న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భారత్‌తో పాటు జర్మనీ, జపాన్‌లను కూడా సభ్యదేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు బైడెన్ సానుకూలంగా ఉన్నారంటూ వైట్‌హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు బైడెన్ సైతం ఈ విషయంపై పరోక్షంగా ప్రకటన చేశారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణ నేపథ్యంలో.. జర్మనీ, జపాన్, భారత్‌లను శాశ్వత సభ్య దేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారని, అదే సమయంలో.. ఇందుకోసం చాలా ప్రక్రియలు జరగాల్సి ఉంటుందని వైట్‌హౌజ్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా మండలిలో ఈ మూడు దేశాలు శాశ్వత సభ్యులుగా ఉండాలనే ఆలోచనకు చారిత్రాత్మకంగా, మా మద్దతు ఉంటుంది అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆ అధికారి స్పందించారు.
ఇక బుధవారం UN జనరల్ వద్ద జో బైడెన్ ప్రసంగించారు. ‘‘నేటి ప్రపంచ అవసరాలకు మెరుగ్గా ప్రతిస్పందించేలా సంస్థ మరింత సమగ్రంగా మారాల్సిన సమయం ఆసన్నమైందని తాను నమ్ముతున్నానని ఈ సందర్భంగా బైడెన్ అన్నారు. యునైటెడ్ స్టేట్స్‌తో సహా UN భద్రతా మండలి సభ్యులు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను నిలకడగా సమర్థించాలి. కౌన్సిల్ విశ్వసనీయంగా, ప్రభావవంతంగా ఉండేలా చూసేందుకు అరుదైన, అసాధారణమైన పరిస్థితులలో మినహా వీటోను ఉపయోగించకుండా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే కౌన్సిల్ శాశ్వత మరియు శాశ్వత ప్రతినిధుల సంఖ్యను పెంచడానికి యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఇస్తుందని ఆయన వెల్లడించారు. మేము చాలా కాలంగా మద్దతు ఇస్తున్న దేశాలకు శాశ్వత స్థానాలు ఇందులో ఉన్నాయి అని బైడెన్ స్పష్టం చేశారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 దేశాలు సభ్యులుగా ఉండగా, శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా ఫెడరేషన్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికాలు మాత్రమే శాశ్వత సభ్యదేశాలుగా ఉండి వీటో పవర్‌ను కలిగి ఉన్నాయి.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ
Comments
Please login to add a commentAdd a comment