విజయ్‌ఆంటోనికి జతగా సునైనా | Vijay Antony new movie kalee in 3 heroins | Sakshi
Sakshi News home page

విజయ్‌ఆంటోనికి జతగా సునైనా

Published Mon, Jul 24 2017 2:54 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

విజయ్‌ఆంటోనికి జతగా సునైనా

విజయ్‌ఆంటోనికి జతగా సునైనా

తమిళసినిమా: నటి సునైనాకో అవకాశం వచ్చింది. కోలీవుడ్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి ఎందుకనో స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకోలేకపోతోంది. నీర్‌పార్వై వంటి కొన్ని చిత్రాల్లో సునైనా నటన విమర్శకులను సైతం మెప్పిం చింది. ఈ మధ్య తొండన్‌ చిత్రంతోనూ విజయాన్ని అందుకున్న సునైనా తాజాగా విజయ్‌ఆంటోనితో జతకట్టడానికి రెడీ అవుతోంది.యమన్‌ చిత్రం తరువాత విజయ్‌ఆంటోని అన్నాదురై అనే ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రంలో నటిస్తున్నారు.

శ్రీనివాసన్‌ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్న ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుపుకుంటోంది. ఆయన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కాళీ అనే టైటిల్‌ను నిర్ణయించారు.ఇందులో ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట.అందులో ఒకరుగా సునైనా ఎంపికయ్యారట. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.కాళీ చిత్రంలో తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని సునైనా తెలిపారు. త్వరలోనే కాళీ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందట. దీని  విజయ్‌ఆంటోని సొంత నిర్మాణ సంస్థ« విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ నిర్మించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement