న్యూఢిల్లీ: ‘కాళీ’ అనే డాక్యుమెంటరీ పోస్టర్ తీవ్ర వివాదానికి దారితీసింది. కెనడాలోని ఆగాఖాన్ మ్యూజియంలో ఈ పోస్టర్‌ను ప్రదర్శించారు. కాళీ మాత పాత్రధారి సిగరెట్ తాగుతూ, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్(ఎల్‌జీబీటీ)ని సూచించే ఏడు రంగుల జెండాను ప్రదర్శిస్తూ పోస్టర్‌లో కనిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంటరీ దర్శకురాలు లీనా మణిమేఖలై దీనిపై సోమవారం స్పందించారు.
‘‘నేను బతికున్నంతకాలం నిర్భయంగా గొంతు వినిపిస్తూనే ఉంటా. అందుకు నా జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా సిద్ధమే. డాక్యుమెంటరీ చూస్తే పోస్టర్ వెనుక ఉద్దేశం అర్థమవుతుంది’’ అన్నారు. తమిళనాడుకు చెందిన ఆమె టొరంటోలో ఉంటున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన మణిమేఖలైపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశామని ‘గో మహాసభ’ వెల్లడించింది. పోస్టర్‌పై కెనడాలోని హిందూ సమాజం నుంచి ఫిర్యాదులందాయని ఒట్టావాలోని ఇండియన్ హైకమిషన్ తెలియజేసింది. డాక్యుమెంటరీలో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే అంశాలుంటే తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment