అనుకున్నదే అయింది
అనుకున్నదే అయింది
Published Fri, Feb 10 2017 6:37 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్ధ అధినేత మసూద్ అజర్‌పై నిషేధంపై చైనా జిత్తులు మారి వేషాలు మానుకోవడం లేదు. అజర్‌పై నిషేధానికి అమెరికా యూఎన్ కౌన్సిల్‌లో ప్రతిపాదన చేయడం ఆ తర్వాత చైనా మరలా ససేమీరా అన్న విషయం తెలిసిందే.
ప్రతిపాదనను ప్రతిసారీ అడ్డుకుంటున్న చైనాపై యూఎన్ కౌన్సిల్ సభ్య దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత్ పావులు కదిపింది. అజర్‌పై నిషేధాన్ని విటోతో అడ్డుకోవడంపై చైనాకు దౌత్యపరంగా వ్యతిరేక గొంతు వినిపించింది. భారత్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా యూఎన్ కౌన్సిల్‌లోని సభ్యులు అందరూ టెర్రరిజం వ్యతిరేకం కార్యక్రమంలో భాగస్వాములేనని చెప్పింది. (చదవండి:అజర్‌కు చైనా రక్ష.. భారత్‌కు లాభం..!)
అందరూ నియమాలను అనుసరిస్తున్నారని ఉద్ఘాటించింది. భారత్ లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. నిషేధానికి కొన్ని సాంకేతిక సమస్యలున్నాయనే పాత మాటనే పదే పదే ప్రస్తావించింది. తాము యూఎన్ నియమాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని పేర్కొంది.
Advertisement