Ukraine Apologises After Backlash Over Goddess Kali Tweet, Details Inside - Sakshi
Sakshi News home page

మార్లిన్‌ మన్రో ఫోజుతో కాళికాదేవి చిత్రం.. భారత్‌కు ఉక్రెయిన్‌ క్షమాపణలు

Published Tue, May 2 2023 12:33 PM | Last Updated on Tue, May 2 2023 1:15 PM

Ukraine Apologises After Backlash Over Goddess Kali - Sakshi

కీవ్‌: కాళికా దేవతను కించపరిచేలా చేసిన ట్వీట్‌పై ఉక్రెయిన్‌ భారత్‌కు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఆ దేశపు విదేశాంగ శాఖ ఉప మంత్రి ఎమిన్ జాపరోవా ట్విటర్‌ ద్వారా విషయాన్ని తెలియజేశారు. జరిగిందానికి ఎంతో చింతిస్తున్నాం. భారత దేశపు ప్రత్యేకమైన సంప్రదాయాన్ని మేం ఎప్పుడూ గౌరవిస్తాం. అలాగే భారత్‌ నుంచి మద్దతును ఎప్పడూ ఆశిస్తాం అని పేర్కొందామె.

హిందూ దేవత కాళిని అవమానించేలా ఉన్న చిత్రాన్ని ఇప్పటికే తొలగించామని, ఇరు దేశాల స్నేహం మునుపటిలా.. మరింత బలంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్వీట్‌ చేశారు. 

పేలుడు పొగలో కాళి దేవత చిత్రాన్ని అభ్యంతరంగా చిత్రీకరిస్తూ ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ఓ ట్వీట్‌ చేసింది. హాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ మార్లిన్‌ మన్రో ‘ఫ్లైయింగ్‌ స్కర్ట్‌ ఫోజు’లో కాళికా దేవి తలను మార్ఫింగ్‌ చేసి.. స్కర్ట్‌ ప్లేసులో బాంబు నుంచి వెలువడే పొగతో ఎడిట్‌ చేసి మరీ ఓ ఫొటో పోస్ట్‌ చేసింది. దీంతో సోషల్‌ మీడియాలో హిందూ సమాజం భగ్గుమంది. యుద్ధంలో సాయం చేస్తుంటే.. ఇలాగేనా వ్యవహరించేందంటూ తిట్టిపోశారు నెటిజన్లు. 

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్‌ సలహాదారు కాంచన గుప్తా సైతం ఈ ట్వీట్‌పై మండిపడ్డారు. హిందువుల మనోభావాలపై జరుగుతున్న దాడి ఇదని పేర్కొన్నారామె. ఉక్రెయిన్‌ నుంచి క్షమాపణలు సైతం డిమాండ్‌ చేశారు. ఈ తరుణంలో తాజాగా ఉక్రెయిన్‌ క్షమాపణలు చెప్తూ.. ఆ ట్వీట్‌ను తొలగించింది. 

ఇదీ చదవండి: రండి బాబూ రండి.. తుపాకీ ఇవ్వండి, గిఫ్ట్‌ కార్డు తీసుకెళ్లండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement