‘అమెరికా ప్రతిపాదనపై మా నిర్ణయం కరెక్టే’
బీజింగ్: భారత్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి వెనుక కీలక సూత్రదారు జైషే ఈ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను చైనాలోకి అనుమతించకుండా నిషేధించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను అడ్డుకోవడాన్ని చైనా సమర్థించుకొంది.
అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకే తాము ఈ పనిచేసినట్లు స్పష్టతనిచ్చింది. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే పనిలో భాగంగా గత ఏడాది 1,267 ఐక్యరాజ్యసమితి ముందు చర్చ జరిగిందని, అయితే, తాము ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా తమ దేశంలోని ఇతర పార్టీల, ముఖ్యవ్యక్తుల అభిప్రాయాలు తీసుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సంబంధిత కథనానికై చదవండి..
(పాక్‌పై గురిపెట్టిన ట్రంప్.. చైనాకు చిక్కు ప్రశ్న)