ఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తగ్గించటంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ అన్నారు. ‘దీ ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్’లో పాల్గొన్న డేవిడ్ కామెరాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వ్యవహరించే సత్తా భారతదేశానికి ఉందని అభిప్రాయపడ్డారు.
‘‘రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తోంది. కాల్పుల విరమణ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. భారతదేశం మధ్యవర్తిత్వం వహించే స్థితిలో ఉంది. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బలవంతంగా భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలి’’అని అన్నారు.
అదేవిధంగా ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్ల విషయంలో ప్రస్తుతం భారత్ దృక్పథం చాలా అవసరమని అన్నారు. ‘‘ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం లభించాలి. ప్రపంచానికి బలమైన ఆర్థిక వృద్ధి, ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి భారత్ దృక్పథం అవసరం. ఈ అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొవటంలో భారతదేశం ఒక ప్రపంచ దేశాలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
ఈ శతాబ్దంలో ఏదో ఒక దశలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే భారతదేశపు ఎదుగుదలను కనబరుస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత స్థానం ఉండాలని 2015 ప్రకటన చేశాను. యూఎన్‌ఏలో సభ్యత్వం పొందటం.. భారతదేశం హక్కు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment