Masood Azhar
-
మసూద్ అజార్ హతం?
ఇస్లామాబాద్: కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి మసూద్ అజార్ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో పాకిస్తాన్‌లోని భావల్పూర్ మసీదు నుంచి వస్తుండగా బాంబు పేలిన ఘటనలో అతడు హతమైనట్లు ధ్రువీకరించని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అనంతరం పాక్ ఆర్మీ దావూద్ ఇబ్రహీం సహా పలువురు ఉగ్రవాదులపై దాడులు చేపట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉండి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తదితర రెండు డజన్ల మంది వరకు ఉగ్రవాదులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2001 పార్లమెంట్‌పై దాడి ఘటనకు సంబంధించిన కేసుల్లో అజార్‌ను భారత్ వాంటెడ్‌గా ప్రకటించింది. 2008లో నేపాల్ నుంచి భారత్‌కు బయలుదేరిన ఇండియన్ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. హైజాకర్ల డిమాండ్ మేరకు జైళ్లలో ఉన్న అజార్ సహా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ ప్రభుత్వం విడిచిపెట్టింది. విమాన ప్రయాణికుల్లో ఒకరిని పొడిచి చంపిన ఉగ్రవాదులు, మరికొందరిని గాయపరిచారు. వారంపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ అనంతరం అందులోని 176 మందిని ఉగ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు. -
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహార్ మృతి?
వరల్డ్ మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది మసూద్ అజహార్(55) మృతి చెందాడా?. ఈ ఉదయం గుర్తు తెలియని దుండగులు జరిపిన బాంబు దాడిలో మసూద్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 1999లో కాందహార్ విమాన హైజాక్ జరిగింది ఇతని విడుదల కోసమే. భారత పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడితో పాటు 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడులకు కారణమైన జేషే మహమ్మద్ సంస్థను స్థాపించింది అజహారే. మహమద్ మసూద్ అజహార్ అల్వీ.. ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ స్థాపకుడు. సోమవారం ఉదయం భవల్పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మసూద్ అజహార్ మృతిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు పాక్‌లో గత కొంతకాలంగా ఉగ్రవాదులు.. ఉగ్ర సంస్థల నేతలు మిస్టరీ పరిస్థితుల్లో మృతి చెందుతున్న సంగతీ తెలిసిందే. BIG BREAKING NEWS - As per unconfirmed reports, Most wanted terrorist, Kandhar hijacker Masood Azhar, has been kiIIIed in a bomb expIosion by UNKNOWN MEN at 5 am 🔥🔥 He was going back from Bhawalpur mosque. UNKNOWN MEN working even on New Year day ⚡ He was the chief of Terror… pic.twitter.com/XG97TMmIE8 — Times Algebra (@TimesAlgebraIND) January 1, 2024 పాక్ పంజాబ్ రాష్ట్రంలో ఓ విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అజహార్.. కశ్మీర్ స్వేచ్ఛ పేరిట ఉగ్ర కార్యకలాపాలకు దిగాడు. బ్రిటన్‌కు జిహదీని పరిచయం చేసింది ఇతనే. భారత్ ఇతన్ని అరెస్ట్ చేస్తే.. ఇతని విడుదల డిమాండ్‌తో ఏకంగా విమానం హైజాక్ చేశారు. కాందహార్ హైజాక్ ఘటనగా భారత్‌కు ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందా ఘటన. జైల్లో ఉన్నప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థలు.. ఇంటర్‌పోల్ సైతం ఇతన్ని గతంలో ప్రశ్నించాయి. 2019, మే 1వ తేదీన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇదీ చదవండి: కాందహార్ హైజాకర్.. ఫర్నీచర్ షాప్ ఓనర్ ముసుగులో ఇంతకాలం! భారత్ పట్టుకుంటే.. 1994లో అజహార్ ఫేక్ ఐడీ మీద శ్రీనగర్‌కు చేరుకున్నాడు. అక్కడ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం చేయాలనుకున్నాడు. అయితే భారత భద్రత బలగాలు ఫిబ్రవరిలో అనంతనాగ్ జిల్లా ఖానాబల్ దగ్గర అజహార్‌ను అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు అతన్ని బయటకు రప్పించే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. చివరకు.. 1999 డిసెంబర్లో మసూద్ అజహార్ సానుభూతి పరులు ఇండియన్‌ఎయిర్‌లైన్స్ విమానం 814ను హైజాక్ చేసి కాందహార్‌కు తరలించారు. ఆ సమయంలో కాందహార్ పాక్ ఐఎస్ఐ మద్దతుతో తాలిబన్ల ఆధీనంలో ఉండేది. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారానికి అజహార్ సోదరుడు అబ్ధుల్ రౌఫ్ అజహార్ నేతృత్వం వహించాడు. విమాన ప్రయాణికుల విడుదల కోసం జరిపిన దౌత్య పరమైన చర్చలు విఫలం కావడంతో.. అప్పటి భారత ప్రభుత్వం అజహార్‌ను విడుదల చేయాల్సి వచ్చింది. కోట్ భల్వాల్ జైలు నంచి అప్పటి పోలీస్ అధికారి శేష్ పాల్ వైద్ నేతృత్వంలో అజహార్ అప్పగింత జరిగింది. ఆ తర్వాత ఐఎస్ఐ సంరక్షణలోనే చాలా కాలం అజహార్ పాక్ అంతటా స్వేచ్ఛగా తిరుగుతూ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాడు. అయితే పాక్ మాత్రం అజహార్ తమ దగ్గర లేడంటూ బుకాయిస్తూ వచ్చింది. హైజాక్ ఇలా.. 1999 డిసెంబర్ 24న సుమారు 180 మంది ప్యాసింజర్లు, 11 మంది బృందంతో వెళ్తున్న IC-814 విమానాన్ని .. ఐదుగురు ఉగ్రవాదులు దారి మళ్లించి హైజాక్ చేశారు. అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా కాందహార్‌కు చేర్చారు. అక్కడ ఆ విమానం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. ఈ హైజాక్ వ్యవహారంలో.. 25 ఏళ్ల భారత ప్రయాణికుడు రూపిన్ కట్యాల్‌ను పొట్టనబెట్టుకున్నారు హైజాకర్లు. చివరికి డిసెంబర్ 31న.. కరడుగట్టిన ఉగ్రవాది అజహార్‌ను భారత్ విడుదల చేయడంతో.. మిగతా ప్రయాణికులను అప్పగించారు. -
మసూద్‌పై చర్యలుంటాయా? పాక్ ప్రధాని రియాక్షన్ ఏంటంటే..
సమర్ఖండ్: పాకిస్తాన్ బుద్ధి మరోసారి.. అదీ అంతర్జాతీయ వేదికగా బయటపడింది. గ్లోబల్ టెర్రరిస్ట్, జైషే ముహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సుకు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ హాజరయ్యారు. అయితే.. అంతర్జాతీయ మీడియాతో ముఖాముఖి సందర్భంగా ఆయన్ని ఇరకాటంలో పడేశాడు భారత జర్నలిస్ట్ ఒకరు. భారత్‌కు చెందిన ఓ మీడియా జర్నలిస్ట్.. ‘షరీఫ్ సాబ్.. మసూద్ అజార్ మీద ఒక చిన్నప్రశ్న. అతనికి వ్యతిరేకంగా మీ చర్యలు ఉంటాయా?’ అని ప్రశ్నించారు. అయితే.. దానికి సమాధానం ఇవ్వకుండా పక్కనే ఉన్న తన ప్రతినిధితో మాట్లాడుకుంటూ ముందుకెళ్లారు. అయితే అక్కడే ఉన్న ఆయన సిబ్బంది సదరు జర్నలిస్ట్‌ను మళ్లీ ఆ ప్రశ్న అడగకుండా నిలువరించే యత్నం చేశారు. ఇకచాలూ.. దయచేసి ఆపండి అంటూ సిబ్బందిలోని ఓ వ్యక్తి సదరు జర్నలిస్ట్‌కు సూచించారు కూడా. ఇదిలా ఉంటే.. భారత్ సహా పలుదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన జైషే ముహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఐక్యరాజ్య సమితి గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించింది. అయితే.. ఈమధ్యే మసూద్ అఫ్గన్‌లో ఉన్నాడంటూ పాక్ ఆరోపించగా.. అలాంటి ఉగ్రసంస్థలను ఆదరించే ఘనత కేవలం పాక్‌కే ఉంటుందంటూ తాలిబన్లు సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: మళ్లీ అక్కడ శవాల దిబ్బలే దర్శనమిస్తున్నాయి -
మా గడ్డ మీలాగా కాదు.. పాక్‌కు తాలిబన్ల కౌంటర్
కాబూల్: అఫ్గనిస్థాన్‌లోని అనధికారిక తాలిబన్ల ప్రభుత్వం.. పొరుగు దేశం పాకిస్తాన్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. జైష్ - ఇ - మహ్మద్ చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది అయిన మసూద్ అజర్, అఫ్గనిస్తాలో తలదాచుకున్నాడంటూ పాక్ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టింది. అలాంటి ఉగ్రసంస్థలకు పాక్ గడ్డే అడ్డాగా ఉంటుందని, చివరకు అలాంటి సంస్థలను అక్కడి ప్రభుత్వమే పెంచి పోషిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వ(తాత్కాలిక) అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తీవ్రంగా స్పందించారు. అఫ్గన్ నంగార్హర్ ప్రావిన్స్‌లో మౌలానా మసూద్ అజర్ తలదాచుకున్నాడని, అతనిని గుర్తించి.. అరెస్ట్ చేసి ఇస్లామాబాద్‌కు అప్పగించాలని ఇప్పటికే అఫ్గన్‌ను ఓ లేఖ రాసినట్లు పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పాక్ మీడియా హౌజ్‌లు కొన్ని ఆ కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. ‘‘అలాంటి లేఖ ఏం మా ప్రభుత్వానికి అందలేదు. అసలు జైషే చీఫ్ మా దేశంలోనే లేడు. అఫ్గన్ భూభాగాన్ని.. మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి మేము ఎవరినీ అనుమతించబోం. అలాంటిది వాళ్లకు(పాక్‌ను ఉద్దేశించి) మాత్రమే సాధ్యం’’ అంటూ జబీహుల్లా ముజాయిద్ పేర్కొన్నారు. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదంటూ అఫ్గన్ విదేశీ వ్యవహారాల శాఖ పాక్‌ను ఉద్దేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాశ్చాత్య దేశాలకు చెందిన పర్యాటకులను కిడ్నాప్ చేసిన నేరానికి భారత్‌లో శిక్ష అనుభవించాడు అజర్. అయితే.. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఐసీ-814 హైజాక్ వ్యవహారంలో ప్రయాణికుల కోసం భారత్ అతన్ని విడుదల చేయాల్సి వచ్చింది. బయటకు వచ్చాక జైష్ ఈ మొహమద్‌ను నెలకొల్పి.. భారత్‌లో ఎన్నో ఉగ్రవాద దాడులను నిర్వహించాడు. దీంతో పాక్ ఆ సంస్థను నిషేధించింది. మే 2019లో ఐరాస అతన్ని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. పుల్వామా దాడికి ప్రధాన సూత్రధారి కూడా ఈ మసూదే. ఇదీ చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి యాక్సిడెంట్! -
తాలిబన్లతో జైషే మహ్మద్ చీఫ్ భేటీ, జమ్మూలో హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అఫ్గానిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో జమ్మూలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా సంస్థలు హెచ్చరికలతో హైఅలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్, కాందహార్‌లో తాలిబన్ల పొలిటికల్ కమిషన్ హెడ్ ముల్లా అబ్దుల్ ఘని బరాదర్, ఇతర నాయకులతతోనూ భేటీ అయిన నేపథ్యంలో ఈ అలర్ట్ జారీ అయింది. అంతేకాదు అన్ని రాష్ట్రాలు భద్రతా చర్యలు చేపట్టాలని తీవ్రవాద వ్యతిరేక విభాగాలను కూడా అప్రమత్తం చేయాలని నిఘా అధికారులు హెచ్చరించారు. జమ్మూ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలపై లభించిన సమాచారం ఆధారంగా నిఘా సంస్థలు అధికారులను అప్రమత్తం చేశాయి. ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు ఎదురైతే, సమర్ధవంతంగా తిప్పికొట్టేలా ఈ సమాచారాన్ని రాష్ట్ర నిఘా, భద్రతా సంస్థలతో పంచుకున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. సోషల్ మీడియాలో నిఘా ఉంచాలని కూడా ఆదేశించినట్టు ప్రకటించారు. ఆగస్టు మూడో వారంలో కందహార్లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మహ్మద్ (జేఈఎం) నాయకులు, తాలిబాన్ నాయకుల సమావేశ మైనట్టు తమ దృష్టికి వచ్చిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇండియాలో ఉగ్ర కార్యకలాపాలకు జేఈఎం తాలిబన్ మద్దతుకోరిందనీ, పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించాయి. కాగా అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాతనుంచీ వేలాది మంది వేలాదిమంది దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో అనేక హృదయవిదాకరదృశ్యాలు ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టాయి. ఈ క్రమంలో గురువారం కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి సంచలనం రేపింది. మరోవైపు ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పుల్వామా దాడులు.. చార్జిషీట్ దాఖలు
న్యూఢిల్లీ: దేశ ప్రజలను తీవ్ర విచారంలోకి నెట్టడమే కాక పాక్, ఇండియా మధ్య యుద్ధ పరిస్థితులకు దారి తీసిన పుల్వామా దాడి కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. జైషే మహ్మద్ చీఫ్, ఉగ్రవాది మసూద్ అజర్‌తో పాటు అతడి సోదరుడు రౌఫ్ అస్గర్ పేరును ఎన్ఐఏ ఈ చార్జిషీట్లో చేర్చింది. పుల్వామా దాడికి వీరిద్దరే ప్రధాన సూత్రధారులని ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. 5,000 పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను ఎన్ఐఏ జమ్మూ కోర్టులో సమర్పించనుంది. ఈ దారుణమైన ఉగ్రదాడులకు ఎలాంటి ప్రణాళిక రచించారు.. పాక్ నుంచి ఎలా అమలు చేశారనే దాని గురించి అధికారులు చార్జిషీట్లో పూర్తిగా వివరించారు. అంతేకాకుండా జైషే మహ్మద్‌కు చెందిన 20 మంది ఉగ్రవాదులు ఈ దాడికి అవసరమైన ఆయుధాలను సమకూర్చారని ఛార్జిషీట్లో తెలిపారు. వీటన్నింటికీ అవసరమైన పూర్తి ఆధారాలను కూడా ఎన్ఐఏ బృందం కోర్టుకు సమర్పించనుంది. వాట్సాప్ చాటింగ్, ఫొటోలు, ఆర్డీఎక్స్ రవాణాకు సంబంధించిన ఫొటోలు, ఫోన్ కాల్స్ డేటా... ఇలా కీలక ఆధారాలను ఎన్ఐఏ అధికారులు కోర్టుకు నివేదించనున్నారు. (చదవండి: మళ్లీ ‘పూల్వామా’ దాడి జరిగితేనే బీజేపీ గెలుపు!) భారత్ కశ్మీర్‌ను ఆక్రమించుకున్నందనే పాక్ ఈ దాడులకు తెగబడిందని ఎన్ఐఏ తెలిపింది. భారత్‌పై దాడికి పాక్, స్థానికుడు ఆదిల్ అహ్మద్ దార్‌ను ఉపయోగించింది. అతడు సూసైడ్ బాంబర్‌గా మరి సీఆర్పీఎఫ్ దళాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్ మీదకు పేలుడు పదార్థాలతో నిండిని కారును దూకించాడని అధికారులు తెలిపారు. ఇక పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశం పాత్రను ఖండించిన సంగతి తెలిసిందే. భారతదేశం సాక్ష్యాలు ఇస్తే నేరస్థులను విచారిస్తామని కూడా తెలిపారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. పైగా అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికి పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
‘మసూద్ పాక్ జైలులో మగ్గలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్ జైలులో మగ్గుతున్నాడనే వార్తలను భారత అధికారులు తోసిపుచ్చారు. పాకిస్తాన్‌లోని ఏ జైలులోనూ మసూద్ అజర్ ఎన్నడూ లేడని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మసూద్ ప్రస్తుతం అజ్ఞాతంలో గడుపుతున్నాడని, ఆయన చివరిసారి బహవల్పూర్లోని జైషే మహ్మద్ హెడ్‌క్వార్టర్స్ మర్కజ్ సుభానల్లాకు వచ్చాడని ఆ వర్గాలు తెలిపాయి. మసూద్ ఆరోగ్యం సైతం మెరుగుపడిందని, అయితే ఆయన జనబాహుళ్యంలోకి రావడం లేదని పేర్కొన్నాయి. ఈ ఏడాది మేలో మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. కాగా భారత్‌ను రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా పాకిస్తాన్ వాస్తవాధీన రేఖ వెంబడి సాయుధ దళాలను మోహరించిన క్రమంలో మసూద్ కదలికలపై సమాచారం బహిర్గతం కావడం గమనార్హం. మరోవైపు జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను మోదీ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో భారత్‌లో భారీ ఉగ్రదాడికి ఐఎస్ఐ సహకారంతో ఉగ్ర మూకలు స్కెచ్ వేస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. -
భారత్‌కు తోడుగా ఉంటాం: అమెరికా
వాషింగ్టన్ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా ప్రకటించిన భారత ప్రభుత్వ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా సమర్థించింది. ఉగ్రవాదాన్ని రూపుమాపడంలో భారత్‌కు అమెరికా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు...‘ నలుగురు ఉగ్రవాదులు మౌలానా మసూత్ అజర్, హఫీజ్ సయీద్, జకీ ఉర్ రెహ్మాన్, దావూద్ ఇబ్రహీంలను ఉగ్రవాదులుగా గుర్తిస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతున్నాం. భారత్- అమెరికా కలిసి ఉగ్రవాదులను ఏరివేయడానికి ఈ కొత్త చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని అమెరికా దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాల బ్యూరో ట్వీట్ చేసింది. కాగా చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)-1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నెలలోపే.. దావూద్, మసూద్, సయీద్, లఖ్వీలను కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు భారత కేంద్ర హోంశాఖ వెల్లడించిన విషయం విదితమే. ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఇక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇప్పటికే ఈ నలుగురిపై అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మౌలానా మసూద్ అజార్ (జైషే మహమ్మద్ చీఫ్): ప్రమేయం ఉన్న దాడులు 2001లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై దాడులు 2001లో పార్లమెంటుపై దాడి 2016లో పఠాన్‌కోట వైమానిక స్థావరంపై దాడి 2017లో శ్రీనగర్‌లో సరిహద్దు భద్రతా శిబిరంపై దాడి ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణించే బస్సుపై దాడి హఫీజ్ మహమ్మద్ సయీద్ (లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు) : ప్రమేయం ఉన్న దాడులు 2000 సంవత్సరంలో ఎర్రకోట సహా వివిధ ప్రాంతాల్లో దాడులు అదే ఏడాది యూపీలో రాం పూర్లో సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి భారత్‌పై జరిగిన దాడుల్లో అత్యంత హేయమైనది 2008 ముంబై దాడులు 2015లో కశ్మీర్ ఉధంపూర్‌లో సరిహద్దు భద్రతా దళం కాన్వాయ్‌పై దాడి జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (లష్కరే తోయిబా కమాండర్): ప్రమేయం ఉన్న దాడులు 2000లో ఎర్రకోటపై దాడి 2008 ముంబై దాడులు రాంపూర్ సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడులు జమ్మూ కశ్మీర్ ఉధంపూర్‌లో సరిహద్దు భద్రతా దళంపై దాడులు లఖ్వీని ఐక్యరాజ్యసమితి 2008లో అంతర్జాతీయ ఉగ్రవాది ప్రకటించింది దావూద్ ఇబ్రహీం(అండర్ వరల్డ్ డాన్ ) పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్‌పై దాడులకి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నాడు. ఆర్థిక సాయాన్ని అందించాడు తన అనుచరులతో కలిసి దాడులకు వ్యూహరచన చేశాడు. అల్‌ఖైదా, తాలిబన్ల కార్యకలాపాలకు మద్దతుగా ఉన్నాడు. 257 మంది నిండు ప్రాణాలను పొట్టనపెట్టుకున్న 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు దావూద్ అనుచరుల పనే. We stand w/ #India & commend it for utilizing new legal authorities to designate 4 notorious terrorists: Maulana Masood Azhar, Hafiz Saeed, Zaki-ur-Rehman Lakhvi & Dawood Ibrahim. This new law expands possibilities for joint #USIndia efforts to combat scourge of terrorism. AGW — State_SCA (@State_SCA) September 4, 2019 -
ఆ నలుగురు
న్యూఢిల్లీ: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)–1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన ఒక నెలలోనే ఈ నలుగురిని కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఈ చట్టం కింద ఉగ్రవాదుల్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వీరిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. -
‘యాత్ర’కు బ్రేక్? ఏమిటా నిఘా సమాచారం!
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అనూహ్యంగా జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను నిలిపేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌కు భారీగా బలగాలనూ తరలించింది. ఒక్కసారిగా లోయలో భయాందోళన రేకెత్తించిన ఈ పరిణామాల వెనుక.. నిఘా వర్గాలు అందించిన కచ్చితమైన సమాచారమే కారణమని తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు ఎలాంటి అవాంఛనీయ దాడులకు పాల్పడకుండా.. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని, సోపూర్ ప్రాంతంలో ఐఈడీ (ఇంప్రూవైస్డ్ పేలుడు పదార్థాల)లతో భద్రతా బలగాలను జైషే మహమ్మద్ (జేఈఎం) తదితర ఉగ్రమూకలు టార్గెట్ చేయవచ్చునన్న నిఘా వర్గాల సమాచారమే ఈ ఆకస్మిక పరిణామాలకు కారణమని ఈ వ్యవహారంతో పరిచయం కలిగిన ఇద్దరు విశ్వసనీయ వ్యక్తులు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. ఏమిటా నిఘా సమాచారం! జేఈఎం చీఫ్ మసూద్ అజార్ సోదరుడు ఇబ్రహీం అజార్ గత నెలలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో కనిపించాడని జాతీయ భద్రతా సంస్థలకు కచ్చితమైన నిఘా సమాచారం అందింది. 1999 నాటి భారత్ విమానం హైజాక్ ప్రధాన సూత్రధారి అయిన ఇబ్రహీం అజార్ తన కొడుకు మృతికి ప్రతీకారంగా లోయలోకి చొరబడి.. ఇక్కడ భద్రతా దళాలపై జరిపే ఉగ్రదాడులకు నేతృత్వం వహించాలని కోరుకుంటున్నాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇబ్రహీం అజార్ నేతృత్వంలో సుశిక్షితులైన జేఈఎం ఉగ్రవాదులు బార్డర్ యాక్షన్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి.. సరిహద్దు నియంత్రణ రేఖ మీదుగా ఉన్న పాక్ ఆర్మీ పోస్టుల దిశగా కదిలాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇబ్రహీం కొడుకు ఉస్మాన్ హైదర్ గత ఏడాది అక్టోబర్‌లో కశ్మీర్లోకి చొరబడి.. అదే నెల 30వ తేదీన పుల్వామాలోని అవంతీపురలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మరో బంధువు, మసూద్ అజార్ బావమరిది అబ్దుల్ రషీద్ కొడుకు తహ్లా రషీద్ 2017 నవంబర్ 6న పుల్వామా కండి అల్గార్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోతున్న ఇబ్రహీం.. తన కొడుకు తరహాలోనే భారత బలగాలపై పోరాడుతూ చనిపోతానని జేఈఎం కేడర్‌కు చెప్పాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఇబ్రహీం అజార్ కశ్మీర్లో పెద్ద ఎత్తున దాడులకు గ్రౌండ్‌వర్క్ చేయడంపై కచ్చితమైన సమాచారం అందడంతో కేంద్రం వెంటనే అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుందని ఓ సీనియర్ భదత్రాధికారి వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన జేఈఎం, లష్కరే తోయిబా తమ ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయడాన్ని నిఘా వర్గాలు ఇప్పటికే పసిగట్టాయి. అంతేకాకుండా అమర్నాథ్ యాత్ర మార్గంలో ఎం24 స్నిపర్ రైఫిల్, భద్రతా దళాలు లక్ష్యంగా అమర్చిన మందుపాతరలు దొరకడంతో పొంచి ఉన్న ముప్పును గ్రహించిన కేంద్రం వెంటనే అమర్నాథ్ యాత్రను నిలిపివేసిందని, దీంతో యాత్రకు రక్షణగా ఉన్న బలగాలు తిరిగి ఉగ్రమూకల ఏరివేత ఆపరేషన్‌కు సన్నద్ధమవుతాయని ఆ అధికారి తెలిపారు. కశ్మీర్లో హింసాత్మక దాడులే లక్ష్యంగా పాక్ సాయుధ మూకలు లోయలోకి పెద్ద ఎత్తున చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయని, కశ్మీర్లో పలుచోట్ల ఆత్మాహుతి దాడులు నిర్వహించాలని అవి తలపోస్తున్నాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. పెషావర్ నుంచి సుశిక్షితులైన జేఈఎం సాయుధ మూక కశ్మీర్లోకి చొరబడి.. భారత బలగాలపై మెరుపుదాడులు నిర్వహించాలని, ఉత్తర కశ్మీర్‌లోని సోపూర్లో ఐఈడీలతో భద్రతా దళాలను టార్గెట్ చేయాలని పథకాన్ని రచించినట్టు పేర్కొన్నాయి. పాక్ సైన్యంతోపాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రసంస్థలు కూడా ఈ దాడుల విషయంలో ఆ మూకలకు సహకారం, సమన్వయం అందించనున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. -
జైషే చీఫ్ మసూద్ అజర్‌కు ఏమైంది.?
న్యూఢిల్లీ : రావల్పిండి ఆస్పత్రిలో సోమవారం జరిగిన పేలుళ్లలో గాయపడిన పదిమందిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఉన్నట్టు భావిస్తున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మసూద్ అజర్ ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై పాకిస్తాన్ పెదవివిప్పడం లేదు. మరోవైపు భారత నిఘా సంస్ధలు సైతం ఈ విషయాన్ని ఇంతవరకూ ధ్రువీకరించలేదు. కాగా, ఓ స్ధానిక చానెల్ రావల్పిండి ఆస్పత్రిలో జరిగిన పేలుడులో అజర్ సహా పది మంది గాయపడ్డారని వెల్లడించడం గమనార్హం. పాకిస్తాన్ సైన్యం నిర్వహించే ఈ ఆస్పత్రికి అజర్ తరచూ డయాలసిస్ చేయించుకునేందుకు వెళతారని చెబుతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో జరిగిన భారీ పేలుడులో గాయపడిన వారిని ఎమర్జెన్సీకి తరలించారని ట్విటర్ యూజర్ అషన్ ఉలా మియాఖల్ పోస్ట్ చేశారు. -
మసూద్ ఆస్తుల ఫ్రీజ్
ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపజేయడంతోపాటు ఆయనపై ప్రయాణ నిషేధాన్ని పాక్ విధించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన మసూద్ ఇకపై ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కొనడం, అమ్మడం వంటివి చేయడానికి వీలు లేదు. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్ఈసీపీ) గురువారం పాకిస్తాన్‌లోని అన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఆదేశాలిస్తూ, మసూద్‌కు చెందిన అన్ని పెట్టుబడుల ఖాతాలను స్తంభింపజేయాలంది. పోలీసుల అనుమతి లేకుండా మసూద్ ఎక్కడికీ ప్రయాణిచడానికి కూడా వీలు లేదని పాక్ హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. కాగా, పుల్వామా ఉగ్రవాద దాడ అనంతరమే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. -
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఉగ్రవాదిగా ప్రకటన
-
మసూద్ వ్యవహారం మా ఘనతే : జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ను ప్రశంసించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రధాని మోదీ అవిశ్రాంత కృషి, ఉగ్రవాదంపై రాజీలేని పోరుతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌లో భారత వైమానిక దాడుల వంటి పరిణామాల అనంతరం చైనా వైఖరిలో వచ్చిన మార్పులు కూడా సానుకూల ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. మసూద్ అజర్ వ్యవహారంలో విపక్షాల తీరును జైట్లీ తప్పుపట్టారు. దేశం విజయం సాధిస్తే అది భారతీయులందరి విజయంగా పరిగణించాలని అన్నారు. ఇది భారతీయులందరూ గర్వించదగిన పరిణామం అయితే, విపక్షంలో కొందరు ఈ దౌత్యవిజయంలో పాలుపంచుకుంటే రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటామని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. -
ఇమ్రాన్ ఖాన్ మోదీ ఫ్రెండేగా..ఏం లాభం?
భోపాల్ : పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. విషయంలో ఎన్నో ఏళ్లుగా మోకాలడ్డుతున్న చైనా.. అగ్రదేశాల ఒత్తిడులకు ఎట్టకేలకు తలొగ్గక తప్పలేదు. దీంతో భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. ఫలితంగా, అజార్ ఆస్తులను స్తంభింపజేసేందుకు, అతడి ప్రయాణంపై నిషేధం విధించేందుకు, ఆయుధాలు సమకూర్చుకునే వీలు లేకుండా చేసేందుకు ఐరాసకు సత్వరం వీలు కలిగింది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్నేహితుడిగా ఉన్నంతకాలం ఐరాస నిషేధం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని ఆయన ప్రశ్నించారు. చదవండి : అజహర్ అంతర్జాతీయ ఉగ్రవాదే భోపాల్‌లో ఓ కార్యక్రమంలో డిగ్గీరాజా మాట్లాడుతూ... ‘ పాక్ ప్రధాని ఇమ్రాన్ మోదీజీతో స్నేహం కోసం పాకులాడుతున్నారు. ఇలాంటి సమయంలో మసూద్ అజహర్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది. దావూద్ ఇబ్రహీం, మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులను వెంటనే భారత్‌కు అప్పగించాలని భారత్ డిమాండ్ చేయాలి. అదొక్కటే సరైన మార్గం అని వ్యాఖ్యానించారు. ఇక మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించటాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. యూపీఏ హయాంలో లష్కర్ ఏ తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తలపై రివార్డు ప్రకటించినట్లుగా.. అజహర్ తలపై కూడా భారీ రివార్డు ప్రకటించాలని డిమాండ్ చేసింది. కాగా కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళం కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాది చేసిన దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయడం, ఈ క్రమంలో భారత పైలట్ పాక్ ఆర్మీకి చిక్కడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఉగ్రదాడులకు కారణమైన మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అగ్ర దేశాలను కోరిన భారత్.. చివరకు బుధవారం దౌత్యపరంగా పెద్ద విజయం సాధించింది. -
ఫలించిన దౌత్యం.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్
న్యూయార్క్ : దశాబ్ధ కాలంగా భారత్ చేస్తోన్న ప్రయత్నం నేటితో ఫలించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం మసూద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ పదే పదే ఐక్యరాజ్యసమితిని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి భారత్‌దే పైచేయి అయింది. మసూద్‌ని బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు భారత అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ‘అందరికీ శుభవార్త.. మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ విషయంలో అందరి సహకారం చాలా గొప్పది. అందరికీ ధన్యవాదాలు’ అని అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. Big,small, all join together. Masood Azhar designated as a terrorist in @UN Sanctions list Grateful to all for their support. 🙏🏽#Zerotolerance4Terrorism — Syed Akbaruddin (@AkbaruddinIndia) May 1, 2019 -
‘పుల్వామా దాడితో మసూద్‌కు సంబంధం లేదంటేనే’
ఇస్లామాబాద్ : ఉగ్రవాది మసూద్ అజహర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలంటూ భారత్.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాక కొన్ని రోజుల క్రితం బ్రిటన్ కూడా త్వరలోనే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తామని.. పాక్‌లోని ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో జైషే పాత్ర లేదని భారత్ ఒప్పుకుంటేనే.. మసూద్ అజహర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే అంశంపై చర్చిస్తామంటూ సదరు మంత్రి షరతులు విధించడం గమనార్హం. పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి మహ్మద్ ఫైజల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్రదాడిలో మసూద్ అజహర్ పాత్ర ఉన్నట్లు భారత్ దగ్గర ఏమైనా రుజువులున్నాయా. ఉంటే వాటిని ప్రపంచానికి చూపించాలి. ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకపోతే.. లేవని ఒప్పుకోవాలి. భారత్ అలా చేస్తేనే మసూద్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టే విషయం గురించి చర్చిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక ‘పుల్వామా దాడి అనేది ప్రత్యేక అంశం. దీన్ని.. మసూద్ అజహర్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. కానీ ఈ విషయంలో భారత్ తీరు ఏం బాగోలేదు. కశ్మీర్లో దేశీయ తిరుగబాటును అణచివేయడానికి భారత్ చేసే ప్రయత్నాల్లో ఈ ప్రచారం ఓ భాగమే. దీని గురించి మేం ఎంత చెప్పినా ఎవరూ నమ్మడం లేద’ని ఫైజల్ పేర్కొన్నాడు. ఓవైపు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెస్తుండగా.. చైనా మాత్రం అందుకు అడ్డుతగులుతున్న సంగతి తెలిసిందే. -
నేను బతికే ఉన్నా.. మరేం పర్లేదు!
ఇస్లామాబాద్ : ‘నేను బతికే ఉన్నాను... పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. మరేం పర్లేదు. మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో పోలిస్తే నేను చాలా ఫిట్‌గా ఉన్నా. నాతో ఆయన ఏ ఆట ఆడతానన్నా సరే సిద్ధంగా ఉన్నా. సవాల్ విసురుతున్నా’ అంటూ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ తన పత్రికలో పేర్కొన్నాడు. మసూద్ మరణించాడంటూ ఇటీవల సోషల్ మీడియా, పాక్ మీడియాలలో వార్తలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైషే మహ్మద్ అధికార పత్రిక ఆల్-కలాంలో సాది అనే కలం పేరిట కథనం రాసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథనం ప్రకారం... తన గురించి వస్తున్న వదంతులను నమ్మవద్దని మసూద్ పేర్కొన్నాడు. పుల్వామా దాడిని జైషే సాధించిన గొప్ప విజయంగా అతడు అభివర్ణించాడు. దాడికి పాల్పడి 40 మందికి పైగా భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్‌ను ప్రశంసిస్తూ.. ‘కశ్మీర్లో ఆదిల్ ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. తను రగిల్చిన మంట ఇప్పట్లో చల్లారే ప్రసక్తే లేదు’ అంటూ ద్వేషపూరిత కథనంలో పేర్కొన్నాడు. అదే విధంగా ఆఫ్గనిస్తాన్ ప్రజల పరిస్థితిపై కూడా మసూద్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇందుకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.(ఇంతకు మసూద్ ఎవరు? ఎక్కడ పుట్టాడు?) కాగా కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆత్మాహుతికి పాల్పడి ఆదిల్ అనే ఉగ్రవాది భారత జవాన్ల కాన్వాయ్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత వైమానిక దళం బాలాకోట్‌లోని జైషే స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాదాన్ని విడనాడాలంటూ భారత్‌తో పాటు అగ్ర దేశాలన్నీ హెచ్చరిస్తున్నా పాక్ తీరు మార్చుకోవడం లేదు. తమ దేశంలో ఆశ్రయం పొందుతున్న మసూద్ అజహర్‌ను మాత్రం భారత్‌కు అప్పగించడం లేదు. మరోవైపు... జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న భారత్‌కు ఆ దిశగా భారీ ఊరట లభించింది. మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపచేస్తామని శుక్రవారం ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ దిశగా ఫ్రాన్స్ దేశీయ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్ అజర్ పేరును ఐరోపా యూనియన్ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. -
బెడిసికొడుతున్న మన దౌత్యం
జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ యూఎన్ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. చైనా ప్రభుత్వ నియంత్రణలోని మీడియా భారత్‌ను మొరటుగా హెచ్చరించే తరహా వ్యాఖ్యానాలు చేసింది. మరోవైపున చైనా పేరు ప్రస్తావించడానికి కూడా సాహసించకుండానే భారత్ ఆ దేశం పట్ల తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. భవిష్యత్తు పరిణామాలను ముందే అంచనా వేసి వ్యవహరించడంలో చైనా ముందంజలో ఉండగా, వరుస తప్పిదాలతో మోదీ ప్రభుత్వం వెనుకబడిపోయింది. మోదీ విదేశీ విధానంలో కొనసాగుతున్న అయిదు తప్పులు భారత్‌కు సరైన దౌత్య ఫలితాలను అందకుండా చేస్తున్నాయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ఉండేదీ, ప్రబలమైనదీ ఏమిటి? భయమా లేక ప్రేమా? ఈ ప్రశ్నకు మీరు మనస్తత్వ నిపుణుడిని సమాధానం అడగాల్సి ఉంది. మరోవైపున రాజకీయ కాలమిస్టు ఏం చేయగలడు కఠిన వాస్తవాలను సేకరించడం తప్ప, కల్పన నుంచి, ప్రచారార్భాటం నుంచి వాటిని వేరుచేయడం తప్ప. వాటి ఆధారంగా ముఖ్యమైన వాదనను ప్రేరేపించడం తప్ప. ఈ వారం ప్రారంభంలో, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని చైనా అడ్డుకోవడం ద్వారా భారత్‌ను తీవ్రంగా చికాకుపెట్టింది. ఐరాస ప్రయత్నాన్ని చైనా నాలుగోసారి అడ్డుకోవడమే కాదు. చైనా ప్రభుత్వ, కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోని మీడియా భారత్‌ను మొరటుగా హెచ్చరించే తరహా వ్యాఖ్యానాలు చేసింది. కమ్యూనిస్టు పార్టీ యాజమాన్యంలోని ‘గ్లోబల్ టైమ్స్’ వ్యాఖ్యాత మరీ మోటుగా భారత్ గురించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహావేశంతో ఉన్న చిత్రాలను చూపిస్తూ నరేంద్రమోదీ ప్రస్తుత పరిస్థితిని తన రాజకీయ ప్రచారానికి వాడుకుం టున్నారని ఆరోపిస్తూ చివరగా ఘోరంగా అవమానిస్తూ ఆ వ్యాఖ్యాత తన వ్యాఖ్యానాన్ని ముగించారు. అదేమిటంటే.. చైనా భారత్ మిత్రురాలే తప్ప దాని జాతీయవాదానికి బందీ కాదు. చైనా ప్రభుత్వం దాని అధికార పార్టీ వాణి ద్వారా తన అభిప్రాయాన్ని ఇలా ప్రకటింపజేస్తూ, తన దృష్టిలో భారత్‌కి, ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న స్థానమేంటో చూపించిందనడంలో సందేహమే లేదు. ఈ వ్యాఖ్యానం ద్వారా చైనా తన ఊహాన్ భేటీ స్ఫూర్తిని పునర్నిర్వచించింది. మీ దేశంలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో మీ భూభాగంలో నా సైనిక దళాలు బైఠాయించనట్లయితే, మన మధ్య ఒప్పందాన్ని నేను గౌరవిస్తాను. ఇతరత్రా సందర్భాల్లో మాత్రం పాత నిబంధనలు వర్తిస్తాయి అన్నదే దీనర్థం. చైనా దురహంకార వైఖరిలో కొట్టొచ్చినట్లుగా రెండు స్పందనలు కనబడుతున్నాయి. అవేమిటంటే వాటి స్వరం, వక్కాణింపులే. మరోవైపున చైనా పేరు ప్రస్తావించడానికి కూడా సాహసించకుండానే భారత్ ‘ఒక దేశం’ పట్ల తన అసంతృప్తిని అలా వ్యక్తపరిచింది. కానీ అమెరికాకు అలాంటి తటాపటాయింపులు ఏమీ లేవు. భారత్ పిరికి ప్రకటన కంటే ఎంతో నిష్కర్షగా, తీవ్రంగా అమెరికన్లు చైనాను పేరెత్తి మరీ విమర్శించారు. భారత్ తన కండపుష్టిని ఇప్పటికీ కోల్పోలేదు. కానీ, ఇప్పుడు అది మరింత జాగ్రత్తగా తన మాటలను, చేతలను ఎంపిక చేసుకుంటోంది. 