చెన్నై: తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడువ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, తమిళనాడులో కారుబాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు శనివారం తెల్లవారుజాము నుంచే కొనసాగుతున్నాయి. చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కాగా, కోయంబత్తూరులో 2021 నాటి కారుబాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.
#JustIn | NIA Raids Across Tamil Nadu's Tiruchirappalli
— NDTV (@ndtv) February 10, 2024
ఇక, ముఖ్యంగా కోయంబత్తూరులోనే నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు దాడులు, తనిఖీలు చేపట్టారు. 2021లో కోయంబత్తూరులోని ఉక్కడం కొట్టమేడు ప్రాంతంలో కారు బాంబు పేలుడుతో సంబంధాలపై దర్యాప్తు వేగవంతం చేశారు. అరబిక్ కాలేజీలో చదివిన విద్యార్థులకు నిషేధిత ఉద్యమాలతో సంబంధం ఉందా? అనే కోణంలో ఈ విచారణ జరుగుతున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment