ఈ నెల 15న జరగాల్సిన భారత్-పాక్ విదేశాంగశాఖ కార్యదర్శి స్థాయి చర్చలు రద్దు అయ్యాయి.
న్యూఢిల్లీ: ఈ నెల 15న జరగాల్సిన భారత్-పాక్ విదేశాంగశాఖ కార్యదర్శి స్థాయి చర్చలు రద్దు అయ్యాయి. పఠాన్‌కోట్ దాడుల నేపథ్యంలో పాక్‌తో చర్చలు రద్దు చేసినట్టు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పఠాన్‌కోట్ దాడి సూత్రదారులపై చర్యలు తీసుకునే వరకు చర్చలు జరగవని చెప్పారు. పాక్ చర్యలపై భారత్ సంతృప్తి చెందినప్పుడే చర్చలపై ఆలోచిస్తామని దోవల్ పేర్కొన్నారు.