‘శాశ్వతానికి’ పెరుగుతున్న మద్దతు | UK, France back UNSC permanent seat for India | Sakshi
Sakshi News home page

‘శాశ్వతానికి’ పెరుగుతున్న మద్దతు

Nov 14 2016 10:23 AM | Updated on Sep 4 2017 8:05 PM

ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న అంశానికి మద్దతు పెరుగుతోంది.

భారత్‌కు భద్రతా మండలి సభ్యత్వంపై బ్రిటన్‌, ఫ్రాన్స్‌ అండ

న్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న అంశానికి మద్దతు పెరుగుతోంది. కొత్త ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తున్న భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్‌ వంటి దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మండలిలో చాలా సభ్య దేశాలు కోరుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, సమతుల్యతకు శాశ్వత సభ్యులతో పాటు తాత్కాలిక సభ్యుల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌ ప్రతినిధి రిక్రాఫ్ట్‌ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా మండలిలో సంస్కరణలు తేవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తమ దేశం మద్దతు భారత్‌కు ఎప్పడూ ఉంటుందని ఇటీవల జరిగిన మండలి భేటీలో అన్నారు.  భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్‌ లతో పాటు ఆఫ్రికా దేశాలకు కూడా శాశ్వత సభ్యత్వానికి తామూ మద్దతునిస్తామని ఫ్రాన్స్‌ ప్రతినిధి అలెక్సిస్‌ నామెక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement