
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు మద్దతివ్వడాన్ని ఆపాలని, తన భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల మౌలిక వసతుల్ని కూల్చివేయాలని భారత్ పాకిస్తాన్‌కు సూచించింది. జైషే చీఫ్ మసూద్ అజర్‌తో పాటు ఇతర ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించాలన్న తమ ప్రతిపాదనకు మద్దతు తెలపాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. పుల్వామా దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని విదేశాంగ శాఖ ప్రకటన జారీచేసింది. ఐక్యరాజ్య సమితి, ఇతర దేశాలు నిషేధించిన, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే ఈ హేయమైన దాడికి పాల్పడిందని పేర్కొంది. జైషే చీఫ్ అయిన మసూద్ తన ఉగ్ర కార్యకలాపాల్ని విస్తరించడానికి, భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ఆరోపించింది. జాతీయ భద్రతను కాపాడేందుకు ఎలాంటి చర్యకైనా వెనకాడమని తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment