పుడు కేటీఆర్ ప్రారంభించిన పథకానికి కూడా తానే శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. పాలేరు కట్ట మీద వేసిన శిలాఫలకంపైనా తన పేరుంటుందని, కావాలంటే చూసుకోవచ్చన్నారు. ఎవరో ఇల్లు కట్టిన తర్వాత దానిపై పెంట్‌హౌస్ వేసి తామే ఇల్లంతా కట్టినట్లు టీఆర్ఎస్ నేతలు చెప్పుకుని తిరుగుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక్కసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని జానా జోస్యం చెప్పారు. -
కుర్చీల కొట్లాటలో భాగమే బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కుర్చీల కొట్లాటలో భాగంగానే బస్సు యాత్ర జరుగుతున్నదని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్‌రెడ్డితో కలిసి బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పెత్తనంకోసం ఈ కుర్చీల కొట్లాట జరుగుతున్నదన్నారు. రైతు సమన్వయ సమితులను రౌడీ సమితులు అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దారుణమని, దీనిపై తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఆ మాటలను కాంగ్రెస్ నేతలు ఉపసంహరించుకోవాలన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్వయంగా చెప్పినా గత ఎన్నికల్లో ప్రజలు నమ్మలేదని, భవిష్యత్తులోనూ ఆ పార్టీని నమ్మరని పాతూరి అన్నారు. ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులను రౌడీలు అంటూ మాట్లాడిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర ఎందుకో వారికే తెలియదన్నారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలపై 420 కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
మోదీకి కేసీఆర్ చెంచాగిరీ!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి, జహీరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ చెంచాగిరీ చేస్తున్నారని.. ఆయన పేరు చెబితేనే గజగజలాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షు డు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రంలో విభజన హామీల కోసం అక్కడి ఎంపీలు కొట్లాడుతుంటే.. ఇక్కడ కేసీఆర్ మాత్రం నోట్ల రద్దు, జీఎస్టీలను సమర్థిస్తున్నారని మండిపడ్డారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య బస్సు యాత్ర బుధవారం సంగారెడ్డి జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా జహీరాబాద్, నారాయణఖేడ్లలో జరిగిన బహిరంగసభల్లో ఉత్తమ్ ప్రసంగించారు. ‘‘మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మైనారిటీలను ఇబ్బందులకు గురిచేస్తోంది. మైనారిటీలపై వేధింపులు పెరిగాయి. అలాంటి మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ చెంచాగిరీ చేస్తున్నారు. ఆయన పేరు చెబితేనే గజగజలాడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో ఎంపీలు విభజన హామీల అమలు కోసం కొట్లాడుతుంటే.. ఇక్కడ కేసీఆర్ మాత్రం నోట్లరద్దు, జీఎస్టీ తదితరాలను సమర్థిస్తున్నారు..’’అని మండిపడ్డారు. టీఆర్ఎస్కు ఓటు వేస్తే మోదీకి ఓటు వేసినట్లేనని.. మైనారిటీల హక్కుల రక్షణ, సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. కేసీఆర్‌ను ప్రజలే తరిమికొడతారు రూ.500 కోట్లతో అధునాతన భవనం కట్టుకుని.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అ త్యంత విలాస జీవితం అనుభవిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళా సంఘాలకు రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్, అభయ హస్తం పింఛన్ పునరుద్ధరణ, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి వంటివి అమలు చేస్తామని.. పంటలకు మద్దతు ధర అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తా: కోమటిరెడ్డి అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. జహీరాబాద్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ సర్వేల పేరు చెబుతూ బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఆనాడే మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెలంగాణ గురించి మాట్లాడేవాడే కాదని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇక కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీలో గందరగోళం ఉన్నమాట వాస్తవమేనని, అయితే అధిష్టానం దగ్గర కొట్లాడి అయినా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సీఎం చేస్తామని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. 106 సీట్లు రాకపోతే కేసీఆర్ తప్పుకొంటారా.. ‘‘వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పక్షంలో నేను నా కుటుంబంతో సహా రాజకీయాల నుంచి వైదొలుగుతా. 106 అసెంబ్లీ స్థానాల్లో గెలవకుంటే కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకొంటారా..’’అని ఉత్తమ్ సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక 2019–20లో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్ రూ.1.90 లక్షల కోట్ల మేర ఉంటుందన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల్లో సీఎం ఆరు శాతం కమీషన్ తీసుకుంటున్నారని.. తాము అధికారంలోకి రాగానే కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులపై పునః సమీక్ష జరుపుతామని పేర్కొన్నారు. -
కనీసం ‘లోక్‌పాల్’ కూడా లేదు
సాక్షి, బెంగళూరు (బెళగావి): అవినీతిపై పోరాటం అంటూ ప్రసంగాల్లో ఊదరగొట్టే ప్రధాని మోదీ లోక్‌పాల్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రశ్నించారు. సోమవారం కర్ణాటకలో బెళగావి రామదుర్గ బహిరంగసభలో ప్రసంగిస్తూ కనీసం ఢిల్లీలో కూడా లోక్‌పాల్‌ను మోదీ ఏర్పాటు చేయలేకపోయారన్నారు. దేశంలో అతి పెద్ద మోసాలు, నేరాలు సంభవిస్తుంటే ప్రధాని నోరు మెదపడం లేదన్నారు. మోదీ కర్ణాటక రాష్ట్రానికి వచ్చి తమ సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన యడ్యూరప్ప, బీజేపీ మాజీ మంత్రులు పక్కనే కూర్చొని ఉండడాన్ని మరచినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని కార్పొరేట్ శక్తుల కోసమే మోదీ పనిచేస్తున్నారన్నారు. కర్ణాటకలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని రాహుల్ చెప్పారు. రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, వారే తమను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మూడు రోజుల రెండో విడత జనాశీర్వాద యాత్ర సోమవారంతో ముగిసింది. -
చౌకీదార్ మాట్లాడరేం?
సాక్షి, బళ్లారి (బాగల్‌కోట): ప్రధాన మంత్రిని చేయొద్దు.. దేశానికి చౌకీదారును చేయాలని ఎన్నికల సభల్లో ప్రజలను కోరిన మోదీ.. ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నా మౌనంగా ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. జనాశీర్వాద యాత్రలో భాగంగా రాహుల్ కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లా చాడగండి తాలూకా చిక్కపడసలగి బ్యారేజ్‌ను సందర్శించి, గంగమ్మ తల్లికి వాయనం సమర్పించారు. అనంతరం మథోళ్లో ఏర్పాటు చేసిన సభలో మోదీపై నిప్పులు చెరిగారు. తరచూ అవినీతిపై ప్రసం గాలు చేసే మోదీ..వేలాది కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, దానితో సంబంధమున్న నీరవ్మోదీలపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జై షా కంపెనీ టర్నోవర్ రూ.50 వేల నుంచి ఒక్కసారిగా రూ.80 కోట్లకు పెరిగినా పెదవి విప్పటం లేదన్నారు. ‘దేశంలోని రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రైతు రుణాలు మాఫీ చేయాలని స్వయానా ప్రధానిని కోరినా ఆయన నోరు మెదపలేదు. బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ.లక్షా 40వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు’ అని రాహుల్ ధ్వజమెత్తారు. మరోవైపు, ‘మోదీ చిల్లర ప్రధాని. మాటలతో ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు’ అని కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి తిమ్మాపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రధాన మంత్రి మోదీ ఇంట్లో కాని, బీజేపీలో కాని ఎవరైనా ప్రాణ త్యాగం చేశారా? పోనీ, ఆ నేతలకు చెందిన కుక్క అయినా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిందా? కాంగ్రెస్‌లో దేశం కోసం ఇందిర, రాజీవ్సహా ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారని తెలిపారు. కర్ణాటకలో అవినీతి పాలన: అమిత్‌షా కర్ణాటకలో అవినీతి పాలన సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన బీదర్ జిల్లా హుమ్నాబాద్, యాదగిరి జిల్లా సురపుర, యానాగుంది తదితర చోట్ల విస్తృత పర్యటన చేసి, పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు గతంలో ఓ వ్యక్తి రూ.40 లక్షలు ఖరీదు చేసే వాచీని కానుకగా ఇచ్చారంటే ఇక్కడ అవినీతి పాలన ఏమేరకు సాగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. -
రైతుల ఆందోళనలు పట్టని టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులతో కుమ్మక్కయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర దక్కకుండా అన్యాయం చేస్తూనే, కాంగ్రెస్‌పై నెపం మోపేందుకు యత్నిస్తున్నాయని అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి ఆరోపించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఇబ్బంది పడుతూ రాష్ట్రంలో రోడ్లెక్కుతున్నా, ఎర్రజొన్న, పసుపు రైతులు 15 రోజులుగా ధర్నాలు చేస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మరో నేత రాజారాంయాదవ్తో కలసి విలేకరులతో మాట్లాడారు. రైతుల మద్దతు ధర కోసం రూ.2 వేల కోట్లు బడ్జెట్లో పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన టీఆర్ఎస్ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పెట్టలేదని విమర్శించారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీవో 153 ద్వారా రూ.30 కోట్లు విడుదల చేశామని, రూ.11 కోట్లను ట్రేడర్స్ యాక్ట్ కింద ఇచ్చామని, రైతులపై కాంగ్రెస్ ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ఆయన సవాల్ చేశారు. కల్తీ విత్తనాల వెనుక ఎమ్మెల్సీ హస్తం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని, దీని వెనుక అధికార టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్సీ హస్తం ఉందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బుధవారం ఆరోపించారు. నకిలీ విత్తనాల గుట్టు తేల్చి అసలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు పంపిణీ చేసిన పోడు భూములను అటవీ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నా సీఎం కేసీఆర్ అధికారులనే వెనకేసుకురావటం బాధాకరమన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. పోడు భూములు లాక్కోవడంతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. -
ఉత్తమ్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అయినా ఈ విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలతో ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల అని, అందుకే ఆ పార్టీ నేతలు నోటికొచ్చిన హామీలిస్తున్నారని విమర్శించారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలసి జూపల్లి విలేకరులతో మాట్లాడారు. పింఛన్లు, మహిళా సంఘాలకు రుణాలు, అభయహస్తం, సెర్ప్ ఉద్యోగుల విషయంలో ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను జూపల్లి ఖండించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రవ్యాప్తంగా రూ. 835.64 కోట్ల పింఛన్లు ఇస్తే, తాము ఏటా రూ. 5,301.83 కోట్ల ఆసరా పింఛన్లుగా ఇస్తున్నామని మంత్రి చెప్పారు. అలాగే 1998–2014 మధ్య మహిళా సంఘాలకు రూ. 16 వేల కోట్ల రుణాలు అందగా గత మూడున్నరేళ్లలోనే తాము రూ. 22,301 కోట్ల రుణాలిచ్చామన్నారు. దీనికి అదనంగా రూ. 4,555 కోట్లను స్త్రీనిధి ద్వారా అందించామని చెప్పారు. అభయహస్తం కింద లబ్ధి పొందేవారిలో 1,16,848 మందికి ఆసరా కింద పింఛన్లు ఇస్తున్నామని, వారి కోసం ప్రత్యేక పథకానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. వారి ద్వారా కట్ చేసుకునే బీమా మొత్తాన్ని తీసుకోవడం లేదని, అయినా సహజ మరణం పొందితే రూ. 75 వేలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 4 లక్షలు అందేలా రాష్ట్రంలోని 78 లక్షల మందికి వర్తింపజేసే పథకాన్ని త్వరలోనే ప్రవేశపెడతామని జూపల్లి చెప్పారు. సెర్ప్ ఉద్యోగుల వేతనాలను గణనీయంగా పెంచిన ఘనత తమదేనన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు అర్థం చేసుకోవాలని, మేనిఫెస్టోలో ఇస్తామని చెప్పకుండానే తాము ఇస్తున్నామని, అదే కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. పింఛన్లలో జాప్యం నిజమే... రిజర్వు బ్యాంకు నుంచి రాష్ట్రానికి నగదు రావడంలో సమన్య వచ్చినందున గత నెలలో పింఛన్ల విషయంలో ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమేనని మంత్రి జూపల్లి తెలిపారు. అలాగే అభయహస్తం పింఛన్ల కింద 2017 ఫిబ్రవరి నుంచి బకాయి ఉన్నమాట కూడా నిజమేనని చెప్పారు. ఉపాధి హామీ వేతనాల కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగా రావడం లేదని, అయినా రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసి ఇస్తున్నామని, అందుకే కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఏదిఏమైనా పథకాల అమల్లో ఉన్న ఇబ్బందులు తొలగించుకుని ముందుకెళుతున్న తమను విపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. -
నువ్వేం చేసినా ఇండియాలోనే కదా.. పాస్‌పోర్ట్ అవసరమా?
పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం రోహిత్ శర్మ వెళితే అక్కడి అధికారి నువ్వేం చేసినా ఇండియాలోనే కదా, విదేశాలకు వెళ్లి చేసేదేముంది, నీకు రెన్యువల్ అవసరమా అని బదులిచ్చాడు. గల్లీ క్రికెట్లో ట్రయల్ బాల్ వేసి ఆ తర్వాత ఆట మొదలు పెడతారు కదా! ఈ సిరీస్‌లో రోహిత్ బ్యాటింగ్ చేయడం కూడా అలాంటిదే. రోహిత్ పెళ్లి రోజు, భార్య పుట్టిన రోజు సిరీస్‌కు ఒకసారి వస్తే ఎంత బాగుంటుంది కదా! రోహిత్ తన కిట్‌లో భారత పిచ్‌ను కూడా తీసుకువెళ్లి ఆడుకునేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస వైఫల్యాల తర్వాత భారత ఓపెనర్ రోహిత్ శర్మపై వస్తున్న అసంఖ్యాక వ్యంగ్య వ్యాఖ్యానాల్లో ఇవి కొన్ని! వన్డే క్రికెట్ అనగానే చెలరేగిపోయే అతనికి సఫారీ గడ్డ ఏమాత్రం అచ్చి రావడం లేదు. నాలుగు మ్యాచ్‌లలో వరుసగా చేసిన 20, 15, 0, 5 స్కోర్లు రోహిత్ స్థాయికి ఏమాత్రం తగనివి. మొత్తానికి రెగ్యులర్ ఓపెనర్ ఫామ్ భారత టీమ్ మేనేజ్మెంట్కు కొత్త సమస్యగా మారింది. సాక్షి క్రీడా విభాగం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రోహిత్ శర్మ 11, 10, 10, 47 పరుగులు మాత్రమే చేశాడు. అయితే టెస్టుల్లో రోహిత్ ఆటపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. అతడిని తుది జట్టులోకి తీసుకోవడంపైనే అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. చివరకు మూడో టెస్టులో జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది. పైగా దక్షిణాఫ్రికా భీకర పేస్ బౌలింగ్‌లో కోహ్లి మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమైన చోట రోహిత్ వైఫల్యాలు కూడా పెద్దగా కనిపించలేదు. కానీ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన మొనగాడు అదే ఫార్మాట్లో తడబడుతున్న తీరు అమితాశ్చర్యం కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో రోహిత్‌కిది మూడో పర్యటన. 2011, 2013లలో ఇక్కడ ఆడిన వన్డేల్లో కూడా అతను ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఏడు వన్డేల్లో అతను వరుసగా 11, 9, 23, 1, 5, 18, 19 చొప్పున పరుగులు చేశాడు. గత సిరీస్‌లో జొహన్నెస్‌బర్గ్ వన్డేలోనైతే 16వ బంతికి గానీ అతను కనీసం బ్యాట్‌ను బాల్‌కు తాకించలేకపోయాడు! అయితే నాటి రోహిత్‌తో పోలిస్తే ఈ నాలుగేళ్ళలో అతను ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ప్రపంచ వ్యాప్తంగా పరుగులు చేశాడు. దీన్ని బట్టి చూస్తే అతని తాజా వైఫల్యం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2013 డిసెంబర్లో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత 2014, 15, 16, 17 సంవత్సరాలలో కలిపి అతను 59.49 సగటుతో 3250 పరుగులు సాధించాడు. ఇలాంటి ఫామ్‌తో సఫారీ గడ్డపైకి వచ్చిన అతను అనూహ్యంగా విఫలమయ్యాడు. ఇక్కడ మాత్రమే... రోహిత్ భారత్‌లో మాత్రమే బాగా ఆడతాడనే విమర్శలో కూడా వాస్తవం లేదు. ఆస్ట్రేలియా గడ్డపై అతను నాలుగు సెంచరీలు సహా 51.95 సగటుతో పరుగులు చేయగా, ఇంగ్లండ్ మైదానాల్లో కూడా 53.30 సగటుతో పరుగులు రాబట్టాడు. న్యూజిలాండ్ పిచ్‌లపై కూడా ఎనిమిది ఇన్నింగ్స్‌లలో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికాకు వచ్చే సరికి మాత్రం అతని ఆట గతి తప్పుతోంది. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కెప్టెన్ వెసెల్స్ ... ‘రోహిత్ ఫుట్వర్క్లోనే సమస్య ఉంది. దక్షిణాఫ్రికాలో సహజంగానే వేగం, బౌన్స్ కలగలిసి బంతులు వస్తాయి. ఆఫ్‌సైడ్ వైపు జరిగి ఆడేటప్పుడు అతని స్టాన్స్ సరిగా ఉండటం లేదు. దాని వల్లే అతను విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాలో బౌన్స్ మాత్రమే ఉంటుంది. దానికి తగినట్లుగా బ్యాట్స్‌మెన్ తనను తాను మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ బౌన్స్‌కు పేస్ తోడైతే కష్టం’ అని విశ్లేషించారు. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో ఇటీవల చాలా వరకు పిచ్‌లు పూర్తి స్థాయిలో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోగా, సౌతాఫ్రికాలో ఇంకా అలాంటి పరిస్థితి లేకపోవడం కూడా రోహిత్‌కు ప్రతికూలంగా మారిందనేది మరో రకమైన విశ్లేషణ. నేర్చుకుంటాడా! తాజా సిరీస్‌లో అతను నాలుగు సార్లు ఔటైన తీరు చూస్తే రోహిత్ ఒకే తరహాలో ఔటవుతున్నాడని కూడా చెప్పలేం. మొదటి రెండు వన్డేల్లో షార్ట్ పిచ్ బంతులను హుక్ చేయబోయి అతను వెనుదిరిగాడు. బౌన్స్ తక్కువగా ఉండే పిచ్‌లపై అతని షాట్ భారీ సిక్సర్‌గా మారేదేమో గానీ ఇక్కడ కాదు. మూడో వన్డేలో వేగంగా దూసుకొచ్చిన ఇన్‌స్వింగర్ రోహిత్ పాత సమస్యను బయట పెట్టింది. ఆ బంతిని ఆడాలా వద్దా తేల్చుకునే లోపే బ్యాట్‌కు తగిలి కీపర్ చేతుల్లో పడింది. నిజానికి ఇదే బలహీనత అతడిని టెస్టులకు పనికి రాకుండా చేసింది. శనివారం వన్డేలో సమర్థంగా డిఫెన్స్ ఆడలేక రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. వన్డేల్లో అత్యద్భుత రికార్డులు తన పేరిట ఉన్నా టెక్నిక్ పరంగా రోహిత్లో చాలా సమస్యలు ఉన్నాయనేది వాస్తవం. చీఫ్ కోచ్‌గా రవిశాస్త్రి పాత్ర గురించి చెప్పలేం కానీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఇలాంటి లోపాలను సరిదిద్దడంలో సిద్ధహస్తుడు. కాబట్టి దానిపై దృష్టి పెడితే తనేంటో చూపించుకునేందుకు రోహిత్‌కు మరో రెండు వన్డేలు ఉన్నాయి. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాలో రోహిత్ శర్మ 11 వన్డే ఇన్నింగ్స్‌లలో కలిపి 126 పరుగులే చేయగలిగాడు. సగటు 11.45 కాగా అత్యధిక స్కోరు 23 మాత్రమే. -
‘రాఫెల్’ అవినీతిపై మోదీ బదులేది?
