
వాషింగ్టన్ : పాకిస్తాన్‌కు కొంత కాలంగా వరుస షాక్‌లు ఇస్తున్న అమెరికా.. తాజాగా మరో గట్టి ఝలక్ ఇచ్చింది. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పడ్డ ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అమెరికా స్పష్టం చేసింది. మసూద్ అజర్ విషయంలో పాకిస్తాన్‌కు వంతపాడుతున్న చైనాను కూడా ఈ వ్యాఖ్యలు ఇబ్బందుల్లోకి నెట్టాయి. మసూద్ అజర్ నిస్సందేహంగా ఉగ్రవాదాని పాల్డుతున్న వ్యక్తే. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదులు జాబితాలో చేర్చాల్సిన అవసరముందని ఆమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి హార్థర్ న్యూర్ట్ స్పష్టం చేశారు. మసూద్ అజర్ విషయంలో చైనా కూడా తన వైఖరిని మార్చుకోవాలని పేర్కొన్నారు.
మసూద్ అజర్‌ని ఐక్యరాజ్య సమితి సమావేశంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే క్రమంలో.. చైనా దానిని వీటో చేయడాన్ని ఆమె ఖండించారు. మసూద్ అజర్‌ని కాపాడే విషయంలో చైనా ప్రపంచానికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుందని ఆమె చెప్పారు. అమెరికా చట్టాల ప్రకారం మసూద్ అజర్‌ని, అతని సంస్థ జైషే మహమ్మద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగానే పరిగణిస్తామని ఆమె స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment