కాళి డాక్యుమెంటరీ అభ్యంతరకర పోస్టర్‌తో వివాదం రాజేసిన లీనా మణిమేకలై.. మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఈసారి మరో చిత్రాన్ని పోస్ట్ చేసి.. ‘ఎక్కడో..’ అంటూ క్యాప్షన్ ఉంచిందామె. ఈసారి బీజేపీని టార్గెట్ చేసుకుని వరుస పోస్టులతో విరుచుకుపడుతోంది.
జానపద థియేటర్ కళాకారులు తమ ప్రదర్శనల తర్వాత ఏం చేస్తారనేది BJP పేరోల్డ్ ట్రోల్ ఆర్మీకి తెలియదు. ఇది నా సినిమాలోనిది కాదు. రోజువారీ గ్రామీణ భారతదేశం నుండి ఈ సంఘ్ పరివార్లు తమ కనికరంలేని ద్వేషం, మత దురభిమానంతో నాశనం చేయాలనుకుంటున్నారు. హిందుత్వం ఎప్పటికీ భారతదేశంగా మారదు అంటూ మరింత ఘాటైన ట్వీట్ చేసింది లీనా మణిమేకలై.
BJP payrolled troll army have no idea about how folk theatre artists chill post their performances.This is not from my film.This is from everyday rural India that these sangh parivars want to destroy with their relentless hate & religious bigotry. Hindutva can never become India. https://t.co/ZsYkDbfJhK
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022
తమిళనాడులో పుట్టి, పెరిగిన కెనడా బేస్డ్ ఫిల్మ్ మేకర్ మణి మేకలై.. పలు షార్ట్‌ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కాళి పేరుతో ఆమె రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ అగ్గిని రాజేసింది.
దేశం మొత్తం - ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్యం నుండి అతిపెద్ద విద్వేష యంత్రానికి దిగజారినట్లు అనిపిస్తుంది. నన్ను సెన్సార్ చేయాలనుకుంటున్నారు. ఈ సమయంలో నేను ఎక్కడా సురక్షితంగా లేను అంటూ మరో ట్వీట్ చేశారామె. కేరళ నుంచి ఆమెకు పెద్ద ఎత్తున్న మద్దతు లభిస్తోంది.
“These trolls are after my artistic freedom. If I give away my freedom fearing this mindless rightwing mob mafia, I will give away everyone’s freedom. So I will keep it, come what may.” https://t.co/nD2TNxypOk
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022
ఇదిలా ఉంటే.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ జులై 2వ తేదీన లీనా మణిమేకలై చేసిన ట్వీట్‌ను తొలగించేసింది. ఇంకోవైపు కెనడా మ్యూజియం ఆగాఖాన్.. కాళి పోస్టర్ వివాదంపై క్షమాపణలు తెలియజేసింది.
“It feels like the whole nation – that has now deteriorated from the largest democracy to the largest hate machine – wants to censor me,” said Manimekalai. “I do not feel safe anywhere at this moment.”
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022
@guardiannews https://t.co/WsK2hWdW96
లీనా మణిమేకలై వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. లీనాను చంపుతానని బెదిరించిన తమిళనాడుకు చెందిన శక్తి సేన హిందూ మక్కల్ ఐయ్యమ్ ప్రెసిడెంట్ సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ట్విటర్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న ట్వీట్ల విషయంలో దృష్టిసారించాలని, విషయాన్ని సీరియస్‌గా పరిగణించి తొలగించాలని ఆయన లేఖలో ప్రస్తావించనున్నారు.
Delhi BJP leaders Harish Khurana, Rajan Tiwari & others lodged a complaint against filmmaker Leena Manimekalai, TMC MP Mahua Moitra and others under Section 295, 505 (2), 153B, 509, 120B IPC and Section 66 & 67 of IT Act for allegedly hurting religious sentiments pic.twitter.com/vGLPOGmdEk
— ANI (@ANI) July 7, 2022
Comments
Please login to add a commentAdd a comment