మారని చైనా.. అదే ప్రశ్నకు తిక్క వివరణ
బీజింగ్: త్వరలో సమావేశం జరగబోతున్నప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగానే చైనా మాట్లాడింది. జైషే ఈ మహ్మద్ సంస్థ వ్యవస్థాపకుడు ఉగ్రవాది మసూద్ అజర్‌పై నిషేధం విధించడానికి భారత్ వద్ద బలమైన పటిష్టమైన ఆధారాలు ఉండాలంటూ ఆగ్రహం తెప్పించే వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 22న భారత విదేశాంగ కార్యదర్శి, చైనా మంత్రి జాంగ్ యేసు మధ్య వ్యూహాత్మక అంశాలపై చర్చ జరగనుంది.
ఈ సమావేశంలో అంతర్జాతీయ వేదికపై ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు, స్థానిక అంశాలు కూడా ఉన్న నేపథ్యంలో మసూద్‌పై నిషేధం విధించాలంటూ భారత్ ఐరాసకు చేసిన ప్రతిపాదనకు మీరు ఎందుకు మద్దతివ్వడం లేదని చైనా ప్రతినిధి ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. ఏవో కొన్ని అంశాలను తీసుకొని తాము మసూద్ విషయంలో నిర్ణయం అంత త్వరగా తీసుకోలేమని అంతకంటే ముందు భారత్ వద్ద గట్టి ఆధారాలుండాలని చెప్పారు.
అలాగే, ఎన్‌ఎస్‌జీ విషయంలో కూడా భారత్‌పై అభిప్రాయాలు ఉన్నాయిగా అని ప్రశ్నించగా విభేదాలు ఉండటం సాధారణం అంటూ సమాధానం దాట వేశారు. ఈ నేపథ్యంలో అసలు ఇరు దేశాల మధ్య త్వరలో జరిగే చర్చలు సత్పలితాలు ఇస్తాయా అనేది అనుమానమే. వాస్తవానికి మసూద్ నేర చరిత్రకు సంబంధించి ఒక్క భారత్ వద్దే కాకుండా పాక్ వద్ద కూడా కీలక ఆధారాలు ఉన్నాయి. వీటన్నింటిని కూడా ఇప్పటికే భారత్ ఐరాస ముందుంచింది. చైనా తప్ప భద్రతా మండలిలోని మిగితా దేశాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ చైనా మాత్రం వ్యతిరేకంగానే ప్రవర్తిస్తోంది.