ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషీ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. భారత్‌లోని పూల్వామాపై జరిగిన ఉగ్రదాడిలో మౌలానా మసూద్ అజార్ కీలక సూత్రధారితా ఉన్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్‌లో ఉన్న మసూద్ గుండెపోటుకు గురి కావడంతో చికిత్స కోసం పాకిస్తాన్ తరలించినట్లు సమాచారం.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అజర్ గుండెపోటుకు గురైనప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నట్లు తేలింది. చికిత్స కోసం ఆఫ్ఘనిస్తాన్ నుంచి గోర్బాజ్ మీదిగా పాకిస్తాన్‌కు తరలించారు. తన వైద్య సంరక్షణ కోసం ఇకార్డియాలజిస్టులతో కరాచీలోని కంబైన్డ్ మిలటరీ ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది., ఆ తర్వాత రావల్పిండిలోని సైనిక ఆసుపత్రికి తరలించే అవకాశం ఉ న్నట్లు వా ర్తలు వస్తున్నాయి.
కాగా, భారత్ ఆధీనంలో ఉండగా 1999లో భారత్‌కు చెందిన ఇండియన్ ఎయిర్‌లైన్ విమానం ఐసీ-814 ఖాట్మాండూ నుంచి న్యూఢిల్లీకి ప్రయాణిస్తుండగా హైజాక్ గురైంది. హైజాక్ చేసిన అనంతరం విమానాన్ని కాందహార్‌లోకి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల డిమాండ్ల మేరకు తమ ఆధీనంలో ఉన్న మసూద్ అజార్‌ను భారత్ విడుదల చేయాల్సి వచ్చింది.
ఈ విడుదల తరువాత, అజార్ పాకిస్తాన్‌లో జైషే మహ్మద్ అనే ఉగ్రసంస్థను స్థాపించాడు. ఈ ఉగ్రసంస్థ 2001లో భారత్ పార్లమెంట్‌పై దాడి, 2016లో పఠాన్ కోట్ దాడి, 2019లో పుల్వామాపై దాడికి పాల్పడ్డాడు.
#BreakingNews : Maulana Masood Azhar, Jaish-e-Mohammed Terrorist And Founder, Gets Heart Attack: Report
Admitted to Hospital in Karachi#MasoodAzhar #Kazakistan
father of the nation pic.twitter.com/apMdkziqnj— Kapadia CP 🇮🇳 (@Ckant72) December 26, 2024
Comments
Please login to add a commentAdd a comment