సాక్షి, బళ్లారి: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ విమర్శలను తీవ్రం చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణమనీ, ఎంతో అనుభవమున్న ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను రాఫెల్ కాంట్రాక్టు నుంచి తప్పించి తన సన్నిహితుడికి ఎందుకు అప్పగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా హొసపేటలో జరిగిన ఎన్నికల ‘జనాశీర్వాద్ యాత్ర’లో రాహుల్ మాట్లాడారు. ‘రాఫెల్’ వ్యవహారంపై తాను సంధించిన 3 ప్రశ్నలకు మోదీ జవాబివ్వలేకపోయారన్నారు. వెనుక నుంచి వచ్చే వాహనాలను అద్దంలో గమనిస్తూ నడిపే వాహనదారు మాదిరిగా.. ప్రధాని మోదీ గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ నోట్ల రద్దు, జీఎస్టీ వంటి తప్పిదాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వెనుక వాటిని చూస్తూ వాహనాన్ని ముందుకు నడిపితే ప్రమాదాలు తప్పవని వ్యాఖ్యానించారు. ముందు చూపుతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్యను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. కాగా, బళ్లారి, కొప్పాల్, రాయిచూర్, కలబురిగి, బీదర్ జిల్లాల్లో నాలుగు రోజుల ఎన్నికల ప్రచారంలో రాహుల్ బస్సులో ప్రయాణిస్తూ సభలు, ర్యాలీల ద్వారా ప్రజలను కలుసుకుంటున్నారు. కాగా, యూపీఏ హయాంలో 126 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందమే కుదరలేదని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. -
2 పరుగులు చేస్తే చాలు... ముందు లంచ్ చేసి రండి!
119 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో భారత్ స్కోరు 19 ఓవర్లు ముగిసేసరికి 117/1... మరో 2 పరుగులు చేస్తే చాలు గెలుపు సొంతమవుతుంది. ఇరు జట్ల ఆటగాళ్లు పెవిలియన్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు. ధావన్ స్టాన్స్ తీసుకునేందుకు సిద్ధమవుతున్న వేళ అంపైర్లు ఒక్కసారిగా ‘లంచ్’ అని ప్రకటించేశారు. దాంతో కోహ్లి, దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ ఆశ్చర్యానికి లోనయ్యారు. వారిద్దరు అంపైర్లతో ఏదో చెప్పబోయినా రూల్స్ అంటే రూల్స్ అంటూ వారు తిరస్కరించడంతో చేసేదేమీ లేక ఆటగాళ్లు మైదానం వీడారు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. రిఫరీ తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోకుండా రాతియుగం లాంటి నిబంధనలు అమలు చేయడం ఏమిటని మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు విరుచుకు పడ్డారు. అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించడం... దక్షిణాఫ్రికా ఓటమి ఖాయం కావడంతో మరో రెండు పరుగుల కోసం వేచి చూడకుండా ప్రేక్షకులు మైదానం వీడటం కనిపించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కేవలం 32.2 ఓవర్లకే ముగియడంతో భారత్ ఆడే సమయంలో లంచ్ విరామం ప్రకటించాల్సింది. 15 ఓవర్లు ముగిశాక మరో 26 పరుగులు చేయాల్సిన సమయంలోనే లంచ్ సమయం అయింది. నిజానికి ఈ సమయంలోనే బ్రేక్ ఇస్తే ఇంతగా విమర్శలు రాకపోయేవేమో! అయితే అంపైర్లు ఫలితాన్ని ఆశిస్తూ మరో 15 నిమిషాలు పొడిగించారు. ఆపై 4 ఓవర్లలో భారత్ 24 పరుగులు చేయగలిగింది. దాంతో మరో మాటకు తావు లేకుండా ఆటను నిలిపేశారు. 45 నిమిషాల విరామం తర్వాత వచ్చీ రాగానే భారత్ గెలవలేదు. షమ్సీ వేసిన 20వ ఓవర్లో ధావన్ పరుగులేమీ చేయకపోవడంతో అది ‘మెయిడిన్’ అయింది. ఆ తర్వాత తాహిర్ ఓవర్ మూడో బంతికి కోహ్లి రెండు పరుగులు తీసి లాంఛనం పూర్తి చేశాడు. 5/22 చహల్ కెరీర్ అత్యుత్తమ బౌలింగ్. తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టిన చహల్... దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున రెండో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. 1999లో సునీల్ జోషి (5/6) ప్రదర్శన మొదటి స్థానంలో ఉంది. 118 సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. 2009లో ఆ జట్టు ఇంగ్లండ్‌పై 119 పరుగులు చేసింది. 9 తొమ్మిదేళ్ల తర్వాత తుది జట్టులో డు ప్లెసిస్, డివిలియర్స్ లేకుండా దక్షిణాఫ్రికా మ్యాచ్ ఆడింది. లంచ్ ప్రకటించక ముందు నిండుగా... ప్రకటించాక ఖాళీగా... -
‘మత హింస’ అమిత్ షా లక్షణం
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ చీఫ్ అమిత్ షాపై విమర్శల తీవ్రతను పెంచారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం అమిత్ షాకు ఉన్న లక్షణమని సిద్ధరామయ్య ఆదివారం నాడిక్కడ విమర్శించారు. ‘కర్ణాటకలో మత హింసను రెచ్చగొట్టే చర్యల్ని మేం ఎంతమాత్రం అనుమతించం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని సిద్ధరామయ్య హెచ్చరించారు. ‘ప్రధాని మోదీ కర్ణాటకకు వచ్చి మత ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతున్నారని నేను చెప్పడం లేదు. అది అమిత్ షాకు ఉన్న లక్షణం. అది తప్ప షాకు మరొకటి తెలీదు. మత హింసనే అతను రాజకీయ వ్యూహంగా భావిస్తాడు’ అని విమర్శించారు. -
కొంతైనా నల్లధనం తెచ్చారా: రాహుల్
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..తిరిగి వస్తూ విమానంలో కొంతైనా నల్లధనాన్ని తీసుకువచ్చారా అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు అక్రమంగా దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తానన్న మోదీ ఎన్నికల హామీపై ఆయన ట్వీటర్లో ఈ వ్యంగ్యాస్త్రం సంధించారు. మీరు స్విట్జర్లాండ్ నుంచి నల్లధనం తెస్తారని ఇక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఎద్దేవాచేశారు. దావోస్ వేదికపై ప్రసంగించిన మోదీ.. దేశంలోని సంపదలో 73 శాతం ఒక్క శాతం ఉన్న ధనికుల వద్దే ఎందుకు పోగుపడిందనే విషయంపైనా ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. దీనిపై రిఫరెన్స్ కోసం.. సంబంధిత ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదికను కూడా జతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. -
కేంద్రంలో ప్రశంసలు.. ఇక్కడేమో విమర్శలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖలో అమలుచేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించి, మిగతా రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచిస్తుంటే, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం విమర్శిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సచి వాలయంలో గురువారం ఆయన విలేక రులతో మాట్లాడారు. తెలంగాణలో స్కూళ్లను మూసివేయడంగానీ, విలీనం చేయడంగానీ లేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తాము చేపట్టిన చర్యల వల్ల డ్రాపవుట్స్‌లో జాతీయ సగటుకంటే తెలంగాణ సగటు తక్కువ ఉందని చెప్పారు. 40 వేల ఉపాధ్యాయుల ఖాళీలు ఎక్కడ ఉన్నాయో విమర్శిస్తున్నవాళ్లే చూపాలన్నారు. టీడీపీని, టీఆర్ఎస్లో విలీనం చేయాలన్న టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానన్నారు. విద్యాశాఖపై జవదేకర్ ప్రశంసలు ఇటీవల ఢిల్లీలో జరిగిన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ (కేబ్) సమావేశంలో రాష్ట్ర విద్యా కార్యక్రమాలపై ప్రజెంటేషన్ ఇచ్చానని కడియం తెలిపారు. వాటిని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసించడమే కాకుండా, అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని విద్యాశాఖ మంత్రుల సమావేశంలో సూచించారన్నారు. గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ బాలి కలకు డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ లు, బాలికలకు ప్రత్యేకంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్, గురుకులాల్లో అమలు చేస్తున్న మెనూ, ఉన్నత విద్యలో బోగస్ అడ్మిషన్లు అరికట్టేందుకు తెచ్చిన దోస్త్, బయో మెట్రిక్ మిషన్ల ద్వారా అటెండెన్స్ తీసుకోవడం, విద్యార్థుల అడ్మిషన్లను ఆధార్‌కార్డుతో అను సంధానించడం వంటివి అందులో ఉన్నా యని పేర్కొన్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవో దయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరా మన్నారు. ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ, రీజినల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ కూడా తెలంగాణకు ఇవ్వాలని కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాసినా స్పందన లేదని, కేంద్రం తెలంగాణపట్ల చిన్న చూపు చూస్తోందని కేబ్ సమావేశంలోనే చెప్పాన న్నారు. తెలంగాణ వచ్చాక వచ్చిన కొత్త సం స్థలేమిటో బీజేపీ నేతలే చెప్పాలని ప్రశ్నిం చారు. కేంద్రానికి తామిచ్చిన వినతి పత్రాల ప్రతులను లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, దత్తా త్రేయకు పంపుతున్నామని, వారి పలుకుబడి ఉపయో గించి ఆ సంస్థలు తెలంగాణకు తీసుకొస్తే మంచిదన్నారు. విద్యాశాఖలో కేవలం 13 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, చెప్పారు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణపై ప్రభుత్వం వివక్ష చూపుతోందా? అని విలేకరులు ప్రశ్నించగా, ప్రభుత్వానికి ఎవరి పైనా కక్షలేదని పేర్కొన్నారు. -
డ్యుయల్ డెస్క్‌ల కొనుగోలు వివాదాస్పదం
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన డ్యుయల్ డెస్క్‌ల కొనుగోలు వివాదాస్పదమవుతోంది. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి డ్యుయల్ డెస్క్‌ల సరఫరా పేరిట ఓ మధ్య వ్యాపారి అధిక ధరలతో వంద.. వెయ్యి కాదు.. ఏకంగా లక్ష బల్లలను సరఫరా చేసేలా ఆర్డర్ సొంతం చేసుకున్నారు. విద్యాశాఖ టెండర్లు పిలిచి ఈ పనులు అప్పగించిందా? అంటే అదీ లేదు. జైళ్ల శాఖ పేరుతో నామినేషన్‌పై వీటి కొనుగోలుకు విద్యా శాఖ ఓకే చెప్పింది. సాధారణంగా రూ.10 లక్షల విలువైన పనులకూ ప్రభుత్వానికి ఫైలు పంపించే విద్యా శాఖ రూ.50 కోట్ల విలువైన ఈ పనులకు సొంతంగా ఆర్డర్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. పైగా చర్లపల్లి సెంట్రల్ జైలులో ఏడాది పొడవునా పని చేసినా లక్ష బల్లల తయారీ సామర్థ్యం లేదని విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు. అయినా జైలు పేరుతో బయటి వ్యక్తికి లక్ష బల్లల సరఫరా ఆర్డర్ అప్పగించారని, ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్ల దందా కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓపెన్ మార్కెట్లో చూస్తే.. విద్యాశాఖ ఆర్డర్ ఇచ్చిన డ్యుయల్ డెస్క్‌లను పరిశీలిస్తే అంత ధర లేదని చిన్నతరహా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు విద్యార్థులు కూర్చునేందుకు వీలున్న ఈ బల్లల తయారీకి రూ.2,800 వరకు ఖర్చవుతుందని, సరఫరా, లాభాల కింద రూ.1,200 కలిపినా రూ.4 వేలకు మించదని పేర్కొంటున్నాయి. కానీ ముగ్గురు విద్యార్థులు కూర్చునే బల్లలకు రూ.5,050 రేటుతో రూ.50 కోట్లకుపైగా విలువైన ఆర్డర్‌ను ఎలాంటి టెండర్లు లేకుండా ఇవ్వడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇవేకాదు పదో తరగతి పరీక్షల కోసం మరో 11 వేల వరకు డ్యుయల్ డెస్క్‌ల సరఫరాకూ ఆర్డర్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో రూ.15 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ మాత్రమే కాదు.. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలు కూడా గురుకులాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జైల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలి. సాధారణంగా జైలులో తయారు చేసే బల్లలపై పన్నులు ఉండవు. అలాంటప్పుడు మరింత రేటు తగ్గాల్సి ఉన్నా.. అధిక ధరలకు ఆర్డర్ ఇవ్వడం గమనార్హం. జెమ్ ఏం చెబుతోందంటే.. గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్(జెమ్).. ప్రధానమంత్రి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సూచనల మేరకు ఏర్పాటైన ఆన్లైన్ మార్కెట్ ఇదీ. ఇందులో వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రభుత్వాలకు అవసరమైన పరికరాలను స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆయా వ్యాపార సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో డెస్క్‌లు సరఫరా చేసే వ్యాపార సంస్థలు వెయ్యికిపైగా ఉన్నాయి. విద్యాశాఖ నిర్దేశిత ప్రమాణాలతో కూడిన డ్యుయల్ డెస్క్‌లు రూ.1,600 నుంచి రూ.3,500 వరకు ధర ఉన్నాయి. కానీ దాని నుంచి కొనుగోలు చేసేందుకు విద్యా శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విచారణకు ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ఈ విషయాన్ని తేల్చాలని జైలు అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. ధరలు మేం నిర్ణయించం.. లక్ష డ్యుయల్ డెస్క్‌ల కొనుగోలు కోసం చర్లపల్లి జైలుకు ఆర్డర్ ఇచ్చింది వాస్తవమే. జైళ్లలో తయారయ్యే వస్తువులను ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేయాలన్న నిబంధన ఉంది. ఆ మేరకే మేం ఆర్డర్ ఇచ్చాం. అయితే ధరలను మేం నిర్ణయించం. మేం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం జైలు అధికారులే ధర నిర్ణయించారు. ఆ ప్రకారమే కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం. – కిషన్, పాఠశాల విద్యా కమిషనర్ -
పేదరికాన్ని చూశావా?
పటాన్: గుజరాత్ మోడల్ అభివృద్ధి, క్రోనీ కేపిటలిజం (సన్నిహితులైన కార్పొరేట్లకు మేలుచేసేలా) పై రాహుల్ గాంధీ చేస్తున్న దుష్ప్రచారంపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. పేదరికాన్ని చూడని వారంతా తనపై విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. పటాన్‌లో సోమవారం జరిగిన ప్రచారంలో మోదీ మాట్లాడుతూ.. ‘ఒకసారి ఏదైనా విమర్శ చేస్తే తప్పు అనుకోవచ్చు. మరోసారి అదేమాటన్నా క్షమించొచ్చు. మూడోసారి అంటే రాజకీయ విమర్శ అనుకోవచ్చు. కానీ రెండు నెలలుగా పదే పదే ఒకే విమర్శ చేస్తున్నావు. అందరూ మూర్ఖులనుకుంటున్నావా? అసత్యాలను ప్రచారం చేస్తున్నావ్’ అని రాహుల్‌పై మండిపడ్డారు. రైతుల భూమిని లాక్కొని టాటాలు, అంబానీల వంటి కార్పొరేట్ పెద్దలకు కట్టబెడుతున్నారని రాహుల్ ప్రస్తావిస్తున్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘నేను అంబానీల పిల్లల చదువుల కోసం యత్నిస్తున్నానా? లేక సామాన్యుడి కూతుళ్లకు చదువుకోసం అడుగుతున్నానా? 45 డిగ్రీల ఎండలో గ్రామగ్రామాన తిరిగి ఆడపిల్లలను స్కూలుకు పంపా లని తల్లిదండ్రులను బతిమాలుకున్నా. పుట్టుకతోనే సంపన్నుడికి ఈ బాధలేం తెలుసు’ అని అన్నారు. -
‘జెరూసలేం’ నిర్ణయంపై తీవ్ర నిరసనలు
న్యూఢిల్లీ: జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ శాంతిని ప్రమాదంలో పడేస్తుందని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం భద్రతా మండలి ప్రత్యేకంగా సమావేశమై ట్రంప్ నిర్ణయంతో తలెత్తిన పరిణామాలను చర్చించనుంది. ట్రంప్ చర్య అన్యాయం, బాధ్యతారహితమని సౌదీ అరేబియా తీవ్రస్థాయిలో ఆరోపించింది. ఏకపక్ష నిర్ణయం: పాలస్తీనా అథారిటీ ట్రంప్ నిర్ణయం ఏకపక్ష, రెచ్చగొట్టేదిగా ఉందని, ఇది ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు, అస్థిర పరిస్థితులకు కారణం కానుందని పాలస్తీనా అథారిటీ హెచ్చరించింది. ఈ మేరకు పాలస్తీనా అథారిటీ..ఐరాసలోని సర్వప్రతినిధి సభకు, భద్రతామండలికి లేఖ రాసింది. జెరూసలేం పాలస్తీనా ప్రజలకు మాత్రమే కాదు..ప్రపంచంలోని ముస్లింలందరికీ సంబంధించినదని పేర్కొంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఖతార్ అమిర్ షేక్ హమద్ అల్–తానీ ఖండించారు. ట్రంప్ తన నిర్ణయాన్ని ఉప సంహరించుకుని ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పాలని పాక్ కోరింది. అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ పాక్ పార్లమెంట్ గురువారం ఏకగ్రీవంగా తీర్మానించింది ట్రంప్ నిర్ణయంతో ఈ ప్రాంతంలో భద్రతకు విఘాతం కలుగనుందని, తీవ్ర పర్యవసానాలు తప్పవని రష్యా హెచ్చరించింది. పరిస్థితి చేయిదాటకుండా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని కోరింది. పశ్చిమ జెరూసలేంను ఇజ్రాయెల్‌కు, తూర్పు జెరూసలేంను పాలస్తీనాకు రాజధానులుగా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో రష్యా కోరుతోంది. దీనిపై చర్చించేందుకు శుక్రవారం భద్రతా మండలి భేటీ కానుంది. జెరూసలేంపై అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం రిస్క్‌తో కూడుకున్నదంటూ పలు వార్తా పత్రికలు వ్యాఖ్యానించాయి. అసలే అంతర్గత కలహాలతో సతమతమవుతున్న పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్‌టైమ్స్, సీఎన్ఎన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయి తే, చారిత్రక సత్యానికి వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా అధ్యక్షుని నిర్ణయం ఉందని ఫాక్స్ న్యూస్ పేర్కొంది. మా వైఖరిలో మార్పులేదు:భారత్ పాలస్తీనాపై తమ వైఖరిలో ఎలాంటి మార్పులేదని భారత్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనపై భారత్ ఈ మేరకు స్పందించింది. పాలస్తీనాపై భారతదేశ వైఖరి మారబోదని, దీనిపై మూడో దేశం ప్రభావం ఉండబోదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ తెలిపారు. నేడు భద్రతామండలి అత్యవసర సమావేశం జెరూసలేం అంశంపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని మండలి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. కాగా, ప్రధాని మోదీ త్వరలో పాలస్తీనాలో పర్యటించనున్నట్లు భారత్‌లో ఆ దేశ రాయబారి అద్నన్ అలిహైజా శుక్రవారం వెల్లడించారు. అయితే పర్యటనకు సంబంధించిన వివరాలను తెలపలేదు. పాలస్తీనా వ్యాప్తంగా ఆందోళనలు అమెరికా నిర్ణయాన్ని నిరసిస్తూ వందలాది మంది ప్రదర్శనకారులు వెస్ట్‌బ్యాంక్, గాజా ప్రాంతాల్లో ప్రదర్శనలు చేపట్టారు. ట్రంప్ దిష్టిబొమ్మలను, అమెరికా, ఇజ్రాయెల్ జాతీయ పతాకాలను దహనం చేశారు. పోలీసులపై పలు చోట్ల రాళ్లు రువ్వారు. అక్కడి∙భద్రతా దళాలతో తలపడ్డారు. బెత్లహాంలో ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. అమెరికా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా తీవ్ర సాయుధ పోరుకు సిద్ధం కావాల్సిందిగా ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రజలకు పిలుపునిచ్చింది. మూడు రోజులపాటు దుకాణాలు, స్కూళ్లను మూసివేయాలని పాలస్తీనా వాసులు నిర్ణయించారు. అయితే, శుక్రవారం ప్రార్ధనల అనంతరం ఆందోళనలు హింసాత్మకంగా మారవచ్చని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
‘అయోధ్య’పై రాజకీయమా?
లక్నో/ధంధుక: రామజన్మ భూమి–బాబ్రీ మసీదు కేసు విచారణను 2019 సార్వత్రిక ఎన్నికలయ్యే వరకు వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరడంపై రాజకీయ దుమారం రేగుతోంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కపిల్ సిబల్, కాంగ్రెస్‌లపై బుధవారం తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి సున్నితమైన విషయాలను రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వాడుకోవడం తగదని మోదీ హితవు పలికారు. అహ్మదాబాద్ జిల్లాలోని ధంధుకలో మోదీ మాట్లాడుతూ ‘సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు విచారణను వాయిదా వేయాలని కోరడం తప్పు. కాంగ్రెస్ ఎన్నో చిక్కులను పరిష్కరించకుండా ఎందుకు వదిలేసిందో నాకు ఇప్పుడు అర్థమౌతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఇలా చేయడం సహేతుకం కాదు’ అని అన్నారు. ముస్లిం మతంలో తక్షణం విడాకులిచ్చే ముమ్మారు తలాక్ విధానాన్ని సుప్రీంకోర్టులో వ్యతిరేకిస్తే యూపీ ఎన్నికల్లో తమకు ఎదురుదెబ్బ తప్పదని అప్పట్లో అందరూ హెచ్చరించారనీ, అయినా ముస్లిం మహిళల శ్రేయస్సు కోసం తాము వెనకడుగు వేయలేదని మోదీ చెప్పారు. కాగా, తొలిదశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది. అవి మా వాదనలు కావు: వక్ఫ్‌బోర్డు సిబల్ కోర్టులో తమ సంస్థ తరఫున వాదించలేదని యూపీ సున్నీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూఖీ స్పష్టం చేశారు. ‘ఈ కేసులో కక్షిదారు అయిన హసీం అన్సారీ కొడుకు తరఫున మాత్రమే సిబల్ వాదించారు. విచారణను వాయిదా వేసేలా కోర్టును కోరమని సున్నీవక్ఫ్‌బోర్డు ఆయనకు చెప్పనేలేదు’ అని అన్నారు. కాగా, సుప్రీంకోర్టులో తాను ఎవరి తరఫున వాదనలు వినిపిస్తున్నానన్న దానికన్నా, దేశం ముందున్న సవాళ్లపై మోదీ దృష్టి పెట్టాలంటూ సిబల్ ఎదురుదాడి చేశారు. -
బీజేపీ ఉండగా ‘క్లోన్’ ఎందుకు?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గుజరాత్లో ఎన్నికల వేళ తరచూ హిందూ దేవాలయాలు సందర్శిస్తుండటంపై కేంద్ర మంత్రి జైట్లీ వ్యంగ్యంగా స్పందించారు. హిందుత్వ విధానాలకు బీజేపీ అనుకూలంగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ...‘ఒరిజినల్’ ఉండగా ప్రజలు ‘క్లోన్’ను ఎందుకు కోరుకుంటారని అన్నారు. ‘బీజేపీని హిందుత్వ అనుకూల పార్టీ అని భావిస్తారు. అసలు సిసలు హిందుత్వ పార్టీ బీజేపీ ఉండగా ప్రజలు క్లోన్‌కు ఎందుకు ప్రాధాన్యమిస్తారు?’ అని జైట్లీ శనివారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. 2014లో లోక్‌సభ ఎన్నికలు మొదలుకొని చాలాసార్లు ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ క్రమంగా అంతరించి పోతోందని ఎద్దేవా చేశారు. నేడు భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మెరుగైన ర్యాంకు సాధించిందని తెలిపారు. వారి తప్పేంటి?: రాహుల్ ‘రోజుకో ప్రశ్న’ పరంపరలో భాగంగా ‘ విద్యలో ప్రభుత్వ ఖర్చుకు సంబంధించి గుజరాత్ 26వ స్థానంలో ఎందుకు ఉంది?ఈ రాష్ట్ర యువత చేసిన తప్పేంటి?’ అని రాహుల్ నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలలను పణంగా పెట్టి మోదీ విద్యను వ్యాపారమయం చేస్తున్నారని, విద్యార్థులపై ఫీజుల భారం పెంచుతున్నారని ఆరోపించారు. -
టీ అమ్ముతా.. దేశాన్ని కాదు
భుజ్/జస్డన్: టీ అమ్మేందుకు తాను సిద్ధమని, అయితే దేశాన్నే అమ్మే పాపానికి మాత్రం ఎన్నటికీ ఒడిగట్టనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా సాగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం భుజ్‌లో ప్రారంభిస్తూ... కాంగ్రెస్‌ను, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను విమర్శించారు. పాకిస్తాన్లో ఉగ్రవాది హఫీజ్ సయీద్ విడుదలైనప్పుడు ఎందుకు సంబరపడ్డారో? డోక్లాం వివాదం కొనసాగుతుండగా చైనా రాయబారిని ఎందుకు హత్తుకున్నారో? రాహుల్ సమాధానం చెప్పాలన్నారు. గుజరాత్‌లోని భుజ్, జస్డన్, చాలాల, కడోదర(సూరత్)ల్లో నిర్వహించిన ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. ఇటీవల పాక్ కోర్టు ఒక ఉగ్రవాదిని విడుదల చేయగా.. రాహుల్ ఎందుకు మెచ్చుకున్నారో తనకు అర్థం కాలేదని భుజ్ సభలో ప్రధాని ప్రశ్నించారు. ‘సయీద్ విడుదలైనప్పుడు మీరు చప్పట్లు కొట్టారు. భారత సైన్యం సర్జికల్ దాడుల్ని మీరు గౌరవించరు. వాటి గురించి ఎందుకు మాట్లాడరు. ఉడీ సెక్టార్లో వారు మన సైనికుల్ని చంపారు. మన సైనికులు వారి భూభాగంలోకి చొచ్చుకెళ్లి సర్జికల్ దాడులు చేసి తిరిగొచ్చారు. మృతదేహాల్ని పాకిస్తాన్ ట్రక్కుల్లో తరలించినట్లు తర్వాతి రోజు ఒక వార్తా పత్రిక పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్జికల్ దాడులపై సందేహం వ్యక్తం చేసింది. వారు మన భారత సైన్యాన్ని గౌరవించలేదు. మన సైనికుల్లో ఎవరూ ఎందుకు గాయపడలేదు? దాడి సమయంలో ఫొటో, వీడియో ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మనవాళ్లు పాకిస్తాన్‌కు సినిమా చిత్రీకరణ కోసం వెళ్లారా?’ అని కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. పేదరికాన్ని ఎగతాళి చేస్తున్నారు.. భారత సైనికులు 70 రోజులకు పైగా డోక్లాంలో చైనాతో ముఖాముఖి తలపడినప్పుడు.. చైనా రాయబారిని ఆలింగనం చేసుకున్నారని, ఎవరి ప్రయోజనం కోసం ఇలా చేశారని రాహుల్‌ను ప్రశ్నించారు. తనపై గుజరాత్ ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని ప్రధాని తిప్పికొట్టారు. ‘ఈ గుజరాతీ పుత్రుడి ప్రజా జీవితంలో ఎలాంటి మరకలు లేవు. మీరు గుజరాత్‌కు వచ్చి ఆధారాలు లేకుండా ఈ భూమి పుత్రుడిపై ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చారు. చాయ్‌వాలా అనడాన్ని తప్పుపడుతూ.. తన నిరాడంబర గత జీవితం, పేద తల్లికి జన్మించడం వల్లే కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుందని మండిపడ్డారు. ‘చాయ్‌వాలా ప్రధాని అయినందుకు వారు అసంతృప్తిగా ఉన్నారు. ఉన్నత వర్గాలు అణగారిన ప్రజల్ని ఎలా వేధించేవారో మనం పుస్తకాల్లో చదివేవాళ్లం. అయితే వారు ఇంత స్థాయికి దిగజారుతారని నేనూహించలేదు’ అని జస్డన్ ర్యాలీలో మోదీ అన్నారు. ‘మీరెందుకు పేదరికాన్ని ఎగతాళి చేస్తున్నారు? పేద తల్లిని అవమానిస్తున్నారు’ అని మోదీ ప్రశ్నించారు. సీఎంలను వేధించారు పటీదార్లను ఆకర్షించే ప్రయత్నం చేసిన మోదీ.. కాంగ్రెస్ ప్రభుత్వం గుజరాత్‌పై కక్షతో పటేల్ వర్గానికి చెందిన మాజీ సీఎంలు బాబుభాయ్ పటేల్, చిమన్‌భాయ్ పటేల్, కేశుభాయ్ పటేల్, ఆనందీ బెన్ పటేల్‌లను వేధించిందని ఆరోపించారు. ఆనందీబెన్ పటేల్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రతిపక్షం అన్ని ప్రయత్నాలు చేసిందని అన్నారు. గుజరాత్లో ఎన్నికలు అభివృద్ధిపై నమ్మకానికి, వారసత్వ రాజకీయాలకు మధ్య పోటీ అని ప్రధాని అభివర్ణించారు. ‘గుజరాత్ నా ఆత్మ, భారతదేశం నా పరమాత్మ అని నేనొక కవిత రాశాను. నేను ఈ నేలపై పెరిగాను, నా బలం, బలహీనతలు గుజరాతీలకు తెలుసు. నాలోని మంచికి ఈ మట్టే కారణం’ అని పేర్కొన్నారు. సర్దార్ పటేల్‌ను గుర్తు చేసుకుంటూ.. ‘ఆయనపై కాంగ్రెస్ దురాగతాలకు పాల్పడినప్పుడు ఆ అవమానాల్ని గుజరాతీలు సహించారు. ఇప్పుడు గుజరాతీలు అందుకు సిద్ధంగా లేరు. పరిస్థితి మారింది’ అని ప్రధాని చెప్పారు. -
పాకిస్తాన్ కల తీర్చిన బీజేపీ: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఐఎస్ ఏజెంట్లు, ద్రోహులు జాతీయవాదుల ముసుగులో దేశాన్ని విడగొట్టేందుకు కుట్రపన్నుతున్నారని పరోక్షంగా బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుల, మత ప్రాతిపదికన భారత్‌లో చీలికలు సృష్టిస్తున్న కాషాయ పార్టీ...దేశాన్ని విభజించాలన్న పాకిస్తాన్ కలను తన మూడేళ్ల పాలనలోనే నిజం చేసిందని ఎద్దేవా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఐదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘పాకిస్తాన్, ఐఎస్‌లు 70 ఏళ్లలో చేయలేని దాన్ని బీజేపీ మూడేళ్లలోనే చేసి చూపించింది. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి భారత్‌ను విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. విచ్ఛిన్న భారత్ కాక పాక్‌కు ఉన్న పెద్ద లక్ష్యం మరేంటి?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. -
కౌగిలింతల దౌత్యం విఫలం: రాహుల్
న్యూఢిల్లీ/ దహేగామ్: గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలదాడిని తీవ్రతరం చేశారు. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పాక్ గృహనిర్బంధం నుంచి విడుదల చేయడంపై స్పందిస్తూ.. ‘ నరేంద్ర భాయ్.. పని పూర్తికాలేదు. ఉగ్ర సూత్రధారి(సయీద్) స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పాక్‌లో లష్కరే ఉగ్రవాదులను ఏరివేయడానికి ఆ దేశ సైన్యానికి ఇస్తున్న నిధుల్ని అమెరికా కాంగ్రెస్ నిలిపివేసింది. మీ కౌగిలింతల దౌత్యం విఫలమైంది. చూస్తుంటే మరిన్ని కౌగిలింతల అవసరం పడేట్లు ఉంది’ అని ట్వీటర్లో చురకలంటించారు. మరోవైపు ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు, అమిత్ షా కుమారుడు జయ్షా ఆస్తులపై విపక్షాలను ఎదుర్కొనే ధైర్యంలేకే ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్ని వాయిదా వేసిందన్నారు. గుజరాత్‌లోని దహేగామ్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. రాఫెల్ ఒప్పందాన్ని అధిక ధరకు మళ్లీ ఎందుకు కుదుర్చుకున్నారో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. -
15 నుంచి పార్లమెంట్!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల 15 నుంచి సమావేశాలు ప్రారంభం కావొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 5 వరకు శీతాకాల సమావేశాలు కొనసాగుతాయని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. బ్యాంకుల్లో అప్పులకు సంబంధించిన దివాలా చట్టంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తోంది. దానిపై రాష్ట్రపతి సంతకం చేయగానే ప్రభుత్వం సమావేశాల తేదీలను లాంఛనంగా ప్రకటించనుంది. బుధవారం మంత్రివర్గ సమావేశానికి ముందు ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి జైట్లీ తదితరులు భేటీ అయ్యి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం సమావేశాలు ప్రారంభమవడానికి 15 రోజుల ముందే తేదీలు ప్రకటించాల్సి ఉన్నందున నెలాఖరుకల్లా అధికారికంగా తేదీలు వెల్లడయ్యే అవకాశం ఉంది. జనవరి తొలి వారం వరకు శీతాకాల సమావేశాలు కొనసాగినా, అదే నెల చివరి వారంలోనే బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయనీ, ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ను ప్రవేశపెడతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి
‘‘జీవితారాజశేఖర్గారంటే నాకు గౌరవం. ఆవిడ ‘నంది’ అవార్డుల ప్రకటన అవగానే బయటికొచ్చి ‘చంద్రబాబునాయుడుగారు రాకింగ్.. తెలుగుదేశం రాకింగ్’ అన్నారు. ‘మీరు తెలుగుదేశంలో చేరబోతున్నారా? అని కొందరు అడిగితే.. వాళ్లు చేరమంటే ఎందుకు చేరను? అని ఆమె అన్నట్టుగా కొన్ని పేపర్లలో నేను చదివాను. ఇది చదివాక ఆమెపై నాకు విశ్వసనీయత పోయింది. అది పోయినప్పుడు మనం వాళ్ల మాటలని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది’’ అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంది అవార్డులపై తన అభిప్రాయాలను చెప్పారు. వర్మగారిని నిందించడం తగదు దర్శకులు రామ్‌గోపాల్‌వర్మగారి మీద మరో దర్శకుడు మద్దినేని రమేశ్‌గారు చేసిన ఆరోపణలు, ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు సాటి దర్శకుడిగా బాధ కలిగించాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన ఎందుకంత తీవ్ర పదజాలంతో వాడకూడని భాష వాడాల్సి వచ్చిందన్నదే నా బాధ. దాసరి నారాయణరావుగారి తర్వాత యువ దర్శకులందరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చారు వర్మ. ఆయనే మాకు స్ఫూర్తి అని ఈ రోజుకి కూడా కొత్త దర్శకులు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆయన్ను తీవ్ర పదజాలంతో మాట్లాడటం తగదు. దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని రమేశ్‌గారిని కోరుతున్నా. వర్మగారి మాటలు వ్యంగ్య బాణాల్లాంటివి. ఆయన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కానీ, మద్దినేని రమేశ్‌గారు ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఆయన వ్యంగ్య మాటల నుంచి కొన్ని రియలైజ్ అవ్వాలి, మరికొన్ని నవ్వి ఊరుకోవాలి తప్పితే ఇలా మాట్లాడకూడదు. ఆ మధ్య ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ సినిమాలోని ఓ పాటలో ఆయన్ని ఆయనే విమర్శించుకుని మమ్మల్నీ తీవ్రంగా విమర్శించడంతో మేం నవ్వుకున్నాం. నా గురించి ఏం రాశారా? అని బోయపాటి శ్రీను తెలుసుకుని మరీ నవ్వుకున్నారట. వర్మలా ప్రశ్నించే వ్యక్తిని మనమెప్పుడూ దూషించకూడదు. మనం వాళ్లకీ, వీళ్లకీ భయపడుతుంటాం. కానీ, ఆయన కల్మషం లేకుండా మాట్లాడేస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఇక మాట్లాడకుండా చేయకూడదు. ఆయన లాంటోళ్లు మాట్లాడితే మంచిది. ఆర్కే లక్ష్మణ్‌గారు, కార్టూనిస్ట్ శ్రీధర్‌గారు, దర్శకుడు బాలాగారు.. వారివన్నీ వ్యంగ్యాస్త్రాలు. అవి హాని కలిగించేవి కావు. వాళ్ల ధోరణిలో సమాజాన్ని చూస్తుంటారు. మహామహులు దాన్ని స్పోర్టివ్‌గా తీసుకున్నారు. నా వెనక శక్తులేం లేవు! నిన్న, మొన్న చాలామంది అన్నారు. అస్సలు ఈ గుణశేఖర్ ఎవడు? ‘రుద్రమదేవి’ సినిమా రిలీజ్ అయి రెండు మూడేళ్లయింది. ఇప్పుడు మళ్లీ ట్యాక్స్ మినహాయింపు, నాకు అన్యాయం జరిగిందని అంటాడేంటి? అసలు తను దరఖాస్తు సరిగ్గా చేయలేదు. రిలీజ్ అయ్యాక చేశాడు. ముందే చేసుంటే పన్ను మినహాయింపు మా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకివ్వదు? తప్పంతా ఆయనలోనే పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఆయన వెనక ఏమైనా శక్తులున్నాయా? అంటున్నారు. నా వెనుక శక్తులేమీ లేవు నేనొక్కడినే. జ్యూరీ సభ్యులు టి.ప్రసన్నకుమార్‌గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘రుద్రమదేవి’ విడుదలయ్యాక దరఖాస్తు చేశారని. నేను రిలీజ్‌కి ముందే అప్లై చేశాను. 2015 అక్టోబర్ 9న రిలీజ్. 7వ తేదీ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ ఉంటే తప్ప పన్ను మినహాయింపుకు దరఖాస్తు చేసుకోలేం. అక్టోబర్ 8న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు దరఖాస్తు చేశా. వాళ్లు ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. కానీ, ఏపీ స్పందించలేదు. 12న చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లంగారు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి ఒక నోటీస్ కూడా పంపించారు. నాకూ ఒక సీసీ పంపించారు. పన్ను మినహాయింపు కోసం ఒక స్క్రీనింగ్ కమిటీ వేసి పరిశీలించ మని ఆ నోటీస్‌లో ఉంది. కానీ, హైదరాబాద్ నుంచి ఆఫీసు విజయవాడకి సర్దుతున్నాం ఒక నెల ఆగమన్నారు. ఆ తర్వాత ఫైళ్లన్నీ సర్దుతున్నాం మరో నెల పడుతుందంటూ కాలయాపన చేశారు. మూణ్నెల్ల తర్వాత ఫైల్ క్లోజ్ చేయమని మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. షాక్ అయి, నేను దరఖాస్తు చేసిన, చీఫ్ సెక్రటరీగారు ఇచ్చిన కాపీలతో వైజాగ్ వెళ్లి మంత్రి అయ్యన్న పాత్రుడిని కలిశా. అజయ్ కల్లంగారిచ్చిన నోటీస్ చూసి, ‘ఆదేశాలున్నా ఎందుకు కమిటీ వేయలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుందాం. నేను అమరావతికి వెళ్లినప్పుడు చెబుతాను నువ్వు కూడా రా’ అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి నాకు కాల్ రాలేదు. నేనే ఫోన్ చేస్తే, లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టినా స్పందించకపోవడంతో వదిలే శా. ఆ తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావుగారిని కలిశా. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ సమావేశంలోనే ‘రుద్రమదేవి’ సినిమా విషయాన్ని ప్రస్తావిస్తా అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి కూడా రెస్పాన్స్ లేదు. దాదాపు 70–80 కోట్లతో ‘రుద్రమదేవి’ లాంటి చారిత్రాత్మక సినిమా నిర్మించాను కాబట్టి, ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తే, మంచి సపోర్ట్ అవుతుందని భావించా. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కదా.. ఏపీ కూడా ఇస్తే నాకు సపోర్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో నా వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేకుండా దరఖాస్తు చేశా. నాకు సమాధానం రాలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా లేఖ రాశా. ఆయన్ని విమర్శించలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని వివరించా. ఆ నిబంధన తీసేయాలి నంది అవార్డుల విషయానికొస్తే ప్రతి సంవత్సరం విమర్శలుంటాయి. రానివాళ్లు అసంతృప్తి వెళ్లబుచ్చడం కరెక్టే. కానీ, ఈ ఏడాది.. మా అసంతృప్తిని వెళ్లగక్కడానికి కూడా వీలు లేకుండా ఓ నియమం పెట్టారు. అవార్డు రాకుంటే బహిరంగంగా విమర్శించకూడదనీ, అలా చేస్తే మరో మూడేళ్లు వారు దరఖాస్తు చేసుకోవడానికి కుదరదని దరఖాస్తులో పేర్కొనడం కరెక్ట్ కాదు. అందువల్ల బయటకి వచ్చి మాట్లాడాలంటే భయమేస్తోంది. మాలాంటి వాళ్లకి ఇప్పుడూ అవార్డులు రాక.. తర్వాత మరో మూడేళ్లు అవార్డులు రాకుంటే ఎలా సార్? అని అప్కమింVŠ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ నాతో అన్నారు. అడిగే హక్కు మాకు ఉంటుంది. ప్రతి సంవత్సరం విమర్శలు వస్తుంటాయి. నేను అవార్డు పొందినప్పుడు కూడా ఎవరో ఒక్కరు విమర్శించినవాళ్లే. ఎవరూ కూడా ఒక స్థాయికి మించి విమర్శించరు. ఓ స్థాయికి మించి విమర్శిస్తే సుమోటాగా స్వీకరించి చర్యలు తీసుకోవచ్చు. నాకు రాలేదు, ఎందుకు రాలేదు? అని ఎవరి హద్దులో వారు అడగొచ్చు. అది తప్పుకాదు? మెసేజ్ కనిపించలేదా? ‘రుద్రమదేవి’ సినిమా విడుదలైంది 2015లో. ఆ సంవత్సరం జ్యూరీ చైర్మన్ జీవితాగారు. మా విమర్శలను కొందరు మీడియా మిత్రులు ఆమె వద్ద ప్రస్తావించగా.. ఆవిడ స్పందించారు. ఉత్తమ చిత్రం విభాగంలో ‘బాహుబలి’తో ‘రుద్రమదేవి’ అన్ని విభాగాల్లో పోటీ పడలేకపోయింది. అందువల్ల ‘బాహుబలి’కి ఇచ్చాం అన్నారామె. పోటీ పడ్డప్పుడు ఉత్తమ చిత్రంగా రాకపోతే ఆ పోటీ పడ్డ సినిమా రన్నరప్ కింద అవుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం అవుతుంది కదా అని కొందరంటే.. జ్యూరీ కన్సిడర్ చేయడానికి కూడా చాలా గట్టి పోటీ ఉందని చెప్పారట. అంటే.. జ్యూరీలో ఉన్న సినిమాలకి కూడా మీరు తీసిన చారిత్రాత్మక చిత్రం పోటీ పడలేకపోయిందా? సార్ అని కొందరు నాతో అన్నారు. దర్శకత్వం విభాగంలో పోటీ పడలేదంటే డైరెక్టర్‌గా రాదు. టోటల్ సినిమాలో సమాజానికి మేలు చేసే ఒక మెసేజ్ ఉంది అనుకున్నప్పుడు కచ్చితంగా ఉత్తమ మూడు చిత్రాల విభాగంలో ఏదో ఒకటి ఇస్తారు. దీనికంటే వేరే సినిమాలు గొప్ప మెసేజ్ ఇస్తున్నాయంటే కనీసం జ్యూరీ కింద ఇస్తారు. మరి ‘రుద్రమదేవి’ కంటే మిగతా సినిమాల్లో ఏం సందేశం కనిపించిందో తెలియడం లేదు. జ్యూరీ బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కువ మంది సినిమావాళ్లనే పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రాజకీయ లబ్ధి పొందేవారు అస్సలు ఉండకూడదు. అవార్డులు ప్రకటించి బయటికొచ్చి ఓ ప్రభుత్వాన్ని జీవితగారు మెచ్చుకున్నారంటే.. ఏదో రాజకీయ లబ్ధి ఆశించే అనుకుంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం కళాభిమానుల కష్టాన్ని పణంగా పెట్టొద్దని విన్నవించుకుంటున్నా.అల్లు అర్జున్ విషయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్లై చేశారని చెప్పారు. సహాయ నటుడిగానే దరఖాస్తు చేశా. సహాయ నటుడిగానే అప్లయ్ చేసినా, ఎస్వీ రంగారావు పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇచ్చాం అన్నారు. మేం ఏ కేటగిరీకి దరఖాస్తు చేశామో దాన్ని వారు మార్చడానికి లేదు. రంగారావుగారి పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు ఇచ్చామంటే సహాయ నటుడి అవార్డుని తగ్గించినట్లవుతుంది కదా? ఇప్పుడు చాలామంది జాతీయ అవార్డులని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. జాతీయ అవార్డు గైడ్‌లైన్స్ వేరు.. నంది అవార్డు గైడ్‌లైన్స్ వేరు. మనకి మన ప్రాంతీయత, సంస్కృతిపైన ఆధారపడి ఉంటాయి. అలా ‘రుద్రమదేవి’ విషయానికొస్తే.. కొన్నింటిలో వాళ్లకి కన్వీనెంట్‌గా ఉన్నవి జాతీయ అవార్డులతో కంపేర్ చేసుకుంటున్నారు. కన్వీనెంట్‌గా లేనివి మనది వేరు కదా అంటున్నారు. ‘రుద్రమదేవి’కి జాతీయ అవార్డులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం రానందుకు నాకు ఏమాత్రం అసంతృప్తి లేదు. ‘కంచె’ సినిమాకి ఇచ్చారు. ఆ సినిమా నా దృష్టిలో ‘రుద్రమదేవి’ కంటే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా. అది కుల వ్యవస్థ మీద పోరాడే, ప్రశ్నించే సినిమా. ‘కంచె’కి అవార్డు రావడంతో తొలుత షాక్ అయ్యా. కథ విన్నాక కరెక్టే అనిపించింది. ‘రుద్రమదేవి’లో తెలుగువారు మరచిపోతున్న చరిత్రను చూపించా. దర్శకత్వమో, మరొకటో నాసిరకంగా కనిపించి ఉండవచ్చు. కానీ, సినిమా ఇచ్చిన సందేశం అందలేదా? అందువల్ల నేను అప్సెట్ అయ్యానే కానీ, ఉత్తమ దర్శకుడి అవార్డు రాలేదనే బాధ లేదు. ‘బాహుబలి’ బెటర్ సినిమానే. రాజమౌళికి అవార్డు ఇచ్చినందకు హ్యాపీ. కానీ, ‘రుద్రమ దేవి’లో సందేశం లేదా? సాటి మహిళ జ్యూరీలో ఉండి కూడా మహిళా సాధికారత మీద తీసిన సినిమాకి న్యాయం జరగలేదంటే ఏమనాలి? ఇండియా కాదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అన్నది మేల్ డామినేషన్. అలాంటిది 70–80 కోట్లు పెట్టి ఓ మహిళ మీద సినిమా తీశాడే. చెడగొట్టాడే. అయినా వీడి సందేశం బాగుందే. ప్రయత్నాన్ని చిన్నగా తట్టి ప్రోత్సహిద్దామనుకుంటే నాకు లక్షలు వచ్చేయవు కదా? పన్ను మినహాయింపు గురించి నేనిప్పుడు మాట్లాడింది కూడా అది తిరిగి ఇచ్చేస్తారని కాదు. అది సమాధి అయిపోయింది. కానీ, నాకు జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి. -
సోషల్ మీడియాలో అరకు ఎంపీ వ్యంగ్యాస్త్రం
తొలిరోజు ఏర్పాటుచేసిన బెలూన్లు.. 16 గాలిలోకి ఎగిరిన బెలూన్లు.. 13 రైడ్‌కి వెళ్లిన పర్యాటకులు.. 30మంది చూసేందుకు వచ్చిన వీక్షకులు.. 50 నుంచి 60మంది ప్రదర్శన సాగిన సమయం.. అరగంటలోపే బందోబస్తులో ఉన్న పోలీసులు.. 1000 మంది మొత్తం ఫెస్టివల్ ఖర్చు.. సుమారు రూ.5 కోట్లు ..ఈ లెక్క చూస్తేనే అరకు లోయలో బెలూన్ ఫెస్టివల్ ఏస్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. అర్ధగంట సంబరానికి ఐదు కోట్లు ఖర్చు చేసిన పాలకుల నిర్వాకం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ కోసం పాకులాడిన పాలకులు.. వాతావరణ సూచనలను సైతం పట్టించుకోకపోవడంతో ఆహ్లాదకరంగా సాగాల్సిన అరకులో తలపెట్టిన బెలూన్ ఉత్సవాలు కాస్త ఉసూరుమనిపించాయి. మంగళవారం తొలిరోజే మొక్కుబడిగా సాగిన ఉత్సవంలో అరగంట సేపే.. అదీ 13 బెలూన్లే ఎగిరాయి. ఆ తర్వాత రెండు రోజులూ ఈదు రు గాలులు, చిరుజల్లులతో మొత్తం కార్యక్రమాలు రద్దయ్యాయి. ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అరకులోయ వంటి ప్రదేశాల్లో రైడింగ్ సురక్షితం కాదని మొదటిరోజే భావించిన బెలూనిస్టులు ఆ తర్వాత రైడింగ్‌కు ఏమాత్రం ప్రయత్నించలేదు. అల్పపీడనం ఉందని చెప్పినా.. బెలూన్ ఫెస్టివల్ జరిగే మూడురోజుల పాటు ప్రతికూల వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉపరితలం నుంచి ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తాల్లో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఉత్సవాల ప్రారంభానికి ఐదురోజుల ముందే ప్రకటించారు. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని, ఫలితంగా గగనతలంలోనే గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ముందుగానే స్పష్టం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్లు సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తు వరకు పయనిస్తాయని నిర్వాహకులు చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉధృతంగా ఉండే గాలుల ప్రభావంతో అవి అదుపు తప్పే ప్రమాదం ఉంటుందని నిపుణులు ముందుగానే అభిప్రాయపడ్డారు. ఈశాన్య గాలులు బలంగా వీస్తుండడం వల్ల హాట్ ఎయిర్ బెలూన్లు కొండ, కోనల నడుమ ఎత్తులో విహరించడం అంత శ్రేయస్కరం కాదని, వీటిని నియంత్రించడం కూడా కష్టమని ముందుగానే పేర్కొన్నారు. పైగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో భద్రతాపరంగా కూడా సమస్యలు ఎదురవుతాయన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. కానీ ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోకుండా అట్టహాసంగా ఏర్పాట్లు చేసేశారు. విదేశాల నుంచి వచ్చిన బెలూనిస్టుల కోసం కొత్తబల్లుగూడ వద్ద 42 టెంట్లతో పాటు కాన్ఫరెన్స్, డైనింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేశామని పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరాములు నాయుడు చెప్పినప్పటికీ రెవెన్యూ శాఖ వాటాతో కలిపి రూ.5కోట్లు దాటిందని అంచనా. మంత్రి అఖిల ప్రియతోనే సరి... ఇక ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని చెబుతూ వచ్చిన జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తొలిరోజు డుమ్మా కొట్టారు. రెండో రోజు బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు వస్తారని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడింది. ఇక మూడో రోజు గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేస్తారని సమాచారం ఇచ్చినప్పటికీ వర్షం కారణంగా రద్దయిందని మళ్లీ ప్రకటించారు. ఇక గురువారం సాయంత్రం ముగింపు కార్యక్రమాలకు గంటాను వెళ్లమని సీఎం చెప్పినప్పటికీ వాతావరణం అనుకూలించక ఆయన పర్యటనా రద్దయింది. సాయంత్రానికి పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ మాత్రం వచ్చారు. మొత్తంగా ప్రభుత్వ పెద్దలు, కనీసం జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకుండానే మూడురోజుల పండుగను తూతూ మంత్రంగా గురువారం రాత్రి ముగించేశారు. ఆదిలోనే హంసపాదు.. ప్రతికూల వాతావరణం పెద్దగా లేని తొలిరోజు మంగళవారమే బెలూన్ ఫెస్టివల్ అట్టర్ ఫ్లాఫ్ అయింది. ముందుగా ఎవరికీ అవగాహన కల్పించకపోవడం, సోషల్ మీడియాలో తప్ప పెద్దగా ప్రచారం చేయకపోవడంతో తొలిరోజే తూతూ మంత్రంలా సాగింది. 13 దేశాల నుంచి వచ్చిన బెలూనిస్టులు 16 హాట్ ఎయిర్ బెలూన్లను ఏర్పాటు చేసినప్పటికీ 13 బెలూన్లు మాత్రమే గాలిలోకి లేచాయి. మిగిలిన మూడు సాంకేతిక కారణాలతో ఓపెన్ కాలేదు. 13 బెలూన్లలో ఒక్కో బెలూన్‌లో ఇద్దరు, ముగ్గురు చొప్పున మొత్తం 30 మందిని మాత్రమే రైడ్‌కి తీసుకువెళ్లారు. కనీసం సందర్శకులు కూడా లేక ఆ ప్రాంతం వెలవెలబోయింది. 50నుంచి 60మంది సందర్శకులు మాత్రమే విచ్చేశారు. చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు కూడా పెద్దగా రాలేదు. కానీ పోలీసులు మాత్రం అడుగడుగునా కనిపించారు. ఏజెన్సీలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ బందోబస్తుకు బెటాలియన్ పోలీసులతో సహా వెయ్యిమందికిపైగా బందోబస్తుకు కేటాయించారు. థ్యాంక్స్ టూ ఏపీ గవర్నమెంట్ సోషల్ మీడియాలో అరకు ఎంపీ వ్యంగ్యాస్త్రం అరకు ఏజెన్సీ ప్రమోషన్ పేరిట జరిగిన ఈ బెలూన్ ఫెస్టివల్‌కు కనీసం అరకు ప్రాంత ప్రజాప్రతినిధులకైనా సమాచారం ఇవ్వలేదు. మంత్రులు, ముఖ్యమంత్రి రాక కోసం తీవ్రంగా పరితపించిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస మాత్రంగా కూడా ఆహ్వానించలేదు. దీనిపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత బాహటంగానే సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మా ప్రాంతంలో జరుగుతున్న బెలూన్ల పండుగకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఆహ్వానమూ లేదూ.. కనీసం సమాచారమూ లేదు.. థ్యాంక్స్ టూ ఏపీ గవర్నమెంట్ . అని ఆమె పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గాలిదే భారం సాక్షి, విశాఖపట్నం: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న అరకు బెలూన్ ఫెస్టివల్‌కు ప్రకృతి బ్రేకులు వేసింది. ఈ నెల 14న తొలిరోజు అరకొర, అపశ్రుతుల మధ్య బెలూన్ల పండగ గంట సేపటికే పరిమితమైంది. మర్నాడు బుధవారం వర్షం కారణంగా నిర్వాహకులు బెలూన్లు ఎగురవేసే సాహసం చేయలేకపోయారు. దీంతో ముగింపు రోజైన గురువారమైనా బెలూన్లతో సందడి చేయాలనుకున్న బెలూనిస్టులకు వరుణుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇలా రూ.కోట్ల రూపాయలు వెచ్చించి మూడు రోజులు అట్టహాసంగా నిర్వహించాలనుకున్న అరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ సందడి లేకుండానే ముగిసింది. పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ గురువారం సాయంత్రం అరకులోయ వెళ్లారు. వాతావరణం అనుకూలిస్తే శుక్రవారం ఉదయమైనా బెలూన్లను ఎగురవేయించాలని నిర్వాహకులను కోరారు. గాలులు, వర్షం లేనిపక్షంలో బెలూన్లు గాలిలోకి పంపడానికి అంగీకరించినట్టు పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరాములునాయుడు ‘సాక్షి’కి చెప్పారు. దీంతో శుక్రవారం వరుణుడు కరుణ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. -
నేను శివ భక్తుణ్ని: రాహుల్
బెచరాజీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలయాలను సందర్శిస్తూ గుజరాత్లో హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారని బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాను శివ భక్తుడినని రాహుల్ సోమవారం వెల్లడించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి రాహుల్ వివిధ ఆలయాలను సందర్శించడం తెలిసిందే. తాజాగా మెహ్సాన జిల్లాలోని మూడు ఆలయాల్లో రాహుల్ ప్రార్థనలు చేశారు. అనంతరం ఓ చోట ఆయన మాట్లాడుతూ ‘నేను శివ భక్తుడిని. బీజేపీ వారికి ఇష్టమొచ్చిన దుష్ప్రచారాన్ని నాకు వ్యతిరేకంగా చేయనివ్వండి. నా నిజాయితీ నాతోనే ఉంది’ అని అన్నారు. -
అది వారి అభిప్రాయం!
దుబాయ్: టి20 ఫార్మాట్ నుంచి తాను తప్పుకోవాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు చేస్తున్న విమర్శలపై మహేంద్ర సింగ్ ధోని తొలిసారి స్వయంగా స్పందించాడు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా స్పష్టతనిచ్చాడు. ‘ప్రతీ ఒక్కరికీ జీవితంలో తమదైన సొంత అభిప్రాయాలు ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. భారత జట్టులో భాగం కావడమే అన్నింటికంటే ఎక్కువగా స్ఫూర్తినిచ్చే అంశం. సహజ ప్రతిభ లేని చాలా మంది క్రికెటర్లు ఎంతో సాధించడం కూడా మనం చూశాం. కేవలం ఆటపై ఉన్న పిచ్చి ప్రేమే దానికి కారణం. ప్రతీ ఒక్కరికి దేశం తరఫున ఆడే అవకాశం రాదు’ అని ధోని వ్యాఖ్యానించాడు. శనివారం ఇక్కడ ధోని తన సొంత అకాడమీ ప్రారంభించిన అనంతరం పలు అంశాలపై మాట్లాడాడు. ఫలితాలకంటే ప్రక్రియపైనే ఎక్కువగా నమ్మకం ఉంచే తాను... ఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తే ఏం జరుగుతుందని తానెప్పుడూ భయపడలేదని చెప్పాడు. తన ట్రేడ్‌మార్క్ ‘హెలికాప్టర్’ షాట్‌ను నేర్చుకోమని ఈతరం కుర్రాళ్లకు ఎప్పుడూ చెప్పనని ధోని అన్నాడు. ‘రోడ్లపై టెన్నిస్‌బాల్ క్రికెట్ ఆడేటప్పుడు నేను ఆ షాట్‌ను నేర్చుకున్నాను. అది చాలా కష్టమైన షాట్. టెన్నిస్ బంతితో అయితే బ్యాట్‌పై ఎక్కడా తగిలినా అది దూరం వెళుతుంది కానీ సాధారణ క్రికెట్లో మాత్రం బ్యాట్ మధ్యలోనే బంతి తగలాలి. ఈ షాట్ ఆడే సమయంలో గాయాలపాలు అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది కాబట్టి నేనెప్పుడూ అది నేర్పించను’ అని ధోని స్పష్టం చేశాడు. పాండ్యాకు అప్పుడే విశ్రాంతా: గంగూలీ కోల్‌కతా: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందుగా ఎంపిక చేసి ఆ తర్వాత ‘విశ్రాంతి’ పేరుతో హార్దిక్ పాండ్యాను తప్పించడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటుగా స్పందించారు. ‘నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. అతను గాయంతో ఉన్నాడా అనే విషయం నాకైతే తెలీదు. పాండ్యా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఇది విరామం లేకుండా ఆడాల్సిన వయసు. కాబట్టి సరైన కారణం కూడా తెలీదు’ అని గంగూలీ అభిప్రాయపడ్డారు. మరోవైపు వన్డేలతో పోలిస్తే టి20ల్లో ధోని తడబడుతున్నాడనే విషయం అర్థమవుతోందని గంగూలీ అన్నారు. ఈ విషయంపై కోహ్లి, టీమ్ మేనేజ్మెంట్ ధోనితో విడిగా మాట్లాడాలి అని సౌరవ్ సూచించారు. -
మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా?
సాక్షి నాలెడ్జ్ సెంటర్: ‘‘హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ గెలుస్తోంది. నేను ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు’’ అంటూనే గురువారం ప్రధాని మోదీ హిమాచల్‌లోని కాంగ్డాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ప్రతి శాసనసభ ఎన్నికల్లోనూ పాలకపక్షాన్ని ఓడించడం ఇక్కడివారికి అలవాటుగా మారడం, 2014 పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లూ బీజేపీ వశం కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే మోదీ ధీమాగా ఉన్నారనిపిస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిది అసమర్థ, అస్తవ్యస్త పాలన అనే విమర్శలు ఉండటం, సీఎంపై అవినీతి కేసులతోఈ ఎన్నికల్లో హస్తానికి ప్రతికూల వాతావరణం ఉండొచ్చు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 73 ఏళ్ల ప్రేమ్ కుమార్ ధూమల్‌ను బీజేపీ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. మోదీ జనాకర్షణపై నమ్మకం లేకనే ధూమల్ పేరు చెప్పారని కాంగ్రెస్ ఎగతాళి చేసినా రాష్ట్ర ప్రజల్లో, బీజేపీ శ్రేణుల్లో గందరగోళానికి తెరపడింది. 2014 నాటి పరిస్థితి ఇప్పుడుందా? కిందటి లోక్‌సభ ఎన్నికలనాటి మోదీ మ్యాజిక్ ఇప్పుడు అదే స్థాయిలో పనిచేస్తుందా? అంటే అనుమానమే. ఏడాది క్రితం మోదీ పాత పెద్దనోట్లను రద్దు చేయడం, జూలై నుంచి ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేశాయి. ఈ చర్యల వల్ల హిమాచల్‌లోని యాపిల్ రైతులు, ఇతర వ్యాపారులు నష్టపోయారు. ఉపాధి అవకాశాలు తగ్గాయి.బీజేపీపై జనంలో మోజు గతంలో మాదిరిగా లేదు. కాంగ్రెస్ తన గెలుపు కోసం నోట్లరద్దు, జీఎస్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతనే నమ్ముకుంది. మరోవైపు బ్రాహ్మణుడైన కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం బాగా జరిగింది. అలా జరిగితే రాజపుత్రుల ఆగ్రహం తప్పదనే భయంతోనే మళ్లీ ధూమల్‌ను సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. కాంగ్డా జిల్లాలో బీసీలే కీలకం! పొరుగు రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో మాదిరిగానే హిమాచల్‌లో కూడా బీసీల జనాభా బాగా తక్కువ. అగ్రకులాల సంఖ్యాబలం ఉన్న హిమాచల్‌లో బీసీల జనాభా కేవలం 18 శాతం మాత్రమే. అయితే, పంజాబ్ నుంచి విడదీసి హిమాచల్‌లో కలిపిన కాంగ్డా జిల్లాలో బీసీలు ఎక్కువే. 16 అసెంబ్లీ సీట్లున్న కాంగ్డాలో సగానికి పైగా జనాభా ఓబీసీలే. గుజరాత్లో మాదిరిగా ఉద్యోగాల్లో 27 శాతం కోటా కావాలని బాహాటంగా అడగకపోయినా, ఈ వర్గంలో ఆ మేరకు చర్చ జరుగుతోంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న బీసీలు రెండు ప్రధానపక్షాల్లో ఎటు మొగ్గితే ఆ పార్టీదే గెలుపు. మొదట 1993లో సీఎం అయిన వీరభద్ర తొలిసారి బీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించి చివరికి కోటాను 18 శాతానికి పెంచారు. అందుకే బీసీలు మొదట్లో కాంగ్రెస్‌కే అనుకూలంగా ఓటేసేవారు. తర్వాత నెమ్మదినెమ్మదిగా చాలా మంది కాషాయపక్షం వైపు వెళ్లిపోయారు. ముస్లింలు రెండు శాతమే కావడంతో హిమాచల్‌లో మత ప్రాతిపదికన ఎన్నికల్లో జనసమీకరణ జరగలేదు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ 2012లో మాదిరిగా మరోసారి మెజారిటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. బీజేపీ ఈసారి 50కి పైగా సీట్లు గెలిచి గద్దెనెక్కాలని ఎన్నికల సమరంలో పోరాడుతోంది. -
అవినీతిలో అన్ని రికార్డులు బద్దలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఘాటుగా విమర్శలు చేశారు. అవినీతికి పాల్పడటంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రికార్డులను అధిగమించిందని ధ్వజమెత్తారు. గురువారం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ గ్రౌండ్స్‌లో ‘నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్ర’ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం అత్యధికంగా అవినీతికి పాల్పడినట్లు ఓ సర్వేలో వెల్లడైందని చెప్పారు. ప్రస్తుతం చేపట్టిన పరివర్తన యాత్ర సిద్ధ రామయ్యను గద్దె దించేందుకు పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో కీలకపాత్ర పోషించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాష్ట్రానికి కేంద్రం విడుదల చేస్తున్న నిధులు ప్రజలకు చేరడం లేదన్నారు. మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నవంబర్ 10న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండటాన్ని ఆయన తప్పు బట్టారు. ఇదంతా ఓటు బ్యాంకు కోసమేనని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం కన్నడ రాజ్యోత్సవ్ను నిర్వహించడం కంటే టిప్పు జయంతిని నిర్వహించేందుకు ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి చూపుతోందని అన్నారు. రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్రను 75 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా నిర్వహించే సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ పాల్గొననున్నారు. -
కాంగ్రెస్ దిగజారిపోయింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పూర్తిగా దిగజారిపోయిందని, ఆ పార్టీ నేతలు భావ దారిద్య్రంలో మునిగి తేలుతున్నారని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశంపై అయినా, ఎంత సేపైనా చర్చించేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారని.. అసెంబ్లీ ముట్టడి ప్రకటన చేయడం కాంగ్రెస్ అసహన రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. అసెంబ్లీలో చర్చిద్దామన్నా.. సిద్ధంకాకుండా రోడ్ల మీదే ఉంటామంటున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎఫ్డిసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డిలతో కలసి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. చలో అసెంబ్లీ పిలుపెందుకు ఇచ్చారు? అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే కాంగ్రెస్ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంపై హరీశ్ మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది. ఏవైనా అభ్యంతరాలుంటే బీఏసీ సమావేశంలో చెప్పాలి. అంతేగానీ సభలో మాట్లాడం, రోడ్ల మీద మాట్లాడుతం అంటే ఎలా? ప్రభుత్వం దగ్గర సమాధానం లేదంటే రోడ్ల మీద బైఠాయించడంలో అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేనివారు, ప్రజా సంఘాల వంటి వారు చలో అసెంబ్లీ పిలుపు ఇస్తారు. అలాంటిది ఒక ప్రధాన ప్రతిపక్షం ఎలా పిలుపు ఇస్తుంది..’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల వద్ద సరుకు లేదు, సబ్జెక్టు లేదు, సత్తా లేదని వ్యాఖ్యానించారు. చలో అసెంబ్లీని ఉపసంహరించుకోవాలని సూచించారు. ఏదైనా జరిగితే వారిదే బాధ్యత ప్రభుత్వం సమాధానం ఇస్తామన్నా విన కుండా ఆందోళన చేయడంలో అర్థం లేదని, కాంగ్రెస్ ఎంత దిగజారిపోయిందో వారి ప్రకటనతో తేలిపోయిందని హరీశ్ విమర్శించారు. చూస్తుంటే కాంగ్రెస్‌కు వీధి పోరాటాలంటేనే ఇష్టమున్నట్లు అనిపిస్తోం దని వ్యాఖ్యానిం చారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా జరగరా నిది ఏదైనా జరిగితే దానికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యూహ రచన లేదని.. సాగునీటి ప్రాజెక్టులపై గతంలో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే మాట్లాడ కుండా పారిపోయిందని గుర్తుచేశారు. సమావేశాలు ఎన్ని రోజులు జరగాలో బీఏసీ నిర్ణయం తీసుకుంటుందని, తాము మూడు నాలుగు వారాలు సభలు జరపాలన్న ఆలోచనలో ఉన్నామని చెప్పారు. జానారెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రతిపక్ష కాంగ్రెస్ నేత జానారెడ్డిని, ఆయన సీనియారిటీని అందరం గౌరవిస్తున్నామని.. అలాంటి ఆయన ప్రతిపక్ష నేతగా ఆలోచించాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలను ఆయన ఎలా సమర్థిస్తారని, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి మూడు నాలుగు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించే వారని.. నిషేధాజ్ఞలు ఉండేవని గుర్తులేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉందని, చలో అసెంబ్లీ పిలుపును ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షనేతను కోరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ మరింతగా దిగజారవద్దని, రెచ్చగొట్టే రాజకీయాలు చేయవద్దని హరీశ్ వ్యాఖ్యానించారు. జానారెడ్డి తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలన్నారు. -
‘మెర్సల్’కు రాజకీయ రంగు
-
‘మెర్సల్’కు రాజకీయ రంగు
న్యూఢిల్లీ/తమిళ సినిమా (చెన్నై): తాజా తమిళ చిత్రం ‘మెర్సల్’ చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. ఈ చిత్రంలో జీఎస్టీ, నోట్లరద్దుపై, భారత్‌లో వైద్య విధానంపై చిత్రీకరించిన కొన్ని సంభాషణలు వివాదాస్పదంగా మారాయి. దీంతో బీజేపీ, బీజేపీయేతర పక్షాల మధ్య వివాదం రాజుకుంది. చిత్రంలో జీఎస్టీపై తప్పుడు ఆరోపణలు చేశారని.. వెంటనే వీటిని తొలగించాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే.. సంస్కృతితో మమేకమైన తమిళ సినిమాను అగౌరవపరచకూడదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహు ల్‌గాంధీ ట్వీటర్లో విమర్శించారు. చిత్రం లోని దృశ్యాలను తొలగించొద్దని కమల్ హాసన్ సూచించారు. వివాదం ముదురుతుండటంతో.. మెర్సల్ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీతేనాండాళ్ ఫిలింస్ వెనక్కు తగ్గింది. బీజేపీ డిమాండ్‌లో న్యాయముందని అంగీకరించిం ది. అభ్యంతరకర దృశ్యాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ‘భారత్‌లోని వైద్య విధానంలో నాణ్యతాలోపాలు.. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూపించాలనే ఉద్దేశంతోనే చిత్రం నిర్మించాం. ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదు’ అని చిత్ర యూనిట్ సభ్యుడు ఎన్ రామస్వామి స్పష్టం చేశారు. అసత్యాలతో చిత్రాలు తీస్తారా?: బీజేపీ తమిళ నటుడు విజయ్ కథానాయకుడిగా, సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ కథానాయికలుగా నటించిన మెర్సల్ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత బుధవారం విడుదలైంది. చిత్రం పతాక సన్నివేశాల్లో.. హీరో విజయ్ జీఎస్టీ, వైద్య విధానంపై మాట్లాడిన సంభాషణలు వివాదాన్ని రాజేశాయి. బీజేపీ నాయకులు ఈ సంభాషణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పోన్ రాధాకృష్టన్, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ, నోట్ల రద్దుపై అసత్య వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, దేశం పరువును తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలోని ఈ దృశ్యాలను తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. బీజేపీ తీరుపై విమర్శలు చిత్రంలోని ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు పలికారు. ‘తమిళ సంస్కృతితో మమేకమైన చిత్ర రంగాన్ని బీజేపీ అవమాన పరచొద్దు’ అని ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తూ చిత్రాలు తీయాలంటూ త్వరలోనే కొత్త చట్టం వస్తుంది’ అంటూ సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం ఎద్దేవా చేశారు. అటు, తమిళ చిత్ర సెన్సార్ బోర్డు ఈ వ్యాఖ్యలకు ఆమోదం తెలిపిన తర్వాత బీజేపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందని కమల్ హాసన్ ప్రశ్నించారు. ‘చిత్రాన్ని రీ–సెన్సార్ చేయొద్దు. విమర్శలకు సరైన సమాధానం ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు. అటు, దక్షిణ భారత నటీనటుల సంఘం కూడా మెర్సల్ చిత్రానికి అండగా నిలిచింది. ‘సెన్సార్ బోర్డు ఆమోదం తర్వాత చిత్రంలోని దృశ్యాలను విమర్శించటం.. భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం’ అని పేర్కొంది. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ భావస్వేచ్ఛ ఉంటుందని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పేర్కొన్నారు. చిత్రాల్లోని సన్నివేశాలు, సంభాషణలు తొలగించాలని రాజకీయ నాయకులు శాసిస్తే.. ఇక సెన్సార్ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. ఈ వివాదంపై హీరో విజయ్ స్పందించనప్పటికీ విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ బీజేపీ తీరును విమర్శించారు. వివాదం రేపిన డైలాగులు ఇవే! చిత్రం క్లైమాక్స్‌లో చేతికి బేడీలతో హీరో విజయ్ కుమార్.. ‘సింగపూర్‌లో 7 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నప్పటికీ ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. కానీ మన ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ తీసుకున్నప్పటికీ ఉచితవైద్యం ఎందుకు ఇవ్వటం లేదు. మందులపై 12 శాతం జీఎస్టీ తీసుకుంటారు.. కానీ మన తల్లుల కాపురాల్లో చిచ్చుపెడుతున్న మద్యంపై మాత్రం జీఎస్టీ ఉండదు’ అని అన్నారు. ఈ డైలాగులపై బీజేపీ మండిపడింది. ‘సింగపూర్‌లో వైద్యం ఉచితం అనేది అబద్ధం. సింగపూర్ ప్రజల సంపాదనలో 10 శాతాన్ని సేవింగ్స్‌గా వెనక్కు తీసుకుంటారు. దీన్ని ఇన్సూరెన్స్ కోసం వినియోగిస్తారు. ఉచిత వైద్యం లేదు’ అని తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి తెలిపారు. -
22న గుజరాత్‌కు ప్రధాని మోదీ
అహ్మదాబాద్ : త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ఈ నెల 22న ప్రధాని మోదీ మరోసారి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భావ్‌నగర్, వడోదర జిల్లాల్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు ప్రధాని గుజరాత్లో పర్యటించారు. భావ్‌నగర్ జిల్లాలోని ఘోఘా, భరూచ్ జిల్లాలోని దహేజ్‌ల మధ్య ‘రోల్–ఆన్ రోల్–ఆఫ్’ ఫెర్రీ(వాహనాల్ని తరలించేందుకు) సేవల్ని ప్రారంభిస్తారు. ఘోఘాలో ప్రసంగించిన అనంతరం.. దహేజ్ నుంచి ఘోఘా వరకూ ఫెర్రీలో ప్రయాణిస్తారు. అనంతరం దహేజ్ నుంచి వడోదర వెళ్తారు. అక్కడ రూ. 1,140 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నవ్లఖీ మైదానంలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గుజరాత్ షెడ్యూల్‌ను మోదీయే ప్రకటిస్తారేమో..: చిదంబరం న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయకపోవడంపై కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ర్యాలీ కోసమే ఎన్నికల షెడ్యూల్‌ను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం మోదీ కనుసన్నల్లో నడుచుకుంటోందని శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. గుజరాత్లో తలపెట్టిన తన చివరి ర్యాలీలో ప్రధాని మోదీ ఎన్నికల షెడ్యూల్‌నూ ప్రకటిస్తారేమోనని చిదంబరం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెచ్చిన విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమవుతోందని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ‘ఐ నీడ్ టు స్పీక్ అప్ నౌ’ పేరుతో ఆయన రాసిన వ్యాసం ప్రచురితమైంది. ‘పేదరికాన్ని చాలా దగ్గరి నుంచి చూశానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకుంటున్నారు. ఆ పేదరికాన్ని భారతీయులందరూ కూడా దగ్గర నుంచి చూసేలా చేసేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అహర్నిశలు శ్రమిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. రంగాల వారీగా ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోందని విమర్శించారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయాయని ఆరోపించారు. పారిశ్రామిక ఉత్పత్తి పూర్తిగా నాశనమైందని పేర్కొన్నారు. ‘వ్యవసాయం పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇక నిర్మాణ రంగం మందకొడిగా సాగుతోంది. సేవల రంగంలో స్తబ్దత నెలకొంది. ఎగుమతులు క్షీణించాయి’ అని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కోలుకోలేని ఆర్థిక విపత్తుగా యశ్వంత్ సిన్హా అభివర్ణించారు. భారీగా ఊహించుకుని, ఘోరంగా అమలు పరిచారంటూ జీఎస్టీ అమలును దుయ్యబట్టారు. ఈ నిర్ణయాల వల్ల వ్యాపార రంగం తీవ్రంగా నాశనమైందన్నారు. వృద్ధి రేటు రానురాను తగ్గిపోతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5.7 శాతానికి చేరుకుందని వెల్లడించారు. ‘నా వ్యాఖ్యలతో బీజేపీలోని చాలామంది వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలుసు. కానీ ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే.. భారతీయుడిగా నా బాధ్యతను విస్మరించినట్లే’ అని పేర్కొన్నారు. ప్రపంచానికి తెలుసు: రాజ్‌నాథ్ యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న విషయం ప్రపంచానికి తెలుసు. ఈ నిజాన్ని ఎవరూ మరిచిపోకూడదు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ విశ్వసనీయత సంపాదించుకుంది’ అని స్పష్టం చేశారు. 18 నెలలుగా ఇదే చెబుతున్నాం..: చిదంబరం దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతుంటే ప్రభుత్వం తమ నోరు మూయిస్తూ వచ్చిందని, గత 18 నెలలుగా కాంగ్రెస్ చెబుతున్న దాన్నే యశ్వంత్ సిన్హా తన వ్యాసంలో చెప్పారని ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ‘నినాదాల’తో ఇంకా ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని ప్రశ్నించారు. ‘యశ్వంత్ సిన్హా నిజం మాట్లాడారు. దీనిపై మేం హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా అభిప్రాయాలు ఆయన ద్వారా ప్రతిధ్వనించాయి’ అని వ్యాఖ్యానించారు.Criticisms -
'మోదీకి ధైర్యముంటే వాటికి సమాధానం చెప్పాలి'
విజయవాడ : పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. నోట్ల రద్దు అనంతరం ఎంత నల్లధనం బయటకు వచ్చిందో ప్రధాని మోదీ లెక్కచెప్పాలన్నారు. మోదీకి ధైర్యముంటే రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, చంద్రబాబులు క్యాష్‌లెస్ విధానం కాదు.. బ్రెయిన్ లెస్ విధానం అవలంభిస్తున్నారని విమర్శించారు. కొంత మంది పెద్దలు పెద్ద నోట్ల ముసుగులో నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసని టీడీపీ నాయకులు అంతా ముందే సర్దుకున్నారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ఎస్బీఐ జోనల్ ఆఫీసు కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. నోట్ల రద్దు వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను వినతి పత్రం ద్వారా ఎస్బీఐ జోనల్ మేనేజర్‌కు కాంగ్రెస్ నాయకులు సమర్పించారు. -
పాక్‌పై నటి రమ్య పొగడ్తలు !
రాజుకుంటున్న వ్యాఖ్యలు బెంగళూరు : మాజీ పార్లమెంటు సభ్యురాలు, శాండిల్‌వుడ్ నటి రమ్య పాకిస్తాన్‌ను మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వివరాలు... నటి రమ్య పాకిస్తాన్లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో మండ్యలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...‘ పాకిస్తాన్‌కు వెళితే నరకానికి వెళ్లినట్లు అని రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్ పేర్కొనడం సరికాదు. మనం ఇక్కడ ఎలా నివసిస్తున్నామో అక్కడి ప్రజలు కూడా అలాగే నివశిస్తున్నారు. అది చాలా మంచి దేశం. అక్కడి వెళ్లిన వారిని చాలా బాగా చూసుకున్నారు.’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల రాష్ట్ర బీజేపీతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. -
చార్జీలు తగ్గించాల్సిందే
సామాన్యుడి ఆవేదన జనగామ : ధనిక రాష్ట్రం అంటూ గొప్పలు చెప్పుకునే పాలకులు ఎడాపెడా చార్జీలు పెంచే స్తూ పెను భారం మోపుతున్నారని సామాన్యు డు ఆవేదన చెందుతున్నాడు. స్వరాష్ట్రం సాధిం చుకుంటే కష్టాలు తీరుతాయని భావించిన ప్రజలకు నిరాశనే ఎదురవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయంపై ప్రజలు ఆవేదన, ఆగ్రహంతో ఉన్నారు. చార్జీల పెంపుపై వారి మాటల్లోనే.. బస్సు చార్జీలు తగ్గించాలి ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలి. తెలంగాణ వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తే ఈ వడ్డింపులు ఏంటి. పల్లెవెలుగు బస్సుల చార్జీలు కూడా పెంచడం దారుణం. - ఒరుగంటి తిరుపతి, చీటకోడూరు ధనిక రాష్ట్రం అంటిరికదా తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ ధరలు పెంచుడు బాగోలేదు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో మధ్యతరగతి ప్రజలు అవస్థ పడుతున్నారు. విద్యుత్తు, ఆర్టీసీ చార్జీల పెంపు పెనుభారం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ప్రజలను బాదుడు బాగోలేదు. - లగిశెట్టి వెంకటేశ్వర్లు, రైల్వేస్టేషన్‌రోడ్డు, జనగామ కరెంటు చార్జీలతో నష్టమే కరెంటు చార్జీల పెంచుతో జిరాక్స్ దుకాణంపై భారం పడనుంది. వంద యూనిట్లు దాటితే రూపాయి వరకు వడ్డిస్తుండడంతో తాము కూడా ధరలు పెంచాల్సి వస్తోంది. పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలి. - వేమెళ్ల సురేష్‌రెడ్డి, జిరాక్స్ దుకాణం, జనగామ హోటళ్లపై మోయలేని భారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హోటళ్లపై ఆధారపడి జీవిస్తున్న వారికి మోయలేని భారం పడనుంది. టిఫిన్స్‌కు అవసరమయ్యే ప్రతి వస్తువును గ్రైండర్‌లోనే తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో అదనపు ఖర్చులు పెరిగి నష్టపోతాం. - బాషెట్టి రాజశేఖర్, హోటల్ యజమాని, జనగామ రూపారుు పెంచితే ఎలా? విద్యుత్తు చార్జీల పెంపు నుంచి వాణిజ్య వినియోగదారులను సడలించాలి. సామాన్యుడి నుంచి ధనికుడి వరకు 100 యూనిట్లు వాడని వారు ఉండరు. ఒక్కసారిగా రూపాయి పెంచితే ఎలా. - ఎండి.సమీర్, వ్యాపారి, జనగామ చార్జీలను వెంటనే తగ్గించాలి ప్రభుత్వం విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రతి ఒక్కటి పెరగడమే తప్ప, ధరలకనుగుణంగా సామాన్యునికి ఒరిగింది ఏమీలేదు. ఏ చార్జీలు పెంచినా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి. - రాపోలు ఉపేందర్, టైలర్, జనగామ -
‘ఉనికి కోసమే కేంద్రంపై విమర్శలు’
యాదిగిరిగుట్ట: తెలంగాణలో టీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునేందుకే అధికార పార్టీ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ప్రచార కార్యక్రమాన్నిఈ నెల 30న నల్లగొండలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రారంభిస్తారని తెలిపారు. 2019 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చే దిశగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు సంకినేని వివరించారు. -
ఓటు వేయని సూర్య
తమిళసినిమా: నూరు శాతం ఓట్లు నమోదు కావాలి.అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ ప్రచారం చేసిన నటుడు సూర్య తన ఓటును వృథా చేయడం విమర్శలకు దారి తీసింది. సోమవారం జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలహాసన్ విదేశాల్లో తన షూటింగ్‌ను కూడా రద్దు చేసుకుని ఓటు వేశారు.ఇక ఓటు వేస్తారో లేదో అని పరిశ్రమ వర్గాల్లో చర్చకు తావిచ్చిన నటుడు అజిత్ కూడా ఉదయాన్నే సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఎన్నికల అధికారులు నిర్వహించిన ఓటు యొక్క అవశ్యకతను వివరించే ప్రచార చిత్రాలలో నటించి అందురూ ఓటు వేయండి, నూరు శాతం పోలింగ్ నమోదు కావాలి అంటూ ప్రచారం చేసిన నటుడు సూర్య ఓటు వేయకుండా తన చిత్ర ప్రచారం కోసం అమెరికా వెళ్లడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.ఎన్నికల కమీషన్ ఓటర్ల పట్టికలో ఓటర్ల పేర్లను సరిగా నమోదు చేయడంలోనూ,ఓటర్ల ఫోటోలను సక్రమంగా పొందుపరచడంలోనూ దృష్టి సారించకుంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసి సినీ తారలతో ఓటింగ్‌పై అవగాహనా ప్రచార చిత్రాలను రూపొందించి టీవీ.చానళ్లలో ప్రచారం చేయడానికే అధిక ప్రాముఖ్యత నిచ్చారు.అలా ప్రచార చిత్రాలలో నటించిన నటుల్లో సూర్య ఒకరు. అలాంటి ఆయన తన ఓటు హక్కును ఉపయోగించుకోకుండా తన చిత్ర ప్రచారం కోసం అమెరికాలో కూర్చున్నారు.దీని గురించి ఆయన వివరణ రూపంలో ఒక ప్రకటన విడుదల చూస్తూ తాను ఓటింగ్ రోజుకు చెన్నైకి తిరి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అయినా అనివార్యకారణాల వల్ల చెన్నైకి చేరుకోలేక పోయాననీ,ఆన్లైన్ లాంటి ఇతర సోర్సెస్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ప్రయత్నం సఫలం కాలేదనీ పేర్కొన్నారు. తాను అందరికీ ఓటు వేయమని చెప్పి తాను ఓటు వేయనందుకు తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తనకు పార్టీల గురించి తెలియని ఒక నిరుపేద నటి డబ్బు కోసం డీఎంకే,అన్నాడీఎంకే పార్టీలకు సంబంధించిన ప్రచార చిత్రాలలో నటిస్తే విమర్శలు గుప్పించిన వారు ఒక ప్రముఖ నటుడు తన ఓటును దుర్వినియోగం చేయడంపై మాట్లాడరా అన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.ఇకపై ఎన్నికల కమీషన్ తారలతో అవగాహనా ప్రచార చిత్రాలు చేయడం మానుకోవాలనే గొంతు వినిపిస్తోంది. -
ఆల్‌ఫ్రీపై విమర్శలు
సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అమలు చేస్తే రాష్ట్రంపై రూ.50 వేలకోట్ల అదనపు భారం పడుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని పార్టీల మేనిఫెస్టోల విడుదల ముగిసిన తరువాత గురువారం సాయంత్రం అమ్మ తన హామీల పట్టికను వెల్లడించారు. అమ్మ మేనిఫెస్టోలో మహిళలు, విద్యార్థులు, రైతులకు అనేక ఉచిత పథకాలను పే ర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఇప్పటికే అనేక ఉచిత పథకాలు అమలులో ఉండగా, మళ్లీ ప్రభుత్వం వస్తే మరిన్ని ఉచితాలు ఉంటాయని అమ్మ హామీ ఇచ్చారు. అమ్మ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల మాటెలా ఉన్నా ప్రభుత్వ ఖజానాపై పడుతున్న ఆర్థిక భారాన్ని మాత్రం అందరూ లెక్కకడుతున్నారు. ఉచితాలపై చెప్పిన హామీలన్నీ నెరవేరిస్తే ప్రభుత్వంపై రూ.50వేల కోట్ల ఆర్థిక భారం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అదనపు భారంలో 50 శాతం సబ్సిడీపై ద్విచక్రవాహనాలు అగ్రస్థానం నిలిచి ఉంది. ఈ పథకానికి మాత్రమే ఏడాదికి రూ.45 కోట్లు కేటాయించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఏడో పే కమిషన్‌ను అమలు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేసినట్లయితే రూ.15వేల కోట్లు అవసరం అవుతుంది. రైతుల అన్నిరకాల రుణాల మాఫీకి రూ.5,500 కోట్లు కేటాయించాలి. అరసు కేబుల్ టీవీ కనెక్షన్, ఉచితంగా సెట్అప్ బాక్స్‌కు రూ.1500 కోట్లు,ప్రతి రేషన్‌కార్డు దారుడికి ఉచిత సెల్‌ఫోన్‌కు రూ.2వేల కోట్లు సిద్ధం చేసుకోక తప్పదు. వంద యూనిట్ల వినియోగదారునికి ఉచిత విద్యుత్ పథకం మరో ముఖ్యమైన హామీగా ఉంది. రాష్ట్రంలో 78.55 లక్షల కుటుంబాలు 100 యూనిట్లకు లోబడి వినియోగిస్తున్నారు. వీరి సబ్సిడీ కోసం ఏడాదికి రూ.2,560 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. పాల ధర తగ్గింపు హామీతో ఏడాదికి రూ.1000 కోట్లు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం టిఫిన్ హామీకి రూ. రూ.600 కోట్లు, వివాహాల ఆర్థిక సహాయానికి ఏడాదికి రూ.200 కోట్లు అవసరం. అన్నాడీఎంకే ప్రభుత్వ పథకాలకు ఐదేళ్లకు రూ.1.50 లక్షల కోట్లు అవసరమని గణాంకాల నిపుణులు లెక్కకట్టారు. అమ్మ మేనిఫెస్టోపై ఆక్షేపణలు: అధికార అన్నాడీంకే మేనిఫెస్టో కోసం ఆత్రంగా ఎదురుచూసిన ప్రతిపక్షాలు ఆక్షే పణలు గుప్పించాయి. డీఎంకే మేనిఫెస్టోను జిరాక్స్ కాపీ తీసి దానికి జయ తన ఫొటోను అతికించుకున్నారని డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఎద్దేవా చేశారు. అన్నింటికీ తన స్టిక్కర్లు అంటించుకోవడంలోనే ఆమె ఆనందాన్ని వెతుక్కుంటారని వ్యాఖ్యానించారు. అమ్మ ప్రకటించిన పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయేగానీ, అభివృద్ధిని సూచించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ విమర్శించారు. ఉచితంగా వస్తువులను ఇచ్చి ప్రజలను మోసం చేసే రోజులకు కాలం చెల్లిందని అన్నాడీఎంకే మేనిఫెస్టోను ఉద్దేశించి పీఎంకే వ్యవస్థాప అధ్యక్షులు డాక్టర్ రాందాస్ వ్యాఖ్యానించారు. ఈ మేనిఫెస్టో చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చిన తీరులో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారం కోసం అర్రులు చాస్తున్న వైనాన్ని అమ్మ మేనిఫెస్టో బైటపెట్టిందని అన్నారు. అభివృద్ధి పథకాలకు ఏమాత్రం తావివ్వకుండా ఉచితాలను పంచడం ద్వారా రాష్ట్రాన్ని మరింత తిరోగమనానికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ మేనిఫెస్టో వెనుక ఉన్న నష్టాన్ని గుర్తించి తీవ్రస్థాయిలో తిప్పికొట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జయలలిత ఇచ్చే సెల్ఫోన్లు వాడితే అవి అమ్మా...అమ్మా అని మాత్రమే అంటాయని డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ ఎద్దేవా చేశారు. -
బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన లభించింది. అధికార బీజేపీ ప్రశంసించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వైద్య సంఘం నిట్టూర్పులు వెళ్లగక్కింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాకాంక్షను నెరవేర్చిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం 2016-17 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా పలువురు స్పందించారు. బడ్జెట్లో అన్ని అంశాలను ప్రస్తావించారని, నిధులను కేటాయించారని తమిళిసై అన్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం నుంచి ఏవైతే ఆశిస్తున్నారో వాటికి ఈ బడ్జెట్ అద్దం పట్టిందని తెలిపారు. ముఖ్యంగా రైతు పక్షపాతి బడ్జెట్‌గా రూపొందిందని చెప్పారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బు మాట్లాడుతూ గత ఏడాది బడ్జెట్లో కేటాయింపులకే దిక్కులేదని ఎద్దేవా చేశారు. ప్రకటించడం కాదు అమలు చేయడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. కంటితుడుపుగా అంకెలు చూపితే ప్రజలకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదని అన్నారు. ప్రజారోగ్యానికి ప్రధాన్యత ఏదీ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పించడంలో కేంద్రబడ్జెట్ విఫలమైందని డాక్టర్ అసోసియేషన్ ఫర్ సోషల్ ఈక్విటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీఆర్ రవీంద్రనాథ్ వ్యాఖ్యానించారు. వైద్య ఖర్చుల కారణంగా ప్రతి ఏటా ఆరుకోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు దిగజారుతున్నారని కేంద్రం విడుదల చేసిన జాతీయ సంక్షేమ సిద్ధాంతం-2015 తేటతెల్లం చేసిందని అన్నారు. ప్రజారోగ్యశాఖకు 2013-14లోనే రూ.1,93,043 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో కేవలం రూ.1,51, 581 కోట్లు కేటాయింపు జరగడం విచారకరమన్నారు. ప్రజావైద్యశాలను బలోపేతం చేయడానికి మారుగా ప్రయివేటు వైద్యశాలకు మేలు చేకూరేలా ఆరోగ్యబీమాపై నిర్ణయాలు తీసుకున్నారని ఆయన విమర్శించారు. బీమా పాలసీలు ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చడం లేదని అనేక సర్వేల్లో తేలిపోయిందని ఆయన గుర్తుచేశారు. వైద్యఖర్చులు, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో లక్ష రూపాయల బీమా సౌకర్యం వృథా అని అన్నారు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని అన్నారు. గ్రామీణ వికాశం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన కేంద్రబడ్జెట్‌ను స్వాగతిస్తున్నానని మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ ఏ వేలయ్యన్ అన్నారు. బడ్జెట్ కేటాయింపులు, తీసుకున్న నిర్ణయాలు భారత దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తాయని చెప్పారు. -
ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకోం
అనంతపురం రూరల్: అనంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై కోగటం విజయభాస్కర్‌రెడ్డి విమర్శలు చేయడం అన్యాయంగా ఉందనీ, అభివృద్ధిని కాంక్షిస్తున్న ఎమ్మెల్యేపై అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు బంగి నాగేంద్ర, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవాంజనేయులు హెచ్చరించారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న కోగటం లాంటి నేతలకు నగర అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఎక్కడి నుంచే అనంతకు వలస వచ్చిన విషయాన్ని కోగటం గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచి దన్నారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి మారుతి కుమార్, నాయకులు కదిరెప్ప, మేదర చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వార్తల్లో నిలిచేందుకే మోదీ ప్రస్తావన: వెంకయ్య
బెంగళూరు/సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకే ప్రధాని మోదీ పేరును రాహుల్ ప్రస్తావిస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. రాహుల్ మానసిక పరిపక్వత లేకుండా, చిన్నపిల్లాడిగా వ్యవహరిస్తున్నారని బెంగళూరులో అన్నారు. రాహుల్ తాత జవహర్లాల్ నెహ్రూ, తండ్రి రాజీవ్ గాంధీలు సైతం సూటు బూటు వేషధారణలోనే పాలించారనే విషయం గుర్తులేదా? అని ఆయన ప్రశ్నించారు. కాగా, యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పరిపాలనలో ‘టేక్ ఇన్ ఇండియా’ జరిగిందని బీజేపీ విమర్శించింది. 2జీ స్పెక్ట్రం, బొగ్గు గనుల కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల్లో (టేక్) తీసుకోకుండా నిర్ణయాలేవీ జరగలేదని బీజేపీ అధికార ప్రతినిధి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు సంధించారు. కాంగ్రెస్ కిసాన్ సమ్మాన్ ర్యాలీలో సోనియా, రాహుల్ చేసిన విమర్శలపై ఢిల్లీలో ఆయన స్పందించారు. రైతులను ఎప్పుడూ పేదరికంలోనే ఉంచాలని కాంగ్రెస్ చూసిందన్నారు. సోనియా అల్లుడు వాద్రా భూ అభివృద్ధి పేరిట రైతులు భూములు లాక్కున్నప్పడు వారికి రైతుల ఆత్మగౌరవం గుర్తుకురాలేదా? అని ఆయన ప్రశ్నించారు. తమ హయాంలో నిజాయితీగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. -
కమలంలో.. ముసలం
- బీబీఎంపీ ఎన్నికల నేపథ్యంలో బహిర్గతం - పార్టీ టికెట్ దక్కలేదంటూ మాజీల అసహనం - స్వపక్షంపై విమర్శల వెల్లువ - మాజీ డీసీఎంపై మండిపాటు సాక్షి, బెంగళూరు : భారతీయ జనతా పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిృబహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల సందర్భంగాభగ్గుమంది. స్వపక్షంలోని నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను భుజస్కందాలపై వేసుకున్న మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్‌పై పలువురు నాయకులు తీవ్ర విమర్శలకు దిగారు. బీబీఎంపీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే 92 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను మంగళవారం రాత్రి దాదాపు 10:30 గంటలకు బీజేపీ విడుదల చేసింది. తాము సూచించిన వారికి వార్డు సభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడం లేదని వారు పేర్కొంటున్నారు. మాజీ మంత్రి సోమణ్ణ, పార్లమెంటు సభ్యుడు పీసీ మోహన్, కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ సైతం ఈ విషయంలో ఆర్.అశోక్ వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్నారు. సోమణ్ణ మరో అడుగు ముందుకు వేసి ఆర్.అశోక్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. స్థానికంగా పార్టీ పటిష్టతకు కృషి చేసిన కార్యకర్తలకు కాకుండా ఆయన చుట్టూ తిరుగుతున్న వారికి, మాజీ కార్పొరేటర్ల భార్యలకు టికెట్లు కేటాయించారని అసంతృప్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ పార్టీ పెద్దలకు ఓ నివేదిక పంపడానికి సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి వారు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎదురైన అనుభవాల దృష్ట్యా తర్వాతి అభ్యర్థుల జాబితా వెల్లడి సందర్భంగా ఎలాంటి అసమ్మతి చెలరేగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమల నాథులు భావిస్తున్నారు. ఇందుకోసం ఆయా వార్డులోని పార్టీ మద్దతుదారులతో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశాలు జరిపి అభ్యర్థులను ఎంపిక చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రచారానికి దూరంగా బీఎస్‌వై! మొదటి జాబితా విడుదలైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 9 మంది పేర్లు సూచించగా అందులో ఒక్కరికి కూడా మొదటి జాబితాలో చోటు దక్కకపోవడమే యడ్డీ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. కనీసం రెండో జాబితాలోనైనా తాను సూచించిన వారికి టికెట్టు ఇవ్వాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. లేదంటే ఈ బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని ఆయన హెచ్చిరించినట్లు సమాచారం. -
అందుకే నాలుగుసార్లు మునుగుతున్నారు
రాహుల్‌పై కవిత విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏకు దగ్గరయ్యేందుకే టీఆర్ఎస్ ఎంపీ కవిత ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. చేసిన పాపాలను కడిగేసుకునేందుకు టీఆర్ఎస్ నాయకులే ఒకటికి నాలుగుసార్లు గోదావరిలో మునుగుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీ కవితకు రాహుల్‌గాంధీని విమర్శించేస్థాయి లేదని అన్నారు. కొన్నిరోజులు ఆగితే ఎవరు పాపాలు చేశారో తెలుస్తుందని, అప్పుడు గోదావరిలో మునిగి పాపాలు కడుక్కోవాలని టీసీఎల్పీ ఉప నేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. పాపాలు పోగొట్టుకోవడానికి రాహుల్ పుష్కర స్నానం చేయాలన్న కవిత వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కేసీఆర్ కుటుంబసభ్యులు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ధన్యవాదాలు చెప్పినపుడు కాంగ్రెస్ పాపాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు రాహుల్‌గాంధీయే కారణమంటూ ఆంధ్రప్రాంత నాయకులు విమర్శలు చేస్తుంటే.. ఇక్కడ కవిత కూడా ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని, అసలు ఆమె తెలంగాణవాదేనా అనే అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. అసలు ఆమె ఏమీ మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్నారు. రైతు ఆత్మహత్యలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు కేబినెట్లో కొనసాగే అర్హత లేదని మండలిలో కాంగ్రెస్ ఉప నాయకుడు పొంగులేటి సుధాకరరెడ్డి మండిపడ్డారు. -
ఆదరణకు నోచని శ్రీమంతుడు!
అధిక భూములున్నా కౌలు తక్కువే వచ్చే ఆదాయానికీ లెక్కల్లేవు ధూపదీప నైవేద్యాలకూ నోచని జగన్నాథుడు రథయాత్రలోనూ అపశ్రుతి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు నిద్రావస్థలో దేవాదాయశాఖ వీరఘట్టంలోని జగన్నాథుడు ఆగర్భ శ్రీమంతుడు. మెట్ట, పల్లపు భూములు, ఖాళీ స్థలాలతోపాటు.. ఏటా లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఇతరులు దర్జాగా అనుభవిస్తుండగా.. ఆయన మాత్రం కడు పేదరికం అనుభవిస్తున్నాడు. ఏడాదిలో ఓ పది రోజులు మినహా ఏనాడూ స్వామివారి ఆలనపాలనా చూసేవారు లేరు. ఇదీ వీరఘట్టం మండల కేంద్రంలో కొలువుతీరిన.. దేవాదాయశాఖ ఆధ్వర్యంలోనే ఉన్న జగన్నాథస్వామి వారి చరిత్ర. వీరఘట్టం: మండల కేంద్రంలోని ముచ్చర్ల వీధిలో కొలువు తీరిన జగన్నాథుడికి సుమారు 45 ఎకరాల విలువైన భూములున్నాయి. ఈ భూములను పలువురు వ్యక్తులకు కారుచౌకగా కౌలుకు తీసుకున్నారు. అలా అయినా ఏడాదికి సుమారు రూ. 3 లక్షలపైనే ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో మేనేజరుకు రూ.1500, అర్చకులకు రూ. 4 వేలు, స్వీపర్‌కు రూ. 500, గుమస్తాకు రూ. 1000, కరెంటు బిల్లుకు సుమారు రూ. 1200 ప్రతి నెలా ఖర్చు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే జీతాలు, ఖర్చులు కలిపి ఏడాదికి సుమారు రూ. 90 వేల వరకు ఖర్చవుతోంది. ఖర్చులు పోను ఏడాది రూ. 2. 50 లక్షల మిగులు ఆదాయం కనిపిస్తోంది. అయితే మిగిలిన ఆదాయం ఏమవుతోందో తెలియని పరిస్థితి ఉంది. ఈ విషయంపై అధికారులు కూడా నోరుమెదపడం లేదు. వాస్తవానికి కౌలుకు ఇచ్చిన భూములను ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్స్ చేయాలి. ప్రస్తుతం భూముల ధరలు పట్టణ ప్రాంతాల్లో 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం పెరిగాయి. అయినా దేవాదాయ శాఖ కౌలుకు ఇచ్చిన ధరల్లో మాత్రం ఇప్పటి వరకు తేడా లేదు. స్వామివారికి కనీసం సరైన దీపధూప నైవేద్యాలూ అందడంలేదు. ఏటా రథోత్సవాల్లో అందరికీ గుర్తొచ్చే ఈ జగన్నాథుడిని.. ఉత్సవాల అనంతరం మరిచిపోవడం ప్రజలకు, దేవాదాయ శాఖ అధికారులకు పరిపాటిగా మారడం విచారకరం. లోపాయికారి ఒప్పందంతో ఆదాయానికి గండి! జగన్నాథస్వామి భూములను కౌలుకు తీసుకున్న వారితో దేవాదాయ శాఖ అధికారులు లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని తక్కువ రేట్లకు కౌలుకు ఇచ్చినట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంవల్లే దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అభివృద్ధిని పట్టించుకోకుండా మిన్నకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ భూముల, ఆదాయ వివరాలను బహిర్గతం చేసి ఆలయ అభివృద్ధికి కమిటీలు వేసి జగన్నాథస్వామి ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రథయాత్రలో భక్తుల ఆవేదన కాగా, మండల కేంద్రంలో శనివారం జరిగిన తొలి రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథచక్రం విరిగి నడిరోడ్డుపై రథం సుమారు మూడు గంటల సేపు నిలిచిపోయింది. రథాన్ని తయారు చేయించడంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, శ్రీమంతుడైన జగన్నాథ స్వామికి ఏమిటీ కష్టాలని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్న కోవెల ఆలన పాలన ఎందుకు చూడడం లేదని ఈఓతో పాటు అర్చకులను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యమే మండల కేంద్రంలో శనివారం జరిగిన తొలి రథయాత్రలో జగన్నాథస్వామిని నడిరోడ్డుపై మూడు గంటల సేపు ఉంచారు. రథాన్ని పటిష్ఠంగా తయారు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. - బుక్కూరు దుర్గారావు, వీరఘట్టం ఆలయ ఆస్తులు వెల్లడించాలి జగన్నాథస్వామి ఆలయ ఆదాయ, వ్యయాలను బహిర్గతం చే యాలి. కమిటీలను వేసి ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ అధికారులు చొరవ చూపాలి. లేదంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు. - జామి లక్ష్మీనారాయణ, సర్పంచ్ ప్రతినిధి, వీరఘట్టం -
చిత్తూరు రోడ్డు ప్రమాదంలో తప్పెవరిది ?
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసుశాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు హంస, అజయ్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వాహనం నడిపిన పురుషోత్తంపైనే నెపం మొత్తం నెట్టేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్లో సీజ్ చేసిన వాహనాన్ని ఎవరి అనుమతి లేకుండానే పురుషోత్తం చిత్తూరుకు తీసుకురావడం అసాధ్యం. పోలీసు స్టేషన్లో అధికారులు పురమాయించిన పనులను చేయడానికే పురుషోత్తం సీజ్ చేసిన వాహనాన్ని చిత్తూరుకు తీసుకొచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక్కడ పని పూర్తి చేసుకుని పోలీసు స్టేషన్‌కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం చాలా నెలల క్రితమే గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్లో సీజ్ చేసి ఉంచారు. ఫలితంగా వాహనం కండీషన్లో లేకుండా పోయింది. ఇలాంటి వాహనాన్ని స్టేషన్ అధికారులు పనిపై పంపితేనే పురుషోత్తం చిత్తూరుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పురుషోత్తంతో పాటు వ్యానులో మరో ఇద్దరు యూనిఫామ్‌లో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రమాదానికి వీరద్దరూ కారణం కాకపోయినప్పటికీ పైఅధికారులు చెప్పిన పనిచేయడానికి స్టేషన్లో ఉన్న వాహనాన్ని తీసుకొచ్చినట్లు నిర్ధారణ అవుతోంది. వాహనం స్టేషన్ నుంచి ఎలా బయటకు వచ్చిందనే విషయాలపై దర్యాప్తు అధికారిగా ఉన్న చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డికి గంగాధరనెల్లూరు స్టేషన్లో పనిచేస్తున్న కొందరు పోలీసులు ఈ వివరాలు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసు శాఖ ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. -
అంత తేలిగ్గా అర్థం కాదు
*బడ్జెట్‌పై వెంకయ్య వ్యాఖ్య సాక్షి. హైదరాబాద్: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంత సులువుగా అర్ధమయ్యేది కాదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.సంక్షిప్త వివరాలను చూస్తే బడ్జెట్ అర్థం కాదని, లోతుపాతులకు వెళ్లి చూడాల్సి ఉంటుందని చెప్పారు. అలా చూడకుండానే కొందరు విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. సహచర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఆదాయాన్ని పెంచి దానిని అందరికీ పంచి సంక్షేమాన్ని కలిగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అన్నీ ఫ్రీ అంటూ కాలం గడిపేయొచ్చనీ కానీ దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను చూడాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్న దాన్లోంచి రూ.5 లక్షల కోట్లను ముందుగా ఆర్థిక సంఘం నిధుల రూపేణా రాష్ట్రాలకు ఇచ్చేసిందని, మిగిలిన దాంట్లోనే బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులకు అవకాశం ఉంటుందన్న విషయం ప్రజలు, రాష్ట్రాలు అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ఆదాయంలో రాష్ట్రాల వాటాగా ఇస్తున్న దానికి అదనంగా ఒకేసారి పది శాతం నిధులను 14వ ఆర్థిక సంఘం ద్వారా ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం అంగీకారం తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు రాబోయే ఐదేళ్లలో కేంద్రం రెండు లక్షల కోట్లు అందజేస్తుందని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులపై అసంతృప్తితో ఉన్న సీఎం చంద్రబాబుతో శనివారమే తాను మాట్లాడినట్టు వెంకయ్య తెలిపారు. లోటుపాట్లు ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి మాట్లాడమని చెప్పానన్నారు. బహిరంగ చర్చలకన్నా కలిసి కూర్చొని మాట్లాడడం మంచిదన్నారు. బాబు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని తాను అనుకోవడం లేదని, బాధను వ్యక్తం చేసినట్టుగా భావిస్తున్నానన్నారు. బాబుతో పవన్‌కల్యాణ్ భేటీ పెద్దగా ప్రాధాన్యమే ముంటుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తుది నిర్ణయమేమీ జరగలేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆర్థిక శాఖ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లానని చెప్పారు. పోలవరానికి కేటాయింపులు తక్కువన్న దానితో తానూ ఏకభవిస్తున్నట్టు వెంకయ్య చెప్పారు. -
టీడీపీ గూడు ఖాళీ
సిద్దిపేట జోన్: తెలంగాణలో టీడీపీ దుకాణం ఖాళీ కానుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని తన నివాసంలో హరీష్‌రావు విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో టీడీపీ కనుమరుగైందన్నారు. మిగతా ప్రాంతాల్లో మిగిలిన ఆ కొద్దిమంది కూడా భవిష్యత్తులో ఉండరన్నారు. టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలు బాబు డెరైక్షన్తోనే తూప్రాన్‌లో సమావేశం నిర్వహించి టీఆర్ఎస్ సర్కార్‌పై బురదజల్లే చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ఆంధ్రాలో అక్కడి ప్రజలకు రుణమాఫీ, పింఛన్లు, ఆహారభద్రతా కార్డులు అందిస్తున్న చంద్రబాబు, హైదరాబాద్‌లోని ఆంధ్రా వారికి నివాసం పేరిట రుణమాఫీని వర్తించకుండా చేశారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో బాబు మోసం తెలియక ఓట్లేసిన హైదరాబాద్‌లోని ఆంధ్రా ఓటర్లు నేడు చంద్రబాబు నిజ స్వరూపాన్ని గుర్తించారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న పాపానికి రుణమాఫీని దూరం చేసిన బాబుకు త్వరలో బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. సంక్షేమ పథకాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.11 వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు. ముఖ్యంగా పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆహార భద్రతా కార్డుల కోసం వీటిని వినియోగించడం జరిగిందన్నారు. తొమ్మిది నెలల టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరుపై విమర్శలు చేస్తున్న ఎర్రబెల్లి, రేవంత్‌లు తమ నియోజకవర్గాల్లో పర్యటించి పథకాల పనితీరును తెలుసుకోవాలన్నారు. మన పథకాలను కాపీ కొడుతున్న బాబు.. తెలంగాణలోని పథకాలను ఆంధ్రాలో కాపీ కొడుతున్న చంద్రబాబును ప్రశ్నించే ధైర్యాన్ని నేర్చుకోవాలని ఆ పార్టీ నేతలకు హరీష్‌రావు హితవు పలికారు. ఆంధ్రాలో ఇరవై కిలోల బియ్యం సీలింగ్ విధానాన్ని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో దళితుల భూ సేకరణకు రూ.19 కోట్లను ఖర్చు చేశామన్నారు. మరో రూ.20 కోట్లతో జిల్లాలో భూ సేకరణకు చర్యలు చేపడుతున్నామన్నారు. టీఆర్ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదుకు జిల్లాలో విశేష స్పందన లభిస్తుందన్నారు. ఇప్పటికే నాలుగు లక్షల సభ్యత్వాలను పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 28 వరకు కొనసాగుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు రామచంద్రం, మూర్తి బాల్‌రెడ్డి, కోల రమేష్‌గౌడ్, జాప శ్రీకాంత్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, మరుపల్లి శ్రీను, శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీపై లెఫ్ట్ మాటల దాడి
రిఫరెండం కాదనడం బీజేపీ అసమర్ధతకు నిదర్శనం న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై కమ్యూనిస్తు పార్టీలు పదునైన మాటలతో విమర్శల వర్షం కురిపించాయి. ఈ ఎన్నికల ఫలితాలతో బీజేపీ చరిత్రను తిరగరాసిందని, ఇది మోదీ పాలనపై రిఫరెండం కాదనడం వారి అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించాయి. ఈ తొమ్మిది నెలల కాలంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల సేవలో తరించిందనే సత్యాన్ని ప్రజలు ఈ ఎన్నికల్లో నిర్మొహమాటంగా తెలియజేశారని సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు విమర్శించాయి. కేవలం మూడు స్థానాల్లో గెలవడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురైన పరాభవాన్ని మించిన ఓటమిని బీజేపీ మూటగట్టుకుందన్నాయి. అప్పటి ఫలితంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా లభించలేదని, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలతో బీజేపీ కూడా ప్రతిపక్షహోదా కోల్పోయిందని చెప్పాయి. ఈ మేరకు సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ‘పీపుల్స్ డెమోక్రసీ’ అనే ఎడిటోరియల్ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎదురైన ఫలితంతో బీజేపీ నాయకులు మోదీని కాపాడేందుకు ఇది కేంద్ర పాలనపై రిఫరెండం కాదని చెబుతున్నారన్నారు. ఎవరు ఏం చెప్పినా ఈ ఎన్నికలు ఆర్ఎస్ఎస్, బీజేపీపై ప్రభావం చూపడం మాత్రం వాస్తవమన్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా నరేంద్రమోదీకి ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. ఈ ఎన్నికల విజయం చేకూర్చడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రజలు పెద్ద బాధ్యత మోపారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజల ఆశలను ఏవిధంగా ఆప్ ప్రభుత్వ నెరవేరుస్తుందనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు సీపీఐ... ‘న్యూ ఏజ్’ పత్రిక ఎడిటోరియల్‌లో బీజేపీపై విమర్శలు కురిపించింది. గత తొమ్మిది నెలల కాలంలో కార్పొరేట్, విదేశీ పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా బీజేపీ వ్యవహరించిందనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా ఇక్కడి ఓటర్లు తెలియజెప్పారంది. నల్లధనం, అవినీతి, ధరల పెరుగుదలను నియంత్రిస్తామని చేసిన హామీలను బీజేపీ విస్మరించిందని పేర్కొంది. -
సర్వ‘భక్షా’భియాన్
ఖమ్మం: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఏటా వందల కోట్ల రూపాయలు విడుదల చేసే సర్వశిక్ష అభియాన్ జిల్లాలో సర్వ భక్ష అభియాన్‌గా మారిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో విద్యావలంటీర్ల వేతనాలు, ఇతర ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ పేరిట భక్షణ జరిగినట్లు బయటపడింది. ఏకరూప దుస్తులు, కేజీబీవీలు, భవిత సెంటర్ల వస్తువులు, బోధనోపకరణాల కొనుగోళ్ళలోనూ రూ.లక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అధికారులను బదిలీ చేశారు. మరికొందరి నుంచి డబ్బులు రికవరీ చేశారు. అయినా ఆశాఖ అధికారుల్లో మార్పు రాలేదని తెలుస్తోంది. కస్తూరిబా గాంధీ, సివిల్ వర్క్స్‌లో మరోమారు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వస్తున్నాయి. వాహనాల వినియోగం, ఇతర వస్తువుల కొనుగోళ్లలో బిల్లులు తారుమారు చేశారని తెలుస్తోంది. కోట్ల రూపాయల లావాదేవీల పనులను ఔట్సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టడంపై జిల్లా ఉన్నతాధికారులు అభ్యంతరాలు చెప్పినా సదరు ఉద్యోగుల సెక్షన్లు మార్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. సంవత్సరాలు గడిచినా తేలని లెక్కలు.. నూతన భవనాల నిర్మాణం, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి మౌలిక సదుపాయాల కల్పన , పాఠశాలలో వివిధ కార్యక్రమాలు, సైన్స్ మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ సామగ్రి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తోంది. గత సంవత్సరం పాఠశాల గ్రాంట్స్, పాఠశాల నిర్వాహణ నిధులు, ఏకరూప దుస్తుల డబ్బులు, వాటి కుట్టుకూలి, ఉపాధ్యాయుడి గ్రాంట్స్, స్కూల్ కాంప్లెక్స్, సివిల్ వర్క్స్, ఎస్కాట్ అలవెన్స్, సీడబ్ల్యూ టాయిలెట్స్, వార్షికోత్సవ నిర్వాహణ నిధులు... సర్వశిక్ష అభియాన్ ద్వారా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అకౌంట్లలో జమచేశారు. గత సంవత్సరం ఖర్చు అయిన డబ్బులు పోగా మిగిలిన డబ్బుల లెక్కలు చెప్పేందుకు పలువురు ఉపాధ్యాయులకు తమ అకౌంట్లలో ఎన్ని డబ్బులు ఉన్నాయి. అవి ఏ గ్రాంట్స్‌కు సంబంధించినవి అనేది తెలియడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన నిధులలో ఖర్చుకాగా రూ. 10.63 కోట్లు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. వీటిలో రూ. 79,11,532కు లెక్క తేలక సదరు ఉపాధ్యాయులు తికమక పడుతున్నారు. సర్వశిక్ష అభియాన్ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం నుంచి విడుదలైన డబ్బులను పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 17 బ్యాంకుల్లో లావాదేవీలు నిర్వహిస్తూ వీటిని ఖర్చు చేస్తున్నారు. ఆయా బ్యాంకుల అధికారులతో ఎస్ఎస్ఏలో పనిచేసే ఉద్యోగులు కుమ్మక్కై వీటిని ఇష్టానుసారం డ్రా చేసే వారని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులనూ తప్పుతోవ పట్టించిన సందర్భాలు లేకపోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఇక్కడ పనిచేసిన పలువురు పీవోలు రూ.లక్షలు కాజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆయా అధికారులపై రాష్ట్ర స్థాయిలో విచారణ సైతం జరిగింది. అక్కడ తమకు ఉన్న పలుకు బడిని ఉపయోగించుకొని సదరు అధికారులు బయటపడ్డారనే ప్రచారం సైతం జరిగింది. దీనిని గమనించిన రాష్ట్ర అధికారులు ఎస్ఎస్ఏ లావాదేవీలు అన్ని ఎస్బీహెచ్ ( స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్) ద్వారా జరపాలని ఆదేశించారు. ఈ బ్యాంకుల మార్పిడిలో జిల్లాలో సుమారు 12 పాఠశాలలు ముందుకు రాకపోవడం, పలు పాఠశాల హెచ్ఎంలు బ్యాంకులు మార్చినా తమ ఖాతాలో ఉన్న డబ్బుల వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. సుమారు 100కు పైగా పాఠశాలల హెచ్ఎంలు ఆడిట్ చేయించుకునేందుకు ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పలువురు ఉద్యోగులు ఆడిందే ఆట విద్యాశాఖలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ ఉద్యోగుల పోస్టులు జిల్లాలో ఇతర ప్రాంతాల్లో లేకపోవడంతో ఒకటి, రెండు సంవత్సరాలు బయట విధులు నిర్వహించినా మళ్లీ వచ్చి ఇక్కడే తిష్టవేస్తున్నారు. డీఈవో, ఆర్వీఎంలలో పనిచేయటం పరిపాటిగా మారింది. ఒకే సెక్షన్లో ఏళ్ల తరబడి పనిచేస్తుండటంతో లావాదేవీలు, వసూళ్లలో ఆరితేరుతున్నారనే అభియోగం ఉంది. పాఠశాల మౌలిక వసతులు, భవనాలు, మానిటరింగ్‌తో పాటు విద్యాశాఖ అధికారికి కలిపి పది వాహనాలకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. ఈ వాహనాలను పలువురు ఉద్యోగులు తమ సొంతానికి వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో ఉండే ఓ అధికారి తమ కుటుంబ సభ్యుల పేరున కారు పెట్టి వందల కిలోమీటర్లు తిరిగినట్లు ప్రతి నెల బిల్లులు తీసుకోవడం గమనార్హం. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం బి. శ్రీనివాస్, ఎస్ఎస్ఏ పీవో కార్యాలయం ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే స్పష్టమైన ఫిర్యాదులు ఎవరూ చేయలేదు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. సంవత్సరాల తరబడి ఒకే సెక్షన్లో ఉద్యోగులు ఉన్నారనేది వాస్తవం. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారితో కూడా చర్చించాను. త్వరలో జిల్లా కలెక్టర్‌గారి అనుమతితో సెక్షన్లు మార్పు చేస్తాం. -
ఇద్దరు ‘చంద్రులదీ’ ఒకే దారి
వినాయక్‌నగర్ : రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర్‌రావులది ఒకేదారని, మాదిగలకు పట్టిన గ్రహాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్య వస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. శనివారం ఆయన నిజామాబాద్‌లో ని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మా ట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే దళి తుడి ముఖ్యమంత్రినే చేస్తానని పలుమార్లు చెప్పిన కేసీఆర్ దురహంకారంతో తానే ఆ కుర్చీలో కూర్చున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి పని చేసిన కొప్పుల ఈశ్వర్‌ను కొడుకు కోసం బలి చేశారన్నారు. కేసీఆర్ చేయించిన సర్వేలో నల్లాల ఓదెలు తెలంగాణలోనే ప్రథమస్థానంలో నిలిచినా మంత్రి పదవికి నోచుకోవడంలో చివరకు కూడా నిలవలేదన్నారు. పార్టీలు మారిన ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి నాలుగుసార్లు గెలిచిన నల్లాల ఓదెలును పక్కకు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ దళితులపై చూపుతున్న వివక్షకు ఇదే తార్కాణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన మహిళలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. అధికారంలోకి వచ్చిన రెండునెలలలో నిజాం చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుంటమన్న మాటలు మరుగున పడేసారన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా ఘం టా చక్రపాణి నియామకంతో మాదిగలకు అన్యా యం జరిగిందన్నారు. మాదిగల రుణం తీర్చుకుం టామన్న ఇద్దరు ముఖ్యమంత్రులు గట్టుకెక్కినాక తెప్పకాల బెట్టారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు మాదిగలె అండగా ఉన్నారన్నారు. చంద్రబాబు తెలంగాణలో పాద యాత్ర చేసేసమయంలో మాదిగలు ముందుండి జైలుకు వెళ్లడంతోపాటు, ఆదిలాబాద్ జిల్లా బైంసా నుంచి తిరుగు ప్రయాణంలో ముగ్గురు మాదిగలు మృతి చెందారని గుర్తు చేశారు. మహిళలను విస్మరించిన కేసీఆర్ కల్లు తెరిపించేవిధంగా మార్చి7వతేదీన మహిళలతో హైదరాబాద్‌లో మహాయాత్ర నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రెండుగా చీలి టీఎంఆర్పీఎస్గా కర్యక్రమాలు నిర్వహిస్తున్నారు, కలిసి పోరాడితే ఏదైనా తొందరగా సాధిం చవచ్చుకదా అని విలేకరులు ప్రశ్నించగా వారు ప్రభుత్వం ఏజేంట్లు,పాలకులకు అమ్ముడుపోయి,పాలేరుల పనిచేస్తున్నరని మందకృష్ణ విమర్శిం చారు. సమావేశంలో జిల్లాఅధ్యక్షులు గందమాల నాగభూషణం,మైలారం బాలు,కిష్టయ్య,గంగాధర్ తార, తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లెక్సీ.. పైత్యం
రౌతులపూడి : రాజకీయ పార్టీలు, వర్గాలకతీతంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన మండల పరిషత్ కార్యాలయంపై టీడీపీ ఫ్లెక్సీ ఉండడం పలు విమర్శలకు తావిస్తోంది. నూతన సంవత్సరం దినోత్సవం సందర్భంగా అధికార తెలుగు దేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, ఎంపీపీ ఇటంశెట్టి సూర్యభాస్కరరావు, టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని మండల పరిషత్ కార్యాలయంపై ఏర్పాటు చేశారు. దీంతో ఇది టీడీపీ కార్యాలయమా, ప్రభుత్వ కార్యాలయమా అని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆశ్చర్యపోయారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి చర్యలను ఖండించి ప్రభుత్వ కార్యాలయాలపై రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధించాలని పలువురు డిమాండ్ చేశారు. -
డీఎస్సీ పోస్టుల్లో కోత
సాక్షి, చిత్తూరు: ఊరించి, ఉడికించిన డీఎస్సీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైందనే సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండా పోయింది. సీఎం చంద్రబాబునాయుడు తన సహజసిద్ధ ధోరణిలోనే డీఎస్సీ పోస్టుల్లో కోత విధించారు. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలో పోస్టులు తగ్గిస్తూ డీఈవో తయారు చేసిన నివేదికను పంపించారు. ఆర్థికభారం సాకుగా చూపించి ఆ చర్యకు పాల్పడినట్లు అధికారుల నుంచి సమాధానం లభించింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన తరువాత పోస్టులు తగ్గించడం ఏమిటో అర్థంకాక విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించారు. ప్రభుత్వ ఆర్థిక స్థితి బాగాలేదని, ఒక్కసారిగా అంత భారం భరించే స్థితిలో లేనందున, ఆర్థికశాఖ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నతాధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. బుధవారం సాయంత్రంలోగా తగ్గంపు ప్రక్రియ ను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆయా జిల్లాల డీఈవోలు నోటిఫికేషన్లో చూపించిన ఉపాధ్యాయ పోస్టులను తగ్గించే కార్యక్రమాన్ని ఇప్పటికే ముగిం చినట్లు సమాచారం. ప్రతిజిల్లాలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా ప్రభుత్వం కేవలం వందల పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసింది. అసలే తక్కువ పోస్టులతో నోటిపికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం దరఖాస్తులకు కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్న సమయంలో మళ్లీ ఉన్న పోస్టులు తగ్గించే ప్రయత్నానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలతో పోలిస్తే చిత్తూరులోనే అత్యధికంగా 1,606 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. తరువాత అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమే వెయ్యి పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోనే వైఎస్సార్ కడప జిల్లాలో అతి తక్కువ పోస్టులు (356) మాత్రమే భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో చూపారు. ఆ తరువాత వరుసక్రమంలో విజయనగరం జిల్లాలో 362, కృష్ణాలో 379, నెల్లూరు 416, పశ్చిమ గోదావరి 601, శ్రీకాకుళం 719, కర్నూలు 731 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో చూపింది. అయితే 20 శాతం కుదించాలన్న తాజా ఆదేశాలతో ఈ పోస్టులు మరింతగా తగ్గనున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోనే మొత్తం 1,606కు గాను 320 పోస్టులు తగ్గనున్నాయి. ఈ లెక్కన తక్కువ పోస్టులు కేటాయించిన జిల్లాలో నామమాత్రంగా కూడా పోస్టులు మిగిలే పరిస్థితి లేదు. ఉదాహరణకు వైఎస్సార్ కడప, విజయనగరం, కృష్ణా, నెల్లూరు జిల్లాల పరిధిలో మొత్తం 400 లోపు మాత్రమే పోస్టులు చూపించారు. వీటిలో 20 శాతం తగ్గిస్తే 80 పోస్టులు తగ్గనున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో కొత్త జాబితాతో వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో ఆది నుంచి చంద్రబాబు ప్రభుత్వం దోబూచులాడింది. ఎన్నికల ప్రచారంలో డీఎస్సీపై ప్రకటన చేసి హామీలు ఇచ్చిన బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీని పక్కన బెట్టింది. డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఐదుమార్లు ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు, తాజాగా 19న మంత్రి ప్రకటన చేయగా 20న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీపై బీఈడీ చేసినవారు అర్హులు కాదనడం, టెట్, డీఎస్సీని అనుసంధానించడం, బీఈడీలను, డీఈడీలను విభజించడం తదితర నిర్ణయాలతో ప్రభుత్వం నిరుద్యోగులను గందరగోళానికి గురిచేసింది. తాజాగా దరఖాస్తులకు నాలుగు రోజులు మాత్రమే గడువున్న సమయంలో పోస్టులను కుదించి అర్హులకు ఉద్యోగావకాశాలను ఎండగడుతోంది. మరోవైపు ఒక్కో జిల్లాలో 20 నుంచి 40 వేలమంది వరకూ బీఈడీ, డీఈడీ అభ్యర్థులు ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా మొక్కుబడిగా డీఎస్సీ నిర్వహణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు డీఎస్సీని కూడా రుణమాఫీ మాదిరే మార్చారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
పొందూరారు!
* ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యునికి చాంబర్ * నిబంధనలను కాలరాసిన జెడ్పీ సీఈవో * పది రోజుల్లో నాలుగు లేఖలతో ఎంపీడీవోపై ఒత్తిడి * పోటీ అధికార కేంద్రం ఏర్పాటుకు కుయుక్తులు * వైఎస్సార్సీపీ ఎంపీపీపై కక్ష సాధింపునకేనన్న విమర్శలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా, నిబంధనలకు విరుద్ధంగా పొందూరు మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యుడికి ప్రత్యేకంగా చాంబర్ కేటాయించారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని పంచాయతీరాజ్ శాఖ 1995లోనే స్పష్టమైన ఆదేశాలిచ్చింది. మండల పరిషత్ అధికారిక కార్యకలాపాల్లో జెడ్పీటీసీలు జోక్యం చేసుకోరాదు. ఎంపీపీ, జెడ్పీటీసీ రెండూ వేర్వేరు రాజ్యాంగ విభాగాలు. వేటికవే అభివృద్ధి కాంక్షించే రాజ్యాంగ శక్తులుగా ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. పొందూరులో దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది. పంచాయతీరాజ్ చట్టాన్ని పరిరక్షించాల్సిన జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్, పొందూరు జెడ్పీటీసీ లోలుగు శ్రీరాములునాయుడుతో కుమ్మక్కై ఆయనకు అనుకూలంగా కేవలం పది రోజుల వ్యవధిలోనే నాలుగు ఉత్తర్వులు జారీ చేశారు. జెడ్పీటీసీకి చాంబర్ కేటాయించాలని పొందూరు ఎంపీడీవో ఎంవీబీ సుబ్రహ్మణ్యానికి లేఖ రూపంలో ఆదేశించారు. ఆయన దాన్ని అమలు చేశారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతులూ పొందలేదని ఎంపీపీ సువ్వారి దివ్య ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకోవాలని సీఈవోకు ఆయన సూచించారన్నారు. అయినా ఫలితం లేదన్నారు. గత సెప్టెంబర్‌లో ఇదే విషయమై అక్కడి నేతలు ప్రభుత్వానికి స్పష్టత కోరుతూ లేఖ రాశారు. ఇది జరిగి రెండు నెలలవుతున్నా అటు జెడ్పీ సీఈవో, ఇటు ఎంపీడీవో స్పందించకపోవడం, జెడ్పీటీసీ చాంబర్ ఖాళీ చేయకపోవడంతో వివాదం ముదురుతోంది. పది రోజుల్లో నాలుగు ఉత్తర్వులు జెడ్పీటీసీ సభ్యుడికి చాంబర్ కేటాయింపు వెనక పెద్ద తతంగమే నడిచిందని తెలుస్తోంది. పొందూరు ఎంపీపీగా వైఎస్సార్సీపీకి సువ్వారి దివ్య ఎన్నికయ్యారు. దీన్ని సహించలేని టీడీపీ నాయకులు ఆమె అధికార విధులకు, అభివృద్ది కార్యక్రమాలకు ఆటంకం కల్పించేలా కుయుక్తులు పన్నుతున్నారన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే జెడ్పీ సీఈవోపై ఒత్తిడి తెచ్చి కేవలం పది రోజుల్లో నాలుగు ఉత్తర్వులిచ్చేలా చేశారు. కలెక్టర్ అనుమతి లేకుండా, చైర్‌పర్సన్‌ను తప్పుదోవ పట్టిస్తూ మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీకి చాంబర్ కేటాయింపజేసి రెండో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఇందుకోసం ఆ గదిలో ఉన్న ఉపాధి హామీ పథకం రికార్డులన్నింటినీ అక్కడి ఐకేపీ కార్యాలయానికి తరలించారు. ఆ రికార్డులకేమైనా జరిగితే జవాబుదారీ ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యాలయంలో గది ఖాళీ ఉంటేనే జెడ్పీటీసీకి కేటాయించాలని ఉత్తర్వుల్లో సూచించినా అందుకు భిన్నంగా రికార్డులను తరలించి గది కేటాయించడం గమనార్హం. ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిని కూడా జెడ్పీటీసీ తన వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంపీడీవో కార్యాలయంలోనే ఉన్న ఈ గది బయట తెలుగుదేశం రంగులు, స్టిక్కర్లు, చంద్రబాబు పోస్టర్లతోపాటు జెడ్పీటీసీ నేమ్ బోర్డు ఏర్పాటు చేసినా ఎంపీడీవో మాత్రం తామెవ్వరికీ గది ఇవ్వలేదని, ప్రస్తుతం అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పడం విడ్డూరం. ఈ వివాదంపై జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాట్లోకి రాలేదు. -
ఆంధ్ర పాలకుల తొత్తు రేవంత్‌రెడ్డి
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కరుణం పురుషోత్తంరావు తాండూరు: బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను రాష్ట్ర టీఆర్ఎస్ కార్యదర్శి కరుణం పురుషోత్తంరావు, యాలాల ఎంపీపీ సాయిల్‌గౌడ్, తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, నాయకులు సురేందర్‌రెడ్డిలు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు పలకుండా ఆంధ్ర పాలకులకు తొత్తుగా వ్యవహారిస్తున్న రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో విద్యుత్ సమస్యకు టీడీపీ, కాంగ్రెస్ పాలకులే కారణమని విషయాన్ని రేవంత్‌రెడ్డి మరిచిపోయి కేసీఆర్‌పై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. రైతులకు రుణమాఫీ కింద 25శాతం బ్యాంకుల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఆంధ్రలో ఏపీ ప్రభుత్వం ఇంతవరకు రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. బంగారు తెలంగాణ కోసమే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. తాండూరులో చెక్‌డ్యాంతోపాటు వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ కోసం జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ఆంధ్రపార్టీ టీడీపీ పని అయిపోయిందని పేర్కొన్నారు. -
బస్తీమే సవాల్ ..?!
ఎర్రబెల్లి, కడియంల మధ్య ముదిరిన మాటల యుద్ధం హన్మకొండ: టీటీడీపీ కన్వీనర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్ఎస్ వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిల మధ్య మాటల యుద్ధం రోజుకో మలుపు తీసుకుంటుంది. పక్షం రోజుల కింద వరంగల్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోగా, నేడు విద్యుత్ సమస్యలపై చర్చకు సిద్ధమంటూ మరోసారి ఎదురెదురుగా నిలిచారు. అఖిలపక్షం పెట్టండి : ఎర్రబెల్లి బస్సుయాత్ర సందర్భంగా మీడియాతో ఎర్రబెల్లి మాట్లాడుతూ... విద్యుత్ సమస్యలకు చంద్రబాబు కారణమని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని, టీఆర్ఎస్ విమర్శలు నిజమని తేలితే తాము ముక్కు నేలకు రాస్తామని సవాల్ విసిరారు. రూ.250 కోట్ల ప్యాకేజీ చూపి ఎమ్మెల్యే ధర్మారెడ్డిని మీ పార్టీలోకి ఆహ్వానించారు, సిగ్గులేదా? అంటూ టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. చర్చకు సిద్ధం : కడియం దీనిపై ఎంపీ కడియం శ్రీహరి సాయంత్రం 5 గంటలకు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ సమస్యపై చర్చకు తాను సిద్ధమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టకపోతే ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డికి మంత్రులు కావాలనే కోరిక ఉందన్నారు. -
బాబు ప్రతిపక్ష నేత భ్రమలోనే ఉన్నారు!
పలమనేరు: చంద్రబాబునాయుడు తాను ఇంకా ప్రతిపక్షనేత అనే భ్రమలోనే ఉన్నట్టున్నారని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి విమర్శించారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకొచ్చినా ఆ పార్టీ నాయకులు మాత్రం వారి ఉనికిని కాపాడుకునే పనిలో ఉన్నారని తెలిపారు. పింఛన్ల కమిటీ విచారణ పూర్తిగా ఆ పార్టీ సమావేశాల్లా మారాయని ఎద్దేవా చేశారు. కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వని ఈ ప్రభుత్వం ఉన్న వాటిని ఊడగొట్టడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, త్వరలో ప్రజాగ్రహం తప్పదని జోస్యం చెప్పారు. రుణమాఫీ జరగక రైతులు పడుతున్న ఆవేదన ఈ ప్రభుత్వానికి శాపంలా మారకతప్పదన్నారు. చంద్రబాబు హామీతో 8 శాతం వడ్డీ 14 శాతంగా పెరిగి బంగారు నగలు వేలం వేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. మంచినీటి సమస్య పరిష్కారంలో భాగంగా జిల్లాలోని పడమటి మండలాల్లో ఒక్క బోరైనా డ్రిల్ చేశారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ గెలుపొందిన స్థానాలపై చిన్నచూపు చూస్తున్నారని, ‘మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక తెలుగుదేశం కార్యకర్తలకా’ అని ప్రశ్నించారు. చాలా మంది మంత్రులకు వారి శాఖల గురించి అవగాహన లేదని, వీరు ప్రజా సమస్యలను గాలికొదిలి లోకేష్‌బాబు జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామా అని ఇప్పటికే జనం భాధపడుతున్నారని, త్వరలోనే వీరికి తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ శారదా, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సీవీ.కుమార్ పాల్గొన్నారు.