న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. భారత్‌కు మద్దతుగా ఉన్నట్టు పలు దేశాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ మద్దతు ఇవ్వగా.. తాజాగా ఈ జాబితాలో యూకే కూడా చేరింది.
న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ సాధారణ చర్చను ఉద్దేశించి యూకే ప్రధాని కైర్ స్టార్మర్ మాట్లాడుతూ..యూఎన్‌సీసీ మరింత ప్రాతినిధ్య సంస్థగా మారాలి. ఇందులో భాగంగానే యూకే పలు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుకుంటోంది. బ్రెజిల్, భారత్, జపాన్, జర్మనీలు శాశ్వత సభ్య దేశాలుగా ఉండాలనుకుంటున్నాం. అలాగే, ఆఫ్రికన్ దేశాల ప్రాతినిధ్యం కూడా చూడాలనుకుంటున్నాం’ అని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
అంతకుముందు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిందేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్ స్పష్టం చేశారు. బుధవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భద్రతా మండలిని విస్తరించి, బలోపేతం చేద్దాం. ఇందుకు ఫ్రాన్స్ అనుకూలంగా ఉంది. ఆఫ్రికాలోని రెండు దేశాలతో పాటు జర్మనీ, జపాన్, ఇండియా, బ్రెజిల్ కు చోటు ఇవ్వాలి. ఆ రెండు దేశాలు ఏవన్నది నిర్ణయించుకునే అధికారం ఆఫ్రికాకే ఇవ్వాలి’ అని కామెంట్స్ చేశారు.
ఇక, గత వారంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్.. భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన మూడు దేశాల నుంచి భారత్ మద్దతు దక్కించుకుంది.
ప్రస్తుతం, యూఎస్‌సీపీలో ఐదు శాశ్వత సభ్యులు, పది తాతాల్కిక సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతాయి. రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఐదు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటికి ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేసే అధికారం ఉంది.
ఇది కూడా చదవండి: అమెరికాలో గన్ కల్చర్‌పై బైడెన్ కొత్త చట్టం
Comments
Please login to add a commentAdd a comment