రేపు బీజింగ్‌లో భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల భేటీ | Ajit Doval Visits China for Key Talks | Sakshi
Sakshi News home page

రేపు బీజింగ్‌లో భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల భేటీ

Published Mon, Dec 16 2024 1:59 PM | Last Updated on Tue, Dec 17 2024 6:14 AM

Ajit Doval Visits China for Key Talks

బీజింగ్‌: సరిహద్దు అంశంపై చర్చించేందుకు భారత్, చైనాల ప్రత్యేక ప్రతినిధులు బుధవారం బీజింగ్‌ సమావేశమవనున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక సరిహద్దు ప్రాంతాల నుంచి సేనలు వైదొలిగేందుకు అక్టోబర్‌ 21న చేసుకున్న ఒప్పందం నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే విషయమై ఈ బృందాలు చర్చించనున్నాయి. 

23వ దఫా చర్చలకు చైనా విదేశాంగ వ్యవహారాల సెంట్రల్‌ కమిషన్‌ డైరెక్టర్‌ వాంగ్‌ యీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ల సారథ్యం వహిస్తారని చైనా విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. ఈ చర్చల్లో రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. భారత్‌– చైనాల మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దు సమస్యను సమగ్రంగా పరిష్కరించే ఉద్దేశంతో 2003లో ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటి వరకు 22 సార్లు సమావేశమైంది. చివరి సారిగా 2019లో చర్చలు జరిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement