jaish e muhammad
-
తౌసీఫ్ మాటవిని తిరిగొచ్చాడు.. కానీ ఆదిల్..
న్యూఢిల్లీ : పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేసి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఆదిల్ అహ్మద్‌దార్ కుటుంబ సభ్యులను ఎన్ఐఏ విచారిస్తోంది. ఆదిల్ సోషల్ మీడియా ప్రొఫైల్ లింకులతో పాటు, అతని కుటుంబ సభ్యుల డీఎన్ఏలు సేకరించింది. ఆదిల్‌తో పాటు అతని బంధువు తౌసీఫ్ కూడా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలో చేరినట్టు తెలిసింది. అయితే, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు తౌసీఫ్ ఇంటికి తిరిగొచ్చినా.. ఆదిల్ మాత్రం రాలేదని అతని తల్లిదండ్రులు తెలిపారు. (దీటుగా బదులిస్తాం: పాక్ హెచ్చరిక) కాగా, తౌసీఫ్ ప్రస్తుతం జమ్మూ జైలులో ఉన్నాడు. అతన్ని ఎన్ఐఏ విచారించనుందని సమాచారం. పుల్వామా ప్రాంతంలోని స్థానికులు, అక్కడి జవాన్ల స్టేట్మెంట్లను ఎన్ఐఏ రికార్డు చేసింది. పుల్వామా ఉగ్రకుట్రకు అంత భారీ మొత్తంలో ఆర్డీఎక్స్ ఎలా లభ్యమైందనే కోణంలో విచారణ కొనసాగుతోంది. జైషేకు బయటనుంచి మద్దతిచ్చే వారు డిసెంబర్లో 100 కేజీ ఆర్డీఎక్స్ను తరలిస్తుండగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీ స్వాధీనం చేసుకుంది. పుల్వామాలో అంత భారీ స్థాయిలో ఆర్డీఎక్స్తో విధ్వంసం సృష్టించడానికి చిన్న చిన్న మొత్తాల్లో కొన్ని నెలలపాటు ఆర్డీఎక్స్ను పోగుచేశారని అధికారులు గుర్తించారు. (మోదీ ఆ రోజు తిన్నారా, తినలేదా !?) -
‘అమెరికా ప్రతిపాదనపై మా నిర్ణయం కరెక్టే’
బీజింగ్: భారత్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి వెనుక కీలక సూత్రదారు జైషే ఈ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను చైనాలోకి అనుమతించకుండా నిషేధించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను అడ్డుకోవడాన్ని చైనా సమర్థించుకొంది. అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకే తాము ఈ పనిచేసినట్లు స్పష్టతనిచ్చింది. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే పనిలో భాగంగా గత ఏడాది 1,267 ఐక్యరాజ్యసమితి ముందు చర్చ జరిగిందని, అయితే, తాము ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా తమ దేశంలోని ఇతర పార్టీల, ముఖ్యవ్యక్తుల అభిప్రాయాలు తీసుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సంబంధిత కథనానికై చదవండి.. (పాక్‌పై గురిపెట్టిన ట్రంప్.. చైనాకు చిక్కు ప్రశ్న) -
పాక్‌పై గురిపెట్టిన ట్రంప్.. చైనాకు చిక్కు ప్రశ్న
న్యూయార్క్: తాను వస్తే ఉగ్రవాదాన్ని, దానికి అవకాశాన్నిచ్చే అంశాలను ఏమాత్రం ఉపేక్షించబోనని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలుత ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించి ఇప్పుడు పాకిస్థాన్ వైపు దృష్టి సారించారు. భారత్‌లోని పఠాన్‌కోట్‌లో దాడికి ఉగ్రదాడికి దిగిన జైషే ఈ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను చైనాలోకి అనుమతించకుండా నిషేధించాలని కోరారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఆయన ఇప్పటికే చైనా అధికారులతో ఇదే విషయాన్ని చెప్పినట్లు కీలక వర్గాల సమాచారం. గత డిసెంబర్లోనే అజర్‌ను ఇతర ప్రాంతాల్లో తిరుగాడకుండా, ఆయన సంస్థను నిషేధించాలంటూ భారత్ ఐక్యరాజ్యసమితికి డిసెంబర్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సరిగ్గా డోనాల్డ్ ట్రంప్ పదవీ ప్రమాణం చేయడానికి ఒక రోజు ముందు జనవరి 19న చైనాకు ఈ ప్రతిపాదన చేశారు. ‘మా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే చైనాకు మసూద్ నిషేధంపై ప్రతిపాదన చేశారు. ఇప్పుడిక చైనా వంతు ఏం చేస్తుందో ఆ దేశమే నిర్ణయం తీసుకోవాలి’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతును సాధించిన భారత్ అమెరికా సపోర్ట్‌ను కూడగట్టింది. ఈ మేరకు యూఎన్ సాంక్షన్ కమిటీ 1267కి గత నెలలోనే అమెరికా పంపించింది. అయితే, ఇప్పటికే అమెరికా ప్రతిపాదనను తొలుత వ్యతిరేకించి పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఇలా ఒక తొమ్మిది నెలలు మాత్రమే ఆ ప్రతిపాదనను తన వద్దకు ఉంచుకోగలుగుతుంది. ఆ తర్వాత అది బ్లాక్ అవడమో.. రద్దు కావడమో జరుగుతుంది. ఈ రెండింట్లో ఏం జరిగినా చైనాకు దెబ్బే అవుతుంది కాబట్టి ఆమోదించే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది.