Kaali
-
కాళికాదేవి ట్వీట్‌పై ఉక్రెయిన్ క్షమాపణలు
కీవ్: కాళికా దేవతను కించపరిచేలా చేసిన ట్వీట్‌పై ఉక్రెయిన్ భారత్‌కు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఆ దేశపు విదేశాంగ శాఖ ఉప మంత్రి ఎమిన్ జాపరోవా ట్విటర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. జరిగిందానికి ఎంతో చింతిస్తున్నాం. భారత దేశపు ప్రత్యేకమైన సంప్రదాయాన్ని మేం ఎప్పుడూ గౌరవిస్తాం. అలాగే భారత్ నుంచి మద్దతును ఎప్పడూ ఆశిస్తాం అని పేర్కొందామె. హిందూ దేవత కాళిని అవమానించేలా ఉన్న చిత్రాన్ని ఇప్పటికే తొలగించామని, ఇరు దేశాల స్నేహం మునుపటిలా.. మరింత బలంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. పేలుడు పొగలో కాళి దేవత చిత్రాన్ని అభ్యంతరంగా చిత్రీకరిస్తూ ఉక్రెయిన్ రక్షణ శాఖ ఓ ట్వీట్ చేసింది. హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో ‘ఫ్లైయింగ్ స్కర్ట్ ఫోజు’లో కాళికా దేవి తలను మార్ఫింగ్ చేసి.. స్కర్ట్ ప్లేసులో బాంబు నుంచి వెలువడే పొగతో ఎడిట్ చేసి మరీ ఓ ఫొటో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో హిందూ సమాజం భగ్గుమంది. యుద్ధంలో సాయం చేస్తుంటే.. ఇలాగేనా వ్యవహరించేందంటూ తిట్టిపోశారు నెటిజన్లు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కాంచన గుప్తా సైతం ఈ ట్వీట్‌పై మండిపడ్డారు. హిందువుల మనోభావాలపై జరుగుతున్న దాడి ఇదని పేర్కొన్నారామె. ఉక్రెయిన్ నుంచి క్షమాపణలు సైతం డిమాండ్ చేశారు. ఈ తరుణంలో తాజాగా ఉక్రెయిన్ క్షమాపణలు చెప్తూ.. ఆ ట్వీట్‌ను తొలగించింది. We regret @DefenceU depicting #Hindu goddess #Kali in distorted manner. #Ukraine &its people respect unique #Indian culture&highly appreciate🇮🇳support.The depiction has already been removed.🇺🇦is determined to further increase cooperation in spirit of mutual respect&💪friendship. — Emine Dzheppar (@EmineDzheppar) May 1, 2023 ఇదీ చదవండి: రండి బాబూ రండి.. తుపాకీ ఇవ్వండి, గిఫ్ట్ కార్డు తీసుకెళ్లండి -
బెంగాల్లోనే కాదు.. దేశం మొత్తం పూజిస్తుంది: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కాళీమాత వివాదం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీ ఆశీర్వాదాలు ఉంటాయని పేర్కొన్నారు. కాళీమాతను బెంగాల్లోనే కాదు దేశం మొత్తం పూజిస్తుందని పేర్కొన్నారు. స్వామి ఆత్మస్థానంద శతజయంతి వేడుకల సందర్భంగా మాట్లాడిన మోదీ.. రామకృష్ట పరమహంస కూడా కాళీమాతను ఆరాధించేవారని పేర్కొన్నారు. స్వామి వివేకానంద ఎంతో గొప్ప వ్యక్తి అయినా.. కాళీమాత పూజ విషయానికి వచ్చేసరికి చిన్న పిల్లాడిలా మారిపోయేవారని తెలిపారు. స్వామి ఆత్మస్థానంద కూడా కాళీమాతను పూజించేవారన్నారు. కాళీమాత తన దృష్టిలో మాంసం తిని మధ్యం తాగే దేవత అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ వివాదాస్పద సినిమా పోస్టర్‌పై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాళీమాతను అవమానించేలా మాట్లాడిన మహువాను టీఎంసీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఆమె మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. హిందూ ధర్మాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా? కాళీమాతను ఎలా పూజించాలో వాళ్లు చెప్పడమేంటి అని ప్రశ్నించారు. బెంగాల్లో సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో కాళీమాత అంశంపై మోదీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆయన సినిమా పోస్టర్‌పై గాని, టీఎంసీ ఎంపీ పేరును గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. చదవండి: కాళీమాత వివాదం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు -
‘కాళీ’ పోస్టర్ వివాదం.. డైరెక్టర్ పోస్ట్ డిలిట్ చేసిన ట్విటర్
దర్శకురాలు లీనా మణిమేగలై ఇటీవల విడుదల చేసిన కాళీ పోస్టర్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. కాళీ అనే పేరుతో ఆమె తీస్తున్న డ్యాక్యుమెంటరీకి సంబంధించిన ఈ పోస్టర్ జూలై 2న కెనడాలోని టోరంటోలో ఉన్న అగాయాన్ మ్యూజీయంలో రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఈ పోస్టర్ సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా దూమారం రేపుతోంది. దేవత మూర్తి కాళిక అమ్మావారి వస్త్రధారణలో ఉన్న ఈపోస్టర్లో సిగరేట్ తాగుతున్నట్లుగా ఉండటంతో పలు సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి: ఓటీటీకి సమ్మతమే మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. అంతేకాదు ఈ పోస్టర్ అమ్మవారిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ భారత్‌లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. డైరెక్టర్ లీనా చేసిన పోస్ట్ మత విశ్వాసాలను, హిందువుల మనోభవాలను దెబ్బతీసేల ఉందంటూ పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాదు కెనడాలోని భారత హైకమిషన్ కూడా దీనిపై వ్యతిరేకత తెలుపుతూ తీవ్రంగా పరిగణించింది. దీంతో స్పందించిన అగాఖాన్ మ్యూజియం కాళీ డాక్యూమెంటరీని తమ ప్రదర్శన నుంచి తొలగించింది. అంతేకాదు ట్విటర్ కూడా డైరెక్టర్ చేసిన పోస్ట్‌ను తొలిగించింది. చదవండి: అందుకే ఇంతకాలం నటనకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి ఇక దీనిపై డైరెక్టర్ లీనా స్పందిస్తూ అభ్యంతరక వ్యాఖ్యలతో మరో ట్వీట్ చేసింది. ఇప్పటికే తన పోస్టర్‌తో ఎంతోమంది ఆగ్రహనికి కారణమైన ఆమె తన తాజా ట్వీట్‌తో మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించింది. మరి దీనిపై ఆమె ఎలాంటి పరిణామాలు ఎదర్కొంటుంది చూడాలి. తమిళనాడులోని మధురైకి చెందిన లీనా మణిమేగలై.. రిథమ్స్ ఆఫ్ కెనడాలో భాగంగా కాళీ పేరుతో డాక్యుమెంటరీని చిత్రీకరించింది. ఇప్పుడు ఈ డాక్యెమెంటరీకి చెందిన పోస్టరే వివాదస్పదమైంది. -
Kaali Row: దుమారం రేపుతున్న లీనా ట్వీట్లు
కాళి డాక్యుమెంటరీ అభ్యంతరకర పోస్టర్‌తో వివాదం రాజేసిన లీనా మణిమేకలై.. మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఈసారి మరో చిత్రాన్ని పోస్ట్ చేసి.. ‘ఎక్కడో..’ అంటూ క్యాప్షన్ ఉంచిందామె. ఈసారి బీజేపీని టార్గెట్ చేసుకుని వరుస పోస్టులతో విరుచుకుపడుతోంది. జానపద థియేటర్ కళాకారులు తమ ప్రదర్శనల తర్వాత ఏం చేస్తారనేది BJP పేరోల్డ్ ట్రోల్ ఆర్మీకి తెలియదు. ఇది నా సినిమాలోనిది కాదు. రోజువారీ గ్రామీణ భారతదేశం నుండి ఈ సంఘ్ పరివార్లు తమ కనికరంలేని ద్వేషం, మత దురభిమానంతో నాశనం చేయాలనుకుంటున్నారు. హిందుత్వం ఎప్పటికీ భారతదేశంగా మారదు అంటూ మరింత ఘాటైన ట్వీట్ చేసింది లీనా మణిమేకలై. BJP payrolled troll army have no idea about how folk theatre artists chill post their performances.This is not from my film.This is from everyday rural India that these sangh parivars want to destroy with their relentless hate & religious bigotry. Hindutva can never become India. https://t.co/ZsYkDbfJhK — Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022 తమిళనాడులో పుట్టి, పెరిగిన కెనడా బేస్డ్ ఫిల్మ్ మేకర్ మణి మేకలై.. పలు షార్ట్‌ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కాళి పేరుతో ఆమె రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ అగ్గిని రాజేసింది. దేశం మొత్తం - ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్యం నుండి అతిపెద్ద విద్వేష యంత్రానికి దిగజారినట్లు అనిపిస్తుంది. నన్ను సెన్సార్ చేయాలనుకుంటున్నారు. ఈ సమయంలో నేను ఎక్కడా సురక్షితంగా లేను అంటూ మరో ట్వీట్ చేశారామె. కేరళ నుంచి ఆమెకు పెద్ద ఎత్తున్న మద్దతు లభిస్తోంది. “These trolls are after my artistic freedom. If I give away my freedom fearing this mindless rightwing mob mafia, I will give away everyone’s freedom. So I will keep it, come what may.” https://t.co/nD2TNxypOk — Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022 ఇదిలా ఉంటే.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ జులై 2వ తేదీన లీనా మణిమేకలై చేసిన ట్వీట్‌ను తొలగించేసింది. ఇంకోవైపు కెనడా మ్యూజియం ఆగాఖాన్.. కాళి పోస్టర్ వివాదంపై క్షమాపణలు తెలియజేసింది. “It feels like the whole nation – that has now deteriorated from the largest democracy to the largest hate machine – wants to censor me,” said Manimekalai. “I do not feel safe anywhere at this moment.” @guardiannews https://t.co/WsK2hWdW96 — Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022 లీనా మణిమేకలై వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. లీనాను చంపుతానని బెదిరించిన తమిళనాడుకు చెందిన శక్తి సేన హిందూ మక్కల్ ఐయ్యమ్ ప్రెసిడెంట్ సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ట్విటర్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న ట్వీట్ల విషయంలో దృష్టిసారించాలని, విషయాన్ని సీరియస్‌గా పరిగణించి తొలగించాలని ఆయన లేఖలో ప్రస్తావించనున్నారు. Delhi BJP leaders Harish Khurana, Rajan Tiwari & others lodged a complaint against filmmaker Leena Manimekalai, TMC MP Mahua Moitra and others under Section 295, 505 (2), 153B, 509, 120B IPC and Section 66 & 67 of IT Act for allegedly hurting religious sentiments pic.twitter.com/vGLPOGmdEk — ANI (@ANI) July 7, 2022 -
‘కాళీ’ పోస్టర్‌పై తీవ్ర వివాదం.. అమ్మవారి పాత్రధారి సిగరెట్ తాగుతూ...
న్యూఢిల్లీ: ‘కాళీ’ అనే డాక్యుమెంటరీ పోస్టర్ తీవ్ర వివాదానికి దారితీసింది. కెనడాలోని ఆగాఖాన్ మ్యూజియంలో ఈ పోస్టర్‌ను ప్రదర్శించారు. కాళీ మాత పాత్రధారి సిగరెట్ తాగుతూ, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్(ఎల్జీబీటీ)ని సూచించే ఏడు రంగుల జెండాను ప్రదర్శిస్తూ పోస్టర్లో కనిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంటరీ దర్శకురాలు లీనా మణిమేఖలై దీనిపై సోమవారం స్పందించారు. ‘‘నేను బతికున్నంతకాలం నిర్భయంగా గొంతు వినిపిస్తూనే ఉంటా. అందుకు నా జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా సిద్ధమే. డాక్యుమెంటరీ చూస్తే పోస్టర్ వెనుక ఉద్దేశం అర్థమవుతుంది’’ అన్నారు. తమిళనాడుకు చెందిన ఆమె టొరంటోలో ఉంటున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన మణిమేఖలైపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశామని ‘గో మహాసభ’ వెల్లడించింది. పోస్టర్‌పై కెనడాలోని హిందూ సమాజం నుంచి ఫిర్యాదులందాయని ఒట్టావాలోని ఇండియన్ హైకమిషన్ తెలియజేసింది. డాక్యుమెంటరీలో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే అంశాలుంటే తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. -
Kaali Poster: ఫిల్మ్‌మేకర్ లీనాపై ఫిర్యాదుల వెల్లువ
నూపుర్ శర్మ వ్యవహారం ఇంకా వార్తల్లోనే ఉన్న వేళ.. ఈసారి హిందువుల మనోభావాలు దెబ్బ తీసిందంటూ ఓ ఫిల్మ్‌మేకర్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ‘కాళి’ పేరుతో రిలీజ్ అయిన ఓ డాక్యుమెంటరీ పోస్టర్.. ఇప్పుడు పెనుదుమారంగా మారే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో పుట్టి.. టొరంటో(కెనడా)లో ఉంటున్న లీనా మణిమేకలై.. కాళి టైటిల్‌తో రెండు రోజుల కిందట ఓ పోస్టర్‌ను వదిలింది. పోస్టర్ మరీ అభ్యంతరకరంగా ఉండడంతో.. ఆమె క్షమాపణలు చెబుతూ, పోస్టర్‌ను తొలగించాలంటూ పలువురు హెచ్చరికలతో కూడిన డిమాండ్లు చేశారు. ఈ తరుణంలో.. క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చగొట్టేలా లీనా మణిమేకలై వ్యవహరించింది. ఈ ఉదయం ఆమె తమిళంలో చేసిన ఓ ట్వీట్.. విషయాన్ని మరింత హీటెక్కించింది. “எனக்கு இழப்பதற்கு ஒன்றுமில்லை. இருக்கும் வரை எதற்கும் அஞ்சாமல் நம்புவதைப் பேசும் குரலோடு இருந்துவிட விரும்புகிறேன். அதற்கு விலை என் உயிர் தான் என்றால் தரலாம்” https://t.co/fEU3sWY4HK — Leena Manimekalai (@LeenaManimekali) July 4, 2022 అరెస్ట్ లీనా మణిమేకలై హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో.. ముందు సినిమా చూడాలని, ఆపై అరెస్ట్ అంటూ డిమాండ్ చేసిన వాళ్లంతా లవ్యూ అంటారంటూ ట్వీట్లో ఆమె పేర్కొంది. అయితే ఆమె వివరణతో వివాదం మాత్రం చల్లారడం లేదు. నూపుర్ శర్మను తప్పుబట్టిన వాళ్లంతా ఇప్పుడు ఏమైపోయారని నిలదీస్తున్నారు పలువురు. ఢిల్లీకి చెందిన ఓ లాయర్ లీనా.. లీనాపై ఢిల్లీ సైబర్ సెల్ ఐఎఫ్ఎస్వోలో ఫిర్యాదు చేశారు. గౌ మహాసభ నిర్వాహకుడు అజయ్ గౌతమ్.. పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు హోం సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ డాక్యుమెంటరీని ఆపించాలంటూ కోరుతున్నారాయన. మరికొన్ని చోట్ల సైతం లీనాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. Super thrilled to share the launch of my recent film - today at @AgaKhanMuseum as part of its “Rhythms of Canada” Link: https://t.co/RAQimMt7Ln I made this performance doc as a cohort of https://t.co/D5ywx1Y7Wu@YorkuAMPD @TorontoMet @YorkUFGS Feeling pumped with my CREW❤️ pic.twitter.com/L8LDDnctC9 — Leena Manimekalai (@LeenaManimekali) July 2, 2022 ‘‘పోగొట్టుకోవడానికి నా దగ్గరంటూ ఏమీ లేదు. ప్రాణం ఉన్నంత వరకు.. దేనికీ భయపడకుండా మాట్లాడతాను. ఒకవేళ నా ప్రాణమే వెల కడితే.. ఇచ్చేస్తాను’ అంటూ మరో ప్రకటన చేసింది ఆమె. టొరంటో ఆగాఖాన్ మ్యూజియమ్ వద్ద రిథమ్స్ ఆఫ్ కెనడా సెగ్మెంట్లో భాగంగా ఈ డాక్యుమెంటరీని తీసినట్లు ఆమె చెప్తున్నారు. ఒకవైపు లీనా.. మరోవైపు విమర్శకులు ఎంతకూ తగ్గకపోవడంతో ఈ వివాదం ఎంత ముదురుతుందో చూడాలి!. -
విజయ్‌ఆంటోనికి జతగా సునైనా
తమిళసినిమా: నటి సునైనాకో అవకాశం వచ్చింది. కోలీవుడ్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి ఎందుకనో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకోలేకపోతోంది. నీర్‌పార్వై వంటి కొన్ని చిత్రాల్లో సునైనా నటన విమర్శకులను సైతం మెప్పిం చింది. ఈ మధ్య తొండన్ చిత్రంతోనూ విజయాన్ని అందుకున్న సునైనా తాజాగా విజయ్‌ఆంటోనితో జతకట్టడానికి రెడీ అవుతోంది.యమన్ చిత్రం తరువాత విజయ్‌ఆంటోని అన్నాదురై అనే ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనివాసన్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్న ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుపుకుంటోంది. ఆయన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కాళీ అనే టైటిల్‌ను నిర్ణయించారు.ఇందులో ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట.అందులో ఒకరుగా సునైనా ఎంపికయ్యారట. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు.కాళీ చిత్రంలో తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని సునైనా తెలిపారు. త్వరలోనే కాళీ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందట. దీని విజయ్‌ఆంటోని సొంత నిర్మాణ సంస్థ« విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ నిర్మించనుంది. -
`కాళి`మూవీ స్టిల్స్