
పట్నా: రాబోయే అక్టోబర్-నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. తాజాగా వివిధ రాజకీయ పార్టీలు ఇఫ్తార్ విందులు నిర్వహించాయి. ఈ విందులలోనూ రాజకీయాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా బీహార్‌లో పోస్టర్ వార్ జరుగుతోంది. పోస్టర్ల రూపంలో అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ మహిళా నేత రబ్రీ దేవి(Rabri Devi) నివాసం వెలుపల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుంటూ పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్‌లో ‘నువ్వు మోసగాడివి, హామీ ఇచ్చిన తరువాత ఎన్‌ఆర్‌సీ అన్నావు. మేము నీకు మద్దతు ఇవ్వబోము’ అని రాసి ఉంది. తాము నితీష్‌కు మద్దతు ఇవ్వబోమని వక్ఫ్ ఈ పోస్టర్‌లో స్పష్టం చేసింది. దీనికి ముందు కూడా పలు పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఇటీవల లాలూ యాదవ్ నివాసం వెలుపల ఒక పోస్టర్ కనిపించింది. ఆ పోస్టర్‌లో ‘నేను తగ్గేదే లే.. టైగర్ ఇంకా బతికే ఉంది’ అని రాసి ఉంది. ఈ పోస్టర్‌ను ‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో లాలూ యాదవ్,మీసా భారతికి ఈడీ నోటీసులు పంపినప్పుడు ఏర్పాటు చేశారు. నాడు ఈడీ విచారణకు లాలూ యాదవ్ తన కుమార్తె మిసా భారతితో కలిసి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దీనిపై లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ స్పందిస్తూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారి యంత్రాంగాన్ని తమపై ప్రయోగిస్తోందని ఆరోపించారు.
#WATCH | Patna, Bihar: Posters targeting Chief Minister Nitish Kumar on Waqf and NRC installed outside the residence of former CM and RJD leader Rabri Devi pic.twitter.com/rOZT9HQFLe
— ANI (@ANI) March 25, 2025
లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) 2004 నుండి 2009 వరకు యూపీఏ- 1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ కాలంలో రైల్వేలలో గ్రూప్ డీ నియామకాలు జరిగాయి. ఈ నియామకంలో లాలూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. లాలూ యాదవ్ ఉద్యోగాలు కల్పించినందుకు ప్రతిగా భూమిని లంచంగా తీసుకున్నారనే వాదన వినిపించింది. ఈడీ ఛార్జిషీట్ ప్రకారం లాలూ కుటుంబానికి ఏడు చోట్ల భూమి ఉంది. ఇండియా టీవీ కథనం ప్రకారం వీరి కుటుంబంపై రూ.600 కోట్ల మేరకు మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ సందర్భంగా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని తేలింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన కుటుంబంలోని ఇతర సభ్యులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రకటన జారీ చేయకుండానే, రైల్వేలలో గ్రూప్ డి ఉద్యోగాలలో పలువురిని నియమించారనే ఆరోపణలున్నాయి.
ఇది కూడా చదవండి: నాడు శివసేన-బీజేపీకి అందుకే చెడింది: ఫడ్నవీస్
Comments
Please login to add a commentAdd a comment