2019 మార్చి నెలలో అంటే ఎన్నికలకు 2 నెలల ముందు భారత్ తన పట్ల శత్రుపూరితంగా వ్యవహరిస్తున్న చైనా పట్ల అధైర్యంతో వ్యవహరిస్తోంది. అదే సమయంలో ట్రంప్ పాలనలోని స్నేహపూర్వకమైన అమెరికాతో మాత్రం పూర్తి స్వదేశీ వాణిజ్య యుద్ధాన్ని భారత్ ప్రారంభి స్తోంది. మనం చైనా అంటే భయపడుతున్నాం. అదే సమయంలో మన తరఫున మాట్లాడుతున్న దేశంతో పోట్లాడుతున్నాం. మోదీ విదేశీ విధాన సూత్రంలో కొనసాగుతున్న అయిదు తప్పులను మనం ఇక్కడ చూద్దాం. 1. మన వ్యూహాత్మక కూటములను మనం పెద్ద హృదయంతో అభినందించడంలో మన వైఫల్యం: వ్యూహాత్మకంగా ట్రంప్ పాలనలోని అమెరికా మనకు ఎంతో బలిష్టమైన పొత్తుదారు, మిత్రురాలు కూడా. కానీ ట్రంప్‌తో మొదలుకుని అమెరికా పాలనా విభాగంలోని ఉన్నత స్థానాల్లో భారత్ గురించి ఒక అలక్ష్యంలాంటిది ఏర్పడిపోయింది. ట్రంప్‌ను దూకుడు పిల్లాడిగా తోసిపుచ్చడానికి భారత్ తొందరపడుతోంది కానీ అలా ప్రకటించేంత సత్తా మనకుందా? హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్‌పై భారత సుంకాల విషయంలో ట్రంప్ దూకుడు చూసి మీరు నవ్వుకోవచ్చు కానీ స్వదేశంలో వాణిజ్యం విషయంలో భారత్ అమలుచేస్తున్న స్వీయ రక్షణ వైఖరిని ట్రంప్ కూడా తప్పుబడుతున్నారు. దిగుమతి చేసుకుంటున్న ఔషధాలు, వైద్య పరికరాల ధరలను బాగా తగ్గించివేయడం నైతికంగా, రాజకీయపరంగా మంచి నిర్ణయమే. కానీ ఆకస్మికంగా ధరల నియంత్రణ, దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ మీరు ఇలాంటి చర్యలను అమలు చేయగలరా? భారతీయ ఇ–కామర్స్‌లో, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల్లో చైనా పెట్టుబడులను స్వాగతిస్తూనే తమ అమెజాన్, వాల్‌మార్ట్‌లపై యుద్ధం ప్రకటిస్తున్న భారత్.. అమెరికన్లకు ఏ మాత్రం అర్థం కావడం లేదు. పుల్వామా ఘటన తర్వాత అమెరికా భారత్ పక్షాన నిలిచిన తీరు విశ్వసనీయమైనదే కాగా మరోవైపున మోదీ, ట్రంప్ మధ్య సంబంధాలు, వ్యక్తిగత బంధం విషయంలో అవరోధాలున్నాయి. 2017 నవంబర్ నుంచి వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరగడం లేదు.2018 నవంబర్‌లో బ్యూనోస్ ఎయిర్స్లో జీ–20 దేశాల సదస్సు సందర్భంగా ఇరువురి మధ్య భేటీ కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనకు అనుకూలమైన అంశాలను పరిష్కరించకపోతే ట్రంప్ కనీసం ఫోటోలకు, గంభీరమైన ఫోజులకు సమయం వెచ్చించడానికి కూడా ట్రంప్ ఇష్టపడే రకం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్యపరంగా అమెరికాకు కాస్త అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంవల్ల భారత్ కొంపేమీ మునిగిపోదు కదా! అయినా ట్రంప్ ఏమంత పెద్దకోరికలు కోరారనీ. ఆప్ఘనిస్తాన్‌లో అమెరికన్ సైన్యాలు పడుతున్న పాట్లు పడమని మనల్ని ట్రంప్ కోరడం లేదు. అలాగే రష్యన్ తయారీ ఎస్–400 క్షిపణి వ్యవస్థలను భారత్ కోరవద్దని ట్రంప్ ఒత్తిడి చేయడం లేదు. పైగా ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవును మూసివేయవలసిందిగా కూడా తను కోరడం లేదు. కొన్ని రకాల సుంకాలపై, వాణిజ్యంపై కాస్త మినహాయింపులను తాను కోరుకుంటున్నారు. తెలివైన నాయకులు ప్రత్యేకించి మిత్రులతో జరపాల్సి వచ్చిన ఘర్షణలను తెలివిగా ఎంచుకుని పరిష్కరించుకుంటారు. ట్రంప్‌తో స్వదేశీ వాణిజ్య యుద్ధరంగాన్ని ప్రారంభించడం ద్వారా మోదీ పెద్దతప్పు చేశారు. 2. అహంకారపూరితమైన అగ్రరాజ్యాలతో ఏకపక్ష బుజ్జగింపు విధానం పనిచేస్తుందన్న తప్పు లెక్క: ఈ అంశాన్ని ఇలా చూద్దాం. అమెరికాతో 60 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య మిగులును ఆస్వాదిస్తూనే భారత్ మరోవైపున అమెరికాతో వాణిజ్య సంబంధాలను ప్రతిష్టంభనలోకి నెట్టివేసింది. కానీ చైనాతో మనకు 60 బిలియన్ డాలర్ల లోటు వ్యాపారం ఉంటున్నప్పటికీ ఆ దేశానికి పూర్తిగా అనుమతులు ఇచ్చేస్తున్నాం. చైనా సరకులకు, పెట్టుబడులకు విస్తృతంగా మన మార్కెట్లను తెరవడం వెనుక, భారత్ పట్ల చైనా వ్యూహాత్మక విధానాన్ని మెత్తపర్చే ఆలోచన ఉందేమో. కానీ మనమనుకున్నట్లు ఏమీ జరగలేదు. రెండేళ్ల క్రితం చైనీయులు డోక్లామ్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు వాళ్లు పంపిస్తున్న సందేశం కూడా మోటుగానే ఉంటోంది. మీరు ఎన్నికలకు సిద్ధమవుతున్న సందర్భంలో మేము డోక్లామ్ లేక చుమార్ ఘటనలను పునరావృతం కానివ్వకూడదనుంటే థాంక్యూ అనే నోట్‌ను మాకు పంపిం చండి. అమెరికా నుంచి అన్నీ వదులుకోవాలని మోదీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూనే, చైనానుంచి అన్నీ తీసుకో అనే విధానాన్ని చేపడుతోంది. ఒక దేశాన్ని తక్కువగా చూడటం మరోదేశం ముందు భయంతో సాగిలబడటం అనే విధానమే ఇది. 3. వ్యక్తిగతీకరించిన విదేశీ విధానం పట్ల వ్యామోహం: మోదీకి ప్రజాకర్షణ మిన్న. కానీ వృత్తినైపుణ్యంతో కూడిన దౌత్యానికి సన్నద్ధమవడానికి, దాన్ని కొనసాగించడానికి ప్రజాకర్షణ మాత్రమే సరిపోదు. దీనికి అంతర్గత చర్చ, సంప్రదింపుల ద్వారా విధానాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతర నేతల వ్యక్తిగత శైలి, వైఖరులు కూడా వ్యత్యాసంతో ఉంటాయి. మోదీ మంత్రిమండలి కంటే మరింత ప్రతిభావంతంగా పనిచేసే వ్యవస్థను జిన్‌పింగ్ నిర్మించుకున్నారు. మోదీ చైనా అధ్యక్షుడితో తొలిసారి నెరిపిన ప్రేమతో కూడిన భేటీ ప్రయోజనాలు కలిగించలేదని ఇప్పుడు తేలిపోయింది. తర్వాత గ్జియాన్, ఊహాన్ ఇతర చోట్ల కూడా ఇదే కొనసాగింది. మన రిపబ్లిక్ డేకి ట్రంప్‌ను ఆహ్వానించడంలో, నవాజ్ షరీఫ్‌తో విఫల కౌగిలింతలో వేసిన తప్పటడుగులు మనం సరైన హోంవర్క్ చేయలేదని తేల్చేసింది. 4. తప్పు అంచనాలతో మూల్యం: రాజకీయాలు, దౌత్యం, యుద్ధం, క్రీడలు, జూదం అన్నింట్లో సరైన అంచనా చాలా విలువైనది. ఇక్కడే మోదీ తప్పు చేశారు. ఎన్నికలకు ముందుగా మోదీ మరొక దాడికి దిగబోతున్నట్లుగా చైనాకు తెలుసు. పాకిస్తాన్‌పై దాడి చేసి వెనువెంటనే విజయం సాధించామని మోర విరుచుకున్నట్లుగా చైనాతో మోదీ వ్యవహరించలేరని చైనా నేతలకు తెలుసు. సరైన అంచనా వేయడమే చైనీ యులు చేసే మొదటిపని. 5. దేశీయ రాజకీయాలతో విదేశీ విధానాన్ని మిళితం చేయడం: మోదీ స్వదేశంలో ప్రతిష్ట పెంచుకోవడం కోసం తరచుగా తన విదేశీ విధానాన్ని, సదస్సులను ఉపయోగించుకుంటూ ఉంటారు. సరిగ్గా దీన్నే చైనీయులు మొదటగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎన్నికల సీజన్లో మరొక దాడి జరగొచ్చన్న భారతీయ భయాందోళన చైనాకు తెలుసు. అందుకే ఊహాన్‌లో తమనుంచి భారత్‌కు హామీ ఇచ్చారు కానీ తమ ఆంక్షల ప్రకారమే ఇచ్చారు. చైనా వాణిజ్య ఆధిపత్యం పెరుగుతోంది. అరుణాచల్, పాకిస్తాన్ వ్యవహారాల్లో వారి దృక్పథం మరింత కఠినంగా మారింది. కానీ భారత్ మాత్రం చైనా పేరు కూడా ఎత్తడానికి సాహసించకుండా మసూద్ అజర్ విషయంలో నంగినంగిగా నిరసన తెలుపతోంది దీనివల్లే భారత్ ఎక్కడుండాలో అక్కడే చైనా ఉంచగలుగుతుంది. మొత్తంమీద చూస్తే ఇది మోదీ అయిదేళ్ల పాలనపై విదేశీ విధాన సమతుల్యతా పత్రం కాదు. ఇది మోదీ తీవ్ర తప్పిదాలు, వాటి పర్యవసానాల చిట్టా మాత్రమే. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మసూద్ అజర్‌కు మరో షాక్
పారిస్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న భారత్‌కు ఆ దిశగా భారీ ఊరట లభించింది. మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపచేస్తామని శుక్రవారం ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ దిశగా ఫ్రాన్స్ దేశీయాంగ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్ అజర్ పేరును ఐరోపా యూనియన్ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. కాగా మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా ఇప్పటికే కోరుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పాకిస్తాన్‌ను తమ భూభాగంలో జైషే మహ్మద్ సహా ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని పలు ప్రపంచ దేశాలు ఇస్లామాబాద్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జైషే మహ్మద్ పాల్పడిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్లో ఉగ్రశిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేపట్టడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. -
‘చైనా ఉత్పత్తులకు చెక్’
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్ని అడ్డుకుంటున్న చైనాకు అత్యంత ప్రాధాన్య దేశం (ఎంఎఫ్ఎన్) హోదాను ఉపసంహరించాలని ఆరెస్సెస్ ఆర్థిక విభాగం స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. చైనాకు ఎంఎఫ్ఎన్ హోదాను ఉపసంహరించడంతో పాటు చైనా ఉత్పత్తులపై నియంత్రణలు విధించాలని, చైనా దిగుమతులపై సుంకాలను పెంచుతూ తక్షణం చర్యలు చేపట్టాలని ప్రధానికి రాసిన లేఖలో ఎస్జేఎం డిమాండ్ చేసింది. పాకిస్తాన్‌పై భారత్ ఇప్పటికే విధించిన నియంత్రణలను చైనాపైనా అమలు చేయాలని కోరింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న చైనాను కట్టడి చేసేందుకు ఇలాంటి చర్యలు అవసరమని పట్టుబట్టింది. చైనా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు తక్కువగా ఉన్నాయని, చైనా దిగుమతులను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఎస్జేఎం కో కన్వీనర్ అశ్వని మహజన్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరాటానికి భారత్ చైనాపై తీసుకునే చర్యలు ఉపకరిస్తాయని అన్నారు. మరోవైపు చైనా వస్తువులను బహిష్కరించాలని ఆరెస్సెస్ సైతం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. చైనా దిగుమతులపై సుంకాలను పెంచాలని కోరింది. -
అజిత్ దోవల్‌పై ఆరోపణలు తోసిపుచ్చిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను 1999లో భారత్ విడుదల చేయడంలో ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర గురించి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన నేపథ్యంలో మసూద్ అజర్‌ను అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో అజిత్ దోవల్‌కు ఎలాంటి ప్రమేయం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 1999లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో సీనియర్ అధికారిగా ఉన్న అజిత్ దోవల్.. మసూద్ అజర్ విడుదలపై సంప్రదింపులు జరిపేందుకు కాందహార్‌కు వెళ్లిన నలుగురు సభ్యులతో కూడిన కమిటీలో ఒకరు. అజర్ విడుదలను దోవల్ అప్పట్లో వ్యతిరేకించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కాందహార్‌లో విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదుల వెంట అజిత్ దోవల్ ఉన్న ఫోటోలను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్ ఈ దాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయాయని, వారిని హత్య చేసిన మసూద్ అజర్‌ను ఎవరు విడుదల చేశారో వారి కుటుంబాలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మసూద్ అజర్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను పాకిస్తాన్‌కు అప్పగించేందుకు కాందహార్‌లో అజిత్ దోవల్ నెరిపిన ఒప్పందం గురించి కూడా వారికి చెప్పాలని రాహుల్ నిలదీశారు. -
మసూస్ అజహర్‌కు పాకిస్తాన్ షాక్
-
ఇంతకు మసూద్ ఎవరు? ఎక్కడ పుట్టాడు?
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నమాట వాస్తవమేనని మొట్టమొదటి సారిగా అంగీకరించిన పాక్ విదేశాంగ మంత్రి, మసూద్ ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధ పడుతున్నారని తెలిపారు. పాకిస్థాన్ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మసూద్‌ను సోమవారం ఉదయం భావల్పూర్లోని జైషే మొహమ్మద్ శిబిరానికి తరలించినట్లు పాకిస్థాన్ మీడియా తెలియజేసింది. మసూద్ చనిపోయాడన్న, బతికున్నాడన్నా అదో పెద్ద వార్తగా నేడు ప్రపంచ మీడియా ప్రచారం చేస్తోంది? ఇంతకు మసూద్ ఎవరు? ఎక్కడ పుట్టాడు? ఎలా మిలిటెంట్‌గా మారాడు? ఆయనకు పాకిస్థాన్‌కు ఉన్న అనుబంధం ఎలాంటిది? ఆయనకు మన దేశంలో జరగుతున్న ఉగ్ర దాడులకున్న సంబంధం ఏమిటీ? సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే, 1999, డిసెంబర్లో నేపాల్ రాజధాని కఠ్మాండు నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ–814ను మసూద్ అజర్ అనుచరులు హైజాక్ చేసి కాందహార్‌కు తరలించారు. అందులోని 155 మంది ప్రయాణికులను బందీ చేసుకున్నారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న మసూద్ అజర్‌ను విడుదల చేస్తేనే బందీలను సురక్షితంగా విడుదల చేస్తామని హైజాకర్లు హెచ్చరించారు. అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వారి హెచ్చరికకు లొంగిపోవాల్సి వచ్చింది. హైజాకర్ల డిమాండ్ మేరకు మరో ఇద్దరు టెర్రరిస్ట్ నాయకులతోపాటు మసూద్‌ను అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ ప్రత్యేక విమానంలో కాందహార్‌కు తీసుకెళ్లి హైజాకర్లకు అప్పగించారు. మసూద్ అజర్ ప్రాముఖ్యత గురించి ఆ రోజే ప్రపంచానికి మొదటిసారి తెలిసి వచ్చింది. అంతకుముందు రెండు సార్లు మసూద్ జైలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన గురించి మొదటిసారి భారత్‌కు తెలిసి వచ్చింది. 1994లో పోర్చుగీసు పాస్‌పోర్టుపై బంగ్లాదేశ్ మీదుగా కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాకు వచ్చినప్పుడు మసూద్ అజర్ యాదృశ్చికంగా భారత సైనికులకు పట్టుబడ్డారు. అప్పటికే పేరుబడ్డ సజ్జద్ అఫ్ఘాని అనే టెర్రరిస్టుతో కలిసి ఆటోలో వెళుతుండగా తనిఖీలో సైనికులతో అఫ్ఘానితోపాటు మసూద్‌ను అరెస్ట్ చేశారు. స్కూల్ హెడ్మాస్టర్ కొడుకు భారత్‌లో పట్టుపడ్డప్పడు దాదాపు 30 ఏళ్లు ఉన్న మసూద్ అజర్ పాకిస్థాన్, పంజాబ్ రాష్ట్రంలోని భావల్పూర్లో పుట్టాడు. ఆయన తండ్రి ఓ స్కూల్ హెడ్మాస్టర్. 1980వ దశకంలో సోవియట్–అఫ్ఘానిస్థాన్ యుద్ధాలతో స్ఫూర్తి పొందిన మసూద్ అఫ్ఘానిస్థాన్ తరపున సోవియట్ దళాలపై మిలెటెంట్ పోరాటాలు జరిపాడు. ఆ తర్వాత 1990వ దశకంలో కశ్మీర్లో ప్రవేశించి మిలిటెంట్ కార్యకలాపాలు ప్రారంభించాడు. 1994లో యాధశ్చికంగా అరెస్ట్ అయ్యాడు. అప్పుడు హర్కతుల్ అన్సార్ అనే మిలిటెంట్ సంస్థకు అతను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 1999, డిసెంబర్లో విడుదలయ్యాక నేరుగా పాకిస్థాన్ వెళ్లాడు. కార్గిల్ యుద్ధంలో పరాజయం భారంతో ఉన్న పాకిస్థాన్ సైనికులు, ఐఎస్ఐ ఆయనకు ఆశ్రయం కల్పించింది. ఆ తర్వాత కొద్దికాలం అఫ్ఘాన్‌లో గడిపిన మసూద్ పాకిస్థాన్ తిరిగొచ్చి బాలకోట్లో జేషే మొహమ్మద్ సంస్థను ఏర్పాటు చేశాడు. 2000లో మళ్లీ కశ్మీర్లో ప్రవేశించిన భారత సైనికులకు వ్యతిరేకంగా అనేక మిలిటెంట్ దాడులు జరిపించాడు. పాక్ సైనిక, ఐఎస్ఐ అధికారులతో ఆయన కశ్మీర్‌లోని సులభంగా వచ్చి అంతకన్నా సులభంగా బాలకోట్ వెళ్లేవాడు. కశ్మీర్‌లోని షాపియన్, కుల్గామ్, అనంత్‌నాగ్, పుల్వామా ప్రాంతాల్లో స్థానిక మిలిటెంట్లను చేరదీసి మంచి పట్టు సాధించాడు. మసూద్‌కు వీవిఐపీ సెక్యూరిటీ 2000, జనవరిలో కరాచిలోని ఓ మసీదు నుంచి ముస్లిం ప్రజలనుద్దేశించి మసూద్ అజర్ ప్రసంగించాడు. ఈ విషయాన్ని ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్ రుజువు చేయగా, దాన్ని పాక్ ఐఎస్ఐ ఖండించింది. మసూద్ జాడ తమకే తెలియడం లేదని బుకాయించింది. ఆ జర్నలిస్టు స్వయంగా వెళ్లి మసూద్ అజర్ కలసుకున్నారు. మసూద్కున్న సైనిక సెక్యూరిటీని చూసిన ఆ జర్నలిస్ట్, వీవీఐపీలకు కూడా ఉండనంత సెక్యూరిటీ ఉందంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మసూద్ అజర్ 1999లో భారత్ నుంచి విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత్‌కు వ్యతిరేకంగా 45 జైషే ఆత్మాహుతి దాడులు జరిపించాడు. వాటిలో పార్లమెంట్, ఎర్రకోట సైనిక శిబిరంపై జరిగిన దాడులు కూడా ఉన్నాయి. దాంతో ఆయన్ని ‘భారత ఒసామా బిన్ లాడెన్’గా భారత మీడియా అభివర్ణించింది. బాలకోట్లో స్థావరం బాలకోట్లో మసూద్ అజర్ టెర్రరిస్ట్ శిక్షణా శిబిరం ఉన్నట్లు 2006లో ఓ అమెరికన్ ‘టెర్రరిస్ట్ ఎక్స్పర్ట్’ కాలిఫోర్నియా కోర్టుకు తెలిపారు. ఆయన అందుకు సాక్ష్యాలు 2001 నుంచి 2004 మధ్య శాటిలైట్ రికార్డు చేసిన ఛాయా చిత్రాలను చూపించారు. ఎప్పటిలాగా అప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వం ఆ వార్తను ఖండించింది. ఆ తర్వాత పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పర్వేజ్ ముషార్రఫ్నే హత్య చేయడానికి జైషే ఉగ్రవాదులు ప్రయత్నించడం, ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిళ్లు తీవ్రమవడంతో తప్పనిసరై 2008 నుంచి పాన్ సైన్యం జైషే చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. 2014లో మళ్లీ ప్రత్యక్షం పాక్ సైనిక చర్యలతో అజ్ఞాతంలోకి వెళ్లిన మసూద్ 2014లో హఠాత్తుగా పాకిస్థాన్‌లో ప్రజల మధ్య మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. 2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై జైషే ఆత్మాహతి దాడికి పాల్పడడంతో మసూద్‌పై కఠిన చర్యలకు భారత ప్రభుత్వం, పాక్‌ను డిమాండ్ చేసింది. తాత్కాలికంగా మసూద్‌ను అదుపులోకి తీసుకున్న పాక్ సైన్యం రాచ మర్యాదలు చేసి విడిచిపెట్టింది. పఠాన్‌కోట్ నుంచి పుల్వామా ఉగ్ర దాడి వరకు జరిగిన అనేక ఉగ్ర దాడులతో మసూద్ అజర్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది. -
భావల్పూర్ జైషే శిబిరానికి మసూద్ తరలింపు
ఇస్లామాబాద్ : ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరణించాడనే వార్తలు వదంతులేనని పాక్ మీడియా కొట్టిపారేయగా, తాజాగా మసూద్‌ను ఆర్మీ ఆస్పత్రి నుంచి తరలించినట్టు వార్తలొచ్చాయి. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మసూద్‌ను ఆర్మీ ఆస్పత్రి నుంచి భావల్పూర్లోని జైషే మహ్మద్ క్యాంప్‌నకు తరలించారు. మసూద్ అజర్ చనిపోయాడనే వదంతుల నేపథ్యంలో ఆయన తరలింపుపై సమాచారం గందరగోళానికి తావిస్తోంది. (మసూద్ సజీవం : పాక్ మీడియా) కాగా, మసూద్ అజర్ మరణించలేదని ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ స్పష్టం చేసింది. మరోవైపు జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరణించలేదని, ఆయన సజీవంగా ఉన్నారని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. మసూద్ మరణించాడన్న ప్రచారం అవాస్తవమని జియో ఉర్ధూ న్యూస్ పేర్కొంది. జైషే చీఫ్ మసూద్ అజర్ భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో తీవ్రంగా గాయపడి మరణించాడని, కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆయన మరణించాడంటూ విభిన్న కథనాలు వెల్లడైన నేపథ్యంలో మసూద్ సజీవంగా ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారని జియో న్యూస్ తెలిపింది.