permanent seat
-
‘భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం భారత్ హక్కు’
ఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తగ్గించటంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ అన్నారు. ‘దీ ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్’లో పాల్గొన్న డేవిడ్ కామెరాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వ్యవహరించే సత్తా భారతదేశానికి ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తోంది. కాల్పుల విరమణ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. భారతదేశం మధ్యవర్తిత్వం వహించే స్థితిలో ఉంది. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బలవంతంగా భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలి’’అని అన్నారు.అదేవిధంగా ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్ల విషయంలో ప్రస్తుతం భారత్ దృక్పథం చాలా అవసరమని అన్నారు. ‘‘ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం లభించాలి. ప్రపంచానికి బలమైన ఆర్థిక వృద్ధి, ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి భారత్ దృక్పథం అవసరం. ఈ అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొవటంలో భారతదేశం ఒక ప్రపంచ దేశాలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ శతాబ్దంలో ఏదో ఒక దశలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే భారతదేశపు ఎదుగుదలను కనబరుస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత స్థానం ఉండాలని 2015 ప్రకటన చేశాను. యూఎన్‌ఏలో సభ్యత్వం పొందటం.. భారతదేశం హక్కు’ అని అన్నారు. -
ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk).. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితమంటూ ఐక్యరాజ్య సమితి పనితీరుపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మారిన పరిస్థితులు, కాలానికి అనుగుణంగా ఆయా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని మస్క్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఇండియాకు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది, శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా అడ్డుపడుతోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా, చైనా, ఫ్రాన్స్, యూకే, రష్యా దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కలిగి ఉండటం వల్ల ఈ దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ కూడా ఉంది. దీంతో ఐక్య రాజ్య సమితి మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఏ ఒక్క దేశం అభ్యంతరం చెప్పినా ఈ నిర్ణయం అక్కడిదీ ఆగిపోతుంది. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు భద్రతా మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి ఏ ఒక్క దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడం దురదృష్టకరమని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ 'ఆంటోనియో గుటెరస్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఇజ్రాయెల్ వెంచర్ క్యాపిటలిస్ట్ 'మైఖెల్ ఐసెన్ బర్గ్'.. మరి ఇండియా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అంతే కాకూండా.. ఐక్యరాజ్య సమితి కొత్త మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మారిన కాలానికి అనుగునంగా మార్పు అవసరమని స్పష్టం చేశారు. At some point, there needs to be a revision of the UN bodies. Problem is that those with excess power don’t want to give it up. India not having a permanent seat on the Security Council, despite being the most populous country on Earth, is absurd. Africa collectively should… — Elon Musk (@elonmusk) January 21, 2024 -
‘శాశ్వతానికి’ పెరుగుతున్న మద్దతు
భారత్‌కు భద్రతా మండలి సభ్యత్వంపై బ్రిటన్, ఫ్రాన్స్ అండ న్యూయార్క్: ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న అంశానికి మద్దతు పెరుగుతోంది. కొత్త ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తున్న భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ వంటి దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మండలిలో చాలా సభ్య దేశాలు కోరుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, సమతుల్యతకు శాశ్వత సభ్యులతో పాటు తాత్కాలిక సభ్యుల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రతినిధి రిక్రాఫ్ట్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా మండలిలో సంస్కరణలు తేవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తమ దేశం మద్దతు భారత్‌కు ఎప్పడూ ఉంటుందని ఇటీవల జరిగిన మండలి భేటీలో అన్నారు. భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ లతో పాటు ఆఫ్రికా దేశాలకు కూడా శాశ్వత సభ్యత్వానికి తామూ మద్దతునిస్తామని ఫ్రాన్స్ ప్రతినిధి అలెక్సిస్ నామెక్ తెలిపారు.