unsc
-
భద్రతా మండలికి పాక్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలోని ప్రధానమైన భద్రతా మండలికి శాశ్వతేతర సభ్య దేశాల కోటాలో 5 దేశాలు ఎన్నికయ్యాయి. అవి..పాకిస్తాన్, పనామా, సొమాలియా, డెన్మార్క్, గ్రీస్. ఐరాస జనరల్ అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ విధానంలో గురువారం జరిగిన ఎన్నికలో ఆఫ్రికా, ఆసి యా–పసిఫిక్ ప్రాంతాలకుగాను సొమా లియా, పాకిస్తాన్‌లు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాలకుగాను పనామా, పశ్చిమ యూరప్, ఇతర దేశాలకుగాను డెన్మార్క్, గ్రీస్‌లు అత్యధిక ఓట్లు సంపాదించాయి. 2025 జనవరి నుంచి రెండేళ్ల పాటు 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు ఇవి శాశ్వతేతర సభ్య హోదాలో కొనసాగుతాయి. -
ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk).. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితమంటూ ఐక్యరాజ్య సమితి పనితీరుపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మారిన పరిస్థితులు, కాలానికి అనుగుణంగా ఆయా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని మస్క్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఇండియాకు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది, శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా అడ్డుపడుతోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా, చైనా, ఫ్రాన్స్, యూకే, రష్యా దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కలిగి ఉండటం వల్ల ఈ దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ కూడా ఉంది. దీంతో ఐక్య రాజ్య సమితి మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఏ ఒక్క దేశం అభ్యంతరం చెప్పినా ఈ నిర్ణయం అక్కడిదీ ఆగిపోతుంది. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు భద్రతా మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి ఏ ఒక్క దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడం దురదృష్టకరమని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ 'ఆంటోనియో గుటెరస్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఇజ్రాయెల్ వెంచర్ క్యాపిటలిస్ట్ 'మైఖెల్ ఐసెన్ బర్గ్'.. మరి ఇండియా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అంతే కాకూండా.. ఐక్యరాజ్య సమితి కొత్త మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మారిన కాలానికి అనుగునంగా మార్పు అవసరమని స్పష్టం చేశారు. At some point, there needs to be a revision of the UN bodies. Problem is that those with excess power don’t want to give it up. India not having a permanent seat on the Security Council, despite being the most populous country on Earth, is absurd. Africa collectively should… — Elon Musk (@elonmusk) January 21, 2024 -
యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌పై కిమ్ సోదరి ఫైర్
ఇటీవల ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలతో సహా ఐక్యరాజ్యసమతి సెక్యూరిటీ కౌన్సిల్ సైతం ఉత్తర కొరియా తీరుపై మండిపడింది. ఉత్తర కొరియా దూకుడుకి అడ్డుకట్టే వేసే దిశగా పావులు కదిపింది కూడా. ఈ నేపథ్యంలో యూఎన్ఎస్సీ తీసుకున్న విధానాలను విమర్శిస్తూ...ఇది ద్వంద వైఖరి అంటూ కిమ్‌జోంగ్ ఉన్ సోదరి యో జోంగ్ సెక్యూరిటీ కౌన్సిల్‌పై నిప్పులు చెరిగింది. దక్షిణకొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ప్రమాదకరమైన సైనిక కసరత్తుల విషయంలో యూఎస్ఎస్సీ కళ్లు మూసుకుపోయినట్లు ఉన్నాయి అంటూ కస్సుమంది. అత్యాశతో ఆయుధాల పెంచుకునే దిశగా చేసిన కసరత్తులు సెక్యూరిటీ కౌన్సిల్‌కి కనిపంచటం లేదని అన్నారు. భయంతో మొరిగే కుక్కమ మాదిరిగా అమెరికా ప్రవర్తిస్తుందని కిమ్ సోదరి యో జోంగ్ అన్నారు. కేవలం కొరియా ద్వీపకల్పాన్ని సంక్షోభంలోకి నెట్టివేయడమే ప్రధాన లక్ష్యంగా అమెరికా ఇలా చేస్తుందని నిందించారు. కిమ్‌జోంగ్ ఉన్ ఇటీవలే హ్యాసాంగ్-17 అనే క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసింది. దీన్ని రాక్షస క్షిపణిగా దక్షిణ కొరియా పేర్కొంది. ఈ క్షిపణి 6 వేల కి.మీ ఎత్తులో వెయ్యి కిలోమీటర్లు (620 మైళ్ళు) వరకు దూసుకుపోయిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తరకొరియా మార్చి 24న అత్యంత శక్తివంతమైన అణు పరీక్షల్లో ఒకటైనా ఐసీబీఎం కంటే ఈ క్షిపణి ప్రయోగం కొంచెం తక్కువగా ప్రభావంతమైందని తెలిపింది. అదీగాక ఇంతవరకు ఉత్తరకొరియా ప్రయోగించిన రికార్డు బ్రేకింగ్ క్షిపణుల్లో ఇది సరికొత్తది. అంతేగాదు దక్షిణ కొరియాలను, టోక్యోలను రక్షించడానికి వాషింగ్టన్ తీసుకుంటున్న చర్యలపై ఉత్తరకొరియా, రష్యాలు పదే పదే నిప్పులు గక్కాయి. దక్షిణ కొరియా, అమెరికాలోని విశ్లేషకులు, అధికారులు మాత్రం ఉత్తర కొరియా ఏడవ అణు పరీక్షకి సిద్ధం కానుందని హెచ్చరిస్తున్నారు. (చదవండి: ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. తీవ్ర ఉద్రిక్తత, జపాన్, సౌత్ కొరియా అలర్ట్) -
మానవాళికి ఉగ్ర ముప్పు పెరుగుతోంది : జైశంకర్
-
పాక్ టెర్రరిస్టుకు చైనా అండ.. 4 నెలల్లో ఐదోసారి మోకాలడ్డు
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు వంతు పాడే చైనా మరోమారు తన కుటిల బుద్ధిని చూపించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే భారత్-అమెరికా ప్రతిపాదను అడ్డుకుంది. పాకిస్థాన్‌కు చెందిన తల్హా సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్, అమెరికా ప్రతిపాదించగా.. బీజింగ్ హోల్డ్‌లో పెట్టింది. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది షాహిద్ మహమూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించటాన్ని అడ్డుకున్న కొన్ని గంటల్లోనే మరోమారు చైనా ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్‌ను ఇటీవలే ఉగ్రవాదిగా గుర్తించింది భారత్. చట్ట వ్యతిరేక చర్యల నియంత్రణ చట్టం 1967 కింద హఫీజ్ సయీద్‌ను టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 8న నోటిఫికేషన్ జారీ చేసింది. తల్హా సయీద్.. భారత్‌లో లష్కరే తోయిబా కోసం నియామకాలు చేపట్టటం, నిధులు సేకరించటం, దాడులకు ప్రణాళికలు రచించటంలో కీలకంగా వ్యవహరించినట్లుపేర్కొంది. ఐక్యరాజ్య సమితిలోని 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీలో భారత్, అమెరికా ప్రతిపాదనలకు చైనా అడ్డుకోవటం ఇదేం మొదటిసారి కాదు. గడిచిన నాలుగు నెలల్లోనే చైనా ఓ ఉగ్రవాదికి మద్దతు ఇవ్వటం ఇది ఐదోసారి. ఇటీవలే లష్కరే సభ్యుడు షాహిద్ మహమూద్, సెప్టెంబర్‌లో సాహిద్ మిర్, జూన్‌లో జమాత్ ఉద్ దావా లీటర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, ఆగస్టులో జైషే మహమ్మద్ చీఫ్ సోదరుడు అబ్దుల్ రావూఫ్ అజార్‌లకు మద్దతు తెలిపింది. వారిని అంతర్జాతీయ ఉగ్రవాదులగా గుర్తించాలని ప్రతిపాదనకు అడ్డుపడింది. ఇదీ చదవండి: భారత్‌పై దొంగదెబ్బ తీసిన కమాండర్లకు చైనా ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం! -
భారత్ ప్రతిపాదనకు నో.. పాకిస్థాన్ ఉగ్రవాదికి చైనా అండ!
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక నాయకుడు షాహిద్ మహమూద్‌కు ఐక్యరాజ్య సమితిలో చైనా అండా నిలిచింది. మహమూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్, అమెరికాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదులపై చర్యలు చేపట్టకుండా ఐక్యరాజ్య సమితిలో గత కొన్ని నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ కింద షాహిద్ మహమూద్‌పై చర్యలు తీసుకోవాలని.. భారత్, అమెరికా ప్రతిపాదనలు చేశాయి. అయితే, పాకిస్థాన్ మిత్రదేశమైన చైనా అందుకు అడ్డుపడింది. ఈ ప్రతిపాదనలను నిలిపివేసింది. మరోవైపు.. 2016లోనే అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ షాహిద్ మహమూద్, మహుమ్మద్ సార్వర్లపై ఆంక్షలు విధించింది. ఉగ్రవాదానికి వీరు నిధులను సమకూర్చటాన్ని అడ్డుకునే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భారత పర్యటనలో భాగంగా 26/11 ముంబై ఉగ్రదాడిలో మరణించి వారికి నివాళులర్పించిన క్రమంలోనే.. చైనా టెర్రరిస్టులకు అండగా నిలవటం గమనార్హం. ఎవరీ షాహిద్? అమెరికా ట్రెజరీ విభాగం వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. షాషిద్ మహమూద్ కరాచీలోని లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో సీనియర్ సభ్యుడు. 2007 నుంచి లష్కరే ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నాడు. 2013లో అతడు లష్కరే పబ్లికేషన్స్ విభాగ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. 2014 నుంచి లష్కరే అనుబంధ విభాగమైన ఫలహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)లో కొనసాగి.. 2015-16 మధ్యలో ఆ సంస్థ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. సిరియా, టర్కీ, బంగ్లాదేశ్, గాజా వంటి ప్రాంతాల్లో పర్యటించి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చాడు. మరో ఉగ్రనేత సాజిద్ మిర్‌తో కలిసి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు. ఇదీ చదవండి: ఎందుకింత ఉగ్రరూపం? జెలెన్స్కీ ట్వీట్ -
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకివ్వరు?
ఐక్యరాజ్యసమితి: భారత్, జపాన్, బ్రెజిల్, ఉక్రెయిన్ లాంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకు కల్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిలదీశారు. శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం జరిగిన ఐరాస సాధారణ సభ చర్చా కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించారు. భదత్రా మండలిలో అన్ని గొంతుకలకు అవకాశం కల్పించాలన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, సెంట్రల్, ఈస్ట్రన్ యూరప్‌లకు వీటో అధికారం ఉండాలని సూచించారు. సమతూకంతో కూడిన భదత్రా మండలిని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఇప్పటికే శాశ్వత సభ్యదేశ హోదా పొందిన రష్యా ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై ఏనాడూ మాట్లాడలేదని జెలెన్స్కీ విమర్శించారు. అందుకు కారణమేంటో చెప్పాలన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇప్పుడు ఐదు శాశ్వత సభ్యదేశాలున్నాయి. అవి రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని దేశాలకు ఈ హోదా కల్పించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. -
భద్రతా మండలి: భారత్ ‘శాశ్వత సభ్యత్వం’పై బైడెన్ స్పందన
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భారత్‌తో పాటు జర్మనీ, జపాన్‌లను కూడా సభ్యదేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు బైడెన్ సానుకూలంగా ఉన్నారంటూ వైట్‌హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు బైడెన్ సైతం ఈ విషయంపై పరోక్షంగా ప్రకటన చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణ నేపథ్యంలో.. జర్మనీ, జపాన్, భారత్‌లను శాశ్వత సభ్య దేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారని, అదే సమయంలో.. ఇందుకోసం చాలా ప్రక్రియలు జరగాల్సి ఉంటుందని వైట్‌హౌజ్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా మండలిలో ఈ మూడు దేశాలు శాశ్వత సభ్యులుగా ఉండాలనే ఆలోచనకు చారిత్రాత్మకంగా, మా మద్దతు ఉంటుంది అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆ అధికారి స్పందించారు. ఇక బుధవారం UN జనరల్ వద్ద జో బైడెన్ ప్రసంగించారు. ‘‘నేటి ప్రపంచ అవసరాలకు మెరుగ్గా ప్రతిస్పందించేలా సంస్థ మరింత సమగ్రంగా మారాల్సిన సమయం ఆసన్నమైందని తాను నమ్ముతున్నానని ఈ సందర్భంగా బైడెన్ అన్నారు. యునైటెడ్ స్టేట్స్తో సహా UN భద్రతా మండలి సభ్యులు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను నిలకడగా సమర్థించాలి. కౌన్సిల్ విశ్వసనీయంగా, ప్రభావవంతంగా ఉండేలా చూసేందుకు అరుదైన, అసాధారణమైన పరిస్థితులలో మినహా వీటోను ఉపయోగించకుండా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే కౌన్సిల్ శాశ్వత మరియు శాశ్వత ప్రతినిధుల సంఖ్యను పెంచడానికి యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఇస్తుందని ఆయన వెల్లడించారు. మేము చాలా కాలంగా మద్దతు ఇస్తున్న దేశాలకు శాశ్వత స్థానాలు ఇందులో ఉన్నాయి అని బైడెన్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 దేశాలు సభ్యులుగా ఉండగా, శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా ఫెడరేషన్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలు మాత్రమే శాశ్వత సభ్యదేశాలుగా ఉండి వీటో పవర్‌ను కలిగి ఉన్నాయి. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ -
చేతకాకపోతే ఐరాసనే రద్దు చేయండి: జెలెన్స్కీ
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆవేశపూరితంగా ప్రసంగించాడు. రష్యా సైన్యం తమ దేశంలో అత్యంత హేయమైన యుద్ధనేరాలకు పాల్పడిందని ఆరోపించిన జెలెన్స్కీ.. తక్షణమే స్పందించాలంటూ భద్రతా మండలిని కోరాడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఉద్దేశించి మంగళవారం రాత్రి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. బుచాలో రక్తమోడుతూ, కాలి బుగ్గిగా మారి కనిపించిన శవాల కుప్పలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించాడు జెలెన్స్కీ. తక్షణమే స్పందించాలని లేదంటే మొత్తంగా మిమ్మల్ని మీరు పూర్తిగా రద్దు చేసుకోండి అంటూ ఐరాస భద్రతా మండలిని ఉద్దేశించి ఆవేశంగా ప్రసంగించాడు జెలెన్స్కీ. ఐసిస్‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రష్యా బలగాలు ఉక్రెయిన్‌లో మారణహోమానికి పాల్పడ్డాయన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు.. రష్యాను వెలివేయాలని డిమాండ్ చేశాడు. తద్వారా వీటో అధికారాన్ని రష్యాకు లేకుండా చేయాలని కోరాడు. ఒకవేళ ప్రత్యామ్నాయం, ఇతర దారులు లేకుంటే గనుక.. మొత్తంగా భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితిలనే రద్దు చేసుకోవాలంటూ కోరాడు జెలెన్స్కీ. రష్యా బలగాలు మారణకాండకు పాల్పడ్డాయన్న దీనిపై విచారణ జరపాలని, ఇంతటి ఘోరాలకు ఆదేశాలిచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ‘బుచాలో రష్యా దళాలు చేయని నేరం లేదు. ప్రతి పౌరున్నీ వెతికి వెతికి చంపాయి. ఉగ్రవాద సంస్థ కంటే కిరాతకంగా వ్యవహరించింది. సాక్షాత్తూ భద్రతా మండలిలో వీటో అధికారమున్న శాశ్వత సభ్య దేశం కావడం గర్హనీయం. వీటో అధికారాన్ని మమ్మల్ని చంపేందుకు హక్కుగా, ఒక లైసెన్స్‌గా రష్యా వాడుకుంటోంది. ప్రపంచ భద్రతకే ఇదో సవాలు. ఇలాంటి వాటిని అరికట్టేలా తక్షణం ఐరాస వ్యవస్థను సంస్కరించాలి’ అని వాదించారు. ఆధారాలు ఏవీ?: రష్యా ఇదిలా ఉండగా.. ఐరాసలో మాస్కో అంబాసిడర్ వసెలీ నెబెంజియా మాత్రం ఉక్రెయిన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నేరుగా ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ.. రష్యా బలగాలు దమనకాండను పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు, ఉంటే సమర్పించండి. ఇదంతా ఉక్రెయిన్ ఆడుతున్న నాటకం అంటూ ప్రత్యారోపణలు చేశారు. మరోవైపు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ భద్రతా మండలిలో తాజా పరిణామాలపై స్పందించారు. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల 74 దేశాలు, బిలియన్‌న్నర మంది సంక్షోభంలోకి కూరుకుపోయారని హెచ్చరిస్తూ.. తక్షణమే ఈ యుద్ధం ఆగాలంటూ పిలుపు ఇచ్చారు. సంబంధిత వార్త: ఉక్రెయిన్‌లో ఊచకోత! లెక్కలు ఏం చెప్తున్నాయంటే.. -
యుద్ధానికి బ్రేక్ వేసింది అందుకే! తరలించేందుకు సహకరిస్తాం!
Russia Says In UN Security Council meeting: ఉక్రెయిన్ పై రష్యా పది రోజులుగా దాడి కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఉక్రెయిన్‌లో ప్రధాన నగరాలు వైమానిక క్షిపణులు, బాంబుల దాడులతో అత్యంత దయనీయంగా మారాయి. ఈ మేరకు రష్యా ఉక్రేయిన్‌లో చిక్కుకున్న విదేశీయులను, భారతీయులను తరలించే నిమిత్తం యుద్ధానికి బ్రేక్ వేసింది కూడా. అంతేగాక ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను, ఇతర విదేశీయులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలియజేసింది. పైగా వారిని తరలించడానికి తూర్పు ఉక్రెయిన్ నగరాలైన ఖార్కివ్, సుమీకి వెళ్లడానికి రష్యా బస్సులు క్రాసింగ్ పాయింట్ల వద్ద సిద్ధంగా ఉన్నాయని కూడ స్పష్టం చేసింది. ఐరోపాలో అతి పెద్దదైన ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి చేయడంతో అంతర్జాతీయ భద్రతా మండలి అల్బేనియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ వంటి 15 దేశాలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విదేశీయులను శాంతియుతంగా తరలించేందుకు రష్యా సైన్యం అన్ని విధాలా కృషి చేస్తోందని రష్యా రాయబారి రాయబారి వాసిలీ నెబెంజియా తెలిపారు. ఉక్రెయిన్ జాతీయవాదులు తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్, సుమీ నగరాల్లో 3,700 మంది భారతీయ పౌరులను బలవంతంగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి, ఐక్యరాజ్యసమితి రాయబారి సెర్గి కిస్లిత్సా రష్యా రాయబారి నెబెంజియాతో మాట్లాడుతూ.."దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. విదేశీ విద్యార్థులు ఆందోళన చెందుతున్న ప్రాంతాలను విడిచిపెట్టడానికి సురక్షితమైన కారిడార్‌ను నిర్ధారించేలా సాయుధ దళాలకు (రష్యా) విజ్ఞప్తి చేయండి. అని కోరారు. అంతేకాదు మీరు నిజంగా ఉక్రెయిన్ రాజధానితో సంబంధంలో ఉంటే అక్కడ ఏమి జరుగుతుందో మీకు బాగా తెలుసు" అని వ్యగ్యంగా అన్నారు. (చదవండి: జెలెన్ స్కీ తీవ్ర ఆవేదన.. బాంబులు వేసేందుకే ఇలా చేశారా..) -
ఉక్రెయిన్‌పై మీ వైఖరికి థ్యాంక్స్
మాస్కో: భద్రతామండలిలో ఉక్రెయిన్‌పై ఓటింగ్‌కు దూరంగా ఉన్న భారత్‌కు రష్యా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఓటింగ్‌ను తమతో పాటు వ్యతిరేకించిన చైనాకు కూడా రష్యా ప్రతినిధి డిమిట్రి పొల్యాన్స్కీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ దేశాలు అమెరికా మెలికలను తట్టుకొని ధైర్యంగా నిలుచున్నాయన్నారు. అమెరికా దౌత్యవిధానాలు అల్పస్థాయికి దిగజారాయని దుయ్యబట్టారు. ఉక్రెయిన్ విషయంలో నిర్మాణాత్మక చర్చలు అవసరమని భారత్ అభిప్రాయపడింది. అక్కడ ఉద్రిక్తతలను పెంచే చర్యలను అనుమతించకూడదని కోరింది. ఉక్రెయిన్‌లో దాదాపు 20వేల మంది భారతీయులు నివసిస్తున్నారని, వారి సంరక్షణే తమ ప్రాధాన్యాంశమని ఐరాసలో భారత రాయబారి త్రిమూర్తి చెప్పారు. మరోవైపు తమ ప్రతిపాదనలకు రష్యా నుంచి సమాధానం వచ్చిందని అమెరికా మంగళవారం ప్రకటించింది. అయితే తామెలాంటి స్పందనను పంపలేదని రష్యా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఉక్రెయిన్ విషయంలో జరిగిన అన్ని చర్చలు విఫలమయ్యాయి. -
పీఓకేను ఖాళీ చేయండి: భారత్
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని చరిత్ర ఇప్పటికే నిరూపించిందని, ఉగ్రవాదులకు కొమ్ముకాయడం, వారికి శిక్షణ, ఆర్థిక సహకారం అందివ్వడం పాక్ విధానమని భారత్ దుయ్యబట్టింది. మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో యూఎన్‌లో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ కాజల్ భట్ మాట్లాడారు. పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ జమ్మూ కశ్మీర్‌పై చేసిన వాదనని కాజల్ తిప్పికొట్టారు. యూఎన్ వేదికల్ని ఉపయోగించుకొని కశ్మీర్‌పై అవాస్తవాలను ప్రచారం చేయడం పాక్‌కు కొత్త కాదన్నారు. కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలన్నీ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్ దేశానిదేనని, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ పాక్ వెంటనే ఖాళీ చేయాలని ఆమె అల్టిమేటమ్ జారీ చేశారు. పాకిస్తాన్ సహా ఇరుగుపొరుగు దేశాలతో సామరస్యంగా ఉండాలనే భారత్ కోరుకుంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపితేనే పాకిస్తాన్‌తో శాంతియుత వాతావరణంలో చర్చలు జరుగుతాయని భట్ అన్నారు. అప్పటివరకు భారత్ సీమాంతర ఉగ్రవాదంపై కఠినమైన విధానంతోనే ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాదుల్లో అత్యధికులు పాక్‌లోనే తలదాచుకోవడాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని అన్నారు. -
అఫ్గన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ.. బైడెన్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: గత 17 రోజులుగా అఫ్గనిస్తాన్‌లో తమ బలగాలు చేపట్టిన పౌరుల తరలింపు ప్రక్రియ(ఎయిర్‌లిఫ్టు) అమెరికా చరిత్రలోనే అతి పెద్దదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. సుమారు 1,20,000 వేల మంది అమెరికా పౌరులు, అమెరికా- అఫ్గన్ మిత్ర దేశాల ప్రజలను తరలించినట్లు పేర్కొన్నారు. అఫ్గన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తైన నేపథ్యంలో జో బైడెన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు... ‘‘20 ఏళ్లుగా అమెరికా సైన్యం అఫ్గనిస్తాన్‌లో అందిస్తున్న సేవలు నేటితో ముగిసాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆగష్టు 31, వేకువజాము లోపే.. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా.. అత్యంత సురక్షితంగా ఈ ప్రమాదకరమైన ఆపరేషన్ పూర్తి చేసిన మా కమాండర్లకు ధన్యవాదాలు చెబుతున్నా’’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పటితో తరలింపు ప్రక్రియ పూర్తైనట్లు కాదని, అంతర్జాతీయ భాగస్వాములు, మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తమ విదేశాంగ మంత్రికి చెప్పినట్లు బైడెన్ తెలిపారు. తాలిబన్లు మాట నిలబెట్టుకోవాలి ‘‘అఫ్గనిస్తాన్‌ను వీడాలనుకుంటున్న అమెరికన్లు, అఫ్గన్, ఇతర విదేశీ పౌరులను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నేడు తీర్మానం జరుగనుంది’’ అని పేర్కొన్నారు. అఫ్గనిస్తాన్‌ను వీడాలనుకున్న పౌరులను సురక్షితంగా తరలిస్తామని తాలిబన్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా బైడెన్ గుర్తుచేశారు. అంతర్జాతీయ పౌరుల ప్రయాణాలపై తాలిబన్లు ఎటువంటి ఆంక్షలు విధించరని అంతర్జాతీయ సమాజం భావిస్తోందన్నారు. ఇక ఆగష్టు 31లోపు అమెరికా సైన్యాలను వెనక్కి పిలిపించడం వెనుక గల కారణాలను తదుపరి మీడియా సమావేశంలో వెల్లడిస్తానని బైడెన్ పేర్కొన్నారు. కాగా ఆగష్టు 15న తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాటి(ఆగష్టు 31)తో సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికాకు డెడ్‌లైన్ విధించారు. చదవండి: Afghanistan Crisis-ISIS K: తాలిబన్ల ‘కే’ తలనొప్పి -
క్లిష్టసమయంలో కీలక బాధ్యత
పదవి గౌరవమే కానీ, దానితో వచ్చే బాధ్యతలే బరువు. అదీ... క్లిష్టమైన సందర్భంలో పీఠమెక్కితే, కిరీటం మరింత బరువనిపించడం సహజం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)కి అధ్యక్ష స్థానంలో నెల రోజుల పాటు కూర్చొనే గౌరవం ఈ ఆగస్టు మొదట్లో భారత్‌కు దక్కినప్పుడు ఇలా ఎవరూ అనుకోలేదు. కానీ, అఫ్గాన్ పరిణామాలతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. భద్రతామండలికీ, ఈ నెల రోజులు అధ్యక్ష స్థానంలో ఉండే మన దేశానికీ బాధ్యతలు పెరిగాయి. ఒకవైపు ప్రపంచ దేశాల పక్షాన ఐరాస ద్వారా అఫ్గాన్ విషయంలో చేపట్టాల్సిన చర్యలున్నాయి. మరోవైపు అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత బాధ్యత ఉంది. ఇవి కాక, పొరుగు దేశమైన అఫ్గాన్ దెబ్బతో ఆర్థిక, రక్షణ రంగాల్లో మనపై పడే ప్రభావంపైనా దృష్టి సారించాల్సి ఉంది. వెరసి, కొద్దికాలం పాటు భారత సర్కారుకు చేతి నిండా పని, బుర్ర నిండా ఆలోచనలు తప్పవు. 2012 తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు భద్రతామండలి అధ్యక్ష పీఠం దక్కించుకోవడం మన దేశ దౌత్య విజయమే. అలా అంతర్జాతీయ భద్రత అంశాలపై మన గొంతు వినిపించే అవకాశమూ లభించింది. గమనిస్తే– అంతర్జాతీయ వేదికపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) కీలకం. దానిలో అతి కీలకవిభాగం భద్రతామండలి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు అయిదింటికే అందులో శాశ్వత సభ్యత్వం ఉంది. ఎప్పటికప్పుడు మరో 10 దేశాలకు రెండేళ్ళ తాత్కాలిక సభ్యత్వం ఇస్తుంటారు. మానవాళిలో ఆరోవంతుకు ప్రాతినిధ్యం వహిస్తూ, దాదాపు 3 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ, థర్మో న్యూక్లియర్ ఆయుధాలున్న భారత్‌కు భద్రతామండలిలో నేటికీ శాశ్వత సభ్యత్వం దక్కకపోవడం విచిత్రం. అది భద్రతా సమితి ప్రాసంగికతపైనా అనుమానాలూ రేపుతోంది. తాత్కాలిక సభ్యత్వం పొందడం మాత్రం మన దేశానికి ఇది ఎనిమిదోసారి. వంతుల వారీగా దక్కే అధ్యక్ష పీఠాన్ని ఈ ఎనిమిదిసార్లుగా భారత్ అధిష్ఠిస్తూనే ఉంది. తాజాగా ఈ ఆగస్టు 2 నుంచి నెలరోజుల భారత భద్రతామండలి సారథ్యం మొదలైంది. ఆ వెంటనే భద్రతామండలి నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారత ప్రధాని అనే ఘనత మోదీ దక్కించుకున్నారు. సాగరజలాల భద్రత, తీవ్రవాద నిరోధం, శాంతిపరిరక్షణ ప్రధానాంశాలంటూ భారత్ మొదటే చెప్పేసింది. తొలి చర్చలోనే సాగర జలాల భద్రత అంశాన్ని చేపట్టి, మనం చైనాను ఇరుకునపెట్టాం. కాబూల్ తాలిబన్ల వశం కాక ముందే, అఫ్గాన్ అంశంపై ఆఖరు నిమిషంలో చర్చకు తెర తీసి, మార్కులు సంపాదించాం. అయితే, తాలిబన్ల పూర్తిస్థాయి విజృంభణతో అసలు సవాలు ఇప్పుడు మొదలైంది. అఫ్గాన్‌లోని మొత్తం 34 ప్రావిన్స్‌లలో ఒక్క పాంజ్‌షిర్ (అయిదు సింహాల) లోయలో మాత్రమే తాలిబన్లకు ప్రతిఘటన స్వరాలు వినిపిస్తున్నాయి. ఛాందస, తీవ్రవాద, సాయుధ తాలిబన్ల మూక పొరుగుగడ్డపై పట్టు సాధించడంతో మన జాతీయ భద్రతా సవాళ్ళు మరింత సంక్లిష్టమయ్యాయి. మరోపక్క తాలిబన్లు సైతం భారత్‌తో అన్ని రకాల ఎగుమతులూ, దిగుమతులూ ఆపేశారు. అది ఓ పెద్ద దెబ్బ. అఫ్గాన్‌తో అనాదిగా సంబంధ బాంధవ్యాలున్న భారత్ ఇప్పటికే 300 కోట్ల డాలర్ల మేర అక్కడ పెట్టుబడులు పెట్టింది. వాటి అతీ గతీ చెప్పలేం. వీటన్నిటికీ తోడు అఫ్గాన్ భూభాగం మన దేశంపై దాడులకు బేస్ క్యాంప్ అయ్యే ప్రమాదం సరే సరి. పేలుతున్న తుపాకీలు.. పెరుగుతున్న నిర్బంధాలు.. మానవహక్కుల ఉల్లంఘనలతో ఇప్పుడు కాబూల్ అల్లకల్లోలంగా మారింది. ఎలాగైనా సరే దేశం విడిచిపోవాలని కాబూల్ విమానాశ్రయం వెలుపల గుంపుల కొద్దీ జనం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి విమానాశ్రయం అమెరికా సైనిక బలాల పహారాలో ఉన్నా, తగిన పత్రాలున్న వారిని సైతం తాలిబన్లు లోపలకు పోనివ్వడం లేదని వార్త. సైనిక ఉపసంహరణకు అమెరికా పెట్టుకున్న గడువు ఆగస్టు 31. అది దాటిపోయినా సరే, ఆఖరు అమెరికన్‌ను కాబూల్ నుంచి భద్రంగా వెనక్కి తెచ్చేవరకు తమ బలగాలు అక్కడే ఉంటాయని వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ గొంతు సవరించుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సైతం కాబూల్‌లోని పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తుదన్నారు. ఇప్పటికైతే భారత్ దృష్టి మొత్తం అఫ్గాన్‌లోని మన పౌరుల్ని సురక్షితంగా మాతృదేశానికి తీసుకురావడం మీదే ఉంది. అందుకు ఐరాస ప్రధాన కార్యదర్శితో, అమెరికా, బ్రిటన్లతోనూ చర్చిస్తోంది. మరోపక్క శాంతిపరిరక్షణ లాంటి అంశాలపై పత్రాలకు భద్రతామండలిలో ఏకగ్రీవ ఆమోదం సంపాదించింది. భారత దౌత్యనైపుణ్యానికి ఇది పరీక్షా సమయం. తీవ్రవాద నిరోధంపై గురువారం నాటి భద్రతా మండలి సమావేశంలో కోవిడ్ లానే తీవ్రవాదం నుంచీ ఎవరూ సురక్షితం కాదన్న జైశంకర్ వ్యాఖ్యలు అందరినీ తాకేవే. తీవ్రవాద నిరోధానికి సప్తసూత్రాలన్న భారత ప్రతిపాదన గమనార్హం. మంచి తీవ్రవాదం, చెడు తీవ్రవాదం అని వేర్వేరుగా ఉండవంటూ– జైష్, లష్కరే తోయిబా లాంటి తీవ్రవాద సంస్థల పేరెత్తడం ద్వారా పాక్ ప్రస్తావన తేకనే తెచ్చారు. అఫ్గాన్‌పైనా దృష్టి పడేలా చేశారు. నిజానికి తాలిబన్లకు తాళం వేస్తున్న చైనా, పాక్ లాంటి వాటికి పగ్గం వేయాలంటే భారత్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వమూ కీలకమే. 1950లలో తప్పిపోయిన శాశ్వత సభ్యత్వాన్ని, ఇప్పుడు వీటో హక్కుతో సహా దక్కించుకోవడం అవసరం. దానివల్ల అఫ్గాన్ సహా అనేక అంశాలపై భారత్ పట్టుపట్టగలుగుతుంది. వచ్చే ఏడాది డిసెంబర్లో మనకు మళ్ళీ భద్రతామండలి సారథ్యం దక్కనుంది. అప్పటికైనా అఫ్గాన్ సంక్షోభానికి తెర పడుతుందా? అది మరీ అంత సులభం కాదేమో! -
సముద్రప్రాంత సహకారానికి పంచ సూత్రాలు
ఐక్యరాజ్యసమితి: సముద్రప్రాంత రక్షణలో ప్రపంచ దేశాల మధ్య సహకారం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశాల మధ్య సముద్ర జల వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. సముద్ర జలాల్లో విద్రోహ శక్తులతో ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు. సముద్ర ప్రాంత రక్షణ పెంపు–అంతర్జాతీయ సహకారం అంశంపై ఐరాస భద్రతామండలిలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన చర్చకు మోదీ అధ్యక్షత వహించారు. సముద్ర ప్రాంత వివాదాలను పరిష్కరించుకునేందుకు ఐదు సూత్రాలతో కూడిన సముద్ర సమ్మిళిత రక్షణ వ్యూహాన్ని ప్రతిపాదించారు. ఆ పంచ సూత్రాలివే.. ► ప్రపంచ ప్రగతి సముద్ర ప్రాంత వాణిజ్యం క్రియాశీలతపైనే ఆధారపడి ఉంది. చట్టపరమైన సముద్ర వాణిజ్యానికి అవరోధాలను తొలగించాలి. ► సముద్ర జల వివాదాలను శాంతియుతంగా, అంతర్జాతీయ చట్టాల ప్రాతిపదికన పరిష్కరించుకోవాలి. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఏకైక మార్గం ఇదే. ► ప్రకృతి వైపరీత్యాలు, విద్రోహ శక్తుల కారణంగా తలెత్తే సవాళ్లను అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఈ విషయంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. ► సముద్ర పాంత పర్యావరణం, వనరులను కాపాడుకోవడం, జవాబుదారీతనంతో కూడిన సముద్ర ప్రాంత అనుసంధానితను ప్రోత్సహించడం. ఈ సందర్భంగా జరిగిన చర్చలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ..వివిధ ప్రాంతాల్లో జరిగే సముద్ర నేరాలపై ప్రత్యక్షంగా పోరాడేందుకు ఐరాస ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సముద్ర జలాల్లో సముద్రపు దొంగలు, ఉగ్రవాదులపై కొన్ని దేశాలు సొంతంగా పోరాడలేకపోతున్నాయని ఆయన చెప్పారు. దక్షిణ చైనా సముద్ర జలాల్లో తలెత్తిన వివాదం భద్రత, వాణిజ్యం విషయంలో అంతర్జాతీయంగా తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తెలిపారు. నియమోల్లంఘన ప్రతి చోటా నష్టానికి, అస్థిరతకు ఆజ్యం పోస్తుందని చైనానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
ఆఫ్ఘనిస్తాన్పై చర్చ: పాకిస్తాన్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సమావేశానికి ఆహ్వానం అందకపోవడంపై పాకిస్తాన్ స్పందించింది. వివాదాస్పద పొరుగుదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిపై ఆగస్టు 6 న నిర్వహించిన భద్రతా మండలి సమావేశానికి ఆహ్వానించకపోవడంపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ పరిస్థితుల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పొరుగుదేశంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిపై చర్చకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పిలుకు రాకపోవడంపై పాకిస్తాన్ విచారం వ్యక్తం చేసింది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆహ్వానించలేదంటూ మండిపడింది. తమ దేశంపై తప్పుడు ప్రచారం జరగడానికి ఈ మండలిని వేదికగా ఉపయోగించుకుంటున్నారని పాక్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ దేశానికి తాము పొరుగునే ఉన్నామని, ఆఫ్ఘన్ లో శాంతి నెలకొనేలా చూడడంలో తమది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. ఈ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని రాజకీయ ఒప్పందమే సరైనమార్గమంటూ ఆయన ట్వీట్ చేశారు. దోహాలో జరిగిన చర్చల్లో తాము కూడా భాగస్వామ్యం వహించామని ఆశిస్తున్నట్టు హఫీజ్ చౌదరి పేర్కొన్నారు. అటు తాలిబాన్లకు సురక్షితమైన స్వర్గధామం పాకిస్తాన్ మారిందని,వారికి భారీమద్దతును అందిస్తోంటూ పాకిస్తాన్ పైఐరాసలోఆఫ్ఘన్ శాశ్వత ప్రతినిధి గులాం ఇసాక్ జై కూడా మండిపడ్డారు. మరోవైపు ఉగ్రవాదులకు ఊతమిస్తోందంటూ పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఈ ప్రాంతంలోని తీవ్రవాద సురక్షిత ప్రాంతాలను తక్షణమే నాశనం చేయాలని తద్వారా తీవ్రవాద గొలుసును అంతం చేయాలని ఐరాస భారత రాయబారి తిరుమూర్తి కోరారు. కాగా నేడు (సోమవారం) సాయంత్రం జరగనున్న ప్రధాని మోదీ అధ్యక్షతన యూఎన్ఎస్సీ కీలక సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్ ఫెలిక్స్-ఆంటోయిన్ షిసెకెడి సిలోంబో, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తదితరులు కూడా పాల్గొంటున్నారు. 15 దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో తీవ్రవాద నిరోధం, అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అంశాలతో పాటు ‘సముద్ర భద్రత’అంశాన్ని ఎజెండాలో ప్రత్యేక అంశంగా చర్చించడం ఇదే తొలిసారి. అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి సమాచారం ప్రకారం ఐరాస భద్రతా మండలి సమావేశానికి భారత ప్రధాని అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
యూఎన్ చీఫ్‌గా మళ్లీ ఆంటోనియా గుటెరస్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఆంటోనియా గుటెరస్‌ను నియమించాలని యూఎన్ భద్రతా మండలి సిఫారసు చేసింది. యూఎన్ చీఫ్‌గా మళ్లీ ఆంటోనియాకే అవకాశం ఇవ్వాలని మంగళవారం జరిగిన సమావేశంలో 15 దేశాల భద్రతామండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. గుటెరస్ పేరుని సూచిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభకు తీర్మానాన్ని పంపింది. 193 సభ్యదేశాలున్న సర్వ ప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ) ఆమోదిస్తే వరుసగా రెండోసారి... 2022 జనవరి 1 నుంచి అయిదేళ్ల పాటు గుటెరస్ ఈ పదవిలో ఉంటారు. మరోవైపు భారత్ భద్రతామండలి తీర్మానాన్ని స్వాగతించింది. (చదవండి: గాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలుశిక్ష ) -
చైనాను కార్నర్ చేసిన యూఎస్, యూకే, జర్మనీ!
న్యూయార్క్: ఉగర్ ముస్లింల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని అమెరికా, యూకే, జర్మనీ తీవ్రంగా విమర్శించాయి. ఉగ్రవాద నిర్మూలన పేరిట మైనార్టీ వర్గాల హక్కులను డ్రాగన్ కాలరాస్తోందని మండిపడ్డాయి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా ఆయా దేశాల ప్రతినిధులు చైనా తీరును ఎండగట్టాయి. ఈ నేపథ్యంలో యూఎన్‌లో అమెరికా శాశ్వత ప్రతినిధి కెల్లీ క్రాఫ్ట్ మాట్లాడుతూ.. ‘‘జింగ్జియాంగ్లో నివసిస్తున్న పది లక్షలకు పైగా ఉగర్లు, ఇతర ముస్లింలను ఉగ్రవాద నిరోధక చర్యల పేరిట అక్రమంగా బంధించడం పట్ల ఆందోళనగా ఉంది. తీవ్ర వాదాన్ని అణిచివేసే పేరిట భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకోవడం సరైంది కాదు. మత స్వేచ్చను హరించి మైనార్టీ వర్గాలను అణగదొక్కేందుకే ఇలా వ్యవహరిస్తున్నారు’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: చైనాలో మసీదులు కూల్చివేత.. పాక్ మౌనం) ఇక యూకే ప్రతినిధి జేమ్స్ రాస్కో సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉగర్లు, ఇతర భిన్న మైనార్టీ జాతుల పట్ల అణచివేత వైఖరి ప్రదర్శిస్తూ.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం సరికాదని డ్రాగన్‌కు హితవు పలికారు. ఉగ్రవాదాన్ని రూపుమాపే పేరిట మైనార్టీలను నిర్బంధించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని జర్మనీ రాయబారి విమర్శించారు. కాగా హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసేందుకు చైనా తీసుకువచ్చిన విధానాలపై కూడా పలు దేశాలు ఇప్పటికే యూఎన్ఎస్సీ రహస్య సమావేశంలో చర్చను లేవనెత్తాయి. అయితే డ్రాగన్ మాత్రం తమ అంతర్గత విషయాల్లో ఇతర దేశాల జోక్యం అనవసరమని తేల్చిచెప్పింది.(చదవండి: విదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!) కాగా వాయువ్య చైనాలో గల జిన్జియాంగ్ (జిన్జియాంగ్ ఉగర్ అటానమస్ రీజియన్(ఎక్స్‌యూఏఆర్)ను స్వయంప్రతిపత్తి గల ప్రాంతంగా గుర్తించిన డ్రాగన్.. అక్కడ నివసిస్తున్న వేలాది ముస్లింలను అనధికారికంగా నిర్బంధించిన విషయాన్ని ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ప్రపంచానికి తెలియజేసిన విషయం తెలిసిందే. -
ఈ ఉగ్ర గ్రూపులకు పాకిస్తానీలే బాస్‌లు
ఐక్యరాజ్యసమితి: భారత ఉపఖండంలో కార్యకలాపాలు సాగిస్తున్న అల్‌కాయిదా వంటి ఉగ్ర సంస్థలకు పాకిస్తానీ జాతీయులే నాయకత్వం వహిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవాంట్–ఖొరాసాన్ (ఐఎస్ఐఎల్–కె), తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) తదితర ఉగ్రసంస్థల నేతల పేర్లను ఆంక్షల జాబితాలో చేర్చలేదని తెలిపింది. ఐఎస్ఐఎల్, అల్‌కాయిదా, వాటి అనుబంధ వ్యక్తులు, ఆస్తులపై ఐరాస ఏర్పాటు చేసిన ఆంక్షల సమీక్ష కమిటీ ఈ విషయాలు వెల్లడించింది. ఐఎస్ఐఎల్–కె అధిపతి అస్లాం ఫరూఖీ అలియాస్ అబ్దుల్లా ఒరాక్జాయ్‌తోపాటు మాజీ అధినేత జియా ఉల్హక్ అలియాస్ అబూ ఒమర్ ఖొరాసానీ, అల్‌కాయిదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్) నేత ఒసామా మహ్మూద్ కూడా పాకిస్తాన్‌కు చెందిన వారేననీ,వీరి పేర్లు ఆంక్షల జాబితాలో లేవని ఆ నివేదిక పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లోని అతిపెద్ద ఉగ్ర ముఠా టీటీపీ చీఫ్ అమిర్ నూర్ వలీ మెహ్సూద్ కూడా పాకిస్తాన్‌కు చెందిన వాడేనని తెలిపింది. -
ఐరాస ఎన్నికల్లో భారత్ విజయం
సాక్షి, న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వపు ఎన్నికల్లో భారత్ విజయం సాధించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి)లో భారత్‌కు మరోసారి తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. దీంతో రెండేళ్లపాటు (2021–22) భారత్ కొనసాగనుంది. ఐరాసలో సభ్యదేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదోసారి. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ఒక్కటే పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించగా, కెనడా ఓటమిపాలైంది ఐరాసలో అత్యంత శక్తిమంతమైన విభాగం భద్రతా మండలి. అంతర్జాతీయంగా శాంతి భద్రతల పరిరక్షణను ఇదే పర్యవేక్షిస్తుంది. ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించే అధికారం ఉంది. సమితిలో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉండగా, మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్), పది తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. శాశ్వత సభ్యదేశాలకు ‘వీటో’ అధికారం ఉంటుంది. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల సభ్యత్వ కాలానికి రొటేషన్ పద్ధతిలో సర్వసభ్య సభ ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తుంది. మండలిలో కీలక నిర్ణయాలకు కనీసం 9 సభ్యదేశాల ఆమోదం అవసరం. అయితే ఏదైనా నిర్ణయానికి అవసరమైనన్ని సభ్యదేశాల ఆమోదం ఉన్నప్పటికీ.. శాశ్వత సభ్యదేశాల్లో ఏదైనా దేశం వ్యతిరేకించి వీటో చేస్తే ఆ నిర్ణయం ఆమోదం పొందదు. కాగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా, చైనా అందుకు మోకాలడ్డుతోంది. Member States elect India to the non-permanent seat of the Security Council for the term 2021-22 with overwhelming support. India gets 184 out of the 192 valid votes polled. pic.twitter.com/Vd43CN41cY — India at UN, NY (@IndiaUNNewYork) June 17, 2020 -
భారత్‌కు ఆస్ట్రేలియా మద్దతు
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆశిస్తున్న భారత్‌కు ఆస్ట్రేలియా మద్దతు తెలిపింది. అదే విధంగా ఎన్ఎస్జీ(అణు సరఫరాదారుల సమూహం)లో భారత్ సభ్యత్వాన్ని బలపరుస్తున్నట్లు వెల్లడించింది. వివిధ అంశాలపై చర్చించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ గురువారం వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగం, మైనింగ్ సహా పలు కీలక రంగాలకు సంబంధించిన ఏడు ఒప్పందాలపై సంతకం చేసిన ఇరు దేశాధినేతలు.. ఇండో- పసిఫిక్ జలాల్లో పరస్పరం సహకరించుకోవాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... భారత్ స్నేహబృందంలో ఆస్ట్రేలియా కూడా ఉందని.. కీలక అంశాల్లో ఇరు దేశాలు కలిసి ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.(భారత్‌కు ఫ్రాన్స్ భారీ రుణ సాయం!) ఇక ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్.. ‘‘ మనం మహాసముద్రాన్ని పంచుకుంటున్నాం. అదే విధంగా బాధ్యతలు కూడా పంచుకోవాల్సి ఉంది. ఆరోగ్యం, భద్రత రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలి’’అని వ్యాఖ్యానించారు. ‘‘యూఎన్ఎస్సీలో భారత శాశ్వత అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నామని ఆస్ట్రేలియా పునరుద్ఘాటిస్తోంది. పౌర అణు ఒప్పందాల్లో ఇరు దేశాలు పరస్పరం అండగా నిలబడతాయి. అదే విధంగా ఎన్ఎస్జీలో కూడా భారత సభ్యత్వం కల్పించే అంశంలో ఆస్ట్రేలియా పూర్తి మద్దతు తెలియజేస్తోంది ’’ అని ఇరు దేశాలు ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అదే విధంగా భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పాల్సిందిగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీని ఆస్ట్రేలియా స్వాగతించింది. కాగా యూఎన్ఎస్సీలో భారత శాశ్వత సభ్యత్వానికి పలు దేశాలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. (తెలుగు ఐఏఎస్ రవి కోటకు కీలక పదవి) -
ఐరాసలో పాక్‌కు మళ్లీ భంగపాటు
ఐక్యరాజ్యసమితి: భద్రతామండలిలో కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్‌కు భంగపాటు ఎదురైంది. చైనా సాయంతో వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించేందుకు పాక్ ప్రయత్నించగా మండలిలో మిగిలిన సభ్యులెవరూ మద్దతివ్వక పోవడంతో ఏకాకిగా మిగిలిపోయింది. కశ్మీర్ అంశం ద్వైపాక్షికమైనందున దానిపై చర్చించడం కుదరదని, మండలిలోని ఇతర సభ్యులు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే పాకిస్తాన్ తనకు కష్టమైన చర్యలు చేపట్టాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. ‘పాక్ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి వేదికగా పదేపదే చేసిన నిరాధార ఆరోపణలకు మద్దతు లభించలేదు’’అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ‘పాక్ ప్రయత్నమంతా దృష్టి మరల్చేందుకేనని మిగిలిన సభ్యులు గుర్తించడం సంతోషకరం. సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక పద్ధతులు ఉన్నాయని భద్రత సమితి సభ్యులు పాక్‌కు గుర్తు చేశారు’అని ఆయన వివరించారు. దురుద్దేశపూర్వక ఆరోపణలు చేయడం పాక్‌కు అలవాటేనని, సమితి సభ్యులు సూచించినట్టుగా సమస్యల పరిష్కారానికి కొన్ని కష్టమైన చర్యలు తీసుకోవడమే ఆ దేశానికి మేలని ఆయన అన్నారు. చైనా దౌత్యవేత్త ఝాంగ్ జున్ మాట్లాడుతూ ‘కశ్మీర్‌పై సమావేశం జరిగింది. భారత, పాక్ అంశం ప్రతి సమావేశంలోనూ ఉంటుంది. దీంతో భద్రతామండలి దీనిపై కొంత సమాచారం తెలుసుకుంది’అని పేర్కొనడం గమనార్హం. ఎస్సీఓ భేటీకి ఇమ్రాన్‌కూ ఆహ్వానం న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) వార్షికభేటీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ సహా పలువురు నేతలకు భారత్ ఆహ్వానం పంపనుంది. ఎస్సీవోలోని పాకిస్తాన్ సహా 8 సభ్య దేశాలు, నాలుగు పరిశీలక హోదా దేశాలనూ ఆహ్వానిస్తామని విదేశాంగ శాఖ మంత్రి రవీశ్ కుమార్ వెల్లడించారు. ‘గతం’ నుంచి భారత్ బయటపడాలి గత అనుభవాలు, ఆలోచనల చట్రంలో బందీగా ఉన్న భారత్, వాటి నుంచి బయటకు రావాల్సి ఉందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. కీలక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో దేశం ప్రస్తుతం కొత్త వైఖరిని అనుసరించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. అయితే, తనను తాను స్వతంత్రంగా నిర్వచించుకుంటుందా లేక ఆ అవకాశాన్ని ఇతరులకు ఇస్తుందా అనేదే అసలైన ప్రశ్న అన్నారు. ఇందులో స్వతంత్ర వైఖరికే తనతోపాటు తమ పార్టీ మొగ్గుచూపు తాయని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంలో జరుగుతున్న ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలపై అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పోరాటం సాగించాలన్నారు. ఈ పోరులో ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను భాగస్వాములను కానీయరాదని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్ మాట్లాడుతూ.. అమెరికాతో తమ దేశం దౌత్యా నికి సిద్ధమే కానీ, చర్చలకు మాత్రం కాదన్నారు. తమ సైనిక జనరల్ సులేమానీని చంపడం అమెరికా చేసిన క్షమించరాని తప్పిదమని వ్యాఖ్యానించారు. ఇరాన్ మంత్రి జరీఫ్ అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ‘రైజినా డైలాగ్’లో విదేశాంగ మంత్రి జై శంకర్ -
పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు
ఐక్యరాజ్యసమితి : కశ్మీర్ విషయంలో అడుగడుగునా దెబ్బతిన్న పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో తెవనెత్తేందుకు చేసిన విఫల ప్రయత్నం బెడిసికొట్టింది. కశ్మీర్ అంశం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశంమని ఐరాస స్పష్టం చేసింది. పాక్ కుయుక్తులపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. కుట్రలను పక్కనబెట్టి.. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుపర్చే అంశంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ఓ అఫ్రికన్ దేశానికి సంబంధించి ఐక్యరాజ్య భద్రతా మండలి బుధవారం రహస్య సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి హాజరైనా చైనా.. కశ్మీర్ అంశాన్ని కూడా చర్చించాలని ప్రతిపాదించింది. దీనికి మిగతా సభ్య దేశాలు అంగీకరించలేదు. కశ్మీర్ అంశం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పింది. పాక్‌కు మద్దతుగా చైనా తప్ప మరే ఇతర దేశాలు అండగా లేకపోవడం గమనార్హం. పాకిస్తాన్ కుయుక్తులు ఐక్యరాజ్య సమితిలో చెల్లవని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్ధీన్ అన్నారు. పాక్ నిరాధార ఆరోపణలు చేస్తూ ఐరాసను తప్పదోవ పట్టిస్తుందన్న విషయం నేటితో తేలిపోయిందన్నారు. ఈ అనుభవంతో ఇప్పటికైనా ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై పాక్ దృష్టి పెట్టాలని సూచించారు. -
కశ్మీర్‌పై ఐరాసలో రహస్య చర్చలు
ఐక్యరాజ్య సమితి: జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని భారత్ తొలగించిన అంశంపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి శుక్రవారం రహస్య చర్చలు జరిపింది. పాకిస్తాన్ కోసం దాని మిత్రదేశం చైనా విజ్ఞప్తి మేరకు ఈ రహస్య చర్చలు జరిగాయి. అయితే ఇవి రహస్య చర్చలైనందున లోపల ఏ దేశం ఏం మాట్లాడిందనే విషయం బయటకు రాలేదు. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత, పది తాత్కాలిక (మొత్తం 15) సభ్య దేశాలే ఈ చర్చల్లో పాల్గొంటున్నాయి. భారత్, పాక్‌లకు భద్రతా మండలిలో ఎలాంటి సభ్యత్వమూ లేనందున ఈ రెండు దేశాలు ఆ రహస్య చర్చల్లో పాల్గొన లేదు. తమ ప్రతినిధికి కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ అభ్యర్థించినా భద్రతా మండలి అందుకు ఒప్పుకోలేదు. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లతోపాటు తాత్కాలిక సభ్యదేశాలైన జర్మనీ, బెల్జియం, కువైట్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, పోలాండ్, పెరూ, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెటోరియల్ గినియా, కోట్ డీఐవరీలు రహస్య చర్చల్లో పాల్గొన్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం పూర్తిగా తమ అంతర్గత అంశమని భారత్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు స్పష్టం చేయగా, పాక్ మాత్రం ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తి వివాదాస్పదం చేస్తోంది. శాంతంగా పరిష్కరించుకోవాలి: రష్యా, చైనా చర్చల్లో పాల్గొనడానికి ముందు ఐరాసలో రష్యా ఉప శాశ్వత ప్రతినిధి దిమిత్రీ పోల్యాంస్కీ మాట్లాడుతూ కశ్మీర్ అంశం భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక అంశంగానే రష్యా చూస్తోందని అన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే ప్రస్తుతం ఈ రహస్య చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. రహస్య చర్చలు ముగిసిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో చైనా రాయబారి ఝాంగ్ జున్ మాట్లాడుతూ భారత్, పాక్‌లు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పద్ధతిని మానుకోవాలని సూచించారు. లదాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంపై ఆయన స్పందిస్తూ, భారత చర్యలు చైనా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేలా ఉన్నాయనీ, సరిహద్దులపై ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించడం పట్ల చైనా కూడా ఆందోళనతో ఉందని అన్నారు. ఉగ్రవాదం ఆపితేనే చర్చలు: భారత్ ఉగ్రవాద చర్యలు, కార్యకలాపాలను పాకిస్తాన్ ఆపిన తర్వాతే ఆ దేశంతో చర్చలు జరుపుతామని ఐరాసలో భారత ప్రతినిధి అక్బరుద్దీన్ అన్నారు. రహస్య చర్చలు ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో భారత్ చెప్పినట్లుగానే కశ్మీర్లో 370వ అధికరణం రద్దు అంశం భారత అంతర్గత వ్యవహారమన్నారు. ఇతర దేశాలకు దీనితో పనిలేదన్నారు. పాక్‌పై ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ, కశ్మీర్లో ఏదో జరిగిపోతోందని భయపెట్టేలా పాక్ ప్రవర్తిస్తోందనీ, ఇది వాస్తవ దూరమని అన్నారు. కశ్మీర్ అంశంపై రెండు దేశాలు (పాక్, చైనా) తమ అభిప్రాయాలను అంతర్జాతీయ సమాజం అభిప్రాయంగా మార్చాలనుకున్నాయనీ, కానీ అది జరగలేదని పేర్కొన్నారు. -
నేడు ఐరాస రహస్య చర్చలు
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశాన్ని శుక్రవారం ఉదయం గోప్యంగా నిర్వహించనున్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. చైనా విజ్ఞప్తి మేరకు ఈ విధంగా రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఐరాసలో బహిరంగ చర్చను నిర్వహింపజేయడంలో పాక్ విఫలమైనట్లయింది. భద్రతా మండలికి ప్రస్తుతం రొటేషన్ పద్ధతిలో చీఫ్‌గా ఉన్న పోలండ్ అంశంపై ఉదయం పది గంటలకు చర్చ నిర్వహించేలా లిస్టింగ్ చేసిందని వారు చెప్పారు. కశ్మీర్ అంశంపై భద్రతా మండలి చర్చించడం చాలా అరుదన్నారు.