ఉగ్రదాడి మసూద్‌ అజర్‌, ఆయన సోదరుడి పనే | NIA files chargesheet against JeM chief Masood Azhar | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడి మసూద్‌ అజర్‌, ఆయన సోదరుడి పనే

Published Mon, Dec 19 2016 12:11 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

ఉగ్రదాడి మసూద్‌ అజర్‌, ఆయన సోదరుడి పనే - Sakshi

ఉగ్రదాడి మసూద్‌ అజర్‌, ఆయన సోదరుడి పనే

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన పటాన్‌ కోట్‌ దాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జీషీటు దాఖలు చేసింది. జైషే ఈ మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఈ దాడికి కీలక సూత్రదారుడిగా అందులో ఎన్‌ఐఏ పేర్కొంది. అలాగే, మసూద్‌ సోదరుడు అబ్దుల్‌ రౌఫ్‌, మరో ఇద్దరని కూడా ఈ చార్జిషీటులో చేర్చింది.

ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో కీలక భారత రక్షణ స్థావరమైన ఎయిర్‌ బేస్‌ పై పాక్‌ కు చెందిన ముష్కరులు అనూహ్యంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మసూద్‌, అతడి సోదరుడు, మరో ఇద్దరిపై ఆయుధాల చట్టం, పేలుళ్లకు సంబంధించిన చట్టాలు, పబ్లిక్‌ ప్రాపర్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అమెరికా కూడా కీలక సహాయం అందించింది. ఉగ్రవాదులు జరిపిన సంభాషణలు, ఈమెయిల్స్ వంటివాటిని అమెరికా సహాయంతో గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement