Pathankot attack
-
పఠాన్‌కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్‌లో హతం
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి జైషే మహ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. పంజాబ్‌లోని సియాల్ కోట్లో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. నూర్ మదీనా మసీద్‌లో ఫజర్ ప్రార్థన అనంతరం బయటకు రాగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు లతీఫ్‌తోపాటు మరో ఇద్దరు సహచరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లతీఫ్తోపాట మరో ఉగ్రవాది అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కాల్పులు జరిపిన అగంతకులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. ఈ దాడిపై పాక్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పఠాన్ కోట్ దాడి వ్యూహకర్త షామిద్ లతీఫ్(41) ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు లాంచింగ్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2016 జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికికి మాస్టర్‌మైండ్ లతీఫే. ఈ దాడిలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పఠాన్‌కోట్‌లో బాంబు పేలుడు జరిగి మరో అధికారి మరణించారు. తరువాత ఈ దాడికి పాల్పడిన అయిదుగురు ముష్కరులను భారత బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఈ పేలుళ్లకు సూత్రధాని షాహిద్ లతీఫ్ అంటూ అప్పట్లో దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అతడు పాక్‌లోని సియాల్కోట్ నుంచే ఈ దాడికి పథకం వేసి.. ఐదుగురు ఉగ్రవాదులను పఠాన్‌కోట్‌పై దాడికి పంపినట్లు దర్యాప్తు నివేదికలో తేలింది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ లతీఫ్‌ను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇక ఇటీవల పాక్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల హత్యలు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో వేర్వేరు ఉగ్రవాద సంస్థలకు చెందిన అయిదుగురు టాప్ కమాండర్లు గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించారు. లతీఫ్‌ను 1994 నవంబర్ ఉగ్రవాదం, చట్ట విరుద్ధ కార్యాకలాపాల నివారణ చట్టం (UAPA)ప్రకారం జమ్మూకశ్మీర్‌లో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 16 ఏళ్ల పాటు మసూద్ అజార్‌తో కలిసి కోట్ బల్వాల్లోని జైలులో శిక్షననుభవించాడు. అనంతరం 2010లో వాఘా ద్వారా పాకిస్థాన్‌కు అప్పగించారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను హైజాక్ చేసిన కేసులో లతీఫ్ నిందితుడిగా ఉన్నాడు. చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
పాక్‌పై గురిపెట్టిన ట్రంప్.. చైనాకు చిక్కు ప్రశ్న
న్యూయార్క్: తాను వస్తే ఉగ్రవాదాన్ని, దానికి అవకాశాన్నిచ్చే అంశాలను ఏమాత్రం ఉపేక్షించబోనని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలుత ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించి ఇప్పుడు పాకిస్థాన్ వైపు దృష్టి సారించారు. భారత్‌లోని పఠాన్‌కోట్‌లో దాడికి ఉగ్రదాడికి దిగిన జైషే ఈ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను చైనాలోకి అనుమతించకుండా నిషేధించాలని కోరారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఆయన ఇప్పటికే చైనా అధికారులతో ఇదే విషయాన్ని చెప్పినట్లు కీలక వర్గాల సమాచారం. గత డిసెంబర్లోనే అజర్‌ను ఇతర ప్రాంతాల్లో తిరుగాడకుండా, ఆయన సంస్థను నిషేధించాలంటూ భారత్ ఐక్యరాజ్యసమితికి డిసెంబర్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సరిగ్గా డోనాల్డ్ ట్రంప్ పదవీ ప్రమాణం చేయడానికి ఒక రోజు ముందు జనవరి 19న చైనాకు ఈ ప్రతిపాదన చేశారు. ‘మా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే చైనాకు మసూద్ నిషేధంపై ప్రతిపాదన చేశారు. ఇప్పుడిక చైనా వంతు ఏం చేస్తుందో ఆ దేశమే నిర్ణయం తీసుకోవాలి’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతును సాధించిన భారత్ అమెరికా సపోర్ట్‌ను కూడగట్టింది. ఈ మేరకు యూఎన్ సాంక్షన్ కమిటీ 1267కి గత నెలలోనే అమెరికా పంపించింది. అయితే, ఇప్పటికే అమెరికా ప్రతిపాదనను తొలుత వ్యతిరేకించి పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఇలా ఒక తొమ్మిది నెలలు మాత్రమే ఆ ప్రతిపాదనను తన వద్దకు ఉంచుకోగలుగుతుంది. ఆ తర్వాత అది బ్లాక్ అవడమో.. రద్దు కావడమో జరుగుతుంది. ఈ రెండింట్లో ఏం జరిగినా చైనాకు దెబ్బే అవుతుంది కాబట్టి ఆమోదించే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది. -
మసూద్ అజర్‌పై చార్జిషీట్
పఠాన్ కోట్ చార్జిషీట్లో జైషే చీఫ్ పేరు చేర్చిన ఎన్ఐఏ న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి కేసుకు సంబంధించి సోమవారం ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమూద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ పేరును చేర్చింది. పఠాన్‌కోట్ దాడికి మసూద్ అజర్ సూత్రధారి అని వెల్లడించింది. అజర్‌తో పాటు అతని సోదరుడు మరో ఇద్దరి పేర్లను సైతం చార్జిషీట్లో పేర్కొంది. పేలుడు పదార్థాలు, ఆయుధాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు సోమవారం పంచకులలోని ఎన్ఐఏ కోర్టులో నలుగురిపై చార్జిషీట్ దాఖలు చేసింది. సాక్ష్యాధారాల సేకరణ, దర్యాప్తులో సహకరించిన.. జైల్లోని ఒక పాక్ ఉగ్రవాది, అమెరికా ఎఫ్‌బీఐ, న్యాయ శాఖ అధికారులు సహా ఆరుగురిని సాక్షులుగా పేర్కొంది. ఈ ఏడాది జనవరి 2న పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్ర దాడిలో ఏడుగురు సైనికులు అమరులయ్యారు. మసూద్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మరో ఇద్దరు షాహీద్ లతీఫ్, కషీఫ్ జాన్ దాడులకు సహకరించినట్టు ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. కాగా, మసూద్ అజర్‌పై చార్జిషీట్‌ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద వ్యతిరేక చట్టాల ప్రకారం అతనిపై ఆంక్షలు విధించేందుకు భారత్ ఉపయోగించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. -
ఉగ్రదాడి మసూద్ అజర్, ఆయన సోదరుడి పనే
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన పటాన్ కోట్ దాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జీషీటు దాఖలు చేసింది. జైషే ఈ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఈ దాడికి కీలక సూత్రదారుడిగా అందులో ఎన్ఐఏ పేర్కొంది. అలాగే, మసూద్ సోదరుడు అబ్దుల్ రౌఫ్, మరో ఇద్దరని కూడా ఈ చార్జిషీటులో చేర్చింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో కీలక భారత రక్షణ స్థావరమైన ఎయిర్ బేస్ పై పాక్ కు చెందిన ముష్కరులు అనూహ్యంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మసూద్, అతడి సోదరుడు, మరో ఇద్దరిపై ఆయుధాల చట్టం, పేలుళ్లకు సంబంధించిన చట్టాలు, పబ్లిక్ ప్రాపర్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అమెరికా కూడా కీలక సహాయం అందించింది. ఉగ్రవాదులు జరిపిన సంభాషణలు, ఈమెయిల్స్ వంటివాటిని అమెరికా సహాయంతో గుర్తించారు. -
‘ఎన్డీటీవీ’ నిలిపివేత ఆదేశాలపై నిరసనలు
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడిపై ప్రసారాలు చేసినందుకు ‘ఎన్డీటీవీ ఇండియా’ హిందీ న్యూస్ చానల్ ను నవంబర్ 9న నిలిపివేయాలన్న ఆదేశాల్ని విపక్షాలు, మీడియా సంస్థలు ఖండించాయి. సమాచార ప్రసార శాఖకు చెందిన అంతర్ మంత్రిత్వ శాఖ విచారణ బృందం ఆదేశాల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఎమర్జెన్సీ రోజులు గుర్తు కొస్తున్నాయంటూ మండిపడ్డాయి. ప్రసారాల నిలుపుదలపై ఇచ్చిన ఆదేశాల్ని తక్షణం ఉపసంహరించుకోవాలన్నాయి. దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఈ ఆదేశాలు దిగ్భ్రాంతికర పరిణామంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పేర్కొన్నారు. ఐబీ ఉత్తర్వుల్ని ఖండించడంతో పాటు ఇది పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ పేర్కొన్నాయి. -
పాకిస్థాన్ సైన్యానికి ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్!
ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలిపోతున్న పాకిస్థాన్ ఎట్టకేలకు చర్యలకు ఉప్రకమించినట్టు కనిపిస్తోంది. పాక్ భూభాగంలోని ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే అంతర్జాతీయంగా ఏకాకి కావాల్సి వస్తుందంటూ ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సైన్యాన్ని గట్టిగా హెచ్చరించారు. అదేవిధంగా పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై విచారణ త్వరగా పూర్తిచేయాలని, స్తంభించిపోయిన ముంబై దాడుల కేసు విచారణను తిరగదొడాలని ఆయన సైన్యానికి తేల్చిచెప్పినట్టు పాకిస్థాన్ ప్రధాన పత్రిక 'డాన్' వెల్లడించింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో పౌర ప్రభుత్వానికి-సైన్యానికి మధ్య కీలక సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో అసాధారణరీతిలో ప్రభుత్వం సైన్యానికి పరుషమైన హెచ్చరికలు జారీచేసిందని ఈ భేటీలో పాల్గొన్న విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక గురువారం వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద గ్రూపులపై చర్యలు సహా కీలకాంశాల్లో ప్రభుత్వానికి అనుగుణంగా సైన్యం నడుచుకోవాలని షరీఫ్ ఈ భేటీలో స్పష్టం చేసినట్టు డాన్ పత్రిక పేర్కొంది. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తు పూర్తిచేసేందుకు, ముంబై దాడుల కేసులో పునర్విచారణ జరిపేందుకు చర్యలు తీసుకోవాలని షరీఫ్ తేల్చిచెప్పినట్టు తెలిపింది. నిషేధిత లేదా అదుపులో లేని మిలిటెంట్ గ్రూపులపై లా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకుంటే.. అందులో సైనిక నిఘా ఏజెన్సీలు జోక్యం చేసుకోకూడదనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చిందని, ఈ సందేశాన్ని సైనిక, నిఘా వర్గాలకు అందజేసేందుకు ఐఎస్ఐ చీఫ్ లెప్టినెంట్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్, జాతీయ భద్రతా సలహాదారు నజర్ జంజువా నాలుగు ప్రావిన్సులలో పర్యటించనున్నారని ఆ పత్రిక వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా దౌత్యపరంగా, ఆర్థికపరంగా ఏకాకిని చేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు జరుపడంతో ఇరుదేశాల సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. సార్క్ దేశాలు కూడా పాక్ తీరును నిరసిస్తూ.. ఆ దేశంలో సార్క్ సదస్సుకు హాజరుకాబోమని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇరకాటంలో పడ్డ పాక్ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు భావిస్తున్నారు. -
పఠాన్‌కోట్ దాడి కేసులో పాక్‌కు షాక్
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడికి తమకు సంబంధం లేదని బీరాలు పోయిన పాకిస్థాన్ మరోసారి ఇరుకున పడింది. ఈ కేసును ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తుండగా ఆ విచారణకు అమెరికా మరింత బలాన్ని చేకూర్చింది. పఠాన్ కోట్ దాడి పాకిస్థాన్ నుంచే జరిగిందని నిరూపించేలా ఉన్న ఆధారాలను అమెరికా అధికారులు ఎన్ఐఏకు అప్పగించారు. దాడికి పాల్పడిన వారు ఉపయోగించిన ఫేస్ బుక్ ఖాతాల ఐపీ అడ్రస్‌లు పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు గుర్తించి వాటి ఆధారాలను ఎన్ఐకు ఇచ్చారు. అంతేకాదు.. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న అల్ రహ్మత్ ట్రస్ట్ ఐపీ అడ్రస్ కూడా పాక్ లోనే ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రకారం దాడి జరిగే సమయంలో అల్ రహ్మత్ వెబ్ పేజీ ని రంగనూర్ డాట్ కామ్ అనే సైట్ లో, అల్కాలంఆన్ లైన్ డాట్ కామ్ అనే మరో సైట్లో అప్ లోడ్ చేశారు. ఈ రెండింటికి కూడా తారిక్ సిద్దిఖీ ఒకే ఈమెయిల్ ఉపయోగించారని, మొత్తానికి దాడి సమయంలో ఉపయోగించిన ఈ ఐపీ అడ్రెస్ లు పాకిస్థాన్‌లో ఉన్నట్లు తాము గుర్తించామని పేర్కొంటూ అమెరికా భారత ఎన్ఐఏ అధికారులకు అధారాలు సమర్పించారు. -
అఫ్గాన్‌కు పరారైన పఠాన్‌కోట్ కుట్రదారుడు
లాహోర్: ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) కీలక నాయకుడు, పంజాబ్ పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన వారికి ఫోన్లో సూచనలు ఇచ్చిన కుట్రదారుడు పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు పరారయ్యాడు. ఈ ఏడాది జనవరి రెండున ఎయిర్‌బేస్‌పై దాడికి ముందు ఇతడు వారితో 18 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు పాకిస్తాన్ అధికారులు గుర్తించారు. ఆ సమయంలో ఈ ఉగ్రవాది పాక్ సరిహద్దులోని గిరిజన ప్రాంతంలో మకాం వేశాడు. పాక్ అధికారులు అక్కడికి వెళ్లేలోపే ఇతడు సరిహద్దు దాటి అఫ్గాన్‌లోకి ప్రవేశించాడని ప్రకటించిన పోలీసులు, నిందితుడి పేరు వెల్లడించడానికి మాత్రం ఇష్టపడటం లేదు. ఇదిలా ఉంటే పఠాన్‌కోట్‌కు దాడికి పథకం పన్నిన వ్యక్తి తమ సంస్థను వదిలిపెట్టాడని జేఈఎం అధిపతి మసూద్ అజర్ ప్రకటించాడు. -
పఠాన్‌కోట్ దాడిలో పాక్ హస్తం లేదు: ఎన్ఐఏ
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం సహకరించినట్లు, దాడి వెనుక దాని హస్తం ఉన్నట్లు ఆధారాలు లేవని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) డెరైక్టర్ జనరల్ శరద్ కుమార్ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. జైషే మహ్మద్ సంస్థ చేసిన ఈ దాడి వెనుక పాక్ ప్రభుత్వ సహకారంగాని, దాని సంస్థల హస్తంగాని లేదన్నారు. ఈ ప్రకటన ప్రకంపనలు సృష్టించడంతో ఎన్ఐఏ వివరణ ఇచ్చింది. ప్రకటనను వక్రీకరించారంది. -
'భారతమాతకు వెన్నుపోటు పొడిచారు'
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి దర్యాప్తు మిషతో పాకిస్థాన్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్(జిట్)ను భారత్ లోకి అనుమతించడాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన స్వరాన్ని తీవ్రతరం చేసింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పఠాన్ కోట్ విషయంలో మోదీ సర్కార్ తీరును తూర్పారబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కలిసి భారతమాతకు వెన్నుపోటు పొడిచారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఇది సిగ్గుచేటు. ప్రధాని మోదీ పాకిస్థాన్ ముందు దేశాన్ని అవమానపర్చారు. ఇంతకు ముందున్న ప్రధానులెవ్వరూ ఇలా చెయ్యలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఓ వైపు భారత్ మాతాకీ జై కొట్టాలని నినదిస్తున్నారు. కానీ వాళ్లే భారత మాతకు వెన్నుపోటు పొడుస్తున్నారు' అంటూ తన ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. జిట్ నివేదిక బటికి రాకముందే అందులో ఏముందో పాకిస్థాన్ మీడియా వెల్లడించడం, పఠాన్ కోట్ దాడికి పాల్పడింది పాక్ కాదు ఇండియానే అనే ప్రేలాపనలు పేలడం లాంటి పరిణామాలు మోదీ అసమర్థత వల్ల కలిగినవేనని విమర్శించారు. -
'పఠాన్‌కోట్ దాడి భారత్ ఆడిన నాటకం'
ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి దర్యాప్తు విషయంలో పాకిస్థాన్ మీడియా విషం చిమ్ముతున్నది. ఉగ్రదాడి ఘటన భారత్ ఆడిన నాటకమని పాకిస్థాన్ దర్యాప్తు బృందం చెప్పిందంటూ బరితెగింపు రాతలు రాసింది. ఆ అడ్డగోలు రాతలకు ఆధారమంటూ యూపీలో ఎన్ఐఏ అధికారి హత్యను బూచిగా చూపెట్టే ప్రయత్నం చేసింది. 'పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి భారత్ ఆడిన భారీ నాటకం. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టేందుకు పన్నిన కుట్ర' అని ఇటీవలే భారత్ లో పర్యటించిన సంయుక్త దర్యాప్తు బృందం(జిట్) అధికారి తమకు చెప్పాడని 'పాకిస్థాన్ టుడే' పత్రిక సోమవారం ఒక కథనాన్ని రాసింది. 'ఎయిర్ బేస్ లోకి ప్రవేశించిన కొద్దిసేపటికే సాయుధులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయని, అయితే ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించేందుకే మూడురోజుల పాటు ఆపరేషన్ నిర్వహించినట్లు బిల్డప్ ఇచ్చింది. ఇదంతా పాకిస్థాన్ ను బదనామ్ చేయడానికే' అని కూడా సదరు అధికారి పేర్కొన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఎన్ఐఏ అధికారి హత్యపై కట్టుకథ ఎన్ఐఏ అధికారి తంజిల్ అహ్మద్ హత్యోదంతాన్ని పాక్ మీడియా తన కట్టుకథలకు ఆధారంగా చూపెట్టే ప్రయత్నం చేసింది. భారత అధికారులు ఆడిన నాటకం బయటపడకుండా ఉండేందుకే ముస్లిం అయిన తంజిల్ అహ్మద్ ను హత్యచేయించారని కట్టుకథ అల్లింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో తమను తిప్పితిప్పి విసిగించారేతప్ప సరైన ఆధారాలు చూపకపోవడం కూడా నాటకంలో భాగమేనని జిట్ అధికారులు అన్నట్లు మీడియా పేర్కొంది. జనవరి 2న గుజరాత్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రమూక జరిపిన దాడిలో ఏడుగురు జవానులు అమరులవ్వగా, ఆరుగురు ముష్కరులు హతమైన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రవాదులు మసూద్ అజార్ జైషే సంస్థకు చెందినవారని, వచ్చింది పాకిస్థాన్ నుంచే ననే ఆధారాలను భారత అధికారులు ఇదివరకే పాకిస్థాన్ కు సమర్పించారు. ఆ ఆధారాలను బట్టి పాక్ దర్యాప్తు బృందం(జిట్) పఠాన్ కోట్ ను సందర్శించింది కూడా. ఒకటి రెండు రోజుల్లో పాక్ బృందం తన నివేదికను ప్రధాని నవాజ్ షరీఫ్ కు అందించనుంది. ఈ లోపే నిజానిజాలను వక్రీకరించే ప్రయత్నం తలకెత్తుకుంది పాకిస్థాన్ మీడియా. -
పాక్ బృందానికి వీసా మంజూరు
‘పఠాన్‌కోట్’పై దర్యాప్తునకు జేఐటీ ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ వైమానిక క్షేత్రంపై పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేశారన్న ఆరోపణలపై దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు పాక్ బృందం భారత్‌కు వస్తోంది. పాక్ సంయుక్త దర్యాప్తు బృందం(జేఐటీ)లోని ఐదుగురు అధికారులకు భారత్ వీసా మంజూరుచేసింది. వీరు భారత్‌కు వెళ్లి పఠాన్‌కోట్ దాడి సంబంధించిన ఆధారాలు సేకరిస్తారని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి చెప్పారు. ఈనెల 27న భారత్‌కు బయలుదేరుతున్న ఈ బృందంలో మిలిటరీ ఇంటెలిజెన్స్‌తోపాటు పోలీసు అధికారులున్నారు. 28న వీరు ఘటనాస్థలికి వెళ్లనున్నారు. పాక్ పంజాబ్ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక విభాగం(సీటీడీ) చీఫ్ అయిన అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముహమ్మద్ తాహిర్ రాయ్ ఈ బృందానికి నేతృత్వ వహిస్తారు. ఇటీవల కఠ్మాండులో జరిగిన సార్క్ మంత్రుల సమావేశాల్లో భారత్, పాక్ విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, అజీజ్‌ల భేటీలో జేఐటీ బృందం రాకకు భారత్ అనుమతించింది. ఎస్పీ సల్వీందర్కు ఎన్ఐఏ తాజా సమన్లు న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి కేసులో పంజాబ్ పోలీసు ఎస్పీ సల్వీందర్ సింగ్ తో పాటు మరో ఇద్దరికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తాజాగా సమన్లు జారీచేసింది. సాధారణ దర్యాప్తులో భాగంగానే సింగ్‌తోపాటు అతని స్నేహితుడు రాజేష్ వర్మ, వంటమనిషి మదన్ గోపాల్‌ను తమ ముందు హాజరవ్వాలని ఆదేశించామని ఎన్ఐఏ వర్గాలు చెప్పాయి. -
జగదీశ్చంద్కు కీర్తిచక్ర
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి ఘటనలో విరోచితంగా పోరాడి ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టి మృతిచెందిన సిపాయి జగదీశ్ చంద్‌ను కేంద్రం కీర్తి చక్రతో గౌరవించింది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించి, అత్యున్నత, అసాధారణ సేవలు కనబరిచిన సైనికులకు ఇచ్చే శౌర్య అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. ప్రాణాలు సైతం లెక్క చేయక ప లు సందర్భాల్లో సేవలు అందించిన మొత్తం 58 మందికి రాష్ట్రపతి ప్రణబ్ పతకాలను అందజేశారు. సభికుల చప్పట్ల నడుమ చాంద్ తరఫున ఆయన భార్య కీర్తిచక్ర(సైనికులకు ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారం) అవార్డును అందుకున్నారు. -
మొక్కుబడిగా ఓ ఎఫ్ఐఆర్!
► పఠాన్‌కోట్ దాడి ఘటనపై పాక్ ప్రభుత్వంలో కదలిక ► భారత్ ఆరోపణలు బేఖాతరు ► నిందితుల పేర్లు లేకుండానే కేసుల నమోదు న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థకే సవాలు విసురుతూ.. పఠాన్‌కోట్‌పై ఉగ్రమూకలు చేసిన దాడికి పాకిస్తాన్ నుంచి ఎట్టకేలకు స్పందన కనిపించింది. పఠాన్‌కోట్ ఉగ్రదాడి కేసుపై ఆ దేశ కౌంటర్ టైజం డిపార్ట్మెంట్(సీటీడీ) పంజాబ్‌లోని గుర్జన్‌వాలాలో మొక్కుబడిగా.. నిందితుల పేర్లు లేకుండానే ఓ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అయితే ఇది చిత్తశుద్ధిలేని చర్యగానే భారత్ భావిస్తోంది. ఎందుకంటే ఏడుగురు భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న పఠాన్‌కోట్ దాడికి కారకులెవరనే విషయమై భారత్ స్పష్టమైన ఆధారాలను పాక్ ప్రభుత్వానికి ఇప్పటికే అందజేసింది. ఆ దేశానికి చెందిన జైష్-ఎ-మహ్మద్ సంస్థ ఈ కుట్రకు పాల్పడిందని భారత్ ఆరోపించింది. దాడికి సూత్రధారి జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన మౌలానా మసూద్ అజరేనని ఆరోపించిన ఇండియా.. అందుకు తగిన ఆధారాలను ఇప్పటికే పాక్‌కు అందజేసింది. అజర్ సోదరుడు రవూఫ్‌తోపాటు మరో ఐదుగురికి ఈ దాడితో సంబంధమున్నట్లు ఆధారాలు చూపింది. అయితే ఇవేవీ పట్టనట్టుగా పాకిస్తాన్ మాత్రం నిందితుల పేర్లేవీ లేకుండానే ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం గమనార్హం. తగిన ఆధారాలను సేకరించేందుకే.. భారత్ చేసిన ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఎఫ్ఐఆర్ను దాఖలు చేసినట్లు సీటీడీ పేర్కొంది. అందుకు తగిన ఆధారాలు సేకరించాలంటే ముందుగా చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సి ఉంటుందని సీటీడీ అధికారి ఒకరు తెలిపారు. పాక్ నేర శిక్షాస్మృతి ప్రకారం 320, 324, 109 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఇవన్నీ ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నమోదైన కేసులేనని స్పష్టం చేశారు. త్వరలో విచారణ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆ నేపథ్యంలోనేనా? పాకిస్తాన్-భారత్ దేశాధినేతల భేటీ నేపథ్యంలోనే పాక్ ప్రభుత్వం ఈ కంటితుడుపు చర్యను తీసుకున్నట్లుగా భారత్ భావిస్తోంది. జనవరి 2న దాడి జరిగిన తర్వాత భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పూర్తి ఆధారాలను పాక్ ప్రభుత్వానికి అందజేశారు. అందులో పాక్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల వివరాలను పొందుపర్చారు. అయినప్పటికీ వారి పేర్లేవీ లేకుండానే ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంమంటే... ప్రస్తుతానికి భారత్‌కు సమాధానం చెప్పుకునేందుకేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో నరేంద్రమోదీ-నవాజ్ షరీఫ్‌లు భేటీ అవుతారనే విషయంపై కొంత స్పష్టత వస్తున్న నేపథ్యంలో భేటీలో భారత్ లేవనెత్త ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకే పాకిస్తాన్ ఈ ఎఫ్ఐఆర్ పథకానికి తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత్ అసంతృప్తి.. పాకిస్తాన్ చ ర్యపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. జైష్-ఎ-మహ్మద్ పేరుగానీ, ఆ సంస్థకు చెందిన మసూద్ అజర్ పేరుగానీ లేకుండా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం నిరాశ పర్చిందని భారత్ పేర్కొంది. తాము ఆధారాలను అందజేసినా నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చడంలో పాకిస్తాన్ ఎందుకు విఫలమైందో అర్థం కావడంలేదని భారత భద్రతా విభాగానికి చెందిన అధికారి ఒకరు అన్నారు. ఇప్పుడేమీ మాట్లాడలేం.. భారత్ అసంతృప్తి వ్యక్తం చేయడంపై తాము ఇప్పుడేమీ మాట్లాడలేమని పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి రాణా సనాఉల్లా పేర్కొన్నారు. ‘ఎఫ్ఐఆర్ నమోదైంది.. విచారణ జరగనివ్వండి. దోషులెవరో తేలితే వారిపై తప్పకుండా చర్యలుంటాయి. దాడికి కారకులెవరే విషయమై ఇప్పడేమీ మాట్లాడలేమ’న్నారు. భారత్ అందజేసిన ఆధారాలపై కూడా మాట్లాడడానికి రాణా నిరాకరించారు. -
పఠాన్‌కోట్ కంటోన్మెంట్లో పాక్ గూఢచారి!
వ్యక్తిని అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు పఠాన్‌కోట్: ఉగ్రవాద దాడులకు గురైన పఠాన్‌కోట్ కంటోన్మెంట్లో ఓ భారత జాతీయుడిని పంజాబ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి అతను ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని నిఘా సంస్థలు సమాచారం అందించడంతో అదుపులోకి తీసుకున్నారు. పఠాన్‌కోట్ కంటోన్మెంట్‌లోని భారత ఆర్మీ 29 డివిజన్ హెడ్ క్వార్టర్ లో ఇష్రాద్ అహ్మద్ సహాయ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతను ఐఎస్ఐకు అండర్ కవర్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడని తాజాగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అతని స్మార్ట్ ఫోన్లో పఠాన్‌కోట్ లోని సున్నితమైన ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు లభించాయని నిఘావర్గాలు నివేదించినట్టు సమాచారం. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దేశంలోనే అతి పెద్ద ఆర్మీ స్థావరం. వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. గత నెలలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎయిర్‌బేస్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ దీనిని ఇటీవలికాలంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల జరిగిన ఉగ్రవాద దాడికి, ఇష్రాద్కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి. సరిహద్దుల ఆవల ఉన్న ఉగ్రవాదుల నుంచి అందిన సూచనల మేరకే అతను నడుచుకున్నట్టు అనుమానిస్తున్నారు. -
హస్తిన కంచుకోట!
సాక్షి, న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి, ఐసిస్ ఉగ్రవాదుల దాడి కుట్రను భగ్నం చేసిన నేపథ్యంలో మంగళవారం రిపబ్లిక్ డే వేడుకల కోసం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. వేడుకలకు వేదికైన దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో డేగ కన్నేశారు. ఢిల్లీలో వివిధ ఉగ్రవాద సంస్థల ముఠాలున్నాయని, నగరంలో దాడులు జరగొచ్చని సమాచారం అందడంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు జరిగే రాజ్‌పథ్‌కు చుట్టుపక్కలున్న 71 ఎత్తయిన భవనాల్లో మంగళవారం కొన్నింటిని పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా మూసేస్తారు. వాటిపై ఆర్మీ షార్ప్ షూటర్స్‌ను మోహరించారు. ముష్కరులు డ్రోన్ల ద్వారా దాడులకు పాల్పడొచ్చన్న అనుమానంతో రాడార్‌తో జల్లెడపడుతున్నారు. మూడు నెలల కిందట ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర్లో ఇటీవల ఒక అనుమానిత డ్రోన్ కనిపించడం, నగరంలో ఆర్మీకి చెందిన మూడు వాహనాలు చోరీ అయిన నేపథ్యంలో లోపాలకు తావులేని భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి అయిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ పర్యటన, పరేడ్ సజావుగా సాగేందుకు 49 వేల మంది భద్రతా సిబ్బందిని మొహరించారు. హోలాండ్ పర్యటనకోసం 20 వేల మందిని కేటాయించారు. కీలక ప్రాంతాల్లో వేలాది సీసీటీవీలు అమర్చారు. రాజ్‌పథ్‌పై విజయ్ చౌక్ నుంచి ఇండియాగేట్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. పరేడ్ జరిగే 9.50 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 300 కి.మీ పరధి మేర నగరాన్ని నోఫ్లై జోన్‌గా ప్రకటించారు ఆ సమయంలో పౌర విమానాలనూ గగనతలంలో ఎగరనివ్వరు. కాగా, పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అదనపు బలగాలతో భద్రత పెంచారు. ఈ రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యేకతలు ► ఫ్రాన్స్ సేనలు రిపబ్లిక్ కవాతు చేయనున్నాయి. పరేడ్‌లో విదేశీ సేనలు పాల్గొనడం ఇదే తొలిసారి. ► 26 ఏళ్ల తర్వాత సైన్యానికి చెందిన జాగిలాలు పరేడ్‌లో పాల్గొంటున్నాయి. ► సాధారణ సమయం కంటే పరేడ్ నిర్వహణ కాలాన్ని 25 నిమిషాలు తగ్గించారు. ► {పత్యేకంగా ఒక మహిళా సీఆర్పీఎఫ్ దళం సైనిక విన్యాసాలు చేయనుంది. ► వీవీఐపీ ఎన్‌క్లోజర్‌పై గాజు పైకప్పును బిగించారు. -
పంజాబ్ ఎస్పీకి క్లీన్చిట్
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడిలో అనుమానితుడిగా పేర్కొన్న పంజాబ్ సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి సల్వీందర్ సింగ్‌కు జాతీయ నేర పరిశోధనా సంస్థ క్లీన్ చిట్ ఇచ్చింది. సింగ్‌కు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించిన ఎన్ఐఏ... ఈ దాడితో ఆయనకు సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ లభించలేదని పేర్కొంది. గత పదిహేను రోజులుగా తమ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ర్యాంక్ అధికారి అయిన సింగ్‌ను ప్రశ్నించిన ఎన్ఐఏ, లైడిటెక్టర్ వంటి శాస్త్రీయ పరీక్షలు సైతం చేసింది. వీటితోపాటు అమృత్‌సర్‌లోని ఆయన నివాసం, కార్యాలయం, సంబంధిత ప్రాంతాల్లో శోధించినా ఎలాంటి ఆధారాలూ దొరకలేదని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. -
రాజ్ నాథ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పఠాన్ కోట్ దాడి.. ఎన్ఐఏ విచారణల నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో జరిగిన ఈ సమావేశంలో పఠాన్ కోట్ దాడి, ఎన్ఐఏ విచారణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరో వైపు.. పఠాన్ కోట్ దాడికి బాధ్యులుగా భావిస్తున్న మోస్ట్ వాండెట్ ఉగ్రవాది, జైషే మహ మ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ను కస్టడీలోకి మాత్రమే తీసుకున్నామని పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన మంత్రి తెలిపారు. పఠాన్ కోట్ దాడి వెనక మసూద్ హస్తం ఉందని తేలితేనే.. అతడిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. -
షరీఫ్ యాక్షన్‌తో మోదీకి రిలీఫ్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో జైషే మహమ్మద్ (జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను ఆ దేశ భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకోవడం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇప్పటికిప్పుడు రాజకీయంగా కొంత ఉపశమనమే. లాహోర్ దౌత్యం విఫలమైందంటూ మోదీ సర్వత్రా రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో పాక్ నుంచి వెలువడిన అజార్ డిటెన్షన్ కథనం.. దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఇది మోదీకి రాజకీయంగా కొంత రక్షణ కల్పించిందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతానంటూ 2014 ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ ఘాటైన ప్రకటనలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనల అలజడితో పాకిస్థాన్‌ను కాస్తా దూరంగా పెట్టారు. 2015 వచ్చేసరికి పాక్ విషయంలో ప్రధాని మోదీ వైఖరిలో గణనీయ మార్పు కనిపించింది. అన్ని భయాలు, దౌత్యపరమైన అడ్డంకులు, చిక్కులు పక్కనబెట్టి మరీ లాహోర్‌కు వెళ్లి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో తేనీటి విందు స్వీకరించారు. వ్యక్తిగతంగా షరీఫ్ మానవరాలి పెళ్లికి హాజరయ్యారు. దాయాది దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మోదీ చేసిన ఈ అసాధారణ చొరవపై అప్పట్లోనే అనేక భయాలు వెల్లువెత్తాయి. పాక్‌కు స్నేహహస్తం చాచిన ప్రతి సందర్భంలోనూ భారత్‌లో ఉగ్రవాదులు దాడులకు తెగబడి.. ఆ సంబంధాలకు విఘాతం కలిగించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడటం.. ప్రధాని మోదీ చొరవ తప్పుమోనన్న రాజకీయ అభిప్రాయానికి తావిచ్చింది. మోదీ లాహోర్ దౌత్యాన్ని తప్పుబడుతూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలు విమర్శల దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరుగాలంటే పాకిస్థాన్ కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. పఠాన్‌కోట్ దాడికి సూత్రధారులైన జేఈఎం నేతలు, కార్యాలయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్‌ను కోరింది. ఈ నేపథ్యంలోనే షరీఫ్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం, ఐఎస్ఐ ఉమ్మడిగా వ్యవహరిస్తూ జేఈఎంపై దాడులు చేసి.. దాని సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారత్ అంచనాలకు అనుగుణంగా షరీఫ్ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఈ వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి మోదీ లాహోర్ దౌత్య ప్రభావం ఉపయోగపడుతున్నట్టు ఈ వార్తలు స్పష్టంగా చాటుతున్నాయి. పఠాన్‌కోట్ దాడిపై భారత్ ఇచ్చిన ఆధారాల ప్రకారం పాక్ చర్యలు తీసుకునేలా తన 'స్నేహితుడు' షరీఫ్‌పై మోదీ ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవాగా కోరింది. కానీ మోదీ సర్కార్ సూచనల మేరకు షరీఫ్ ప్రభుత్వం విస్పష్ట చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం పైకి కనిపించేవిధంగా చేపడుతున్న చర్యలు కూడా ప్రధాని మోదీకి రాజకీయంగా, దౌత్యపరంగా కలిసివచ్చేవే. -
పాక్‌లో మసూద్ అరెస్ట్
-
ఎలాంటి సవాలుకైనా సిద్ధం
ఆర్మీ చీఫ్ సుహాగ్ వెల్లడి ♦ పీఓకేలో 17 ఉగ్ర శిబిరాలున్నాయ్ ♦ శాంతి ప్రక్రియకు పాక్ సైన్యం తూట్లు న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తినప్పుడు దానిని దీటుగా ఎదుర్కొనేందుకు ఎలాంటి టాస్క్‌నైనా సమర్థవంతంగా చేపట్టేందుకు సైన్యం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ చెప్పారు. భారత్‌కు నొప్పి కలిగించిన సంస్థలు, వ్యక్తులకు తిరిగి అదే మాదిరి నొప్పి కలిగేలా చేయాలని రెండు రోజుల కిందట రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నా యి. ఆర్మీ డేని పురస్కరించుకొని సైన్యాధిపతి సుహాగ్ బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై కోవర్ట్ దాడులు చేసేందుకు భారత సైన్యానికి సత్తా ఉందా అన్న ప్రశ్నకు, తమకు అప్పగించిన ఎలాంటి పనినైనా సమర్థవతంగా నిర్వహించేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని సుహాగ్ బదులిచ్చారు. దేశం ఎదుర్కొనే ఎలాంటి సవాల్‌ను అయినా అధిగమించేందుకు సైన్యం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందన్నారు. పీఓకేలో ఇంకా కనీసం 17 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు క్రియాశీలకంగా కొనసాగుతున్నాయని, వీటితో భారత్‌కు భద్రతాపరంగా సవాల్ పొంచి ఉందని చెప్పారు. గతంలో 42 ఉగ్ర శిబిరాలు ఉండేవని, కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయ ఒత్తిడితో కొన్నింటిని మూసేశారన్నారు. పంజాబ్‌లోని పాక్ సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబాట్లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ, దీనికి సరిహద్దు భద్రతా దళానిదే బాధ్యతని పేర్కొన్నారు. పఠాన్‌కోట్ దాడిలో పాక్ హస్తముందన్న దానిపై మాట్లాడుతూ, ఉగ్రవాదులు తమ వెంట తెచ్చుకున్న మందులు, ఇతర పరికరాలను బట్టి చూస్తే వారు పాక్ నుంచే వచ్చినట్లు అర్థమవుతోందని సుహాగ్ చెప్పారు. శాంతికి విఘాతం కలిగించేందుకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐలు పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై దాడికి యత్నించాయా అన్న ప్రశ్నకు, గతంలో ఎన్నోసార్లు పాక్ ఆర్మీ శాంతి ప్రక్రియకు తూట్లు పొడిచిందన్నారు. పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్‌ను ఎన్ఎస్జీ కమాండోలకు అప్పగించడం సబబా, కాదా అన్న ప్రశ్నకు, అది సరైన నిర్ణయమేనని చెప్పారు. కాగా, పఠాన్‌కోట్ ఉగ్రదాడిని విచారిస్తున్న ఎన్ఐఏ.. ఉగ్రవాదులు వదిలి వెళ్లిన వాహనం సమీపంలో ఓ చైనా తయారీ వైర్లెస్ సెట్‌ను స్వాధీనం చేసుకుంది. వాహనం సమీపంలో క్లూస్ కోసం వెతుకుతుండగా ఈ సెట్ దొరికిందని దీన్ని ఫొరెన్సిక్ లేబొరేటరీకి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌ను ఎన్ఐఏ వరుసగా మూడోరోజూ విచారించింది. -
పాక్‌లో మసూద్ అరెస్ట్
పఠాన్‌కోట్ ఘటన నేపథ్యంలో భారత్ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ * జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, అతని సోదరుడు, మరికొందరు ఉగ్రవాదులు అరెస్టు * పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కార్యాలయం ప్రకటన * ఉగ్రవాదంపై భారత్‌తో కలసి పనిచేస్తామని వెల్లడి * అరెస్టుపై అధికారిక సమాచారం లేదన్న భారత్ * ప్రధానితో సుష్మాస్వరాజ్, విదేశాంగ అధికారుల భేటీ * నేడు మళ్లీ సమావేశమై పాక్‌తో చర్చలపై నిర్ణయం ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ ఘటన తర్వాత భారత్ తీసుకొచ్చిన ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. ఈ దాడికి బాధ్యులుగా భావిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు రెహ్మాన్ రవూఫ్‌లను అరెస్టు చేసింది. వీరితోపాటు పలువురు జైషే ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. దీంతోపాటు జైషే సంస్థకు చెందిన కార్యాలయాలను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం (ఆర్మీ చీఫ్ జనరల్ రషీల్ షరీఫ్, ఐఎస్ఐ చీఫ్, హోం, ఆర్థిక మంత్రులు, విదేశాంగ శాఖ సలహాదారు సర్తాజ్ అజీజ్, పలువురు కీలక నేతలు హాజరయ్యారు) పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు పకడ్బందీగా పనిచేయాలని.. ఈ ప్రయత్నంలో భారత్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాటు పఠాన్‌కోట్ ఘటనలో లోతైన విచారణ కోసం ఐఎస్ఐ, ఎంఐ, ఐబీలతో పాక్ ప్రధాని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం జనవరి 15న (శుక్రవారం) ఇస్లామాబాద్‌లో ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరగాల్సి ఉండగా.. పఠాన్‌కోట్ ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ భేటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ దాడికి వ్యూహరచన పాకిస్తాన్లో జరిగినట్లు, జైషే ఉగ్రవాదులే దాడికి పాల్పడినట్లు ఆధారాలు అందజేసిన భారత్.. బాధ్యులపై చర్చలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో గతవారంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వరుసగా రెండ్రోజులు ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ద్వైపాక్షిక చర్చల విషయంలో బంతిని పాక్తిసాన్ కోర్టులోకి నెట్టినందున.. ఏం చేయాలనే దానిపై ఈ భేటీల్లో చర్చించారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతోపాటు మరిన్ని వివరాలు పంపించాలని భారత్‌ను కోరారు. జనవరి 2న జైషే ఉగ్రవాదులే పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడ్డారని ఆధారాలు అందజేసిన భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. వీరిని అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేయటంపైనా చర్చించారు. దీనికి అనుగుణంగానే.. పాక్‌లో తలదాచుకుని.. భారత్‌పై దాడులకు వ్యూహరచన చేస్తున్న జైషే చీఫ్, అతని సోదరులతోపాటు.. పలువురు జైషే ఉగ్రవాదులను అరెస్టు చేయటం అనివార్యమైంది. అయితే.. మసూద్ అజర్‌ను భారత్‌కు అప్పగిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. అజర్ అరెస్టుపై తమకు అధికారిక సమాచారం అందలేదని భారత్ తెలిసింది. పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడినట్లు వార్తలొస్తున్నా.. తమకు సమాచారం రాలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాన మంత్రితో విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్, విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్, అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ భేటీ అయ్యారు. అజర్‌పై భారత్ నజర్ 1994లోనే శ్రీనగర్‌లో హర్కతుల్ జిహాదీ సాయంతో అల్లర్లు సృష్టించేందుకు జైషే చీఫ్ మసూద్ అజర్ ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో భారత బలగాలు అజర్‌ను అరెస్టు చేశాయి. అప్పటికే ప్రమాదకర ఉగ్రవాది, వ్యూహకర్తగా పేరున్న మసూద్ అరెస్టుతో కశ్మీర్ లోయలో ఉగ్ర కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో మసూద్‌ను విడిపించేందుకు 1995లో కొందరు ఉగ్రవాదులు కశ్మీర్‌కు వచ్చిన విదేశీ పర్యాటకులను కిడ్నాప్ చేశారు. ఇందులోనుంచి ఒక టూరిస్టు తప్పించుకోగా.. మిగిలిన వారిని ఉగ్రవాదులు చంపేశారు. ఈ ప్రయత్నం బెడిసికొట్టడంతో.. 1999 డిసెంబర్లో 155 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం (ఐసీ184)ను మసూద్ సోదరుడు ఇబ్రహీం నేపథ్యంలోని కొందరు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అఫ్ఘానిస్తాన్‌లోని కాందహార్‌లో (అప్పడు తాలిబాన్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం) విమానాన్ని ల్యాండ్ చేసి.. మసూద్‌తో పాటు మరో ఇద్దరు కరడుగట్టిన నేరస్తులను విడిపించుకున్నారు. 2001లో భారత పార్లమెంటుపై దాడికి కూడా మసూద్ వ్యూహరచన చేశారు. అప్పడు భారత్ ఒత్తిడితో జైషే చీఫ్‌ను అరెస్టు చేసినా..2002లో విడుదల చేశారు. అప్పటినుంచి అజర్‌పై భారత్ దృష్టిపెట్టింది. విధానం నిర్ణయించటానికి షరీఫ్ ఎవరు? పఠాన్‌కోట్‌పై ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ పాత్రమై అనుమానాలు తలెత్తుతున్న సమయంలో.. పాకిస్తాన్ మాజీ రాయబారి అషఫ్ ్రజహంగీర్ కాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో విదేశాంగ విధానం నిర్ణయించటంలో పాకిస్తాన్ ప్రధాని ఒక్కరే నిర్ణయం తీసుకోలేరని.. ఆర్మీ మద్దతు లేకుండా అడుగు ముందుకేయలేరని స్పష్టం చేశారు. ‘మోదీ స్టాప్ ఓవర్ విషయంలో పాక్ ఆర్మీ స్పందన ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయి పాక్ పర్యటించి వెళ్లాకే కార్గిల్ యుద్ధం జరిగింది. ఇప్పుడ మోదీ పర్యటన తర్వాతే పఠాన్‌కోట్ ఘటన జరిగింది’అని డాన్ పత్రికకు రాసిన వ్యాసంలో కాజీ పేర్కొన్నారు. ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశంలో ఆర్మీ చీఫ్ పాల్గొన్నంత మాత్రాన ప్రభుత్వం-ఆర్మీ మధ్య అన్నీ సవ్యంగా ఉన్నట్లు కాదని ఆయన అన్నారు. భారత్‌తో దౌత్యపర సంబంధాల విషయంలో ఆర్మీ నిర్ణయమే కీలకమవుతుందని వెల్లడించారు. స్పష్టమైన ఆధారాలిచ్చి భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న కాజీ.. బాధ్యులపై చర్యలుంటాయని షరీఫ్ హామీ ఇచ్చినా.. ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటారనుకోలేదన్నారు. పాక్ చర్యపై భారత్‌లో మిశ్రమ స్పందన జైషే చీఫ్ అరెస్టుపై బీజేపీ, కాంగ్రెస్ జాగ్రత్తగా స్పందించగా శివసేన మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక శాంతి చర్చలకు పాకిస్తాన్ తీసుకున్న చర్యలను ఆహ్వానిస్తున్నామని బీజేపీ ప్రకటించింది. అభివృద్ధిని కోరుకునే భారత్-పాక్ దేశాల ప్రజలు ఈ చర్యలను హర్షిస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ తెలిపారు. కాగా, పాక్ చర్యను స్వాగతించిన కాంగ్రెస్ కఠినంగా వ్యవహరించటంలో వెనక్కు తగ్గొద్దని సూచించింది. చర్చల ప్రక్రియను కొనసాగించేందుకు నవాజ్ షరీఫ్ చిత్తశుద్ధితో పనిచేస్తే.. పాకిస్తాన్లో గొప్ప రాజనీతిజ్ఞుడుగా ఖ్యాతి సంపాదిస్తారని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. జేడీయూతోపాటు ఇతర పార్టీలు కూడా పాక్ నిర్ణయాన్ని స్వాగతించగా.. శివసేన మాత్రం అజర్ అరెస్టుపై పెదవి విరిచింది. చర్చల ప్రక్రియకు ఇదేం పెద్ద అనుకూల అంశం కాబోదని.. ఉగ్రవాదులను అరెస్టు చేయటం, తర్వాత విడుదల చేయటం పాకిస్తాన్‌కు అలవాటేనని వ్యాఖ్యానించింది. -
'అజార్ అరెస్టా.. ఇంకా కన్ఫర్మ్ కాలేదు'
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడిలో సూత్రదారి మౌలానా మసూద్ అజార్ అరెస్టుపై తమకు అధికారిక ప్రకటన సమాచారం లేదని భారత్ స్పష్టం చేసింది. అతడు అరెస్టు అయ్యాడా లేదా అనే విషయంపై పాక్ నుంచి తమకు ధ్రువీకరణ సమాచారం అందలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. పాకిస్థాన్ మంత్రి మహ్మద్ జుబెయిర్ కూడా ఇదే అంశాన్ని తెలిపారు. మసూద్ అజార్ అరెస్టు అయ్యాడని వార్తను ఇప్పుడే పక్కాగా చెప్పలేమని, అయితే, అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో చాలామందిని అరెస్టు చేసినట్లు ఆ మంత్రి తెలిపారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ అధినేత మౌలానా మసూద్ అజార్‌ను ఇస్లామాబాద్‌లో భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నట్టు బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద గ్రూప్ కార్యాలయాలపై దాడులు జరుపుతూ.. వాటిని మూసివేస్తున్న సైన్యం.. ఇందులో భాగంగా మసూద్, అతని నలుగురు కీలక అనుచరులని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయని పాకిస్థాన్‌కు చెందిన జీయో న్యూస్ వెల్లడించింది. -
కాందహార్ హైజాక్ వల్ల విడుదలై.. ఇప్పుడు దొరికాడు!
జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూపు స్థాపకుడు, 2001 నాటి పార్లమెంటుపై దాడి సూత్రధారి మసూద్ అజార్ గురించి భారత నిఘా, భద్రతా సంస్థలు ఎప్పటినుంచో గాలిస్తున్నాయి. 1999 నాటి కాందహార్ హైజాక్ వ్యవహారం ద్వారా తప్పించుకొని పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న మసూద్ అజార్‌ను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో దాయాదిని కోరుతూ వస్తోంది. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి వ్యవహారంలో మసూద్ అజార్‌ను పాక్ భద్రతా సంస్థలు నిజంగానే అదుపులోకి తీసుకుంటే.. భారత్‌కు అది పెద్ద విజయమే అవుతుంది. భారత్-పాకిస్థాన్ చర్చల దిశగా కీలక ముందడుగు పడినట్టు అవుతుంది. పాకిస్థాన్ పంజాబ్‌లోని భవల్‌పుర్‌లో జన్మించిన మసూద్ అజార్‌ను మొదట 1994లోనే అరెస్టు అయ్యాడు. తీవ్రవాద కార్యకలాపాల కోసం పోర్చుగీసు నకిలీ పాస్పోర్టుతో కశ్మీర్ వచ్చిన అతన్ని అరెస్టు చేసి జైలుకు కూడా తరలించారు. అయితే, 1999లో పాకిస్థాన్ ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ తరలించారు. విమానంలోని 155 మంది ప్రయాణికులు బందీలుగా చిక్కడంతో ఉగ్రవాదుల డిమాండ్ మేరకు జైల్లో ఉన్న మసూద్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన ప్రయాణికులను విడిపించుకుంది. అప్పట్లో కాందహార్ తాలిబన్ అధీనంలో ఉండేది. కాందహార్ నుంచి పాకిస్థాన్ పారిపోయిన అజార్ 2001లో భారత పార్లమెంటుపై దాడి వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత తన సహచరుడు ఒమర్ షైక్‌తో కలిసి జమ్ముకశ్మీర్‌లో మిలిటెన్సీని ప్రేరేపించడానికి జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. చాలాకాలంపాటు సొంత ప్రాంతం పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్పూర్లో అజ్ఞాతంలో గడిపిన అజార్‌ను పట్టుకునేందుకు భారత నిఘా, భద్రతా సంస్థలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. 2014లో మసూద్ పాక్‌లోని ఓ బహిరంగ ర్యాలీలో ఫోన్ ద్వారా ప్రసంగించడంతో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. జేఈఎం ద్వారా భారత్ లక్ష్యంగా అతడు ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నాడని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. -
పాక్‌లో మసూద్ అజహర్ బంధువులు అరెస్టు!
ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్ చర్యలకు ఉపక్రమించినట్టు కనిపిస్తోంది. పఠాన్‌కోట్ దాడికి సూత్రధారులుగా భావిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ సభ్యులను పాక్ భద్రతా దళాలు బుధవారం అదుపులోకి తీసుకున్నాయి. జైషే మహమ్మద్ కార్యాలయాలపై దాడులు జరుపుతూ.. వాటిని మూసివేసినట్టు తెలుస్తోంది. 'జైషే మహమ్మద్‌కు చెందిన పలువురు సభ్యులను అదుపులోకి తీసుకొని, వాటి కార్యాలయాలను సీల్ చేస్తున్నట్టు పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అరెస్టైన వారిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బంధువులు కూడా ఉండి ఉండొచ్చునని పాక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పఠాన్‌కోట్ దాడిపై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిని తెలుసుకునేందుకు తమ విచారణాధికారులను భారత్ పంపిస్తామని ఇప్పటికే పాక్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై భారత్ ఇంకా స్పందించలేదు. పఠాన్‌కోట్ దాడికి కారణమైన జైషే మహమ్మద్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటేనే.. భారత్-పాక్ చర్చలు ముందుకు కొనసాగిస్తామని మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. -
అమరవీరుల కుటుంబాలకు కేజ్రీవాల్ పరామర్శ
గురుదాస్ పూర్: పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, టాక్సీ డ్రైవర్ కుటుంబ సభ్యులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. చాక్ షరీఫ్, ఝుండా గురజాన్ గ్రామాలకు వెళ్లి హావిల్దార్ కుల్వంత్ సింగ్, ఫతేహ్ సింగ్, టాక్సీ డ్రైవర్ ఇకాగర్ సింగ్ కల్వంత్ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అన్నివిధాలా అండగా ఉంటామని వారికి భరోసాయిచ్చారు. అమరవీరులకు నివాళి అర్పించారు. -
జమ్మూకశ్మీర్‌కు ఎన్ఐఏ బృందం
పఠాన్‌కోట్ దాడులపై దర్యాప్తు ముమ్మరం ♦ కతువా, సాంబా ప్రాంతాలను సందర్శించిన అధికారులు ♦ రెండోరోజూ సల్వీందర్ విచారణ న్యూఢిల్లీ/నోయిడా: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో ఉగ్రవాదుల దాడిపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరింత విస్తృతం చేసింది. గత ఏడాది ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని కతువా, సాంబా జిల్లాల్లో సైనిక, పోలీసు శిబిరాలపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఏవైనా ఆనవాళ్లు దొరుకుతాయనే ఉద్దేశంతో ఎన్ఐఏ బృందాలు ఆయా ప్రాంతాలను సందర్శించాయి. దాడులకు సంబంధించిన సారూప్యతలు, ఆపరేషన్ నిర్వహణ తీరుతెన్నులను కనుగొనేందుకు మంగళవారం అక్కడికెళ్లినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. గత మార్చి 21న ఉగ్రవాదులు జమ్మూ-పఠాన్‌కోట్ హైవేలోని సాంబా సైనిక శిబిరంపై తుపాకులతో కాల్పులు జరిపారు. అలాగే అంతకుముందు రోజు కతువాలోని రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌పై ముష్కరులు దాడి చేశారు. సాంబాలో ఆర్మీ క్యాంప్‌పై దాడులకు పాల్పడిన ఉగ్రముఠా భద్రతా బలగాలతో ఎక్కువసేపు పోరాడే ఉద్దేశంతో సరిపడా ఆహారం, ఇతరాలను వెంట తెచ్చుకున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కి కవరేజ్ అందిస్తున్న మూడు సెల్‌ఫోన్ టవర్ల నుంచి వెళ్లిన కాల్స్ వివరాలివ్వాలని ఎన్ఐఏ ఆయా కంపెనీలను కోరింది. పొంతనలేని సమాధానాలు.. గే పఠాన్‌కోట్‌లో దాడులకు ముందు ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్న పంజాబ్ పోలీస్ అధికారి సల్విందర్ సింగ్‌ను ప్రధాన కార్యాలయంలో ఎన్ఐఏ వరుసగా రెండోరోజూ విచారించింది. సింగ్ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆయా వర్గాలు చెప్పాయి. దాడులకు ముందు పంజ్ పీర్ దర్గా నుంచి వస్తుండగా తనను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని సింగ్ చెప్పిన మేరకు ఎన్ఐఏ.. ఆ దర్గా ఇన్చార్జి సోమ్రాజ్కు సమన్లు జారీచేసింది. ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినట్లు భావిస్తున్న బమియాల్ గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ దర్గా ఉంది. ఈ దర్గాకు తాను నిత్యం వెళ్తుంటానని సల్విందర్ సింగ్ చెప్పగా, దాడులకు ముందే మొదటిసారి సింగ్ దర్గాకు వచ్చినట్లు సోమ్రాజ్ చెప్పారు. అదేరోజు ఎస్పీ స్నేహితుడు రాజేశ్ వర్మ, వంటమనిషి మదన్‌గోపాల్ రెండుసార్లు దర్గా వద్దకు వచ్చారన్నారు. బుధవారం విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ మదన్‌గోపాల్‌కు సమన్లు ఇచ్చింది. అవసరమైతే సల్విందర్ను, మదన్‌గోపాల్‌ను కలిపి ప్రశ్నిస్తారని సమాచారం. పాక్‌ను నమ్మకుండా ఉండలేం: రాజ్‌నాథ్ పఠాన్‌కోట్ దాడిపై భారత్ ఇచ్చిన సమాచారం మేరకు పాక్ చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసముందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. పాక్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటామని చెప్పిందని, వారిని నమ్మకుండా ఉండేందుకు ఏ ఒక్క కారణమూ కనిపించలేదని నోయిడాలో అన్నారు. సస్పెన్స్‌లో భారత్, పాక్ చర్చలు భారత్, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శుల చర్చలపై అనిశ్చితి తొలగలేదు. ఇస్లామాబాద్‌లో ఈ చర్చలు ఈ శుక్రవారం(జనవరి 15) నుంచి ప్రారంభం కానుండగా.. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో.. భారత్ పునరాలోచనలో పడింది. ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రూ. 20 ఇస్తే చాలు.. లోపలకు వెళ్లొచ్చు! ఉగ్రవాదులు దాడిచేసిన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరానికి సంబంధించిన భద్రతాపరమైన లొసుగులు వెల్లడయ్యాయి. యుద్ధ విమానాలు, హెలికాప్లర్లుండే రక్షణపరంగా కీలకమైన పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి స్థానికులు యథేచ్ఛగా వెళ్లేవారని, అక్కడి భద్రతా సిబ్బందికి కేవలం రూ. 20 ఇచ్చి తమ పశువులను అదే ప్రాంగణంలో మేపుకునేవారని తేలింది. అక్కడి సెక్యూరిటీ సహకారంతో మిలటరీ క్యాంటీన్లో షాపింగ్ కూడా చేసేవారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అందించిన నివేదికలో నిఘా వర్గాలు పేర్కొన్నాయి. వైమానిక స్థావరంలోకి ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు, అక్కడి దుకాణాల్లో షాపింగ్ చేసేందుకు కొందరు గుర్తింపు పత్రాలను సైతం రూపొందించుకున్నట్లు తేలిందన్నాయి. ఎయిర్ బేస్ చుట్టుపక్కల గుజ్జర్లు నివసిస్తున్నారని, తమ పశువులను మేపుకునేందుకు వైమానిక స్థావరంలోని విశాల ఆవరణం అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో వారు భద్రతా సిబ్బందికి లంచం ఇచ్చి పశువులతో సహా లోపలకు వెళ్లేవారని తెలిపాయి. -
పాక్ హామీ ఇచ్చింది: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రదారులపై చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ హామీ ఇచ్చిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. పాక్ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలని, అంతవరకు ఎదురు చూడాలని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పఠాన్‌కోట్ దాడి సూత్రధారులపై చర్యలు తీసుకునే విషయంలో పాక్ చిత్తశుద్ధిని అనుమానించడానికి ప్రస్తుతానికి ఎలాంటి కారణం లేదని చెప్పారు. పఠాన్‌కోట్ దాడి సూత్రధారులను పట్టుకునేందుకు పాక్ చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అత్యున్నత స్థాయి అధికారులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పాక్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
'ఇప్పటికైతే అనుమానం లేదు.. దర్యాప్తు పూర్తికాని'
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని పాకిస్థాన్ హామీ ఇచ్చిందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను దర్యాప్తు విషయంలో ఇంకా అనుమానించాల్సిన అవసరం లేదని తాను అనుకుంటున్నానని చెప్పారు. వారు దర్యాప్తు పూర్తి చేసేవరకు ఎదురుచూస్తే బాగుంటుందని అన్నారు. పఠాన్‌కోట్ దాడికి సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలను, వివరణలను పాకిస్థాన్ భారత్‌కు ఇచ్చిన సందర్భంగా రాజ్‌నాథ్ ఇలా స్పందించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న భారత్ వాటి వివరాలు తెలియజేయాలని పాకిస్థాన్‌ను కోరిన విషయం తెలిసిందే. అయితే, వాటిని పరిశీలించిన పాక్ అవి తమ దేశంలో రిజిస్ట్రేషన్ అయిన సిమ్ కార్డులు కాదని చెప్పడంతోపాటు, ఆ దేశ దర్యాప్తు అధికారులు పఠాన్ కోట్ దాడికి సంబంధించి ప్రాథమికంగా సేకరించిన ఆధారాలను భారత్ కు సోమవారం అందజేసిన విషయం తెలిసిందే. -
భారత్ అతిగా స్పందిస్తుంది: ముషారఫ్
పాకిస్థాన్ : భారత్‌లోని పఠాన్‌కోట్ ఘటనపై పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మంగళవారం స్పందించారు. ఈ ఘటనపై భారత్ అతిగా స్పందిస్తుందని ముషారఫ్ ఆరోపించారు. పాక్ - భారత్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే అని ఆయన చెప్పారు. పఠాన్‌కోట్‌లాంటి ఘటనలు సాధారణం అని ఆయన వ్యాఖ్యానించారు. పాక్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పర్యటనకు అంత ప్రాధాన్యత లేదని ముషారఫ్ పేర్కొన్నారు. -
రెండోరోజు విచారణకు హాజరైన సల్వీందర్
న్యూఢిల్లీ : పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్ రెండోరోజు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఎదుట హాజరయ్యారు. ఆయనకు ఇవాళ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు కేంద్రం నుంచి కూడా అనుమతి లభించినట్లు సమాచారం. కాగా పఠాన్‌కోట్‌పై దాడికి ముందు ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని పేర్కొన్న సల్వీందర్ సింగ్ కిడ్నాప్‌కు ముందు, తర్వాత జరిగిన సంఘటనలపై ఆయన చెప్తున్న కథనాల్లో పొంతన లేని అంశాలు ఉండటంతో లోతుగా ప్రశ్నించేందుకు తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఎన్ఐఏ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సల్వీందర్ సింగ్ పంజాబ్ సాయుధ పోలీసు 75వ బెటాలియన్‌కు అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్నారు. నిన్న ఆయనను ఎన్ఐఏ బృందం సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ మాత్రం సల్వీందర్కు క్లీన్ చిట్ ఇవ్వలేదు. దీంతో మరోసారి ఆయనను విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ ఆదేశించడంతో మరోసారి విచారణకు హాజరయ్యారు. -
పఠాన్‌కోట్ దాడి; పాక్‌లో అరెస్ట్‌లు
ఇస్లామాబాద్: భారత్ హెచ్చరికలు, అమెరికా వంటి అగ్రదేశాల ఒత్తిళ్లు పనిచేశాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి ఘటనపై పాకిస్తాన్ అనూహ్యంగా స్పందించింది. పఠాన్‌కోట్ దాడి సూత్రధారులను పట్టుకునేందుకు పాక్ అధికారులు తమ దేశాంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేయించారు. సోమవారం కొందరు అనుమానితులను అరెస్ట్ చేసినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాక్‌లోని గుజ్రన్‌వాలా, జెలుమ్, బహవల్పూర్ జిల్లాల్లో దాడులు జరిగాయి. అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేశారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో వీరికి సంబంధముందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడి ఘటనపై విచారణకు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటలిజెన్స్ బ్యూరో, ఐఎస్ఐ, మిలటరీ ఇంటలిజెన్స్, ఫెడరల్ ఇంటలిజెన్స్ ఏజన్సీ, పోలీసులు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పఠాన్‌కోట్ దాడి సూత్రధారులపై పాక్ చర్యలు తీసుకోకుంటే ఇరు దేశాల విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శుల సమావేశం జరగదని భారత్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ హెచ్చరించారు. ఈ విషయంపై అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి కూడా పాక్ ప్రధానితో మాట్లాడారు. -
భారత్-పాక్ చర్చలు రద్దు
-
ఎన్ఐఏ విచారణకు హాజరైన సల్వీందర్
కోల్‌కతా: ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ సోమవారం ఉదయం ఎన్ఐఏ ఉన్నత కార్యాలయ సముదాయానికి వచ్చారు. సోమవారం తమ ముందు హాజరుకావాలని ఎన్ఐఏ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన సోమవారం ఉదయమే అక్కడికి చేరుకున్నారు. పఠాన్ కోట్ పై జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడికి పరోక్షంగా సల్వీందర్ సహకరించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పఠాన్ కోట్ దాడికి ముందు తమను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆయుధ సామాగ్రి కూడా ఉందని, తనను మధ్యలో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. అనంతరం ఎన్ఐఏ సందించిన పలు ప్రశ్నలకు కూడా ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆయనపై మరింత అనుమానం పెరిగి లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమయ్యారు. -
భారత్-పాక్ చర్చలు రద్దు: దోవల్
న్యూఢిల్లీ: ఈ నెల 15న జరగాల్సిన భారత్-పాక్ విదేశాంగశాఖ కార్యదర్శి స్థాయి చర్చలు రద్దు అయ్యాయి. పఠాన్‌కోట్ దాడుల నేపథ్యంలో పాక్‌తో చర్చలు రద్దు చేసినట్టు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పఠాన్‌కోట్ దాడి సూత్రదారులపై చర్యలు తీసుకునే వరకు చర్చలు జరగవని చెప్పారు. పాక్ చర్యలపై భారత్ సంతృప్తి చెందినప్పుడే చర్చలపై ఆలోచిస్తామని దోవల్ పేర్కొన్నారు. -
సల్వీందర్ సత్యవంతుడో.. కాదో?
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడిపై విచారణలో భాగంగా గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ఇస్తున్న వివరణలు నిజాలా లేక అబద్ధాల అనే విషయం నేడు తేలనుంది. ఆయనకు నేడు సత్య శోధన (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ కేసు విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆయనను ఇప్పటికే ఢిల్లీలో పాలిగ్రాప్ పరీక్షలకు తీసుకెళ్లింది. పాలిగ్రాప్ పరీక్షలకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ నెల 8నే సల్వీందర్ సింగ్ కు ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. పఠాన్ కోట్ దాడికి ముందు తమను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆయుధ సామాగ్రి కూడా ఉందని, తనను మధ్యలో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. అయితే, ఆయన ఇస్తున్న వివరణలు పలు రకాల అనుమానాలకు దారి ఇవ్వడంతోపాటు ఆ రోజు కిడ్నాప్ అయినట్లు చెప్తున్న ప్రాంతంలో దర్గా మూసే సమయం అయినా కావాలని తెరిపించి ఉంచారని, సల్వీందర్ స్నేహితుడు రెండుసార్లు దర్గాను సందర్శించారని ఆ దర్గాలో పనిచేసే వ్యక్తి చెప్పారు. దీంతో ఎన్ఐఏ అధికారులు సల్వీందర్ తీరును మరింత అనుమానించారు. పైగా ఆ దర్గా ప్రాంతంలో, సమీప పొలాల్లో వేర్వేరు సైజుల్లో ఉన్న కాలి బూటు గుర్తులను కూడా ఫొటోలు తీసుకుని పరిశీలించారు. దాదాపు అన్నిరకాలుగా సల్వీందర్‌ను విచారించిన ఎన్ఐఏ అధికారులు చివరికి పాలిగ్రాప్ పరీక్షలకు సిద్ధమయ్యారు. -
‘పఠాన్ కోట్’పై పాక్ దర్యాప్తు
-
‘పఠాన్ కోట్’పై పాక్ దర్యాప్తు
పాక్ ప్రభుత్వ ప్రకటన భారత్ అందించిన ఆధారాలపై విచారణ.. చర్చలపై ఆశాభావం ఇస్లామాబాద్/పఠాన్‌కోట్: తమ సరిహద్దుకు దగ్గర్లోని పంజాబ్‌లో పఠాన్‌కోట్ భారత వైమానిక దళ స్థావరంపై ఉగ్రాదాడికి సంబంధించి భారత్ అందించిన సాక్ష్యాధారాలపై దర్యాప్తును సమీక్షించినట్లు పాక్ ప్రకటించింది. పఠాన్‌కోట్ దాడులపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ శుక్రవారం వరుసగా రెండోరోజు ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. ఈ ప్రాంతం నుంచి ఉగ్రవాదాన్ని తరిమేసే దిశగా భారత్‌తో కలిసి పాక్ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించినట్లు భేటీ అనంతరం పాక్ పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరుదేశాల మధ్య ఇటీవల చర్చలతో నెలకొన్న సానుకూల వాతావరణం నేపథ్యంలో.. చర్చల ప్రక్రియకు ఇరుదేశాలు కట్టుబడి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘పాక్ గడ్డను ఉగ్రచర్యలకు వాడే అందరు ఉగ్రవాదులు, అన్ని ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టే విషయంలో పాక్ ప్రజలు, ప్రభుత్వం కట్టుబడి ఉంద’ని అందులో పేర్కొంది.భేటీలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్, విదేశీ వ్య వహారాల్లో ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్, జాతీయ భద్రత సలహాదారు నాసర్ ఖాన్ జంజువా, ఐఎస్ఐ డీజీ రిజ్వాన్ అఖ్తర్, విదేశాంగ కార్యదర్శి అయిజాజ్ అహ్మద్ చౌధురి పాల్గొన్నారు. సాక్ష్యాధారాలను అందిస్తూ.. ఉగ్ర దాడి వెనకున్న వారిపై సాధ్యమైనంత త్వరగా, కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా భారత్ డిమాండ్ చేయడం తెలిసిందే. గురువారం కూడా షరీఫ్ ఇస్లామాబాద్‌లో ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. అనంతరం.. పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తునకు పాక్ ప్రభుత్వం ఆదేశించింది. భారత్ అందించిన సాక్ష్యాధారాలను ఆ భేటీలో ఐబీ చీఫ్ అఫ్తాబ్ సుల్తాన్‌కు అందించారు. వాటిపై విచారణ జరపాల్సిందిగా నిఘా విభాగాన్ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించినట్లుగా పాక్ మీడియా పేర్కొంది. భారత జాతీయ భద్రతాసలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌తో సంప్రదింపులు కొనసాగించాలని తమ దేశ ఎన్ఎస్ఏ జంజువాను షరీఫ్ ఆదేశించారు. దాడికి సంబంధించి భారత్ కొన్ని ఫోన్ నంబర్లు మాత్రమే ఇచ్చిందని, మరింత సమాచారం కావాలని భారత్‌ను కోరే అవకాశముందని ఓ అధికారి తెలిపారు. దాడి పూర్వాపరాలపై పాక్ సత్వరం సమగ్ర, నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు జరపాలని అమెరికా అభిలషించింది. కూంబింగ్ ముగిసింది.. మరోవైపు, పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో కూంబింగ్ ముగిసింది. అక్కడి విశాల ఆవరణాన్నిమూడు రోజులుగా ఆర్మీ, ఎన్ఎస్జీ, వైమానికదళానికి చెందిన గరుడ కమెండోలు జల్లెడబట్టారు. ఉగ్రవాదులెవరూ దాగిలేరని, ఆయుధాలు, మందుగుండు.. తదితరాలేవీ లేవని నిర్ధారించుకున్నారు. కాగా, సైనిక దుస్తుల్లో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న వార్తలతో పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్‌లలో హైఅలర్ట్‌ను కొనసాగించారు. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో పార్లమెంట్ భద్రతను స్పీకర్ సుమిత్రా మహాజన్ సమీక్షించారు. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా భద్రతాదళాలను ఆదేశించారు. మరోపక్క.. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండొచ్చని వారి మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు. వారి శరీరాల్లో 3 నుంచి 10 వరకు బుల్లెట్లున్నాయన్నారు. డీఎన్ఏ పరీక్షల కోసం మృతదేహాల నుంచి గోర్లు, దంతాలు తదితరాలను సేకరించారు. ఇద్దరు టైస్టుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయన్నారు. ప్రజలు ఆర్మీ యూనీఫామ్స్ వాడొద్దు ఈ దాడి చేసిన ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చిన నేపథ్యంలో.. సైనికుల తరహాలో వస్త్రధారణ చేయొద్దని పౌరులకు, అలాంటి దుస్తులను అమ్మొద్దని దుకాణదారులకు ఆర్మీ నిబంధనలు జారీ చేసింది. ఇవి దేశవ్యాప్తంగా వర్తిస్తాయంది. పఠాన్‌కోట్ దాడికి ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లోనే వచ్చిన విషయం తెలిసిందే. నేడు పఠాన్‌కోట్‌కు మోదీ? కాగా ప్రధాని మోదీ శనివారం పఠాన్‌కోఠ్ ఎయిర్‌బేస్‌ను సందర్శించే అవకాశముందని పీఎంఓ వర్గాలు తెలిపాయి. అనుమానాస్పద ఎస్పీకి ఎన్ఐఏ సమన్లు పఠాన్‌కోట్ దాడి విషయంలో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న, వివాదాస్పద పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌కు ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. సమగ్ర విచారణ నిమిత్తం సోమవారం తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించిందని సంబంధిత వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఆయనపై సత్య శోధన పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయని వెల్లడించాయి. ఉగ్రదాడి జరిగిన ముందు రోజు ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడానికి సంబంధించి సల్వీందర్ నమ్మశక్యం కాని రీతిలో వివరణ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోన్న నేపథ్యంలో ఆయనపై ఎన్ఐఏ ప్రధానంగా దృష్టి పెట్టింది. కాగా.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడన్న ఆరోపణలపై సల్వీందర్ సింగ్‌పై పంజాబ్ పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది. -
పాకిస్ధాన్‌లోనే పధకం రచన..!
-
మసూద్, అతడి సోదరుడు సూత్రధారులు!
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ జైష్-ఈ-అహ్మద్ హస్తం ముందని గుర్తించినట్టు తెలుస్తోంది. జైష్-ఈ-అహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్, అతడి సోదరుడు, మరో ఇద్దరు దాడికి సూత్రధారులుగా గుర్తించామని పాకిస్థాన్ కు భారత్ తెలిపినట్టు సమాచారం. పఠాన్ కోట్ దాడి వెనుకున్న కుట్రదారులను చట్టపరంగా శిక్షించేందుకు పాకిస్థాన్ వెంటనే చర్యలు చేపట్టాలని పాకిస్థాన్ భారత్ కోరుతోంది. ఈనెల 15న ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోంది. మరోవైపు దర్యాప్తులో సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి హామీయిచ్చిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. -
పఠాన్ కోట్ ఘటనపై పాక్ లో ఉన్నతస్థాయి భేటీ
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయాలని అధికారులను పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆదేశించారు. గురువారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి ఘటనపై సమావేశంలో చర్చించారు. భారత్ అందజేసిన ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను నవాజ్ షరీఫ్ ఆదేశించారు. జాతీయ, స్థానిక భద్రతకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక మంత్రి, ఆంతరంగిక వ్యవహారాల మంత్రి, విదేశాంగ సలహాదారు, విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు, నిఘా విభాగం ప్రధానాధికారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ అందించిన ఆధారాలతో పఠాన్ కోట్ దాడిపై దర్యాప్తు వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. అయితే భారత్ అందజేసిన సమాచారం సరిపోదని, మరిన్ని ఆధారాలు కోరాలని ఓ అధికారి పేర్కొన్నట్టు తెలిపాయి. గట్టి ఆధారాలుంటే దోషులపై కేసులు పెట్టొచ్చని, లేకుంటే కోర్టులు జోక్యం చేసుకుని అనుమానితులను విడుదల చేసే అవకాశముందని అభిప్రాయపడినట్టు వెల్లడించాయి. పఠాన్ కోట్ దాడి కేసులో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో అంగీకారానికి వచ్చారు. దాడికి పాల్పడినవారిని చట్టం ముందు నిలబెడతామని భారత ప్రధాని నరేంద్ర మోదీకి హామీయిచ్చిన నేపథ్యంలో నవాజ్ షరీఫ్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. -
'అసలేం జరిగిందో చెప్పండి'
తిరువనంతపురం: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ దాడి జరిగిందని ధ్వజమెత్తారు. గురువారం ఆయన బహిరంగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'ఉగ్రవాదుల చొరబాట్లను నివారించడంలో లొసుగులు బయటపడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రధాని మోదీ ఇప్పటికైనా మౌనం వీడాలి. పఠాన్ కోట్ లో అసలేం జరిగిందో ప్రజలకు చెప్పాలి' అని ఆంటోనీ డిమాండ్ చేశారు. మోదీ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత పఠాన్ కోట్ లో దాడి జరిగిందని, ఇది తీవ్రమైన వ్యవహారమన్నారు. ఇక ఎంతమాత్రం మోదీ మౌనంగా ఉండడానికి వీల్లేదని, అసలేం జరిగిందో జాతికి చెప్పాలని డిమాండ్ చేశారు. పంబాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడిన ఆరుగురు ఉగ్రవాదులను సైనిక బలగాలు హతమార్చాయి. ఉగ్రవాదులతో పోరాటంలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. -
అటు కూంబింగ్.. ఇటు విచారణ
-
అటు కూంబింగ్.. ఇటు విచారణ
పఠాన్‌కోట్ రంగంలోకి ఎన్ఏఐ చీఫ్ ♦ సాయంత్రం ఎయిర్‌బేస్ వద్ద కలకలం ♦ ఎస్పీ సల్విందర్ సింగ్‌ను ప్రశ్నించిన ఎన్ఏఐ పఠాన్‌కోట్: ముష్కర మూకలు దాడి చేసిన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. నాలుగు రోజులుగా తుపాకుల మోతతో హోరెత్తిన ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు మిగిలున్నారా అనే అనుమానంతో భద్రతా దళాలు అణువణువూ గాలిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనను విచారించేందుకు ఎన్ఐఏ చీఫ్ శరద్‌కుమార్ రంగంలోకి దిగారు బుధవారం ఎయిర్‌బేస్‌లో వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. పఠాన్‌కోట్ ఘటనకు సంబంధించి.. ఇప్పటివరకు మొత్తం మూడు కేసులను ఎన్ఐఏ నమోదు చేసింది. జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి చెందిన 20 మంది సభ్యుల బృందం ఎయిర్‌బేస్‌లో ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. మరోవైపు పఠాన్‌కోట్ ఘటనకు ముందు కిడ్నాపై విడుదలైన ఎస్పీ సల్విందర్ సింగ్నుకూడా ఎన్ఐఏ విచారించింది. ఎస్పీ, గాయాలతో ఉన్న అతని మిత్రుడు వర్మ చెబుతున్న విషయాలకు పొంతన కుదరకపోవటంతో ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేసింది. గురుద్వారా పూజారిని కూడా ఎన్ఐఏ విచారించింది. కిడ్నాప్ విషయంలోనూ ఎస్పీ, డ్రైవర్, వర్మ చెబుతున్న దానికి పొంతన కుదరలేదు. బుధవారం సాయంత్రం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ వద్ద కలకలం రేగింది. గడ్డంతో, ఖాకీ దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి ఎయిర్‌బేస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా గుర్తించిన బలగాలు.. అప్రమత్తమయ్యాయి. ‘బ్యాగును దూరంగా పడేసి.. నేలపై పడుకోవాల’ని ఆర్మీ చేసిన హెచ్చరికలను ఆ వ్యక్తి పట్టించుకోలేదు. 15-20 నిమిషాల హైడ్రామా తర్వాత భద్రతా బలగాలు ఆయన్ను పట్టుకున్నాయి. కాగా, ఆర్మీ, ఎన్ఎస్జీ సంయుక్తంగా పఠాన్‌కోట్ ఆపరేషన్‌ను నిర్వహించాయని.. లెఫ్టినెంట్ జనరల్ కమల్జిత్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదులు ఎయిర్‌ఫోర్సు స్టేషన్ లోపల ఉన్న రెండస్తుల భవంతిలో దాక్కోవటం వల్ల ఆపరేషన్ తొందరగా ముగిసిందన్నారు. కాగా, బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ పఠాన్‌కోట్ ఉదంతాన్ని కేబినెట్ సహచరులకు వివరించారు. మరోవైపు, సరిహద్దుల్లో భద్రతా లోపాల కారణంగానే ఉగ్రవాదులు భారత్‌లోకి వచ్చారన్న విమర్శలతో భద్రత కట్టుదిట్టం చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పంజాబ్, కశ్మీర్ సరిహద్దుల్లో గస్తీ కాసేందుకు 2వేల మంది జవాన్లను పంపించారు. అటు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంచెలవారిగా సీఐఎస్ఎఫ్, క్విక్ రియాక్షన్ టీమ్ సభ్యులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది భద్రతా వైఫల్యమే: కాంగ్రెస్ పఠాన్‌కోట్ దాడి కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని, బాధ్యులు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే అన్నారు. శాంతి చర్చలకు విఘాతం కలిగించేందుకే ఉగ్రవాదులు దాడికి తెగబడినా.. దానిని లెక్కచేయకుండా ఇరు దేశాలు ముందుకెళ్లడాన్ని హురియత్ కాన్ఫరెన్స్ స్వాగతించింది. నిరంజన్ కుటుంబానికి రూ. 50 లక్షలు పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎన్ఎస్జీ కమాండో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుటుంబానికి కేరళ ప్రభుత్వం రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. -
నిరంజన్ కుటుంబానికి కేరళ రూ.50లక్షల సాయం
కొచ్చి: పంజాబ్‌లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన లెప్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ కుటుంబానికి కేరళ ప్రభుత్వం బుధవారం రూ.50 లక్షల సాయం ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా నిరంజన్ కుటుంబానికి 30 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళలోని పాలక్కడ్ జిల్లా ఎలాంబస్సెర్ట్ గ్రామానికి చెందిన నిరంజన్‌కుమార్ 2004లో సైన్యంలో చేరారు. ఎస్‌ఎస్‌జీలో చేరడానికి ముందు మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ ఆఫ్ ఆర్మీలో పనిచేశారు. పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేయడంలో నిపుణుడైన నిరంజన్ బాంబు నిర్వీర్యక విభాగం అధికారిగా ఇటీవలే పదోన్నతి పొందారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్‌ను నిర్వీర్యం చేస్తుండగా అది పేలి దుర్మరణం చెందారు. కల్నల్ నిరంజన్‌కు భార్య రాధిక, రెండేళ్ల కుమార్తె విస్మయ ఉన్నారు. ఆయన కుటుంబం ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడింది. -
'అప్పుడు కార్గిల్.. ఇప్పుడు పఠాన్‌కోట్'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆకస్మికంగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి విమర్శలు సంధించింది. గతంలో ప్రధాని హోదాలో వాజ్‌పేయి పాక్ పర్యటనకు వెళ్లాక కార్గిల్ యుద్ధం జరిగిందని, ప్రస్తుత ప్రధాని మోదీ పాక్‌కు వెళ్లొచ్చాక పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి జరిగిందని కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే విమర్శించారు. యూపీఏ హయాంలో మంత్రులు బిరియానీని పాక్‌కు పంపుతున్నారని గతంలో మోదీ విమర్శలు చేశారని, ఆయన లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కలసి వచ్చారని, ఇప్పుడు ఏం జరిగిందని షిండే ప్రశ్నించారు. ఉగ్రవాదంపై పోరాటంలో మోదీ పరిష్కార చర్యలు తీసుకోవాలని షిండే సూచించారు. మోదీ అప్ఘానిస్తాన్ నుంచి నేరుగా లాహోర్‌కు వెళ్లి షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయన మనవరాలి వివాహ వేడుకలో పాల్గొని వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేశారు. -
బతికి ఉండటమే తప్పా?
నేను పోలీస్‌నని తెలిశాక చంపటానికి తిరిగివచ్చారు: పంజాబ్ ఎస్పీ చండీగఢ్: పఠాన్‌కోట్ దాడికి దారి తీసిన లోపాల్లో.. అందకుముందు వారి చేతుల్లో కిడ్నాపై విడుదలైన గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్ కథనంలో పొంతన లేని అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ఆయనను దర్యాప్తు అధికారులు సోమవారం ఆరు గంటలు ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. డిసెంబర్ 31వ తేదీ రాత్రి తాను డ్రైవరు, మరో సహాయకుడితో కలిసి సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక ఆలయానికి వెళ్లి వస్తుండగా ఉగ్రవాదులు తమను కిడ్నాప్ చేశారన్నారు. ‘నేను యూనిఫాంలో లేను. కానీ నా అధికారిక కారులో వెళ్లాను. నన్ను కిడ్నాప్ చేసిన వారివద్ద ఏకే47 తుపాకులు ఉన్నాయి. పంజాబీ, హిందీ, ఉర్దూ మాట్లాడారు. నా కారును హైజాక్ చేశాక తర్వాత నా చేతులూ, కాళ్లూ కట్టేశారు.. నోటికి, కళ్లకు ప్లాస్టర్ వేసి మూసేశారు. నేను పోలీసు అధికారినని వారికి తెలియదు. నన్ను వదిలేసి వెళ్లారు. నా మూడు సెల్ ఫోన్లలో రెండు తీసుకున్నారు. నా గార్డు నా మొబైల్ ఫోన్‌కు కాల్ చేయగా, ఉగ్రవాదులు ‘సలామ్ అలేకుం’ అన్నారు. నా గన్‌మన్ ఫోన్ చేయటంతో నేను పోలీసు అధికారినని వారికి తెలిసింది. దీంతో వారు నన్ను చంపటానికి తిరిగి వచ్చారు. ఎవరినైనా హెచ్చరించటానికి ప్రయత్నిస్తే అందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని బెదిరించి వెళ్లిపోయారు. నేను తప్పించుకుని, ఓ గ్రామానికి చేరుకుని, నా దగ్గరున్న మూడో సెల్‌ఫోన్‌తో శుక్రవారం తెల్లవారుజామున ఉన్నతాధికారులకు కాల్ చేసి సంప్రదించాను. నేను చెప్పిన దాంట్లో దాపరికం లేదు. నేను ఇంకా బతికి ఉండటమే నా తప్పా? నేను తప్పు చేస్తే నన్ను ఉరితీయండి’ అని అన్నారు. సమాచారం ఇవ్వటం వల్లే .. పఠాన్‌కోట్‌లో దాడికి ముందు ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, కొట్టి వదిలేసిన గురుదాస్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఇచ్చిన సమాచారాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని.. కాబట్టే ఉగ్రవాదుల దాడులకన్నా ముందుగానే ఎన్ఎస్జీ బలగాలు ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయని పంజాబ్ డీజీపీ సురేశ్అరోరా పేర్కొన్నారు. -
‘పఠాన్‌కోట్’పై చిటపటలు
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో మోదీ సర్కారుపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. మిత్రపక్షం శివసేనా మోదీపై విమర్శలు గుప్పించింది. పాక్ పట్ల ఆయన వైఖరిని తప్పుపట్టింది. ప్రపంచాన్ని ఒక్కటి చేయడాన్ని పక్కనపెట్టి దేశంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ‘నవాజ్ షరీఫ్‌తో మోదీ కప్పు టీ తాగి వచ్చినందుకు పాక్ ముష్కరులు ఏడుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్నారు’ అని తన పత్రిక సామ్నాలో విమర్శించింది. మోదీ ఇటీవల పాక్ వెళ్లి ఏం సాధించారని కాంగ్రెస్ ప్రశ్నించింది. కేంద్రం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని తప్పుపట్టింది. ‘మేం పాక్‌తో చర్చలకు వ్యతిరేకం కాదు. అలాగనీ దేశ భద్రత, సమగ్రత విషయంలో రాజీపడబోం’ అని పేర్కొంది. కాంగ్రెస్ విమర్శలు వ్యాఖ్యలు జాతి వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చేలా ఉన్నాయని బీజేపీ దుయ్యబట్టింది. ‘ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన ఈ సమయంలో అమరుల త్యాగాలను ప్రశ్నించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది’ అని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ నిప్పులు చెరిగారు. కాగా, పఠాన్‌కోట్ ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదుల శవాలను పందిచర్మంలో పెట్టిన తర్వాత పూడ్చిపెట్టాలని త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ అన్నారు. 320 మంది కమాండోలు తక్షణమే పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌కు వెళ్లాలని జనవరి 1న కేంద్ర హోం శాఖ నుంచి ఎన్ఎస్జీ ప్రధాన కార్యాలయానికి సందేశం అందగానే.. కమాండో టీం సిద్ధమైంది. తొలి విడతలో 160 మంది పఠాన్‌కోట్ చేరుకోగా 2, 3 తేదీల్లో మరో రెండు విడతల్లో 80 మంది చొప్పున బ్లాక్‌క్యాట్స్ పఠాన్‌కోట్ చేరుకున్నారు. 320 మంది కమాండోలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఆపరేషన్‌లో ఎన్ఎస్జీ ‘బ్లాక్‌క్యాట్’ కమాండోలు ఎంపీ 5 తుపాకులు, గ్లాక్ పిస్టల్స్, కార్నర్ షాట్ గన్స్, తలుపులు, గోడలను బద్దలుకొట్టే బస్టర్ బాంబ్స్‌ను విరివిగా ఉపయోగించారు. -
'అది బీజేపీ విధానం కాదు'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా విమర్శించారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పొరుగు దేశంతో సంబంధాల పునరుద్ధరణకు చేపట్టనున్న చర్చలు రద్దు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ తో వ్యూహాత్మక చర్చలను తాను మొదట నుంచి వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. మోదీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని అన్నారు. భారత్- పాకిస్థాన్ కార్యదర్శుల స్థాయి చర్చలు వచ్చే వారం జరగనున్నాయి. 'యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పులనే తమ సర్కారు చేసింది. ఇది బీజేపీ విధానం కాదు. పాకిస్థాన్ తో ఎటువంటి చర్చలకు మనం సానుకూలం కాదు. దాయాది దేశంతో చర్చలు రద్దుచేసుకోవాలి' అని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. తమ దేశంలో కొనసాగుతున్న తీవ్రవాద తండాలకు వ్యతిరేకంగా పాకిస్థాన్ చర్య తీసుకున్నప్పుడే ఆ దేశంతో చర్చలు జరపాలని వాజపేయి హయాంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. -
పాకిస్థాన్ కు ఎల్ ఆర్ పంపనున్న భారత్
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి వెనుకున్న కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్థాన్ ను భారత్ కోరనుంది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వానికి లెటర్ రొగేటరీ(ఎల్ ఆర్) పంపనుంది. సైనిక ఆపరేషన్ లో మృతి చెందిన ఉగ్రవాదుల డీఎన్ఏ నమూనాలు, ఫోన్ కాల్స్ తదితర వివరాలు పాకిస్థాన్ కు అందజేయనుంది. పఠాన్ కోట్ లో సైనిక బలగాల చేతిలో హతమైన ఆరుగురు ఉగ్రవాద మృతదేహాలకు వీలైనంత త్వరగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వీటితో పాటు పాకిస్థాన్ లోని సూత్రధారుల నుంచి ఉగ్రవాదులకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు ఎల్ ఆర్ ద్వారా పొరుగు దేశానికి పంపించనుంది. ఈ వివరాలతో కుట్రదారులను పట్టుకోవాలని పాక్ ప్రభుత్వ వర్గాలకు భారత్ అధికారికంగా విజ్ఞప్తి చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొన్ని రకాల న్యాయ సేవల కోసం కోర్టు ద్వారా విదేశీ కోర్టును అభ్యర్థించడానికి ఎల్ ఆర్ ను పంపుతారు. న్యాయ సేవ ప్రక్రియ ప్రాసెస్, ఆధారాలు పంపడానికి ఎల్ ఆర్ ను వినియోగిస్తుంటారు. పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే-ఈ-మొహ్మద్ తీవ్రవాద సంస్థ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. -
పఠాన్ కోట్ కు పారికర్
న్యూఢిల్లీ: ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్ఐఏ దళపతులతో కలిసి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను మంగళవారం సాయంత్రం సందర్శించనున్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను సైనిక బలగాలు హతమార్చాయి. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా, జాతీయ దర్యాప్తు సంస్థ అధిపతి శరద్ కుమార్ తో కలిసి పారికర్.. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ ను సందర్శించనున్నారని అధికారవర్గాలు తెలిపాయి. కాగా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. ఐదుగురు ఉగ్రవాదులు హతమయినట్టు ఎన్ఎస్ జీ ధ్రువీకరించింది. ఆరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. -
పఠాన్ కోట్ లో మరో ఉగ్రవాది హతం
పఠాన్ కోట్: పంజాబ్ లోని పఠాన్ కోట్ లో చొరబడ్డ ఉగ్రవాదుల్లో మరొకరిని సైనిక బలగాలు మట్టుబెట్టాయి. రెండతస్తుల భవనంలో నక్కిన ఉగ్రవాదిని కమెండోలు హతమార్చాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్ లో ఇప్పటివరకు హతమార్చిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరింది. కూంబింగ్ కొనసాగుతోంది. వైమానిక దళంలోకి చొరబడిన ముష్కరులను మట్టుమెట్టేందుకు వరుసగా మూడో రోజు సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. వీరిని తుదముట్టించే క్రమంలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. అయితే ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారనే దానిపై స్పష్టత లేదు. -
'మంచం కింద దాక్కున్నాం'
గురుదాస్ పూర్: 'ఆయన కూతురిగా పుట్టినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నా' అని అమరజవాను ఫతే సింగ్ కుమార్తె మధు అన్నారు. శనివారం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులతో పోరాడుతూ సుబేదార్ మేజర్ ఫతే సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ముష్కరులు చొరబడ్డారనే సమాచారం తెలియగానే యూనిఫాం ధరించి తన తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయారని ఆమె తెలిపింది. 1995 కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ ఈవెంట్ లో స్వర్ణ, రజత పతకాలు గెలిచిన ఫతే సింగ్ తాను చనిపోయే ముందు ఉగ్రవాదుల్లో ఒకడి తుపాకీ లాక్కుని అతడిని మట్టుబెట్టారు. తన తండ్రి ఉగ్రవాదులతో పోరాడానికి వెళ్లిపోగానే ఇంట్లో తాము బిక్కుబిక్కుమంటూ గడిపామని టీచర్ గా పనిచేస్తున్న 25 ఏళ్ల మధు చెప్పింది. 'కాల్పుల మోత విన్పిస్తోంది. తుపాకీ బుల్లెట్లు మా ఇంటి కిటికీ దగ్గర పడుతున్నాయి. మేము రెండు గంటల పాటు మంచం కింద దాక్కున్నాం. కింద చాలా చలిగా ఉంది. కానీ మంచంపై పడుకుని మా ప్రాణాలను బలిపెట్టే సాహసం చేయలేకపోయాం. మమ్మల్ని ఉగ్రవాదులు గుర్తిస్తారనే భయంతో ఇంట్లో లైట్లు అన్నీ ఆర్పేశాం. చిమ్మచీకటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం' అని మధు చెప్పింది. సత్యం కోసం గళం విప్పాలి, పోరాడాలని అని తన తండ్రి చెప్పేవారని గుర్తు చేసుకుంది. చెడును ఓడించడానికి మంచికి మనవంతు సాయం చేయాలని అనేవారని, ఆ విలువలను ఆయన తుదివరకు పాటించారని వెల్లడించింది. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ లో చొరబడిన ఉగ్రవాదులతో ఫతే సింగ్ సహా ఏడుగురు సైనికులు వీరమరణం పొందారు. 20 మంది గాయపడ్డారు. ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు. మరో ఇద్దరు ముష్కరులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. -
లెఫ్టినెంట్ కల్నల్ అమర్ రహే..
-
లెఫ్టినెంట్ కల్నల్ అమర్ రహే..
బెంగళూరు: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ మృతదేహాన్ని సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన నివాసానికి తీసుకు వచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ నిరంజన్ అమర్ రహే అంటూ ఆ ప్రాంతం మారుమోగిపోతోంది. జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్ జీ)లో విధులు నిర్వహిస్తున్న కల్నల్ నిరంజన్.. విధినిర్వహణలో భాగంగా శనివారం తెల్లవారుజామునుంచి ఉగ్రమూకలతో పోరాడుతూ ఆదివారం అనూహ్యరీతిలో మరణించిన విషయం తెలిసిందే. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన ఏడుగురు సైనికుల్లో నిరంజన్ ఒకరు. కేరళకు చెందిన ఆయన.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. ఆ తర్వాత బెంగళూరులో విద్యాభ్యాసం చేసి ఆర్మీలో చేరారు. ఉగ్రవాదులు అమర్చిన గ్రేనేడ్ ను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలడంతో నిరంజన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు సైనికులు చనిపోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ఆరుగురు ఉగ్రవాదుల బలగాలు మట్టుపెట్టగలిగాయి. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.