పాక్‌పై గురిపెట్టిన ట్రంప్‌.. చైనాకు చిక్కు ప్రశ్న | US Plan to Ban JeM Chief Masood Azhar Runs Into Great Wall of China | Sakshi
Sakshi News home page

పాక్‌పై గురిపెట్టిన ట్రంప్‌.. చైనాకు చిక్కు ప్రశ్న

Published Wed, Feb 8 2017 9:24 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

పాక్‌పై గురిపెట్టిన ట్రంప్‌.. చైనాకు చిక్కు ప్రశ్న - Sakshi

పాక్‌పై గురిపెట్టిన ట్రంప్‌.. చైనాకు చిక్కు ప్రశ్న

న్యూయార్క్‌: తాను వస్తే ఉగ్రవాదాన్ని, దానికి అవకాశాన్నిచ్చే అంశాలను ఏమాత్రం ఉపేక్షించబోనని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తొలుత ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించి ఇప్పుడు పాకిస్థాన్‌ వైపు దృష్టి సారించారు. భారత్‌లోని పఠాన్‌కోట్‌లో దాడికి ఉగ్రదాడికి దిగిన జైషే ఈ మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ ను చైనాలోకి అనుమతించకుండా నిషేధించాలని కోరారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఆయన ఇప్పటికే చైనా అధికారులతో ఇదే విషయాన్ని చెప్పినట్లు కీలక వర్గాల సమాచారం.

గత డిసెంబర్‌లోనే అజర్‌ను ఇతర ప్రాంతాల్లో తిరుగాడకుండా, ఆయన సంస్థను నిషేధించాలంటూ భారత్‌ ఐక్యరాజ్యసమితికి డిసెంబర్‌లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సరిగ్గా డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీ ప్రమాణం చేయడానికి ఒక రోజు ముందు జనవరి 19న చైనాకు ఈ ప్రతిపాదన చేశారు. ‘మా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే చైనాకు మసూద్‌ నిషేధంపై ప్రతిపాదన చేశారు. ఇప్పుడిక చైనా వంతు ఏం చేస్తుందో ఆ దేశమే నిర్ణయం తీసుకోవాలి’  అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మద్దతును సాధించిన భారత్‌ అమెరికా సపోర్ట్‌ను కూడగట్టింది.

ఈ మేరకు యూఎన్‌ సాంక్షన్‌ కమిటీ 1267కి గత నెలలోనే అమెరికా పంపించింది. అయితే, ఇప్పటికే అమెరికా ప్రతిపాదనను తొలుత వ్యతిరేకించి పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఇలా ఒక తొమ్మిది నెలలు మాత్రమే ఆ ప్రతిపాదనను తన వద్దకు ఉంచుకోగలుగుతుంది. ఆ తర్వాత అది బ్లాక్‌ అవడమో.. రద్దు కావడమో జరుగుతుంది. ఈ రెండింట్లో ఏం జరిగినా చైనాకు దెబ్బే అవుతుంది కాబట్టి ఆమోదించే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement