వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని వారాల్లో తన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో అమెరికాలో గన్ కల్చర్ తగ్గించేందుకు ప్లాన్ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో తుపాకీ హింసకు అంతం పలకాలనే ఉద్దేశంతో బైడెన్ కొత్త చట్టంపై సంతకాలు చేశారు.
తాజాగా బైడెన్ ట్విట్టర్ వేదికగా..‘అమెరికాలో గన్ కల్చర్ కారణంగా చాలా మంది పిల్లులు చనిపోతున్నారు. వ్యాధులు, ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్న చిన్నారుల కంటే.. తుపాకీల కారణంగా మరణించిన వారి సంఖ్యే ఎక్కవగా ఉంది. ఇది చాలా బాధాకరమైనది. ఈ హింసను అంతం చేయడానికి నేను, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కృషి చేస్తున్నాం. మీరు మాతో చేతులు కలపండి తుపాకీ హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తాను సంతకాలు చేస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.
ఆర్డర్ ప్రకారం, మొదటి భాగం మెషిన్ గన్ మార్పిడి పరికరాలతో సహా ఉత్పన్నమయ్యే తుపాకీ బెదిరింపులుపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఇది హ్యాండ్ హెల్డ్ గన్ లేదా పిస్టల్‌ను ఆటోమేటిక్ తుపాకీ లేదా ఆయుధంగా మారుస్తుంది. ఇటువంటి పరికరాలు ఇప్పటికే చట్టవిరుద్ధం, అయితే చట్ట అమలు సంస్థలు అటువంటి పరికరాలను విచక్షణారహితంగా ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది. కొత్త చట్టం దాని లభ్యతపై అణిచివేతను నిర్ధారిస్తుంది.
అగ్రరాజ్యంలో తుపాకీదే హవా..
అమెరికాలో తీవ్రమైన తుపాకీ హింస ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో కాల్పుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. గత రెండు దశాబ్దాలలో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో వందలాది కాల్పులు జరిగాయి. ఈ హింసలు యూఎస్ తుపాకీ చట్టాలు, రాజ్యాంగం రెండవ సవరణపై తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చట్టం ప్రకారం.. ఆయుధాలను కలిగి ఉండే హక్కు ఉంది.
విద్యాసంస్థల్లో కాల్పుల కారణంగా 2020లో 4,368 మంది పిల్లలు తుపాకీ కారణంగా మృతి చెందారు. ఇక, 2019లో ఆ సంఖ్య 3,390గా ఉండగా.. 2021లో 4,752కు చేరింది. ఇక, 2007లో వర్జీనియా టెక్‌లో కాల్పుల కారణంగా 30 మందికిపైగా మరణించిన అత్యంత ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. పిల్లల గన్ వాడకంపై పేరెంట్స్ కూడా దృష్టిసారించాలని అన్నారు.
Today, I'll sign an Executive Order to crack down on emerging firearm threats like unserialized, 3D-printed guns and machine gun conversion devices.
It'll also direct my Cabinet to help improve school-based active shooter drills.
It's our job to do better.— President Biden (@POTUS) September 26, 2024
ఇది కూడా చదవండి: పాలస్తీనా మా సొంతం
Comments
Please login to add a commentAdd a comment